NCP chief Sharad Pawar
-
‘మహా’ వ్యాఖ్యలు... మర్మమేమిటో?!
మహారాష్ట్రలో రాజకీయ పునరేకీకరణకు రంగం సిద్ధమవుతోందా? కొద్ది రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ దిశగా చర్చ జోరందుకుంటోంది. బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమికి చేరువయ్యేందుకు విపక్ష శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) ప్రయత్నం చేస్తున్నాయన్న వార్తలు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆ పార్టీల నేతల తాజా వ్యాఖ్యలు ఈ దిశగా సంకేతాలేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి మహాయుతి ఘోర ఓటమి రుచి చూపించడం తెలిసిందే. శివసేనను కొన్నేళ్ల క్రితం నిలువునా చీల్చిన ఏక్నాథ్ షిండే వర్గం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి విడిపోయిన అజిత్ పవార్ వర్గం మహాయుతి భాగస్వాములుగా బీజేపీతో అధికారం పంచుకుంటున్నాయి. తామే అసలైన పార్టీలమంటూ ఇప్పటికే గుర్తింపు కూడా దక్కించుకున్నాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగా షిండే, అజిత్ ఆయనకు డిప్యూటీలుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి ఎంవీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన ఉద్ధవ్ సేన, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ భారీ ఓటమితో కుదేలయ్యాయి. ఒకరకంగా ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అభిమానులు, కార్యకర్తల నుంచి వస్తున్న విజ్ఞప్తులు ఆసక్తి కలిగిస్తున్నాయి. విడిపోయిన పార్టీలు మళ్లీ కలిసి పోవాలంటూ కొద్ది రోజులుగా వారు గట్టిగా కోరుతున్నారు! ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్) అధికారిక పత్రిక ‘సామ్నా’ తమ ప్రత్యర్థి అయిన ఫడ్నవీస్‌ను ప్రశంసల్లో ముంచెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది. గడ్చిరోలీ జిల్లాలో నక్సలిజం అంతానికి ఆయన బాగా కృషి చేస్తున్నారని సామ్నా తాజా సంచిక సంపాదకీయంలో పేర్కొంది. ‘‘గడ్చిరోలీలో పలు అభివృద్ధి పనులకు సీఎం ఫడ్నవీస్ శ్రీకారం చుట్టారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎంతో కృషి చేస్తున్నారు. గడ్చిరోలీకి నూతన గుర్తింపును ఇవ్వాలని ఫడ్నవీస్ భావిస్తే స్వాగతిస్తాం’’ అని చెప్పుకొచ్చింది. ‘‘నక్సల్స్ ప్రభావిత జిల్లాలో నూతన అభివృద్ధి శకానికి శ్రీకారం చుట్టిన ఫడ్నవీస్ నిజంగా ప్రశంసలకు అర్హుడు’’ అని పేర్కొంది! మరోవైపు పార్టీని చీల్చి ప్రస్తుత దుస్థితికి కారకుడైన షిండేపై సంపాదకీయం విమర్శలు గుప్పించింది. ఆయన గతంలో ఇన్చార్జి మంత్రి హోదాలో గడ్చిరోలీలో మైనింగ్ లాబీల ప్రయోజనాల పరిరక్షణకే పని చేశారని ఆరోపించింది. లోగుట్టు ఏమిటో?! ఉద్ధవ్ సేన ఉన్నట్టుండి బీజేపీ అనుకూల వైఖరి ప్రదర్శిస్తుండటం ఆసక్తికరంగా మారింది. గత నెల 17న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ఫడ్నవీస్‌ను పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యేకంగా కలుసుకున్నారు కూడా! ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే సైతం ఫడ్నవీస్‌ను అభినందించారు. రాష్ట్ర ప్రగతి కోసం ఆయన మిషన్ మోడ్‌లో పని చేస్తున్నారంటూ ప్రస్తుతించారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ సీఎంను ఇలా ఆకాశానికెత్తుతుండటం యాదృచ్ఛికమేమీ కాదన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అవి ఎన్డీఏ వైపు చూస్తున్నాయనేందుకు బహుశా ఇది సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. హిందూత్వవాదమే మూల సిద్ధాంతంగా పుట్టుకొచ్చిన శివసేన రాష్ట్రంలో అధికారం కోసం ఐదేళ్ల కింద అనూహ్యంగా తన బద్ధ విరోధి కాంగ్రెస్‌తో జట్టుకట్టడం తెలిసిందే. అప్పటినుంచే పార్టీ పతనం ప్రారంభమైందన్నది పరిశీలకుల మాట. ఈ నేపథ్యంలో ఉనికిని కాపాడుకోవడానికి హిందూత్వవాది అయిన బీజేపీతో స్నేహం తప్పు కాదని ఉద్ధవ్ వర్గం నేతల్లో కొందరంటున్నారు. కానీ అది ఆత్మహత్యా సదృశమే కాగలదని, పార్టీ ఎదుగుదల అవకాశాలు శాశ్వతంగా మూసుకుపోతాయని మరికొందరు వాదిస్తున్నారు. పైగా ఎన్డీఏలో చేర్చుకుని ఉద్ధవ్ సేనకు చేజేతులారా కొత్త ఊపిరి పోసే పని బీజేపీ ఎందుకు చేస్తుందని ప్రశి్నస్తున్నారు. మాది మనసున్న పార్టీ: రౌత్ సామ్నా సంపాదకీయాన్ని పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ సమ రి్థంచుకున్నారు. తాము విపక్షంలో ఉన్నప్పటికీ గడ్చిరోలీ జిల్లాకు సీఎం మంచి పనులు చేస్తున్నారు గనుక ప్రశంసిస్తున్నామని చెప్పుకొచ్చారు. ‘‘మాది చాలా పెద్ద మనసున్న పార్టీ. ప్రజలకు మంచి చేస్తే మా ప్రత్యర్థులనైనా ప్రశంసిస్తాం’’ అన్నారు.ఎన్సీపీల విలీనం! ఎన్సీపీలో చీలిక నేపథ్యంలో కొన్నేళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉంటున్న బాబాయి శరద్ పవార్, అబ్బాయి అజిత్ దగ్గరవుతున్న సంకేతాలు కొద్ది రోజులుగా ప్రస్ఫుటమవుతున్నాయి. విభేదాలకు స్వస్తి పలికి ఇద్దరూ కలిసిపోవాలని అజిత్ తల్లి ఇటీవలే పిలుపునివ్వడం తెలిసిందే. వారిద్దరూ కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. అందుకు తగ్గట్టే డిసెంబర్ 12న శరద్ జన్మదినం సందర్భంగా అజిత్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దాంతో రెండు ఎన్సీపీలు కలిసిపోతాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అది అతి త్వరలోనే జరగవచ్చని పవార్ కుటుంబ అభిమానులు చెప్పుకుంటున్నారు. శరద్ తమకు దేవుడని, పవార్ కుటుంబం ఒక్కటైతే చాలా సంతోషిస్తామని అజిత్ వర్గం ఎంపీ ప్రఫుల్ పటేల్ అన్నారు. శరద్ తన వర్గాన్ని అజిత్ పార్టీలోనే కలిపేసి ఎన్డీయే గూటికి చేరినా ఆశ్చర్యం లేదని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఫడ్నవీస్‌కు శరద్ కూతురు సుప్రియ ప్రశంసలు అందులో భాగమేనని వారంటుండగా మరికొందరు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ 35 నిమిషాలు : సాధారణమా? రాజకీయమా?
సాక్షి, ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ జన్మదినోత్సవాలను ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు ఘనంగా జరుపు కున్నారు. పవార్ 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం ముంబైతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అనేక మంది ప్రముఖులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా జన్మదినోత్సవం రోజున శరద్ పవార్ ఢిల్లీలోనే ఉండటంతో ఎన్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు అనేక పార్టీల నేతలు ఢిల్లీలోని ఆయన నివాసంలో స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా కలిసి..శుభాకాంక్షలు శరద్ పవార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్, కుమారుడు పార్థ్ పవార్‌లతోపాటు ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, సునీల్ తట్కరే తదితరులున్నారు. వీరందరూ పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సమయంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా అక్కడే ఉన్నారు. ఎన్సీపీ రెండుపార్టీలుగా చీలిపోయిన తర్వాత శరద్ పవార్‌తో అజిత్‌పవార్ భేటీ కావడం ఇదే తొలిసారి. మంచి చెడులు మాత్రమే చర్చించాం: అజిత్‌పవార్ అజిత్ పవార్‌తోపాటు అనేక మంది ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు శరద్ పవార్‌తో భేటీ కావడం అనేక చర్చలకు ఊతమిచ్చింది మళ్లీ వీరిద్దరూ ఒకటికానున్నారా అనే అంశంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే అలాంటిదేమిలేదని తమ కుటుంబ పెద్ద అయిన శరద్‌పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే వెళ్లామని మంచిచెడులు, బాగోగుల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని చెప్పారు. అయితే సుమారు 35 నిమిషాలపాటు అజిత్ పవార్, శరద్ పవార్ల మధ్య చర్చలు కొనసాగాయని, ఈ చర్చల్లో రాజకీయ అంశాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా చర్చలు జరిగి ఉండవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా అయిదు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవంతో రాజకీయ చాణక్యుడిగా గుర్తింపుపొందిన శరద్ పవార్ జీవిత విశేషాలను గురించి క్లుప్తంగా..... తల్లినుంచే రాజకీయ వారసత్వం పవార్, ఆయన కుటుంబీకులు రెండుతరాలుగా రాజకీయాల్లో కొన సాగుతున్నారు. ప్రస్తుతం మూడో తరం కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజాదరణతో రాజకీయాలను కొనసాగిస్తున్నారు. మొదటగా శరద్ పవార్ తల్లి శారదాబాయి పవార్ పుణే జిల్లా లోకల్బోర్డ్ సభ్యురాలుగా ఎన్నికవ్వడంతో పవార్ కుటుంబ రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. ఆ విధంగా తల్లి నుంచే శరద్‌పవార్‌కు రాజకీయ వారసత్వం లభించింది. అనంతరం ఇంతింతై అన్నట్లుగా పవార్ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలలో కీలకపాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. బారామతి ఎంపీగా ఏడు సార్లు...శరద్‌పవార్ బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు విజయం సాధించారు. దీంతో ఆయనకు ఈ నియోజకవర్గం కంచుకోటలా మారింది. 1984 నుంచి 1991, 1995, 1997, 1998, 1999తో పాటు 2004లోనూ ఈ నియోజకవర్గంలో పవార్‌దే విజయం. దీంతో ఆయన ఈ లోక్‌సభ నియోజకవర్గానికి మకుటంలేని మహారాజుగా మారారు. కాగా 2009లో పవార్ తన కుమార్తై సుప్రియా సూలేను బారామతి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయించారు. ఆయన మాడా లోక్‌సభ సెగ్మెంట్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కేంద్రరాజకీయాల్లోకి... పవార్ 1991లో రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇటు రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తూనే అటు కేంద్రంలో ఒక్కో మెట్టు ఎక్కసాగారు. ఈ నేపథ్యంలో 1993లో మరోమారు ఆయన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరించింది. తదనంతరం 1995లో మరోసారి అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుని పాత్రను పోషించారు. ఆ తరువాత కేంద్రరాజకీయాలలో చురుకుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 1998 మార్చి 22న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించి 1999 మే 20న పార్టీని వీడారు. నెలరోజుల్లోనే 1999 జూన్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. అనంతరం 1999 అక్టోబరు ఏడవ తేదీన మరోసారి ఎంపీగా విజయం సాధించారు. 2004 ఎన్నికల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. లక్ష మెజార్టీతో అజిత్ పవార్ గెలుపు... ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎన్సీపీ(ఎస్పీ)తరపున బారామతి ఎంపీగా సుప్రియా సూలే గెలిచారు. ఎరద్పవార్ కుమార్తై ఎన్సీపీ (ఎస్పీ) పార్టీ నుంచి విజయం సాధించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా అజిత్‌పవార్ లక్షకుపైగా ఓట్లతో విజయం సాధించి బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో శరద్‌పవార్ ప్రాభవానికి చెక్‌పెట్టారు. 50 ఏళ్లకుపైగా రాజకీయాల్లో.. మొట్టమొదటిసారిగా 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బారామతి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పటినుంచి వెనుతిరిగి చూడలేదు. తరువాత తరువాత అసెంబ్లీతో పాటు లోక్‌సభ నియోజకవర్గంపై కూడా పట్టుసాధించారు. 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. ఇదే సంవత్సరం ఆయనకు మంత్రి మండలిలో స్థానం లభించింది. 1978 జూలై 12వ తేదీన నలుగురు మంత్రులతో కలసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జూలై 17వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇతర పార్టీలతో కలిసి ‘పురోగామి లోక్‌షాహీ ఆఘాడీ’(పులోద్)ను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో అతి పిన్నవయసు ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. రెండేళ్ల అనంతరం 1980లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలై 1981 జులై 31 వరకు ప్రతిపక్షనాయకుని పాత్రకు పరిమితమయ్యారు. 1984లో మొట్టమొదటి సారిగా బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1986లో మరోసారి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం 1988లో జూన్ 25వ తేదీన రెండోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1991 జూన్ వరకూ ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. -
‘నేను రాలేదు.. కాబట్టే నువ్వు గెలిచావ్ రా’!..
