Ganga Ram Hospital
-
ఆసుపత్రికి సోనియా గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్న సోనియా.. సాధారణ పరీక్షల కోసం ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆసుపత్రికి వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కరోనా బారిన పడిన అనంతరం వివిధ అనారోగ్య సమస్యలు సోనియా గాంధీని చుట్టుముట్టాయి. ఇటీవలే మెడకల్ చెకప్ కోసం విదేశాలకు సైతం వెళ్లొచ్చారు సోనియా. మరోవైపు.. సోనియా గాంధీకి తోడుగా ఉండేందుకు ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నారని, యూపీలో భారత్ జోడో యాత్రలో పాల్గొనకపోవచ్చనే వాదనలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: ‘ఇది పార్టీ అధికారిక కార్యక్రమం.. అంతా రావాల్సిందే!’ రేవంత్ యాత్ర ప్రకటించాడా? -
కరోనా కలకలం : 37 మంది వైద్యులకు పాజిటివ్
-
కరోనా కలకలం : 37 మంది వైద్యులకు పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండోదశలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త రికార్డు స్థాయిలతో కరోనా వైరస్ పంజా విసురుతోంది. అటు పెరుగుతున్న మరణాల సంఖ్య కూడా ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్-19 ఉదృతి కొనసాగుతోంది. ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి చెందిన ఏకంగా 37 మంది వైద్యులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 32 మంది ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉండగా, ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా వ్యాక్సినేషన్ తొలిదశలో భాగంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారే కావడంతో మరింత ఆందోళన పుట్టిస్తోంది. (కరోనా ఉధృతి: ఒకేరోజు 780 మంది మృత్యువాత) కాగా కరోనా శరవేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కేరళ, పంజాబ్‌లతో పాటు 10 రాష్ట్రాలలో ఢిల్లీ కూడా ఉంది. దీంతో వైరస్ ఉధృతిని అడ్డుకునేందుకు ఢిల్లీలో ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తలిసిందే. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం నాటి గణాంకాల ప్రకారం దేశంలో పాజిటివ్ కేసుల నమోదు మరో రికార్డును తాకింది. ఇటీవల రోజు వారీ కేసులలో లక్షమార్క్‌ను అధిగమించిన కేసులకు తోడు గత 24గంటల్లో మరో 1,31,968 కేసులు జత చేరడం గమనార్హం. అలాగే ఒకేరోజు 780 మంది మృత్యువాత పడటం వ్యాధి తీవ్రతకు అద్దంపడుతోంది. -
సోనియా గాంధీకి అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చిక్సిత అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. అయిత పార్టీ వర్గాల మాత్రం సాధారణ చెకప్‌గా చెబుతున్నారు. కాగా ఉదరకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె గతంలో కూడా చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజా ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు హుటాహుటినా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. -
సోనియా గాంధీ డిస్చార్జ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్ఫత్రి నుంచి డిస్చార్జ్ అయ్యారు. ఆమెను డిస్చార్జ్ చేస్తున్నట్టు ఢిల్లీలోని సర్ గంగా రాం ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఇటీవల వారణాసిలో జరిగిన రోడ్ షోలో గాయపడిన సోనియా భుజానికి శస్త్ర చికిత్సను వైద్యులు నిర్వహించారు. రీ చెకప్ లో భాగంగా ఆమె అగస్టు 17 న గంగారాం ఆస్పత్రిలో చేరారు. డిస్చార్జ్ సమయానికి సోనియా నీరసంగా ఉండటంతో ఆమె రెండు రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నారు. వైద్యులు ఆమెకు మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. -
ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి
న్యూఢిల్లీ: ఎడమ భుజానికి శస్త్రచికిత్స, జ్వరం కారణంగా గత 11 రోజులుగా ఆస్పత్రిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి ఆమెను డిశ్చార్జి చేశారు. 11 రోజుల క్రితం వారణాసి పర్యటన సందర్భంగా అస్వస్థతకు గురైన సోనియాను తొలుత ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. పూర్తిగా కోలుకోవడంతో సోనియా గాంధీని డిశ్చార్జి చేసినట్టు గంగారాం ఆస్పత్రి మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. -
ఆత్మాహుతి దాడి : ఐదుగురు మృతి
-
ఆత్మాహుతి దాడి : ఐదుగురు మృతి
పాకిస్థాన్: లాహోర్ నగరంలోని పోలీసు కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదురుగు అక్కడికక్కడే మరణించగా... మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను నగరంలోని మెయో, గంగారామ్ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. హోటల్ సమీపంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఘటన ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. మృతులు, క్షతగాత్రులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు. -
ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి
న్యూఢిల్లీ: ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో గత ఆరు రోజులుగా ఇక్కడి గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం డిశ్చార్జి అయ్యారు. ఆమె కోలుకున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు.