discharge
-
ఆస్పత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
ముంబయిలోని లీలావతి ఆస్పత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 16 న ఆయనపై దొంగతనానికి వచ్చిన వ్యక్తి దాడి చేయడంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు ఐదు రోజులు పాటు ఆస్పత్రిలో చికిత్సపొందిన సైఫ్ ఇంటికి చేరుకున్నారు. కాగా.. ఈనెల 16న తెల్లవారు జామున సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగింది. ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. హీరోపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి ఆటోలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. సైఫ్‌ను పరిశీలించిన వైద్యులు ఆయన సకాలంలో చికిత్స అందించారు. దాదాపు ఐదు రోజుల పాటు సైఫ్ ఆస్పత్రిలోనే ఉన్నారు. నిందితుడి అరెస్ట్..ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్‌గా పోలీసులు గుర్తించారు. ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన షరీఫుల్ తన పేరును విజయ్ దాస్‌గా మార్చుకుని తిరుగుతున్నారు. కేవలం దొంగతన కోసమే అతను సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్లు నిందితుడు వెల్లడించారు. పోలీసు కస్టడీ.. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. -
ఆస్పత్రి నుంచి టాలీవుడ్ నటుడు మోహన్ బాబు డిశ్చార్జ్
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఆయన ఇంటి వద్ద గొడవ జరిగిన అనంతరం అస్వస్థతకు గురైన మోహన్ బాబు కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం చికిత్స తీసుకున్న మోహన్ బాబు ఇవాళ ఇంటికి వెళ్లారు. అయితే వారం రోజుల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.మంచు ఫ్యామిలీలో మొదలైన వివాదం చివరికీ పోలీసుల వద్దకు చేరింది. మంచు మనోజ్, మోహన్‌బాబు మధ్య గొడవకు దారితీసింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ తర్వాత మోహన్ బాబు ఓ ఆడియో సందేశాన్ని మీడియాకు రిలీజ్ చేశారు.(ఇది చదవండి: హైకోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట!)అంతేకాకుండా ఈ విషయంపై మంచు విష్ణు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇది మా ఫ్యామిలీ గొడవని.. ఎవరి కుటుంబాల్లోనైనా సాధారణంగా ఉండేవని తెలిపారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని వెల్లడించారు. ఈ వివాదంపై రాచకొండ సీపీ ఎదుట మంచు విష్ణు, మనోజ్ హాజరై జరిగిందంతా వివరించారు. తన వైపు ఎలాంటి గొడవ జరగదని సీపీకి మంచు మనోజ్ హామీ ఇచ్చారు. -
#Mayank Agarwal: ఆసుపత్రి నుంచి మయాంక్ డిశ్చార్జి..
అగర్తలా: కర్ణాటక రంజీ జట్టు కెప్టెన్, భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. శుక్రవారం నుంచి రైల్వేస్‌తో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్ కోసం మంగళవారం సాయంత్రం అగర్తలా నుంచి సూరత్ బయలుదేరేందుకు మయాంక్ విమానం ఎక్కాడు. తాను కూర్చున్న సీటు ముందు ప్లాస్టిక్ కవర్లో ఉంచిన హానికారక ద్రవ్యాన్ని నీళ్లనుకొని మయాంక్ తాగాడు. ఆ వెంటనే అతని నోరు వాచిపోయి బొబ్బలు రావడంతో మాట్లాడలేకపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాంతో వెంటనే విమానాన్ని ఆపి అతడిని ఆసుపత్రికి తరలించారు. రోజంతా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న మయాంక్ బుధవారం సాయంత్రంకల్లా కోలుకోవడంతో అతడిని డిశ్చార్జి చేశారు. -
తన సొంతింటికి కేసీఆర్
-
యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
-
TS:యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
సాక్షి,హైదరాబాద్ : తుంటి ఎముక సర్జరీ చేయించుకుని కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితం యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయి బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని ఆయన పూర్వ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ కొద్దిరోజుల పాటు నందినగర్‌లోని ఇంట్లోనే ఉండనున్నారు. సర్జరీకి సంబంధించి డాక్టర్లకు అందుబాటులో ఉండాలన్న కారణంతోనే కేసీఆర్ గజ్వేల్‌లోని తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లకుండా నందినగర్‌లోని ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. తొమ్మిదిన్నర ఏళ్ళ తర్వాత నందినగర్‌లోని సొంత ఇంటిలో కేసీఆర్ బస చేయనున్నారు. నందినగర్ ఇంటిని 2000 సంవత్సరంలో నిర్మించారు. 2021 జులై 13న ఇంటి మరమ్మతు పనులను కేసీఆర్ పరిశీలించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఇంటి నుంచే కేసీఆర్ కార్యాచరణ రూపొందించారు. తొమ్మిదిన్నరేళ్ల తర్వాత సొంత ఇంటికి కేసిఆర్ వస్తుండడంతో పూలదండలతో అలంకరించిన కుటుంబ సభ్యులు ఉదయమే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్ బాత్రూమ్లో జారిపడడంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. వెంటనే ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆయనకు తుంటి ఎముకు రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత వారంరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్న ఆయనను శుక్రవారం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ కారణంగా కేసీఆర్ అసెంబ్లీలో ఇంకా ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇదీచదవండి..మాజీ సీఎం కేసీఆర్ భద్రత.. ప్రభుత్వ కీలక నిర్ణయం -
రేపే డిశ్చార్జి.. పాత ఇంటికి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. తుంటి ఎముక విరగడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) ఆయన్ని వైద్యులు ఇంటికి పంపించనున్నారు. ఆపై ఆయన నేరుగా బంజారాహిల్స్ నందినినగర్‌లోని తన పాత నివాసానికి వెళ్తారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రగతి భవన్ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు షిఫ్ట్ అయ్యారాయన. ఈ క్రమంలో గత గురువారం రాత్రి బాత్రూంలో జారి కిందపడడంతో తుంటి ఎముక రెండుచోట్ల విరిగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్య బృందం వివిధ పరీక్షలు జరిపి తుంటి ఎముక విరిగినట్లు నిర్ధారించింది. ఆపై విజయవంతంగా సర్జరీ చేసింది. అప్పటి నుంచి ఆయన కోలుకుంటూ వస్తుండగా.. ప్రముఖుల పరామర్శ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యుల బృందం.. రేపు డిశ్చార్జి చేయనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు. మరోవైపు నందినినగర్‌లోని కేసీఆర్ ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన సిబ్బంది ఇప్పటికే పూర్తి చేశారు. -
నాలుగు నెలల పాపకు అలా అవ్వడం ప్రమాదం కాదా?
నాకు నాలుగు నెలల పాప. అంత చంటిపిల్లకు అప్పుడప్పుడు వైట్ డిశ్చార్జ్ అవుతోంది. నేను భయపడుతుంటే మా ఇంట్లో పెద్దవాళ్లేమో ‘మరేం పర్లేదు .. అలా అవడం సహజమే’ అని తేలిగ్గా తీసుకుంటున్నారు. నిజంగా పర్లేదా? అది సహజమేనా? – పేరు, ఊరు వివరాలు రాయలేదు. వైట్ కలర్ లేదా బ్లడ్ టైప్ వెజైనల్ డిశ్చార్జ్ పది రోజుల వయసు నుంచి ఆరు నెలల వయసు గల ఆడపిల్లల్లో చాలా నార్మల్. గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావంలో ఉండి.. పుట్టిన తరువాత ఒక్కసారిగా ఆ హార్మోన్ ప్రభావం నుంచి బయటపడ్డంతో ఇలా విత్‌డ్రాయల్ బ్లీడ్ లేదా డిశ్చార్జ్ కనపడవచ్చు. ఇది పుట్టినప్పటి నుంచి ఆరునెలల దాకా ఉండొచ్చు. మూడు నాలుగు రోజుల్లోనే తగ్గిపోతుంది. క్లియర్‌గా.. స్మెల్ లేని వైట్ డిశ్చార్జ్ ఆడపిల్లల్లో ఎప్పుడైనా కనపడొచ్చు. అయితే ఇన్ఫెక్షన్ గనుక ఉంటే రెడ్నెస్, బ్యాడ్ స్మెల్, యెల్లో లేదా గ్రీన్‌కలర్ వెజైనల్ డిశ్చార్జ్ కనిపిస్తుంది. దగ్గు, జలుబుకు ఎక్కువసార్లు యాంటీబయాటిక్స్ వాడితే వాటితో వెజైనాలో ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. సబ్బుతో స్నానం, టాల్కంపౌడర్స్, డియోడరెంట్ పెర్ఫ్యూమ్స్ వంటివాటి వల్లా.. పిల్లల ఇన్నర్‌వేర్ నుంచీ ఇరిటేషన్ రావచ్చు. అందుకే మైల్డ్ క్లెన్సర్స్తో.. గోరువెచ్చని నీటిలో క్లీన్ చెయ్యాలి. పాపకు స్నానం చేయించాక వెట్ క్లాత్‌తో వెజైనల్ ఏరియాను ముందు నుంచి వెనుకగా తుడవాలి. ఔ్చbజ్చీ కింద డైపర్కి సంబంధించిందేమైనా ఉండిపోయి.. అది వైట్ డిశ్చార్జ్‌గా కనిపించవచ్చు. అందుకే అక్కడ శుభ్రంగా తుడవాలి. స్క్రబ్ చేయకూడదు. మెత్తటి తడి గుడ్డతోనే అదీ ముందు నుంచి వెనుకగా శుభ్రం చేయాలి. ఒక్కోసారి ఫారిన్ బాడీ ఏదైనా పొరపాటున వెజైనాలో ఉంటే కూడా తెల్లబట్ట అవుతూ ఉంటుంది. ఒకసారి గైనకాలజిస్ట్/ పీడియాట్రీషన్ని సంప్రదించడం మంచిది. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఆకుకూరలు మంచిదని తినేస్తున్నారా? శాస్త్రవేత్తలు స్త్రాంగ్ వార్నింగ్!) -
వైద్యుల నిర్లక్ష్యం... బాలింతకు కష్టం
మంచిర్యాల టౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 24న ఓ మహిళకు ప్రసవ సమయంలో వైద్యులు, సిబ్బంది కాటన్ ప్యాడ్‌ను అమర్చి డిశ్చార్జి సమయంలో తొలగించడం మర్చిపోయారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. బాధితురాలు కీర్తిలయ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తిలయకు ఈ నెల 24న పురిటి నొప్పులు రావడంతో మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అదేరోజు మధ్యాహ్న సమయంలో సాధారణ ప్రసవానికి ప్రయత్నించగా.. కొంత క్రిటికల్ కావడంతో ఫోర్సెప్ డెలివరీ (బలవంతపు సాధారణ ప్రసవం) చేయగా మగశిశువుకు జన్మనిచ్చింది. కీర్తిలయకు రక్తస్రావం కాకుండా ఉండేందుకు కాటన్ ప్యాడ్ అమర్చారు. అనంతరం తల్లీబిడ్డలను వార్డులోకి మార్చారు. మూడు రోజుల తర్వాత 27న సాయంత్రం కాటన్‌ప్యాడ్‌ను తొలగించకుండానే డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిన బాలింత 28న సాయంత్రం అస్వస్థతకు గురికాగా 108లో చెన్నూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది విషయాన్ని గమనించి కాటన్‌ప్యాడ్‌ను తొలగించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాటన్ప్యాడ్ తొలగించకుండానే డిశ్చార్జి చేయడంపై బాలింత, ఆమె కుటుంబ సభ్యులు వైద్యులు, వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాలింత పరిస్థితి మెరుగ్గానే ఉండగా, పూర్తిస్థాయి చికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చందర్రెడ్డిని సంప్రదించగా.. కాటన్‌ప్యాడ్‌ను తొలగించడంలో సిబ్బంది తప్పిదం ఉందని, బాధ్యులైన వైద్యులు, సిబ్బంది వివరణ తీసుకుని ఉన్నతాధికారులకు తెలిపి, వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మెరుగుపడిన ఆరోగ్యం..‘విశ్వభారతి’ నుంచి శ్రీలక్షి డిశ్చార్జి
సాక్షి ప్రతినిధి కర్నూలు : ఎంపీ అవినాశ్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడటంతో ఆమెను విశ్వభారతి ఆస్పత్రి నుంచి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. తదుపరి చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. తల్లి వెంట అవినాశ్ కూడా హైదరాబాద్‌కు వెళ్లారు. ఆయనతో పాటు పలు వురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఆస్పత్రి నుంచి అవినాశ్ బయటకు రాగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు కలిసి ఆయనకు ధైర్యం చెప్పారు. మరోవైపు.. డిశ్చార్జ్ అయ్యే రోజు కూడా ఎల్లో మీడియా శుక్రవారం ఉదయం నుంచి అవినాశ్ లక్ష్యంగా తప్పుడు కథనాలే ప్రసారం చేసింది. శ్రీలక్ష్మి డిశ్చార్జ్ కాగానే సీబీఐ అధికారులు అవినాశ్‌ను అరెస్టుచేస్తారని బ్రేకింగ్‌లు, డిబేట్లు నిర్వహించింది. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మిపై, ఆమె బాగోగులు చూసుకుంటున్న అవినాశ్‌పై కనీస మానవత్వం లేకుండా చికిత్సపై, అవినాశ్ అరెస్టుపై ఇష్టారాజ్యంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన అవినాశ్ అక్కడ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘అమ్మ ఆరోగ్యం బాగుంది. గుండెలో రక్తనాళాలు బ్లాక్ కావడంతో తదుపరి చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నాం. అమ్మను పరామర్శించేందుకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీడియాకు ఏదైనా ఇబ్బందులు జరిగి ఉంటే మనసులో పెట్టుకోవద్దు’.. అని ఆయన చెప్పారు. చేరిక నుంచి డిశ్చార్జ్ వరకూ తప్పుడు కథనాలే! అనారోగ్యంతో పులివెందుల ఆస్పత్రిలో చేరిన శ్రీలక్ష్మిని చూసేందుకు ఈ నెల 19న హైదరాబాద్ నుంచి అవినాశ్ పులివెందులకు బయల్దేరారు. పుల్లూరు టోల్గేట్ వద్ద సీబీఐ అధికారులు ఉన్నారని, అవినాశ్‌ను అరెస్టుచేయబోతున్నారని ‘పచ్చ’ చానళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి. నిజానికి ఆ రోజు సీబీఐ అధికారులే రాలేదు. 20న కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేయబోతున్నారని ప్రచారం చేశారు. 22న సీబీఐ అధికారులు ఎస్పీని కలిశారని.. ఇక్కడి పోలీసుల సహకారం లేకపోవడంతో మధ్యాహ్నానికి కేంద్ర బలగాలు రానున్నాయని, కాసేపట్లో కర్నూలుకు చేరుకుంటాయని, అవినాశ్ అరెస్టు తప్పదని రోజంతా ఏబీఎన్, టీవీ5లో గంటల తరబడి డిబేట్లు నడిపించారు. కానీ, కేంద్ర బలగాలు కర్నూలుకు రాలేదు. అవినాశ్ ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ ‘ఈరోజు అరెస్టు తప్పదు’ అనే కోణంలోనే ప్రసారం చేశారు. చివరకు శ్రీలక్ష్మి శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని విశ్వభారతి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దీంతో సీబీఐ అధికారులు కర్నూలులో రహస్య ప్రాంతాల్లో ఉన్నారని, డిశ్చార్జ్ కాగానే అరెస్టుచేస్తారని కథనాలు ప్రసారం చేశారు. ఇలా వారం రోజులుగా ఎల్లో మీడియా చెప్పిన ఏ ఒక్కటి జరగలేదు. ఒక్క వార్తలోనూ వాస్తవంలేదు. దీంతో ఎల్లో మీడియా అవినాశ్ లక్ష్యంగా ఎలాంటి తప్పుడు వార్తలు రాసిందో ప్రజలకు స్పష్టమైంది. శ్రీలక్ష్మి ఆరోగ్యంపైనా తప్పుడు వార్తలే.. పులివెందులలో శ్రీలక్ష్మి ఇంట్లో బీపీ వచ్చి పడిపోవడంతో ఉన్నత వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. మార్గమధ్యంలో ఆందోళనకరంగా ఉండటంతో కర్నూలులో విశ్వభారతి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. కార్డియాక్ ఎంజైమ్‌లో మార్పులు వచ్చాయని, ఈసీజీ తీశామని, రెండు రక్తనాళాలు కూడా బ్లాక్ అయ్యాయని డాక్టర్ హితేశ్‌రెడ్డి మీడియాకు చెప్పారు. కానీ, శ్రీలక్ష్మి ఆరోగ్యం బాగానే ఉందని, సీబీఐ నుంచి తప్పించుకునేందుకు అవినాశ్ తల్లిని పావుగా చేసుకున్నారనే కోణంలో కనీస మానవత్వం లేకుండా తప్పుడు వార్తలు ప్రసారం చేశారు. టీడీపీ వ్యక్తులు, మద్దతుదారులతో డిబేట్లు నడిపించారు. చివరకు.. ఆవిడకు బీపీ ఎక్కువై అయానోట్రోపిక్ సపోర్ట్‌తో ఉన్నారని వైద్యులు చెప్పినా తప్పుడు వార్తలకు ఫుల్స్టాప్ పెట్టలేదు. బుధవారం రాత్రి నుంచి శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగవుతూ రావడంతో శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. రెండు రక్తనాశాలు బ్లాక్ కావడంతో చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. దీంతో పచ్చ చానళ్ల ప్రసారాల్లో ఏమాత్రం నిజంలేదని అందరికీ తేటతెల్లమైంది. -
డిశ్చార్జికి.. రీచార్జికి మధ్య ‘ట్రాన్సిషనల్ కేర్’.. కొత్త వైద్యసేవలకు డిమాండ్
నాగేందర్ (55) దిల్సుఖ్నగర్ నివాసి. తీవ్రమైన నరాల వ్యాధికి గురై ఖైరతాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. శస్త్రచికిత్స తర్వాత డిశ్చార్జయి ఇంటికి వెళ్లారు. కానీ నాలుగైదు రోజుల్లోనే సమస్యలు తిరగబెట్టి ఆస్పత్రి పాలయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేవల లోపం దీనికి కారణమని వైద్యులు నిర్ధారించారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, వైద్యుల సూచనలను కచ్చితంగా అమలు చేస్తే.. ఈ పరిస్థితి వచ్చేదికాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటి నుంచి పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ‘ట్రాన్సిషనల్ కేర్’అవసరమని గుర్తించారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థ మన దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యం పాలైన కొందరు రోగులు చికిత్స పొంది, డిశ్చార్జి అయ్యాక తిరిగి ఆస్పత్రుల పాలవుతున్నారు. వైద్యుల సూచనలను సరిగా పాటించలేకనో, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనో.. అనారోగ్య సమస్యను మొదటికి తెచ్చుకుంటున్నారు. చికిత్స తర్వాత జాగ్రత్తలు లోపిస్తే అత్యంత అధునాతనమైన చికిత్స సైతం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ట్రాన్సిషనల్ కేర్ సేవలు పుట్టుకొచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స ముగిసినప్పటి నుంచి పూర్తిస్థాయిలో సాధారణ జీవితాన్ని మొదలుపెట్టేవరకు మధ్యలో అవసరమైన సేవలే ట్రాన్సిషనల్ కేర్. కొందరికి చికిత్స తర్వాత నర్సింగ్ కేర్, ఫిజియోథెరపీ వంటివి అవసరం. వ్యాధి సమస్యల కారణంగా ఎదుర్కొనే మానసిక క్షోభను తగ్గించేందుకు మానసిక పర్యవేక్షణ కావాలి. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్, న్యూరోసైన్స్, కార్డియాలజీకి సంబంధించిన సర్జరీల తర్వాత చికిత్సానంతర సమస్యలను తగ్గించడానికి, పూర్తిగా రికవరీ కావడానికి ట్రాన్సిషనల్ కేర్ మంచి పరిష్కారమని నిపుణులు చెప్తున్నారు. ఎలాంటి వారికి? ఎప్పుడు? ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే ప్రతి లక్ష మంది బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో 120కిపైగా మళ్లీ స్ట్రోక్ బారిన పడే చాన్స్ ఉందని అంచనా. వారు డిశ్చార్జి తర్వాతా ఆస్పత్రులకు, ఇంటికి తిరగాల్సి ఉంటుంది. ఈ ప్రయాణ, ఆస్పత్రి ఖర్చుల్ని తగ్గించుకోవడం, జాగ్రత్తల కోసం ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లు ఉపయుక్తమని నిపుణులు చెప్తున్నారు. న్యూరో సర్జరీ, వెన్నెముక గాయాలు, హిప్, మోకాలి మారి్పడి వంటివాటిల్లో చికిత్సానంతరం ఇంటికి వెళ్లేందుకు పట్టే రెండు–మూడు వారాల వ్యవధిలో ప్రత్యేక ట్రాన్సిషనల్ కేర్ అవసరమని వివరిస్తున్నారు. డిశ్చార్జ్ అనంతరం కొందరికి ఫిజియోథెరపీ, మానసిక కౌన్సెలింగ్ వంటివి సుదీర్ఘకాలం చేయాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోగిని ఇంటికి తీసుకెళ్లడానికి బదులుగా కేర్ సెంటర్‌ను ఎంచుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. అల్జీమర్స్ సమస్య ఉన్నవారికీ ట్రాన్సిషనల్ కేర్ అవసరమని అంటున్నారు. ఇక స్వాలో, స్పీచ్ థెరపిస్ట్, మసు్క్యలోస్కెలెటల్ ఫిజియోథెరపిస్ట్ సేవలు, ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావడం, ట్యూబుల ద్వారా ఆహారం అందించాల్సి రావడం, కదలికలకు తోడ్పడే పరికరాలు, మెషీన్లు, కొన్ని రకాల ప్రత్యేక బెడ్లు అవసరం ఉన్నప్పుడు ఈ సేవలను ఎంచుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. కేర్ సెంటర్లు ఏం చేస్తాయి? ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లలో వైద్యులు, నర్సులు, ఫిజియోథెరపిస్ట్‌లు, డైటీíÙయన్లు, సైకాలజిస్టులు, ఆక్యుపేషనల్, స్పీచ్, రెస్పిరేటరీ థెరపిస్ట్‌లు, న్యూరో, కార్డియాక్ ఫిజియో థెరపిస్టులు, సైకోథెరపిస్టులు, రోగి పూర్తిగా కోలుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆధునిక సౌకర్యాలు, అనుభవజు్ఞలైన, మల్టీడిసిప్లినరీ రీహ్యాబ్ కేర్ టీమ్ రోగులను పూర్వస్థితికి తీసుకురావడానికి సాయపడుతుంది. రోగి డిశ్చార్జి సమ్మరీని పరిశీలించి, వైద్యులతో మాట్లాడి అవగాహన ఏర్పరుచుకుని, అవసరమైన సేవలను అందిస్తారు. రోగుల పొజిషన్లను మార్చే బెడ్‌సైడ్ అసిస్టెంట్లు, ఆహారాన్ని అందించే నర్సులు కేర్ సెంటర్లో అందుబాటులో ఉంటారు. ఇంటర్నల్ మెడిసిన్‌కు చెందిన వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. వ్యయ ప్రయాసలు తగ్గించే క్రమంలో.. దేశంలో 65ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. వారికి తరచూ ఆరోగ్య సమస్యలు రావడం, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం ఎక్కువ. కొందరి విషయంలో ఇంట్లోనే ఉంటే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలోనే ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ల అవసరం ఏర్పడింది. సర్జరీ/ ప్రధాన చికిత్స వంటివి జరిగాక.. పూర్తిగా కోలుకోవడానికి ఆస్పత్రిలోనే ఉండటం తీవ్ర వ్యయ భారంతో కూడుకున్నది. అంతేగాకుండా ఇతర రోగులకు చికిత్స అందడంలో ఇబ్బందులు రావచ్చు. అలాంటప్పుడు ఈ సపోర్టివ్ కేర్ సేవలు అందిస్తుంది. – డాక్టర్ రామ్ పాపారావు, చైర్మన్, ఉచ్ఛా్వస్ ట్రాన్సిషనల్ కేర్ చదవండి: డాక్టర్లూ పదండి పల్లెకు పోదాం! -
ఆస్పత్రి నుంచి నేడు పోప్ ఫ్రాన్సిస్ డిశ్చార్జి
రోమ్: కేథలిక్కుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్(86) శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వాటికన్ వర్గాలు తెలిపాయి. సెంట్ పీటర్స్ స్క్వేర్‌లో బుధవారం సంప్రదాయ వారాంతపు ప్రసంగం అనంతరం అస్వస్థతకు గురైన పోప్‌ను రోమ్‌లోని గెమెల్లి పాలీక్లినిక్‌లో చేర్పించారు. బ్రాంకైటిస్‌తో బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలింది. యాంటీబయాటిక్ చికిత్సకు స్పందిస్తున్నారని వాటికన్ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందన్నారు. అయితే, ఆదివారం నుంచి ఈస్టర్ వీక్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారా లేదా అనేది సందిగ్ధంలో పడింది. ఇప్పటికే మోకాలి నొప్పితో బాధపడుతున్న పోప్ కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. కాగా, పోప్ ఫ్రాన్సిస్ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ శుక్రవారం ట్వీట్ చేశారు. -
ముక్కుస్రావం (చీమిడి) రంగును బట్టి వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పవచ్చు..!
ముక్కుస్రావాల గురించి మాట్లాడటం, జనబాహుళ్యంలో దానికి ఉండే పేరుతో పిలవడం అంత సభ్యత కాదనే అభిప్రాయంతో దాని గురించి పెద్దగా మాట్లాడరు. అయితే ముక్కుస్రావం ఏ రంగుతో ఉందనే దాన్ని బట్టి ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని చెప్పవచ్చంటున్నారు నిపుణులు. స్రావం ఏ రంగుతో ఉంటే ఎలాంటి సూచన అందుతుందో తెలిపే కథనం ఇది. ఏ రంగుతో ఏ సూచన అంటే..? రంగులేని స్వచ్ఛమైన స్రావం స్రావం స్వచ్ఛంగా ఉందంటే అందులో నీరు, ప్రోటీన్లు, కొన్ని లవణాలు ఉన్నాయని అర్థం. అలా ఉంటే ఆరోగ్యం పూర్తిగా నార్మల్ అని సూచన (ఒకవేళ పరిమాణం ఎక్కువగా ఉంటే జలుబు లేదా అలర్జీ ఉండి ఉండవచ్చు.) ముక్కులో ఉండే మ్యూకస్ అక్కడి తేమను, ముక్కు లోపలి పొరల లైనింగ్‌ను రక్షిస్తుంది. మంట (ఇరిటేషన్) రాకుండా కా΄ాడుతుంది. తెలుపు ముక్కు దిబ్బడ వేసి, ముక్కురంధ్రాలు మూసుకుపోయి (నేసల్ కంజెష్చన్) ఉండవచ్చు. ముక్కు లోపలి పొరల్లో వాపు లేదా ముక్కు లోపలి కణజాలంలో మంట (నేసల్ టిష్యూ ఇరిటేషన్) ఉండవచ్చు. ముక్కులో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉండి ఉండవచ్చు. ముక్కులో అలర్జీల కారణంగా అలా ఉండవచ్చు లేదా డీహైడ్రేషన్‌ను సూచించవచ్చు. పసుపుపచ్చ జలుబు కారణంగా దేహం జలుబుతో లేదా ఇతర ఇన్ఫెక్షన్తో పోరాడుతుండవచ్చు. మంట (ఇరిటేషన్)కు సూచన కావచ్చు. ఇన్ఫెక్షన్తో పోరాడి నశించిన తెల్లరక్తకణాలు... ఇలా పసుపురంగుతో బయటపడతాయి. కచ్చితంగా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం లేదుగానీ... జబ్బుతో బాధపడుతున్న (సిక్) ఫీలింగ్ ఉండవచ్చు. ఆకుపచ్చ మన వ్యాధినిరోధక శక్తి చాలా ఎక్కువగా పోరాడుతోందని అర్థం. స్రావాల్లో నశించిన తెల్లరక్తకణాలూ, ఇతరత్రా మరికొన్ని నశించిన కణాల సమూహమని అర్థం. సైసన్ ఇన్ఫెక్షన్ ఉన్నదనడానికి సూచన కావచ్చు. ఆకుపచ్చ స్రావాలు వరసగా 12 రోజులకు పైగా కనిపిస్తే డాక్టర్‌ను కలవాలనడానికి సూచన. పింక్ / ఎరుపు ముక్కు స్రావాలు ఎండినట్లుగా కావడం, మంట (ఇరిటేషన్) రావడం, అక్కడి కొద్దిగా దెబ్బతిన్నదనడానికి సూచన. ఈ పింక్ లేదా ఎరుపు రంగు... రక్తపు చారికకు సూచన. బ్రౌన్ ఆ ప్రాంతాల్లో రక్తస్రావమై అది ఎండిపోయినదడానికి సూచన. ఆ రంగు పదార్థాన్ని (ముక్కు΄÷డం లాంటిది) దేన్నైనా పీల్చి ఉండవచ్చు. వెంటనే ప్రమాదకరం కాక΄ోయినా, అప్రమత్తంగా ఉండాలి. దగ్గు సమయంలోనూ బ్రౌన్ రంగు కళ్లె/గళ్ల పడితే బ్రాంకైటిస్‌కు సూచన కావచ్చని అనుమానించాలి. డాక్టర్‌ను సంప్రదించాలి. నలుపు పొగతాగే అలవాటు ఉన్నవారై ఉండవచ్చు. కాలుష్యమూ కారణం కావచ్చు. డ్రగ్స్ తీసుకుని కూడా ఉండవచ్చు. దేహంలో ఫంగల్ ఇన్ఫెక్షన్కి సూచన కావచ్చు. ఈ సందర్భాల్లోనూ, పై సమస్యలేవీ కానప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి. -
గ్యాస్ లీకేజీ: ఘటనా స్థలానికి వెళ్లిన మంత్రి గుడివాడ అమర్నాథ్
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనలో ఎస్ఈజెడ్లోని ప్రమాద ప్రాంతాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎంపీ డాక్టర్ సత్యవతి శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఘటనా స్థలంలో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. గ్యాస్ లీక్ ఎలా అయింది అన్న విషయంపై ఆరా తీశారు. అయితే, దీనిపై స్పష్టత లేకపోవడంతో మంత్రి అమర్నాథ్ ఏపీఐఐసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించాము. రెండు కంపెనీల్లో ఉద్యోగులు ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారు. ఎక్కడ నుంచి విష వాయువులు వచ్చాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎస్ఈజెడ్లో ప్రమాదాల నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తాము. ముందుగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే మా ఉద్దేశ్యం’’ అని అన్నారు కోలుకుంటున్న బాధితులు ఇదిలా ఉండగా.. గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులు కోలుకుంటున్నారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులు డిశ్చార్జి అవుతున్నారు. శనివారం ఉదయం ఎలమంచిలి ఆసుపత్రి నుంచి కోలుకున్న బాధితులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక, మరికొన్ని ఆసుపత్రుల్లో కొందరు బాధితులు చికిత్స పొందుతున్నారు. వారికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి డిశ్చార్జి చేయాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. ఇది కూడా చదవండి: '124 మంది చికిత్స పొందుతున్నారు.. ఎవరికీ ప్రాణాపాయం లేదు' -
సంపూర్ణ ఆరోగ్యంతో ఏపీకి చేరుకున్న గవర్నర్ బిశ్వభూషణ్
సాక్షి, అమరావతి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఢిల్లీ టూర్ అనంతరం ఈనెల 15న కరోనావైరస్ బారిన పడిన గవర్నర్ బిశ్వభూషణ్.. హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకొని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఏపీకి బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో.. ఏపీ అధికారులు ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత.. గన్నవరం నుండి విజయవాడలోని రాజ్భనవన్కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బయలుదేరి వెళ్లారు. -
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్..
Inzamam-ul-Haq discharged from hospital: గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో అతడి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రముఖ భారతీయ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా ఇంజమామ్-ఉల్-హక్ వేగంగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అయితే గత కొద్ది రోజులుగా ఛాతీ నొప్పితో భాద పడుతున్న అతడిని సోమవారం ఉదయం లాహోర్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో అతడికి వైద్యులు ఆంజియోప్లాస్టి శస్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఇంజమామ్ ఆరోగ్యం మెరుగు పడడంతో వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇక 1992 ప్రపంచకప్‌ను పాకిస్తాన్ గెలవడంలో ఇంజమామ్ కీలక పాత్ర పోషించాడు. అతడు 2007 లో అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. గతంలో పాక్ జట్టు సారథ్య బాధ్యతలు నిర్వహించిన 51 ఏళ్ల ఇంజీ.. ప్రస్తుతం తన యూట్యూబ్ చానెల్ వేదికగా క్రికెట్‌కు సంబంధించిన విశ్లేషణలతో అభిమానులకు టచ్‌లో ఉంటున్నాడు. 1991లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఇంజమామ్ ఉల్ హక్.. తన కెరీర్లో 120 టెస్టులు... 378 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 8830 పరుగులు(25 సెంచరీలు).. వన్డేల్లో 11739(10 సెంచరీలు) రన్స్ చేశాడు. ఇక పాకిస్తాన్ ఆటగాళ్లలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంజీ గుర్తింపు పొందాడు. చదవండి: T20 World Cup: టీమిండియాలోకి శ్రేయస్..? ఆ నలుగురిపై వేటు పడనుందా..? -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బాలీవుడ్ నటి
ముంబై: బాలీవుడ్ నటి, వెటరన్ యాక్టర్ సైరా బాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ ఫైజల్ ఫారూఖీ అతని ట్విటర్ అకౌంట్ ద్వారా ఆమె అభిమానులతో పంచుకున్నాడు. కాగా 77 ఏళ్ల నటి సైరా బాను ఊపిరి అందక ఆగస్టు 28న ముంబైలోని హిందుజ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత ఊపిరితిత్తుల సమస్య తీవ్రంగా ఉండడంతో ఆమెను ఐసీయూలోకి మార్చారు. ఆమె ఆరోగ్యం కుదుటపడడంతో డిశ్చార్జి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు ఓ మీడియా ఏజెన్సీకి తెలిపాయి. ఫారుఖీ ఈ విషయం గురించి తెలుపుతూ.. "సైరా బానుజీ ఇంటికి వచ్చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. విశ్రాంతి తీసుకుంటున్నారు. మీ ప్రేమ, ప్రార్థన వల్లే ఆమె కోలుకున్నారు" అని నటి అభిమానులను ఉద్దేశించి ఫైజల్ ఫారూఖీ పోస్ట్‌లో హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు సైరా బాను గుండె జబ్బుతో తీవ్రమైన కరోనరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు, నిర్ధారణ తర్వాత కరోనరీ ఆంజియోగ్రామ్ చేయించుకోమని సూచించగా నటి నిరాకరించినట్లు ఆసుపత్రి వైద్యుడు ఒకరు మీడియా ఏజెన్సీకి తెలిపాడు. సైరాబాను భర్త, బాలీవుడ్ స్టార్ దీలిప్ కుమార్ 98 ఏళ్ల వయసులో మరణించిన విషయం అందరికి తెలిసిందే. ఆయన కూడా ఊపిరి అందక అదే హిందుజా హిస్పిటల్‌లో చేరి, అనంతరం జూలై 7న తుదిశ్వాస విడిచారు. ఈ రియల్ లైఫ్ కపుల్ సగిన, గోపి, బైరాగ్, దునియా వంటి హిట్ సినిమాల్లో కలిసి నటించారు. కాగా, ఆమె దివంగత బాలీవుడ్ నటుడు షామ్మీ కపూర్ హీరోగా నటించిన జంగ్లీ సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యారు. అనంతరం ఆమె పదోసన్, హేరా పేరి, దివానా వంటి ఎన్నో మంచి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిగా 1988లో ఫైస్లాలో నటించారు. #SairaBanu ji is back home. Discharged from the hospital. Doing well. Resting. Your love and prayers are truly appreciated. 🙏 — faisal farooqui (@FAISALmouthshut) September 5, 2021 చదవండి: Kim Sharma- Leander Paes: టెన్నిస్ స్టార్‌తో రిలేషన్.. కన్ఫర్మ్ చేసిన కిమ్ శర్మ! -
ఆసుపత్రి నుంచి కెప్టెన్ విజయకాంత్ డిశ్చార్జ్
చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విజయకాంత్ కోలుకొని ఇంటికి చేరుకున్నారని పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన క్షేమంగా ఉన్నారని, అనవసరంగా ఆయన ఆరోగ్యం గురించి లేనిపోని పుకార్లు సృష్టించవద్దని అభ్యర్థించారు. కాగా ఈనెల 19న విజయ్‌కాంత్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఊపిరాడని సమస్య మొదలైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నై మనప్పాక్కంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. విజయకాంత్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అప్పటినుంచి విజయ్‌కాంత్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పార్టీ కార్యాలయం తాజాగా విడుదల చేసిన ప్రకటనతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కెప్టెన్ అంటూ ప్రజలతో అభిమానంగా పిలువబడే విజయకాంత్ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండేళ్ల క్రితం ఆయన కుటుంబ సభ్యులు విజయకాంత్‌ను సింగపూరులో చికిత్స చేయించి సుమారు మూడునెలల తరువాత చెన్నైకి తీసుకొచ్చారు. దాదాపుగా మాట కూడా పడిపోయింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనకుండా ప్రధాన కార్యాలయంలో జరిగే ముఖ్యమైన సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారు. పార్టీ కోశాధికారి హోదాలో ఆయన సతీమణి ప్రేమలత పార్టీని నడుపుతున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి ఏమీ మాట్లాడకుండా కారులోనే కూర్చుండి సైగలతో ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఆయన మళ్లీ ఇంటికే పరిమితమయ్యారు. చదవండి : Vijayakanth Health Condition 2021: విజయ్ కాంత్‌కు అస్వస్థత టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత -
మదనపల్లి జంట హత్యల కేసు నిందితుల డిశ్చార్జి
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసు నిందితులను విశాఖ చినవాల్తేరులోని మానసిక వ్యాధుల చికిత్సాలయం నుంచి గురువారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. మదనపల్లికి చెందిన పురుషోత్తం, పద్మజ దంపతులు మూఢ విశ్వాసాలతో ఈ ఏడాది జనవరిలో తమ ఇద్దరు కుమార్తెలను అతి పాశవికంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. నిందితులను పోలీసులు అరెస్టు చేసి మదనపల్లి సబ్‌జైలుకి తరలించారు. అయితే వారి మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించిన జైలు అధికారులు తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యుల సిఫారసు మేరకు చినవాల్తేరులోని మానసిక వ్యాధుల చికిత్సాలయంలో చేర్పించారు. అప్పటినుంచి కౌన్సెలింగ్, చికిత్స పొందుతున్న వీరి ఆరోగ్య పరిస్థితి కుదుటపడడంతో చికిత్సాలయం సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి ఆమోదంతో డిశ్చార్జి చేశారు. కాగా, పోలీసులు వీరిని తిరిగి మదనపల్లి జైలుకి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: ‘నేను శివుణ్ణి.. కాళికను’: పద్మజ కేకలు -
రేపు గంగూలీ డిశ్చార్జి
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బుధవారం డిశ్చార్జి చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే మరికొన్ని రోజుల్లో లేదా వారాల్లో అతనికి మరోసారి యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి ఎండీ, సీఈవో రూపాలి బసు తెలిపారు. ప్రముఖ కార్డియాలజిస్టు దేవీ శెట్టి మంగళవారం గంగూలీని పరీక్షించిన తర్వాత తదుపరి చికిత్స గురించి వైద్యులకు సూచనలిస్తారని ఆమె చెప్పారు. ‘ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఇప్పుడే యాంజియోప్లాస్టీ చేయాల్సిన అవసరం కనిపించలేదు. కానీ కొన్ని రోజుల్లో కచ్చితంగా యాంజియాప్లాస్టీ చేయాల్సి ఉంటుంది. బుధవారం డిశ్చార్జి చేస్తాం. తర్వాత కూడా వైద్యులు నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తుంటారు’ అని రూపాలి బసు వెల్లడించారు. మరోవైపు సోమవారం గంగూలీని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి జై షా పరామర్శించారు. -
ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: రక్తపోటులో హెచ్చుతగ్గుల సమస్యతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన సినీనటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. గత రెండ్రోజులతో పోలిస్తే ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే ఆయనకు మరో వారం రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో స్పష్టం చేశారు. రక్తపోటు పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు ఆయన వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన అపోలో ఆస్పత్రి నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లిపోయారు. అన్నాత్తే సినిమా షూటింగ్ కోసం ఈ నెల 14న హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్.. చిత్ర యూనిట్లో పలువురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఈ నెల 22న ఆయన కూడా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. తాత్కాలికంగా సినిమా షూటింగ్ నిలిపివేయడంతో ఫిలింసిటీలోని హోటల్లో ఆయన హోం క్వారంటై¯Œ అయ్యారు. శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా ఆయన అనారోగ్యం బారిన పడటంతో జూబ్లీ్లహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. -
ఏలూరు ఘటన: 20 మంది డిశ్చార్జ్
సాక్షి, ఏలూరు: నగరంలోని వన్‌టౌన్ ఏరియాలో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బాధితులు డిశ్చార్జ్ అవుతున్నారు. శనివారం అర్ధరాత్రి డాక్టర్ల బృందం పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం.. 20 మంది బాధితులు పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించే విషయంలో డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక పర్యవేక్షణలో ఏలూరు కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని మోనిటరింగ్ చేయడానికి మంత్రి ఆదేశాలు ఇచ్చారు. చదవండి: (ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత) ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంచార్జి డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ పర్యవేక్షణలో వైద్యుల బృందం ప్రత్యేకంగా వైద్యసేవలు అందిస్తోంది. ఈ మేరకు వైద్యుల బృందం మీడియాతో మాట్లాడుతూ.. ఏలూరు నగరంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దు. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మంత్రి ఆళ్ల నాని ఆదేశాల మేరకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిళ్ళపల్లి జై ప్రకాష్ ప్రభుత్వ ఆస్పత్రిలో మకాం వేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సమన్వయం చేస్తున్నారు. ఏలూరులో అనారోగ్యానికి గురైన ప్రాంతాలలో ప్రత్యేకంగా మెడికల్ టీమ్‌లు, ఇంటింటి సర్వే చేపట్టామని తెలిపారు. కాగా, మంత్రి ఆదేశాల మేరకు ఏలూరు ఆర్డీవో పనబాక రచన, ఎమ్మార్వో సోమశేఖర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. -
కరోనా నుంచి కోలుకున్న రాజశేఖర్
కరోనా మహమ్మారి బారిన పడిన హీరో రాజశేఖర్ కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి ఆయన సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబరులో రాజశేఖర్, జీవితలతో పాటు ఆయన కుమార్తెలు శివాని, శివాత్మిక కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తొలుత శివాని, శివాత్మిక కరోనా నుంచి కోలుకోగా ఆ తర్వాత జీవిత కోలుకున్నారు. అయితే రాజశేఖర్ మాత్రం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ పూర్తిగా కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు– జీవిత ‘‘రాజశేఖర్‌గారు ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు నేను, మా అమ్మాయిలు కూడా ఆస్పత్రిలోనే ఉంటూ ఆయన్ని చూసుకున్నాం. డాక్టర్ కృష్ణగారు, ఇతర డాక్టర్లు, నర్సులు, వార్డు బాయ్స్‌తో పాటు యాజమాన్యం వారు మమ్మల్ని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. అందుకే రాజశేఖర్‌గారు ఇంత పెద్ద విపత్తు నుంచి బయట పడ్డారు. రాజశేఖర్‌గారు త్వరగా కోలుకోవాలని కోరుకున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’’ అన్నారు జీవిత. -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కపిల్ దేవ్
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన టిమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కోలుకుని ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల కపిల్‌కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోని ఓ ప్రవైటు ఆస్పిత్రిలో చేర్పించగా అదే రోజు రాత్రి వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు మాజీ క్రికెటర్ చెతన్‌శర్మ ఆదివారం ట్విటర్ వేదికగా ప్రకటించాడు. కపిల్ దేవ్ ఆస్పత్రి వైద్యుడితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘వైద్యుడు అతుల్ మాథుర్ కపిల్ పాజీకి యాంజియోప్లాస్టీ చేశాడు. ప్రస్తుతం కపిల్ కోలుకోవడంతో ఈ రోజు ఉదయం ఆయనను డిశ్చార్జ్ చేశారు’ అంటూ చేతన్ శర్మ ట్వీట్ చేశాడు. (చదవండి: గుండెకు ఆపరేషన్: కపిల్‌దేవ్ ట్వీట్) Dr Atul Mathur did Kapil paji angioplasty. He is fine and discharged. Pic of @therealkapildev on time of discharge from hospital. pic.twitter.com/NCV4bux6Ea — Chetan Sharma (@chetans1987) October 25, 2020 అయితే అక్టోబర్ 23(శుక్రవారం) రాత్రి కపిల్‌కు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. అనంతరం ఆయనను ఐసీయుకు తరలించారు. ఇదే విషయాన్ని కపిల్ తర్వాత రోజు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆస్పత్రి యాజమాన్యం కూడా కపిల్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేస్తూ.. ‘కపిల్ ఐసీయు ఉన్నారని ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. మరో రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: బ్రేకింగ్: కపిల్‌దేవ్‌కు గుండెపోటు) -
కరోనా నుంచి కోలుకున్న అమితాబ్
ముంబై: కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోలుకున్నారు. కరోనా నుంచి అమితాబ్ బచ్చన్ కోలుకొని ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్‌తో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అమితాబ్.. నేడు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల కరోనా పరీక్షల్లో అమితాబ్‌కు నెగటివ్ వచ్చిందనే నకలీ వార్త సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీని పై అమితాబ్ ఘాటుగానే స్పందించారు. బాధ్యతారాహిత్యంతో కూడిన వార్తలను ప్రచారం చేయవద్దని అమితాబ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అమితాబ్ కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా సోకగా, ఇటీవలే ఐశ్వర్యరాయ్, ఆరాధ్య, ఇద్దరు కోలుకున్నారు. (వాళ్లకు భూమ్మీద బతికే అర్హత లేదు) -
కరోనా : డిశ్చార్జ్ అయ్యాక పాజిటివ్!
శ్రీనగర్ : కరోనా పరీక్షలో నెగిటివ్ తేలిన 12 మందికి మూడు రోజుల తర్వాత కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన ఉదంతం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. స్థానికంగా ఓ కూల్ డ్రింక్ ఫ్యాక్టరీలో పనిచేసే 12 మంది కార్మికులకు కరోనా లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందారు. పదిరోజుల అనంతరం నిర్వహించిన రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా మొదటిసారి ఫలితాల్లో నెగిటివ్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎవరికి వారు తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కోవిడ్ ఉన్నట్లు తేలడంతో వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వారు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ భూపిందర్ కుమార్‌ని సంప్రదించగా.. తనకు ఈ సంఘటన గురించి తెలియదన్నారు. విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (వినూత్న ప్రచారం.. ముందు పేజీలో మాస్క్ ) ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగానే తాము పరీక్షలు నిర్వహించామని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. బాధితులు జూలై 1న వారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, ఆసుపత్రిలోనే చికిత్స అందించామని తెలిపారు. నిబంధనల ప్రకారం వైరస్ నిర్ధారణ అయిన 10 రోజుల అనంతరం రోగిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోతే, పరీక్షలోనూ నెగిటివ్ వస్తే డిశ్చార్జ్ చేయొచ్చని.. దానికనుగుణంగానే తాము చేసినట్లు పేర్కొన్నారు. నిజానికి కరోనా సోకిన వ్యక్తికి 10 రోజుల అనంతరం లక్షణాలు లేకపోతే రెండుసార్లు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. రెండింటిలోనూ నెగిటివ్ వస్తే వైరస్ లేనట్లు. అంటే వారిని డిశ్చార్జ్ చేయొచ్చు. కశ్మీర్ ఆస్పత్రి సిబ్బంది మాత్రం రెండోసారి ఫలితాలు రాకముందే వారందరినీ ఇళ్లకు పంపించేశారు. దీంతో వారు ఇప్పుడు ఎవరెవరిని కలిసారన్న దానిపై అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు. (అమర్నాథ్ యాత్ర రద్దు ) -
కర్నూలులో 403 మంది కరోనా విజేతలు
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కంటే కర్నూలు జిల్లాను కోవిడ్–19(కరోనా) వైరస్ తీవ్రంగా భయపెట్టింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజల మనోధైర్యం ముందు కరోనా తోక ముడుస్తోంది. తాజాగా మరో 28 మంది కోవిడ్‌ను జయించి..ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కోవిడ్ విజేతల సంఖ్య 403కు చేరుకుంది. ఇది మొత్తం కేసుల్లో 71 శాతంగా ఉండటం విశేషం. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 159 మంది (26 శాతం) మాత్రమే చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం కర్నూలు చైతన్య కాలేజీ కోవిడ్ కేర్ సెంటర్ నుంచి ఏడుగురు, నంద్యాల శాంతిరామ్ జిల్లా స్థాయి ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రి నుంచి 14 మంది, కర్నూలు సమీపంలోని విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రి నుంచి ముగ్గురు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి నలుగురు డిశ్చార్జ్ అయ్యారు. (ఫలిస్తున్న నియంత్రణ చర్యలు ) వీరికి వరుసగా రెండు పరీక్షల్లో నెగిటివ్ ఫలితం రావడంతో వైద్యులు, అధికారులు చప్పట్లతో అభినందించి ఇంటికి పంపించారు. ఇందులో 15 మంది పురుషులు, 13 మంది స్త్రీలు ఉండగా.. కర్నూలు నగర వాసులు 14 మంది, నంద్యాల వాసులు 12 మంది, కోవెలకుంట్ల, చాగలమర్రికి చెందిన ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరిలో బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ 50 నుంచి 70 ఏళ్ల వయసు కల్గిన వారు 10 మంది ఉండటం విశేషం. డిశ్చార్జ్ అయిన వారికి ఒక్కొక్కరికి రూ.2వేల నగదు ఇచ్చి ప్రత్యేక అంబులెన్స్‌లో ఇంటికి పంపించినట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. మరో ముగ్గురికి పాజిటివ్ జిల్లాలో తాజాగా మరో ముగ్గురు వ్యక్తులకు కరోనా నిర్ధారణ అయ్యింది. వీరిలో కర్నూలు నగరానికి చెందిన ఇద్దరు, ఆదోనికి చెందిన ఒకరు ఉన్నారు. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 611కు చేరుకుంది. అలాగే కర్నూలు నగరంలో బాధితుల సంఖ్య 388కి చేరగా.. వీరిలో ఇప్పటి వరకు 243 మంది కోలుకున్నారు. -
ఆస్పత్రి నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆదివారం రోజున ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జి చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎటువంటి సమస్య లేదని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. (చదవండి : మెరుగుపడిన మన్మోహన్ ఆరోగ్యం) కాగా, ఛాతీ నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరిన సమయంలో మన్మోహన్‌కు జ్వరం కూడా వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా వైద్యులు.. ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. మొదట వైద్యులు ఆయన్ని కార్డియో థొరాసిక్ ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అనంతరం కార్డియో–న్యూరో టవర్లోని ప్రైవేట్ వార్డుకు తరలించారు. కాగా, 1990లో ఆయనకు తొలిసారిగా బైపాస్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత 2003లో ఆయనకు స్టంట్ వేశారు. 2009లో మరోసారి ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. -
కరోనా నుంచి కోలుకున్న భారతీయులు!
ఖాట్మాండు: నేపాల్‌లో కరోనా సోకిన ఆరుగురు భారతీయులు బుధవారం డిశార్జ్ అయ్యారు. బిరాత్‌నగర్‌లోని కోశి హస్పటల్లో ఐసోలేషన్ వార్డులో వీరిని ఉంచి చికిత్స అందించారు. వారిని చాలా సార్లు పరీక్షించి, పరిశీలించిన తరువాత నెగిటివ్ అని తేలడంతో హాస్పటల్ నుంచి డిశార్జ్ చేసినట్లు కోశి హాస్పటల్ సూపరింటెండెంట్ సంగీత మిశ్రా తెలిపారు. రెండు సార్లు వారికి కరోనా నెగిటివ్ వచ్చిందని, 19 రోజుల పాటు ఆసుప్రతిలో ఉంచి పూర్తిగా కోలుకున్న తరువాతే డిశార్జ్ చేశామని తెలిపారు. (ఇటలీ : కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేశాం!) కోలుకున్న వారందరికి నేపాల్ సోషల్ డెవలప్మెంట్ మంత్రి జీవన్ గిమైర్ ఆసుపత్రి ప్రాంగణంలో వీడ్కోలు పలికారు. మరో ఏడుగురు భారతీయులు కరోనా సోకి ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని డాక్టర్ మిశ్రా తెలిపారు. కోలుకున్న ఈ ఆరుగురితో కలిపి నేపాల్‌లో మొత్తం 22మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. నేపాల్ దేశంలో 60 మంది ఇంకా వివిధ ఆసుపత్రుల్లో కరోనా సోకి పరిశీలనలో ఉన్నారు. (ఎక్కువ మంది చనిపోతారు.. మాస్కు పెట్టుకోను) -
కోవిడ్ ఒక మహా విపత్తు
వాషింగ్టన్/లండన్/రోమ్: కోవిడ్ రక్కసి గుప్పిట్లో చిక్కుకొని అమెరికా విలవిల్లాడుతోంది. ఈ వైరస్ ప్రతిరోజూ వందలాది మంది ప్రాణాలను బలిగొంటూ తీవ్రరూపం దాలుస్తోంది. కోవిడ్ కేసులు, మృతుల సంఖ్యలో అమెరికా అన్ని దేశాలను దాటేసి పట్టికలో అగ్రస్థానానికి వెళ్లడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కోవిడ్ మృతులు ఇటలీని మించిపోయి 20 వేలు దాటిపోవడంతో అమెరికా ప్రభుత్వం మహా విపత్తుగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకారంతో వ్యోమింగ్ రాష్ట్రాన్ని కూడా కోవిడ్ విపత్తు పరిధిలోకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాల్లోనూ అత్యవసర పరిస్థితులు విధించినట్టయింది. అమెరికా చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. కోవిడ్‌ను మహా విపత్తుగా గుర్తించడం వల్ల వైరస్ ముప్పు ఉన్నంతకాలం అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నిధులను అన్ని రాష్ట్రాలూ, స్థానిక ప్రభుత్వాలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ విపత్తును ఎదుర్కొనేం దుకు నేరుగా వైట్ హౌస్ నిధులు అన్ని రాష్ట్రాలకు బదలాయిస్తుంది. అత్యవసర సేవల్ని కూడా ఫెడరల్ ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. కోవిడ్ ప్రభావం అత్యధికంగా న్యూయార్క్, న్యూజెర్సీలపై ఉంటే, ఇప్పుడిప్పుడే షికాగో వంటి రాష్ట్రాలకూ వ్యాధి విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య కూడా 5 లక్షల 50 వేలకు చేరుకుంది. కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడడానికి అధ్యక్షుడు ట్రంప్ 50 వేల మంది ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దించారు. 60 వేల మంది మరణిస్తారని అంచనాలు కోవిడ్ మహమ్మారితో అమెరికాలో లక్ష నుంచి రెండు లక్షల మంది మరణిస్తారని తొలి దశలో అంచనా వేశారు. కానీ దేశం యావత్తూ లాక్డౌన్లో ఉండడం, 95 శాతానికి పైగా ఇళ్లు వదిలి బయటకు రాకుండా అత్యంత కఠినంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఉండడంతో మృతుల సంఖ్య ఆ స్థాయిలో ఉండదని కోవిడ్‌పై పోరాటానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ భావిస్తోంది. ఈ విపత్తు నుంచి బయటపడే సమయానికి మృతుల సంఖ్య 60 వేలు దాటకపోవచ్చునని టాస్క్ ఫోర్స్ సభ్యులు అంచనా వేశారు. అమెరికాకు చేరుకున్న క్లోరోక్విన్ మాత్రలు కరోనా వైరస్‌ను నిరోధించడంలో అత్యంత కీలకంగా భావిస్తున్న మలేరియా వ్యాధికి వాడే క్లోరోక్విన్ మాత్రలు భారత్ నుంచి అమెరికాకు చేరుకున్నాయి. అమెరికా కోరినట్టుగా 35.82 లక్షల మాత్రలతో పాటు ఇతర ఔషధాల తయారీలో వినియోగించే ముడిపదార్థం 9 మెట్రిక్ టన్నుల్ని ప్రత్యేక కార్గో విమానంలో అమెరికాకు పంపింది. అవన్నీ శనివారం న్యూజెర్సీలో నేవార్క్ విమానాశ్రయానికి చేరుకున్నట్టుగా అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ ట్వీట్ చేశారు. ► సింగపూర్‌లో సంపూర్ణంగా లాక్డౌన్ ప్రకటించినప్పటికీ 24 గంటల్లో 191 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 51 మంది భారతీయులు ఉన్నారని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ► యూకేలో మృతులు 10 వేలు దాటేశాయి. ఒకే రోజు 657 మంది మృతి చెందడం ఆందోళన పెంచుతోంది. ► యూరప్ దేశాల్లో మృతుల సంఖ్య 75 వేలు దాటింది. స్పెయిన్‌లో ఆదివారం 610 మంది ప్రాణాలు కోల్పోయారు. ► చైనాలో మళ్లీ కరోనా కలవరం రేపుతోంది. మరో 100 కేసులు నమోదయ్యాయి. ► ప్రపంచ దేశాలన్నీ మరికొన్ని రోజులు లాక్డౌన్ పాటించాలని, లేదంటే రెండో విడత వైరస్ విజృంభించే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హితవు హెచ్చరించింది. ఆస్పత్రి నుంచి బోరిస్ జాన్సన్ డిశ్చార్జి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కోవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఆరోగ్యం బాగుపడడంతో లండన్‌లో సెయింట్ థామస్ నుంచి ఆయనను డిశ్చార్చి చేశారు. వైద్య సిబ్బంది తన ప్రాణాలు కాపాడారని, వాళ్లకి ఎప్పుడూ రుణపడి ఉంటానని ఇంటికి వెళ్లే సమయంలో జాన్సన్ పేరు పేరునా ఆస్పత్రిలో అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మరికొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారని, ఆయన విధులకు హాజరుకావడానికి మరి కొద్ది రోజుల సమయం పడుతుందని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డొమినిక్ రాబ్ వెల్లడించారు. -
క్వారంటైన్ నుంచి 293 మంది డిశ్చార్జి
సాక్షి, మార్కాపురం: మార్కాపురంలోని జార్జి ఇంజినీరింగ్ కళాశాలలో 74 మంది, కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 91 మంది కరోనా వైరస్ అనుమానితులను పరీక్షల అనంతరం శనివారం విడుదల చేసినట్లు విద్యాశాఖమంత్రి సురేష్, ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, ఆర్డీవో ఎం.శేషిరెడ్డి, తహసీల్దార్ రమేష్ తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం ఉండటంతో, ఇతర ప్రాంతాల నుంచి రావటంతో అధికారులు క్వారంటైన్ సెంటర్లలో వైద్య పరీక్షలు నిర్వహించిన నెగటివ్ రావడంతో స్వగృహాలకు పంపుతున్నట్లు తెలిపారు. (ఏపీలో 190కి చేరిన పాజిటివ్‌లు) అద్దంకి రూరల్: అద్దంకి క్వారంటైన్ సెంటర్లో ఉన్న కరోనా వైరస్ అనుమానితులను శుక్రవారం 111 మందిని డిశ్చార్జి చేసినట్లు తహసీల్దార్ సీతారామయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కరోనా అనుమానితులుగా గుర్తించిన వారిని క్వారంటైన్ సెంటర్లో 10 రోజులుంచి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేకపోవటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు 111 మందిని శనివారం డిశ్చార్జి చేశారు. కందుకూరు: కరోనా అనుమానితులుగా క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచిన పలువురిని వైద్య పరీక్షల అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటికి పంపించారు. ఓగూరులోని వైఎస్సార్ ఉద్యానవన కాలేజీలో ఉన్న క్వారంటైన్ కేంద్రంలో దాదాపు 60 మంది వరకు ఉన్నారు. వీరి నుంచి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షల కోసం పంపారు. వీరిలో 17 మందికి సంబంధించి కరోనా నెగటివ్ రిపోర్టులు రావడంతో శనివారం ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి, ఆర్డీవో ఓబులేసు, తహసీల్దార్ శ్రీనివాసరావు దగ్గర ఉండి వారిని ఇళ్లకు పంపించారు. రెండు కుటుంబాలు క్వారంటైన్‌కు తరలింపు : హనుమంతునిపాడు: మండల పరిధిలోని హాజీపురం ఎస్సీ కాలనీకి చెందిన రెండు కుటుంబాలు, సీతారంపురం ఎస్సీ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకిందేమని అనుమానంతో కనిగిరి మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు హాజీపురం ఎస్సీ కాలనీకి చెందిన గూడూరి సలోమి, గూడూరి సంతమ్మ ఎస్సీ కమిషనర్‌ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లి మార్చి 15వ తేదీన స్వగ్రామం హాజీపురం వచ్చారు. సీతారాంపురం ఎస్సీ కాలనీకి చెందిన కస్తాల గురువయ్య ఢిల్లీ ఏపీ భవన్లో ఉద్యోగం చేస్తూ స్వగ్రామం వచ్చారు. దీంతో కరోనా సోకిందేమోనని అనుమానంతో వైద్యలను కల్సి స్వచ్ఛందంగా కనిగిరి క్వారంటైన్లో చేరినట్లు డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, ఎస్సైలు వై.శ్రీహరి తెలిపారు. వారి రక్త నమూనాలు తీసి కరోనా పరీక్షలకు పంపించినట్లు తెలిపారు. అనుమానిత కేసు ఐసోలేషన్‌కు చినగంజాం: మండల కేంద్రంలోని అంబేడ్కర్ నగర్లో కరోనా అనుమానిత మహిళ కేసును గుర్తించిన టాస్క్‌ఫోర్స్ బృందం శనివారం ఆమె ఇంటిని సందర్శించి పరిశీలించారు. మహిళకు దగ్గు, జలుబుతో ఉండటంతో ఆమెను చీరాల ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. -
ఆస్పత్రినుంచి సినీనటుడు శర్వానంద్ డిశ్చార్జ్
రాంగోపాల్‌పేట్: సినిమా షూటింగ్లో గాయపడిన సినీ హీరో శర్వానంద్ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. థాయ్‌లాండ్‌లో ఓ సినిమా షూటింగ్లో గాయపడిన ఆయన ఈ నెల16న సికింద్రాబాద్ సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన సంగతి విదితమే. అతడి భుజానికి గాయం కావడంతో డాక్టర్ గురువారెడ్డి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం శర్వానంద్ కోలుకోవడంతో శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. -
గోవాకు తిరిగొచ్చిన పరీకర్
పనజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆదివారం మధ్యాహ్నం స్వరాష్ట్రానికి తిరిగొచ్చారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గోవా చేరిన పరీకర్.. అక్కడ నుంచి అంబులెన్స్‌లో డోనా పౌలాలో ఉన్న నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు గోవా మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. పరీకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం అని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ విలేకరులకు తెలిపారు. గోవా అసెంబ్లీ రద్దు వార్తలను ఆయన ఖండించారు. ఫిబ్రవరిలో అనారోగ్యానికి గురైన పరీకర్ గోవా, ముంబై, అమెరికాలో చికిత్స పొందారు. చివరికి సెప్టెంబర్ 15న ఎయిమ్స్‌లో చేరారు. -
8 మంది కంటి వెలుగు బాధితుల డిశ్చార్జి
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు ఆపరేషన్ వికటించి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిది మందిని సోమవారం డిశ్చార్జి చేశారు. పూర్వ వరంగల్ జిల్లాకు చెందిన 19 మంది కంటి వెలుగు కింద పరీక్షలు చేయించుకోగా, వారికి వరంగల్ జయ నర్సింగ్ హోమ్‌లో క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశారు. అందులో 17 మందికి ఆపరేషన్ వికటించిన సంగతి తెలిసిందే. వారికి ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో అందులో కోలుకున్న 8 మందిని డిశ్చార్జి చేసినట్లు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. మిగిలిన వారికి చికిత్స అందుతోందని, ఎవరికీ కంటి చూపు కోల్పోయే ప్రమాదం లేదని పేర్కొన్నారు. డిశ్చార్జి అయిన వారిలో గోరంట్ల సుజాత (55), అజ్మీర మేఘ్య (70), గోపరాజు బుచ్చమ్మ (65), భగవాన్ (70), ఎం.శాంతమ్మ (58), ఎం.రాజయ్య (70), బోలె సరోజన (45), కె.సరోజన (48) ఉన్నారు. పూర్తిగా నయం కాకుండానే డిశ్చార్జి! డిశ్చార్జి అయిన 8 మందిలో ఇద్దరు మాత్రం తమకు పూర్తిగా నయం కాలేదని ఆరోపించారు. కె.సరోజన కుమారుడు హరిప్రసాద్ మాట్లాడుతూ.. తన తల్లి ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందన్నారు. ఆమెకు కళ్లు కనిపించడం లేదన్నారు. డిశ్చార్జి అయిన అందరి పరిస్థితీ అలాగే ఉందని తెలిపారు. డాక్టర్లను అడిగితే సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. తన తల్లికి సగమే నయమైందని గోపరాజు బుచ్చమ్మ కుమారుడు కుమారస్వామి అన్నారు. 8 మందికి నయం కాలేదన్న ప్రచారాన్ని డాక్టర్ శ్రీనివాసరావు ఖం డించారు. నయం కానప్పుడు అందరినీ కాకుండా 8 మందినే ఎందుకు డిశ్చార్జి చేస్తామని ప్రశ్నించారు. ఈ సంఘటనకు రాజకీయ రంగు పులుముకుంది. ఆపరేషన్ వికటించి ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రతిపక్షాల నేతలు రెండు రోజులుగా పరామర్శిస్తున్నారు. -
సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్: మాజీ డీఐజీకి ఊరట
సాక్షి, ముంబై : గ్యాంగ్‌స్టర్ సోహ్రబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో గుజరాత్ మాజీ డీఐజీ డీజీ వంజర, ఐఏఎస్ అధికారులు దినేష్, రాజ్‌కుమార్ పాండియన్‌లకు విముక్తి లభించింది. కేసు విచారణ సందర్భంగా వీరిపై అభియోగాలు కొట్టివేయడానికి తాను వ్యతిరేకం కాదని సీబీఐ స్పష్టం చేయడంతో వీరిపై అభియోగాలను బాంబే హైకోర్టు సోమవారం కొట్టివేసింది. 2005-2006లో సోహ్రబుద్దీన్ షేక్, ఆయన భార్య కౌసర్ బీ, వారి సహచరులు తులసీరాం ప్రజాపతి ఎన్కౌంటర్ కేసు నుంచి తనను తప్పించాలని గుజరాత్ ఐపీఎస్ అధికారి విపుల్ అగర్వాల్ దరఖాస్తును కోర్టు అనుమతించింది. కాగా ఈ కేసు నుంచి గుజరాత్ మాజీ డీఐజీ వంజర, ఐపీఎస్ అధికారులు ఎంఎన్ దినేష్, పాండియన్‌లను తప్పించడాన్ని సవాల్ చేస్తూ సోహ్రబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు ప్రధాన నిందితులపై అభియోగాలను కొట్టివేయడాన్ని సోహ్రబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ న్యాయవాది గౌతం తివారి తప్పుపట్టారు. -
‘నా ఈ పరిస్థితికి కారణం సల్మాన్’
‘నాకు బట్టల దగ్గర నుంచి సబ్బుల వరకూ.. మందులు, ఆహారం అన్నింటిని సమకూర్చి.. నేను పూర్తి ఆరోగ్యంగా మారాడానికి అతని ఫౌండేషన్ ఎంతో సహకరించింది. ఈ రోజు నేను బతికి ఉన్నానంటే అందుకు కారణం ఆయనే’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు పూజా దద్వాల్. ఇది చదివాకా ఈ పేరు ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది కదా. అవును.. కొన్ని నెలల క్రితం ‘అనారోగ్యం పాలైన సల్మాన్ హీరోయిన్.. ఆదుకునే వారు లేరు’ అంటూ వార్తలు వచ్చింది ఈ నటి గురించే. టీబీతో బాధపడుతున్న పూజా దద్వాల్ తన అనారోగ్యం గురించి ఆర్ధిక పరిస్థితుల గురించి ఓ జాతీయా మీడియా సంస్థతో మాట్లాడుతూ, సల్మాన్ ఖాన్‌ను సాయం చేయాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సల్లుభాయ్ ఆమెకు సాయం చేస్తానని మాట ఇవ్వడమే కాక.. తన ఫౌండేషన్ వారికి ఆమె గురించి చెప్పాడు. సల్మాన్ ఆదేశాలు మేరకు ఈ ఫౌండేషన్ పూజాకు అవసరమైన సాయం చేసి ఆమె తిరిగి కోలుకునేలా సహకరించారు. ఐదు నెలల తర్వాత ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు పూజా. ఈ సందర్భంగా పూజా ఒక ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఈ వ్యాధి గురించి తెలిసినప్పుడు ఖచ్చితంగా నేను మరణిస్తాననే అనుకున్నాను. ఎందుకంటే నా ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా నన్ను దూరం పెట్టారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. పట్టించుకునే వారు లేరు. ఆ సమయంలో నేను చాలా నిరాశకు గురయ్యాను. కానీ నేను దీన్ని ఇంతటితో ముగించాలని అనుకోలేదు. ఈ వ్యాధితో పోరాటం చేయాలనుకున్నాను. అందుకే ఆ సమయంలో సల్మాన్‌ని సాయం కోరాను. నా పరిస్థితి గురించి తెలుసుకుని ఆయన చాలా బాధపడ్డారు. తక్షణమే ఆయన ఫౌండేషన్‌కి చెప్పి నాకు కావాలసినవన్ని సమకూర్చారు. మందులు, ఆహారం, బట్టలు ప్రతీది. ఈ రోజు నేను బతికున్ననంటే అందుకు కారణం సల్మాన్. ఆయన చేసిన మేలును ఎన్నటికి మరవలేను’ అంటూ సల్లుభాయ్కి కృతజ్ఞతలు తెలిపారు. సల్మాన్ హీరోగా 90ల్లో వచ్చిన 'వీర్‌గాటి' చిత్రంలో నటించిన పూజా దద్వాల్ టీబీ వ్యాధి బారిన పడి వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేని స్థితిలో ఉన్నానంటూ, సల్మాన్‌ను సాయం చేయాల్సిందిగా మీడియా ద్వారా వేడుకున్న విషయం తెలిసిందే. పూజా పరిస్థితి తెలుసుకున్న సల్మాన్ ఆమె కోలుకునేందుకు అవసరమైన సాయం చేశారు. -
ఆ క్షణం అద్భుతం
చియాంగ్ రాయ్: థాయ్‌లాండ్ గుహలో చిక్కుకుని 18 రోజుల తర్వాత బయటపడిన 12 మంది బాలురు, వారి ఫుట్‌బాట్ కోచ్ బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జయి ఇళ్లకు చేరుకున్నారు. ఆస్పత్రి బయట ఈ సందర్భంగా వారు తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. గుహ నుంచి బయటపడటం ఓ అద్భుతమని పిల్లలు వ్యాఖ్యానించారు. రెండు వారాలకుపైగా గుహలో ఉండటంతో ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకి ఉంటాయేమోనన్న అనుమానంతో వారిని చియాంగ్రాయ్లోని ఓ ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉంచడం తెల్సిందే. తొలుత పిల్లలను గురువారం ఇళ్లకు పంపాలని నిర్ణయించినప్పటికీ ఒకరోజు ముందుగానే వారిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అందరు పిల్లలతోపాటు, వారి కోచ్ కూడా పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. కాగా, ఇళ్లకు వెళ్లాక నెలపాటు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా పిల్లలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేలా చూడాలని వైద్యులు సూచించారు. ఆ గుహలోని జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు అడగనున్న ప్రశ్నలను ప్రభుత్వం ముందుగానే తెప్పించుకుని, మానసిక వైద్యులకు చూపించి, బాలుర ఆరోగ్యానికి ఏ ఇబ్బందీ ఉండదనుకున్న ప్రశ్నలనే అనుమతించారు. పిల్లలు ఇళ్లకు రావడంతో అమితానందంగా ఉందని, ఈ రోజు ఓ శుభదినమని బాలుర కుటుంబ సభ్యులు చెప్పారు. -
హమ్మయ్యా..గండం గడిచింది
ఎ.కొండూరు (తిరువూరు) : శ్రీరామనవమి కల్యాణోత్సవాల్లో కలుషిత పానకం సేవించి అస్వస్థతకు గురైన 313 మంది కోలుకున్నారు. వీరంతా నాలుగు రోజులుగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. వీరి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో అధికారులు వీరిని ప్రైవేటు బస్సుల్లో వా రివారి ఇళ్లకు చేర్పించారు. ఎవ్వరికి ఎటువంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు. నాలు గు రోజుల నుంచి తిరువూరులో 94, విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో 72 మంది, నూజివీడులో 75 మంది, మైలవరంలో 60 మంది, ఎ.కొండూరులో 12 మంది చికిత్సపొందారు. ప్రస్తుతం కోలుకున్న 135 మంది బాధితులను ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. మండలంలో ని మాత్రీయ తండా, చైతన్య నగర్ తండాల్లో సుమారు 600 మంది జనాభాలో సగం మంది అస్వస్థతకు గురయ్యారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరం తహసీల్దార్ సురేష్‌కుమార్ ఆదేశాల మేరకు ఉదయం నుంచి తండాల్లో పారిశుద్ద్య పనులు చేపట్టారు. బ్లీచింగ్ చల్లి దోమల మందు పిచికారీ చేశారు. 15 రోజుల వరకు మాంసం క్రయ, విక్రయాలు జరపరాదని మైక్ ప్రచారం నిర్వహించారు. ఆరోగ్య విషయంలో ఎటువంటి తేడాలున్నా తహశీల్దార్ కార్యాలయానికి సమాచారం అందించాలని స్థానికులకు అధికారులు సూచించారు. రెండు తండాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి అవసరమైన వారికి చికిత్సలు చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఆర్వో ప్లాంట్ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటిని మాత్రమే తాగాలని తహసీల్దార్ సూచించారు. ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులకు పండ్లు పంపిణీచేశారు. పానకాన్ని ల్యాబ్‌కు పంపించామని నివేదిక వచ్చిన తర్వాత నిర్థారిస్తారని అధికారులు తెలిపారు. గిరిజన సంక్షేమాధికారి పరామర్శ మైలవరం: కల్తీ పానకం తాగి అనారోగ్యానికి గురై మైలవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గిరిజన సంక్షేమ శాఖ సహాయాధికారి టి. రమేష్ గు రువారం పరామర్శించారు. బాధితుల నుంచి వివరా లు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో లభిస్తున్న వైద్య సౌకర్యాలు తెలుసుకుని నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నా రు. లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి హంసావత్ భోజ్యానాయక్ పాల్గొన్నారు. బాధితులకు ఎమ్మెల్యేల పరామర్శ నూజివీడు, ఎ.కొండూరు:కలుషిత పానకం సేవించి నూజివీడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం తిరువూరు ఎమ్మెల్యే కె. రక్షణనిధి, నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పరామర్శించారు. వారు మాట్లాడుతూ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పూర్తిగా తగ్గే వరకు చికిత్సలు చేసి డిశ్చార్జ్ చేయాలని చెప్పారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నరెడ్ల వీరారెడి తదితరులు పాల్గొన్నారు. -
క్షేమంగా ఇంటికి వెళ్లిన సీఎం..
సాక్షి, పనాజీ : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆయన చికిత్స పొందుతున్నలీలావతి ఆస్పత్రి నుంచి గురువారం ఇంటికి పంపించారు. దీంతో ఆయన అక్కడ నుంచి నేరుగా గోవాకు చేరుకున్నారు. ఈ విషయాన్ని గోవా డిప్యూటీ స్పీకర్ మైఖెల్ లాబో స్పష్టం చేశారు. ఈ నెల (ఫిబ్రవరి) 15 నుంచి ప్యాంక్రియాటిస్ సమస్య కారణంగా లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై దుష్ప్రచారం కూడా జోరుగా సాగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే, పారికర్ చనిపోతే మరొకరు ముఖ్యమంత్రి అవుతారు అందులో అనుకోవడానికి ఏముందంటూ పెట్టి కలకలం రేపారు. ఈ వార్తలతో అసలు పారికర్‌కు ఏమైందంటూ పెద్ద స్థాయిలో చర్చ జరిగింది. అయితే, అవన్నీ కూడా ఊహాగానాలే అని పారికర్ డిశ్చార్జి కావడంతో స్పష్టమైంది. 'పారికర్ గోవా చేరుకున్నారు. ఆయన ఆస్పత్రి నుంచి విడుదల కావడం మంచి శుభవార్త. అయితే, ఆయన ఎప్పుడు బడ్జెట్‌ను ప్రవేశ పెడతారనే విషయం ఇప్పుడే తెలియదు' అని మైఖెల్ చెప్పారు. పారికర్‌కు ఉన్న పట్టుదల సామర్థ్యమే ఆయనను కోలుకునేలా చేసిందని, ఆయనే బడ్జెట్ బిల్లు ప్రవేశ పెట్టాలని అనుకుంటే కచ్చితంగా త్వరలోనే పెడతారని స్పష్టం చేశారు. ప్రస్తుతం పారికర్ పనాజీలోని తన నివాసానికి వెళ్లారు. -
ఆస్పత్రి నుంచి దాసరి నారాయణరావు డిశ్చార్జ్
హైదరాబాద్ : ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు మంగళవారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన గత రెండు నెలలుగా కిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ జనవరి 29న దాసరి కిమ్స్‌లో చేరారు. ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ క్లీన్ చేస్తున్న సమయంలో దాసరికి గుండెపోటు రావడం, కిడ్నీల పనితీరు మందగించడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్ నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కిమ్స్ ఆసుపత్రి సీఈవో భాస్కర్ రావు నేతృత్వంలో దాసరికి చికిత్స చేశారు. అనంతరం ఆయనను వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. ప్రస్తుతం దాసరి పూర్తిగా కోలుకోవడంతో ఆయనను డిశ్చార్జి చేసినట్లు డాక్టర్ భాస్కర్‌రావు ప్రకటించారు. -
అమ్మ మాట
► మైక్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి జయ ► డిశ్చార్జ్ ఆమె అభీష్టమే ► అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత మైక్ సహాయంతో కొద్దిసేపు మాట్లాడారని, ఆమె ఆరోగ్యం సాధారణస్థితికి చేరుకుందని అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలితకు దేశ, విదేశీ వైద్యులు సుమారు రెండు నెలలపాటు చికిత్సను అందించారు. ఆమె ఆస్పత్రిలో చేరి శుక్రవారానికి 64 రోజులు పూర్తరుుంది. ముఖ్యమంత్రి బాగా కోలుకున్నట్లు రెండువారాల క్రితమే అపోలో అధినేత ప్రతాప్ సీ రెడ్డి ప్రకటించారు. అవయవదానంపై అపోలో ఆస్పత్రి శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఫిజియోథెరపీ వల్ల ముఖ్యమంత్రి సహజస్థితికి చేరుకున్నారని చెప్పారు. మైక్ సహాయంతో కొద్ది నిమిషాలు ఆమె మాట్లాడారని, 90 శాతం వరకూ ఆమె సహజసిద్ధంగా శ్వాస తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అపోలో ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ కావాలని ముఖ్యమంత్రి మనస్సులో ఉందో తెలుసుకునేందుకు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నామని తెలిపారు. డిశ్చార్జ్ ఎప్పుడనేది ఆమె అభీష్టమని, ఎప్పుడైనా ఇంటికి వెళ్లవచ్చని ఆయన తెలియజేశారు. -
ఎదురుచూపులు
► సీఎం జయ డిశ్చార్జ్‌కు సిద్ధం ► 27వ తేదీలోగా ప్రకటన 33 రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత త్వరలో డిశ్చార్జ్ కానున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇందుకు సన్నాహాలు సాగుతున్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి,చెన్నై: జ్వరం, డీహైడ్రేషన్ బారినపడి ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చేరార ంటూ గత నెల 23వ తేదీన అపోలో హెల్త్‌బులెటిన్ విడుదల చేసింది. స్వల్ప అనారోగ్యమేనని, రెండు మూడు రోజుల్లో ఆమె ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకుంటారని అందరూ భావించారు. అయితే ఇప్పట్లో డిశ్చార్జ్ కారని, సుదీర్ఘకాలం ఆసుపత్రిలో ఉంటూ చికిత్సలు పొందాల్సి ఉంటుందని బులెటిన్ స్పష్టం చేయడంతో అన్నాడీఎంకే శ్రేణులు నిరాశకు లోనయ్యారు. స్వల్ప అనారోగ్యం అంటూనే లండన్ నుంచి అంతర్జాతీయ వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్‌ను, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులను, సింగపూర్ నుంచి మహిళా ఫిజియోథెరపిస్టులను వరుసగా రప్పించడం అన్నాడీఎంకే శ్రేణులను ఆందోళన కలిగించింది. సీఎం ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనలు, ప్రత్యేక పూజలు, హోమాలు ప్రారంభమైనాయి. ఈ ప్రార్థనలు ఫలించాయా అన్నట్లుగా సీఎం క్రమేణా కోలుకున్నారు. శ్వాసకోశ ఇబ్బందులను దాటుకుని స్వేచ్ఛగా శ్వాస పీల్చడంతోపాటు, తానే స్వయంగా ఆహారం తీసుకుంటున్నట్లు అపోలో వైద్యులు చెబుతున్నారు. ఆమె ఆరోగ్యం దాదాపు సాధారణ స్థితికి వచ్చినట్లు తేలడంతో డిశ్చార్జ్ చేయాలని వైద్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే ముఖ్యనేతలంతా అపోలో ఆసుపత్రి వద్దనే గడుపుతున్నందున వారంతా దీపావళి పండుగకు దూరం అవుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం జయలలిత సైతం దీపావళి పండుగలోగా ఇంటికి చేరుకోవాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో సీఎం డిశ్చార్జ్ అవుతారని తెలుస్తుండగా ఇందుకు సంబంధించి ఈనెల 27వ తేదీలోగా ఒక ప్రకటన విడుదల కాగలదని అంచనా వేస్తున్నారు. అంతేగాక అమ్మ డిశ్చార్జ్ కోసం అటు వైద్యులు, ఇటు పార్టీ శ్రేణులు సన్నాహాలు సాగిస్తున్నట్లు సమాచారం. అధికారులకు హైకోర్టు ఆదేశం: సీఎం జయలలిత చికిత్స పొందడాన్ని అడ్డుపెట్టుకుని డీఎంకే నేతల ఫేస్బుక్, ట్విట్టర్లను హాక్ చేయరాదని మద్రాసు హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. డీఎంకే నేతల హక్కులను కాలరాచే విధంగా పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తోందని, అమ్మ వదంతులు అంటూ అరెస్టులకు పాల్పడుతోందని పొల్లాచ్చికి చెందిన నవనీత కృష్ణన్ అనే డీఎంకే నేత మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ముఖ్యమంత్రి జయలలిత పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరించబోమని డీఎంకే ఇచ్చిన హామీని రికార్డు చేసుకుంటున్నామని న్యాయమూర్తి రాజేంద్రన్ తెలిపారు. కొన్ని నిబంధనలకు లోబడి ఫేస్బుక్, ట్విట్టర్లలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ప్రజలకు ఉందని ఆయన అన్నారు. డీఎంకే నేతల ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను హాక్ చేయడం సరికాదని అన్నారు. సీఎం గురించి డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవచ్చు కాబట్టి, ఈ కేసు విచారణను ఇంతటితో ముగిస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు. అమ్మ కోలుకోవాలని ప్రార్థిస్తూ అనేక ఆలయాల్లో ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమాలు జరిగాయి. -
మిడ్ మానేరుకు గండి
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న మిడ్ మానేరు ప్రాజెక్ట్ కట్టకు గండిపడింది. ఎగువ మానేరు నుంచి భారీగా వస్తున్న వరదతో మిడ్ మానేరు మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులను దిగువ ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. భారీ వర్షాలతో పొటెత్తిన వరదల కారణంగా భారీ మొత్తంలో ప్రవాహం వచ్చి డ్యాంలో చేరడంతో అనూహ్యంగా డ్యాం మట్టికట్టకు గండి పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తమయ్యారు. గండి పడిన ప్రాంతాన్ని మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ ఆదివారం పరిశీలించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రులు భరోసానిచ్చారు. మానేరు డ్యామ్‌కు 5 లక్షల క్యూసెక్కుల నీటి సామర్థ్యం ఉందన్నారు. నాలుగు గ్రామాల్లో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. త్వరలోనే గ్రామస్తులకు నష్టపరిహారం చెల్లించి గ్రామాలను ఖాళీ చేయిస్తామని చెప్పారు. కొదురుపాక, మన్వాడ, రుద్రవరం గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. గండిపడిన కారణంగా సిరిసిల్ల-కరీంనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వరదతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే అధికారులు తరలించారు. సహాయక చర్యలను ప్రారంభించారు. మరోపక్క, మిడ్ మానేరు వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. -
ఆస్పత్రి నుంచి సైనా డిశ్చార్జి
ముంబై: ఇటీవల తన కుడి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రియో ఒలింపిక్స్ లో లీగ్ దశ నుంచి నిష్క్రమించిన సైనా మోకాలి గాయం తీవ్రంగా బాధించడంతో ముంబై ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది. చికిత్స నిమిత్తం తొలుత హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన సైనా, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం ముంబైకు వెళ్లింది. కోకిలా బెన్ ఆస్పత్రిలో శనివారం సైనాకు శస్త్రచికిత్స పూర్తికావడంతో ఆమె కోలుకుంటుంది. కాగా, కోకిలా బెన్ ఆస్పత్రిలో చికిత్స పూర్తయిన తరువాత అంథేరీ ఆస్పత్రిలో కూడా సైనా చెకప్ చేయించుకుంది. -
ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి
న్యూఢిల్లీ: ఎడమ భుజానికి శస్త్రచికిత్స, జ్వరం కారణంగా గత 11 రోజులుగా ఆస్పత్రిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి ఆమెను డిశ్చార్జి చేశారు. 11 రోజుల క్రితం వారణాసి పర్యటన సందర్భంగా అస్వస్థతకు గురైన సోనియాను తొలుత ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. పూర్తిగా కోలుకోవడంతో సోనియా గాంధీని డిశ్చార్జి చేసినట్టు గంగారాం ఆస్పత్రి మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. -
గ్లోబల్ నుంచి నిఖిల్‌రెడ్డి డిశ్చార్జ్
ఈ ఘటనపై ఎంసీఐ విచారణ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయించుకున్న నిఖిల్‌రెడ్డిని వైద్యులు బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం కొంత మెరుగు పడటంతో ఆస్పత్రి నుంచి ఇంటికి పంపినట్లు డాక్టర్ చంద్రభూషణ్ తెలిపారు. అయితే డిశ్చార్జ్‌కి తల్లిదండ్రులు అంగీకరించలేదు. శస్త్రచికిత్స చేసి 15 రోజులైనా ఇప్పటి వరకు నిఖిల్‌రెడ్డి నడవలేకపోతున్నాడని, నొప్పితో బాధపడుతున్నాడని,ఈ పరిస్థితుల్లో డిశ్చార్జ్ చేస్తే ఎలాగని తండ్రి గోవర్ధన్‌రెడ్డి వైద్యులను ప్రశ్నించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యుడే డిశ్చార్జ్ తర్వాత స్వయంగా మా ఇంటికి వచ్చి తదుపరి చికిత్సలు అందజేసేందుకు అంగీకరిస్తే డిశ్చార్జ్ ఒప్పుకుంటామని స్పష్టం చేశారు. దీంతో డాక్టర్ చంద్రభూషణ్ ఇందుకు అంగీకరిస్తూ ఓ హామీ పత్రం రాసిచ్చారు. విచారణ ప్రారంభం... ఎత్తుపెంపు శస్త్రచికిత్సపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం విచారణ చేపట్టింది. తల్లిదండ్రులకు చెప్పకుండా నిఖిల్‌రెడ్డికి గ్లోబల్ ఆస్పత్రిలో వైద్యులు ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయడం వివాదాస్పదం కావడంతో ఆస్పత్రి వైద్యుడికి ఎంసీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం డాక్టర్ చంద్రభూషణ్ ఎంసీఐ ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. వైద్యుడు చెప్పిన వివరాలను కమిటీ సభ్యులు రికార్డు చేశారు. ఆ తర్వాత నిఖిల్‌రెడ్డి తండ్రి గోవర్ధన్‌రెడ్డి కమిటీ సభ్యుల ముందు హాజరై చెప్పిన వివరాలను కూడా రికార్డు చేసినట్లు ఎంసీఐ చైర్మన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. నా కొడుకుపై ఇదో ప్రయోగం... నిఖిల్రె డ్డిపై గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు చంద్రభూషణ్రెడ్డి ఓ ప్రయోగం చేశారని ఆయన తండ్రి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఎత్తుపెంపు పేరుతో ఆరోగ్యంగా ఉన్న నా కుమారుని కాళ్లు నరకడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. ఇప్పటి వరకు మూడున్నర లక్షలు దండుకున్నారని ఆరోపించారు. ఆపరేషన్ చేసి 15 రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఇతరుల సహాయం లేనిదే నడవలేని దుస్థితిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాడని, పెయిన్‌కిల్లర్స్ ఇచ్చి వైద్యులు చేతులు దులుపుకుంటున్నారు. ఆసుపత్రిపై వినియోగదారుల ఫోరం, ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్, హెచ్ఆర్సీల్లో ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డిలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
23 మంది విద్యార్థులను డిశ్చార్జ్ చేస్తాం: కలెక్టర్
విజయవాడ : డ్రైవర్ నిర్లక్ష్యంతో తీవ్రంగా గాయపడిన తెలంగాణకు చెందిన మెడికోలను కృష్ణాజిల్లా కలెక్టర్ ఎ. బాబు పరామర్శించారు. నగరంలోని ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎ.బాబు మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను కూడా ఆయన ఆరా తీశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎ. బాబు మాట్లాడుతూ... ఈ ప్రమాదంలో గాయపడిన 23 మంది విద్యార్థులను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. 8 మందిని మాత్రం డిశ్చార్జ్ చేయడం లేదన్నారు. డిశ్చార్జ్ అయినవారిని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ జరుగుతోందని కలెక్టర్ ఎ.బాబు చెప్పారు. -
'ఒకే చోట కూర్చోవడం నాకు అసహ్యం'
పుణె: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కోలుకున్నారు. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు పుణెలోని రూబీ హాల్ ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల కిందట అనారోగ్యం కారణంగా ఆయన రూబీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు 76 గంటలపాటు విశ్రాంతాఇ తీసుకోవాలని సూచించారు. దీంతో ఆయన మూడు రోజులవరకు ఆస్పత్రిలోనే ఉన్నారు. బుధవారం ఉదయం చేసిన వైద్య పరీక్షలు ఆయన ఆరోగ్యం సాధారణంగానే ఉందని తేలడంతో డిశ్చార్జి చేశారు. ఈ నేపథ్యంలో పవార్ కూడా మీడియతో మాట్లాడారు. 'వచ్చే రెండు నెలల్లో నాకు ఏమాత్రం ఖాళీ లేకుండా వరుస పర్యటనలు ఉన్నాయి. నేను ఎలా విశ్రాంతి తీసుకోగలను. ఒకే చోట చాలా సేపు కూర్చొవడాన్ని నేను అసహ్యంచుకుంటాను' అని పవార్ చెప్పారు. హెలికాప్టర్ ద్వారా ఆయన ఈ రోజు ముంబయికి చేరుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. -
హాస్టల్ లో ఉండి చదువుకుంటా: ప్రత్యూష
-
హాస్టల్ లో ఉండి చదువుకుంటా: ప్రత్యూష
హైదరాబాద్: సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో తీవ్ర హింసకు గురై కోలుకున్న ప్రత్యూషను బుధవారం గ్లోబల్ అవేర్ ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు బీఎస్సీ నర్సింగ్ చదవాలని ఉందని, బంధువులెవరి దగ్గర ఉండటం ఇష్టం లేదని, నాన్న, పిన్నిని కఠినంగా శిక్షించాలని కోర్టును కోరతానని తెలిపింది. హాస్టల్ లో ఉండి చదువుకుంటానని ప్రత్యూష తెలిపింది. కాగా ప్రత్యూషను బుధవారం మధ్యాహ్నం 1 గంటకు తమ చాంబర్‌కు తీసుకురావాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏ రకమైన ఇబ్బంది కలగకుండా, మీడియా ద్వారా కూడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆమెను నేరుగా తమ వద్దకు తీసుకురావాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి, కన్నతండ్రి తీవ్రంగా హింసించిన వార్తలపై చలించిపోయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఈ ఘటనపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జస్టిస్ బొసాలే.. పత్రిక కథనాలను సుమోటోగా రిట్ పిటిషన్‌గా పరిగణించేందుకు అంగీకరించి, ఆ మేరకు జస్టిస్ ఎస్.వి.భట్‌తో కలిసి విచారణ చేపట్టింది. -
29న ప్రత్యూష డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో తీవ్ర హింసకు గురై, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష బుధవారం డిశ్చార్జ్ అవుతారని, అందువల్ల ఆమెను సోమవారం కోర్టు ముందు హాజరుపరచలేకపోయామని ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. కోర్టుకు వచ్చేందుకు ప్రత్యూష సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ కోర్టుకు నివేదించారు. అయితే ఆమెను బుధవారం మధ్యాహ్నం 1 గంటకు తమ చాంబర్‌కు తీసుకురావాలని ధర్మాసనం సూచించింది. ఏ రకమైన ఇబ్బంది కలగకుండా, మీడియా ద్వారా కూడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆమెను నేరుగా తమ వద్దకు తీసుకురావాలని ఆదేశిస్తూ విచారణను 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి, కన్నతండ్రి తీవ్రంగా హింసించిన వార్తలపై చలించిపోయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఈ ఘటనపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జస్టిస్ బొసాలే.. పత్రిక కథనాలను సుమోటోగా రిట్ పిటిషన్‌గా పరిగణించేందుకు అంగీకరించి, ఆ మేర జస్టిస్ ఎస్.వి.భట్‌తో కలిసి విచారణ ప్రారంభించారు. -
ఆస్పత్రినుంచి హెన్రిక్స్ డిశ్చార్జ్
లండన్: కౌంటీ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్‌లో సహచరుడిని ఢీకొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ మొయిజెస్ హెన్రిక్స్ గాయంనుంచి కోలుకున్నాడు. ప్రమాదంలో అతని దవడకు గాయాలైన సంగతి తెలి సిందే. చికిత్స అనంతరం బుధవారం హెన్రిక్స్ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ‘మొయిజెస్ ఇప్పుడు హాస్పిటల్నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అతను నెమ్మదిగా కోలుకుంటున్నాడు. గురువారం హెన్రిక్స్ దంత వైద్యుడిని సంప్రదిస్తాడు’ అని అతని కౌంటీ జట్టు సర్రే ప్రకటించింది. -
ఈటల రాజేందర్ డిశ్చార్జి
హైదరాబాద్: కారు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి నుంచి మంత్రి తన నివాసానికి వెళ్లారు. ఈటల కోలుకున్నారని వైద్యులు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో శనివారం ఈటల రాజేందర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ నుంచి కరీంనగర్‌కు ఆయన బుల్లెట్‌ప్రూఫ్ కారులో వెళ్తుండగా మార్గమధ్యంలో టిప్పర్‌ను ఓవర్టేక్ చేసే క్రమంలో కారు అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఈటల కాలుకు గాయాలయ్యాయి. పీఏలు, డ్రైవర్, గన్మెన్లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరికరి కరీంనగర్‌లోని అపోలో రీచ్ ఆసుపత్రిలో చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
మళ్లీ అపోలో ఆస్పత్రికి రాజయ్య
హైదరాబాద్ : మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మరోసారి అపోలో ఆస్పత్రిలో చేరారు. బుధవారం ఉదయం ఆయనను కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకు వచ్చారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో రాజయ్యను మంగళవారం సాయంత్రం హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. రాజయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు బీపీ, పల్స్ రేటు పెరిగినట్లు గుర్తించారు. అనంతరం రాజయ్యను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి రావాల్సిందిగా గతరాత్రి వైద్యులు సూచించారు. దాంతో డాక్టర్ల సూచన మేరకు రాజయ్య ఈరోజు ఉదయం ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. -
బర్తరఫ్ మాట విని ఆవేదన చెందా: రాజయ్య
హైదరాబాద్: తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య అపోలో ఆస్పత్రి నుంచి మంగళవారం రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో రాజయ్యను ఈ సాయంత్రం హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. రాజయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు బీపీ, పల్స్ రేటు పెరిగినట్లు గుర్తించారు. రాజయ్యకు బీపీ, షుగర్ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో ఆయన మనస్థాపం చెందినట్లు అనుచరులు చెబుతున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రాజయ్య మాట్లాడుతూ బర్తరఫ్ మాటవిని ఆవేదన చెందానని చెప్పారు. తన పొరపాటు ఉంటే విచారణ జరిపించాలని అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. వైద్యులు అన్ని పరీక్షలు చేశారని చెప్పారు. వైద్యుల సహకారంతో ఇంటివద్దే ఉండి చికిత్స పొందుతానన్నారు. రేపు మళ్లీ ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంటానని చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కోరారు. -
మాజీ మంత్రి రాజయ్యకు గుండెపోటు
⇒ హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలింపు ⇒ ఐసీయూలో వైద్య పరీక్షలు ⇒ మంత్రి చందూలాల్ సహా పలువురు నేతల పరామర్శ ⇒ చికిత్స అనంతరం డిశ్చార్జి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మంగళవారం గుండెపోటుతో ఆస్పత్రి పాలయ్యారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అవడంతో ఆవేదన చెందుతున్న ఆయన మూడు రోజులుగా బీపీ, షుగర్ మందులు వేసుకోవట్లేదు. దీంతో రక్తపోటు, షుగర్ లెవల్స్ బాగా పెరిగాయి. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లో తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, మిత్రులతో మాట్లాడుతూ రాజయ్య ఛాతీ నొప్పితో కూలబడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన హైదర్‌గూడలో ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రాజయ్యను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి వైద్యం అందించారు. ఆయనకు ఈసీజీ, 2డీ ఎకో, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. షుగర్, బీపీ స్థాయిలు పెరగడం వల్లే ఛాతీ నొప్పి వచ్చినట్లు ‘హెల్త్ బులిటెన్’లో పేర్కొన్నారు. అనంతరం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అంతకుముందు రాజయ్య అస్వస్థత విషయం తెలుసుకున్న రాష్ట్ర పర్యాటకాభివృద్ధిశాఖ మంత్రి చందూలాల్, మాజీ మంత్రి మారెప్ప, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు. మాజీ ఎంపీ మధుయాష్కి, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు తదితరులు ఆస్పత్రికి చేరుకొని రాజయ్యను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, రాజయ్యపట్ల సీఎం కేసీఆర్ ప్రదర్శిస్తున్న తీరును తప్పుబడుతూ తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్యతోపాటు పలువురు ఎమ్మార్పీఎస్ (మంద కృష్ణమాదిగ వర్గం) నాయకులు ఆస్పత్రి వద్ద కాసేపు రాస్తారోకో చేపట్టారు. తప్పు చేసి ఉంటే ... విచారణ జరపండి: రాజయ్య ‘బర్తరఫ్ మాట విని ఆవేదన చెందా. నా పొరపాటు ఉంటే విచారణ జరపండి. వైద్య, ఆరోగ్యశాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించండి. సీఎం కేసీఆర్ నాకు తండ్రిలాంటి వారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. మూడు రోజులుగా నిద్ర లేదు. తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. మంత్రి వర్గం నుంచి తప్పించిన తీరు కలచి వేసింది. ఇప్పటికీ చెబుతున్నా, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఈ అంశంపై విచారణ జరిపించాలి..’ అని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం రాజయ్య మీడియాతో పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని, మినిస్టర్స్ క్వార్టర్స్‌లో అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. -
ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి
న్యూఢిల్లీ: ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో గత ఆరు రోజులుగా ఇక్కడి గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం డిశ్చార్జి అయ్యారు. ఆమె కోలుకున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. -
పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీజ కోలుకుంది..
-
పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీజ కోలుకుంది..
ఖమ్మం: అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిన శ్రీజ కోలుకుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఇంటెన్సివ్ కేర్ నుంచి బయటకు వచ్చిందని డాక్టర్ అసాధారణ్ ఆదివారం విలేకరులకు తెలిపారు. పాల్వంచకు చెందిన శ్రీజ అక్టోబర్ 2న బ్రెయిన్ ఫీవర్‌తో కోమాలోకి వెళ్లడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అనారోగ్యంతో ఉన్న ఆమె అభిమాన హీరో పవన్‌కల్యాణ్‌ను చూడాలనుందని తండ్రి నాగయ్యకు చెప్పింది. శ్రీజ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. తన కూతురికి పవన్‌ను చూడాలని ఉందని, చిన్నారి తండ్రి మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తికి పవన్ స్పందించారు. అక్టోబర్ 17న ఖమ్మం వచ్చి శ్రీజను చూశారు. కోలుకున్నాక మరోసారి వచ్చి చూస్తానన్నారు. కాగా, ప్రస్తుతం శ్రీజ కోలుకుంది. తన బిడ్డకు మెరుగైన వైద్యం అందించిన డాక్టర్లకు, పవన్‌కు శ్రీజ తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. -
ఆంత్రాక్స్ నుంచి పూర్తిగా కోలుకున్న విద్యార్థి
హిందూపురం : ఆరోగ్యం కుదుట పడడంతో ఆంత్రాక్స్ సోకిన విద్యార్థిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆనందంతో విద్యార్థి తల్లిదండ్రులు డాక్టర్లను సన్మానించారు. వివరాల్లోకి వెళితే.. అనారోగ్యంతో లేపాక్షి మండలం మానెంపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థి శ్రీకాంత్ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా అక్కడి వైద్యులు ఆంత్రాక్స్‌గా తేల్చారు. అనంతరం స్వగ్రామానికి చేరుకున్న శ్రీకాంత్, అతడి తల్లిదండ్రులను గ్రామంలో వెలివేసేందుకు చూశారు. కన్నీరుమున్నీరైన వారు లేపాక్షి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాగా డాక్టర్ శివకుమార్, దివాకర్ల సాయంతో హిందూపురం ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు కూడా సంకోచించి కేసు విషయమై కర్నూలు, అనంతపురం ఆస్పత్రి వైద్యులతో మాట్లాడగా.. తమ వద్ద ఐసోలేషన్ వార్డు లేదని చెప్పారు. చివరకు ఈ విషయం కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ దృష్టికి వెళ్లడంతో ప్రాథమిక చికిత్స కోసం అడ్మిట్ చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 31వ తేదీ నుంచి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, ఆర్ఎంఓ శ్రీనివాసరెడ్డి, స్థానిక వైద్యుల పర్యవేక్షణలో శ్రీకాంత్‌కు చికిత్స అందించారు. అనంతరం మైసూరు డీఆర్డీఓ రీసెర్చ్ ల్యాబొరేటరీకి రక్తనమూనాలు పంపగా అతడు కోలుకున్నట్లు వైద్యులు చెప్పడంతో గురువారం శ్రీకాంత్‌ను డిశ్చార్జ్ చేశారు. నెల రోజుల పాటు వాడాల్సిన మందులను ఇచ్చి పంపారు. కొడుకు అనారోగ్యం నుంచి కోలుకోవడంతో ఆనందంలో ముగినిపోయిన విద్యార్థి తల్లిదండ్రులు వైద్యులతో పాటు నర్సులు ఇందిరా, శ్యామలమ్మ, ఖుర్షీద్‌బేగం, అటెండర్ లక్ష్మినారాయణను సన్మానించారు. ఈ సమయంలో ఉద్వేగానికి లోనైన వైద్యులు.. ఇకపై మరింత బాధ్యతతో పని చేస్తామని చెప్పారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించి భవిష్యత్‌లో మంచి శాస్త్రవేత్త అయి ఆంత్రాక్స్ వ్యాధిపై రీసెర్స్ చేయాలని శ్రీకాంత్‌కు సూచించారు. వ్యాధి బారి నుంచి శ్రీకాంత్ పూర్తిగా కోలుకున్నాడని, అపోహలను నమ్మకుండా అందరిలో ఒక్కడిగా శ్రీకాంత్‌ను చూసుకోవాలన్నారు. ఈ విషయమై తహశీల్దార్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామని తెలిపారు. -
ఆస్పత్రి నుంచి అరుణ్ జైట్లీ డిశ్చార్జ్
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక, రక్షణశాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన గత నెల 28న ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. జైట్లీ ఆరోగ్యం మెరుగుపడిందని ఆయనను ఈరోజు ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి అధికారి ప్రతినిధి అమిత్ గుప్తా తెలిపారు. రొటీన్ చెకప్ కోసమే వచ్చినట్లు చెప్పారు. గతంలో మధుమేహం సోకటంతో జైట్లీ శస్త్ర చికిత్సను చేయించుకున్నారు. అనంతరం ఆయనకు ఇన్ఫెక్షన్లు సోకటంతో ఎయిమ్స్‌లోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందించారు. కాగా జైట్లీ ఈ నెల 8వ తేదీన అమెరికా వెళ్లాల్సి ఉంది. అక్టోబరు 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వాషింగ్టన్లో జరగనున్న ప్రపంచబ్యాంకు సదస్సుల ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆయన హాజరయ్యే అవకాశాలు కనిపించటం లేదు. -
ఆస్పత్రి నుంచి హోం మంత్రి నాయిని డిశ్చార్జ్
హైదరాబాద్: సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి తెలంగాణ హోంశాఖ మంత్రి నర్సింహారెడ్డి ఆదివారం రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ ఇటీవల ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. పూర్తిగా కోలుకున్న నాయిని ఆస్పత్రి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. కాగా, మంత్రి కొద్దిగా నీరసంగా ఉన్నారని త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతులవుతారని డాక్టర్లు పేర్కొన్నారు. -
తాగునీటి ఎద్దడిపై సభ్యుల ఆగ్రహం
సమస్య పరిష్కరించాలని డిమాండ్ చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్ : నగరంలో నానాటికీ జఠిలమవుతున్న తాగునీటి సమస్య పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నగరసభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన నగరసభ సర్వసభ్య సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చైర్పర్సన్ లీలావతి మాట్లాడుతూ.. చిక్కబళ్లాపురానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న జక్కలమడుగు జలాశయం నుంచి మే నెల చివరి వరకూ నీరు అందాల్సి ఉందని తెలిపారు. అయితే జలాశయం ఏప్రిల్ మొదటి వారానికి ఖాళీ అయిందని, ఈ జలాశయం నుంచి 33 శాతం నీరు దొడ్డబళ్లాపురానికి వెళుతోందని తెలిపారు. దొడ్డబళ్లాపురం పంప్‌హౌస్‌లో ఫుట్‌బాల్‌ను రెండున్నర అడుగులు పెంచినందున నిర్ణీత శాతానికన్నా ఎక్కువగా నీరు ఆ ప్రాంతానికి వెళుతోందని, ఫలితంగా చిక్కబళ్లాపురానికి నీరు తక్కువగా అందుతోందని రాజకీయాలకు అతీతంగా సభ్యులందరూ ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఈ విషయంపై నీటి సరఫరా అధికారిని సభ్యులు నిలదీశారు. నగరసభ కమిషనర్ మునిశామప్ప జోక్యం చేసుకుని మాట్లాడుతూ.. జిల్లాకు నీరు తక్కువగా వస్తోందని, ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు సైతం వివరించడం జరిగిందని గుర్తు చేశారు. కమిషనర్ సమాధానంతో సభ్యులు మహకాళీబాబు, కిసాన్ కృష్ణప్ప, శ్రీనివాస్ తదితరులు ఏకీభవించలేదు. దొడ్డబళ్లాపురం పంప్‌హౌస్‌లోని ఫుట్‌బాల్‌ను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారికంగా ఈ చర్యను చేపట్టకపోతే గురువారం ఉదయం సభ్యులే అక్కడికెళ్లి ఫుట్‌బాల్‌ను పూర్తిగా తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో ఉపాధ్యక్షురాలు జబీన్‌తాజ్, సభ్యులు ఎ.బి.మంజునాథ్, రఫీక్, నిర్మల ప్రభు, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అత్యాచార బాధితురాలి డిశ్చార్జి
సూరి (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు కోలుకుంటోంది. శుక్రవారం ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రభుత్వ పర్యవేక్షణలోని గృహానికి ఆమెను తరలించినట్టు అధికారులు తెలిపారు. గురువారం ఆమెను బోల్పూర్ సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. ఆమె వాంగాల్మాన్ని నమోదు చేశారు. బీర్భూమ్ జిల్లాలో 20 ఏళ్ల అమ్మాయిపై దారుణంగా సామూహిక అత్యాచారం చేయించిన సంగతి తెలిసిందే. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించినందుకుగాను.. ఖాప్ పంచాయతీ పెద్దలు 13 మంది వ్యక్తులతో ఆమెపై సామూహిక అత్యాచారం చేయించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. విచారణ జరిపి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసును సుమోటోగా తీసుకుంది. -
దిలీప్ కుమార్ డిశ్చార్జి
బాలీవుడ్ వెటరన్ దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగుపడింది. ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను గురువారం డిశ్చార్జి చేశారు. ఈ నెల 15న అస్వస్థతకు గురైన 90 ఏళ్ల దిలీప్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. పది రోజుల పాటు ఐసీయూలో ఉంచారు. ఆయన పూర్తిగా కోలుకున్నారని సన్నిహితులు తెలిపారు. దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగవడంతో ఇంటికి పంపాలని వైద్యులు నిర్ణయించినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. మహమ్మద్ యూసుఫ్ ఖాన్‌గా జన్మించిన దిలీప్ సినీ రంగ ప్రవేశం చేశాక తన పేరును మార్చుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు పలు సినిమాల్లో నటించారు. 14 ఏళ్ల క్రితం ఆయన గుండెకు శస్త్రచికిత్స చేశారు.