
'ఒకే చోట కూర్చోవడం నాకు అసహ్యం'
పుణె: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కోలుకున్నారు. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు పుణెలోని రూబీ హాల్ ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల కిందట అనారోగ్యం కారణంగా ఆయన రూబీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు 76 గంటలపాటు విశ్రాంతాఇ తీసుకోవాలని సూచించారు.
దీంతో ఆయన మూడు రోజులవరకు ఆస్పత్రిలోనే ఉన్నారు. బుధవారం ఉదయం చేసిన వైద్య పరీక్షలు ఆయన ఆరోగ్యం సాధారణంగానే ఉందని తేలడంతో డిశ్చార్జి చేశారు. ఈ నేపథ్యంలో పవార్ కూడా మీడియతో మాట్లాడారు. 'వచ్చే రెండు నెలల్లో నాకు ఏమాత్రం ఖాళీ లేకుండా వరుస పర్యటనలు ఉన్నాయి. నేను ఎలా విశ్రాంతి తీసుకోగలను. ఒకే చోట చాలా సేపు కూర్చొవడాన్ని నేను అసహ్యంచుకుంటాను' అని పవార్ చెప్పారు. హెలికాప్టర్ ద్వారా ఆయన ఈ రోజు ముంబయికి చేరుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.