తమ పార్టీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి రేసులో లేరని నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డీపీ త్రిపాఠి స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: తమ పార్టీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి రేసులో లేరని నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డీపీ త్రిపాఠి స్పష్టం చేశారు. 2017 జూలై నెలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో శరద్‌పవార్ నామినేషన్ వేయనున్నారని వచ్చిన ఊహాగానాలకు తెరదించారు. ‘పవార్ మా పార్టీ అధ్యక్షుడు. పార్లమెంటరీ నేత.
ఇప్పుడు రాష్ట్రపతి పదవికి సంబంధించిన ప్రశ్నే లేదు. ఆ పదవికి పోటీ చేసేందుకు చాలామంది ఉన్నారు’ అని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న శరద్ పవార్ తన ప్రస్తానంలో ఎన్నో కీలక పదవులు అలంకరించారు. ఆయనకు మహారాష్ట్ర స్ట్రాంగ్ మ్యాన్‌గా పేరుంది. గతంలో కూడా తాను రాష్ట్రపతి పదవి రేసులో లేనని పవార్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.