diagnosed with dengue
-
'సభలకు అజిత్ పవార్ హాజరు కాట్లేదు.. ఎందుకంటే..?'
ముంబయి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కొద్ది రోజులుగా రాజకీయ కార్యక్రమాలకు హాజరవడం లేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయంగా మరేదైనా బాంబు పేల్చబోతున్నారా..? అనే అనుమానాలకు తావిచ్చాయి. అయితే.. ఈ పుకార్లకు తెరదించుతూ ఎన్సీపీ రెబల్ గ్రూప్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ స్పందించారు. అజిత్ పవార్ డెంగ్యూతో బాధపడుతున్నారని చెప్పారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆరోగ్యం కుదుటపడగానే అజిత్ పవార్ ప్రజల ముందుకు వస్తారని ప్రఫుల్ పటేల్ స్పష్టం చేశారు. 'ప్రజా కార్యక్రమాల్లో అజిత్ పవార్ కనిపించటం లేదని తాజాగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ పుకార్లకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. డెంగ్యూతో బాధపడుతున్న అజిత్ పవార్.. నిన్నటి నుంచే చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరాను.' అని ప్రఫుల్ పటేల్ తెలిపారు. ఇదీ చదవండి: నోరు జారిన రాహుల్.. అదానీ కోసం పనిచేయాలని పార్టీ నేతకు సూచన -
హీరోయిన్ కు డెంగ్యూ, హీరోకు జరిమానా!
-
హీరోయిన్ కు డెంగ్యూ, హీరోకు జరిమానా!
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ కు డెంగ్యూ సోకినట్లు శుక్రవారం నిర్దారణ అయింది. ప్రస్తుతం జుహు తారా రోడ్డులోని సొంత ఇంటిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. డెంగ్యూ కలిగించే దోమల(ఎడెస్ ఏఈజిప్టీ జాతి) నిరోధానికి మార్గదర్శకాలు పాటించనందుకు విద్యాబాలన్ ఇరుగుపొరుగు వారిపై బీఎంసీ కొరడా ఝుళిపించింది. విద్యాబాలన్ కు డెంగ్యూ సోకిందని తెలిసిన వెంటనే అప్రమత్తమైన బీఎంసీ.. అదే అపార్ట్ మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో నివసిస్తున్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, మూడో ఫ్లోర్ లో నివసిస్తున్న వారి ఇళ్లను పరిశీలించింది. షాహిద్ కపూర్ కు చెందిన స్విమ్మింగ్ పూల్ లోని నీటిని వినియోగించకపోవడం వల్ల అందులో డెంగ్యూని వ్యాప్తి చేసే దోమలు అభివృద్ధి చెందినట్లు గుర్తించింది. దీంతో బీఎంసీ సెక్షన్ 382 ప్రకారం సంరక్షణ చర్యలు చేపట్టనందుకు షాహిద్ కపూర్ కు రూ.10వేల జరిమానా పడే అవకాశం ఉంది. కాగా, ఒక్క సెప్టెంబర్ మాసంలోనే ముంబైలో దాదాపు 1,500 డెంగ్యూ అనుమానిత కేసులు నమోదయ్యాయి.