ముంబయి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కొద్ది రోజులుగా రాజకీయ కార్యక్రమాలకు హాజరవడం లేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయంగా మరేదైనా బాంబు పేల్చబోతున్నారా..? అనే అనుమానాలకు తావిచ్చాయి. అయితే.. ఈ పుకార్లకు తెరదించుతూ ఎన్సీపీ రెబల్ గ్రూప్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ స్పందించారు. అజిత్ పవార్ డెంగ్యూతో బాధపడుతున్నారని చెప్పారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఆరోగ్యం కుదుటపడగానే అజిత్ పవార్ ప్రజల ముందుకు వస్తారని ప్రఫుల్ పటేల్ స్పష్టం చేశారు. 'ప్రజా కార్యక్రమాల్లో అజిత్ పవార్ కనిపించటం లేదని తాజాగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ పుకార్లకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. డెంగ్యూతో బాధపడుతున్న అజిత్ పవార్.. నిన్నటి నుంచే చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరాను.' అని ప్రఫుల్ పటేల్ తెలిపారు.
ఇదీ చదవండి: నోరు జారిన రాహుల్.. అదానీ కోసం పనిచేయాలని పార్టీ నేతకు సూచన
Comments
Please login to add a commentAdd a comment