
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్న సోనియా.. సాధారణ పరీక్షల కోసం ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆసుపత్రికి వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కరోనా బారిన పడిన అనంతరం వివిధ అనారోగ్య సమస్యలు సోనియా గాంధీని చుట్టుముట్టాయి. ఇటీవలే మెడకల్ చెకప్ కోసం విదేశాలకు సైతం వెళ్లొచ్చారు సోనియా. మరోవైపు.. సోనియా గాంధీకి తోడుగా ఉండేందుకు ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నారని, యూపీలో భారత్ జోడో యాత్రలో పాల్గొనకపోవచ్చనే వాదనలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: ‘ఇది పార్టీ అధికారిక కార్యక్రమం.. అంతా రావాల్సిందే!’ రేవంత్ యాత్ర ప్రకటించాడా?
Comments
Please login to add a commentAdd a comment