టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఆయన ఇంటి వద్ద గొడవ జరిగిన అనంతరం అస్వస్థతకు గురైన మోహన్ బాబు కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం చికిత్స తీసుకున్న మోహన్ బాబు ఇవాళ ఇంటికి వెళ్లారు. అయితే వారం రోజుల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.
మంచు ఫ్యామిలీలో మొదలైన వివాదం చివరికీ పోలీసుల వద్దకు చేరింది. మంచు మనోజ్, మోహన్‌బాబు మధ్య గొడవకు దారితీసింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ తర్వాత మోహన్ బాబు ఓ ఆడియో సందేశాన్ని మీడియాకు రిలీజ్ చేశారు.
(ఇది చదవండి: హైకోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట!)
అంతేకాకుండా ఈ విషయంపై మంచు విష్ణు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇది మా ఫ్యామిలీ గొడవని.. ఎవరి కుటుంబాల్లోనైనా సాధారణంగా ఉండేవని తెలిపారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని వెల్లడించారు. ఈ వివాదంపై రాచకొండ సీపీ ఎదుట మంచు విష్ణు, మనోజ్ హాజరై జరిగిందంతా వివరించారు. తన వైపు ఎలాంటి గొడవ జరగదని సీపీకి మంచు మనోజ్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment