nationalist congress party
-
‘మహా’ రాజకీయం: ఏక్నాథ్ షిండే అలకపాన్పు
ముంబై: మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెరపడడం లేదు. ఎన్నికల ఫలితాలు విడుదలై వారం రోజులవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రావడం లేదు. శుక్రవారం జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం అనూహ్యంగా రద్దయ్యింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అడుగులు చర్చనీయాంశంగా మారాయి. సతారా జిల్లాలోని తన సొంత గ్రామానికి ఆయన చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన(షిండే) నాయకుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ(అజిత్) నేత అజిత్ పవార్ గురువారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రి జె.పి.నడ్డాతో సమావేశమయ్యారు. మంత్రివర్గం కూర్పు, మంత్రి పదవుల పంపకంపై వారు చర్చించినట్లు వార్తలొచ్చాయి. ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం ఉదయం ముంబైకి చేరుకున్నారు. శుక్రవారం ముగ్గురు నేతల మధ్య కీలక సమావేశం జరగాల్సి ఉంది. నూతన ముఖ్యమంత్రి ఎంపికతోపాటు మంత్రి పదవుల పంపకాన్ని ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఏక్నాథ్ షిండే ఆకస్మికంగా తన సొంత గ్రామానికి వెళ్లిపోవడంతో చర్చలు ఆగిపోయాయి. తాజా పరిణామాల పట్ల షిండే అసంతృప్తితో ఉన్నారని, అందుకే అలకబూని మిత్రపక్షాలతో చర్చలు కొనసాగించడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ మరింత పెరిగిపోయింది. మహాయుతి సమావేశం ఆదివారం జరుగనున్నట్లు శివసేన(షిండే) వర్గాలు తెలియజేశాయి. కొత్త ముఖ్యమంత్రి వచ్చేవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వివరించాయి. తమ పార్టీ నేత ఏక్నాథ్ షిండేలో ఎలాంటి అసంతృప్తి లేదని, ఆయన శనివారం ముంబైకి తిరిగి వస్తారని శివసేన నాయకుడు ఉదయ్ సామంత్ చెప్పారు. ఢిల్లీలో షిండే తమ పార్టీ డిమాండ్లను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దీనిపై అమిత్ షా అతిత్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తారని వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్) పారీ్టలు మహాయుతి పేరిట కూటమిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ(అజిత్) 41 సీట్లు గెలుచుకున్నాయి. సీఎం కుర్చీ కోసం మూడు పార్టీల ముఖ్యనేతలు పోటీపడ్డారు. కానీ, మిత్రపక్షాలకు సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించడం లేదు. దాంతో కనీసం మంత్రి పదవుల్లోనైనా ఎక్కువ వాటా సొంతం చేసుకోవాలని శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్) ఆరాటపడుతున్నాయి. మిత్రపక్షాలకు 20 మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ పెద్దలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో తమకే ఎక్కువ పదవులు కావాలని ఎన్సీపీ(అజిత్) పట్టుబడుతోంది. మరోవైపు బీజేపీ శాసనసభాపక్షం ఇప్పటికీ సమావేశం కాలేదు. తమ నాయకుడిని ఎన్నుకోలేదు. షిండే అడుగులు ఎటువైపు? మరోసారి సీఎం పదవి తనకే ఇవ్వాలని ఏక్నాథ్ షిండే తొలుత డిమాండ్ చేశారు. బీజేపీ అగ్రనాయకత్వం బుజ్జగించడంతో మెత్తబడ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి అంగీకరించినట్లు తెలిసింది. కానీ, కీలకమైన హోంశాఖను తనకే అప్పగించాలని షరతు పెట్టారు. షిండే మనసు మార్చుకుంటున్నట్లు ఆయన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదని అంటున్నాయి. ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పోస్టుపై శివసేన(షిండే)లో రెండు రకాల వాదనలు వినిపిస్తాయి. ఈ పదవి తీసుకోవాలని ఒక వర్గం చెబుతుండగా, అవసరం లేదని మరో వర్గం వ్యతిరేకిస్తోంది. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావడం ఏమిటని శివసేన(షిండే) ఎమ్మెల్యే సంజయ్ సిర్సాత్ ప్రశ్నించడం గమనార్హం. పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి చిన్న పదవిలో ఇమడలేరని ఆయన చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో షిండే కూర్చొనే అవకాశం లేదని అన్నారు. కూటమి ధర్మాన్ని తన తండ్రి గౌరవిస్తారని, వ్యక్తిగత ఆకాంక్షలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోరని ఏక్నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే స్పష్టంచేశారు. ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఎటువైపు అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీతో జట్టుకట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు వారి బలం సరిపోదు. రెండు రోజుల్లో సీఎం ఎంపిక: షిండే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అమిత్ షా, జె.పి.నడ్డాతో సానుకూల చర్చలు జరిగాయని ఏక్నాథ్ షిండే చెప్పారు. ఆయన శుక్రవారం ఉదయం ఢిల్లీలో ముంబైకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. కొత్త సీఎం ఎంపికపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ముంబైలో మహాయుతి కీలక సమావేశం జరగబోతోందని, చర్చలు కొనసాగుతాయని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాను అవరోధం కాబోనని, ప్రధాని మోదీ, అమిత్ షాల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. మహాయుతి కూటమి పారీ్టల మధ్య చక్కటి సమన్వయం ఉందని వివరించారు. అతి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏక్నాథ్ షిండే ప్రకటించారు. పదవుల వెంట పడడం తమకు ఇష్టం లేదన్నారు. -
ఎన్నికల వేళ.. అజిత్ పవార్ ఎన్సీపీకి సుప్రీంకోర్టు చీవాట్లు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)పై సుప్రీంకోర్టు మండిపడింది. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ వ్యవస్థాపకుడు అజిత్ పవార్ ఫోటోలను, వీడియోలను.. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ఉపయోగించకూడదని హెచ్చరించింది.‘మీ సొంత కాళ్లపై నిలబడటం నేర్చుకోండి’ అంటూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం బుధవారం చీవాట్లు పెట్టింది. శరద్ పవార్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉపయోగించవద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సర్క్యులర్ జారీ చేయాలని అజిత్ పవార్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. కాగా అజిత్ పవార్ వర్గానికి పార్టీ చిహ్నమైన గడియారం గుర్తును కేటాయించడాన్ని శరద్ పవార్ నేతృత్వంలోనే ఎన్సీపీ-ఎస్పీ వర్గం సుప్రీంకోర్టును ఇటీవల ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై నేడు విచారణ సందర్భంగా శరద్ పవార్‌కు చెందిన వీడియోలను అజిత్ పవార్ వర్గం ప్రచారం చేస్తోందని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలియజేశారు. అయితే అజిత్ పవార్ వర్గం తరపు నసీనియర్ న్యాయవాది బల్బీర్ సింగ్ వాదిస్తూ.. అదిపాత వీడియో అని తెలిపారు. కానీ కోర్టు ఈ అభ్యంతరాలను తోసిపుచ్చింది.‘ఈ వీడియో పాతది అయినా కాకపోయినా, శరద్ పవార్‌తో మీకు సైద్దాంతిక విభేదాలు ఉన్నాయి. ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి మీరు మీ కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నించాలి’ అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రత్యేకమైన, భిన్నమైన రాజకీయ పార్టీగా మీ సొంత గుర్తింపును కనుగొనండి అని తెలిపారు. -
సీఎం యోగి వ్యాఖ్యలను ఖండించిన అజిత్ పవార్
ముంబై: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే, నాశనం అవుతాం) వ్యాఖ్యలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఖండించారు. యోగి పేరు ప్రస్తావించడకుండా.. బయట వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేస్తారని, మహారాష్ట్ర ఎప్పుడూ మత సామరస్యాన్ని కొనసాగిస్తోందని ఆయన అన్నారు.‘మహారాష్ట్రను ఇతర రాష్ట్రాలతో ఎవరూ పోల్చకూడదు. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ మత సామరస్యాన్ని కాపాడుతున్నారు. బయటి నుంచి కొందరు ఇక్కడికి వచ్చి ప్రకటనలు చేస్తున్నారు, కానీ మహారాష్ట్ర ఎప్పుడూ మత విభజనను అంగీకరించలేదు. షాహు (మహారాజ్), జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ లౌకిక భావజాలాన్ని రాష్ట్రం అనుసరిస్తోంది’ అని వెల్లడించారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన పార్టీ అభ్యర్థి నవాబ్ మాలిక్ తరపున తాను ప్రచారం చేస్తానని అజిత్ పవార్ తెలిపారు. మాలిక్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. మన్ఖుర్డ్-శివాజీనగర్ స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సీఎం ఏక్నాథ్ షిండే శివసేన కూడా ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టింది.ఇద్దరూ మహాయుతి అభ్యర్థులు కాగా, బీజేపీ మాత్రం షిండే అభ్యర్థికి మద్దతు ఇస్తోంది. మాలిక్‌కు ప్రచారం చేయడం లేదని స్పష్టం చేసింది.కాగా అజిత్ పవార్ ఎన్సీపీ ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే యోగి వ్యాఖ్యలపై అజిత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. కూటమిలో లుకలుకలు బయటపడ్డాయంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. -
రాజకీయాల నుంచి తప్పుకోబోతున్న శరద్ పవార్?
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్చంద్ర) అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి వైదొలగడంపై ఆయన స్పందించారు. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. రాజ్యసభలో తమ పదవీకాలం ఇంకా ఏడాది కాలం మిగిలి ఉందని, అది పూర్తైన తర్వాత మళ్లీ ఎన్నికల్లో పోటీచేయనని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం బారామతిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను అధికారంలో లేనని చెప్పారు. రాజ్యసభలో తన పదవీకాలం ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఆ తర్వాత భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని వెల్లడించారు. ఎక్కడో ఒకచోట ఆగిపోవాల్సిందేనన్న శరద్ పవార్.. ఇప్పటి వరకు 14 సార్లు తనను ఎంపీగా, ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు బారామతి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈనెల 20న జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నుంచి ఎన్సీపీ(అజిత్) అధ్యక్షుడు అజిత్ పవార్ బరిలోకి దిగుతున్నారు. ఆయనపై శరద్‌పవార్ మనవడు యుగేంద్ర పవార్ పోటీ చేస్తున్నారు. దీంతో శరద్ పవార్ తన మనవడు యుగేంద్ర తరఫున ప్రచారం చేస్తు్న్నారు. కాగా అజిత్ పవార్ బారామతి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత విజయాల్లో అతనికి తన మామ పార్టీ మద్దతు ఉంది. కానీ పార్టీ నుంచి చీలిపోయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే.దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. తనకు అజిత్ పవార్‌పై ఎలాంటి పగ లేదని చెప్పారు. రాష్ట్రంలో అజిత్ పవార్ 30 ఏళ్లకు పైగా పనిచేశారని, ఆయన సేవలపై ఎలాంటి సందేహం లేదని అన్నారు. అయితే ఇప్పుడు భవిష్యత్తు కోసం సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కొత్త నాయకుడు అవసరమని ఆయన అన్నారు. రాబోయే 30 ఏళ్లు పనిచేసే నాయకత్వాన్ని మనం తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కాగా శరద్‌పవార్ వయసు ప్రస్తుతం 83 ఏళ్లు. ఆయన దాదాపు 60 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నేతగా అవతరించారు. 1999లో ఆయన ఎన్సీపీని స్థాపించి ప్రముఖ రాజకీయ నాయకుడిగా సేవలందించారు. -
అన్ని నామినేషన్లు పూర్తి.. ఇక యుద్ధానికి సిద్ధం: కాంగ్రెస్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియడంతో ఏయే స్థానాల్లో ఏ అభ్యర్థి పోటీ చేస్తున్నారనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. దీంతో బరిలో నిలిచన అభ్యర్థులు ప్రచార హోరును పెంచుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ తమ అభ్యర్థుల గెలుపుకు సర్వశక్తుల కృషిచేస్తున్నాయి.అయితే నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ..15 స్థానాల్లో అటు మహాయుతి, ఇటు మహా వికాస్ అఘాడీ కూటమిలోనూ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో తొలుత గందరగోళం నెలకొంది. ఇప్పుడు ఆ సందిగ్దత తొలగిపోయింది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు నామినేషన్లు పూర్తి చేసినట్లు మహా వికాస్ అఘాడీ కూటమి వెల్లడించింది. ఇక ఎన్నికల యుద్ధానికి సిద్దమైనట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, సీనియర్ నాయకుడు వర్షా గైక్వాడ్, నసీమ్ ఖాన్‌లతో కలిసి మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి రమేష్ చెన్నితాల బుధవారం మాట్లాడుతూ..మహా వికాస్ అఘాడిలో అన్ని పార్టీలకు సమానమైన గౌరవం ఉందని తెలిపారు. మొత్తం 288 స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశామని చెప్పారు. మహాయుతి కూటమితో పోల్చితే తమ గ్రూపులో ఎలాంటి గొడవలు లేవని అన్నారు. . తమ సభ్యుల మధ్య కొంత అపార్థాలు ఉన్నప్పటికీ మిత్రపక్షాల మధ్య ఎలాంటి చీలికలు లేవన్నారు. ఎంవీయేలో అన్ని పార్టీలకు సమానమైన గౌరవాన్ని అందించామని తెలిపారు‘మహాయుతి సమయం ముగిసింది. , ఆ కూటమిలో బీజేపీ తమ మిత్రపక్షాలైన ఎన్సీపీ, శివసేన(షిండే) స్థానాలను దోచుకుంది. బీజేపీ తమ కూటమి భాగస్వాములను అణగదొక్కాలని చూస్తోంది. కానే మేము ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులకు ఏ, బీ ఫారమ్‌లను ఇచ్చాం. ఎన్నికల్లో పోటీకి మేము సిద్దం. స్వతంత్రంగా నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ నాయకులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలి. ’ అని చెన్నితాల కోరారు. కాగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. 23న ఫలితాలను వెల్లడిస్తారు. -
Maharashtra: ఎన్సీపీ అభ్యర్థి నవాబ్ మాలిక్‌పై బీజేపీ మండిపాటు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటమిల నుంచి కీలక నేతలంతా బరిలోకి దిగుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి చెందిన కీలక నేతల్లో ఒకరైన నవాబ్ మాలిక్ అభ్యర్థిత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికలకు మన్‌ఖుర్ద్ శివాజీ నగర స్థానానికి ఆఖరి నిమిషంలో ఆయన రెండు నామినేషన్లు దాఖలు చేశారు. ఒకటి ఇండిపెండెంట్‌గా, మరొకటి ఎన్సీపీ సభ్యుడిగా చేశారు. చివరికి ఎన్సీపీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించడంతో పార్టీ నుంచే పోటీలోకి దిగుతున్నారు. కాగా మాలిక్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతని సహచరులు ఛోటా షకీల్, టైగర్ మెమన్‌లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.తాజాగా నవాబ్ మాలిక్ రెండు నామినేషన్లు వేయడంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అశిష్ షెలార్ మాట్లాడుతూ.. కూటమిలోని అన్నిపార్టీలు తమ సొంత అభ్యర్థిని నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు. దీనిపై బీజేపీ వైఖరి చాలా స్పష్టంగా ఉందని తెలిపారు. ‘ఎన్సీపీకి సంబంధించి నవాబ్ మాలిక్ అధికారిక అభ్యర్థిత్వానికి సంబంధించే ఇక్కడ సమస్య. బీజేపీ వైఖరిని దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ పదే పదే స్పష్టం చేశారు, నేను మళ్ళీ చెబుతున్నాను. నవాబ్ మాలిక్ కోసం బీజేపీ ప్రచారం చేయదు. మేము అతని కోసం ప్రచారం చేసే ప్రశ్నే లేదు. ఎందుకంటే దావూద్ సంబంధిత కేసులతో సంబంధం ఉన్న ఎవరికీ మేము ప్రచారం చేయము’. అని పేర్కొన్నారు.వాస్తవానికి నవాబ్ మాలిక్ అనుశక్తి నగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఈసారి ఆ సీటు తన కుమార్తె సనా మాలిక్‌కు న్సీపీ కేటాయించింది. దీంతో నవాబ్ మాలిక్ మరోస్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. అయితే నవాబ్ మాలిక్‌కు నామినేషన్ ఇవ్వవద్దని అజిత్ పవార్‌పై బీజేపీ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం -
నటి భర్త కంటే బెటర్: ప్రత్యర్థిపై నవాబ్ మాలిక్ కుమార్తె
ముంబై: రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్సీపీ నేత( అజిత్ పవార్ వర్గం) నవాబ్ మాలిక్ కుమార్తె సనా మాలిక్ ముంబైలోని అనుశక్తి నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గంలో చేరిన నటి స్వర భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్‌తో ఆమె తలపడనున్నారు. ఈ సందర్భంగా సనా మాలిక్ మాట్లాడుతూ.. ప్రత్యర్థి ఫహద్ అహ్మద్‌పై విరుచుకుపడ్డారు. తాను నవాబ్ మాలిక్ కుమార్తె అయినందుకు గర్వపడుతున్నానని, నవాబ్ మాలిక్ కూతురు అనుశక్తి నగర్ కూతురిగా మారగలదని తెలిపారు. ఇది ఓ నటి భర్త కావడం కంటే మేలే అంటూ విమర్శలు గుప్పించారు.అనుశక్తి నగర్‌లోని ప్రజల కోసం తాను కష్టపడి పనిచేశానని, నామినేషను దాఖలు చేసే సమయంలో స్థానికులు తన వెంట రావడం వారి మద్దతుకు నిదర్శనమని సనా మాలిక్ అన్నారు. ఫహద్ అహ్మద్ తనకు శత్రువు కాదని, కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని ఆమె అన్నారు.‘ ఇది రాజకీయం. ఎవరూ శత్రువులు కాదు. ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. ప్రస్తుతం అహ్మద్ నా ప్రత్యర్థి. నేను ఫహద్ గురించి మాట్లాడను, కానీ ఇక్కడి ప్రజలకు నన్ను నవాబ్ మాలిక్ కూతురిగా మాత్రమే తెలుసునని నేను చెబుతాను, కానీ నేను వారి ఇళ్లకు వెళ్లినప్పుడు, వారితో టీ తాగేటప్పుడు, మా మాటలు వినండి, వారు నన్ను తెలుసుకుంటారు. సమస్యలు" అని సనా మాలిక్ అన్నారు.కాగా సనా మాలిక్ తండ్రి నవాబ్ మాలిక్, అనుశక్తి నగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మన్ఖుర్డ్-శివాజీ నగర్ నుంచి ఆయన పోటీ చేయున్నారు. 1993లో ముంబైలో జరిగిన పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో..ఫిబ్రవరి 2022లో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. నవాబ్ మాలిక్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. -
ఎన్సీపీలో చేరిన బాబా సిద్దిఖీ కుమారుడు
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, దివంగత నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ శుక్రవారం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీలో చేరారు. అజిత్ పవార్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా జీషన్ మాట్లాడుతూ.. ఇది తనకు, తన కుటుంబానికి ఉద్వేగభరితమైన క్షణం అని పేర్కొన్నారు. ఈ కష్ట సమయాల్లో తనును నమ్మినందుకు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ స్థానమైన వాంద్రే ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడి నుంచే నామినేషన్ వేసి ప్రజలందరి ప్రేమ, మద్దతుతో మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.కాగా 2019 ఎన్నికల్లో వాంద్రే ఈస్ట్ నుంచి గెలుపొందిన 32 ఏళ్ల జీషన్ సిద్దిఖీ.. గత ఆగస్టులో మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలతో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండించారు.అసెంబ్లీ ఎన్నికల వేళ మహరాష్ట్ర మహా వికాస్ అఘాడీ కూటమి 255 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వాంద్రే సిట్టింగ్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ స్థానాన్ని పొత్తులో భాగంగా కాంగ్రెస్.. శివసేన (యూబీటీ) ఉద్దవ్ ఠ్రాకేకు అప్పగించింది. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే అసమ్మతి వ్యక్తం చేస్తూ జీషన్.. ఎన్సీపీలో చేరారు. -
బారామతి నుంచి అజిత్ పవార్ బరిలోకి.. ఎన్సీపీ తొలి జాబితా విడుదల
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ).. అసెంబ్లీ ఎన్నికలకు తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 38 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితా ప్రకటించగాగా.. పార్టీ అధినేత అజిత్ పవార్ అతడి కుటుంబానికి కంచుకోట ఉన్న బారామతి స్థానం నుంచి పోటీ చేయనున్నారు.ఎన్సీపీకి చెందిన 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా అభ్యర్థులుగా తొలి జాబితాలో పేర్కొన్నారు. యెవ్లా స్థానం నుంచి ఎన్సీపీ సీనియర్ నాయకుడు ఛగన్ భుజ్‌బల్, నవాపూర్ సీటు నుంచి దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్‌రావు గవిత్ కుమారుడు భరత్ గవిత్ బరిలోకి దిగుతున్నారు. కాగా, ఎన్సీపీకి చెందిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌ను దిండోరి నుంచి, గతంలో బీజేపీలో ఉన్న మాజీ మంత్రి రాజ్‌కుమార్ బడోలేను అర్జుని-మోర్గావ్ నుంచి, అంబేగాన్ నుంచి దిలీప్ వైస్-పాటిల్, పార్లీ నుంచి ధనంజయ్ ముండే, కాగల్ నుంచి హసన్ ముష్రిఫ్ పోటీ చేయనున్నారు. అలాగే ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్సీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు సుల్భా ఖోడ్కే (అమరావతి), హిరామన్ ఖోస్కర్ (ఇగత్పురి)లను కూడా ఎన్సీపీ అభ్యర్థులుగా ఆ పార్టీ ప్రకటించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ. శివసేన(ఏక్నాథ్ షిండే)తో కలిసి ఎన్సీపీ(మహాయుతి కూటమి) పోటీ చేస్తుంది. ఇప్పటికే ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ 45 మంది అభ్యర్థులతో మంగళవారం తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే కోప్రి-పచ్పఖాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు -
అందమైన అమ్మాయిలు రైతు బిడ్డను పెళ్లిచేసుకోవడం లేదు: ఎమ్మెల్యే కామెంట్స్
ముంబై: అందమైన అమ్మాయిలు ఎవరూ రైతు బిడ్డని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడరు అంటూ మహారాష్ట్ర ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.మహారాష్ట్రకు చెందిన అజిల్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే దేవేంద్ర భుయార్ వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన తన నియోజకవర్గం వరుద్ తహసీల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతుల సమస్యలపై మాట్లాడారు. ఈ క్రమంలో భుయార్ మాట్లాడుతూ.. ఉద్యోగం ఉన్న అబ్బాయిలనే అందమైన అమ్మాయిలు ఎంచుకుంటారు. ఒక అమ్మాయి అందంగా ఉంటే రైతుల కొడుకులను ఇష్టపడదు. కొందరు అమ్మాయిలు మాత్రమే వ్యవసాయ కుటుంబంలోని అబ్బాయిని వివాహం చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు అని కామెంట్స్ చేశారు.ఈ క్రమంలో ఎమ్మెల్యే దేవేంద్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకురాలు, మహారాష్ట్ర మాజీ మహిళా శిశు అభివృద్ధి మంత్రి యశోమతి ఠాకూర్ స్పందిస్తూ.. మహిళలను ఉద్దేశిస్తూ భుయార్ మాట్లాడిన భాష సరిగా లేదన్నారు. ఆయన ఉపయోగించిన పదజాలం మహిళలను కించపరిచేలా ఉంది అంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో తమ ఎమ్మెల్యేలను అదుపులో ఉంచుకోవాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు సూచించారు.ఇది కూడా చదవండి: వరద నీటిలో పడిపోయిన ఆర్మీ హెలికాప్టర్.. ఆ తర్వాత ఏమైందంటే? -
Maharashtra Polls: నాకూ సీఎం కావాలని ఉంది.. అజిత్ పవార్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి గెలిస్తే.. తాను సీఎం కావాలనే ఆశతో ఉన్నట్లు అజిత్ పవార్ పేర్కొన్నారు.పుణెలోని దగ్దుషేత్ హల్దవాయ్ గణపతి ఆలయంలో మంగళవారం అజిత్ పవార్ పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ‘ప్రతిఒక్కరు తమ నాయకుడిని సీఎంగా చూడాలని కోరుకుంటారు. నేను కూడా అదే అనుకుంటున్నారు. కానీ ఎవరైనా సీఎం కావాలనుకుంటే.. వారు మెజార్టీ సంఖ్యకు చేరుకోవాలి. ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరవు.చదవండి: ‘వారిపై చర్యలు తీసుకోండి’.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయంక, కోరికలు ఉంటాయి. కానీ అందరూ వారు కోరుకున్నది పొందలేరు. అదంతా ఓటర్ల చేతిలో ఉంటుంది. 288 స్థానాలకుగానూ 145 సీట్లు దక్కించుకోవాలి’ అని ఈ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా రాబోయే ఎన్నికల్లో సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే మహాయుతి కూటమి(బీజేపీ, శివసేన, ఎన్సీపీ) పోటీ చేస్తుందని పేర్కొన్నారు.‘మా కూటమిని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు మేమంతా ప్రయత్నిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా కలిసి చర్చించుకొని తదుపరి సీఎంను ఎంచుకుంటాం’ అని తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ శిండేను ముఖ్యమంత్రి చేయాలంటూ శివసేన నేతలు డిమాండ్ చేస్తోన్న తరుణంలో పవార్ స్పందించడం గమనార్హం. మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌ను మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. -
Maharashtra: సీట్ల పంపకాలు పూర్తి.. 140 స్థానాల్లో బీజేపీ పోటీ?
ముంబై: లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. హర్యానా, జమ్మూకశ్మీర్, మహారాష్ట్రకు వరుసగా అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాజకీయ హడావిడీ నెలకొంది. గెలుపే లక్ష్యంగా అన్నిపార్టీలు ఎన్నికల పోరుకు సమాయత్తం అవుతున్నాయిఈ క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ విడుదల కాకముందే.. అధికార, విపక్షాలు తమ ఫోకస్ పెంచాయి. తాజాగా మహయుతి ప్రభుత్వంలోని పార్టీల మధ్య (బీజేపీ, శివసనే,ఎన్సీపీ) సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి. మూడు పార్టీలు సైతం తమ పట్టు నిలుపుకునేందుకు ఎక్కువ స్థానాల్లో పోటీ కోరినట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు అధికార కూటమిలో సీట్ల పంపకాల చర్చ అప్పుడే కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 140 నుంచి 150 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 55 స్థానాల్లో పోటీ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా చిన్న మిత్రపక్షాలకు మూడు సీట్లు కేటాయించనున్నట్లు వినికిడి.అయితే ప్రభుత్వానికి ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి కూటమి నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాల్లో 30 స్థానాలను గెలుచుకొని సత్తా చాటాయి ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్చంద్ర), శివసేన(ఉద్దవ్). లోక్‌సభ ఎన్నికల జోష్‌నే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు మహా వికాస్ అఘాడి కూటమి తమ సీట్ల భాగస్వామ్యాన్ని ఇంకా ప్రకటించలేదు. మరోవైపు కేవలం 17 స్థానాలకు మాత్రమే పరిమితమైన ఎన్డీయే కూటమి.. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చి అధికారాన్ని కాపాడుకునేందుకు యత్నిస్తోంది. కాగా గత 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అవిభక్త శివసేన కూటమి అఖండ విజయం సాధించింది.అయితే సీఎం పదవిపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. కానీ కొంతకాలానికే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. 2022లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే బయటకు వచ్చి బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కొంతకాలానికే ఎన్సీపీని చీల్చుతూ అజిత్ పవార్ బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు. -
నా కూతురు అల్లుడిని నదిలో పడేయండి: మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ(అజిత్‌పవార్) సీనియర్ నేత ధర్మారావు బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కూతురు భాగ్యశ్రీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతుందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. శనివారం అహేరి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లతో మాట్లాడుతూ.. నమ్మక ద్రోహానికి పాల్పడితే తన కూతురు భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్ హల్గేకర్‌లను ప్రాణహిత నదిలో పడేయాలని వ్యాఖ్యానించారు.అయితే మంత్రి ఈ వ్యాఖ్యలు ‘జన్సన్మాన్ యాత్ర’ సందర్భంగా ఎన్సీపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలోనే చేయడం గమనార్హం. ‘పార్టీని విడిచివెళ్లే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మా కుటుంబంలోని కొందరు వేరే పార్టీలో చేరాలనుకుంటున్నారు. 40 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు ఎన్నో ఫిరాయింపులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు శరద్ పవార్‌కు చెందిన నాయకులు నా కుటుంబాన్ని విభజించి నా కుమార్తెను నాపై పోటీకి దింపాలని చూస్తున్నారు. నా అల్లుడు, కూతురిని నమ్మవద్దు. వాళ్లు నన్ను విడిచిపెట్టారు. అలాంటి వారిని సమీపంలోని ప్రాణహిత నదిలో తోసేయాలి, వారు నా కుమార్తెను తమ వైపుకు తిప్పుకొని సొంత తండ్రికి వ్యతిరేకంగా ఆమెను తయారు చేస్తున్నారు. తండ్రికి కూతురు కాలేకపోయిన అమ్మాయి మీకు ఏం అవుతుంది? దాని గురించి మీరు ఆలోచించాలి. ఆమె నీకు ఏం న్యాయం చేస్తుంది? వారిని నమ్మవద్దు. రాజకీయాల్లో నేను కుమార్తె, సోదరుడు సోదరిలా చూడను. ’అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్న ధర్మారావు ఆత్రమ్.. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అహేరి నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాలని చూస్తున్నారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే టార్గెట్.. సీట్ల పంపకాలపై చర్చలు షురూ
ముంబై: మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార బీజేపీ కూటమికి ఆశించిన స్థానాలు రాకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలపై గురిపెట్టింది. మరోవైపు ఈ సారి ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలనే ధీమాతో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి పావులు కదుపుతోంది.అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్), ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీలు ఆగస్టు 7న సమావేశం కానున్నాయి. ముంబైలో జరిగే ఈ కీలక భేటీలో మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరగనుంది. వీటితోపాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ర్యాఆలీ ప్రణాళికతో సహా ఇతర అంశాలను సమావేశంలో చర్చిస్తామని కాంగ్రెస్ ఎల్పీ నేత బాలాసాహెబ్ థోరట్ పేర్కొన్నారు. గెలిచే అభ్యర్ధులను బరిలోకి దింపడం వల్ల సీట్ల మార్పిడి కూడా ఉండే అవకాశం ఉందని చెప్పారు.ఇక 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్..110 స్థానాల్లో పోటీచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 10 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎన్సీపీ దాదాపు 80 స్థానాల్లో పోటీపై కన్నేసినట్లు వినికిడి.. ఇక ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 100 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 లోక్‌సభ స్థానాలకు గాను 30 స్థానాలను ప్రతిపక్ష ఎంవీఏ గెలుచుకుంది. కాంగ్రెస్ రెబల్‌గా ఉన్న ఏకైక స్వతంత్ర ఎంపీ విశాల్ పాటిల్ ఆ పార్టీ అసోసియేట్ మెంబర్‌గా మారడంతో రాష్ట్రంలో ప్రతిపక్ష ఎంపీల సంఖ్య 31కి చేరుకుంది. బీజేపీ, ఎన్సీపీ, శివసేన కూటమి 17 స్థానాలకే పరిమితమైంది. -
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ముంబై: ఎన్సీపీ(శరత్చంద్ర) అధినేత శరద్ పవార్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమిలో మిత్రపక్షాల కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎన్సీపీ అంగీకరించిందని, అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుందని శరద్ పవార్ పేర్కొన్నారు.ఈ మేరకు శుక్రవారం శదర్ పవార్ పుణెలో రెండు పార్టీ సమావేశాలు నిర్వహించారు. జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలతో, పార్టీ ఎమ్మెల్యేలు, కొత్తగా ఎంపికైన ఎంపీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.పుణె ఎన్సీపీ చీఫ్ ప్రశాంత్ జగ్తాప్ మాట్లాడుతూ.. శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌తో పొత్తు చెక్కుచెదరకుండా ఉండేలా లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తక్కువ స్థానాల్లో పోటీ చేసిందని శరద్ పవార్ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఈ ఫార్ములా భిన్నంగా ఉంటుందని పార్టీ చీఫ్ తమకు సూచించాడని చెప్పారు.పూణే, బారామతి, మావల్, షిరూర్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిస్థితిని కూడా ఎన్సీపీచీఫ్ సమీక్షించారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎంపీలు, ఎమ్మెల్యేలను పవార్ పిలుపునిచ్చినట్లు చెప్పారు.అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ సీట్ల పంపకం సందర్భంగా పార్టీ ఎన్ని సీట్లు కోరుతుందో ఇంకా నిర్ణయించలేదని రాష్ట్ర ఎన్సీపీచీఫ్ జయంత్ పాటిల్ పేర్కొన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ప్రత్యర్థి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి విషయంలో శరద్ పవార్ సీనియర్ నిర్ణయం తీసుకుంటారని పాటిల్ చెప్పారు.కాగా ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. -
‘బీజేపీ ఆఫర్ చేస్తే.. కేంద్రంలో మంత్రి పదవి స్వీకరిస్తా’
ముంబై: కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి అవకాశం ఇస్తే తప్పకుండా స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ అన్నారు. ఆమె ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీ కంచుకోట స్థానమైన బారామతిలో పోటీ చేసి ఆ పార్టీ నేత సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. అయితే తాజాగా సునేత్రా పవార్ రాజ్య సభ ఉప ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ ఆమెకు ప్రత్యర్థి లేకపోవటంతో సునేత్రా గెలుపు ఖాయమని తెలుస్తోంది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు సునేత్ర మాట్లాడుతూ.. ‘కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే కచ్చితంగా స్వీకరిస్తాను. ఆ ఆవకాశాన్ని వినియోగించుకుంటా. బారామతిలో మేం హోరంగా ఓడిపోయాం. ఓటమికిగల కారణాలుపై విశ్లేషణ చేస్తాం, తగిన క్షేత్రస్థాయి చర్యలు తీసుకుంటాం’’ అని ఆమె అన్నారు.మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో భాగంగా ఒక్కసీటు కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ పార్టీకి కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కలేదు. అయితే ఈ పార్టీకి చెందిన సీనియర్ నేత ప్రఫూల్ పటేల్‌కు కేంద్ర సహాయమంత్రి (స్వతంత్ర హోదా) ఇస్తామని బీజేపీ ప్రతిపాదించింది. కాగా.. ఆయన గతంలోనే కేంద్ర కేబినెట్ మినిస్టర్‌గా పనిచేసి ఉండటంతో బీజేపీ ఇచ్చిన సహాయ మంత్రి పదవి ఆఫర్‌ను తిరస్కరించారు. -
శరద్ పవార్‌తో టచ్‌లో.. అజిత్ పవార్ వర్గం 15 మంది ఎమ్మెల్యేలు
ముంబై: మహరాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. లోక్‌సభ ఎన్నికల్లో అధికార కూటమి(బీజేపీ, ఎన్సీపీ, శివసేన) బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. మొత్తం 48 స్థానాల్లో కేవలం 17 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి(కాంగ్రెస్, శరద్ ఎన్సీపీ, ఉద్దవ్ శివసేన) 30 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష కూటమికి అత్యధిక సీట్లు రావడంతో ప్రభుత్వం అయోమయంలో పడింది.ఈ క్రమంలో తాజాగా అజిత్ పవార్ వర్గానికి చెందిన 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ పేరు చెప్పకుండానే పలువురు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ పేర్కొన్నారు. జూన్ 9న జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనల గురించి ఆలోచిస్తామని.. జూన్ 10న ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పారు.దీంతో ఆ నేతలు అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేతలేన న్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తన వర్గం నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎన్సీపీ ప్రముఖులైన పార్టీ రాష్ట్ర చీఫ్ సునీల్ తట్కరే, ఛగన్ భుజబల్, దిలీప్ వల్సే పాటిల్, హసన్ ముస్రిఫ్, అదితి తట్కరే తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన, పార్టీ భవిష్యత్తు గురించి వారు చర్చించారు.లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ నాలుగు స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం ఒక చోటనే గెలిచింది. అంతేగాక అజిత్ సతీమణి సైతం ఓటమి చెందింది. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే చేతిలో లక్ష యాబై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.కాగా, మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను కేవలం 17 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. 2019లో 23 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి కేవలం 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 7 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఒక్క సీటు గెలుచుకున్నాయి. మరోవైపు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమిలో కాంగ్రెస్ 13 సీట్లు, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 9 సీట్లు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎనిమిది సీట్లు గెలుచుకుంది.ఇక ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు మరోసారి మలుపులు తిరుగవచ్చని అంతా భావిస్తున్నారు. -
Lok sabha elections 2024: మరాఠా గడ్డపై మహా పోరు!
మరాఠా గడ్డపై ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. పొత్తుకు పై పొత్తు అన్నట్లుగా ఏ పార్టీ ఎప్పుడు ఏ కూటమిలో ఉంటుందో తెలియని ట్విస్టులతో మహారాష్ట్రలో రాజకీయం నానా మలుపులు తిరుగుతోంది. శివసేన, దిగ్గజ నేత శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) పగ్గాలు చీలిక వర్గాల చేతికి వెళ్లడంతో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. ఆ రెండు పార్టీలతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లోనూ వాటితో కలిసే కూటమిగా పోటీ చేస్తోంది. మరోపక్క, ఉద్ధవ్ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్)తో సహా చిన్నాచితకా పార్టీలు జట్టు కట్టి రంగంలోకి దిగాయి... స్టేట్ స్కాన్ 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్ర సీట్లపరంగా ఉత్తరప్రదేశ్ తర్వాత రెండో అతి పెద్ద రాష్ట్రం. ఇక్కడి రాజకీయాలు ఎక్కువగా స్థానికాంశాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఎన్నికల వేళ అనూహ్య రాజకీయ మార్పులూ పరిపాటే. ఏ పార్టీ కూడా ఒంటిచేత్తో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న దాఖలాలు పెద్దగా లేవు. రెండేళ్లలో అంతా తలకిందులు పొత్తు రాజకీయాలకు పేరొందిన మహారాష్ట్రలో గడిచిన రెండేళ్లలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వాములుగా పోటీ చేసిన బీజేపీ, శివసేన ఏకంగా 41 స్థానాలు కైవసం చేసుకున్నాయి. బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేసి 23 సీట్లు దక్కించుకోగా, శివసేన 23 చోట్ల పోటీ చేసి 18 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీ మరో రెండు ప్రాంతీయ పార్టీలను కలుపుకొని బరిలోకి దిగినా ప్రభావం చూపలేకపోయాయి. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేసి ఒక్క చోటే గెలిచింది. ఎన్సీపీ 19 చోట్ల అభ్యర్థులను నిలబెట్టి 4 సీట్లతో సరిపెట్టుకుంది. ఇతర పార్టీలు ఎన్డీఏ సునామీలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు శివసేన, ఎన్సీపీ రెండుగా చీలిపోయాయి. ఒకటి ఎన్డీఏలో, మరోటి మహాకూటమి పంచన చేరాయి. 48 లోక్‌సభ స్థానాల్లో 5 సీట్లు ఎస్సీలకు, 4 ఎస్టీలకు కేటాయించారు. మాటల యుద్ధం ఎన్నికల ప్రచారం జోరందుకుంటున్న కొద్దీ నేతల మాటల్లో వాడి, వేడి కూడా పెరుగుతోంది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే బీజేపీకి బేషరతు మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ తప్పుబట్టారు. ‘రాజ్ ఠాక్రే బీజేపీ ముందు మరీ ఇలా సాగిలపడిపోతారనుకోలేదు. పులి కాస్త గొర్రెలా మారింది. ఠాక్రే వంటి పోరాట యోధుడు బానిసగా మారారు. అతను బీజేపీకి మద్దతు ప్రకటించినా ఎన్నికల్లో మా విపక్ష ఎంవీఏ కూటమిపై ఎలాంటి ప్రభావం ఉండదు’ అని విజయ్ పేర్కొన్నారు. కాగా, బుధవారం నాగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. ‘సర్వేలన్నీ ఎన్డీఏ బంపర్ విజయం ఖాయమంటున్నాయి. ప్రతిపక్షాలు నాపై చేస్తున్న విమర్శలు, దూషణలతో మా బలం మరింత పెరుగుతోంది. ’అబ్కీ బార్ 400 పార్’ ట్రెండ్ బలపడుతోంది‘ అని స్పష్టం చేశారు. బీజేపీ తరపున డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వంటి నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కాగా, రెండు నెలల క్రితం కాంగ్రెస్‌ను వీడిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కూడా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లలో ఉండటం విశేషం. ఆయనకు బీజేపీ రాజ్యసభ సీటు కట్టబెట్టింది. మరోపక్క, కాంగ్రెస్ ప్రచారంలో రాహుల్ గాం«దీ, మల్లిఖార్జున ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే దన్నుగా నిలుస్తున్నారు. అధికార కుమ్ములాటలు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసి మెజారిటీ సాధించాయి. మహా వికాస్ అఘాఢీ (ఎంవీఏ) పేరిట కలిసి బరిలో దిగిన కాంగ్రెస్, ఎన్సీపీ ప్రతిపక్షానికి పరిమితయ్యాయి. అధికార పంపకంపై బీజేపీ, శివసేన కుమ్ములాట చివరికి కూటమి నుంచి సేన వైదొలిగేందుకు దారితీసింది. శివసేనకు ఎంవీఏ సీఎం పదవి ఆఫర్ చేయడంతో అది కూటమిలో చేరింది. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టారు. 100కు పైగా సీట్లను దక్కించుకున్నా అధికారం దక్కకపోవడంతో బీజేపీ అదను చూసి శివసేనకు షాకిచ్చింది. శివసేన నేత ఏక్నాథ్ షిండే మెజారిటీ ఎమ్మెల్యేలను చీల్చి వేరుకుంపటి పెట్టుకున్నారు. ఆయన సీఎంగా బీజేపీ–శివసేన సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసింది. శివసేన పార్టీ, గుర్తు షిండే వర్గానికే దక్కాయి. అటు ఎన్సీపీలోనూ అజిత్ పవార్ తిరుగుబావుటా ఎగరేశారు. ఎమ్మెల్యేలను చీల్చి అధికార సంకీర్ణంలో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. ఎన్సీపీ పేరు, గుర్తు కూడా అజిత్ వర్గానికే దక్కడంతో శరద్ పవార్ కొత్త పేరు, గుర్తుతో పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది! ‘మహా’యుతి కూటమి బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి బలంగా కన్పిస్తోంది. శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమిలో ఉన్నాయి. అయోధ్య రామ మందిరం సాకారం, అభివృద్ధి నినాదాలతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది. మోదీ కేబినెట్లో రెండు విడతల్లోనూ మంత్రి పదవి దక్కించుకున్న మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) షిర్డీ లోక్‌సభ సీటు డిమాండ్ చేస్తోంది. దాన్ని తమ సిట్టింగ్ ఎంపీకే కేటాయించాలని సీఎం షిండే పట్టుబడుతున్నారు. షిర్డీ నుంచి తాను పోటీ చేసినా, చేయకపోయినా ఎన్డీఏతోనే ఉంటానని ఆర్పీఐ చీఫ్ రాందాస్ అథవాలే ప్రకటించారు. ఆయనకున్న ఓటు బ్యాంకు చాలా స్థానాల్లో కూటమికి కలిసొస్తుందని భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. బీజేపీ దాదాపు 30 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. కానీ ఎన్సీపీ 10, శివసేన 18 సీట్లు కోరుతున్నాయి. ఇప్పటిదాకా బీజేపీ 24, శివసేన 8, ఎన్సీపీ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. గత ఎన్నికల్లో మహారాష్ట్రలో 7 శాతం ఓట్లు సాధించిన అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ సారథ్యంలోని బహుజన్ అఘాడీ కూడా బీజేపీతో సీట్ల బేరం సాగిస్తోంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా తాజాగా మోదీకి జై కొట్టారు. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమికి బేషరతుగా మద్దతు ప్రకటించారు! ‘ఇండియా’ పైచేయి సాధించేనా? ప్రతిపక్ష ఎంవీఏ కూటమిలో ఎట్టకేలకు సీట్ల పంపకం కొలిక్కి వచి్చంది. శివసేన (ఉద్ధవ్) 21 సీట్లు, కాంగ్రెస్ 17 స్థానాలు, ఎన్సీపీ (శరద్ పవార్) 10 స్థానాల చొప్పున పంచుకున్నాయి. ఎన్సీపీ, శివసేన ఓటు బ్యాంకు తమతోనే ఉందని ఎంవీఏ చెబుతోంది. కాంగ్రెస్ 6 న్యాయాలు, 25 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. మహాయుతి కూటమికి ఎంవీఏ గట్టి పోటీ ఇస్తున్నట్టు కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో మహారాష్ట్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సర్వేల సంగతేంటి? సర్వేల్లో మహారాష్ట్రపై మిశ్రమ అంచనాలు వెలువడుతున్నాయి. కొన్ని అధికార మహాయుతి కూటమికే మెజారిటీ సీట్లు కట్టబెట్టగా మరికొన్ని ఎంవీఏ భారీగా పుంజుకుని పైచేయి సాధిస్తుందంటున్నాయి. తాజా సర్వే ఒకటి ఎంవీఏ కూటమికి ఏకంగా 26 స్థానాలు అంచనా వేయడంతో కాంగ్రెస్ తదితర విపక్షాల్లో ఉత్సాహం నెలకొంది. – సాక్షి నేషనల్ డెస్క్ -
న్యాయవ్యవస్థపై ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
నాగ్‌పూర్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత జితేంద్ర అవద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు వివాదం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల ఫలితంగా ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈసారి ఆయన దేశంలోని న్యాయవ్యవస్థపై తాజాగా చేసిన వ్యాఖ్యలు మళ్లీ దుమారం రేపుతున్నాయి. ‘నాకు చాలా బాధగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయవ్యవస్థలోనూ రిజర్వేషన్లు పెట్టాల్సింది. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల 80 శాతం సమాజానికి అన్యాయం జరుగుతోంది. న్యాయ వ్యవస్థ చేసే కొన్ని నిర్ణయాల్లో కుల వివక్ష వాసన వస్తోంది. ఇది న్యాయవ్యవస్థ నుంచి ఆశించ లేదు’ అని నాగ్‌పూర్‌లో జరిగిన ఎన్సీపీ సమతాపరిషద్ మీటింగ్‌లో అవద్ మాట్లాడారు. బహుజనులు ఇప్పుడిప్పుడే బార్ కౌన్సిల్లలో కనిపిస్తున్నారని అవద్ అన్నారు. తరాలుగా వారికి విద్య అందకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇదీచదవండి.. అమ్మాయి మీద వెకిలి జోకు.. ఒకరి బలి -
మరాఠా రిజర్వేషన్ల పోరాటం.. ఎన్సీపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు..
ముంబై: మహారాష్ట్రలో రిజర్వేషన్ ఉద్యమ నిరసనలు హింసకు దారి తీశాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిని నిరసనకారులు ముట్టడించారు. మరాఠా కోటా డిమాండ్ నేపథ్యంలో బీద్ జిల్లాలోని ఎమ్మెల్యే నివాసంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బిల్డింగ్ వద్ద ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో స్థానికంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంటి సమీపంలోని కార్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ప్రకాశ్ సోలంకి ఇంటి వద్ద భారీగా మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చుట్టుపక్కలా ప్రాంతమంతా దట్టమైన మంటలు వ్యాపించాయి. కాగా ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే తెలిపారు. అదృష్టవశాత్తూ తన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఆయన వెల్లడించారు. తామంతా క్షేమంగా ఉన్నట్లు, తెలిపారు. అయితే అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నారు. అయితే మరాటా రిజర్వేషన్ల ఉద్యమం గురించి సోలంకే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటిపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే పాటిల్ గత అయిదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. సోలంకే ఈ దీక్షపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మరాఠా రిజర్వేషన్ సమస్యను పిల్లల ఆటగా ఆయన అభివర్ణించారు. ఈ క్రమంలోనే నిరసనకారులు ఆగ్రహంతో రగిలిపోయి.. ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. చదవండి: ఈడీ ఎదుటకు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు #WATCH | Beed, Maharashtra: Maratha reservation agitators vandalised and set the residence of NCP MLA Prakash Solanke on fire. pic.twitter.com/8uAfmGbNCI — ANI (@ANI) October 30, 2023 -
'సభలకు అజిత్ పవార్ హాజరు కాట్లేదు.. ఎందుకంటే..?'
ముంబయి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కొద్ది రోజులుగా రాజకీయ కార్యక్రమాలకు హాజరవడం లేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయంగా మరేదైనా బాంబు పేల్చబోతున్నారా..? అనే అనుమానాలకు తావిచ్చాయి. అయితే.. ఈ పుకార్లకు తెరదించుతూ ఎన్సీపీ రెబల్ గ్రూప్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ స్పందించారు. అజిత్ పవార్ డెంగ్యూతో బాధపడుతున్నారని చెప్పారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆరోగ్యం కుదుటపడగానే అజిత్ పవార్ ప్రజల ముందుకు వస్తారని ప్రఫుల్ పటేల్ స్పష్టం చేశారు. 'ప్రజా కార్యక్రమాల్లో అజిత్ పవార్ కనిపించటం లేదని తాజాగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ పుకార్లకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. డెంగ్యూతో బాధపడుతున్న అజిత్ పవార్.. నిన్నటి నుంచే చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరాను.' అని ప్రఫుల్ పటేల్ తెలిపారు. ఇదీ చదవండి: నోరు జారిన రాహుల్.. అదానీ కోసం పనిచేయాలని పార్టీ నేతకు సూచన -
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ
ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నాగాలాండ్‌కు చెందిన పార్టీ నేతలంతా అజిత్ పవార్‌కు మద్దతు తెలుపుతున్నాం’ అని ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. . కాగా, జూలై 2న ఎన్సీపీని రెండుగా చీల్చిన అజిత్ పవార్ 30-35 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అందులో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తిరుగుబాటు అనంతరం కూడా అజిత్.. శరద్ పవార్‌తో రెండుసార్లు భేటీ కావడం విశేషం.. తన వర్గం నేతలతో కలిసి ముంబయిలోని శరద్ పవార్ నివాసానికి చేరుకొని, పార్టీని ఐక్యంగా ఉంచే విషయంపై ఆయనతో చర్చించారు. తమ విజ్ఞప్తిని విన్న శరద్ పవార్.. మౌనంగా ఉన్నారే తప్ప ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని రెబల్ ఎమ్మెల్యేలు వెల్లడించారు. చదవండి: మణిపూర్‌లో మహిళల నగ్న ఊరేగింపు.. ఆరోజు జరిగింది ఇదేనా! -
‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్‌ను కలిసిన ఉద్ధవ్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్సీపీలో చీలిక తర్వాత మహా పాలిటిక్స్‌లో ‘పవార్’ పేరే జోరుగా వినిపిస్తోంది. తాజాగా ఎన్సీపీ తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను శివసేన నేత (యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. బుధవారం ముంబైలో జరిగిన ఈ భేటీలో శివసేన నేత ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు. కాగా అజిత్ పవార్ బీజేపీ, శివసేన (షిండే) ప్రభుత్వంలో చేరిన తర్వాత వీరిరువురు కలవడం ఇదే తొలిసారి. అయితే అజిత్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే గతంలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సంగతి విదితమే. శివసేనలో చీలిక ఏర్పడి ఎంవీఏ ప్రభుత్వం కూలిపోవడానికి ముందు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవార్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అజిత్ పనితీరు తెలుసు: ఉద్ధవ్ అజిత్‌తో భేటీ అనంతరం ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు.. అజిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర ధృతరాష్ట్రుడిలా గుడ్డిది కాదని, ఛత్రపతి శివాజీ మహారాజా నడియాడిన రాష్ట్రమని తెలిపారు. అజిత్ రాష్ట్ర ప్రజలు, రైతుల కోసం మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో అజిత్‌తో కలిసి పనిచేశాను కాబట్టి అతని పని తీరు తెలుసని చెప్పారు. చదవండి: మేం వాళ్లకు అంటరానివాళ్లమేమో!: ఎంఐఎం విపక్షాల భేటీ మరుసటి రోజే.. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే బెంగుళూరులో రెండు రోజులపాటు జరిగిన ప్రతిపక్ష పార్టీల కీలక భేటీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే అజిత్‌తో సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు అజిత్ పవార్ సైతం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. ఎన్డీయేలో చేరాలని శరద్‌ను కోరారు. కాగా అజిత్ తన బాబాయిని 24 గంటల వ్యవధిలో రెండుసార్లు (ఆది, సోమవారం) కలిశారు. అజిత్ తన వర్గం నేతలతో కలిసి ముంబయిలోని శరద్ పవార్ నివాసానికి చేరుకొని, పార్టీని ఐక్యంగా ఉంచే విషయంపై ఆయనతో చర్చించారు. అయితే, తమ విజ్ఞప్తిని విన్న శరద్ పవార్.. మౌనంగా ఉన్నారని, ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. చదవండి: షాకింగ్ వీడియో.. మహిళా పైలట్‌ను జుట్టు పట్టుకొని లాక్కొచ్చి.. VIDEO | Shiv Sena (UBT) leader Uddhav Thackeray meets Maharashtra Deputy CM Ajit Pawar in Mumbai. (Source: Third Party) pic.twitter.com/38w33jcPnv — Press Trust of India (@PTI_News) July 19, 2023 -
మంత్రివర్గ విస్తరణ వెంటనే శరద్ పవార్ నివాసానికి అజిత్
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్.. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ నివాసానికి వెళ్లారు. కేబినెట్ విస్తరణ జరగిన కొన్ని గంటల్లోనే ముంబైలోని శరద్ పవార్ అధికారిక నివాసమైన ‘సిల్వర్ ఓక్’ను సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఎన్సీపీపై తిరుగుబాటు ఎగురవేసి, తన వర్గం నేతలతో ప్రభుత్వంలో చేరిన అనంతరం అజిత్, ఎన్సీపీ అధినేత ఇంటికి వెళ్లడం ఇదే తొలిసారి. అయితే అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్‌తో సమావేశమయ్యారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై అజిత్ పవార్ వర్గం నేతలు స్పందించారు. తన భేటీ వెనక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని తెలిపారు. కేవలం తన చిన్నమ్మ(శరద్ భార్య) ప్రతిభా పవార్ పరామర్శించడానే ఆ ఇంటికి వెళ్లారని వెల్లడించారు. కాగా శరద్ పవార్ సతీమణి ప్రతిభకు క్రవారం దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేతికి సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది. అనంతరం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. చిన్నమ్మను చూసేందుకు అజిత్ శరద్ నివాసానికి వెళ్లారు. ఇదిలా ఉండగా అజిత్ పవార్ తన చిన్నమ్మ ప్రతిభతో మంచి సాన్నిహిత్యం ఉంది. 2019లో పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ స్వల్పకాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. అతన్ని తిరిగి ఎన్సీపీలోకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. చదవండి: ఒక్క పర్వతంపై 900 ఆలయాలు.. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా.. ఇక జూలైన 2న ఎన్సీపీని రెండు గా చీల్చిన అజిత్ పవార్ 30-35 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అందులో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రెండు వారాల తర్వాత వీరికి శుక్రవారం శాఖలు కేటాయింపు జరిగింది. అజిత్‌కు రెండు ప్రధాన ఆర్థిక, ప్రణాళిక శాఖ కేటాయించారు. ఆయన వర్గానికి చెందిన మరో ఎనిమింది మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇప్పటి వరకు శిండే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన 20 మంది మత్రులతోనే ప్రభుత్వాన్ని నెట్టొచ్చారు. ఇప్పుడు అజిత్ వర్గం కూడా చేరండంతో రాష్ట్ర కేబినెట్లో మంత్రుల సంఖ్య 29కి చేరింది. #WATCH | Mumbai: Maharashtra Deputy Chief Minister Ajit Pawar leaves from NCP chief Sharad Pawar's residence Silver Oak. pic.twitter.com/qt6mdCuX9M — ANI (@ANI) July 14, 2023 -
అజిత్ పవార్ చేరికపై అసంతృప్తి, సీఎం రాజీనామా!.. స్పందించిన శివసేన
సార్వత్రిక ఎన్నికలకు ముందు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రతిపక్ష కూటమిలోనూ ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు చేయడంతో రోజుకో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీపై పట్టుకోసం బాబాయ్-అబ్బాయ్ మధ్య తీవ్ర వార్ నడుస్తోంది. అయితే ఎన్సీపీ నేత అజిత్ పవార్ పార్టీని చీల్చుతూ ఆయన మద్దతుదారులతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడం, ఎనిమిది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఏక్నాథ్ శిండే(శివసేన) వర్గంలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శివసేనలో చిచ్చు మంత్రి పదవులు దక్కని కొందరు ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారని, అసంతృప్తితో ఉన్న 8–10 మంది మళ్లీ ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం సైతం రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. పార్టీలో నెలకొన్న అనిశ్చితిపై చర్చించేందుకే ముఖ్యమంత్రి షిండే తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని హడావిడీకి ముంబైకి వచ్చారని వదంతులు వ్యాపించాయి. ఏ గందరగోళం లేదు తాజాగా శివసేనపై వస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ నేత ఉదయ్ సావంత్ ఘాటుగా స్పందించారు. ఎన్సీపీ తిరుగుబాటు నేతలు అజిత్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరడంపై శివసేనలో ఎలాంటి విభేదాల్లేవని, ఎవరో గిట్టనివారు వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఏక్నాథ్ షిండే సీఎం పదవి నుంచి తప్పుకునే ఆలోచనలు కూడా లేనట్లు స్పష్టం చేశారు. తాము రాజీనామా లేఖలు ఇచ్చేవాళ్లం కాదని, తీసుకునే వాళ్లమని వ్యాఖ్యానించారు. చదవండి: NCP Crisis: అబ్బాయికి బాబాయ్ చురకలు సీఎం అత్యవసర భేటీ బుధవారం ముర్ముకు స్వాగతం పలికేందుకు నాగ్‌పూర్‌కు వెళ్లిన శిండే తన పర్యటనను అర్థంతరంగా ముగించుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన నివాసంలో అత్యవసరంగా భేటీ అయిన సంగతి తెలిసందే. ఈ క్రమంలో ఉదయ్ సావంత్ మాట్లాడుతూ.. ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో భాగమని అన్నారు. షిండే సారథ్యంలో తమ ప్రభుత్వం ప్రశాంతంగా ముందుకు సాగుతోందని చెప్పారు. సీఎం ప్రతి ఒక్కర్నీ కలుపుకొంటూ వెళ్తారని, చివరి వరకు ఓపిక పట్టడమే ఆయన నాయకత్వ లక్షణమని ఆయన అన్నారు. బుధవారం నాటి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలందరూ సీఎంకు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఎన్సీపీతో వెళ్లవద్దని వాదన? శిండే వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఘర్షణ పడ్డారని ఎన్సీపీతో వెళ్లకూడదని ఓ ఎమ్మెల్యే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయని, అలాంటిదేమీ జరగలేదన్నారు. ఎవరూ ఎటు వెళ్లాల్సిన పని లేదని, ప్రస్తుతానికి తమ ప్రభుత్వానికి 200 మంది ఎమ్మెల్యేలతో సంపూర్ణ మెజార్టీ ఉందన్నారు. గతంలో తాము ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(ఉద్దవ్) నుంచి బయటకి వస్తే.. మమ్మల్ని ద్రోహులుగా చిత్రీకరించారని, ప్రస్తుతం ఎన్సీపీ కూడా అదే బాట పట్టిందని సామంత్ అన్నారు. అజిత్ పవార్ తమ ప్రభుత్వంలో కలవడం అంటే ఇప్పుడు శివసేన - కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి సరిగ్గా లేదనే అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. -
అజిత్ పవార్ కట్టప్ప - శరద్ పవార్ బాహుబలి
న్యూఢిల్లీ: ఎన్సీపీలో తిరుగుబాటు చేసి అజిత్ పవార్ పార్టీ అధినేత శరద్ పవార్ ను వెన్నుపోటు పొడిచారని చెబుతూ ఢిల్లీ ప్రధాన కార్యాలయం ఎదుట కట్టప్ప బాహుబలిని చంపిన పోస్టర్లతో పెద్ద పెద్ద హోర్డింగులు వెలిశాయి. ఎన్సీపీ విద్యార్థి విభాగమైన రాష్ట్రవాది విద్యార్థి కాంగ్రెస్ నాయకులు గద్దర్(నమ్మకద్రోహి) అని పెద్దగా రాసి బాహుబలి సినిమాలో కట్టప్ప అమరేంద్ర బాహుబలిని పొడిచిన దృశ్యం ఉన్న పెద్ద పోస్టర్ ని నిలబెట్టారు. ఢిల్లీ కార్యాలయం ఎదుట అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ లు ఉన్న పోస్టర్లన్నిటినీ తొలగించి వాటి స్థానంలో ఈ పోస్టర్లను, హోర్డింగులను ఏర్పాటు చేశారు. పోస్టర్ మీద "మనలోని దేశద్రోహులు ఎవరన్నది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు వారిని క్షమించరు" అని పైన చిన్నగా రాసి పెద్దగా నమ్మకద్రోహి అని రాశారు. ఈ పోస్టర్లు, వాటిని ప్రతిష్టించిన వీడియోలు బయటకు రావడంతో ఎన్సీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అజిత్ పవార్ తిరుగుబాటు ప్రకటించిన క్షణం నుండి మహారాష్ట్రలో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతూ వచ్చాయి. ప్రస్తుతానికి ఈ రెండు వర్గాలు ఎలక్షన్ కమిషన్ ముందు తమ బలాన్ని నిరూపించుకునే పనిలో ఉన్నాయి. #WATCH | Old posters and hoardings of NCP that showed Ajit Pawar and Praful Patel on them are being removed from outside the office of the party in Delhi. A new poster with 'Gaddaar' (traitor) written on it is being put up there. pic.twitter.com/CjLoQmI5u9 — ANI (@ANI) July 6, 2023 ఇది కూడా చదవండి: యూనిఫామ్ సివిల్ కోడ్: తొలి అడుగు వేసిన కేంద్రం -
ఎన్సీపీ కొత్త చీఫ్‌గా అజిత్ పవార్.. జూన్ 30నే తీర్మానం!
ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో తలెత్తిన సంక్షోభం ముదిరింది. పార్టీలో రోజుకో కీలక మలుపు చోటు చేసుకుంటోంది. ఎన్సీపీపై ఆధిపత్యం కోసం పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్, చీలిక వర్గం నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా శరద్ పవార్‌ను పార్టీ చీఫ్ పదవి తొలగిస్తూ ఆయన స్థానంలో అజిత్ పవార్‌ను నియమిస్తూ జూన్ 30నే తీర్మానం చేసినట్లు ఎన్సీపీ తిరుగుబాటు నేతలు వెల్లడించారు. రెండు రోజుల ముందే తీర్మాణం ఎన్సీపీ నుంచి వేరుపడే కొన్ని రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజిత్ వర్గం పేర్కొంది. ఈ మేరకు అజిత్ వర్గం ఎన్నికల కమిషన్‌కు బుధవారం ఒక పిటిషన్ సైతం సమర్పించింది. ఇందులో జూన్ 30న జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎన్సీపీ పార్టీ అధ్యక్షుడిగా అజిత్ పవార్‌ను ఎన్నుకుంటూ తీర్మాణాన్ని ఆమోదించినట్లు తెలిపారు. దీనిపై దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మద్దతు ఇస్తూ ఆఫిడవిట్లపై సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు. హోటల్‌కు అజిత్ గ్రూప్ ఎమ్మెల్యేలు ఎన్సీపీ నుంచి వేరు కుంపటి ఏర్పాటు చేసిన అజిత్ గ్రూప్ పార్టీ పేరు, గుర్తు కోసం ఈసీని ఆశ్రయించారు. తమకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమదే నిజమైన ఎన్సీపీ అని పార్టీ పేరు, గుర్తు తమకు కేటాయించాలని ఆరోపిస్తున్నారు. అంతేగాక అజిత్ పవార్ తన గ్రూప్ ఎమ్మెల్యేలందరిని ముంబై హోటల్లో ఉంచారు. అయితే తిరుగుబాటు ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శరద్ పవార్ విధేయుడు జయంత్ పాటిల్ నుంచి కూడా తమకు లేఖ అందిందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. చదవండి: 'అక్కడ చూస్తే నవ్వొచ్చింది..' ప్రతిపక్ష కూటమిపై ప్రపుల్ పటేల్ సెటైర్.. షిండే ఎమ్మెల్యేల్లో అసంతృప్తి కాగా ఆదివారం అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఉప ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలోని బిజెపి-శివసేన ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసందే. అయితే ఈ పరిణామంపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి తన అపాయింట్మెంట్లన్నింటినీ రద్దు చేసుకొని తన అధికారిక నివాసంలో అత్యవసరంగా పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. అయితే శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే, ఎన్సీపీతో ఎప్పుడు బంధం కలిగి లేరనే విషయాన్ని ఎత్తి చూపుతూ.. ఎన్సీపీతో పొత్తుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అజిత్ వెంట 32 మంది ఎన్సీపీ పార్టీపై ఆధిపత్యం కోసం ఇరువురు నేతలు బుధవారం బల ప్రదర్శనకు దిగారు. ఎమ్మెల్యేలు, అనుచరులతో కలిసి సమావేశాలు నిర్వహించారు. పరస్పరం వాగ్బాణాలు విసురుకున్నారు. అయితే నంబర్‌గేమ్‌లో బాబాయిపై అబ్బాయి అజిత్‌దే పై చేయి అయింది. 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో అజిత్ సభకు 32 మంది హాజరయ్యారని ఆయన వర్గం నేతలు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకొచ్చారు. చదవండి: మొత్తం శరద్ పవారే చేశారు.. ఎన్సీపీ చీఫ్‌పై సంచలన వ్యాఖ్యలు వారే కీలకం 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్సీల్లో ఐదుగురు ఇప్పటికే అజిత్‌కు మద్దతు ప్రకటించారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే అజిత్‌కు 36 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఆయనకు 40 మంది అండ ఉందని చీలిక వర్గం ఎమ్మెల్యే అనిల్ పాటిల్ చెప్పారు. ఇక శరద్ భేటీకి 18 మంది ఎమ్మెల్యేలే హాజరైనట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు ఇరు భేటీల్లోనూ పాల్గొనడం విశేషం!. మరికొందరు రెండు సమావేశాలకు హాజరుకాలేదు. అయితే ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలుండగా ఏ భేటీకీ వెళ్లని ఎమ్మెల్యేల మద్దతు రెండు వర్గాలకూ కీలకంగా మారేలా కన్పిస్తోంది. -
పవార్ వర్సర్ పవార్.. అజిత్‌తో 29 మంది, శరద్‌తో 13 ఎమ్మెల్యేలు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్సీపీపై అజిత్ పవార్ తిరుగుబావుట ఎగిరేసినప్పటినుంచి మరింత వేడెక్కాయి. ప్రస్తుతం ఎన్సీపీలో పవార్ వర్సెస్ పవార్ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా తమ బలాన్ని చాటుకునేందుకు ఇటు శరద్ పవార్, అటు అజిత్ పవార్ వర్గాలు నేడు వేరువేరుగా ముంబైలో ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇరువర్గాలకు ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతుందనే దానిపై స్పష్టత లేని నేపథ్యంలో నేటీ భేటీతో ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఎన్సీపీకి చెందిన 29 మంది ఎమ్మెల్యేలు రెబల్ నేత అజిత్ పవార్‌తో కలిసి వేదికపై కనిపించారు. ఇక శరద్ పవార్ నేతృత్వంలోని భేటీకి 13 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు సమాచారం. 83 ఏళ్ల యోధుడికి మద్దతివ్వాలి ముంబైలోని నారీమన్ పాయింట్ వద్ద బుధవారం ఒంటి గంటకు నిర్వహించే కీలక సమావేశానికి హాజరు కావాలంటూ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ తమ పార్టీ ఎమ్మెల్యేందరికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఆదివారం ఎన్సీపీ చీఫ్ విప్‌గా బాధ్యతలు చేపట్టిన జితేంద్ర అహ్వాద్ పేరుతో జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటి ముందు ‘ఒంటరిగా పోరాడుతున్న 83 ఏళ్ల యోధుడికి మద్దతు తెలిపాలి’ అంటూ భారీగా బ్యానర్లు వెలిశాయి. బాంద్రాలో అజిత్ వర్గం ప్రత్యేక భేటీ మరోవైపు తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బాంద్రాలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తనకే మెజారీటి ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని నిరూపించునే ప్రయత్రంలో ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా అతని అనుమతితో మాత్రమే తన ఫోటో ఉపయోగించాలని పరోక్షంగా అజిత్ పవార్‌ను ఉద్ధేశిస్తూ శరద్ పవార్ మంగళవారం వ్యాఖ్యానించారు. మంగళవారం అజిత్ నేతృత్వంలోని కొత్త కార్యాలయంలో శరద్ పవార్ ఫోటో కనిపించిన తర్వాత ఎన్సీపీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నేటీ అజిత్ సమావేశంలోనూ శరద్ ఫోటోలు కనిపించడం గమనార్హం. చదవండి: కేబినెట్ భేటీకి దూరం.. కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా? 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ ఎన్సీపీని చీల్చుతూ అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా 8 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు దక్కాయి. అయితే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శరద్ పవార్ పార్టీ అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ముందు పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి మొత్తం 53 ఎమ్మెల్యేల బలం ఉండగా.. అయితే తనకు 43 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని అజిత్ పవార్ చెబుతున్నారు. అయితే అజిత్ వెనక ఉన్నది 13 మంది ఎమ్మెల్యేనంటున్న శరద్ వర్గం ఆరోపిస్తుంది. దీనిపై జయంత్ పాటిల్ మాట్లాడుతూ.. అజిత్ వైపు నిలబడి పేపర్‌పై సంతకం చేసిన కొంతమంది ఎమ్మెల్యేలకు అసలు తాము ఎందుకు, దేనిపై సంతకం చేస్తున్నారో తెలియదని, కుట్రపూరితంగా ఇది జరిగిందంటూ ఆరోపించారు. అజిత్, తన వర్గం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన లోక్‌సభ ఎంపీ అమోల్ కోల్హే.. శరద్ పవార్‌కే తన విధేయత ఉంటుందని ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందాను. రాజకీయాల నుంచి నిష్క్రమించాలనుకున్నాను. అయితే పార్టీ అధ్యక్షుడిని కలిసిన తర్వాత మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు. చదవండి: అజిత్ పవార్‌కు చేదు అనుభవం ఎన్సీపీలో పార్టీ పేరు, గుర్తు కోసం గొడవ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తు కోసం ఇరు నేతల పంచాయితీ త్వరలో ఎన్నికల కమిషన్ వద్దకు చేరుకోనుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం బుధవారం నాటి కీలక సమావేశం తర్వాత ఎన్నికల కమిషన్ ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పార్టీ పేరు, గుర్తుపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల కమిషన్ తన మాట కూడా వినాలని కోరుతూ ఇక శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇప్పటికే కేవియట్ దాఖలుచేసింది.ది. -
మహారాష్ట్ర సీఎం మారబోతున్నారు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్రలో ఒక్కరోజులోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేతో కలిసి బీజేపీ–శివసేన(షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడం రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఏకంగా అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా తన వర్గం ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి తాజాగా అజిత్ పవార్ ఎన్డీయే ప్రభుత్వంలో చేరడంపై శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. త్వరలోనే మహారాష్ట్ర సీఎం మారనున్నారని వ్యాఖ్యానించారు. ఏక్నాథ్ షిండేకు పదవి గండం మొదలైందని, అజిత్ పవార్ త్వరలోనే మహారాష్ట్ర సీఎంగా బాద్యతలు చేపట్టనున్నారని చెప్పారు. దీంతో షిండే తన పదవిని కోల్పేయే ప్రక్రియ మొదలైందని, ఆయన 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని అన్నారు. ఈ పరిణామాన్ని ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌గా చూడరాదని.. రెండు ఇంజిన్లలో ఒకటి ఫెయిలవుతోందంటూ పేర్కొన్నారు. #WATCH | Uddhav Thackeray faction leader and MP Sanjay Raut, says "Today I am saying this in front of the camera, the Chief Minister of Maharashtra is going to change. Eknath Shinde is being removed. Eknath Shinde and the 16 MLAs are going to be disqualified" pic.twitter.com/R0YI0MwQwR — ANI (@ANI) July 3, 2023 సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర సీఎం మారబోతున్నారు. ఈ విషయాన్ని నేను ఈ రోజు కెమెరా ముందు చెబుతున్నాను. ఏక్నాథ్ షిండేను సీఎంగా తొలిగిస్తారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు కూడా అనర్హత వేటుకు గురవుతారు. పవార్‌కు పట్టాభిషేకం చేస్తారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లను బీజేపీ విచ్ఛిన్నం చేస్తోంది. అయితే దీని వల్ల వారికి (బీజేపీ) ఎటువంటి ప్రయోజనం లేదు. 2024 ఎన్నికల్లో మేమంతా కలిసే పోరాడుతాం. ఎన్సీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని మోదీయే చెప్పారు. ఇప్పుడు అదే నేతలు రాజ్భవన్లోప్రమాణం స్వీకారం చేయడం షాకింగ్‌గా ఉంది’ అని పేర్కొన్నారు. కాగా ఎన్సీపీలో ఆదివారం చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అనూహ్యంగా షిండే- బీజేపీ ప్రభుత్వంలో చేరడంతో ఆ పార్టీ చీఫ్ శరద్‌పవార్‌కు పెద్ద షాక్ తగిలినటైంది. అజిత్ పవార్‌తో ఉప ముఖ్యమంత్రిగా, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, ఆదితీ తట్కారే, ధర్మారావు , అనిల్ పాటిల్, సంజయ్ బాంసోడేతో మంత్రులుగా రాష్ట్ర గవర్నర్ రమేశ్ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్ తోపాటు డిప్యూటీ స్పీకర్ నరహరి, ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. #WATCH | Uddhav Thackeray faction leader and MP Sanjay Raut, says "BJP is breaking Shiv Sena, NCP and Congress but this will not benefit them at all. In Maharashtra, we will fight unitedly. It is shocking that PM Modi had said that the leaders of NCP are involved in corruption… pic.twitter.com/6VodgbNNXI — ANI (@ANI) July 3, 2023 -
మొత్తం మీద మీ ఫోటోనే సరిపోయింది సార్! స్థలం లేదు!
మొత్తం మీద మీ ఫోటోనే సరిపోయింది సార్! స్థలం లేదు! -
మరాఠా యోధుడి రిటైర్మెంట్
-
ఎమ్మెల్యే ధనంజయ్ ముండేకు కారు ప్రమాదం
సాక్షి, ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ధనంజయ్ ముండే ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ధనంజయ్ ఛాతీ, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంవల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. తన అసెంబ్లీ నియోజక వర్గమైన పర్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ధనంజయ్ ముండే పాల్గొన్నారు. అనంతరం రోజంతా స్థానికులతో సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని పర్లీకి బయలుదేరారు. పట్టణానికి కొద్ది దూరంలో ఉన్న అజాద్ చౌక్ వద్ద కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు ప్రమాదానికి గురైంది. గాయాలైన ముండేను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వదంతులను నమ్మవద్దని, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారని ముండే ట్వీట్ చేశారు. కాగా, ముందుజాగ్రత్తగా మెరుగైన వైద్య కోసం ఆయన్ని ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. -
మంత్రుల అధికారాలు కార్యదర్శులకా?
సాక్షి, ముంబై: మంత్రాలయలో విధులు నిర్వహిస్తున్న ఆయా శాఖల కార్యదర్శులకు మంత్రుల అధికారాలు అప్పగించడంపై మహా వికాస్ అఘాడీకి చెందిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరి నెల మీద వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంవల్లే నేడు శిందే, ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఈ దుస్థితి ఎదురైందని మహా వికాస్ అఘాడీ నేతలు దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు సీఎం శిందే సమాధానమిస్తూ కార్యదర్శులకు మంత్రుల అధికారాలు కొన్ని మాత్రమే తాత్కాలికంగా కట్టబెట్టామే తప్ప, మిగతా అధికారాలు మంత్రిమండలి వద్దే ఉంటాయని స్పష్టం చేశారు. మంత్రులు లేక వివిధ శాఖల్లో పనులు స్థంభించిపోతున్నాయన్నారు. దీంతో పనులు పారదర్శకంగా, వెంటనే పూర్తయ్యేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శిందే దృష్టి సారించారు. అందులో భాగంగా మంత్రాలయలో ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులకు శనివారం తాత్కాలికంగా మంత్రుల బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. కానీ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మహావికాస్ అఘాడీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలంటే బీజేపీ ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు. శిందే, ఫడ్నవీస్ అసమర్థతవల్ల మంత్రివర్గ విస్తరణ తరుచూ వాయిదా పడుతోందని ఆరోపించారు. శిందే తరుచూ ఢిల్లీ పర్యటన చేస్తూ అక్కడ బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరుపుతూ కాలం వెల్లదీస్తున్నారు. రాష్ట్రంలో మంత్రులు లేకపోవడంవల్ల ప్రజల పనులు సకాలంలో జరగడం లేదు. దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద కూడా ఎలాంటి శాఖలు లేవు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన హోంశాఖ మంత్రి పదవి ఖాళీగానే ఉంది. ఫలితంగా ప్రభుత్వ పాలన కుంటుపడుతోంది. హోం, రెవెన్యూ, నగరాభివృద్ధి, ఆహార, పౌర, సరఫరాల శాఖ, ఫుడ్ అండ్ డ్రగ్స్ పరిపాలన విభాగం, గ్రామాభివృద్ధి, విద్య తదితర శాఖలతో సామాన్య ప్రజలకు చాలా దగ్గరి సంబంధాలుంటాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో ఇద్దరే ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్న శిందే, ఫడ్నవీస్ తీసుకుంటున్నారు. చదవండి: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ? మంత్రులు లేకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగానే ఉంటున్నాయని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అనేక చోట్ల వరదలొచ్చాయి. బయట ప్రపంచంతో సబం«ధాలు తెగిపోయాయి. మంత్రులు లేక వరద బాధితులకు సాయం, పునరావాసం, పంటల నష్టంపై పంచనామా వంటి పనులు సకాలంలో పూర్తికాలేక పెండింగ్‌లో ఉన్నాయి. కానీ మంత్రుల అధికారాలు కార్యదర్శులకు అప్పగిస్తే తప్ప ఈ పనులు పారదర్శకంగా పూర్తికావని దుయ్యబట్టారు. ముఖ్యంగా జిల్లా ఇన్చార్జి మంత్రులు లేకపోవడంతో బాధితుల గోడు వినే నాథుడే కరువయ్యాడు. డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ చదివి పరీక్షలు రాసిన కార్యదర్శులకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయని నిలదీశారు. ప్రజలతో ఉంటూ, ప్రజల్లో మమేకమై తిరిగి, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు అంటే మంత్రులకే ఎక్కువ తెలుస్తుందన్నారు. దీంతో త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
52 మందిని వదులుకున్నారు.. ఎన్సీపీని వదలలేరా? ఉద్ధవ్‌ను ప్రశ్నించిన రెబల్ మంత్రి
ముంబై: ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన 52 మంది ఎమ్మెల్యేలను వదులుకున్నారని, అయితే ఎన్సీపీని మాత్రం వదలలేక పోతున్నారని శివసేన రెబెల్ మంత్రి గులాబ్రావ్ పాటిల్ అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు అవకాశవాదులు కాదని, వారు సీఎంను ఒప్పించలేని స్థితిలో పార్టీ కోసం, తమ నాయకుడి కోసం అన్నీ చేశారని పాటిల్ అన్నారు. శివసేనపై గత వారం సీనియర్ నాయకుడు ఏక్నాథ్ షిండే ప్రారంభించిన తిరుగుబాటులో గులాబ్‌రావు పాటిల్ కూడా ఉన్నారు. మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంలో తమ పార్టీతో అధికారాన్ని పంచుకున్న ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో సంబంధాలు తెంచుకోవాలని తిరుగుబాటు శాసనసభ్యులు ఉద్ధవ్ ఠాక్రేను కోరుతున్నారు. ‘ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని, 52 మంది ఎమ్మెల్యేలను విడిచిపెట్టాడు. కానీ శరద్ పవార్‌ను విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు’ అని అసమ్మతి శిబిరం విడుదల చేసిన ప్రసంగంలో పాటిల్ తన తోటి రెబల్ శాసనసభ్యులతో అన్నారు. చదవండి: శివసేనకు వెన్నుపోటు పొడించింది ఆయనే! -
ఎన్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, ముంబై: విధాన పరిషత్ ఎన్నికలకు ముందు ఎన్సీపీ నాయకులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్సీపీ నేతలు అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌లకు విధాన పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముంబై హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌లు కోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఈ విషయంపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. ఈ హైకోర్టు తీర్పుతో ఎన్సీపీకి గట్టి దెబ్బతగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పోటీ అనివార్యం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వా–నేనా? ఆ ఒక్కరు ఎవరు!
సాక్షి, ముంబై: విధాన పరిషత్ ఎన్నికలు అనివార్యమయ్యాయి. పది స్ధానాలకు గాను 13 మంది సభ్యులు నామినేషన్లు వేయగా అందులో చివరి రోజైన సోమవారం ఇద్దరు మాత్రమే ఉపసంహరించుకున్నారు. దీంతో పది స్ధానాలకు 11 మంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో ఇక విధాన్ పరిషత్ ఎన్నికల్లో పోటీ అనివార్యమని తేలిపోయింది. దీంతో ఈ ఎన్నికలు కూడా రాజ్యసభ మాదిరిగానే హోరాహోరీగా జరగనున్నాయి. బీజేపీ, మహావికాస్ ఆఘాడి నేతలు తమ పరువు, ప్రతిష్టను ఫణంగా పెట్టనున్నారు. విధాన్ పరిషత్‌లో ఖాళీకానున్న 10 స్ధానాలకుగాను బీజేపీ, మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంలోని మిత్రపక్షాలైన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి మొత్తం 13 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసిన వారిలో బీజేపీ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రవీణ్ దరేకర్, ప్రసాద్ లాడ్, మాజీ మంత్రి రామ్ షిందే, మహిళామోర్చా అధ్యక్షురాలు ఉమా ఖాపరే, ప్రతినిధి శ్రీకాంత్ భారతీయ్ ఇలా ఐదుగురు అభ్యర్ధులు ఉన్నారు. అదే విధంగా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న రయత్ క్రాంతి సంఘటన చీఫ్, మాజీ మంత్రి సదాభావు ఖోత్ ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో బీజేపీ తరపున ఐదుగురు, ఒకరు ఇండిపెండెంట్ ఇలా ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. చదవండి: రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాలకు శరద్ పవర్ షాక్ అదేవిధంగా శివసేన తరఫున మాజీ సహాయ మంత్రి సచిన్ అహిర్, అమషా పాడ్వీ నామినేషన్ వేయగా కాంగ్రెస్ నుంచి ముంబై ప్రదేశ్ అధ్యక్షుడు భాయి జగ్తాప్, చంద్రకాంత్ హండోరే నామినేషన్లు వేశారు. ఎన్సీపీ తరఫున విధాన్ పరిషత్ స్పీకర్ రామ్‌రాజే నాయిక్ నింబాల్కర్, ఏక్నాథ్ ఖడ్సే, శివాజీరావ్ గర్జే ఇలా మొత్తం 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అందులో నామినేషన్లు ఉపసంహరణ గడువు ఆఖరు రోజున అంటే సోమవారం బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న రయత్ క్రాంతి సంఘటన చీఫ్, మాజీ మంత్రి సదాభావు ఖోత్, ఎన్సీపీ నుంచి శివాజీరావు గర్జే నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు తను నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు సదాభావు ఖోత్ ప్రకటించారు. చివరగా 10 స్ధానాలకుగాను 11 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేందుకు శివసేన, ఎన్సీపీ కలిసి కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. కాంగ్రెస్ తమ రెండో అభ్యర్ధి నామినేషన్ ఉపసంహరించు కోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో బీజేపీ తరఫున ఐదుగురు, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ తరఫున ఇద్దరు చొప్పున ఇలా 11 మంది బరిలో ఉన్నారు. ఇందులో ఒక్కరు మినహా మిగతా పది మంది అభ్యర్ధులకు విధాన్ పరిషత్‌కు వెళతారు. ఈ నెల 20వ తేదీన జరిగే ఎన్నికల్లో ఆ ఒక్కరు ఎవరుంటారు...? ఎవరు ఓడిపోతారనేది ఫలితాల్లో తేటతెల్లం కానుంది. విధాన్ పరిషత్‌లో ఎవరికెన్ని ఓట్లు.. ► శివసేనకు 55 ఓట్లుండగా–ఇద్దరు అభ్యర్ధులకు సరిపోను ఒక ఓటు అదనంగా ఉంటుంది. ► ఎన్సీపీకి 51 ఓట్లుండగా.. ఇద్దరు అభ్యర్ధులు గెలవాలంటే మూడు ఓట్లు కావాలి. ► కాంగ్రెస్‌కు 44 ఓట్లుండగా ఇద్దరు అభ్యర్ధులు గెలవాలంటే 10 ఓట్లు కావాలి. ► బీజేపీకి 106 ఓట్లుండగా–ఐదుగురు అభ్యర్ధులు గెలవాలంటే ఇంకా 29 ఓట్లు కావాలి. ► ఇందులోంచి ఎన్ని ఓట్లు చీలిపోయి ఎవరిని గెలిపిస్తాయి..? ఎవరిని ఓడిస్తాయనేది ఉత్కంఠగా మారింది. -
చపాతీలు చేయడం నేర్చుకోండి: బీజేపీకి ఎన్సీపీ ఘాటు రిప్లై
సాక్షి, ముంబై: రాజకీయాలు చేయడానికి బదులు ఇంటికెళ్లి వంట చేసుకోండి అని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేను ఉద్దేశిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) తీవ్రంగా మండిపడింది. ఎన్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు విద్యా చవాన్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలకు బదులుగా చంద్రకాంత్ పాటిల్ చపాతీలు చేయడం నేర్చుకోవాలని, ఇంటికెళ్లి ఆయన భార్యకు సాయపడతారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీ బుధవారం ముంబైలో నిర్వహించిన ఆందోళనలో సుప్రియా సూలేపై చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఢిల్లీ పర్యటించినప్పుడు సుప్రియా సూలే ఆయన వద్దకు వెళ్లి కలిశారని, స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు అనుమతించేందుకు ఏం చేశారని మాత్రం ఆయనను అడగలేకపోయారని విమర్శిస్తూ పాటిల్ సుప్రియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై విద్యా చవాన్ స్పందిస్తూ చంద్రకాంత్ పాటిల్ మనుస్మృతిని బలంగా నమ్ముతారని తెలుసని అయితే ఈ విషయంలో మేం ఇక ఏమాత్రం మౌనంగా ఉండదలుచుకోలేదని హెచ్చరించారు. చదవండి: లైంగిక ఆరోపణలు.. మనస్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య -
PM Modi: మోదీకి హనుమాన్ చాలీసా ఎఫెక్ట్
దేశంలో హనుమాన్ చాలీసా పఠనంపై ఇంకా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో శివసేన, బీజేపీ, ఎన్సీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన మహిళా నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీకి చెందిన ఫహ్మిదా హసన్ ఖాన్.. తనకు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ఎదుట(ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ అధికారిక నివాసం) హనుమాన్ చాలీసా, నమాజ్, దుర్గా చాలీసా, నమోకర్ మంత్రం (జైన్ శ్లోకం), గురు గ్రంథ్ సాహిబ్ (సిక్కు గ్రంథం) చదివేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అనంతరం తాను హనుమాన్ చాలీసా పఠిస్తానని, తన ఇంట్లో దుర్గాపూజ కూడా చేస్తానని ఎంఎస్ ఖాన్ చెప్పారు. దీంతో ఆమె లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ రాణా మొదట్లో దంపతులు ప్రకటించారు. ఆ తర్వాత విరమించుకున్నారు. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో హైటెన్షన్ నెలకొంది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి వారిలో కోర్టులో హాజరు పరుచగా.. వీరిద్దరికీ మే 6 వరకూ జుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు బాంద్రా మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ సన్డే కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బిగ్ షాక్ -
‘మహా’ మంత్రి అరెస్ట్‌పై రాజకీయ దుమారం.. ఎవరీ నవాబ్ మాలిక్?
MVA protests against Malik’s arrest: మహారాష్ట్ర మైనార్టీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) మహ్మద్ నవాబ్ మాలిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్టు ఈడీ వెల్లడించింది. మాలిక్ అరెస్ట్ మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. శివసేన నేతృత్వంలోని అధికార మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాల్లో భాగంగానే నవాబ్‌ను పావుగా వాడుకున్నారన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఎవరీ నవాబ్ మాలిక్? 62 ఏళ్ల నవాబ్ మాలిక్ ప్రస్తుతం ముంబై సబర్బన్‌లోని అణుశక్తి నగర్ నియోజకవర్గం నుంచి విధానసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీకీపీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆయన 1959, జూన్ 20న ఉత్తరప్రదేశ్‌లోని దుస్వాలో జన్మించారు. బాంబే యూనివర్సిటీ పరిధిలోని బుర్హానీ కాలేజీ నుంచి 1978లో 12వ తరగతి పాస్ అయినట్టు ఎన్నికల అఫిడవిట్లో మాలిక్ పేర్కొన్నారు. తన వృత్తి వ్యవసాయం, వ్యాపారం అని తెలిపారు. కలినా (మహారాష్ట్ర) నియోజకవర్గంలో ఓటరుగా నమోదైనట్టు వెల్లడించారు. తనపై క్రిమినల్ కేసులు లేవని, రూ.5.74 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని 2019 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. 1996, 1999, 2004లో నెహ్రు నగర్ నుంచి విధాన సభకు ఎన్నికయ్యారు. ఎన్సీపీ జాతీయ అధికార ప్రతినిధిగా, పార్టీ ముంబై నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వాంఖెడే వర్సెస్ మాలిక్ ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసులో గతేడాది అక్టోబర్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ అరెస్టైన సందర్భంలో సంచలన ఆరోపణలతో నవాబ్ మాలిక్ పతాక శీర్షికలకు ఎక్కారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముంబై జోనల్ చీఫ్ సమీర్ వాంఖెడేలపై ఆయన చేసిన ఆరోపణలు పెద్ద కలకలమే సృష్టించాయి. ఆర్యన్‌ఖాన్ అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించడమే కాకుండా.. ట్విటర్ వేదికగా సమీర్ వాంఖెడేను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. నవాబ్ మాలిక్ టార్చర్ తట్టుకోలేక వాంఖెడే.. బాంబే హైకోర్టును ఆశ్రయించారు. చివరకు ఉన్నత న్యాయస్థానం జోక్యంతో సమీర్‌కు మంత్రి మాలిక్ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదానికి తెర పడింది. (క్లిక్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘సామాన్యుడి’ పార్టీ!) మోదీ సర్కారుపై మండిపాటు కాగా, మోదీ సర్కారుకు వంతపాడుతున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ను కూడా నవాబ్ మాలిక్ వదిలిపెట్టలేదు. రైతుల ఉద్యమం, మహాత్మ గాంధీపై ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అంతేకాదు.. కంగనకు కేంద్రం కల్పించిన ‘వై ప్లస్’ భద్రతను కూడా తొలగించాలని గట్టిగా డిమాండ్ చేశారాయన. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. బీజేపీ రాజకీయ ప్రత్యర్థి పార్టీలను భయపెట్టేందుకే మోదీ సర్కార్ ఈడీ, ఎన్సీబీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రకటించారు. అయితే, 2005 నాటి కేసులో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఆయనను అదుపులోకి తీసుకుంది. పాత కేసును తిరగదోడి ఇప్పుడు మాలిక్‌ను అరెస్ట్ చేయడాన్ని కక్ష సాధింపుగా బీజేపీ వ్యతిరేక పార్టీలు పేర్కొంటున్నాయి. మహా అఘాడీకి ఎదురుదెబ్బ మంత్రి మాలిక్ అరెస్ట్ మహా అఘాడీ సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. బలమైన సీనియర్ నాయకుడిని కోల్పోవడం కూటమి మనోధైర్యాన్ని దెబ్బ తీస్తుంది. కూటమిలోని పార్టీలకు ఈ వ్యవహారం తలనొప్పిగా పరిణమించే అవకాశముంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని కేబినెట్ తప్పించాలని ప్రభుత్వంపై విపక్ష బీజేపీ ఒత్తిడి పెంచుతోంది. తమకు వ్యతిరేకంగా బలమైన గళం వినిపిస్తున్న ఆయనను జైలుకు పంపించడం ద్వారా బీజేపీ పైచేయి సాధించింది. కొంతకాలంగా నిస్తేజంగా ఉన్న కేడర్‌లో చురుకు తెచ్చి క్రియాశీలంగా పనిచేసేందుకు తాజా పరిణామం కమలనాథులకు ఉపయోగపడుతుంది. (క్లిక్: ఉక్రెయిన్‌లో భారతీయుల ఆర్తనాదాలు.. ప్రభుత్వం ముందున్న ప్లానేంటి?) ‘మహా’ పొలిటికల్ హీట్ నవాబ్ మాలిక్ అరెస్ట్‌తో మహారాష్ట్రలో రాజకీయంగా కలకలం రేగింది. ఆయన అరెస్ట్‌ను శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఖండించగా.. బీజేపీ సమర్థించింది. మాలిక్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర వ్యాప్తంగా గురువారం బీజేపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అటు నవాబ్ మాలిక్ అరెస్ట్‌కు నిరసనగా నిర్వహించిన ఆందోళనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో సహా పలువురు మంత్రులు పాల్గొనడం గమనార్హం. కాగా, మంత్రి నవాబ్ మాలిక్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అధికార, విపక్షాల పోటాపోటీ ఆందోళనలతో మహారాష్ట్రలో రాజకీయం మళ్లీ వేడెక్కింది. మొత్తానికి మాలిక్ అరెస్ట్ వ్యవహారం మహారాష్ట్రతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. - సాక్షి వెబ్ ప్రత్యేకం -
ఆర్యన్ కేసులో బీజేపీ హస్తం!
ముంబై: బాలీవుడ్ స్టార్కిడ్ ఆర్యన్ ఖాన్ అరెస్టు కేసు విషయం పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు అంతా బీజేపీ ఆడిస్తున్న నాటకమని, సోదాల్లో ఎన్సీబీ అధికారులతో పాటు బీజేపీ నేత ఒకరు పాల్గొన్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్టకి చెందిన మహారాష్ట్ర మైనార్టీ వ్యవహరాల మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. మరోవైపు ఎన్సీబీ, బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చాయి. ఇప్పటివరకు ఈ కేసులో ఆర్యన్‌తో సహా 17మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. జాతీయ నార్కొటిక్ బ్యూరో జరిపిన ఈ సోదాలన్నీ డ్రామాలని, నకిలీవని నవాబ్ మాలిక్ విమర్శించారు. అసలా నౌకలో డ్రగ్సే దొరకలేదన్నారు. ఈ సందర్భంగా రైడ్ జరుగుతున్నప్పటి కొన్ని వీడియోలను ఆయన విడుదల చేశారు. ఇందులోని ఒక వీడియోలో ఆర్యన్‌ను ఎస్కార్ట్ చేస్తూ గోస్వామి అనే వ్యక్తి కనిపించారు. అయితే అతను ఎన్సీబీ అధికారి కాదని, గోస్వామి సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం అతను ఒక ప్రైవేట్ డిటెక్టివని నవాబ్ ఆరోపించారు. మరో వీడియోలో ఇదే కేసులో అరెస్టయిన అర్బాజ్ మర్చెంట్‌ను ఇద్దరు ఎస్కార్ట్ చేస్తూ కనిపించారు. వీరిలో ఒక వ్యక్తి బీజేపీ సభ్యుడని నవాబ్ చెప్పారు. వీరంతా ఎన్సీబీ అధికారులు కానప్పుడు రైడ్‌లో ఎందుకున్నారని ప్రశ్నించారు. మర్చంట్‌తో పాటు ఉన్న వ్యక్తి గుజరాత్లో సెపె్టంబర్ 21–22 తారీకుల్లో కనిపించాడని, అందువల్ల అతనికి ముంద్రా పోర్టులో దొరికిన డ్రగ్స్‌తో సంబంధం ఉండి ఉండొచ్చని ఆరోపించారు. సదరు వ్యక్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బాలీవుడ్‌ను, తమ ప్రభుత్వాన్ని మకిలిపట్టించేందుకు ఎన్సీబీని బీజేపీ ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు. నవాబ్ అల్లుడు సమీర్ ఖాన్‌ను ఎన్సీబీ డ్రగ్స్ కేసులో గత జనవరిలో అరెస్టు చేయగా, సెపె్టంబర్లో బెయిల్‌పై బయటకు వచ్చారు. అవును.. అక్కడే ఉన్నాను: నౌకలో ఎన్సీబీ సోదాలు జరిపినప్పుడు తాను అక్కడే ఉన్నానని మాలిక్ ఆరోపణల్లో కేంద్రబిందువుగా మారిన మనీశ్ భన్సాలీ తెలిపారు. తాను బీజేపీ కార్యకర్తనేనని, కానీ ఏ నాయకుడిని ఇంతవరకు కలవలేదని తెలిపారు. తనకు, తన కుటుంబానికి పోలీసు రక్షణ కలి్పంచాలని కోరతానన్నారు. ‘‘అక్టోబర్ 1న డ్రగ్స్ పార్టీ గురించి సమాచారం వచ్చింది. దీన్ని ఎన్సీబీకి చెప్పమని నా స్నేహితుడు సూచించాడు. ఈ పార్టీ విషయమై ఎన్సీబీ వద్ద స్వల్ప సమాచారమే ఉంది. మేము మరికొంత అందించాం. అక్టోబర్ 2న రైడ్‌ను ప్లాన్ చేశారు. సాక్షిగా నేను సంఘటనా స్థలంలో ఉన్నాను’’ అని మనీశ్ వెల్లడించారు. ఎన్సీబీ అధికారులతో తాను ఉన్నానని, అందుకే వీడియోల్లో ఎస్కార్ట్ చేస్తున్నట్లు కనిపించిందని ఇండియాటుడేకు ఆయన తెలిపారు. నవాబ్ మాలిక్ మలిన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను దేశం కోసం పనిచేస్తున్నామని, నౌకలో షారూఖ్ కొడుకున్నట్లు తమకు తెలియదని చెప్పారు. వారంతా సాక్షులు తమ ఏజెన్సీపై వస్తున్న ఆరోపణలు నిరాధారాలని, గతంలో తాము చేసిన అరెస్టులకు ప్రతీకారంగా చేస్తున్నవై ఉండొచ్చని ఎన్సీబీ డీఐజీ జ్ఞానేశ్వర్ సింగ్ అభిప్రాయపడ్డారు. తమ విచారణ చట్టబద్ధంగా, పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. రైడ్‌లో ఎన్సీపీ అధికారులతో పాటు గోస్వామి, భన్సాలీతో పాటు ప్రభాకర్, గోమెజ్, ఉస్మానీ, వైగాంకర్, రానే, ప్రకాశ్, ఫయాజ్, ఇబ్రహీంలు పాల్గొన్నారని, వీరంతా సాక్షులుగా వ్యవహరించారని వివరించారు. ఎన్సీబీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆర్యన్ ఖాన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలుండబట్టే కోర్టు అతన్ని కస్టడీకి పంపిందని బీజేపీ ఎంఎల్ఏ అతుల్ అభిప్రాయపడ్డారు. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోతే వెంటనే బెయిల్ వచ్చేదన్నారు. అల్లుడి అరెస్టును మనసులో ఉంచుకొని మాలిక్ ఆరోపణలు చేశారని విమర్శించారు. డ్రగ్స్ కేసులో మరొకరి అరెస్ట్ ముంబైలో క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో ఎన్సీబీ అధికారులు తాజాగా మరొక డ్రగ్ విక్రేతను అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముంబైలోని సబ్–అర్బన్ పోవాయ్‌లో ఈ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీఐ ముంబై జోనల్ అధికారులు బుధవారం వెల్లడించారు. దీంతో, బాలీవుడ్ స్టార్ షారుఖ్‌ఖాన్ కొడుకుసహా మొత్తం 17 మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. కాగా, మంగళవారం అరెస్టయిన నలుగురు ఈవెంట్ ఆర్గనైజర్లు సమీర్ సెహగల్, మానవ్ సింఘాల్, భాస్కర్ అరోరా, గోపాల్ ఆనంద్‌లను 14 తేదీ దాకా ఎస్సీబీ కస్టడీకి పంపుతూ ముంబైలోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నెర్లికర్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. మరోవైపు, అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యులు కొందరు బుధవారం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి వచ్చారు. అరెస్ట్ అయిన అర్బాజ్ మర్చంట్ తండ్రి అస్లాం వారిలో ఉన్నారు. తన కుమారుడు అమాయకుడని ఆయన వ్యాఖ్యానించారు. అర్బాజ్‌కు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫు లాయర్ పిటిషన్ దాఖలుచేశారు. అక్టోబర్ రెండో తేదీన ముంబై పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ వద్ద ఉదయం 11.30 నుంచి రాత్రి 8.30 వరకు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని తెప్పించి, భద్రపరచాలని విన్నవించు కున్నారు. దీనిపై మీ స్పందన తెలపాలని ఎన్సీబీని కోర్టు ఆదేశించింది. -
పవార్‌తో మళ్లీ ప్రశాంత్ కిషోర్ భేటీ
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 8 విపక్ష పార్టీల నేతలు మంగళవానం పవార్ నివాసంలో ప్రత్యేకంగా సమావేశమైన మర్నాడు ఈ భేటీ చోటు చేసుకోవడం విశేషం. పవార్, ప్రశాంత్ కిషోర్ దాదాపు గంటపాటు సమావేశమయ్యారని, గత పక్షం రోజుల్లో వారిమధ్య ఇది మూడో భేటీ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్ 11న ముంబైలో పవార్ నివాసంలో ఒకసారి, ఆ తరువాత తాజాగా సోమవారం ఢిల్లీలోని పవార్ నివాసంలో రెండోసారి వారు సమావేశమయ్యారని వెల్లడించాయి. ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహలున్న విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నారన్న అంచనాల మధ్య ప్రశాంత్ కిషోర్, పవార్ల మధ్య వరుస భేటీలు జరగడం ఆసక్తికరంగా మారింది. పవార్ నివాసంలో మంగళవారం జరిగిన విపక్ష నేతల సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, ఆర్ఎల్డీ, నేషనల్ కాన్ఫెరెన్స్, లెఫ్ట్ పార్టీలు పాల్గొన్న విషయం తెలిసిందే. అది రాజకీయేతర సమావేశమని అందులో పాల్గొన్న పలువురు నేతలు పేర్కొన్నారు. -
అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎస్ సిపీ) నాయకుడు అనిల్ దేశ్‌ముఖ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆయన భారీగా ముడుపులు డిమాండ్ చేసినట్లు ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అనిల్ దేశ్‌ముఖ్‌పై దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. నిందితుడితో పాటు గుర్తు తెలియని వ్యక్తులపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి బలమైన ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ముంబై, నాగపూర్‌లో అనిల్ దేశ్‌ముఖ్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఆయన వ్యక్తిగత సహాయకుడి నివాసంలోనూ సోదాలు జరిపారు. చదవండి: ప్రాణవాయువును అడ్డుకుంటే ఉరి తీస్తాం! -
ఆ పదవిపై ఆసక్తి లేదు: శరద్ పవార్
న్యూఢిల్లీ : యూపీఏ(యునైడెట్ ప్రోగ్రెసివ్ అలియాన్సెస్) అధ్యక్షుడిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ బాధ్యతలు చేపట్టనున్నారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై శరద్ పవార్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ అధ్యక్ష బాధ్యతలు చేపట్టటానికి తనకు ఎలాంటి ఆసక్తి లేదని తేల్చిచెప్పారు. రైతుల ఉద్యమంపైనుంచి దృష్టిని మళ్లించటానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు. యూపీఏ అధ్యక్షుడిగా తన పేరు తెరపైకి రావటంపై ఆయన గతంలోనూ క్లారిటీ ఇచ్చారు. అయితే శివసేన మాత్రం శరద్ పవార్‌వైపే మొగ్గుచూపుతోంది. దీనిపై కూడా పవార్ స్పందించారు. ఒకవేళ శివనసేన తన పేరును సూచిస్తే అది ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయం మాత్రమేనని, తనది కాదని స్పష్టం చేశారు. ( మరో బాంబు పేల్చిన నితీష్ కుమార్..) దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ యూపీఏ అధ్యక్షుడిగా శరద్ పవార్ ఎన్నికవుతారని నేననుకోవటం లేదు. రెండు పార్టీలు కలిసి ఓ నిర్ణయం తీసుకుని అధ్యక్షుడ్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ యూపీఏ అధ్యక్షుడి ఎన్నిక మాత్రమే జరుగుతుంది, ప్రధాని అభ్యర్థి ఎన్నిక కాదు’’ అని అన్నారు. -
‘పాక్ కాదు.. చైనానే డేంజర్’
సాక్షి, ముంబై: భారత్, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా సైనిక శక్తి భారత్ కంటే పది రెట్లు బలీయమైనదని తెలిపారు. ఆయన శివసేన పత్రిక 'సామ్నా' ఇంటర్వ్యూలో దేశ బధ్రకు సంబంధించిన అంశాలపై విశ్లేషించారు. దేశానికి ప్రథమ శత్రువు పాకిస్తాన్ అని అందరు భావిస్తారు కానీ, పాక్ కంటే చైనాతోనే దేశానికి ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. చైనా పర్యటనలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌లు షేక్ హ్యాండ్స్ ఇవ్వడం ద్వారా ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారం కావని అన్నారు.అయితే రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని, చైనాను అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చి, దేశ సమస్యను పరిష్కరించాలని సూచించారు. గత కొన్ని రోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు చైనా పాక్ దేశాలు మాత్రమే భారత్‌కు శత్రువులు కావని, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు కూడా భారత్‌కు శత్రు దేశాలే అని అన్నారు. బంగ్లాదేశ్‌లోని అంతర్గత సమస్యను భారత్ పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే బంగ్లాదేశ్ మాత్రం చైనాతో ఒప్పందాలు చేసుకుంటుందని ద్వజమెత్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ముఖ్య అంశాలలో సైతం ప్రతిపక్షాలను సంప్రదించడం లేదని శరద్ పవార్ విమర్శించారు. (చదవండి: నేనేమీ రిమోట్ కంట్రోల్‌ని కాదు: శరద్ పవార్) -
మహా సంకీర్ణం : రైతు సంక్షేమం, ఉపాధే అజెండా
ముంబై : రైతులు, ఉపాధి కల్పనే ప్రధాన అజెండాగా మహారాష్ట్రలో కొలువుతీరే ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన కూటమి ప్రభుత్వం కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) విడుదల చేసింది. అకాల వర్షాలు, వరదల వల్ల భారీగా నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయం, వ్యవసాయ రుణాల రద్దు, పంటల బీమా పథకంతో పాటు రైతులకు గిట్టుబాటు ధరల కల్పనకు పెద్దపీట వేయనున్నట్టు సీఎంపీ వెల్లడించింది. కరువు పీడిత ప్రాంతాలకు నీటి సరఫరాపై నిర్ధిష్ట చర్యలు చేపడతామని పేర్కొంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ సత్వరమే భర్తీ చేస్తామని తెలిపింది. అర్హులైన నిరుద్యోగ యువతకు ఫెలోషిప్ మంజూరు, స్ధానిక యువతకు ఉద్యోగాల్లో 80 శాతం రిజర్వేషన్ కోసం చట్టం తీసుకువస్తామని సీఎంపీలో పొందుపరిచారు. బాలికలకు ఉచిత విద్య, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని కూటమి నేతలు సీఎంపీలో ప్రస్తావించారు. -
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే!!
ముంబై: మహారాష్ట్రలో కొత్త పొత్తు పొడిచే అవకాశం కనిపిస్తోంది. బీజేపీతో కటీఫ్ చెప్పిన శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతునిస్తామని ఎన్సీపీ ఇప్పటికే స్పష్టంచేయగా.. కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగానే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో చర్చించిన తర్వాత ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయమై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తన నివాసంలో పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. శివసేన ప్రభుత్వాన్ని బయటినుంచి మద్దతునివ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నిర్ణయం కోసం వేచిచూస్తున్న శివసేన ప్రభుత్వ ఏర్పాటులో తమకు మరికొంత గడువు ఇవ్వాలని గవర్నర్ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు గవర్నర్ బీఎస్ కోశ్యారీని కలిశారు. (చదవండి: శివసేనకు ట్విస్ట్ ఇచ్చిన కాంగ్రెస్..!) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటకు మ్యాజిక్ ఫిగర్ 145 కాగా.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. మరో ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా శివసేన సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు పలికారు. దీంతో సంకీర్ణ కూటమి బలం 160కి చేరుకుంది. దీంతో సునాయసంగా సేన కూటమి సునాయసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో సేన నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది ఆసక్తి రేపుతోంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సీఎం అవుతారన్న వాదన వినిపిస్తోంది. ఎన్సీపీ కూడా ఇదే డిమాండ్ చేస్తోందని, ఉద్ధవ్‌ను సీఎం చేయాలని, అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలని ఎన్సీపీ పట్టుబడుతున్నట్టు సమాచారం. అయితే, సీఎం పదవి కోసం గట్టిగా లాబీయింగ్ చేస్తున్న ఓ సీనియర్ శివసేన నేత.. ఠాక్రే సీఎం అయితే, తిరుగుబాటును లేవనెత్తవచ్చునని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. -
వడివడిగా అడుగులు.. ఠాక్రే-పవార్ కీలక భేటీ!
ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన రంగం సిద్ధం చేసింది. ఈ కూటమికి కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు పార్టీలు కలిస్తే అలవోకగా మ్యాజిక్ ఫిగర్‌ను అధిగమించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. ఈ క్రమంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి.. అత్యంత కీలకమైన ఈ భేటీలో పదవులు పంపకాలపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. పదవుల పంపకాల్లో భాగంగా శివసేన ముఖ్యమంత్రి పదవిని చేపట్టనుండగా.. ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌కి అసెంబ్లీ స్పీకర్ వంటి కీలక పదవులను సేన ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక, రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సాయంత్రం 5గంటలకు శివసేన నేతలు గవర్నర్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. ఇక, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి గట్టి ప్రతిపక్షంగా ముచ్చెమటు పట్టించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం పదవిపై మిత్రపక్షం శివసేనతో రాజీ కుదరకపోవడంతో ప్రతిపక్షంలో ఉండేందుకు బీజేపీ సిద్ధమైంది. రెబల్ ఎమ్మెల్యేలను కూడా తనవైపు తిప్పుకొని.. గట్టి ప్రతిపక్షంగా సేన కూటమిని ఎదుర్కోవాలని బీజేపీ భావిస్తోంది. -
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం..
గౌహతి : మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్న మేఘాలయలో భద్రత బలగాలు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ని మట్టుబెట్టాయి. ఉగ్రసంస్థ గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ(జీఎన్ఎల్ఏ) చీఫ్ కమాండర్ సోహన్, భద్రతా దళాలు జరిపిన భీకర ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఫిబ్రవరి 27న మేఘాలయలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో ఈ ఎన్కౌంటర్ జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. గారో హిల్స్‌లో సోహన్ చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. గారోహిల్స్ పోలీసు, మేఘాలయ స్పెషల్ ఫోర్స్-10 కమాండోస్ సంయుక్తంగా జరిపిన ఎన్కౌంటర్లో ఉదయం 11.50కి సోహన్ మృతిచెందాడు. గత ఆదివారం ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జొనాథోన్ ఎన్ సంగ్మాతోపాటు మరో ముగ్గురిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు జరిపిన ఆ బాంబు దాడిని, పోలీసులు తీవ్రంగా పరిగణించారు. 27వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రజలను భయపెట్టేందుకే తీవ్రవాదులు ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ప్రత్యేక భద్రతా బలగాలను రంగంలోకి దించారు. ఆ ప్రాంతంలో తీవ్ర గాలింపు చేపట్టిన భద్రతా బలగాలు ఉదయం జరిపిన ఎన్కౌంటర్లో సోహన్‌ని అంతమొందించాయి. 2009లో ఏర్పడిన జీఎన్ఎల్ఏ గారో ల్యాండ్ సౌరభౌమాధికారం కోసం పోరాడుతుంది. -
‘మా నాయకుడు రాష్ట్రపతి రేసులో లేరు’
న్యూఢిల్లీ: తమ పార్టీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి రేసులో లేరని నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డీపీ త్రిపాఠి స్పష్టం చేశారు. 2017 జూలై నెలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో శరద్‌పవార్ నామినేషన్ వేయనున్నారని వచ్చిన ఊహాగానాలకు తెరదించారు. ‘పవార్ మా పార్టీ అధ్యక్షుడు. పార్లమెంటరీ నేత. ఇప్పుడు రాష్ట్రపతి పదవికి సంబంధించిన ప్రశ్నే లేదు. ఆ పదవికి పోటీ చేసేందుకు చాలామంది ఉన్నారు’ అని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న శరద్ పవార్ తన ప్రస్తానంలో ఎన్నో కీలక పదవులు అలంకరించారు. ఆయనకు మహారాష్ట్ర స్ట్రాంగ్ మ్యాన్‌గా పేరుంది. గతంలో కూడా తాను రాష్ట్రపతి పదవి రేసులో లేనని పవార్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
'ఒకే చోట కూర్చోవడం నాకు అసహ్యం'
పుణె: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కోలుకున్నారు. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు పుణెలోని రూబీ హాల్ ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల కిందట అనారోగ్యం కారణంగా ఆయన రూబీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు 76 గంటలపాటు విశ్రాంతాఇ తీసుకోవాలని సూచించారు. దీంతో ఆయన మూడు రోజులవరకు ఆస్పత్రిలోనే ఉన్నారు. బుధవారం ఉదయం చేసిన వైద్య పరీక్షలు ఆయన ఆరోగ్యం సాధారణంగానే ఉందని తేలడంతో డిశ్చార్జి చేశారు. ఈ నేపథ్యంలో పవార్ కూడా మీడియతో మాట్లాడారు. 'వచ్చే రెండు నెలల్లో నాకు ఏమాత్రం ఖాళీ లేకుండా వరుస పర్యటనలు ఉన్నాయి. నేను ఎలా విశ్రాంతి తీసుకోగలను. ఒకే చోట చాలా సేపు కూర్చొవడాన్ని నేను అసహ్యంచుకుంటాను' అని పవార్ చెప్పారు. హెలికాప్టర్ ద్వారా ఆయన ఈ రోజు ముంబయికి చేరుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఎన్సీపీ చీఫ్‌గా పవార్
ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రకటన పట్నా: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడిగా మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ (74) తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ ఆరో జాతీయ సమావేశాల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి టీపీ పీతాంబర్ ప్రకటించారు. 1999లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి ఎన్సీపీని స్థాపించినప్పటి నుంచి పవారే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీ 16వ వార్షికోత్సవాల సందర్భంగా బుధవారమిక్కడ నిర్వహించిన జాతీయ సమావేశాలకు పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. అజిత్ గైర్హాజరీపై నాయకులను ప్రశ్నించగా తమకు సమాచారం లేదని చెప్పారు. 700 మంది ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో పవార్ మాట్లాడుతూ, ప్రధాని మోదీపై విమర్శలు సంధించారు. విదేశీ గడ్డపై దేశ రాజకీయాల గురించి మాట్లాడుతూ మోదీ భారత్ పరువు మంట గలుపుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో కాషాయ ఎజెండాను, భావజాలాన్ని రుద్దుతున్నారంటూ నిప్పులు చెరిగారు. దీన్ని పెను సవాల్‌గా స్వీకరించి ఎన్సీపీ అడ్డుకుంటుందన్నారు. మతవాద శక్తులకు అడ్డుకట్ట వేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పవార్ హెచ్చరించారు. రానున్న బిహార్ ఎన్నికలు దేశ రాజకీయాలను నిర్దేశిస్తాయని, దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ప్రతి భారీ మార్పు బిహార్ నుంచే వస్తుందని చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత సామరస్యం దెబ్బతినిందన్నారు. -
ఎన్సీపీ ప్రక్షాళన ప్రారంభం
- రాష్ట్ర, నగర అధ్యక్షులను మార్చాలని నిర్ణయం - మైనార్టీ నేత నవాబ్ మాలిక్‌కు ముంబై పగ్గాలు - బీఎంసీ ఎన్నికల నేపథ్యంలో కీలక మార్పులు సాక్షి, ముంబై: పార్టీ ప్రక్షాళన దిశగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధిష్టానం అడుగులేస్తోంది. రాష్ట్ర, ముంబై రీజియన్ అధ్యక్షులను మార్చాలని సోమవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ముంబై రీజియన్ అధ్యక్ష పదవిలో ప్రస్తుత పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్‌ను నియమించాలని పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర ప్రదేశ్ అధ్యక్ష పదవి కోసం దిలీప్ వల్సే పాటిల్, మరికొందరి పేర్లు తెరమీదకు వచ్చాయి. నగరంలో బుధవారం జరగనున్న సమావేశంలో ఎన్సీపీ కార్యవర్గ విస్తరణ జరగనుంది. ఇందులో ముంబై రీజియన్ అధ్యక్షుడిగా మలిక్ పేరును ఖరారు చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు 25 స్థానాల్లో విజయ ఢంకా మోగించారు. దీంతోృబహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో నిలుపుతామని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఒవైసీ ప్రకటనతో అప్రమత్తమైన ఎన్సీపీ.. భవిష్యత్ సమస్యల పరిష్కారానికి ఇప్పుడే పార్టీ ప్రక్షాళన చేయాలని భావించింది. ఈ నేపథ్యంలో ముంబైలోని మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు నగర పార్టీ పగ్గాలను నవాబ్ మలిక్ కట్టబెట్టాలని ఎన్సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎన్సీపీ దెబ్బకు డీలా.. గత వారం జరిగిన ఔరంగాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం కారణంగా ఎన్సీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఎన్సీపీ 70 స్థానాల్లో పోటీచేయగా కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే చోట ఎంఐఎం 53 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 25 స్థానాలు గెలుచుకుని ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ముంబైలో ఎన్సీపీ బలం అంతంత మాత్రమే ఉంది. ఇటువైపు ఉత్తరాది ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సంజయ్ నిరుపంకు ముంబై రీజియన్ పగ్గాలు కట్టబెట్టింది. ఇదే తరహాలో మైనార్టీలను ఆకర్షించేందుకు ఎన్సీపీ ముంబై రీజియన్ అధ్యక్ష పదవి బాధ్యతలు నవాబ్ మాలిక్‌కు అప్పగించనుంది. నవాబ్కు ఉత్తరాది, మైనార్టీలతో మంచి సంబంధాలున్నాయి. ఈ నెల 11న బాంద్రా తూర్పు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ రాణేకు ముస్లిం ఓట్లు పోలవడానికి నవాబ్ మలిక్ కారణమని ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. అలాగే ఎన్సీపీ మహిళ ప్రదేశ్ అధ్యక్ష పదవిలో చిత్రా వాఘ్ ను నియమించే అవకాశాలు ఉన్నాయి. దీనికి బుధవారం ఆమోద ముద్ర వేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
న్యూఢిల్లీ: మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర కేబినెట్ శనివారం సిఫార్సు చేయగా.. దీనికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి పాలన విధింపు ప్రకటనపై ప్రణబ్ సంతకం చేసినట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు ఆదివారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో 15 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) మద్దతు ఉపసంహరించడంతో.. పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడడం, దీంతో సీఎం పదవికి చవాన్ రాజీనామా చేయడం తెలిసిందే. -
ఎన్సీపీ నేత హత్యకేసు పునర్విచారణ
సాక్షి, ముంబై: 2004లో జరిగిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు విలాస్ జాదవ్ హత్య కేసు విచారణ మళ్లీ ప్రారంభమైంది. వచ్చే నెలలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో శివసేన తరఫున ఏరోలి నియోజక వర్గం నుంచి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న విజయ్ చౌగులే ఇబ్బందుల్లో పడిపోయారు. ఈ హత్య కేసుతో చౌగులేతోపాటు మరో ఇద్దరికి సంబంధాలున్నాయని అప్పట్లో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. చివరకు తగిన సాక్షాధారాలు లభించకపోవడ ం వల్ల వీరంతా నిర్దోషులుగా విడుదలయ్యారు. కానీ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మళ్లీ విచారణ ప్రారంభించారు. తప్పకుండా తమకు న్యాయం జరుగుందని అతని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వివాదాల కారణంగానే.. నవీ ముంబైలోని దిఘా రామ్‌నగర్ ప్రాంతంలో ఉంటున్న విలాస్ జాదవ్, విజయ్ చౌగులే మధ్య రాజకీయ వివాదం ఉంది. పలుమార్లు జాదవ్ ఇంటిపై దాడులు కూడా చేసినట్లు అప్పట్లో చౌగులే పై ఆరోపణలు వచ్చాయి. చివరకు 2004 జూలై ఏడో తేదీన జాదవ్ హత్యకు గురికావడంతో ఇది చౌగులే చేశాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తరువాత ఈ కేసు పలుమార్లు కోర్టుకు విచారణకు వచ్చినప్పటికీ తగిన సాక్షాలు లేకపోవడంతో ఇతనితోపాటు మరో ఇద్దరు సహచరులు నిర్ధోషులుగా విడుదలయ్యారు. ఈ హత్య తమ కళ్ల ముందే చేశారని ఆరోపిస్తూ మరోసారి బాధితులు కోర్టులో అపిల్ చేసుకున్నారు. ఈ కేసు పునర్విచారణ జరపాలని 2012 సెప్టెంబర్ 23న అత్యున్నత న్యాయస్థానం హై కోర్టును ఆదేశించింది. ఆ ప్రకారం ఈ హత్యకేసు ఇప్పుడు మళ్లీ విచారణకు రావడం చర్చనీయాంశమైంది. -
ఎన్సీపీ ఎమ్మెల్యే ధోబ్లేపై రేప్ కేసు
ముంబై: మహారాష్ట్రలో అక్టోబర్ 15న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి లక్ష్మణ్‌రావ్ ధోబ్లేపై అత్యాచార కేసు నమోదైంది. ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న నలంద కాలేజీలో క్లర్క్‌గా పని చేస్తున్న 42 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు శనివారం ధోబ్లేపై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫిర్యాదు ప్రకారం.. దోబ్లే బాధితురాలు పని చేస్తున్న కాలేజీకి ట్రస్టీ. 2011-13 మధ్య ధోబ్లే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఈ విషయం ఎవరికైనా చెపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, తన ఫొటోలను బయటపెడతానని బెదిరించాడని ఆమె పేర్కొంది. ఈ ఆరోపణలను ధోబ్లే ఖండించారు. -
కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరైన ఎమ్మెన్నెస్
సాక్షి, ముంబై: నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ)లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారి తారుమారు అయ్యాయి. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా (ఎమ్మెన్నెస్)తో బీజేపీ తెగతెంపులు చేసుకుంది. గతంలో ఎమ్మెన్నెస్, బీజేపీ మిత్రపక్షాలుగా ఏర్పడి ఎన్ఎంసీలో అధికారం చేజిక్కించుకున్నాయి. కానీ బీజేపీ ఎమ్మెన్నెస్‌తో తెగతెంపులు చేసుకుని మిత్రపక్షమైన శివసేనతో పొత్తు కుదర్చుకుంది. శివసేన మేయర్ పదవికి, బీజేపీ డిప్యూటీ మేయర్ పదవికి నామినేషన్లు వేశాయి. ఇక చేసేది లేక ఒంటరైన ఎమ్మెన్నెస్, శరద్ పవార్ నేతత్వంలోని నేషనలిస్టు కాంగ్రె స్ పార్టీ (ఎన్సీపీ)తో జతకడుతుందా..? అనేది తేలాల్సి ఉంది. ఎమ్మెన్నెస్ తరఫున నలుగురి నామినేషన్లు ఎన్ఎంసీకి ఈ నెల 12న మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అండతో ఎమ్మెన్నెస్ అధికారం చేజిక్కించుకుంది. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లలో నాసిక్ ఒకటే ఎమ్మెన్నెస్ అధీనంలో ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా దూరం కావడంతో ఎమ్మెన్నెస్ ఇబ్బందుల్లో పడిపోయింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు మంగళవారం 11-2 గంటల మధ్య నామినేషన్లు వేయాలి. బీజేపీ తమతో జతకట్టడం లేదని తేలిపోయిన తర్వాత ఎమ్మెన్నెస్ తరఫున నల్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బీజేపీకి సంబంధించిన వారెవరు లేరు. కొద్ది సేపటికి బీజేపీ, శివసేన, ఆర్పీఐ కార్పొరేటర్లు భారీగా బలప్రదర్శన చేస్తూ కార్పొరేషన్ భవనానికి చేరుకున్నారు. మూడు గంటల్లోనే రాజకీయ సమీకరణాలు మారిపోవడం అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తింది. నాసిక్‌లో ఆకస్మాత్తుగా చోటుచేసుకున్న పరిణామాల వల్ల పోటీ మరింత ఉత్కంఠకు దారితీసింది. ఎన్సీపీతో దోస్తీకి ప్రయత్నం.. ఎమ్మెన్నెస్ ఆధీనంలో ఉన్న ఒక్క కార్పొరేషన్ కూడా చేజారి పోవడం ఖాయమని తెలుస్తోంది. వచ్చే శాసన సభ ఎన్నికల్లో పరిణామాలు ఎలా ఉంటాయోనని ఎమ్మెన్నెస్‌కు దిగులు పట్టుకుంది. ఎలాగైన అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తెర వెనక నుంచి చక్రం తిప్పాలని యోచిస్తోంది. నాసిక్ కార్పొరేషన్లో ఎన్సీపీకి 20 మంది కార్పొరేటర్ల సంఖ్యా బలముంది. అధికారం కోసం ఎమ్మెన్నెస్ ఎన్సీపీతో జతకట్టే అవకాశాలు లేకపోలేదు. మరోపక్క 14 మంది సంఖ్యా బలం ఉన్న కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు తమ వైఖరి స్పష్టం చేయలేదు. బలాబలాలు ...... ఎమ్మెన్నెస్-39, శివసేన, ఆర్పీఐ-23, బీజేపీ-15, ఎన్సీపీ-20, కాంగ్రెస్-14, ఇండిపెండెంట్లు-6, మార్క్స్‌వాది కమ్యూనిస్టు పార్టీ -3, జనరాజ్య-2 ఇలా మొత్తం 122 స్థానాలున్నాయి. -
కలిసే ఎన్నికలకు వెళ్దాం..
సాక్షి, ముంబై: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీలు కలిసే కూటమిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాయి. పొత్తు విషయమై కూడా ఇరు కాంగ్రెస్‌ల మధ్య సయోధ్య కుదిరినట్లే కనిపిస్తోంది. సీట్ల పంపకాల విషయమై తుది నిర్ణయం తీసుకోకపోయినా కలిసే పోటీ చేయాలని పార్టీ అధినేతలు సోనియా, శరద్‌పవార్ నిర్ణయించారు. ఎన్సీపీ అధ్యక్షులు శరద్‌పవార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోని యాగాంధీతో ఢిల్లీలోని ఆమె నివాసస్థానంలో బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో మరో రెండు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంపై చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీల పొత్తు విషయంపై నెలకొన్న ఉత్కంఠతకు తెరపడినట్టేనని రాజకీయనిపుణులు చెబుతున్నారు. అయితే సీట్ల పంపకాల విషయంపై మాత్రం ఇరు పార్టీల అధ్యక్షులు ఎలాంటి చర్చ లు జరపలేదు. దీంతో తొందర్లోనే ఈ విషయంపై చర్చలు జరిపి.. ఎవరెన్ని సీట్లలో పోటీ చేయనున్నారనేది స్పష్టం చేయనున్నారు. సీట్ల పంపకాలపై చర్చలు కూడా ఢిల్లీలోనే జరగనున్నాయని తెలిసింది. రాష్ట్రంలోని మొత్తం 288 అసెం బ్లీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 174 సీట్లలో పోటీ చేయగా ఎన్సీపీ 114 సీట్లలో పోటీచేసింది. అయితే ఈసారి లోకసభలో కాంగ్రెస్ కంటే అధికంగా సీట్లు వచ్చాయని, దీంతో తమకు 144 సీట్లు కేటాయించాలని రాష్ట్రం లోని ఎన్సీపీ నాయకులు డిమాండ్ చేస్తుండగా కాంగ్రెస్ మాత్రం అందుకు ససేమిరా అంటున్న సంగతి తెలిసిందే. శరద్‌పవార్ సోదురుని కుమారుడైన అజిత్‌పవార్, మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షులు సునీల్ తట్కరేలు ఎన్సీపీకి 144 స్థానాలను ఇవ్వాల్సిందేనని, లేదంటే ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. సీఎం పృథ్వీరాజ్ చవాన్,ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే రాష్ట్రంలోని 288 స్థానాలలో పోటీ చేసేందుకు కసరత్తులు కూడా చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాం గ్రెస్, ఎన్సీపీలు వేర్వేరుగా పోటీ చేసేఅవకాశాలున్నాయని అం దరూ భావించారు. కానీ సోనియా, శరద్‌పవార్ భేటీ తర్వాత పొత్తు విష యం ఖరారైంది. -
ఓ నిర్ణయానికొచ్చిన ఎన్నికల కమిషన్
సాక్షి, ముంబై: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికలను దీపావళికి ముందే నిర్వహించాలని ఎన్నికల సంఘం ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అక్టోబర్ 13 నుంచి 18వ తేదీ లోపు రెండు దశల్లో పూర్తిచేసి ఫలితాలు వెల్లడించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్, జాతీయవాద కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)ల నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం గడువు డిసెంబర్ 7వ తేదీతో ముగుస్తుంది. హర్యానా ప్రభుత్వం గడువు కూడా అక్టోబర్ 27తో ముగియనుంది. దీంతో ఆలోపే ఇరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలవైపు మళ్లింది. గత పదేళ్ల కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన విషయం తెలిసిందే. ప్రతిపక్ష హోదా కూడా అతికష్టం మీద దక్కించుకున్న కాంగ్రెస్‌కు, తిరుగులేని మెజార్టీ సాధించిన బీజేపీకి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పెద్ద సవాలే. దీంతో దేశం మొత్తం కూడా ఈ ఎన్నికలవైపు చూస్తోంది. ఎన్నికల గురించి కమిషన్ ఎటువంటి కసరత్తు మొదలు పెట్టకముందే ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. కాగా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన తతంగమంతా పూర్తి కావడంతో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించిన ఎన్నికల సంఘం మరో రెండు నెలల్లో పక్కా షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల కమిషన్ ఈ ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. ఈ నెలాఖరు వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకులతో ఎన్నికల తేదీలపై చర్చలు జరిపి వారి అభిప్రాయాన్ని సేకరించనుంది. అందుకు ముంబైలో ఈ నెల 20వ తేదీన అన్ని రాజ కీయ పార్టీలతో సమావేశం నిర్వహించే అవకాశాలున్నట్లు తెలిసింది. సెప్టెంబర్‌లో గణేశ్ ఉత్సవాలు జరుగనుండడంతో ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించవద్దంటూ ఇదివరకే రాజకీయ పార్టీలతోపాటు సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో గణేశ్ ఉత్సవాలు ముగిసిన తర్వాత, దీపావళి ముందు అంటే రెండు పండుగల మధ్యలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ యోచిస్తోందని, అక్టోబర్ 21 నుంచి దీపావళి పండుగ మొదలవుతుండడంతో మహారాష్ట్రలో దీపావళికి ముందే ఎన్నికల తంతు పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో డిసెంబరు 7వ తేదీ గడువు ముగిసేలోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినంత సమయం దొరుకుతుందని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. కార్యకర్తలను ఉత్తేజపరుస్తాం: తట్కరే ముంబై: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపుతామని ఎన్సీపీ రాష్ట్రాధ్యక్షుడు సునీల్ తట్కరే తెలిపారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పాల్ఘర్లో ఈ నెల 1వ తేదీన కార్యకర్తలతో సమావేశం నిర్వహించామని, 4న అహ్మద్‌నగర్‌లో నిర్వహించనున్నామని, ఆ తర్వాత 5న డోంబివలి, ఠాణేలో, జల్గావ్లో 6న నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశాలు సామాన్యులను పార్టీకి దగ్గర చేసేందుకేనని చెప్పారు. కాంగ్రెస్-ఎన్సీపీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరిస్తామన్నారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సమావేశాల ద్వారా అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకుంటామని చెప్పారు. పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు సుహృద్భావ వాతావరణం నెలకొల్పే ప్రయత్నం చేస్తామన్నారు. నేతలు నిజాయతీగా నడుచుకునేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామన్నారు. సమావేశాలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలంద రూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చేసేదే ప్రజలకు చెబుతామని, మోడీలాగా కల్లబొల్లి మాటలు చెప్పి మోసగించమన్నారు. మంచి రోజులు ముందున్నాయని చెప్పిన మోడీనుద్దేశించి మాట్లాడుతూ... ‘ఏవి మంచిరోజు లు.. మీరు అధికారంలోకి వచ్చాక ఇంధనం ధరలు పెంచేశారు. రైలు చార్జీలు పెంచేశారు. ఇవేనా మంచిరోజులు?’ అని ప్రశ్నించారు. -
మోగింది ఎన్నికల నగారా
సాక్షి, ముంబై: విధాన పరిషత్ (లెజిస్లేటివ్ కౌన్సిల్) పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఇది వరకే తమ అభ్యర్థులను ప్రకటించగా మిత్రపక్షమైన కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు పేర్లను వెల్లడించలేదు. దీంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. గవర్నర్ కోటాలో నియమితులయ్యే 12 మందిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్, ఎన్సీపీలు పేర్లను ప్రకటించకపోవడంతో ఆశావహుల్లో అయోమయం నెలకొంది. పుణే, ఔరంగాబాద్ విధాన పరిషత్‌లోని పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి జూన్ 20న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కలసి పోటీ చేయనున్నాయి. ఆ ప్రకారం ఎన్సీపీ రెండు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఎన్సీపీ తమ కోటాలోని ఔరంగాబాద్ నుంచి సతీష్ చవాన్‌కు మళ్లీ అవకాశమివ్వగా, పుణే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సారంగ్ పాటిల్‌కు అవకాశమిచ్చింది. కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న వారిలో ఆందోళన ఎక్కువవుతోంది. అదేవిధంగా పుణే ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి పోటీకి మనీషా పాటిల్, రాజ్మానే పాటిల్, ప్రకాశ్ పాటిల్ ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి ఉపాధ్యాయ నియోజక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ తావ్డే కుమారుడు ప్రకాశ్ తావ్డే, నాగపూర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బబన్‌రావ్ తావ్డే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నాగపూర్ నియోజక వర్గం నుంచి పోటీకి బీజేపీ ప్రకాశ్ సోలే పేరు ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఈ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. సీట్ల కేటాయింపుపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మధ్య రెండుసార్లు చర్చలు జరిగాయి. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల పేర్లను ఇంకా ప్రకటించలేదు. -
మున్ముందు బీజేపీకి తలబొప్పికట్టేనేమో!
సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి చరిత్రాత్మక విజయం నేపథ్యంలో బీజేపీలోకి వలసల పర్వం మొదలైంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్ల విషయంలో బీజేపీకి తలబొప్పికట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇది ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇప్పటి నుంచే ఆందోళనకు గురిచేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకుగాను 42 స్థానాలను మహాకూటమి గెలుచుకుంది. కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నాయకులతోపాటు దిగ్గజాలను బరిలో దింపింది. అయితే నరేంద్ర మోడీ సునామీలో ఇతర పార్టీల ఎత్తులు, హామీలు కొట్టుకుపోయాయి. ఫలితంగా ఇరుపార్టీలు కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ 42 లోక్‌సభ స్థానాల పరిధిలోకి 240 శాసనసభ స్థానాలు వస్తాయి. ఈ నియోజక వర్గాల్లో కాంగ్రెస్, ఎన్సీపీ అభ్యర్థులకు అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయి, దీంతో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆ రెండు పార్టీలకు చెందిన ఔత్సాహిక అభ్యర్థులు ఆందోళనలో పడిపోయారు. లోక్‌సభ ఎన్నికల ఓట్ల శాతాన్ని బట్టిచూస్తే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తక్కువ శాతం ఓట్లు పోలవుతాయని భావిస్తున్నారు. దీంతో ఓటమి తథ్యమని ఇప్పటికే కొందరు ఓ నిర్ణయానికి వస్తున్నారు. దీంతో పార్టీలో తమ పరిస్థితి ఏమిటనే అంశంపై దిగులు పట్టుకుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పార్టీని వీడే యోచనలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడికాగానే కొందరు మహాకూటమిలో చేరిన విషయం తెలిసిందే. ఇలా ఇతర పార్టీల నుంచి వలసలు వస్తుండడం దశాబ్దాలనుంచి బీజేపీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలకు మింగుడు పడడంలేదు. గత 15 సంవత్సరాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారంలో ఉంది. దీంతో శివసేన, బీజేపీ నాయకులకు పదవులు దక్కలేదు. వీరంతా కేవలం పార్టీ పటిష్టతకోసమే కృషి చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోయింది. దీంతో అనేక మంది ఎమ్మెల్యే, ఇతర పదవులను ఆశిస్తున్నారు. అయితే ఓటమిని ముందే గ్రహించిన కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి చెందిన కొందరు న కొందరు మహాకూటమిలో చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొందరు బీజేపీ, శివసేన నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ అదే జరిగితే వారికి కూడా ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు తలెత్తితే తాము అన్యాయమైపోతామని ఆందోళన చెందుతున్నారు. -
దమ్ముంటే పోటీ చేయ్
సాక్షి, ముంబై: ఒక్కసారి...ఒకే ఒక్కసారి ఎన్నికల్లో పోటీచేసి చూడు, నీ స్థానమేంటో రాష్ట్ర ప్రజలు చూపిస్తారని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ సవాల్ విసిరారు. నాసిక్‌లో ఎన్సీపీ లోక్‌సభ అభ్యర్థి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఛగన్ భుజ బల్కు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో పవార్ పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడుతున్నానని తనపై ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘బాలుడా (ఉద్ధవ్) నేను 14 సార్లు వివిధ ఎన్నికల్లో పోటీచేశాను. 14 సార్లు గెలిచాను కూడా. ఉద్ధవ్ ఒంటెపై కూర్చుండి నేను చాలా ఎత్తు ఎదిగానని విర్రవీగుతున్నాడు. ఏ పార్టీని చూసుకుని విర్రవీగుతున్నావో ఆ పార్టీ ఎవరు స్థాపించారో తెలుసా..? శివసేన పార్టీని మీ తండ్రి, దివంగత అధినేత బాల్‌ఠాక్రే స్థాపించారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి గుర్తింపు రావడానికి అందుకు ఆయన ఎంతో కృషి చేశార’ని పవార్ గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడేవాడినైతే 14 సార్లు పోటీ ఎలా చేస్తాను..? ఎలా గెలుస్తాను..? అని ఉద్ధవ్‌ను నిలదీశారు. ‘ఎన్నికలంటే తనకు భయమని చెప్పడం కాదు, జీవితంలో ఒక్కసారైన ఎన్నికల్లో పోటీ చేసి చూపించు. దిగితే తప్ప బావి లోతు తెలియదంటారు. ఎన్నికల బరిలోకి దిగి చూపించు....ఎవరికి భయమేస్తుందో తెలుస్తుంద’ ని ఆయన చురక అంటించారు. ఈ సభలో పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే, వినాయక్ పాటిల్, ఎంపీ సమీర్ భుజబల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్‌రావ్ కోకాటే, ఎన్సీపీ కార్యధ్యక్షుడు జితేంద్ర అవ్హాడ్, మాజీ మంత్రులు తుకారాం దిఘోలే, లక్ష్మణ్ డోబలే తదితరులు పాల్గొన్నారు. -
'మోడీని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి'
సాధారణ ఎన్నికలు మరో వారం రోజులలో ప్రారంభమవుతున్న తరుణంలో రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శల దాడిని రోజురోజుకు పెంచుతున్నారు. అందులోభాగంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఎన్సీపీ నేత శరద్ పవార్ గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై వ్యక్తిగత దాడికి దిగారు. ఆదివారం మహారాష్ట్రలోని గాస్వాంగిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శరద్ పవార్... మోడీ పెద్ద వాగుడుకాయని ఆరోపించారు. మోడీ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని విమర్శించారు. పిచ్చి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలని మోడీకి శరద్ పవార్ ఈ సందర్బంగా సూచించారు. మహారాష్ట్రలో అకోవా, నాందేడ్, అమరావతిలలో ఆదివారం మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శరద్ పవార్‌పై మోడీ విమర్శలు దాడి చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్‌పై అనర్గళంగా మాట్లాడే శరద్ పవార్...కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కూడ దేశంలో రైతుల ఆత్మహత్యలు అపలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందించారు. ఓ రాష్ట్రంలో ఘర్షణలు చోటు చేసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే బాధ్యత వహించవలసి ఉంటుందంటూ ఓ టీవీ ఇంటర్వ్యూలో శరద్ పవార్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లకు మోడీ బాధ్యత వహించవలసి ఉంటుందని శరద్ పరోక్షంగా ఆ ఇంటర్య్వలో వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఘర్షణలు చోటు చేసుకుంటే తానే బాధ్యత వహిస్తానని శరద్ పవార్ కుండబద్దలు కొట్టినట్లు ఆ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఎంపికయ్యేదెవ్వరో!
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగకముందే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపి క ప్రక్రియ ప్రారంభించింది. భివండీ, పుణే, నాగపూర్, లాతూర్, నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గాలలోని ఐదుగురు సిట్టింగ్ ఎంపీలను పక్కనబెట్టి కొత్తవారికి అవకాశమివ్వాలనే దానిపై ‘మహా’ నేతలు చర్చిస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రం లోని 48 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ 26, మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 22 స్థానా ల్లో పోటీచేయనున్నాయి. జిల్లాల వారీగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి, సిట్టింగ్ ఎంపీలు, కొత్తగా బరిలో దిగే అభ్యర్థుల జాబితా రూపొందించి పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే కోరడంతో ఆ దిశగా నాయకులు కసరత్తును మొదలెట్టారు. కాంగ్రెస్ తమ వాటాలోకి వచ్చిన స్థానాల్లో అభ్యర్థులను ఖరారుచేసే ప్రక్రియను ప్రారంభించింది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావు ఠాక్రే, ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్చార్జి మోహన్ ప్రకా శ్ తదితరులు గత రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం కూడా అభ్యర్థుల ఎంపి క విషయమై మంతనాలు జరిగాయి. పుణే, భివం డీ, నాగపూర్, లాతూర్, నాందేడ్ ప్రాంతాల్లో సిట్టిం గ్ ఎంపీలపై తీవ్ర అసంతృప్తి వాతావరణం ఉన్నట్లు సమావేశంలో చర్చకు వచ్చింది. వీరిని మార్చాలనే దానిపై సమావేశంలో మంతనాలు జరిగాయి. అభ్యర్థులను మారిస్తే ఆ స్థానాలను సులభంగా గెలుచుకోవచ్చని అధిష్టానానికి సిపార్సు చేయాలని నిర్ణయించారు. కాగా, పుణేలో సురేశ్ కల్మాడీపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. మళ్లీ అతనికి అభ్యర్థిత్వం ఇస్తే విమర్శలకు తావిచ్చినట్లవుతుంది. కానీ అభ్యర్థిత్వం ఎవరికివ్వాలనే దానిపై పార్టీ సందిగ్ధంలో పడిపోయింది. భివండీ ఎంపీ సురేష్ టావరేపై స్థానిక నేతల ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఇతనికి మొం డిచేయి చూపే అవకాశాలున్నాయి. ఇదే పరిస్థితి లాతూర్‌లోనూ ఉంది. సిట్టింగ్ ఎంపీ జయంత్ ఆవలేకు అభ్యర్థిత్వం ఇవ్వకూడదని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నాందేడ్‌లో సిట్టింగ్ ఎంపీ భాస్కర్‌రావ్ ఖత్గావ్కర్పై స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ కూడా కొత్త ముఖానికి అవకాశమివ్వాలని పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేయనున్నారు. నాగపూర్ సిట్టింగ్ ఎంపీ విలాస్ ముత్తెం వార్‌కు టికెట్ నిరాకరించే సూచనలు కనిపిస్తున్నా యి. ఇక్కడ కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని ఇదివరకే డిమాండ్ ఉంది. అయితే ముంబైలోని ఐదుగురు కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇతర స్థానాల అభ్యర్థుల విషయంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇందులో ఎవరికి మరోసారి అవకాశం లభించనుంది..? ఎవరిని పక్కన బెట్టనున్నారనేది పార్టీ అధిష్టానం తీసుకునే తుది నిర్ణయంపై ఆధారపడి ఉంది. -
శరద్ ‘పవర్’ చూపించారు
సాక్షి, ముంబై: ఈసారి కాంగ్రెస్, ఎన్సీపీ మిత్రపక్షాలుగా బరిలోకి దిగడం దాదాపు అసాధ్యమేనని అందరూ అనుకుంటున్న తరుణంలో రాజకీయాల్లో రాటుదేలిన శరద్ పవార్ రంగప్రవేశం చేసి పొత్తుకు శుభం పడేలా చూశారు. రాజకీయాల్లో ‘మహా’ నాయకుడినని మరోసారి నిరూపించారు. రాజకీయ చదరంగంలో ఎవరిని ఎక్కడ ఉంచాలో..? ఎవరిని ఎలా ఒప్పించాలో తెలిసిన పవార్ కాంగ్రెస్‌తో పొత్తును కొనసాగేలా చూడటంతో పాటు పాత ఫార్ములా ప్రకారమే ఒప్పించేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. గత కొంతకాలంగా కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య లోక్‌సభ సీట్ల పంపకాలపై వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్సీపీ బలం తగ్గిందంటూ, దీంతో లోక్‌సభ ఎన్నికల్లో పాత ఫార్ములాతో (కాంగ్రెస్ 26-ఎన్సీపీ 22) కాకుండా కాంగ్రెస్ 29, ఎన్సీపీ 19 సీట్లలో పోటీ చేయాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. అయితే ఎన్సీపీ మాత్రం ససేమిరా అని కొట్టిపడేసింది. కాంగ్రెస్‌పై అనేక ఆరోపణలు చేసింది. రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు బాస్కర్ జాదవ్ కాంగ్రెస్‌కు తీవ్ర విమర్శలు చేశారు. ఇవన్నీ జరిగిన అనంతరం కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ పర్యవేక్షణలో ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని, అవసరమైతే ఎన్సీపీతో తెగదెంపులు చేసుకుని ఒంటరిగా కాంగ్రెస్ బరిలోకి దిగుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే రాజకీయ చదరంగంలో ఉన్నత స్థానంలో ఉన్న శరద్‌పవార్ మాత్రం సోనియాగాంధీ, అహ్మద్ పటేల్‌ను ముందుకు తీసుకువచ్చారు. కాంగ్రెస్‌ను ఒక మెట్టు వెనక్కి తగ్గేలా చేసి తన పంథాన్ని నెగ్గించుకున్నారు. ఎట్టకేలకు కాంగ్రెస్ 26, ఎన్సీపీ 22 సీట్లతో పాత ఫార్ములాతోనే పోటీచేసేందుకు అంగీకరించింది. సీట్ల మార్పులు ఎలా ఉంటాయో..? సీట్ల పంపకాల ఘట్టం పూర్తి అయినప్పటికీ నియోజకవర్గాల కేటాయింపు మార్పులపై మళ్లీ వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయి. అనేక సీట్లపై ఇరు కాంగ్రెస్‌ల మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతో సీట్ల పంపకాలు ఎలా ఉంటాయోనని ఇరు కాంగ్రెస్‌ల నాయకులు అయోమయానికి గురవుతున్నారు. పొత్తు కుదరడంపై ఆనందం వ్యక్తం చేస్తున్న ఎన్సీపీ కొన్ని స్థానాల్లో సీట్ల మార్పులు చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అనుకూలమైన సీట్లను మార్పు చేసుకోవడంలో ఎవరు సఫలీకృతమవుతారోనన్నది ఆసక్తికరంగా మారింది. హాతకణంగలే, రావేర్ లోక్‌సభ నియోజకవర్గాలను కాంగ్రెస్‌కు కట్టబెట్టాలని అనుకుంటున్న ఎన్సీపీ రాయ్‌గఢ్‌ను మాత్రంతమ వద్ద ఉంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు కాంగ్రెస్ సీట్లలో ఎలాంటి మార్పులు చేసినప్పటికీ కొల్హాపూర్‌ను మాత్రం విడిచిపెట్టొద్దనే నిర్ణయానికి ఎన్సీపీ వచ్చింది. -
బీజేపీతో పొత్తు ఎందుకు?
ముంబై: చిన్న రాష్ట్రాల విషయంలో శివసేన రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఎన్సీపీ ఆరోపించింది. ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్న బీజేపీతో ఆ పార్టీ పొత్తు ఎందుకంటూ నిలదీసింది. పార్టీ కార్యాలయంలో గురువారం ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఉద్ధవ్‌ఠాక్రే.. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు మద్దతు పలికారన్నారు. ఒకవేళ ఉద్ధవ్ నిజంగానే సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుదారుడైతే సమైక్య మహారాష్ట్రకు భిన్నంగా వ్యవహరిస్తున్న బీజేపీతో పొత్తు ఎందుకని ప్రశ్నించారు. ప్రత్యేక విదర్భకు మద్దతుగా బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడణవిస్ ఆ ప్రాంతంలో ఇటీవల సైకిల్ ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా నవాబ్ గుర్తుచేశారు. -
క్లాక్... టిక్ టిక్
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారించిన ఎన్సీపీ... అభ్యర్థుల జాబితాకు తుదిమెరుగులు దిద్దుతోంది. అన్ని పార్టీలకంటే ముందుగానే జాబితా విడుదల చేయాలని భావిస్తోంది. ఇందులోభాగంగా ఇప్పటికే పలువురి పేర్లను ఖరారు చేసింది. మిగిలిన అభ్యర్థులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఖరారైన అభ్యర్థుల జాబితాలో గోండియా లోక్‌సభాస్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన విమానయన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్, ఉస్మానాబాద్ ఎంపీ పద్మసింగ్ పాటిల్ విజయ భాంబోలి (పర్భణి) తదితరులున్నారు. హింగోలి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి సూర్యకాంత్ పాటిల్, శివాజీ మానేలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ స్థానం నుంచి వీరిలో ఒకరిని ఖరారు చేయాల్సి ఉంది. మరోవైపు అహ్మద్‌నగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్సీపీలో చేరిన రాజీవ్ రాజలేతోపాటు బబన్‌రావ్ పాచ్‌పుతే , ఆయన కుమారుడు విక్రమసింగ్ ల పేర్లను పరిశీలించాలని అధిష్టానాన్ని కొందరు నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. వీరితోపాటు అహ్మద్‌నగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఘనశ్యామ్ శేలార్ ఆసక్తి కనబరుస్తుండడంతో ఆయన పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలియవచ్చింది. ఎన్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బీడ్ నియోజకవర్గం స్థానానికి సంబంధించి మంత్రి జయదత్ క్షీరసాగర్, సురేష్‌ల పేర్లు తెరపైకొచ్చాయి. గత ఎన్నికల్లో పరాజయం పాలైన రమేష్ ఆడస్కర్ కూడా మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర శాసనసభ్యుడు ఎమ్మెల్యే రవి రాణా భార్య సినీ నటి నవనీత్ కౌర్ పేరు పరిశీలనలో ఉంది. ఇక రావేర్ నియోజకవర్గం నుంచి రవీంద్ర పాటిల్ పేరును పరిశీలించాల్సిందిగా అక్కడి నాయకులు, కార్యకర్తలు అధిష్టానానికి విన్నవించారు. బరిలోకి దిగేందుకు నేతల సుముఖత త్వరలో జరగనున్న సార ్వత్రిక ఎన్నికల బరిలోకి దిగేందుకు ఉపముఖ్యమంత్రి అజిత్పవార్తోపాటు ఎన్సీపీకి చెందిన మంత్రులు, ఇతర అగ్రనాయకులు సుముఖత వ్యక్తం చేశారు. మొత్తం 48 స్థానాలకు 22 నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగాలని ఆ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. కొద్దినియోజకవర్గాలలో భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌తో కలసి బరిలోకి దిగనుంది. లోక్‌సభ ఎన్నిలకు సన్నద్ధతకు సంబంధించి రెండురోజులపాటు జరిగిన సమీక్షా సమావేశంలో బరిలోకి దిగాలని ఆశిస్తున్నవారందరితో ఆ పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్ భేటీ అయ్యారు. ఈ నెల 10 లేదా 15వ తేదీలోగా అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే అవకాశముందని పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు భాస్కర్ జాదవ్ మీడియాకు వెల్లడించారు. ఏ స్థానాన్ని కేటాయించినా పోటీ చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని అజిత్పవార్తోపాటు ఇతర మంత్రులు పార్టీ అధినేతకు స్పష్టం చేశారు. ఇక బీడ్ లేదా శిరూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అజిత్ ఆసక్తి కనబరిచారని జాదవ్ తెలిపారు. శరద్‌పవార్ ప్రాతినిధ్యం వహిస్తున్న మఢా నియోజకవర్గం నుంచి అజిత్ బరిలోకి దిగుతారా అని మీడియా ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. పార్టీ అధినేత కుమార్తె, ఎంపీ సుప్రియాసూలేను రాష్ట్ర రాజకీయాల్లోకి దించేందుకు వీలుగా అజిత్‌ను లోక్‌సభ బరిలోకి దించుతున్నారా అని ప్రశ్నించగా అమె ఎంపీ అని, బారామతి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో ఒక్కొక్క స్థానం నుంచి పోటీ చేయాలంటూ తాము భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌కు ప్రతిపాదిస్తామన్నారు. మూడుచోట్ల ఒక పార్టీ స్థానంలో మరొక పార్టీ పోటీ చేసే అవకాశముందన్నారు. రాయ్‌గఢ్ నియోజక వర్గం కాంగ్రెస్ కోటాలోనే ఉందని, అయితే గత మూడు ఎన్నికల్లో వారు పరాజయం పాలయ్యారన్నారు. ఒకవేళ సీట్ల మార్పిడి జరిగితే ఈ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు తాను ఆసక్తి కనబరిచానన్నారు. కాగా జాదవ్ రాయ్‌గఢ్ జిల్లా చిప్లున్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి విదితమే. కాగా తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత నిర్ణయించిన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ద్వితీయ తరం నాయకత్వం వహించనుంది. రాష్ర్టంలో మొత్తం 48 స్థానాలు ఉండగా శరద్‌పవార్ సమీప బంధువు, ఉపముఖ్యమంత్రి అజిత్పవార్తోపాటు ఆ పార్టీకి చెందిన ఇతర మంత్రులు, అగ్రనాయకులు లోక్‌సభపై దృష్టి సారించారు. లోక్‌సభ ఎన్నికలకు టికెట్లను ఆశిస్తున్నవారితో ఆ పార్టీ అధినేత పవార్... రెండురోజులపాటు భేటీ అయిన సంగతి విదితమే. లోక్‌సభ ఎన్నికల విషయమై ఆ పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు భాస్కర్ జాదవ్ మీడియాతో మాట్లాడుతూ అజిత్ పవార్ బీడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయక తప్పదన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 22 స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. -
ఉప ఎన్నికల్లో ఎన్సీపీ జయకేతనం
సాక్షి, ముంబై:అసెంబ్లీ హాలులో సోమవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఎన్సీపీ నుంచి బరిలో దిగిన ధనంజయ్ ముండే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ, శివసేన తరఫున పోటీచేసిన పృథ్వీరాజ్ కాకడే ఘోరపరాజయం పాలయ్యారు. కాకడేను గెలిపించేందుకు బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. బాబాయ్ గోపీనాథ్ ముండేతో ధనంజయ్ విబేధించడమేగాక తిరుగుబాటు చేసి ఎన్సీపీలో తీర్థం పుచ్చుకున్నారు. అందుకే ఆయనను ఓడించేందుకు గోపీనాధ్ ముండే ఈ ఎన్నికను సవాలుగా తీసుకున్నారు. అయినా విజయవకాశాలు ధనంజయ్కే ఎక్కువగా ఉండడంతో ముండే ప్రయత్నాలు ఫలించలేదు. కాకడేకు 106 ఓట్లు రాగా ధనంజయ్‌కు 165 ఓట్లు వచ్చాయి. ఇదిలాఉండగా, గోపీనాథ్‌తో తెగతెంపులు చేసుకున్న ధనంజయ్ ఎన్సీపీలో చేరిన తరువాత కొద్ది రోజులపాటు ఎమ్మెల్సీగా కొనసాగారు. జూలై రెండున తన పదవికి రాజీనానా చేయడగా, ఖాళీ అయిన ఈ స్థానానికి సోమవారం ఉపఎన్నిక జరిగింది. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. మొత్తం 288 మందిలో 272 మంది శాసనసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెన్సెస్ సభ్యులు తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 12 మంది ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యేలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. రెండు ఓట్లు రద్దయ్యాయి. కాంగ్రెస్ సభ్యుడు అమిత్ దేశ్‌ముఖ్, పీడబ్ల్యూపీకి చెందిన ధైర్యశీల్ పాటిల్, శివసేన సభ్యుడు సురేశ్దాదా జైన్,మార్క్స్‌వాది కమ్యూనిస్టు పార్టీకి చెందిన రాజారాం ఓజరే తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని తెలిసింది. టీఎంసీలో మహాకూటమి హవా ఠాణే మున్సిపల్ కార్పొరేషన్లో (టీఎంసీ) శివసేన, బీజేపీ, ఆర్పీఐ మహాకూటమి తన పట్టును నిలుపుకుంది. ఎంతో ఉత్కంఠ మధ్య కొనసాగిన ఓట్ల లెక్కింపులో కోప్రీ విభాగంలోని వార్డునెంబరు ‘51 ఏ’లో బీజేపీ అభ్యర్థి రేఖాపాటిల్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అరుణా భుజ్‌బల్‌పై 3,221 ఓట్ల మెజారిటీ సాధించారు. ముంబ్రాలోని వార్డు నెంబరు ‘57 బీ’లో శివసేన మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థిపై ఎన్సీపీ అభ్యర్థి విశ్వనాథ్ భగత్ విజయం సాధించారు. దీంతో ఠాణే మున్సిపల్ కార్పొరేషన్లో పార్టీల బలాబలాల్లో ఎలాంటి మార్పులూ జరగలేదు. గతంలో మాదిరిగానే మహాకూటమి 65, కాంగ్రెస్, ఎన్సీపీ, ఎమ్మెన్నెస్ కూటమికి 65 సభ్యుల బలం ఉంది. ఠాణే మున్సిపల్ కార్పొరేషన్లో మహాకూటమి అధికారంలో ఉంది. ఉప ఎన్నికల్లో కోప్రీ విభాగం నుంచి బీజేపీ పరాజయం పాలైఉంటే, టీఎంసీలో మహాకూటమి అధికారం కోల్పోయే అవకాశాలుండేవి. అయితే ఎట్టకేలకు ఆమె భారీ మెజారిటీతో విజయం సాధించడంతో మహాకూటమి తన పట్టును నిలుపుకుంది. జల్గావ్లో కేవీఏ జోరు: జల్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరికి పూర్తి మెజారిటీ లభించకపోయినా, సురేశ్జై న్కు చెందిన ‘ఖాందేశ్ వికాస్ అఘాడి’(కేవీఏ) అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఈ కార్పొరేషన్లో మొత్తం 75 స్థానాలుండగా, 34 స్థానాలను ఖాందేశ్ వికాస్ అఘాడి కైవసం చేసుకోవడం విశేషం. మరోవైపు బీజేపీ 14, ఎన్సీపీ 11, ఎమ్మెన్నెస్ 12, ఇతరులకు నాలుగు స్థానాలు దక్కాయి. జల్గావ్లో బీజేపీ నాయకుడు ఏక్నాథ్ గైక్వాడ్ ప్రభావం పెద్దగా కన్పించకపోగా సురేష్‌జైన్ ప్రభావం చూపగలిగారు.