మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియడంతో ఏయే స్థానాల్లో ఏ అభ్యర్థి పోటీ చేస్తున్నారనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. దీంతో బరిలో నిలిచన అభ్యర్థులు ప్రచార హోరును పెంచుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ తమ అభ్యర్థుల గెలుపుకు సర్వశక్తుల కృషిచేస్తున్నాయి.
అయితే నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ..15 స్థానాల్లో అటు మహాయుతి, ఇటు మహా వికాస్ అఘాడీ కూటమిలోనూ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో తొలుత గందరగోళం నెలకొంది. ఇప్పుడు ఆ సందిగ్దత తొలగిపోయింది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు నామినేషన్లు పూర్తి చేసినట్లు మహా వికాస్ అఘాడీ కూటమి వెల్లడించింది. ఇక ఎన్నికల యుద్ధానికి సిద్దమైనట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, సీనియర్ నాయకుడు వర్షా గైక్వాడ్, నసీమ్ ఖాన్‌లతో కలిసి మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి
రమేష్ చెన్నితాల బుధవారం మాట్లాడుతూ..మహా వికాస్ అఘాడిలో అన్ని పార్టీలకు సమానమైన గౌరవం ఉందని తెలిపారు. మొత్తం 288 స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశామని చెప్పారు. మహాయుతి కూటమితో పోల్చితే తమ గ్రూపులో ఎలాంటి గొడవలు లేవని అన్నారు. . తమ సభ్యుల మధ్య కొంత అపార్థాలు ఉన్నప్పటికీ మిత్రపక్షాల మధ్య ఎలాంటి చీలికలు లేవన్నారు. ఎంవీయేలో అన్ని పార్టీలకు సమానమైన గౌరవాన్ని అందించామని తెలిపారు
‘మహాయుతి సమయం ముగిసింది. , ఆ కూటమిలో బీజేపీ తమ మిత్రపక్షాలైన ఎన్సీపీ, శివసేన(షిండే) స్థానాలను దోచుకుంది. బీజేపీ తమ కూటమి భాగస్వాములను అణగదొక్కాలని చూస్తోంది. కానే మేము ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులకు ఏ, బీ ఫారమ్‌లను ఇచ్చాం. ఎన్నికల్లో పోటీకి మేము సిద్దం. స్వతంత్రంగా నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ నాయకులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలి. ’ అని చెన్నితాల కోరారు. కాగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. 23న ఫలితాలను వెల్లడిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment