నా మిత్రుడు చిరంజీవితో నటించడం మరిచిపోలేనిది: మోహన్ బాబు | Mohan Babu Shares Most Memorable Hit Movie with Chiranjeevi | Sakshi
Sakshi News home page

Mohan Babu: నా జర్నీలో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం: మోహన్ బాబు

Published Fri, Dec 20 2024 4:51 PM | Last Updated on Fri, Dec 20 2024 5:00 PM

Mohan Babu Shares Most Memorable Hit Movie with Chiranjeevi

టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఇటీవల వరుసగా ‍ట్వీట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. గతంలో నటించిన తన ఫిల్మోగ్రఫీలోని సినిమాలను రోజు ఒకటి గుర్తు చేసుకుంటున్నారు. వాటిలో సూపర్‌ హిట్‌ చిత్రాలతో తనకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఇవాళ పట్న వచ్చిన ప్రతివ్రతలు సినిమా గురించి తన అనుభవాన్ని పోస్ట్ చేశారు.

1982లో నటించిన పట్నం వచ్చిన ప్రతివ్రతలు సినిమాకు నా ప్రయాణంలో ప్రత్యేకమైన స్థానం ఉందని మోహన్ బాబు అన్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ మౌలీ తన పాత్రను అద్బుతంగా తీర్చి దిద్దారని కొనియాడారు. అంతేకాకుండా నా మిత్రుడు చిరంజీవితో అన్నదమ్ములుగా నటించడం నా కెరీర్‌లోనే మరిచిపోలేని పాత్ర అని గుర్తు చేసుకున్నారు. నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని చిత్రాల్లో పట్నం వచ్చిన ప్రతివ్రతలు కచ్చితంగా ఉంటుందని మోహన్ బాబు ట్విటర్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement