ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి
న్యూఢిల్లీ: ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో గత ఆరు రోజులుగా ఇక్కడి గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం డిశ్చార్జి అయ్యారు. ఆమె కోలుకున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు.