మంచు ఫ్యామిలీ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. వీరి కుటుంబంలో ఆస్తి తగాదాలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. తాజాగా మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట హాజరయ్యారు. కాగా.. మంచు మనోజ్ తన ఆస్తిలో పాగా వేశారంటూ కలెక్టర్‌కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. మేజిస్ట్రేట్ హోదాలో వీరిద్దరికీ నోటీసులు జారీ చేయడంతో మోహన్ బాబు కూడా కలెక్టర్ ఎదుట హాజరయ్యారు. ఈ విషయంలో ఇప్పటికే మంచు మనోజ్‌ను అధికారులు విచారించారు.
గతేడాది మొదలైన వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. మొదట హైదరాబాద్‌లోని జల్‌పల్లిలో ఉన్న మోహన్ బాబు నివాసానికి మనోజ్ వెళ్లగా అక్కడే ఉన్న సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.
పరస్పరం ఫిర్యాదులు..
తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. కానీ, తనపై దాడి చేసింది ఎవరో ఆయన పేర్కనలేదు. అయితే, అది జరిగిన గంటలోనే మోహన్‌బాబు వాట్సాప్ ద్వారా రాచ కొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుకు ఫిర్యాదు పంపారు. తన కుమారుడు మనోజ్ వల్ల ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తిరుపతిలోనూ వివాదం..
ఆ తర్వాత ఇటీవల తిరుపతిలో మరోసారి గొడవ మొదలైంది. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లిన మనోజ్‌ను లోపలికి అనుమతించకపోవడంతో గొడవ మళ్లీ పోలీసుల వద్దకు వెళ్లింది. ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment