
అమెరికా వెళ్లిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అమెరికా వెళ్లారు. రెగ్యులర్ వైద్య పరీక్షల కోసం ఆమె అమెరికా వెళ్లారని, వారం రోజుల్లో తిరిగొస్తారని కాంగ్రెస్ పార్టీ సోమవారం వెల్లడించింది.
'రెగ్యులర్, రొటీన్ చెకప్ కోసమే సోనియా గాంధీ అమెరికా వెళ్లారు. వారం రోజుల్లో తిరిగొస్తారు' అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా తెలిపారు.
68 ఏళ్ల సోనియా రెండు నెలల క్రితమే అమెరికాకు వెళ్లాల్సివుందని, బిహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆమె వెళ్లలేకపోయారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. బిహార్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అమెరికా వెళ్లారని తెలిపాయి.