ముక్కుస్రావాల గురించి మాట్లాడటం, జనబాహుళ్యంలో దానికి ఉండే పేరుతో పిలవడం అంత సభ్యత కాదనే అభిప్రాయంతో దాని గురించి పెద్దగా మాట్లాడరు. అయితే ముక్కుస్రావం ఏ రంగుతో ఉందనే దాన్ని బట్టి ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని చెప్పవచ్చంటున్నారు నిపుణులు. స్రావం ఏ రంగుతో ఉంటే ఎలాంటి సూచన అందుతుందో తెలిపే కథనం ఇది.
ఏ రంగుతో ఏ సూచన అంటే..?
రంగులేని స్వచ్ఛమైన స్రావం
- స్రావం స్వచ్ఛంగా ఉందంటే అందులో నీరు, ప్రోటీన్లు, కొన్ని లవణాలు ఉన్నాయని అర్థం.
- అలా ఉంటే ఆరోగ్యం పూర్తిగా నార్మల్ అని సూచన (ఒకవేళ పరిమాణం ఎక్కువగా ఉంటే జలుబు లేదా అలర్జీ ఉండి ఉండవచ్చు.)
- ముక్కులో ఉండే మ్యూకస్ అక్కడి తేమను, ముక్కు లోపలి పొరల లైనింగ్‌ను రక్షిస్తుంది. మంట (ఇరిటేషన్) రాకుండా కా΄ాడుతుంది.
తెలుపు
- ముక్కు దిబ్బడ వేసి, ముక్కురంధ్రాలు మూసుకుపోయి (నేసల్ కంజెష్చన్) ఉండవచ్చు. ముక్కు లోపలి పొరల్లో వాపు లేదా ముక్కు లోపలి కణజాలంలో మంట (నేసల్ టిష్యూ ఇరిటేషన్) ఉండవచ్చు.
- ముక్కులో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉండి ఉండవచ్చు.
- ముక్కులో అలర్జీల కారణంగా అలా ఉండవచ్చు లేదా డీహైడ్రేషన్‌ను సూచించవచ్చు.
పసుపుపచ్చ
- జలుబు కారణంగా దేహం జలుబుతో లేదా ఇతర ఇన్ఫెక్షన్‌తో పోరాడుతుండవచ్చు. మంట (ఇరిటేషన్)కు సూచన కావచ్చు.
- ఇన్ఫెక్షన్‌తో పోరాడి నశించిన తెల్లరక్తకణాలు... ఇలా పసుపురంగుతో బయటపడతాయి.
- కచ్చితంగా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం లేదుగానీ... జబ్బుతో బాధపడుతున్న (సిక్) ఫీలింగ్ ఉండవచ్చు.
ఆకుపచ్చ
- మన వ్యాధినిరోధక శక్తి చాలా ఎక్కువగా పోరాడుతోందని అర్థం. స్రావాల్లో నశించిన తెల్లరక్తకణాలూ, ఇతరత్రా మరికొన్ని నశించిన కణాల సమూహమని అర్థం.
- సైసన్ ఇన్ఫెక్షన్ ఉన్నదనడానికి సూచన కావచ్చు. ఆకుపచ్చ స్రావాలు వరసగా 12 రోజులకు పైగా కనిపిస్తే డాక్టర్‌ను కలవాలనడానికి సూచన.
పింక్ / ఎరుపు
- ముక్కు స్రావాలు ఎండినట్లుగా కావడం, మంట (ఇరిటేషన్) రావడం, అక్కడి కొద్దిగా దెబ్బతిన్నదనడానికి సూచన.
- ఈ పింక్ లేదా ఎరుపు రంగు... రక్తపు చారికకు సూచన.
బ్రౌన్
- ఆ ప్రాంతాల్లో రక్తస్రావమై అది ఎండిపోయినదడానికి సూచన.
- ఆ రంగు పదార్థాన్ని (ముక్కు΄÷డం లాంటిది) దేన్నైనా పీల్చి ఉండవచ్చు.
- వెంటనే ప్రమాదకరం కాక΄ోయినా, అప్రమత్తంగా ఉండాలి. దగ్గు సమయంలోనూ బ్రౌన్ రంగు కళ్లె/గళ్ల పడితే బ్రాంకైటిస్‌కు సూచన కావచ్చని అనుమానించాలి. డాక్టర్‌ను సంప్రదించాలి.
నలుపు
- పొగతాగే అలవాటు ఉన్నవారై ఉండవచ్చు. కాలుష్యమూ కారణం కావచ్చు. డ్రగ్స్ తీసుకుని కూడా ఉండవచ్చు.
- దేహంలో ఫంగల్ ఇన్ఫెక్షన్‌కి సూచన కావచ్చు. ఈ సందర్భాల్లోనూ, పై సమస్యలేవీ కానప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి.
Comments
Please login to add a commentAdd a comment