ముంబై : నువ్వు పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గంలో నేను పోటీ చేసి ఉండి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదంటూ బాబాయ్ అజిత్ పవార్, అబ్బాయి రోహిత్ పవార్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రస్తుతం, ఆ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) తరుఫున అహల్య జిల్లా ఖజరత్ జమ్ఖేడ్ నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ సోదరుడి కుమారుడు రోహిత్ పవార్.. బీజేపీ అభ్యర్థిపై స్వల్ప తేడాతో విజయం సాధించారు.ఈ తరుణంలో సోమవారం(నవంబర్ 25) మహారాష్ట్ర తొలి సీఎం వైబీ చవాన్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అజిత్ పవార్, ఆయన సోదరుడి కుమారుడు రోహిత్ పవార్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచావుగా. రా.. వచ్చి నా ఆశీర్వాదం తీసుకో. ఒకవేళ నేనే ఖజరత్ జమ్ఖేడ్లో ఎన్నికల ప్రచారం చేసి ఉంటే ఏమి జరిగి ఉండేది?’’ అని రోహిత్ పవార్‌ను ఉద్దేశిస్తూ అజిత్ పవార్ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడారు. ఆ మాటతో రోహిత్ పవార్.. అజిత్ పవార్ కాళ్లకు నమస్కరించారు.స్వల్ప తేడాది విజయంఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ అహల్యానగర్ జిల్లాలోని ఖజరత్ జమ్ఖేడ్ నియోజకవర్గంలో తన ప్రత్యర్థి బీజేపీ నేత రామ్ షిండేపై 1,243 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. 41 అసెంబ్లీ స్థానాల్లో అజిత్ పవార్ గెలుపుగత వారం మహరాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికలలో శరత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)10 స్థానాల్ని కైవసం చేసుకోగా.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. स्व. यशवंतराव चव्हाण साहेबांची समाधी प्रितीसंगम म्हणजे पवित्र स्थळ. चव्हाण साहेबांनीच एक सुसंस्कृत अशी राजकीय संस्कृती जपण्याचे संस्कार महाराष्ट्रावर केले. त्यानुसारच आज प्रितीसंगमावर आदरणीय अजितदादांची भेट झाली. त्यांची राजकीय वाटचाल स्वतंत्र दिशेने सुरु असली तरी त्यांचा राजकीय… pic.twitter.com/Oc8eQYdwfN— Rohit Pawar (@RRPSpeaks) November 25, 2024 -
లడ్కీ బహన్, మత విభజనే కారణం
కరాడ్: లడ్కీ బహిన్ పథకం, మతపరమైన విభజనే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయానికి దోహదపడ్డాయని ఎన్సీపీ (ఎస్పీ)అధినేత శరద్‌పవార్ అభిప్రాయపడ్డారు. లడ్కీ బహెన్ పథకం వల్ల మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని, మతపరమైన విభజన కలిసొచ్చిందని చెప్పారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడంపై పార్టీ సహచరులతో కలిసి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఓటమికి గల కారణాలను అధ్యయనం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈవీఎంలపై అనుమానాలు తలెత్తుతున్నాయన్న అంశంపై అధికారిక సమాచారం ఉంటేనే మాట్లాడతానన్నారు. ఎంవీఏ కూటమి ఎంతో కష్టపడ్డా ప్రజలు ఆశించిన ఫలితాలు రాలేదని పవార్ అన్నారు. మనవడు యుగేంద్ర పవార్‌ను బారామతిలో అజిత్ పవార్‌పై బరిలోకి దింపడం తప్పు నిర్ణయం కాదని, ఎన్నికలన్నప్పుడు పోటీ తప్పదని చెప్పారు. అజిత్ పవార్, యుగేంద్ర పవార్లను పోల్చలేమని, ఈ విషయం తనకూ తెలుసని స్పష్టం చేశారు. యుగేంద్ర పవార్‌పై అజిత్ పవార్ లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. -
శరద్ పవార్ శకం ముగిసినట్లే!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ(శరద్ పవార్) ఘోర పరాజయం పాలైంది. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో భాగస్వామి అయిన ఆ పార్టీ పొత్తులో భాగంగా 86 స్థానాల్లో పోటీ చేసింది. కేవలం 10 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ చీలిక వర్గం ఎన్సీపీ(అజిత్‌పవార్) 59 స్థానాల్లో పోటీచేసింది. 41 స్థానాల్లో విజయం సాధించింది. శరద్ పవార్‌కు కంచుకోట అయిన బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో అజిత్ పవార్ జయకేతనం ఎగురవేశారు. ఇక్కడ ఎన్సీపీ(శరద్ పవార్) అభ్యర్థిగా పోటీ చేసిన శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ ఓడిపోయాడు. ఐదు నెలల క్రితం ఇదే బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే విజయం సాధించారు. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను ఆమె ఓడించారు. లోక్‌సభ ఎన్నికల్లో 10 సీట్లలో పోటీ చేసిన శరద్ పవార్ పార్టీ 8 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఇకపై ఎన్నికలకు దూరంశరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ గత ఏడాది జూలైలో ఎన్సీపీని చీల్చారు. బీజేపీ–శివసేన(షిండే) కూటమితో చేతులు కలిపారు. ఉప ముఖ్యమంత్రి దక్కించుకున్నారు. అసలైన ఎన్సీపీ తమదేనంటూ శరద్ పవార్ చేసిన పోరాటం ఫలించలేదు. పార్టీని, పార్టీ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ పవార్‌కే కేటాయించింది. కుట్రదారులను ఓడించాలంటూ శరద్ పవార్ చేసిన విజ్ఞప్తిని మహారాష్ట్ర ప్రజలు మన్నించలేదు. 57 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో శరద్ పవార్ బారామతి అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది పదవీ కాలం ముగియనుంది. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయడంలో శరద్ పవార్ క్రియాశీలకంగా వ్యవహరించారు. ‘ఇండియా’కూటమి ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ఏర్పాటులో ఆయనదే కీలక పాత్ర. కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్)ని తమ కూటమిలోకి తీసుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 సీట్లకు గాను ఎంవీఏ ఏకంగా 30 సీట్లు కైవసం చేసుకుంది. అదే ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగింది. తగిన ప్రభావం చూపలేక చతికిలపడింది. రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన శరద్ పవార్ చాణక్యం ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. 2019 ఎన్నికల్లో 54 సీట్లు గెలుచుకున్న శరద్ పవార్ ఈసారి 10 సీట్లకే పరిమితమయ్యారు. సోనియాతో విభేదించి కాంగ్రెస్‌తో పొత్తు 1940 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని బారామతిలో జని్మంచిన శదర్ పవార్ విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్ శిష్యుడిగా రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. 1967లో 27 ఏళ్ల వయసులోనే తొలిసారి బారామతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోవడంతో తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి జనతా పారీ్టతో పొత్తు పెట్టుకున్నారు. పవార్ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగలేదు. 1986లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. మొత్తం నాలుగు సార్లు ముఖ్యమంత్రి, రెండు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. కీలకమైన రక్షణ, వ్యవసాయ శాఖలు ఆయన లభించాయి. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ విదేశీయురాలు అని విమర్శిస్తూ 1999లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(ఎన్సీపీ)ని స్థాపించారు. తర్వాత అదే కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వం 15 ఏళ్ల పాటు అధికారంలోకి కొనసాగింది. తాజా ఎన్నికల్లో శరద్ పవార్ దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ శకం ఇక ముగిసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఎన్సీపీ’ గుర్తు వివాదం..సుప్రీంకోర్టులో ‘ట్రంప్’ ప్రస్తావన
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీలిక వివాదంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్సీపీ అసలు గుర్తు గడియారంతో అజిత్‌పవార్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ గుర్తుపై కోర్టులో వివాదం నడుస్తోందని ప్రచారంలో స్పష్టంగా పేర్కొన్నాలని ఎన్నికల ప్రచారంలో సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. అయితే పార్టీ ప్రచార ప్రకటనల్లో అజిత్‌పవార్ ఈ నిబంధనను సరిగా పాటించడం లేదని శరద్‌పవార్‌వర్గం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై బుధవారం(నవంబర్ 13)సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటుచేసుకుంది.ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావన సుప్రీం కోర్టులో వచ్చింది. అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ పత్రికల్లో ఇచ్చిన ప్రచార ప్రకటనలు చూపిస్తూ శరద్‌పవార్ వర్గం న్యాయవాది అభిషేక్‌మను సింఘ్వి వాదిస్తున్నారు. అయితే ఆ పేపర్లలో అజిత్ పవార్ పార్టీ ప్రకటనలకు కాస్త పైనే ట్రంప్ ఫొటో ఉంది. దీనిని గమనించిన జడ్జి జస్టిస్ సూర్యకాంత్ న్యాయవాది సింఘ్వీకి సరదాగా ఈ విషయం చెప్పారు. ట్రంప్ ఫొట కూడా ప్రకటనలకు దగ్గరగా ఉందన్నారు. దీనికి స్పందించిన సింఘ్వీ ట్రంప్ ఎలాంటి పిటిషన్ వేయలేదని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ పరిణామంతో సుప్రీంకోర్టులో సరదా వాతావరణం నెలకొంది. తర్వాత కేసులో వాదనలు కొనసాగాయి. ఇదీ చదవండి: అజిత్ ఎన్సీపీకి సుప్రీంకోర్టు చివాట్లు -
మహా ఎన్నికలు: ‘నన్ను గెలిపిస్తే.. బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు జరిపిస్తా’
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసేందుకు పోటీలో నిలబడిన అభ్యర్థుల విచిత్ర హామీలు ఇస్తున్నారు. అయితే.. ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఇచ్చిన హామీ ఆసక్తికరంగా మారింది. తానను ఎన్నికల్లో గెలిపిస్తే బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేసి, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. బీడ్ జిల్లాలోని పర్లీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన పర్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.‘‘యువతకు పని కల్పిస్తాం. పెళ్లి సమయంలో యువకులకు ఉద్యోగం లేదా వ్యాపారం ఉందా? అడుగుతారు. జిల్లా మంత్రి ధనంజయ్ ముండేకే వ్యాపారం లేనప్పుడు, మీరు ఏవిధంగా ఉద్యోగాలు పొందుతారు. ధనుంజయ్ ముండే.. నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. అందువల్ల ఉద్యోగాలు లేక.. స్థానిక బ్యాచిలర్లు వివాహం చేసుకోవడం కష్టంగా మారింది. నన్ను గెలిపిస్తే.. ఉద్యోగాలు కల్పించి బ్యాచిలర్స్‌కు పెళ్లిలు చేస్తా’ అని అన్నారు.Unique poll promise@NCPspeaks candidate #RajasahebDeshmukh says on getting elected from Beed district's #Parli assembly constituency, he will get all the bachelors married#Maharashtra #PoliticsToday #MaharashtraAssembly pic.twitter.com/TfRm7kRtO8— Mohammed Akhef TOI (@MohammedAkhef) November 6, 2024 దేశ్‌ముఖ్ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎన్సీపీ (అజిత్ వర్గం) నేత ధనుంజయ్ ముండే పరిశ్రమలు తేకపోవడంతో ఉద్యోగాల్లేక పెళ్లిళ్లు జరగక యువత ఇబ్బంది పడుతున్నారని ర రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఆరోపణలు చేశారు.చదవండి: నేను వ్యాపార వ్యతిరేకిని కాదు: రాహుల్ గాంధీ క్లారిటీ -
ముగిసిన నామినేషన్ల గడువు.. 15 స్థానాలపై రాని స్పష్టత!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ఇవాళ(మంగళవారం) ముగిసింది. కానీ దాదాపు 15 సీట్లను అధికార, ప్రతిపక్ష కూటమి పార్టీలు అధికారికంగా ప్రకటించని పరిస్థితి నెలకొంది . బీజేపీ, శివసేన( ఏక్నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) అధికార కూటమి ఇంకా నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. అదేవిధంగా ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో శివసేన( ఉద్ధవ్ వర్గం), ఎన్‌న్సీపీ( ఎస్పీ వర్గం), కాంగ్రెస్ పార్టీ మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. బీజేపీ 152 మంది అభ్యర్థులు, ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) 52 మంది అభ్యర్థులు, శివసేన( ఏక్నాథ్ షిండే వర్గం) శివసేన 80 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో అధికార కూటమి చిన్న మిత్రపక్షాలకు ఇచ్చిన సీట్లు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ 103 మంది అభ్యర్థులు, శివసేన( ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ( ఎస్పీ) కలిపి 87 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది.మధ్యాహ్నం నాటికి ఎన్సీపీ( ఎస్పీ)కి సంబంధించినంత వరకు చివరి 87వ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపింది. అయితే అది అప్పటికీ 11 సీట్లపై అనిశ్చిత్తి నెలకొంది. ఈ సీట్లు కొన్ని చిన్న మిత్రపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీకి వస్తాయని అంచనా వేయగా.. ఎవరికి ఏది, ఎన్ని అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఎన్‌న్సీపీ (అజిత్ పవార్ వర్గం) నవాబ్ మాలిక్ మంఖుడ్ స్థానం నుంచి రెండు నామినేషన్లను దాఖలు చేశారు. ఒకటి ఇండిపెండెంట్‌గా, మరొకటి ఎన్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్య
ముంబై/న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఉన్న స్నేహ సంబంధాలు మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పారీ్ట(అజిత్‌పవార్) సీనియర్ నేత బాబా సిద్దిఖీని బలి తీసుకున్నాయి. రాజస్తాన్‌లో బిష్ణోయ్ తెగ ప్రజలు పరమ పవిత్రంగా భావించే కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్‌పై కక్షగట్టిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఆయన సన్నిహితుడు సిద్దిఖీని దారుణంగా హత్య చేసింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో దసరా పండుగ రోజే జరిగిన ఈ హత్యాకాండ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబై బాంద్రా ఈస్ట్ ప్రాంతంలోని నిర్మల్ నగర్లో బాబా సిద్దిఖీ కుమారుడు, మహారాష్ట్ర ఎమ్మెల్యే జీషాన్ సిద్దిఖీ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి 9.30 గంటలకు ముగ్గురు యువకులు ముఖాలకు కర్చీఫ్‌లు ధరించి, కార్యాలయం ప్రాంగణంలోకి దూసుకొచ్చారు. అక్కడే ఉన్న బాబా సిద్దిఖీపై 9.9 ఎంఎం పిస్తోల్ గురిపెట్టారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపి, వెంటనే పరారయ్యారు.నగరంలో పండుగ సందర్భంగా టపాసుల మోత వల్ల ఈ కాల్పుల శబ్ధం బయటకు వినిపించలేదు. 66 ఏళ్ల సిద్దిఖీ కడుపు, ఛాతీలోకి తూటాలు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తీవ్రంగా రక్తస్రావం జరిగింది. లీలావతి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించినట్లు రాత్రి 11.27 గంటలకు డాక్టర్లు నిర్ధారించారు. హత్య చేసింది మేమే.. 1998 సెప్టెంబర్‌లో రాజస్తాన్‌లోని జోద్పూర్ సమీపంలో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ఆటవిడుపుగా కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు ఆయనకు బెయిల్ ఇచి్చంది. కృష్ణ జింకలను చంపేసినందుకు సల్మాన్ ఖాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆయన మిత్రులను వేటాడడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే బాబా సిద్దిఖీని హత్య చేశామని ప్రకటించింది. శనివారం రాత్రి సిద్దిఖీ హత్య జరగ్గా, ఆదివారం ఫేసుబుక్‌లో లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు శిబూ లోంకర్ అలియాస్ శుభం రామేశ్వర్ లోంకర్ పేరిట ఓ పోస్టు ప్రత్యక్షమైంది. సల్మాన్ ఖాన్‌కు మిత్రుడు కావడంతోపాటు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌తో సంబంధాలు కొనసాగిస్తుండడం వల్లే సిద్దిఖీని హత్య చేశామని లోంకర్ తేలి్చచెప్పారు. సల్మాన్‌కు సహకరిస్తే ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సల్మాన్ ఖాన్‌తోపాటు దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధాలు కొనసాగిస్తే సిద్దిఖీకి పట్టిన గతే పడుతుందని స్పష్టం చేశారు. అలాగే తమ ముఠా సభ్యుడైన అనూజ్ థపన్ మరణానికి కారణమైన వారిని శిక్షించామని పేర్కొన్నారు. కాంట్రాక్టు హంతకుల పనే బాబా సిద్దిఖీపై కాల్పులు జరిపినవారిలో ఇద్దరిని గుర్మెయిల్ బల్జీత్ సింగ్(23), ధరమ్‌రాజ్ రాజేశ్ కాశ్యప్(19)గా పోలీసులు గుర్తించారు. ధరమ్రాజ్ను ఉత్తరప్రదేశ్‌లో, బల్జీత్ సింగ్‌ను హరియాణాలో అరెస్టు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులమని దర్యాప్తులో వారు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. గత నెల రోజులుగా సిద్దిఖీ కదలికలపై కన్నేసి, పథకం ప్రకారం హత్య చేసినట్లు నిందితులు వెల్లడించారు. సిద్దిఖీపై మూడు రౌండ్లు కాల్పులు జరపగా, ఒకటి ఆయన ఛాతీలోకి, మరొకటి కడుపులోకి దూసుకెళ్లింది. మరొకటి గురి తప్పడంతో సిద్దిఖీ కారు విండ్‌షీల్డ్ ధ్వంసమైంది. కాల్పులు జరిపినవారిలో మూడో నిందితుడు శివ కుమార్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ హత్యాకాండతో మరో నిందితుడి ప్రమేయం ఉందని, అతడిని మొహమ్మద్ జీషాన్ అఖ్తర్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వీరంతా కాంట్రాక్టు హంతకులేనని తెలిపారు.సిద్దిఖీని హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చున్న నిందితులు అడ్వాన్స్ తీసుకున్నారని, కొద్దిరోజుల క్రితమే ఆయుధాలు సమకూర్చుకున్నారని వివరించారు. హత్య జరిగిన సమయంలో సిద్దిఖీ సమీపంలో ఒక కానిస్టేబుల్ ఉన్నాడని చెప్పారు. నిందితుల నుంచి రెండు పిస్తోళ్లు, 28 తూటాలు స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసు కస్టడీకి నిందితుడు బాబా సిద్దిఖీ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం ముంబై కోర్టులో హాజరుపర్చారు. మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ వైరంతో ఈ హత్య జరిగిందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో కుట్ర ఏదైనా జరిగిందా? అనేది తేల్చాల్సి ఉందన్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. నిందితుల్లో ఒకడైన హరియాణా వాసి గుర్మెయిల్ బల్జీత్ సింగ్(23)ను ఈ నెల 21 దాకా పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తాను మైనర్‌నని మరో నిందితుడు వాదించాడు. దాంతో అతడికి వయసు నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం తమ ఎదుట హాజరుపర్చాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఏమిటీ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్? పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో జన్మించిన లారెన్స్ బిష్ణోయ్(33) అనే గ్యాంగ్‌స్టర్ ఈ ముఠాను ఏర్పాటు చేశాడు. చండీగఢ్‌లో విద్యార్థి రాజకీయాల ద్వారా నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. అతడిపై 20కిపైగా కేసులున్నాయి. ముఠాలో దాదాపు 700 మంది షూటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో బిష్ణోయ్ గ్యాంగ్ పేరు అందరికీ తెలిసింది. 2023 నవంబర్‌లో మరో పంజాబీ గాయకుడు గిప్పీ గ్రేవాల్ నివాసం వద్ద ఈ ముఠా కాల్పులు జరిపింది. సల్మాన్ ఖాన్‌ను సోదరుడు అని సంబోధించినందుకు గ్రేవాల్‌ను టార్గెట్ చేసినట్లు ప్రకటించింది. గత నెలలో కెనడాలో గాయకుడు ఎ.పి.థిల్లాన్ను హత్య చేసేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం దేశ విదేశాల్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. బిష్ణోయ్ ప్రస్తు తం గుజరాత్లో సబర్మతి జైలులో ఉన్నాడు.నివాళులర్పించారు. సల్మాన్ ఖాన్ తన మిత్రుడు బాబా సిద్దిఖీపై జరిగిన హత్యాయత్నం గురించి తెలిసిన వెంటనే సల్మాన్ ఖాన్ లీలావతి హాస్పిటల్‌కు వచ్చారు. సిద్దిఖీ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. ఆదివారం సాయంత్రం బాంద్రాలోని సిద్దిఖీ అపార్టుమెంట్ వద్దకు సల్మాన్ చేరుకున్నారు. సిద్దిఖీ మృతదేహం వద్ద నివాళులర్పించారు. సల్మాన్ కుటుంబ సభ్యులైన సోహైల్ ఖాన్, షురా ఖాన్, అరి్పతాఖాన్ శర్మ, అల్విరా అగి్నహోత్రి, సల్మాన్ స్నేహితురాలు లులియా వంతూర్తోపాటు పలువురు బాలీ వుడ్ ప్రముఖులు సైతం నివాళులరి్పంచారు. హత్య వెనుక వ్యాపార విభేదాలు? సల్మాన్‌తో సంబంధాలు ఉన్నందుకు బాబా సిద్దిఖీని తామే హత్య చేసినట్లు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించినప్పటికీ, వ్యాపార విభేదాలు కారణం కావొచ్చని ప్రచారం సాగుతోంది. 2000 నుంచి 2004 దాకా మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా పనిచేశారు. అప్పట్లో మురికివాడ పునరావాస ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో రూ.2 వేల కోట్ల దాకా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 2014లో సిద్దిఖీతోపాటు మరికొందరిపై కేసు నమోదైంది. 2018లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్దిఖీకి చెందిన రూ.462 కోట్ల ఆస్తులను ఆటాచ్ చేసింది. వ్యాపార గొడవల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. దుండగులను కఠినంగా శిక్షిస్తాం: ఏక్నాథ్ షిండే బాబా సిద్దిఖీ హత్యాకాండపై మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా వివిధ పారీ్టల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సిద్దిఖీని పొట్టనపెట్టుకున్న దుండగులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని ఏక్నాథ్ షిండే ప్రకటించారు. దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లీలావత్ హాస్పిటల్‌కు చేరుకొని వైద్యులతో మాట్లాడారు. తన విశ్వసనీయ సహచరుడు, సన్నిహి త మిత్రుడైన సిద్దిఖీ హత్యకు గురికావడం బాధాకరమని అజిత్ పవార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటన వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. మైనారీ్టల సంక్షేమం, మత సామరస్యం కోసం సిద్దిఖీ నిరంతరం పోరాటం సాగించారని అజిత్ పవార్ కొనియాడారు. కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి.. బాబా సిద్దిఖీ అలియాస్ జియా ఉద్దీన్ సిద్దిఖీ 1953 సెప్టెంబర్ 13న బిహార్ రాజధాని పాట్నాలో జని్మంచారు. బాల్యంలో కుటుంబంతోపాటు ముంబైకి వలస వచి్చ, అక్కడే పెరిగారు. రాజకీయాలపై ఆసక్తితో 1977లో కాంగ్రెస్ పారీ్టలో చేరారు. చురుకైన నాయకుడిగా పేరు సంపాదించారు. స్థానిక ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ తక్కువ కాలంలోనే పార్టీలో ఉన్నతస్థాయికి చేరుకున్నారు. 1980లో బాంద్రా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లలో బాంద్రా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 1988లో ముంబై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నియ్యారు. 1992లో ముంబై మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. 1999లో తొలిసారిగా బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు జయకేతనం ఎగురవేశారు. 2014 దాకా ఎమ్మెల్యేగా కొనసాగారు. 2004 నుంచి 2008 దాకా మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల, కారి్మక శాఖ మంత్రిగా పనిచేశారు. రాజకీయ వర్గాలతోపాటు బాలీవుడ్ ప్రముఖులతో సిద్దిఖీకి చక్కటి సంబంధాలున్నాయి. ఆయన ఇచ్చే భారీ ఇఫ్తార్ విందులకు బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యేవారు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, సంజయ్ దత్తో సిద్దిఖీ సన్నిహితంగా మెలిగేవారు. సల్మాన్, షారుక్ మధ్య ఐదేళ్లపాటు నెలకొన్న వివాదాన్ని స్వయంగా పరిష్కరించారు. ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఎన్సీపీలో చేరారు. సిద్దిఖీ కుమారుడు జీషాన్ సిద్దిఖీ ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే. ముంబై ముస్లిం ప్రజల్లో గట్టి పట్టున్న బాబా సిద్దిఖీ రాకతో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ లబ్ధి పొందింది. ఇదిలా ఉండగా, కరోనా మహమ్మారి ఉధృతి సమయంలో బాబా సిద్దిఖీ అందించిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ప్రజలకు ప్రాణాధార ఔషధాలు, పీపీఈ కిట్లు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఈ యుద్ధం మేము కోరుకోలేదు ‘‘ఓం జైశ్రీరామ్, జైభారత్. జీవితం గురించి నాకు తెలుసు. నా దృష్టిలో ఆస్తులకు, మానవ శరీరానికి పెద్దగా విలువ లేదు. ఏది సరైందో అదే చేశాం. స్నేహం అనే బాధ్యతను గౌరవించాం. నిజానికి ఈ యుద్ధం మేము కోరుకోలేదు. కానీ, సల్మాన్ ఖాన్ వల్ల మా సోదరుడు అనూజ్ థపన్ ప్రాణాలు కోల్పోయాడు. మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. కానీ, సల్మాన్ ఖాన్‌కు, దావూద్ ఇబ్రహీంకు ఎవరైనా సహరిస్తే వారి లెక్కలు సరిచేస్తాం. గతంలో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద దావూద్‌తోపాటు సిద్దిఖీ కూడా నిందితుడే. మా సోదరుడు థపన్ మరణం, సల్మాన్, దావూద్‌తో సంబంధాలు, బాలీవుడ్, రాజకీయాల్లో భాగస్వామ్యం, ఆస్తుల సెటిల్మెంట్ల వ్యవహారాలే సిద్దిఖీ హత్యకు కారణం. మా సభ్యుల్లో ఎవరినైనా చంపేస్తే తగిన రీతిలో జవాబిస్తాం. మొదట దాడి మేము చేయం. ప్రత్యర్థులు దాడి చేస్తేనే ప్రతిస్పందిస్తాం. అమరులకు మా వందనాలు’’ అని ఫేసుబుక్ పోస్టులో లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు శిబూ లోంకర్ తేలి్చచెప్పాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనూజ్ థపన్ మరణానికి ప్రతీకారం? సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి గత కొన్నేళ్లుగా హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో ఆయనకు మహారాష్ట్ర పోలీసులు పటిష్టమైన భద్రత కలి్పస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బైక్‌పై వచి్చన ఇద్దరు వ్యక్తులు ముంబైలో సల్మాన్ ఇంటి ఎదుట తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఇద్దరిలో అనూజ్ థపన్ ఉన్నాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న థపన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మే 1న ముంబై క్రైమ్ బ్రాంచ్ లాకప్‌లో శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పగా, పోలీసులే చిత్రహింసలు పెట్టి చంపేశారని థపన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. థపన్ మరణం పట్ల ప్రతీకారంతో రగిలిపోయిన బిష్ణోయ్ ముఠా బాబా సిద్దిఖీని అంతం చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇది కూడా చదవండి: డీయూ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత -
అజిత్‌పవార్‌పై సుప్రియాసూలే ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబయి: ఎన్సీపీ పగ్గాలు తన కజిన్ అజిత్ పవార్‌కు ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైనప్పటికీ ఆయన తమను వీడి వెళ్లారని, ఇబ్బందులకు గురిచేశారని ఎంపీ సుప్రియాసూలే అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సూలే ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘అడిగితే అన్ని ఇచ్చేవాళ్లం. ఎన్సీపీ లీడర్‌ను చేసే వాళ్లం. కానీ ఆయన ఏదో ఊహించుకుని పార్టీవీడి వెళ్లారు. మా జీవితాలను ఇబ్బందుల పాలు చేశారు. ఇది వారసత్వ సమస్య కానేకాదు. ఎన్సీపీకి నాయకత్వం వహించేందుకు నేను ఆయనకు పోటీ రాలేదు. ఇది కేలం కూటమి సమస్య. ఆయన బీజేపీ, శివసేన కూటమితో వెళ్లాలనుకున్నందున వెళ్లిపోయారు’అని సూలే వివరించారు. ఈ విషయంలో అజిత్ పవార్‌తో తాను బహిరంగ చర్చకు సిద్ధమని సూలే సవాల్ విసిరారు. కాగా, శరద్‌పవార్ నేతృత్వంలో నడుస్తున్న ఎన్సీపీలోని ఎక్కువ మంది ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టుకున్న అజిత్ పవార్ బీజేపీ, శివసేన ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం అయిన విషయం తెలిసిందే. తర్వాతి పరిణామాల్లో అసలైన ఎన్సీపీని కూడా అజిత్ పవార్ కైవశం చేసుకున్నారు. -
మోదీ క్షమాపణల్లోనూ అహంకారమే
ముంబై: సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై మహా వికాస్ అఘాడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి కారణంగా ఈ తప్పిదం జరిగిందని, ఇది క్షమించరానిదని పేర్కొంది. ఆదివారం మహావికాస్ అఘాడీలోని ఎన్సీపీ(ఎస్పీ)చీఫ్ శరద్‌పవార్, శివసేన(యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేల సారథ్యంలో ముంబైలోని హుతాత్మ చౌక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు భారీ ర్యాలీ జరిగింది. ఆగస్ట్ 26న విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో క్షమాపణ చెప్పడం తెలిసిందే. దీనిపై ఠాక్రే స్పందిస్తూ..‘క్షమాపణ చెప్పడంలో ప్రధాని మోదీ అహంకారాన్ని గమనించారా? ఆయన అహంకారానికి ఇదో ఉదాహరణ. అదే సమయంలో డిప్యూటీ సీఎం ఒకరు నవ్వుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అవినీతి వల్లే విగ్రహం కూలింది. ఇది మహారాష్ట్ర ఆత్మకే అవమానం. క్షమించరాని నేరం. దేశం నుంచి బీజేపీ వెళ్లిపోవాలి’అని ఆయన డిమాండ్ చేశారు. సింధుదుర్గ్‌లో శివాజీ మహారాజ్ విగ్రహం బీజేపీ అవినీతి కారణంగానే కూలిందని, ఛత్రపతి అభిమానులకు ఇది అవమానకరం’అని శరద్ పవార్ పేర్కొన్నారు. -
కూలిన శివాజీ విగ్రహం: నిరసనకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు
ముంబై: గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్‌లో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఎత్తైన శివాజీ విగ్రహా ఆగస్టు 26 కుప్పకూలింది. ఈ విగ్రహం కూలిపోవటంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్ష మహా వికాస్ అఘాడి తప్పుపడుతూ సీఎం ఏక్నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. శివాజీ విగ్రహం కూలిపోవటంపై సెప్టెంబర్ 1న నిరసన ర్యాలీని చేపడతామని బుధవారం మహావికాస్ అఘాడీ ప్రకటించింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి హుతాత్మా చౌక్ నుంచి ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. బుధవారం శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, నానా పటోల్, సంజయ్ రౌత్‌లు సమావేశమైన అనంతరం నిరసన ర్యాలీని ప్రకటించారు.మరోవైపు.. సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వం శివాజీ విగ్రహ నిర్మాణం, ఏర్పాటు విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఉద్దవ్ ఠాక్రే ఆరోపణలు చేశారు.ఈ ఘటనకు ప్రభుత్వం, నేవి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇక.. విగ్రహం కూలడంపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. లాతూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘శివాజీ మహారాజ్ మనందరి ఆరాధ్య దైవం. ఆయన విగ్రహం కూలినందుకు మహారాష్ట్రలోని 13కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా’’ అని అన్నారు. -
బంధాలు, బిజినెస్ ఒకటి కాదు.. అజిత్ పవార్‌కు సోదరి కౌంటర్
ఎన్సీపీ(శరద్చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే.. తన సోదరుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్రప్రభుత్వానికి తమ ప్రియమైన సోదరీమణులను గుర్తుకు రాలేదు కానీ.. అసెంబ్లీ ఎన్నికల వేళ వారి ప్రేమ పొంగిపొర్లుతుందని సెటైర్లు వేశారు.కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి సోదరి సుప్రియా సోలే మీద పోటీకి తన భార్య సునేత్ర పవార్‌ను నిలబెట్టినందుకు బాధపడుతున్నట్లు అజిత్ పవార్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు సుప్రియా తన సోదరుడికి కౌంటర్ ఇచ్చింది.ఆమె మాట్లాడుతూ.. బంధాలు, వ్యాపారం మధ్య తేడాను మన సోదరులు గుర్తించలేకపోతున్నారు. ఎవరూ కూడా బంధాల మధ్యలోకి డబ్బును తీసుకురాకూడదు. అదే విధంగా వ్యాపారంలోకి సంబంధాలను లాగకూడదు. అయితే మా సోదరుడు దీనిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఇది మాకు చాలా బాధ కలిగిస్తోంది.’ అని అన్నారు.అంతేగాక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల నిజమైన ప్రేమ లేదని, ఎన్నికల లబ్ధి కోసం సంక్షేమ పథకాలను సాధనాలుగా వాడుకుంటుందని విమర్శించారు.‘ఈ ప్రభుత్వం ఏం చేసిన ఓట్ల కోసమే. మంచిఉద్దేశ్యంతో ఏం చేయదు. ఇదీ లోక్‌సభ ఎన్నికల ప్రభావం. రెండేళ్ల క్రితం అక్కాచెల్లెళ్లపై ఎవ్వరూ అభిమానం చూపలేదు. ఇది కేవలం లోక్‌సభ ఎన్నికల ప్రభావం మాత్రమే’ నని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలోని ‘లడ్కీ బహిన్’ స్కీమ్‌ను ఉద్ధేశించి చేసినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి వల్లనే మహిళలకు నెలకు రూ.1,500 ఇచ్చే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు -
నా ఫోన్ హ్యాక్ అయింది: ఎంపీ సుప్రియా సూలే
ముంబై: ఎన్సీపీ( శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే తన మొబైల్ ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయినట్లు తెలిపారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. ‘అర్జెట్: నా మొబైల్ ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయింది. దయచేసి బారామతి ప్రజలు ఎవరూ నాకు కాల్స్ లేదా సందేశాలు చేయోద్దు’. నేను మొబైల్ హ్యాక్‌కు సంబంధించి పోలీసు స్టేషన్‌కు వెళ్లి సాయం కోరాను’ అని తెలిపారు. మరోవైపు.. ప్రహార్ జనశక్తి పార్టీ (పీజేపీ) అధ్యక్షుడు, అధికార మహాయుతి మిత్రపక్షం ఎమ్మెల్యే ఓంప్రకాష్ అలియాస్ బచ్చు కడు శనివారం పూణెలో ఎన్సీపీ( శరద్ పవర్ వర్గం) చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు.శరద్ పవార్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార మహాయుతితో ఉండాలా.. లేదా కూటమి నుంచి వైదొలుగాలా? అనే విషయంఐ సెప్టెంబర్ 1న నిర్ణయం తీసుకుంటానని అన్నారు. దీనిపై ఎంపీ సుప్రియా సూలే స్పందిస్తూ.. దివ్యాంగుల రాజకీయ సిద్ధాంతాలు భిన్నమైనప్పటికీ వారి పక్షాన కడు కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి అందరూ ఏకం కావాలని ఆమె కోరారు. -
అజిత్‌కు శరద్ పవార్ మరో ఛాన్స్.. వ్యాఖ్యల అర్థం అదేనా?
ముంబై: అసెంబ్లీ ఎన్నికల ముందు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇవాళ పలువురు అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు ఆ పార్టీకి గుడ్‌చెప్పి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(శరద్ పవార్) వర్గంలో చేరారు. అయితే ఈ క్రమంలో అజిత్ పవార్ సైతం శరద్ పవార్ వర్గంలో చేరుతారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరందుకుంది. అయితే అజిత్ పవార్.. తమ వర్గంలోకి తిరిగి రావాలని ఆసక్తి చూపిస్తే చేర్చుకోవటంపై ఇప్పటికే స్పష్టత ఇచ్చారు శరద్ పవార్. అజిత్ పవార్‌ను తమ వర్గంలో చేర్చుకునే విషయం తన చేతిలో లేదని, అటువంటి విషయంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.‘ప్రతి ఒక్కరికి తమ పార్టీలో స్థానం ఉంటుంది. అయితే ఈ విషయంలో మాత్రం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇతర పార్టీలు నేతలను చేర్చుకోవటంలో నేను సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి లేదు. నాతోపాటు పార్టీ నేతలందరీని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం’ అని శరద్ పవార్ పేర్కొన్నారు.ఇక.. అజిత్ పవర్ వర్గానికి చెందిన పింప్రి చించ్వాడ్ ఎన్సీపీ యూనిట్ అధ్యక్షుడు అజిత్ గవానే, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాహుల్ భోసలే, స్టూడెంట్ వింగ్ చీఫ్ యష్ సానేతోపాటు, మాజీ కార్పొరేటర్లు రాహుల్ భోసలే, పంకజ్ భలేకర్ బుధవారం ఎన్సీపీ( శరద్ చంద్ర పవార్) వర్గంలో చేరారు. వీరంతా తమ పార్టీలో తిరిగి చేరటాన్ని శరద్ పవార్ స్వాగతించారు.కాగా, శరద్ పవార్ గత నెలలో ‘తన పార్టీ నాశనాన్ని కోరుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వారిని ఆహ్వానించం. కానీ పార్టీ పరువును దెబ్బతీయకుండా బలోపేతం చేసేందుకు కృషి చేసే నాయకుల్ని తిరిగి చేర్చుకుంటాం’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే మరోమూడు నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో ఇవాళ పార్టీ మారిన నేతల నిర్ణయంతో అజిత్ పవార్ (ఎన్సీపీ) పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలో పలువురు నేతల చేరికపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే స్పందిచారు. ‘ప్రతిపక్షాలు సైతం శరద్ పవార్‌పై నమ్మకంతో తమ వర్గంలో చేరటానికి ఆసక్తి చూపుతున్నాయి. అందుకే పలువురు నేతలు తమ పార్టీలో చేరారు’ అని ఆమె అన్నారు. మరోవైపు.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అజిత్ పవార్ వర్గం 4 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒక స్థానంలో మాత్రమే గెలిచింది.ఇక.. గతేడాది 8 మంది రెబెల్ ఎమ్మెల్యేతో అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తెచ్చి.. శివసేన (షిండే)వర్గం-బీజేపీ కూటమిలో ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంతో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. -
అజిత్ పవార్‌కు ఎదురు దెబ్బ.. శరద్ పవార్‌కు టచ్‌లోకి 15 మంది ఎమ్మెల్యేలు!
ముంబై : అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అజిత్ పవార్ వర్గంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 20 మంది నేతలు (అందులో 15మంది ఎమ్మెల్యేలు).. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి నేతృత్వం వహిస్తున్న అజిత్ పవార్‌కు గట్టి షాక్ తగిలింది. అజిత్ పవార్‌కు నేతృత్వంలోని ఎన్సీపీకి నలుగురు కీలక నేతలు రాజీనామా చేశారు. త్వరలోనే శరద్ పవార్‌తో జతకట్టనున్నారు.పింప్రి చించ్వాడ్ ఎన్సీపీ యూనిట్ అధ్యక్షుడు అజిత్ గవానే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను అజిత్ పవార్‌కు పంపించారు. గవానేతో పాటు స్టూడెండ్ వింగ్ అధ్యక్షుడు యష్ సానే,మాజీ కార్పొరేటర్లు రాహుల్ భోసలే,పంకజ్ భలేకర్ ఎన్సీపీకి గుడ్‌బై చెప్పారు.అజిత్ పవార్ వర్గంలో అలజడిపింప్రి చించ్వాడ్కు చెందిన నలుగురు కీలక నేతలు రాజీనామా చేయడంతో అజిత్ పవార్ వర్గంలో అలజడి మొదలైంది. మరికొందరు నేతలు సైతం అజిత్‌ను కాదని శరద్ పవార్‌తో టచ్‌లోకి వెళ్లారంటూ మహరాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు అందుకు ఊతం ఇచ్చేలా శరద్ పవార్ గత నెలలో ‘తన పార్టీ నాశనాన్ని కోరుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వారిని ఆహ్వానించం. కానీ పార్టీ పరువును దెబ్బతీయకుండా బలోపేతం చేసేందుకు కృషి చేసే నాయకుల్ని తిరిగి చేర్చుకుంటాం’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో పింప్రి చించ్వాడ్ అజిత్ పవార్ వర్గంలోని ఎన్సీపీ నేతలు తన రాజీనామాలు చేయడం మహా రాజకీయాలు మరోసారి చర్చకు దారి తీశాయి.షాక్‌లోకి అజిత్ పవార్ వర్గంఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహరాష్ట్ర అజిత్ పవార్ వర్గం 4 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. ఈ ఊహించని ఫలితాలు తనని షాక్‌కి గురి చేశాయని, ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలుకాగా, ఈ ఏడాది నవంబర్‌లో మహరాష్ట్రలో 288 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో ఉద్దవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేన 115 నుంచి 125 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుండగా.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ సైతం మెజార్టీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుండగా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలో డీలా పడ్డ అజిత్ పవార్ వర్గంలోని 15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్‌కు టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం.శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్గతేడాది మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ ఉద్ధండుడు శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నిట్టనిలువునా చీలింది. పార్టీ సీనియర్ నేత, పవార్‌కు స్వయానా అన్న కుమారుడైన అజిత్ పవారే పార్టీని చీల్చారు. ఎన్సీపీలో తనకు, తనకుమారుడు పార్థ్‌కు రాజకీయ భవిష్యత్ ఉండదనే ఆందోళనతో పార్టీని చీల్చి శరద్ పవార్ వర్గంలో నేతల్ని తనవైపుకు తిప్పుకున్నారు. వెంటనే ప్రభుత్వంలో చేరారు. వారిలో కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టారు. మహరాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టారు. -
ఎంవీఏ కూటమి సీఎం అభ్యర్థిపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ముంబై: అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయం అసక్తికరంగా మారుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి(ఎంవీఏ)కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందస్తుగా ప్రకటించాలని వస్తున్న సూచనను ఎన్సీపీ (శరద్ పవార్) చీఫ్ శరద్ పవార్ తిరస్కరించారు. కూటమి తరఫున శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీలో చర్చలు జరగుతున్న సమయంలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.‘మన కూటమే మన ఉమ్మడి సీఎం అభ్యర్థి. ఒక వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించటంపై మాకు నమ్మకం లేదు. ఉమ్మడి నాయకత్వమే మా ఫార్మూలా’ అని శరద్ పవార్ అన్నారు.అయితే సీఎం అభ్యర్థి ప్రకటనపై కూటమిలో గురువారం నుంచి అంతర్గతం వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఓవైపు శరద్ పవార్ తిరస్కరిస్తున్న సమయంలోనే శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్.. ఎంవీకే కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రేను నిలపాలని అంటున్నారు. శరద్ పవార్ వ్యాఖ్యపై సంజయ్ రౌత్ స్పందించారు.‘శరద్ పవార్ చెబుతుంది నిజమే. ఎంవీకే కూటమి ముందు మెజార్టీ స్థానాలకు సాధించాలి. అయితే రాహుల్ గాంధీని లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఉంటే మరో 23 నుంచి 30 సీట్లను ఇండియా కూటమి గెలచుకొని ఉండేది. ఇది మా పార్టీ అభిప్రాయం. ఏ ప్రభుత్వం, పార్టీ అయినా సీఎం అభ్యర్థి ముఖం లేకుండా ఉండకూడదు. ప్రజలకు కూడా తెలియాలి కదా.. వారు ఎవరికి ఓటు వేస్తున్నారో. ..ప్రజలు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, నరేంద్ర మోదీ ఇలా అభ్యర్థుల ముఖాలను చూసే ఓటు వేశారు. అదేవిధంగా ఎంవీఏ కూటమి తరఫున ఎవరిని సీఎం అభ్యర్థిగా పెట్టినా మాకు ఇబ్బంది లేదు. ఎంవీఏలో మూడు పార్టీలు ఉన్నాయి. మూడు పార్టీలు కలిసి లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాయి. మళ్లీ అసెంబ్లీకి సైతం ఇలాగే ఉమ్మడిగా పోటీ చేయడానికి సిద్ధం’ అని అన్నారు.ఇదిలా ఉండగా.. ఇటీవల సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘ఉద్ధవ్ ఠాక్రే గతంలో ఎంవీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన చేసిన మంచి పనులను ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. అదే విధంగా లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉద్ధవ్ ఠాక్రే పలు మిత్రపక్షాలను ముందుండి నడిపించారు’ అని అన్నారు. మహారాష్ట్రలో సెపప్టెంబర్/ అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. -
‘శరద్ పవార్‌కు టచ్‌లో 19 మంది అజిత్ వర్గం ఎమ్యెల్యేలు’
ముంబై: లోక్‌సభ ఎన్నికల ముగిసిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణమాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) నేత రోహిత్ పవార్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని అధికార ఎన్సీపీ నుంచి 18-19 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారని తెలిపారు. వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆ పార్టీకి గుడ్‌బై చెబుతారన్నారు. 2023 జూలైలో ఎన్సీపీలో చీలికలు జరిగినప్పటి నుంచి అజిత్ వర్గంవైపు ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడూ ఒక్కమాట కూడా ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, ఇతర సీనియర్ నేతలపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని గుర్తుచేశారు.‘అజిత్ వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. తమ నియోజకవర్గం అభివృద్ధి పనుల నిధుల కోసం సమావేశాల్లో పాల్గొంటారు. తర్వాత వారంతా అజిత్ వర్గం నుంచి బయటకు వచ్చేస్తారు. 18 నుంచి 19 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు శరద్‌పవార్‌తో టచ్‌లో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత శరద్ పవార్ వర్గంలో వారంతా చేరనున్నారు’అని రోహిత్ పవార్ అన్నారు. అజిత్ పవార్ వర్గం రాజ్యసభ ఎంపీప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. తనకు కేబినెట్ విస్తరణలో కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెతున్నారు. అంటే అజిత్ పవార్ వర్గంపై ప్రఫుల్‌కు మంచిపట్టు ఉందని తెలుస్తోంది. కానీ, అజిత్ పవార్ అనుకుంటున్న రాష్ట్ర అభివృద్ధి కోసమా? లేదా తనను ఈడీ నుంచి రక్షించుకోవడానికా? అని రోహిత్ పవార్ నిలదీశారు.ఇటీవల ఎంపీ ప్రఫుల్ పటేల్‌కు ఎన్డీయే ప్రభుత్వం కేంద్రమంత్రి( సంతంత్ర హోదా) పదవి ఆఫర్ ఇస్తే.. దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపి( ఎస్పీ) 8, అజిత్ వర్గం ఎన్సీపీ 1 ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. ఇక.. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జూన్ జూన్ 27 నుంచి జూలై 12 వరకు జరగనున్నాయి. అక్టోబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. -
రేపు NDA మిత్రపక్షాల భేటీ
-
మహారాష్ట్రలో ఎన్డీయే ఢీలా.. ఆధిక్యంలో ఇండియా కూటమి
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అందరిని షాక్‌కు గురిచేస్తున్నాయి. జాతీయ స్థాయిలో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రల్లో బీజేపీ, ప్రధాని మోదీ చరిష్మా తగ్గింది. అయోధ్య రామనాయం పనిచేయనట్లు కనిపిస్తుంది. 2019 ఫలితాలో పోలిస్తే తాజాగా బీజేపీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, బెంగాల్, మహారాష్ట్రలో గతం కంటే సగం సీట్లు కోల్పోయింది కాషాయ పార్టీ.చాలా చోట్ల ఊహించని విధంగా ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలో ఇండియా కూటమి ఆధిక్యంలో దూసుకుపోతుండగా.. ఎన్డీయే వెనుకంజలో ఉంది. మొత్తం 48 స్థానాల్లో ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీ 12 చోట్ల, శివసేన(షిండే వర్గం) ఆరు చోట్ల, ఎన్సీపీ(అజిత్ పవార్) ఒకచోట ఆధిక్యతలో ఉంది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ ముందంజలో ఉన్నారు. మరోవైపు మహా వికాస్ అఘాడి కూటమిలో భాగస్వామ్యమైన శివసేన(ఉద్దవ్ వర్గం) 10 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 10 సీట్లలో, ఎన్సీపీ(శరద్ పవార్) ఎనిమిది చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి సాంగ్లీ నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి విశాల్ పాటిల్ ఆధిక్యంలో ఉన్నారు.మొత్తానికి ఎన్డీయే కూటమి 19 చోట్ల, ఇండియా కూటమి 28 చోట్ల, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా 48 లోక్‌సభ స్థానాలతో దేశంలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. అయిదు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. మొత్తం 61 శాతం పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే 30 స్థానాలు గెలుచుకుంటుందని, ఇండియా 18 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వాస్తవ ఫలితాలు తారుమారు చేశాయి. -
ఎన్డీయేలో చేరాలన్న మోదీ.. శరద్ పవార్ స్పందన ఇదే
ముంబై: నకిలీ ఎన్సీపీ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీసీ (శరద్ చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారితో (బీజేపీ) తాను ఎప్పటికీ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు.మహారాష్ట్రలోని నందుర్బార్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గాన్ని ఉద్ధేశిస్తూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో విలీనమై ఉనికి కోల్పోవడం కన్నా.. అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేతో చేతులు కలపాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీయోలో చేరాలని తెలిపారు.‘గత 40-50 ఏళ్లుగా మహారాష్ట్రకు చెందిన ఓ ప్రముఖ నాయకుడు (శరద్ పవార్) రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. బారామతి లోక్‌సభ స్థానంలో పోలింగ్ తర్వాత ఏమవుతుందో అని ఆయన ఆందోళన చెందుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. జూన్ 4 అనంతరం చిన్న పార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్‌లో విలీం చేయాలని ఆయన అంటున్నారు’ అని మోదీ తెలిపారు. నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన ఇదే ఆలోచనతో ఉన్నట్లు’ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల పార్టీల గురించి ఎద్దేవా చేశారు.దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. మోదీ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. తాను గాంధీ-నెహ్రూ భావజాలాన్ని ఎన్నడూ వదులుకోనని, ముస్లిం వ్యతిరేక విధానాలు అవలంబించే వారితో చేతులు కలపనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతల్లో ఓటమి తాలూకు భయం కన్పిస్తోందని, అందుకే తన ప్రసంగాన్ని మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ తమపై వస్తున్న ప్రతికూలతను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. మోదీ పాలనలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని అన్నారు. ఇందుకు సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను అరెస్టు చేసిన ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు.‘కేజ్రీవాల్, సోరెన్‌లను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం పాత్ర లేకుండా ఇది సాధ్యం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థపై వారికి ఎంత విశ్వాసం ఉందో ఇది తెలియజేస్తోంది. ప్రధానమంత్రి మోదీ ఇటీవలి ప్రసంగాలు వర్గాల మధ్య చీలికలు సృష్టించేలా ఉన్నాయి. మోదీ ప్రసంగాలు ప్రధాని పదవికి తగినవి కావు. ఇది దేశానికి ప్రమాదకరం. శివసేన(యూబీటీ), ఎన్సీపీలను నకిలీ అని విమర్శించడం సరికాదు. డూప్లికేట్ అని పిలిచే హక్కు ఆయనకు ఎవరిచ్చారు?’ అని శరద్ మండిపడ్డారు -
బారామతిలో అలాంటి పనులు పనిచేయవు: అజిత్ పవార్
మహారాష్ట్రలో కీలకమై బారామతి పార్లమెంట్ స్థానంలో పవార్ వర్సెస్ పవార్ పోటీ నెలకొంది. మూడో దశలో మే 7(మంగళవారం) బారామతిలో పోలింగ్ జరగనుంది. ఆదివారంతో ఇక్కడ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో పూణె జిల్లాలోని బారామతిలో నిర్వహించిన ఓ ర్యాలీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘వికాస్ పురుష్’అంటూ ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఇటీవల తన మేనల్లుడు రోహిత్ పవార్‌పై విమర్శలు చేశారు. సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) అభ్యర్థి సుప్రియా సూలే తరఫున ప్రచారం చేస్తూ రోహిత్ పవార్ భావోద్వేగానికి గురైన విషయాన్ని ప్రస్తావించారు.‘నీ భావోద్వేగాలతో కొంతమంది ఆడుకుంటారని చెప్పాను. కానీ, అలాంటి పనులు బారామతిలో పని చేయవు. విమర్శలు చేయడానికి ప్రయత్నం చేయను. అభివృద్ధి కోసం నిరంతరం పని చేయటానికే నా తొలి ప్రాధన్యం. ఇప్పటివరకు చాలా ప్రచార ర్యాలీలో పాల్గొన్నా. కానీ, ఇంత పెద్దసంఖ్యలో అభిమానులు, జనాలను చూడలేదు. ఇదంతా చూస్తే.. మన గెలుపు ఖాయమని అర్థమవుతోంది. రాజకీయాలు నేర్పింది నేనే అని చెప్పే రోహిత్.. ఇప్పడు నాపై విమర్శలు చేస్తున్నాడు. అయినా నేను వాటిని పట్టించుకోను. అభివృద్ధి కోసం పనిచేయటమే నా తొలి ప్రాధాన్యం’ అని అజిత్ పవార్ అన్నారు. అదేవిధంగా ‘ప్రధాని మోదీ భారత దేశానికి వికాస్ పురుష్. ఈ లోక్‌సభ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. బారామతి గత 15ఏళ్లగా ఎటువంటి నిధులు పొందలేదు. కానీ, ప్రస్తుతం 2499 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు నిధలు అనుమతులు పొందాయి’ అని అజిత్ పవార్ వెల్లడించారు. ఇక.. ఇటీవల సుప్రియా సూలేకు మద్దతుగా ఓ ర్యాలీలో పాల్గొన్న రోహిత్ ప్రవార్ ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘పార్టీ రెండుగా చీలినప్పుడు నేను పార్టీ కార్యకర్తలతో కలిసి శరద్ పవార్‌ను కలిశాను. మేము, కుటుంబం అండగా ఉంటామని తెలిపాను’’ అని ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు. -
మామ శరద్ పవర్ మాట.. బోరుమని ఏడ్చిన కోడలు
ముంబై: మహరాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో వదిన (సునేత్ర), మరదలు (సుప్రియా సూలే) మధ్య పోటీ నెలకొంది. కొద్ది రోజుల క్రితం ‘పవార్ కార్డ్’ ఉపయోగించి తన సతీమణి, లోక్‌సభ అభ్యర్ధి సునేత్రా పవార్‌ను గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విజ్ఞప్తి చేశారు. అయితే అజిత్ పవార్ వ్యాఖ్యల్ని శరద్ పవార్ ఖండించారు. సునేత్ర పవార్ బయటి వ్యక్తి అని శరద్ పవార్ అన్నారు. ఈ తరుణంలో మీడియా ప్రతినిధులు ఇదే అంశంపై సునేత్రా పవార్‌ను ప్రశ్నించారు. శరద్ పవార్ మిమ్మల్ని ‘బయటి పవార్’ అని అనడంపై సునేత్ర పవార్ కన్నీటి పర్యంతమయ్యారు. మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Pune: NCP candidate from Baramati, Sunetra Pawar gets emotional when asked about Sharad Pawar's remark calling her 'outsider Pawar' Sunetra Pawar is the wife of Maharashtra Deputy CM Ajit Pawar and is contesting LS elections against NCP-SCP MP Supriya Sule from… pic.twitter.com/sJauAJa2fg — ANI (@ANI) April 13, 2024 -
రాజ్‌ఠాక్రేపై ఏ ఫైల్ ఓపెన్ చేశారు: సంజయ్ రౌత్
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌ఠాక్రేపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్ ఠాక్రేపై ఏదో ఫైల్ ఓపన్ చేశాని.. అందుకే ఒక్కసారిగా బీజేపీకి తన మద్దతు ప్రకటించారని సంజయ్ రౌత్ అన్నారు. ‘ఒక్కసారిగా ఏదో విచిత్రం జరిగింది. మేము ఈ విషయాన్ని రాజ్‌ఠాక్రేను అడగదలుచుకున్నాం. ఒక్కసారిగా మారిపోయి మహారాష్ట్ర శత్రువుల(ప్రత్యర్థుల)వైపు చేరి పూర్తి మద్దతు ఇస్తున్నారు. మీరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? ఇలా చేయటం వెనక ఉన్న బలమైన కారణం ఏంటీ? మీ మీద ఏ ఫైల్ ఓపెన్ చేశారు?’ అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సోదరుడైన రాజ్ ఠాక్రే... తన పార్టీ బీజేపీ, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ (ఎన్సీపీ) కూటమికి సంపూర్ణ మద్దత ఇస్తుందని ప్రకటించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ ఠాక్రే.. తన పార్టీ కేవలం ప్రధాని నర్రేందమోదీ, ఎన్డీయే కూటమికే మాత్రమే మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తనకు 1990 నుంచి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మొదటి నుంచి నరేంద్ర మోదీ.. ప్రధాని అవుతారన్న వారిలో తాను ఒకరినని చెప్పారు. ఇక.. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం మహావికాస్ ఆఘాడీ కూటమి మధ్య సీట్లు పంపిణీ ఖరారైన విషయం తెలిసిందే. శివసేన (యూబీటీ)కి -21,కాంగ్రెస్- 17, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్)-10 సీట్లుతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. -
మహారాష్ట్రలో కూటమి సీట్ల పంపిణీ ఖరారు.. ఏ పార్టీకి ఎన్ని?
ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ ఎట్టకేలకు మహారాష్ట్రలో ప్రతిపక్షాల ఇండియా కూటమి సీట్ల పంపిణీ ఒప్పందం కుందిరింది. ఈ మేరకు మంగళవారం మహావికాస్ఆఘాడీ నేతలు సంయుక్తంగా ప్రకటించారు. శివసేన(యూబీటీ) 21 సీట్లు, కాంగ్రెస్‌పార్టీ 17 సీట్లు, ఎన్సీపీ(శరద్ చంద్ర పవార్) 10 సీట్లతో లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. మొదటి నుంచి ఆశించిన సంగాలి లోక్‌సభ నియోజకవర్గాన్ని శివసేన(యూబీటీ) దక్కించుకోగా.. భీవండి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మరోవైపు శివసేన(యూబీటీ)కి పట్టు ఉన్న ముంబై నార్త్ స్థానాన్ని సీట్ల పంపిణీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవటం గమనార్హం. సీట్ల పంపిణీ అనంతం శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ‘ప్రతిఒక్కరు అన్ని సీట్లలో గెలవడానికి తీవ్రంతా పోరాడాలి. పోరాడటంలో ఎలాంటి తప్పు లేదు. ఖచ్చితంగా అన్ని సీట్లలో గెవడానే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి’ అని ఉద్ధవ్ అన్నారు. మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. అయితే కొన్ని కీలకమైన సీట్ల విషయంలో మహా వికాస్ ఆఘాడీ కూటమి సీట్ల పంపకం కొంత జాప్యమైన విషయం తెలిసిందే. -
‘బీజేపీవి చెత్త రాజకీయాలు’.. సుప్రియా సూలే ఫైర్
ముంబై: బారామతి లోక్‌సభ స్థానం విషయంలో బీజేపీ తమపై కుట్ర చేస్తోందని ఎన్సీపీ(శరద్ చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే మండిపడ్డారు. ముఖ్యంగా తన వదిన సునేత్ర పవార్‌ను బారామతి బరిలోకి దించి ఎన్సీపీ( శరద్ చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ రాజకీయంగా ఉన్న పేరును అంతం చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోందని దుయ్యబట్టారు. ‘నా పోరాటం ఒక వ్యక్తిగా వ్యతిరేకంగా కాదు. వారి(బీజేపీ) ఆలోచనలు, విధానాలుపై మాత్రమే. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి18 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకు ఒక్క వ్యక్తి కూడా నేను వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. సునేత్ర పవార్ తను పెద్దన్న భార్య అని.. అంటే తల్లితో సమానం’ అని అన్నారు. ‘బీజేపీవి చెత్త రాజకీయాలు, సునేత్ర పవార్ మా పెద్దన్న భార్య. మరాఠీ కుటుంబంలో అన్న భార్యకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మాకు ఆమె తల్లితో సమానం. మాలో మాకు శత్రుత్వం పెంచడానికి సునేత్రను బారామతి బరిలో దింపుతున్నారు. ఈ నిర్ణయం వెనక బీజేపీ హస్తం ఉంది. ఎన్సీపీ(శరద్ పవార్) చీఫ్ శరద్‌పవార్ పేరును రాజకీయంగా దెబ్బతీయాలని బీజేపీ కుట్ర చేస్తోంది. బారామతి నియోజకవర్గం అభివృద్ధి గురించి బీజేపీ ఆలోచించదు’ అని సుప్రియా సూలే మండిపడ్డారు. అధికారికంగా బారామతి స్థానంలో మహారాష్ట్ర బీజేపీ కూటమి నుంచి సునేత్ర పవార్‌ను బరిలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సునేత్ర పవార్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ రోజు నాకు చాలా గొప్ప రోజు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ధన్యవాదాలు’ అని అన్నారు. -
‘రాఘవ్ చద్దా ఎక్కడ?’.. పోస్ట్ డిలీట్ చేసిన ఎన్సీపీ నేత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన అరెస్ట్‌ను ఆప్ మంత్రులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఇకప్పటికీ స్పందించకపోవటంపై ఎన్సీపీ (శరద్ పవార్) నేత జితేంద్ర అవధ్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. అయితే ప్రతిపక్షాల కూటమిలో భాగంగా.. ఎన్సీపీ, ఆప్ భాగస్వామ్య పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఎంపీ రఘవ్ చద్దా స్పందించలేదని ఎన్సీపీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ‘రఘవ్ చద్దా ఎక్కడ?’ అని ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టిన ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్ తర్వాత దాన్ని డిలీట్ చేయటం గమనార్హం. శనివారం జితేంద్ర అవధ్ మాట్లాడుతూ.. ‘ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి రాజ్యసభ ఎంపీ రఘవ్ చద్దా కనిపించటం లేదు. ఆ పార్టీ నేతలు కేజ్రీవాల్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. కానీ, ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎంపీ రాఘవ్ చద్దా మాత్రం కనిపించటం లేదు. ఆప్‌కు రాఘవ్ చద్దా కీలకమైన నేత.. ఆయన ఇక్కడ లేకపోవటం, అరెస్ట్‌పై స్పందించకపోవటం కార్యకర్తలను అవనించినట్లే’ అని జితేంద్ర అన్నారు. దూరంగా వేరే దేశంలో ఉన్నంత మాత్రనా ప్రజలతో కనెక్ట్కాలేని రోజుల కాలం కాదు. ఆయన లండన్‌లో ఉన్పటికీ కనీసం స్పందిచకపోవటం చాలా విచిత్రం. ఒక వీడియో సందేశమైనా పార్టీకి, కార్యకర్తలకు పంపాలి. రఘవ్ చద్దా పూర్తిగా కనిపించకుండా, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నా’ అని ఎనన్సీపీ నేత జితేంద్ర అవధ్ అన్నారు. ఇక.. రఘవ్ చద్దా, ఆయన భార్య పరిణితి చోప్రాతో కలిసి లండన్ వెళ్లారు. కంటికి సంబంధించిన చికిత్స కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుసస్తోంది. ఢల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 1తో ఈడీ కస్టడీ ముగియనుంది. -
పార్టీలకు ప్రతిష్టాత్మకంగా విదర్భ!
మహారాష్ట్రలోని విదర్భ లోక్‌సభ స్థానానికి జరిగే ఎన్నికలు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత రెండు ఎన్నికల్లో విదర్భ ఓటర్లు బీజేపీ, శివసేన జంటకు తమ మద్దతు పలికారు. తూర్పు విదర్భలో బీజేపీ, పశ్చిమాన శివసేన గట్టి పట్టు సాధించాయి. అయితే 1960 నుంచి 2009 వరకు విదర్భ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికల్లో చాలాచోట్ల కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైనప్పుడు విదర్భ ప్రజలు ఇందిరా గాంధీకి మద్దతుగా నిలిచారు. విదర్భ అనేది తూర్పు మహారాష్ట్రలోని 11 జిల్లాలు కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో 10 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో నాగ్‌పూర్, రామ్‌టెక్, చంద్రాపూర్, గోండియా భండారా గడ్చిరోలి స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది. రెండో దశలో ఏప్రిల్ 26న అకోలా, అమరావతి, వార్ధా, యవత్మాల్ వాషిం, బుల్దానా స్థానాలకు పోలింగ్ జరగనుంది. శివసేనకు చెందిన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే, ఎన్‌సిపికి చెందిన శరద్ పవార్, కాంగ్రెస్‌కు చెందిన మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి, అధికార బీజేపీ, శివసేన, ఎన్సీపీ (అజిత్ వర్గం) మహాకూటమి మధ్య అన్ని స్థానాల్లో గట్టి పోటీ ఉంది. హైవే మ్యాన్‌గా బిరుదు పొందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మూడోసారి నాగ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. నాగ్‌పూర్ సౌత్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వికాస్ ఠాక్రేను పోటీకి దింపడం ద్వారా కాంగ్రెస్.. బీజేపీకి గట్టి పోటీనిస్తుండగా, గడ్కరీ హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం విదర్భ పరిధిలోని నాగ్‌పూర్‌లో ఉంది. పొరుగున ఉన్న వార్ధా నియోజకవర్గం మహాత్మా గాంధీ జన్మస్థలం. రైతు ఆత్మహత్యలకు నెలవైన విదర్భలోని ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన సమస్యలు ఉన్నాయి. 64 సంవత్సరాల క్రితం విదర్భ ప్రాంతం నాగ్‌పూర్ ఒప్పందం కింద మహారాష్ట్రలో విలీనమైంది. మహారాష్ట్రలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే విదర్భలోని మొత్తం 62 సీట్లలో, బీజెపీ 29, అవిభక్త శివసేన 4, ఎన్సీపీ 6, కాంగ్రెస్ 15 ఇతరులు 8 సీట్లు గెలుచుకున్నారు. 2014లో విదర్భలో బీజేపీ 44 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. -
‘బీజేపీది రాజకీయం కాదు.. ప్రజాస్వామ్య హత్య’
ముంబై: బీజేపీలోకి చేరేవాళ్లంతా.. ఆ పార్టీ మీద ప్రేమతో చేరటం లేదని ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) పార్టీ ఎంపీ సుప్రీయా సూలే అన్నారు. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్, సీబీఐ, ఈడీ కారణంగా బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. బారామతి నియోజకర్గంలో తనపై పోటీగా ఎవరు నిలబడతారనే విషయం ఇంకా తెలియదన్నారు. అధికారికంగా ప్రకటన వెలువడలేదని చెప్పారు. ‘దేశంలో ప్రజాస్వాయ్యం హత్యకు గురువుతోంది. బీజేపీలో ఎవరూ ప్రేమతో చేరటం లేదు. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్, సీబీఐ, ఈడీ వల్ల చేరుతున్నారు. బీజేపీ ఆశోక్ చవాన్‌పై ఒత్తిడి తెచ్చి.. పార్టీలోకి చేర్చుకుంది. బీజేపీ.. పార్టీలను ఎలా ముక్కలు చేస్తోందో తెలుస్తోంది. ఇది రాజకీయం కాదు.. ప్రజాస్వామ్య హత్య’ అని సుప్రీయా సూలే మండిపడ్డారు. ఇక గత ఎన్నికలతో పోల్చితే ఈసారి భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్సీపీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. ఇక.. ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్.. బీజేపీ, శివసేన (ఏక్నాథ్ షిండే) కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. అయితే కీలకమైన బారామతి లోక్‌సభ స్థానంలో పవార్ వర్సెస్ పవార్‌గా పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ సతీమణి పర్యావరణ కార్యకర్త సునేత్ర పవార్ బారామతి బరిలో దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బారిమతిలో ఈసారి కూడా తానే విజయం సాధిస్తానని సుప్రీయా సూలే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బారామతి నియోజకవర్గ ప్రజలకు నేను చేసిన పనులు అందరికీ తెలుసు. నాపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు’ అని సుప్రీయా సూలే స్పష్టం చేశారు. బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఆమె 2009 నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. బారామతి పార్లమెంట్ స్థానం ఎన్సీపీ (శరత్ చంద్ర పవార్) చీఫ్ శరత్ పవార్ కుటుంబానికి కంచుకోట. -
బీజేపీకి ‘సపోర్టింగ్ పార్టీ’ ఈడీ : శరద్ పవార్
ఎన్సీపీ(ఎస్పి) అధినేత శరద్ పవార్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి ఏజెన్సీల సాయంతో ప్రతిపక్ష పార్టీల నాయకులలో భయాన్ని పుట్టించేందుకు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బీజేపీకి ఈడీ ‘సపోర్టింగ్ పార్టీ’ అని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్ పూణేలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శరద్ పవార్ మాట్లాడుతూ.. బీజేపీ..ఈడీ వంటి ఏజెన్సీల సహాయంతో ఎన్నికలను ప్రభావితం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని, ప్రతిపక్షం నుండి పోటీ చేయవద్దని అభ్యర్థులను బెదిరిస్తుందని వాపోయారు. ఈ సందర్భంగా 2005 - 2023 మధ్య ఈడీ తీసుకున్న చర్యలను ఉదహరిస్తూ.. 5,806 కేసులు నమోదు చేసిందని, వాటిల్లో కేవలం 25 మాత్రమే పరిష్కరించిందని తెలిపారు. ‘2005- 2023 మధ్య రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. యూపీఏ హయాంలో ఈడీ 26 మంది నాయకులను విచారించింది. వారిలో ఐదుగురు కాంగ్రెస్, ముగ్గురు బీజేపీకి చెందిన నేతలున్నారు. కానీ 2014 తర్వాత ఒక్క బీజేపీ నాయకుడిని కూడా ప్రశ్నించలేదన్న ఆయన... ఈడీ చర్యల గురించి బీజేపీ నేతలకు ముందే తెలుసు. బీజేపీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు కనిపిస్తోంది’ అని పవార్ పేర్కొన్నారు. -
Maharashtra Politics: బారామతిలో ప‘వార్’!
ఎన్సీపీ పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వంలో చేరి ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టిన అజిత్ పవార్.. తన భార్యను రాజకీయ అరంగేట్రం చేయిస్తున్నారా? అందులోనూ దిగ్గజ నేత శరద్‌పవార్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్న‘బారామతి’ నుంచే బరిలో దింపుతున్నారా? అంటే ఎన్సీపీ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ వార్తలను బలం చేకూరుస్తూ ఇప్పటికే కొన్ని చోట్ల ‘బారామతి ఎంపీ సునేత్రా పవార్’ అంటూ భారీ హోర్డింగ్‌లనూ పెట్టేశారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనే పుకార్లు బారామతి నియోజకవర్గంలో షికార్లుచేస్తున్నాయి. అసలు సునేత్రా పేరు తెరమీదకు ఎందుకొచి్చంది? అనే ప్రశ్నకు ఆమె భర్త అజిత్ వ్యాఖ్యల్లో సమాధానం దొరుకుతుంది. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో డెప్యూటీ సీఎం అజిత్ పవార్ భావోద్వేగంతో చేసిన ప్రసంగం ఈ వార్తలకు బలం చేకూర్చింది. బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని నిలపబోతున్నారో ఆయన స్పష్టంగా చెప్పకపోయినా.. ‘ ఈసారి బారామతిలో కొత్త అభ్యరి్థని నిలుపుతాం. తొలిసారి పోటీచేస్తున్న అభ్యరి్థ.. మన భవిష్యత్ తరాల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేయగలరు. కొందరు ‘పాత’ భావోద్వేగాలతో ఓటేయాలని మిమ్మల్ని అడుగుతారు. పట్టించుకోకండి. జరగబోయే నిరంతర అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. మొదటిసారి పోటీచేస్తున్నా ఆశీర్వదించండి. అభివృద్ధిని గెలిపించండి’ అని పిలుపునిచ్చారు. వెంటనే భార్య సునేత్రనే ఆయన రంగంలోకి దింపబోతున్నారని భావించిన ఎన్సీపీ పార్టీ వర్గాలు ఆ నియోజకవర్గం ప్రధాన కూడళ్లలో భారీ హోర్డింగ్‌లు పెట్టేశాయి. కాబోయే ఎంపీ సునేత్రా పవార్ అని రాసి ఉన్న ప్లెక్సీలతో బారామతిలో అప్పుడే ఎన్నికల కోలాహలం మొదలైంది. శరద్‌పవార్ కుటుంబానికి కంచుకోట ఈ నియోజకవర్గం. ఇక్కడ ఎన్సీపీ దిగ్గజ నేత శరదపవార్ కూతురు సుప్రియా సూలే సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. 2009 ఏడాది నుంచి అప్రతిహతంగా ఆమె జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆమెను ఢీకొట్టాలంటే తమ కుటుంబానికే చెందిన మహిళా అభ్యర్థి అయితేనే ఎన్నికల రణరంగంలో నెగ్గుకు రాగలరని అజిత్ పవార్ భావిస్తున్నారు. అందుకే భార్యను బరిలో నిలుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్సీపీ పార్టీని అజిత్ పవార్ చీలి్చన నేపథ్యంలో పార్టీ ఓటర్లు సైతం రెండు వర్గాలుగా చీలే అవకాశముంది. అప్పుడు సుప్రియా, సునేత్రలలో ఎవరు గెలుపు తలుపు తట్టగలరో వేచి చూడాల్సిందే. ఎవరీ సునేత్రా? అజిత్ భార్యగా తప్పితే రాజకీయ వర్గాల్లో ఎవరికీ తెలియని పేరు సునేత్ర. ఆమె చాలా సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. శరద్‌పవార్‌కు ఒకప్పటి సన్నిహిత నేత, మాజీ మంత్రి పద్మసిన్హా పాటిల్ చెల్లెలే ఈమె. ప్రత్యక్ష రాజకీయాలు ఈమెకు కొత్త. ఎని్వరాన్‌మెంట్ ఫోరమ్ ఆఫ్ ఇండియా పేరిట ఒక ఎన్జీవోను సునేత్ర నడుపుతున్నారు. సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ఈమె అమితంగా ప్రోత్సహిస్తున్నారు. పర్యావరణహిత గ్రామాల స్థాపనకు కృషిచేస్తున్నారు. ప్రముఖ విద్యాసంస్థ ‘విద్యా ప్రతిష్ఠాన్’కు ట్రస్టీగా ఉన్నారు. ఫ్రాన్స్‌లోని మేథో సంస్థ వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్íÙప్ ఫోరమ్‌లో 2011 నుంచి భాగస్వామిగా కొనసాగుతున్నారు. అయితే ఈమె మెల్లిగా ప్రచారకార్యక్రమాలు మొదలెట్టినట్లు తెలుస్తోంది. 2019లో సుప్రియాపై పోటీచేసి ఓడిపోయిన బీజేపీ మహిళా అభ్యర్థి కంచన్ రాహుల్ కౌల్‌ను ఈవారమే కలిసి చర్చించారని వార్తలొచ్చాయి. అజిత్, సునేత్రలకు ఇద్దరు కుమారులు. జై పవార్, పార్థపవార్. 2019లో మావాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి పార్థపవార్ ఓటమిని చవిచూశారు. కంచుకోట బారామతి పవార్ల కుటుంబానికి పుణె జిల్లాలోని బారామతి పెట్టనికోట. గత 55 సంవత్సరాలుగా ఇక్కడ వీరిదే హవా. తొలిసారిగా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 1967లో బారామతి ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి పోటీచేసి శరద్‌పవార్ గెలిచారు. తర్వాత 1972, 1978, 1980, 1985, 1990 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్థానంలో ఘన విజయం సాధించారు. ఇదే బారామతి లోక్‌సభ స్థానం నుంచీ శరద్‌పవార్ 1984, 1996, 1999, 2004 ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. అజిత్ పవార్ సైతం 1991లో ఇదే లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుంచి అజిత్ ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం బారామతి ఎమ్మెల్యే అజితే. 2009 నుంచి సుప్రియా సూలే ఇక్కడ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఇక్కడ ఈసారి సునేత్రను దింపితే స్పష్టంగా ‘పవర్’ప్లే మొదలైనట్లే. పెదనాన్న కొడుకైన అజిత్.. సుప్రియాకు అన్నయ్య అవుతారు. ఆ లెక్కన వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో చూడాలి మరి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్సీపీని లాగేసుకున్న ఈసీ: పవార్
పుణే: ఎన్సీపీని ఎన్నికల సంఘమే తమనుంచి లాగేసుకుందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ వాపోయారు. ఎన్సీపీ పేరును, గుర్తును అజిత్ పవార్ వర్గానికి ఈసీ కేటాయించడం తెలిసిందే. ఆదివారం పుణేలో జరిగిన శరద్ పవార్ ఒక కార్యక్రమంలో దీనిపై స్పందించారు. ఎన్సీపీని స్థాపించి, బలోపేతం చేసిన వారి చేతుల్లో నుంచి లాగేసుకోవడమే గాక ఇతరులకు అప్పగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందన్నారు. దీన్ని ప్రజలు హర్షించరని నమ్మకం తనకుందని చెప్పారు. -
అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠకు శరద్ పవార్ దూరం
ముంబయి: అయోధ్య రామ మందిరంలో జనవరి 22న జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ తెలిపారు. ఆహ్వానం పంపించినందుకు రామమందిరం ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణప్రతిష్ఠకు పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నందున దర్శనం పొందడం సులభం కాదని అన్నారు. జనవరి 22 తర్వాత దర్శనం పొందడం సులభం అవుతుందని ఆయన చెప్పారు. త్వరలో అయోధ్యను దర్శిస్తానని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి, భక్తికి రాముడు ప్రతీక అని శరద్ పవార్ అన్నారు. "అయోధ్యలో జరిగే కార్యక్రమం కోసం రామభక్తులలో విపరీతమైన ఉత్సాహం ఉంది. వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఈ చారిత్రాత్మక సందర్భం నాకు ఆనందాన్నిస్తోంది. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత దర్శనం పొందడం సులభం అవుతుంది" అని శరద్ పవార్ ఓ ప్రకటనలో తెలిపారు. అయోధ్య రామున్ని త్వరలో ప్రార్థిస్తానని శరద్ పవార్ పేర్కొన్నారు. అప్పటికి రామమందిర నిర్మాణం కూడా పూర్తవుతుందని చెప్పారు. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. జనవరి 16 నుంచే ప్రాణప్రతిష్ఠకు జరగాల్సిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రజాప్రతినిధులతో సహా సెలబ్రిటీలకు కూడా ఆహ్వానాలు అందాయి. జనవరి 23 నుంచి రామాలయాన్ని సాధారణ భక్తుల దర్శనం కోసం తెరవనున్నారు. ఇదీ చదవండి: Lata Mangeshkar: లతా మంగేష్కర్ ఆఖరి రామ శ్లోకాన్ని షేర్ చేసిన ప్రధాని మోదీ! -
ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి అవసరం లేదు: శరద్ పవార్
ముంబయి: ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థిని ముందు ప్రకటించాల్సిన అవసరం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అన్నారు. కూటమి పేరుతోనే ఓట్లు అడగాలని శరద్ పవార్ పేర్కొన్నారు. దేశానికి ఇండియా కూటమి ప్రత్యామ్నాయంగా మారగలదని చెప్పారు. ఇండియా కూటమి సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవార్.. "కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఇండియా పేరుతో ఓట్లు అడగాలని నేను నమ్ముతున్నా. దేశానికి ఇండియా కూటమి ప్రత్యామ్నాయాన్ని అందించగలదు." అని శరద్ పవార్ అన్నారు. మొరార్జీ దేశాయ్ 1977లో జనతా పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రి అయినప్పుడు జరిగిన రాజకీయ మార్పులను కూడా పవార్ ప్రస్తావించారు. ఆనాటి ఎన్నికలకు ముందు జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేదని చెప్పారు. ప్రధానమంత్రి అభ్యర్థి, లోక్‌సభ సీట్ల పంపిణీపై వచ్చిన కొన్ని నివేదికలను తోసిపుచ్చుతూ "కూటమి సమూహంలో ఎలాంటి అసంతృప్తి లేదు" అని స్పష్టం చేశారు. ఇండియా కూటమికి ఛైర్మన్‌గా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేయడంపై పవార్ మాట్లాడుతూ.. "ఇండియా కూటమి అధ్యక్షుడిగా ఖర్గే ఉండాలని కొందరు నేతలు సూచించారు. చాలా మంది అందుకు అంగీకరించారు. నితీష్ కుమార్‌ను కన్వీనర్‌గా ప్రతిపాదించారు. అయితే.. అందుకు నితీష్ కుమార్ తిరస్కరించారు. ప్రస్తుతానికి అది అవసరం లేదు". అని ఆయన అన్నారు. ఇదీ చదవండి: ‘ఇండియా’కు ఖర్గే సారథ్యం! -
రిటైర్మెంట్కి కొందరు ఎప్పటికీ ఇష్టపడరు: అజిత్ పవార్
ముంబయి: ఎన్సీపీలో అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య వర్గపోరు నడుస్తూనే ఉంది. పార్టీలో ఉన్నత పదవి నుంచి వైదొలగాలన్న నిర్ణయానికి శరద్ పవార్ కట్టుబడి ఉండనందుకు తాను ఇప్పటికీ కలత చెందుతున్నానని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరోసారి అన్నారు. నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత కూడా పదవీ విరమణ చేయడానికి కొంతమంది ఇష్టపడరు అని శరద్ పవార్‌ను ఉద్దేశించి అజిత్ పవార్ అన్నారు. "ఒక వయస్సు వచ్చిన తర్వాత ప్రజలే ఆపాలి. ఈ సంప్రదాయం ఏళ్లుగా కొనసాగుతోంది. వినడానికి సిద్ధంగా లేని కొందరు వ్యక్తులు ఉన్నారు. వారు తమ అభిప్రాయాల పట్ల మొండిగా ఉంటారు. 60 ఏళ్ల తర్వాత, కొందరు 65 ఏళ్ల వయస్సులో, కొందరు 70 ఏళ్లలో, మరికొందరు 80 ఏళ్లలో పదవీ విరమణ చేస్తారు. కానీ 80 ఏళ్లు నిండిన తర్వాత కూడా ఓ వ్యక్తి పదవీ విరమణకు సిద్ధంగా లేరు" అని అజిత్ పవార్ అన్నారు. "ఏం జరుగుతోంది? మేము పని చేయడానికే ఇక్కడ ఉన్నాం. ఎక్కడైనా తప్పు జరిగితే మాకు తెలియజేయండి. మాకు చాలా సత్తా ఉంది. నేను రాష్ట్రానికి చాలాసార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాను. మేము అనేక పథకాలను విజయవంతం చేశాము" అని పరోక్షంగా శరద్ పవార్‌ను ఉద్దేశించే అజిత్ పవార్ అన్నారు. ఎన్సీపీలో అత్యున్నత పదవుల విషయంలో శరద్ పవార్‌కు అజిత్ పవార్‌కు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. శరద్ పవార్ అధ్యక్ష పదవి నుంచి తొలగినట్లే తొలగి మళ్లీ అధిష్టించారు. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి షిండే ప్రభుత్వంతో కలిసిపోయారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. పార్టీ పేరు, గుర్తుపై ఎన్నికల కమిషన్ వద్ద సవాలు చేశారు. ఈ పరిణామాల మధ్య అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య రాజకీయ వివాదం నడుస్తోంది. ఇదీ చదవండి: TMC: నేతల్లో అంతరాలు లేవు.. మమతా నాయకత్వంలోనే.. -
Shiv Sena (UBT): ‘సీట్ల పంపిణీ చర్చలు మళ్లీ మొదటికి’
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమితో సీట్ల పంపణీ విషయంపై శివసేన(ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పార్టీ సంప్రదింపులు ఓ కొలిక్కి రావటం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ మొదటి నుంచి సీట్ల పంపిణీ చర్చలు జరగనున్నట్లు శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. శివసేన గెలిచిన సీట్లపై కాకుండా మిగతా సీట్లపై చర్చలు కొంత అలస్యంగా జరుపుతామని తెలిపారు. ఇదే విషయాన్ని తాము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు తెలియజేశామన్నారు. 2019లో బీజేపీ కూటమి ద్వారా ఎన్నికల బరిలోకి దిగి 23 స్థానాల్లో పోటీ చేయగా 18 సీట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గతేడాది శివసేనలో ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో చీలికలు వచ్చాయి. మెజార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే మహారాష్ట్రకు సీఎం అయ్యారు. అయితే ఇప్పటికీ శివసేన(ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే).. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిలో కొనసాగుతోంది. మొదటి నుంచి శివసేన(యూబీటీ) తాము 23 స్థానాల్లో పోటీ చేస్తామంటూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో శివసేన(యూబీటీ) తాము 2019లో గెలిచిన సీట్లు తప్ప మిగతా వాటిపై చర్చలు కొంత అలస్యంగా జరుపుతామని కాంగ్రెస్ నేతలకు వెల్లడించింది. చదవండి: ‘నేను కూడా హిందూనే’.. హిందుత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు -
'రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు'
లక్నో: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని ఎన్సీపీ నేత శరద్ పవార్ చెప్పారు. రామ మందిరాన్ని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమని ఆయన అన్నారు. ఎదైతేనేం.. రామాలయం ఏర్పడైనందుకు సంతోషిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ఎంతో మంది సహకారం ఉందని అన్నారు. అయోధ్యలో జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లతో సహా దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందాయి. దాదాపు 6000 మందికిపైగా ఈ వేడుకకు హాజరుకానున్నారు. డిసెంబర్ 30న అయోధ్యలో ఎయిర్‌పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇదీ చదవండి: ఇది ఇంగ్లాండ్ కాదు.. కన్నడ భాషా వివాదంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు -
ఓబీసీ సర్టిఫికెట్ దుమారం: శరద్ పవార్ కౌంటర్
Sharad Pawar నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గానికి చెందిన వ్యక్తి అంటూ ఒక సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శరద్‌పవార్ స్పందించారు. కులాన్ని దాచుకోవాల్సిన అవసరం తనకు లేదని, కులాన్ని అడ్డం పెట్టుకుని తాను ఏనాడూ రాజకీయాలు చేయలేదని మంగళవారం ప్రకటించారు. తన కులం ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. తాను ఏనాడూ కులం ఆధారంగా రాజకీయాలు చేయలేదు.. చేయను కూడా అని పవార్ ప్రకటించారు. కానీ సమాజంలోని సమస్యలను పరిష్కారం తాను చేయాల్సింది చేస్తానని పవార్ వెల్లడించారు. ఓబీసీ సామాజికవర్గం పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని, అయితే తాను పుట్టిన కులాన్ని దాచిపెట్టడం తనకు ఇష్టం ఉండదన్నారు. అయితే మరాఠా కమ్యూనిటీ కోటాపై మాట్లాడుతూ, రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిధిలోని దన్నారు. మరాఠాలకు రిజర్వేషన్లపై యువత సెంటిమెంట్ చాలా తీవ్రంగా ఉందని కానీ ఈ విషయంలో నిర్ణయాధికారం మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. ఎన్సీపీ ఎంపీ, పవార్ కుమార్తె సుప్రియా సూలే ఇది నకిలీదని ఇప్పటికే దీన్ని కొట్టిపారేశారు. శరద్ పవార్ 10వ తరగతి చదువుతున్నప్పుడు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు ఉండేవా ప్రజలు ఆలోచించాలని ఆమె కోరారు. ఇది ఫేక్ సర్టిఫికెట్ అని శరద్ పవార్ మద్దతుదారు వికాస్ పసల్కర్ గట్టిగా వాదించారు. అసలు శరద్ పవార్ అలాంటి సర్టిఫికెట్ ఏదీ తీసుకోలేదని ఆయన పరువు తీసేందుకు జరుగుతున్న కుట్ర అని మండిపడ్డారు. నాగ్ పూర్ కేంద్రంగా ఇలా జరుగుతోందని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ఇటీవల రాష్ట్రమంతటా తీవ్ర హింసకు దారితీసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మరాఠా సంఘం పెద్దఎత్తున నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం వివాదానికి దారి తీసింది. -
శివసేన, ఎన్సీపీ విబేధాలపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు తుది గడువు
ఢిల్లీ: శివసేన, ఎన్సీపీ విభేదాలకు సంబంధించి దాఖలైన అనర్హత పిటిషన్లను పరిష్కరించడానికి మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు సుప్రీంకోర్టు నేడు తుది గడువును విధించింది. శివసేన విబేధాలపై డిసెంబర్ 31, 2023 నాటికి, ఎన్సీపీ అనర్హత పిటిషన్లపై జనవరి 31, 2024లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ వర్గాలకు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ శివసేన సభ్యుడు సునీల్ ప్రభు (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ సభ్యుడు జయంత్ పాటిల్ (శరద్ పవార్) దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కాగా.. శివసేన పార్టీలో చీలికకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఫిబ్రవరి 29, 2024 వరకు సమయం కావాలని కోరిన మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ వైఖరిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విబేధాలపై ఇంతకాలం కాలయాపన చేసి మళ్లీ గడువు కోరడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ రాహుల్ నార్వేకర్ తరఫున వాదనలు వినిపించిన భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జనవరి 31లోగా విచారణ పూర్తవుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన సీజేఐ డీవై చంద్రచూడ్.. డిసెంబర్ 31లోగా తేల్చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. 2022 జులైలో ఈ ఘటనలు చోటుచేసుకోగా.. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉందని ఈ ఏడాది మేలోనే రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అయితే.. రాబోయే దీపావళి సెలవులు, అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఉటంకిస్తూ జనవరి 31లోపు పూర్తి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ విన్నవించారు. వాదనల అనంతరం డిసెంబర్ 31లోపు విచారణ పూర్తి చేయాల్సిందేనని ధర్మాసనం ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్సీపీ విభేదాలకు సంబంధించి మాత్రం జనవరి 31 వరకు సమయం ఇచ్చింది. కానీ ఎన్సీపీ విబేధంపై గడువు ఇవ్వడాన్ని అజిత్ పవార్ వర్గం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ నిరసించారు. ఈ ఏడాది జూలై, సెప్టెంబర్లలో మాత్రమే పిటిషన్లు దాఖలయ్యాయని చెప్పారు. అయితే.. ఈ ఏడాది జులైలో తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను మాత్రమే ఈ దశలో పరిగణిస్తామని ధర్మాసనం తెలిపింది. శివసనే, ఎన్సీపీ అనర్హత పిటిషన్లను త్వరితగతిన విచారించడానికి తగిన షెడ్యూల్‌ను రూపొందించడానికి మహారాష్ట్ర స్పీకర్‌కు కోర్టు చివరి అవకాశాన్ని ఇప్పటికే ఇచ్చింది. ముఖ్యమంత్రి శిందేతో సహా పలువురు శివసేన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉద్ధవ్ వర్గం పెట్టుకున్న అర్జీలపై ఎటూ తేల్చకుండా నాన్చుతున్నారని స్పీకర్‌పై ఇంతకుముందు ఆగ్రహం వ్యక్తంచేసింది. కాగా.. శివసేనలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఏక్నాథ్ షిండే, ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీం ఆదేశించినా స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటు ఎన్సీపీలోనూ తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ వర్గంపై అనర్హత ప్రకటించాలని కోరుతూ శరద్ పవార్ మద్దతుదారులు సర్వోన్నత న్యాయస్థానానికి చేరారు. దీనిపై విచారణ జరుపుతున్న సీజేఐ ధర్మాసనం నేడు తుది గడువును విధించింది. ఇదీ చదవండి: హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు: మూర్తి అలా అనలేదంటున్న గుర్నానీ -
'సభలకు అజిత్ పవార్ హాజరు కాట్లేదు.. ఎందుకంటే..?'
ముంబయి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కొద్ది రోజులుగా రాజకీయ కార్యక్రమాలకు హాజరవడం లేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయంగా మరేదైనా బాంబు పేల్చబోతున్నారా..? అనే అనుమానాలకు తావిచ్చాయి. అయితే.. ఈ పుకార్లకు తెరదించుతూ ఎన్సీపీ రెబల్ గ్రూప్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ స్పందించారు. అజిత్ పవార్ డెంగ్యూతో బాధపడుతున్నారని చెప్పారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆరోగ్యం కుదుటపడగానే అజిత్ పవార్ ప్రజల ముందుకు వస్తారని ప్రఫుల్ పటేల్ స్పష్టం చేశారు. 'ప్రజా కార్యక్రమాల్లో అజిత్ పవార్ కనిపించటం లేదని తాజాగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ పుకార్లకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. డెంగ్యూతో బాధపడుతున్న అజిత్ పవార్.. నిన్నటి నుంచే చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరాను.' అని ప్రఫుల్ పటేల్ తెలిపారు. ఇదీ చదవండి: నోరు జారిన రాహుల్.. అదానీ కోసం పనిచేయాలని పార్టీ నేతకు సూచన -
‘ఇండియా’లో లోక్‌సభ ఎన్నికల నాటికి ఐక్యత అవసరం
ముంబై: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కొన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థులను బరిలో నిలపడలంలో సభ పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)చీఫ్ శరద్ పవార్ చెప్పారు. అయితే, 2024లో లోక్‌సభ ఎన్నికల వేళకు ఇవన్నీ సర్దుకుని, ఉమ్మడిగా పోటీ చేసేందుకు అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ప్రతిపక్షపార్టీలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. జాతీయ స్థాయిలో కూడా ఇదే విధమైన మార్పు వస్తుందని చెప్పేందుకు తన వద్ద కచ్చితమైన సమాచారం లేదన్నారు. మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు లేవని ఆయన గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో బలంగా కాంగ్రెస్ ఉండగా, మరికొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు కీలకంగా ఉన్నాయన్నారు. ఇలాంటి సందర్భాల్లో తలెత్తే విభేదాలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. -
ఎన్సీపీ పార్టీ గుర్తు ఆయనకే సొంతం
ముంబై: ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ పార్టీ గుర్తు ఎవరికీ ధారాదత్తం చేసేది లేదని పార్టీ గుర్తు మా వద్దే ఉంటుందని తేల్చి చెప్పారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశం అనంతరం ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ తెలుసు ఎన్సీపీ అంటే శరద్ పవార్.. శరద్ పవార్ అంటే ఎన్సీపీ అని. అలాగే మహారాష్ట్రలో ఎన్సీపీ అంటే జయంత్ పాటిల్ అని కూడా అందరికీ తెలుసన్నారు. 25 ఏళ్ల క్రితం శరద్ పవార్ ఎన్సీపీ పార్టీని స్థాపించారని ఈ పార్టీ గుర్తు ఎప్పటికీ ఆయనతోనే ఉంటుందని ఎవరికీ ఇచ్చేది లేదన్నారు. ఈ ఏడాది జులై ప్రారంభంలో ఎన్సీపీలో చీలిక తీసుకొస్తూ అజిత్ పవార్ అధికార బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపిన విషయం తెలిసిందే. కానీ ఆయన అంతకుముందే జూన్ 30న ఎన్సీపీ పార్టీ తనదేనంటూ ఆ గుర్తు తమ వర్గానికే కేటాయించాల్సిందిగా కోరుతూ ఎలక్షన్ కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. అజిత్ పవార్ సమర్పించిన పిటిషన్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీల అఫిడవిట్లు కూడా ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. దీంతో ఎన్నికల కమిషన్ కూడా పార్టీలో చీలిక వచ్చిందన్న విషయాన్ని అంగీకరిస్తూ అక్టోబర్ 6న విచారణకు హాజరు కావాల్సిందిగా ఇరుపక్షాలకు నోటీసులిచ్చింది. ఇది కూడా చదవండి: పొత్తుల విషయంలో మాయావతి కీలక వ్యాఖ్యలు -
ఆదానీతో కలిసి శరద్ పవార్.. ఇదేం ట్విస్టు..?
అహ్మదాబాద్: గుజరాత్లో ఆదానీకి చెందిన ఒక ఫ్యాక్టరీ ఓపెనింగ్‌కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. విపక్షాల ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ నేత ఆదానీతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్సీపీ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ వివరణ ఇచ్చారు. ఇందులో అభ్యంతరం ఏముంటుంది? అదానీ శరద్ పవర్ మంచి స్నేహితులని అన్నారు. జయంత్ పాటిల్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఇండియా కూటమి అన్ని సమావేశాలకు శరద్ పవర్ హాజరయ్యారు. నిస్సందేహంగా కూటమిలో ఎన్సీపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. ఇక అదానీ శరద్ పవర్ ఇద్దరూ సన్నిహితులు. వారి మధ్య బంధం ఇప్పటిది కాదని అహ్మదబాద్‌లో ఆయన నిర్మించిన నూతన ఫ్యాక్టరీకి గౌరవ అతిధిగా ఆహ్వానించారు.పవార్ దానికి హాజరైతే తప్పేంటని ప్రశ్నించారు. ఎన్సీపీ నేత శరద్ పవర్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేయడంతో దీనిపై చర్చ మొదలైంది. ఫోటోలతో పాటు శరద్ పవర్ రాస్తూ.. గుజరాత్ చంచార్వాడీ వాస్నాలో అదానీ గ్రూప్ నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి లాక్టోఫెర్రిన్ ఎక్సిమ్ పవర్ ప్లాంటును ప్రారంభించడం గౌరవంగా భావిస్తున్నానని రాశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ ఈ ఫోటోలు బయటకు రాగానే రాహుల్ గాంధీ శరద్ పవార్ మధ్య వైరం మరోసారి బట్టబయలైందని వ్యాఖ్యానించారు. It was a privilege to inaugurate India’s first Lactoferrin Plant Exympower in Vasna , Chacharwadi , Gujarat along with Mr. Gautam Adani pic.twitter.com/G5WH9FaO5f — Sharad Pawar (@PawarSpeaks) September 23, 2023 ఇది కూడా చదవండి: సభలో మాటలతో చంపేశారు: బీఎస్పీ ఎంపీ -
శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?
ముంబయి: ఎన్సీపీలో ఇరు వర్గాల మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. పార్టీలో ఎలాంటి చీలిక రాలేదని సీనియర్ నాయకులు అజిత్ పవార్, శరద్ పవార్లు ప్రకటించినప్పటికీ ఇరుపక్షాల నుంచి ఇంకా విభజనకు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయి. శరద్ పవార్ గ్రూప్ ఎమ్మెల్యేలపై అజిత్ పవార్ వర్గం అనర్హత వేటుకు సిద్ధమైంది. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యేల పేర్లు పేర్కొంటూ స్పీకర్‌కు అజిత్ వర్గం ఫిర్యాదు చేసింది. మొదట అజిత్ పవార్ వర్గానికి చెందిన 41 మంది ఎమ్మెల్యేలపై శరద్ పవార్ వర్గం అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసింది. దీని తర్వాత అజిత్ పవార్ వర్గం కూడా ఈ చర్యలకు పూనుకుంది. అనర్హత వేటు పిటిషన్లో శరద్ పవార్ వర్గానికి చెందిన జయంత్ పాటిల్, జితేంద్ర అవద్, రోహిత్ పవార్, రాజేష్ తోపే, అనిల్ దేశ్‌ముఖ్, సందీప్ క్షీరసాగర్, మాన్సింగ్ నాయక్, ప్రజక్తా తాన్పురే, రవీంద్ర భూసార, బాలాసాహెబ్ పాటిల్ ఉన్నారు. అనర్హత పిటిషన్ జాబితా నుంచి నవాబ్ మాలిక్, సుమన్ పాటిల్, అశోక్ పవార్, చేతన్ తుపేలను మినహాయించారు. ఎన్సీపీ జాతీయాధ్యక్ష పదవిపై ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ సమక్షంలో ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. అజిత్ వర్గం పిటిషన్‌పై అక్టోబర్ 6న ఇరువర్గాలను ఈసీ విచారణకు పిలిచింది. పార్టీ జాతీయాధ్యక్షున్ని తాము ఎన్నుకున్నామని అజిత్ వర్గం ఈసీకి పిటిషన్ దాఖలు చేసింది. అజిత్ పవార్ తిరుగుబాటుతో జులైలో ఎన్సీపీలో చీలిక వచ్చింది. తన వర్గం ఎమ్మెల్యేలతో అజిత్ పవార్.. శివ సేన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. అనంతరం తన వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్సీపీలో ఎలాంటి చీలిక రాలేదని ఇటీవల ఇరుపక్షాల నాయకులు చెప్పారు. అయినప్పటికీ తాజాగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదీ చదవండి: చంద్రయాన్ 3: విక్రమ్ ల్యాండర్, రోవర్ మేల్కొలుపు! -
భోపాల్‌లో ‘ఇండియా’ మొట్టమొదటి ర్యాలీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి తమ మొట్టమొదటి బహిరంగసభను వచ్చే నెలలో భోపాల్‌లో నిర్వహించనుంది. అదేవిధంగా, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపిణీకి సంబంధించిన చర్చలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించనుంది. ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం బుధవారం ఢిల్లీలో జరిగింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ భేటీకి కమిటీలోని 14 మంది సభ్యులకు గాను 12 మంది హాజరయ్యారు. సనాతనధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. కమిటీ సభ్యుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అనంతరం మాట్లాడుతూ, విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంతో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ భేటీకి రాలేదని చెప్పారు. హాజరైన వారిలో..ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, సీపీఐ నేత డి.రాజా, ఎస్పీ నుంచి జావెద్ అలీ ఖాన్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, జేడీయూకు చెందిన సంజయ్ ఝా, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, శివసేన(యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్ ఉన్నారు. ‘సీట్ల పంపకాల ప్రక్రియను ప్రారంభించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. భాగస్వామ్య పక్షాలు చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా సీట్ల పంపణీని ఖరారు చేయాలి.. కూటమి ఉమ్మడి సమావేశాలను దేశవ్యాప్తంగా చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటి సభను అక్టోబర్ మొదటి వారంలో భోపాల్‌లో చేపట్టాలని అంగీకారానికి వచ్చారు. బీజేపీ పాలనలో పెరిగిన అవినీతి, నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం ప్రధాన ఎజెండాగా ఈ సభలు జరుగుతాయి’అని కమిటీ ఉమ్మడి ప్రకటనను వేణుగోపాల్ చదివి వినిపించారు. మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్‌ల్లో సీట్ల పంపకం సులువుగా కనిపిస్తుండగా, పంజాబ్, ఢిల్లీ, పశి్చమబెంగాల్ల్లో మాత్రం భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
13న ‘ఇండియా’ సమన్వయ కమిటీ తొలి భేటీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం ఈ నెల 13న ఢిల్లీలో జరుగనుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఈ భేటీ జరుగుతుందని కూటమి నేతలు ఆదివారం వెల్లడించారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. వివిధ పారీ్టలకు చెందిన 14 మంది నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇండియా కూటమిలో ఈ కమిటీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగంగా పనిచేస్తోంది. -
‘భారత్’గా మారనున్న ఇండియా?.. ఆ హక్కు ఎవరికీ లేదు: శరద్ పవార్
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు జరగనున్న తరుణంలో.. ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చనున్నారనే అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. సదస్సులో పాల్గొనే అతిథులు, ఇతర ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విందుకు పంపిన ‘ఆహ్వానం’మే కారణమైంది. ఆహ్వానంపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొనడంపై రాజకీయ పార్టీలు, నేతలు, ప్రముఖులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ఇచ్చిన ఆహ్వాన లేఖలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని మాత్రమే పేర్కొనడంతో.. ఇండియా పేరును ‘భారత్’గా మార్చనున్నారా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిని ప్రతిపక్షాలు సహా పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ‘ఇండియా, ఇది భారత్; రాష్ట్రాల సమాఖ్య’ అని ఉంటుందని, ఇప్పుడు యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అనే పదం కూడా దాడికి గురవుతోందని కాంగ్రెస్ మంగళవారం ఆరోపించింది. చదవండి: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందు కాంగ్రెస్ పార్టీ సమావేశం నేషనలిస్టు కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్ తాజాగా స్పందించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో మీడియా సమావేశంలో పవార్ పాల్గొని మాట్లాడుతూ.. ‘దేశానికి సంబంధించిన పేరుపై అధికార పార్టీ ఎందుకు అంత కలవరపడుతోందో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే ‘రాజ్యాంగంలో ఇండియాను పేరు మార్చేందుకు అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. దానిపై తనకు ఎలాంటి సమాచారం లేదు’ అంటూ బదులిచ్చారు. ఇండియా కూటమికి చెందిన అన్ని పార్టీల అధినేతల సమావేశం బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోతోందని తెలిపారు. ఈ సమావేశంలో దేశం పేరు మార్పుపై చర్చ ఉంటుందని తెలిపారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు. ఎవరూ పేరు మార్చలేరని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్ధమైన వేళ.. ఇండియా పేరును భారత్‌గా మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నరేంద్ర మోదీ సర్కార్ ఇండియా పేరును మార్చే ప్రతిపాదనను పార్లమెంట్ సభ్యుల ముందుంచనుందని తెలుస్తోంది. రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా పేరును భారత్‌గా మార్చే ప్రక్రియను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని వార్తలు వస్తున్నాయి. చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఎమ్మెల్సీ కవిత లేఖతో కదిలిన రాజకీయ పార్టీలు -
పార్టీ చీలదు
కొల్హాపూర్: ఎన్సీపీలో చీలిక రాబోతోందంటూ వినవస్తున్న ఊహాగానాలకు పార్టీ అధినేత శరద్ పవార్ అడ్డుకట్టవేశారు. ‘పార్టీలో చీలిక అనే సమస్యే లేదు. ఒక వేళ నిజంగానే పార్టీ ఎమ్మెల్యేలు కొందరు పార్టీని వీడితే అది అంతవరకే పరిమితం. అంతేగానీ అది మొత్తం పార్టీకి వర్తించదు. ఎమ్మెల్యేలు అంటే అర్థం మొత్తం పార్టీ అని కాదు. పార్టీకి జాతీయ అధ్యక్షుడిని నేనే. మహారాష్ట్ర రాష్ట్ర విభాగానికి జయంత్ పాటిల్ సారథ్యం కొనసాగుతుంది. తిరుగుబాటు శాసనసభ్యులకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు?’ అని మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు. శుక్రవారం పవార్ కూతురు, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే మాట్లాడుతూ.. ‘ అజిత్ పవార్, కొందరు ఎమ్మెల్యేలు షిండే సర్కార్‌లో భాగస్వామ్యం అయినా సరే ఎన్సీపీ చీలిపోలేదు. అజిత్ ఎన్సీపీ నేతగానే కొనసాగుతారు’ అని తెలిపారు. దీనిపై శరద్ స్పందిస్తూ.. ‘ అవును అది నిజమే. ఇందులో వివాదం ఏం లేదు’ అని అన్నారు. కానీ కొద్ది సేపటికే అలా అనలేదంటూ మాటమార్చారు. -
మా పార్టీ చీలిపోలేదు: శరద్ పవార్
ముంబై: కొద్దీ రోజుల క్రితం అధికార శివసేన-బీజేపీ పార్టీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన అజిత్ పవార్ ఇప్పటికీ మా పార్టీకి చెందిన వారేనన్నారు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్. ఆయన రాజకీయంగా మాతో విభేదించినంత మాత్రాన మా పార్టీలో చీలిక వచ్చిందని ఎలా అంటారని ప్రశ్నించారు. కొల్హాపూర్ వెళ్లేముందు పూణే బారామతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తమ పార్టీలో ఎలాంటి చీలిక రాలేదని తాము ఇప్పటికీ కలిసే ఉన్నామన్నారు. అజిత్ పవార్ పార్టీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంపై మేము అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని సభాపతి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. దీన్ని ఆధారం చేసుకుని మా పార్టీలో చీలిక వచ్చిందని ఎలా చెబుతారు? ఆయన ఇప్పటికీ మా పార్టీకి చెందినవారేనని అన్నారు. జాతీయ స్థాయిలో భారీ సంఖ్యలో నాయకులు పార్టీ నుండి వేరైతే దాన్ని పార్టీలో చీలిక రావడమంటారు. మా పార్టీలో అలాంటిదేమీ జరగలేదు కదా. కొంతమంది మా పార్టీని విడిచి వెళ్లారు. మరికొంతమంది రాజకీయంగా మాతో విభేదించారు. ప్రజాస్వామ్యంలో సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు అందరికీ ఉంటుందన్నారు. నేను సర్వేలు ఇంకా అధ్యయనం చేయలేదు కానీ ఎన్సీపీ- శివసేన(యూబీటీ) మహా వికాస్ అఘాడిపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తోపాటు మరికొన్ని పార్టీలతో కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కంటే మెరుగ్గా రాణిస్తుందని అన్నారు. శరద్ పవార్ కంటే ముందు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా అజిత్ పవార్ తమ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే అని ఆయన ఇంకా మా పార్టీతోనే ఉన్నారని అన్నారు. ఇది కూడా చదవండి: చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ అడుగుపెట్టిన దృశ్యాలు -
ఒకే వేదికపై ప్రధాని మోదీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్?
ముంబై: పూణేలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డు ప్రదానం చేయనున్న కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్యఅతిధిగా హాజరు కానున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. అయినా ఒకే వేదికపై నవ్వుకుంటూ ఎలా కూర్చుంటారంటూ ప్రశ్నించారు శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్. దీనికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీదే అంటూ నిలదీశారు . పూణేలోని లోక్ మాన్య తిలక్ స్మారక మందిర్ వారు ప్రధానమంత్రి నరేద్ర మోదీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును బహూకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవర్ హాజరు కానున్నారు. ఇదే విషయాన్ని వేలెత్తి చూపుతూ శివసేన(యూబీటి) నాయకుడు సంజయ్ రౌత్ మీకసలు విజ్ఞత ఉందా? ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఒకే వేదికపై ఎలా కూర్చుంటారో వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. మీరు నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తారు. వాటికి కట్టుబడి మీ కార్యకర్తలు వాళ్లలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు.. మీరేమో ఒకే వేదికపై స్నేహితుల్లా కలిసిపోతారంటూ ప్రధాని మోదీని, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను ఇద్దరినీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ప్రధాని చూస్తే ఎన్సీపీ పార్టీ నిండా అవినీతిపరులే ఉన్నారంటారు. మీరేమో నేను మరాఠాల ముఖచిత్రాన్ని.. మేము బీజేపీకి వ్యతిరేకమంటూ మాటలు చెబుతారు. మరి ఈ రోజు అవన్నీ ఏమైపోయాయి. ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తున్నారా? మీరు ప్రధాని అవార్డు కార్యక్రమానికి వెళ్తే మీ కార్యకర్తలను అనుమానించినట్లే. అధికారం కోసమో మరో కారణంతోనో మీకు వెన్నుపోటు పొడిచిన వారంతా అక్కడికి వస్తారు. వారందరినీ నవ్వుతూ పలకరిస్తే మీరు వాళ్ళు చేసినదానికి ఆమోదం తెలిపినట్లు కదా? దేశమంతా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే మీరు వెళ్లి ఆయన పంచన చేరడం న్యాయమేనా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరో ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ లోక్ మాన్య తిలక్ "స్వరాజ్యం మా జన్మహక్కు" అన్నారు. మీరు దాన్ని కాస్తా "సొంత రాజ్యం మా హక్కు"గా మార్చేశారని ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: హెచ్ఆర్ ఘరానా మోసం.. నిరుద్యోగియైన భార్యకు కంపెనీ జీతం.. -
మంత్రిని ఆహ్వానించడానికి విద్యార్థులే దొరికారా?
ముంబై: మహారాష్ట్రలో అజిత్ పవార్ తిరుగుబాటు బృందం నుండి మంత్రి వర్గంలో కొత్తగా చేరిన అనిల్ భైడాస్ పాటిల్ సొంతూరు అమల్నెర్ తిరిగి వస్తున్న క్రమంలో ఆయనను స్వాగతించేందుకు స్కూలు పిల్లల్ని రోడ్డుకు ఇరువైపులా రెండు గంటల పాటు అమానుషంగా నిలబెట్టారు. అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీలోని ఒక వర్గం తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆ బృందంలో అనిల్ భైడాస్ పాటిల్ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనిల్ మొదటిసారి ఆయన సొంతూరు అమల్నెర్ తిరిగొస్తున్న నేపథ్యంలో ఆయనను స్వాగతించడానికి స్థానిక ఆశ్రమశాల పాఠశాల పిల్లల్ని రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టారు ఆ స్కూలు టీచర్లు. మంత్రి కాన్వాయ్ రావడం ఆలస్యం కావడంతో పిల్లలు అలాగే మంచినీళ్లు కూడా తాగడానికి లేనిచోట రెండు గంటలపాటు అలాగే కూర్చుని ఎదురుచూశారు. తీరా చూస్తే చాలాసేపు నిరీక్షణ తర్వాత వచ్చిన మంత్రి పిల్లలకు కనీసం అభివాదమైనా చేయకుండా వెళ్లిపోయారు. మంత్రి గారిని స్వాగతించడానికి పిల్లల్ని నిలబెట్టడమేమిటని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర పాటిల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిల్లల పట్ల మంత్రి తీరు అమానుషమని దీనిపై వెంటనే విచారణ జరిపిస్తామని తెలిపారు జల్గావ్ జిల్లా అధికారులు. ఇదిలా ఉండగా తనకోసం చేసిన ఈ ఏర్పాట్ల గురించి తనకసలు తెలియదని అనిల్ పాటిల్ అన్నారు. Ridiculous. Young school students made to sit on roadside for 2 hours to welcome newly sworn in NCP rebel minister Anil Patil, returning to his City Amalner in Maharashtra. pic.twitter.com/413bOMFQhd — Nasreen Ebrahim (@EbrahimNasreen) July 9, 2023 ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్ గా మారిన రైల్వే స్టేషన్ -
NCP Crisis: అబ్బాయికి బాబాయ్ చురకలు
ముంబై: ఎన్సీపీని ఎట్టిపరిస్థితుల్లో చేజార్చుకోనని.. తిరుగుబాటుతో కుదేలు అయిన పార్టీని పునర్నిర్మించి తీరతానని తోటి నేతలతో శరద్ పవార్ మరోమారు స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో తన నివాసంలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ చీలిక సంక్షోభం, భవిష్యత్ ప్రణాళిక గురించి పార్టీ నేతలతో చర్చించిన ఆయన.. తానే అధ్యక్షుడిగా కొనసాగుతానని, ఇకపైనా పార్టీని ముందుండి నడిపిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో తిరుగుబాటు నేత అజిత్ పవార్ చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. వయసు 82 అయితే ఏంటి.. 92 అయితే ఏంటి.. ఈ వయసులోనూ నేను ఇప్పటికీ ఇంకా ఆరోగ్యంగానే ఉన్నా. పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నా కదా అంటూ పవార్ సమావేశం అనంతరం మీడియా వద్ద ప్రస్తావించారు. పార్టీ అధ్యక్షుడిని నేనే. పార్టీలో చీలిక తదితర పరిణామాల గురించి నేరుగా ఈసీ వద్దే తేల్చుకుంటామని చెప్పారాయన. ‘‘ కొందరు తామే అసలైన ఎన్సీపీ నేతలమని.. పార్టీ అధినేత తానేనని చెప్పుకుంటున్నారు. ఎవరో ఏదో వాగుతున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంకా ఆరోగ్యంగానే ఉండి.. పని చేస్తున్నా. ఇక మీదట అధ్యక్ష పదవిలోనూ నేను ఉంటా. వయసు ఎంత మీద పడినా సరే.. పార్టీ కోసం కష్టపడుతూనే ఉంటా. ఏం చెప్పాలనుకున్నా మనం ఎన్నికల సంఘం ముందే చెబుదాం. ఎవరికో ఏదో వివరణ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదూ అంటూ తోటి నేతలతో సమావేశంలో చెప్పారాయన. Meeting of @NCPspeaks was held at the Delhi residence of National President Hon'ble Sharad Pawar Saheb. Party Working committee members, Mp's, leaders and office bearers attended this meeting to discuss important strategies and chart the course for future endeavors.@supriya_sule… pic.twitter.com/3mWpQEuIoO — Sharad Pawar (@PawarSpeaks) July 6, 2023 ఇదిలా ఉంటే.. శరద్ పవార్ నేతృత్వంలో ఆయన నివాసంలో జరిగిన కార్యవర్గ సమావేశం.. తిరుగుబాటు నేతలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో న్యాయపరంగా ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే సమాలోచనలు చేస్తోంది. ఒక ఎన్సీపీ కార్యవర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే అజిత్ పవార్ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం కీలక ప్రకటన చేసింది. శరద్ పవార్ నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశం చెల్లదని, అసలు అలాంటి భేటీ నిర్వహించేందుకు అధికారం.. అందులో నిర్ణయాలు తీసుకునేందుకు హక్కు లేదంటూ అజిత్‌పవార్ వర్గం ఒక ప్రకటన విడుదల చేసింది. పవార్‌తో రాహుల్ భేటీ ఇదిలా ఉంటే.. ఎన్సీపీ కార్యవర్గ సమావేశం తర్వాత జన్‌పథ్‌లోని తన అధికార నివాసానికి శరద్ పవార్ చేరుకున్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. పవార్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. పార్టీ చీలిక సంక్షోభంపై వీళ్లు చర్చించినట్లు సమాచారం. #WATCH | Congress leader Rahul Gandhi meets NCP President Sharad Pawar in Delhi pic.twitter.com/vU2DUZZMqH — ANI (@ANI) July 6, 2023 ఇదీ చదవండి: బీజేపీతో పొత్తు కోసం యత్నించింది శరద్ పవారే! -
'అక్కడ చూస్తే నవ్వొచ్చింది..' ప్రతిపక్ష కూటమిపై ప్రపుల్ పటేల్ సెటైర్..
ముంబయి: అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీలో చీలిక వచ్చిన తర్వాత శరద్ పవార్ ముఖ్య అనుచరుడు ప్రపుల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో జరిగిన ప్రతిపక్ష కూటమి అనే అంశం నవ్వు తెప్పించే విషయమని అన్నారు. శరద్ పవార్‌తో కలిసి తాను కూడా ఆ మీటింగ్‌కు హాజరయ్యానని చెప్పిన ప్రపుల్ పటేల్.. అక్కడి దృశ్యాలు గుర్తొస్తే నవ్వొస్తుందని చెప్పారు. 'అక్కడ 17 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. అందులో 7 పార్టీలకు ఒక్క ఎంపీ మాత్రమే ఉన్నారు. ఓ పార్టీకైతే ఒక్కరు కూడా లేరు. అలాంటివారందరూ కలిసి దేశంలో మార్పులు తెస్తామని అంటున్నారు' అని ప్రపుల్ పటేల్ ఎద్దేవా చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలో ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంతో చేతులు కలిపినట్లు ప్రపుల్ పటేల్ తెలిపారు. శివ సేన భావాజాలాన్ని అంగీకరించినప్పుడు బీజేపీతో కలిస్తే తప్పేంటి?. జమ్మూ కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లాలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. అలాంటి వారందరూ ప్రతిపక్ష కూటమి అంటూ ఒకచోటుకు వస్తున్నారని ప్రపుల్ పటేల్ చెప్పారు. నేడు ఎన్సీపీలో ఇరువర్గాల మధ్య బల ప్రదర్శన జరిగింది. ఇందులో అజిత్ పవార్ 30 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకోగా.. శరద్ పవార్ వెనుక కేవలం 17 మంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి మొత్తం 53 ఎమ్మెల్యేల బలం ఉండగా.. తనకు 43 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని అజిత్ పవార్ చెబుతున్నారు. ఇదీ చదవండి: ‘బీజేపీతో పొత్తు కోసం ఆయనే యత్నించారు.. రాజీనామా డ్రామాలు ఆడారు! -
మొత్తం శరద్ పవారే చేశారు.. ఎన్సీపీ చీఫ్‌పై సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమిలోని ఎన్సీపీ చీలికపై.. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి సంక్షోభాలకు శరద్ పవార్ ఆద్యుడని ఆరోపించిన రాజ్ థాక్రే.. తాజా పరిణామాలకు కూడా శరద్ పవారే కారణమంటూ పేర్కొన్నారు. మహారాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) చీఫ్ రాజ్ థాక్రే బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీ సంక్షోభం శరద్ పవార్ ఆశీస్సులతోనే జరిగిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారాయన. ‘‘రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే జరిగిందో అది అసహ్యమైన రాజకీయం. ఇది ముమ్మాటికీ ఓటర్లను అవమానించడమే అని తీవ్రంగా స్పందించారాయన. అసలు మహారాష్ట్రలో ఇలాంటి రాజకీయాలు మొదలుపట్టిందే శరద్ పవార్. 1978లో పులోద్(పురోగామి లోక్‌షాహీ దళ్) పేరుతో చీలిక రాజకీయాలను ప్రదర్శించారు. అప్పటిదాకా మరాఠా రాజకీయం అలాంటి పరిణామాలను చూడలేదు. ఇలాంటివి పవార్‌తోనే మొదలై.. ఆయనతోనే ముగిసేలా కనిపిస్తున్నాయి. కర్మ ఫలితాన్ని ఆయన అనుభవించాల్సిందే కదా. ఇప్పుడు జరుగుతున్నదంతా ఆయన చేజేతులారా చేసుకున్నదే అని రాజ్ థాక్రే విమర్శించారు. అలాగే.. ప్రఫుల్ పటేల్, దిలీప్ వాల్సే పాటిల్, ఛాగన్ భుజ్‌బల్‌లు అజిత్ పవార్ వెంట వెళ్లే వ్యక్తులు ఏమాత్రం కాదని.. వాళ్లకు కచ్చితంగా శరద్ పవార్ అండదండలు ఉంటాయని ఆరోపించారాయన. ఆనాడు ఏం జరిగిందంటే.. 1977 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం.. జనతా పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడింది. ఇందిరా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్(ఐ), యశ్వంత్‌రావు చవాన్ నేతృత్వంలో కాంగ్రెస్(యూ)గా ముందుకు వెళ్లాయి. మహారాష్ట్రలో మెజారిటీ సీట్లు ఓడిపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి సీఎం శంకర్రావ్ చవాన్ రాజీనామా చేశారు. దీంతో వసంత్‌దాదా పాటిల్ సీఎం అయ్యారు. అయితే.. శరద్ పవార్ అప్పటి పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చారు. తన రాజకీయ గురువైన యశ్వంత్‌రావు చవాన్ పంచన చేరి కాంగ్రెస్(యూ)లో కొనసాగారు. అయితే.. అధికారం కోసం కాంగ్రెస్(యూ) నుంచి విడిపోయి.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(సోషలిస్ట్) పార్టీని సొంతంగా ఏర్పాటు చేశాడు శరద్ పవార్. ఆపై జనతా పార్టీ, పీడబ్ల్యూపీలతో కలిసి ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి) లేదా పురోగామి లోక్‌షాహీ అగాఢి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా 38 ఏళ్ల శరద్ పవార్ ప్రమాణ స్వీకారం చేయగా.. 1978 జులై 18 పీడీఎఫ్ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే.. ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చాక 1980 ఫిబ్రవరి 18వ తేదీన ఆ ప్రభుత్వం రద్దు అయ్యింది. అదే ఏడాదిలో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ తిరిగి అధికారం కైవసం చేసుకుంది. ఇదీ చదవండి: శరద్ పవార్‌కు షాక్ -
ఎవరైనా నా పర్మిషన్ తీసుకోవాల్సిందే!: శరద్ పవార్
ముంబై: తన ఫోటోను తిరుగుబాటు నేత అజిత్ పవార్ ఉపయోగించడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ.. తన భావజాలానికి ద్రోహం చేసినవారు, తన అభిప్రాయాలతో విభేదించేవారు, సైద్ధాంతిక విభేదాలున్నవారు తన ఫోటోను ఉపయోగించవద్దని స్పష్టం చేశారు. తాను జాతీయ అధ్యక్షుడిగా, జయంత్ పాటిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎన్సీపీ అనే వర్గం మాత్రమే తన ఫోటోను ఉపయోగించుకోవాలన్నారు. తన ఫోటోను ఎవరు ఉపయోగించుకోవాలో నిర్ణయించే హక్కు తనదేనని, తన అనుమతి తప్పనిసరి అన్నారు. అజిత్ పవార్, పార్టీకి చెందిన మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరిన రెండురోజుల తర్వాత పవార్ ఈ ప్రకటన చేశారు. అజిత్ పవార్ మంగళవారం తమ వర్గానికి కొత్తగా ఎన్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ పార్టీ కార్యాలయంలో శరద్ పవార్ ఫోటో కనిపించింది. అయితే ఆ పార్టీ కార్యాలయం తాళం చేతులు లేకపోవడంతో పెద్ద హైడ్రామానే నడిచింది అక్కడ. ఇక.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలిక వర్గం.. లోక్‌సభ ఎంపీ సునీల్ తట్కరేని ఎన్సీపీ రాష్ట్ర శాఖ చీఫ్‌గా ఉంటారని ప్రకటించడం గమనార్హం. ఇదీ చదవండి: కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు నోటీసులు -
విలేకరి ప్రశ్నపై ప్రపుల్ పటేల్‌కు కోపం వచ్చింది.. వీడియో వైరల్..
ముంబయి: శరత్ పవార్ అనుయాయులైన ప్రఫుల్ పటేల్ మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్.. షిండే ప్రభుత్వంతో చేతులు కలిపారు. నిన్న రాజ్ భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ అంశంలో మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ప్రపుల్ పటేల్ దురుసుగా స్పందించారు. ఈ రోజు ప్రపుల్ పటేల్ అజిత్ పవార్ ఇంటికి వచ్చారు. ఆ సందర్భంగా మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అజిత్ పవార్‌తో కలిసి షిండే ప్రభుత్వంలో కలిసినందుకు కేంద్ర మంత్రి పదవి దక్కనుందనే పుకార్లలో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఇంకా ఢిల్లీకి వెళ్లి మాట్లాడలేదని చెప్పారు. మహారాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి మాత్రమే చర్చించామని స్పష్టం చేశారు. ఎన్సీపీ పార్టీని, నాయకుడు శరద్ పవార్‌ను వదిలేస్తున్నారా? అనే ప్రశ్నకు ప్రపుల్ పటేల్ కోపం తెచ్చుకున్నారు. కారు అద్దాలను పైకి ఎత్తేశారు. కారును ముందుకు పోనివ్వమని ఆదేశాలు ఇచ్చారు. ఈ వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎన్సీపీలో సీనియర్ నాయకులుగా ఉన్న ప్రపుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ కూడా అజిత్ పవార్‌తో కలిసి షిండే ప్రభుత్వంలో కలిశారు. #WATCH | NCP leader Praful Patel, says "We are the NCP and that is what we are doing. We will decide now if I have to go to Delhi. We have not discussed anything about Delhi, we have only discussed about the formation of our government in Maharashtra" pic.twitter.com/Wp4e3X7RIi — ANI (@ANI) July 3, 2023 కాగా ఎన్సీపీలో ఆదివారం చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అనూహ్యంగా షిండే- బీజేపీ ప్రభుత్వంలో చేరడంతో ఆ పార్టీ చీఫ్ శరద్‌పవార్‌కు పెద్ద షాక్ తగిలినటైంది. అజిత్ పవార్‌తో ఉప ముఖ్యమంత్రిగా, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, ఆదితీ తట్కారే, ధర్మారావు , అనిల్ పాటిల్, సంజయ్ బాంసోడేతో మంత్రులుగా రాష్ట్ర గవర్నర్ రమేశ్ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్ తోపాటు డిప్యూటీ స్పీకర్ నరహరి, ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: 'కుటుంబంలో సమస్యల్లేవు..' ఎన్సీపీ చీలికపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. -
ఇలాంటివి చాలా చూశాను.. ఎవ్వరినీ విడిచిపెట్టను..
ముంబై: ఇంతకాలం నమ్మిన బంటుగా ఉన్న అజిత్ పవార్ మరోసారి ప్లేటు ఫిరాయించడంతో ఆత్మరక్షణలో పడింది ఎన్సీపీ నాయకత్వం. ఎన్సీపీలో ఎటువంటి చీలిక లేదంటూనే అజిత్ పవార్ ప్రఫుల్ పటేల్ వంటి కీలక నాయకులతో వెళ్లి షిండే ప్రభుత్వంలో చేరడంపై శరద్ పవార్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇలాంటివి నా రాజకీయ జీవితంలో చాలా చూశానని పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రెండు రోజుల క్రితమే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేసిన అజిత్ పవార్ ఆదివారం 40 మంది ఎమ్మెల్యేలతో షిండే ప్రభుత్వానికి మద్దతు తెలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీంతో హుటాహుటిన ఒకచోట చేరిన ఎన్సీపీ వర్గాలు ప్రెస్ మీట్ నిర్వహించి పార్టీ ధిక్కరణకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. నాకు ఇలాంటివి కొత్తేమీ కాదు. 1980లో కూడా ఇలాగే 58 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా పార్టీకి కొంతమంది వెన్నుపోటు పొడిచారు. ఆరోజు నాతో ఆరుగురు మాత్రమే మిగిలినప్పుడు కూడా నేను భయపడకుండా మళ్ళీ పార్టీని యధాస్థితికి తీసుకొచ్చాను. అప్పుడు నన్ను విడిచి వెళ్లిన వారంతా వారి నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరి పైనా కఠిన చర్యలు తీసుకుంటామని, పార్టీని కూడా పునర్నిర్మించుకుంటామని అన్నారు. పార్టీని విడిచి వెళ్లిన వారిలో కొంతమందిపై బీజేపీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన ఆరోపించారు. అయితే నాతో పాటు చాలాకాలం కలిసి పనిచేసి, నేను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించిన ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే కూడా వారితో వెళ్లడమే నన్ను కొంచెం బాధించిందని అన్నారు. ఇది కూడా చదవండి: ఇప్పటికీ మాది అదే పార్టీ.. ఆ గుర్తు పైనే పోటీ చేస్తాం: అజిత్‌పవార్ -
ఇప్పుడు మాది డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్.. షిండే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం ఉన్నట్టుండి పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. గత కొంతకాలంగా ఎన్సీపీలో నాయకత్వ మార్పుపై అసంతృప్తిగా ఉన్న అజిత్ పవార్ ముఖ్యమంత్రి షిండేతో చేతులు కలిపారు. 40 మంది ఎమ్మెల్యేలతో వెళ్లి గవర్నరుని కలవడం, సీఎం ఏక్ నాథ్ షిండే సమక్షంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అంతా ఆగమేఘాలమీద జరిగిపోయాయి. ఆశ్చర్యకరంగా ఇటీవల ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సుప్రియా సూలే తోపాటు నియమితులైన ప్రఫుల్ పటేల్ కూడా కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్బంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే మాట్లాడుతూ.. అజిత్ పవార్ చేరికతో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అయ్యింది. మహారాష్ట్ర అభివృద్ధి కోసమే అజిత్ పవర్ తో చేతులు కలిపాము. ఇందులో మా ప్రోద్బలం ఏమీ లేదు. ఆయనంతట ఆయనే వచ్చి మాతో చేతులు కలిపారని తెలిపారు. ఆయనతోపాటు ఎన్డీయేలో చేరిన మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఛగన్ భుజబల్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, దిలీప్ వాల్సే పాటిల్, ధర్మారావు బాబా ఆత్రం, అదితి తాత్కరే, అనిల్ పాటిల్, సంజయ్ బన్సోడే ఉన్నారు. దీంతో మహారాష్ట్రలో ఇప్పుడు ఒక సీఎం ఇద్దరు డిప్యూటీ సీఎంలతో ఎన్డీయే ప్రభుత్వం మరింత బలోపేతమైంది. ఇది కూడా చదవండి: రైల్వే పోలీసు అమానుషం.. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి.. -
కేసీఆర్ భారీ కాన్వాయ్‌పై స్పందించిన శరద్ పవార్.. ఏమన్నాడంటే!
ముంబై: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మహారాష్ట్రలో పర్యటించిన విషయం తెలిసిందే. 600కు పైగా కార్లతో హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి సోలాపూర్ వరకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరి వెళ్లారు. తాజాగా కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రలోని పండరీపూర్‌కు కేసీఆర్ రావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన బలాన్ని చూపించుకునేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నం ఆందోళనకరమని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రానికి వచ్చి ఆలయాలను దర్శించుకునేందుకు వస్తే అందుకు తాము అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే భారీ సంఖ్యలో వాహనాలను తీసుకొచ్చి తమ బాలన్ని చూపించుకునేందుకు చేసిన ప్రయత్నమే ఆందోళన కలిగిస్తోందన్నారు. దాని కంటే కేసీఆర్ తన పర్యటనలో రెండు రాష్ట్రాల మధ్య(తెలంగాణ-మహారాష్ట్ర) సహకారాన్ని పెంచడంపై దృష్టి పెడితే బాగుండేదని అన్నారు. చదవండి: కాంగ్రెస్ VS బీజేపీ: పీవీ జయంతి చుట్టూ రాజకీయాలు అలాగే 2021లో పండరిపూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎన్సీపీ నేత భగీరత్ బాల్కే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. దీనిపై శరద్ పవర్ మాట్లాడుతూ.. ఒక్క వ్యక్తి పార్టీ నుంచి వెళ్లిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భగీరత్ భాల్కేకు టికెట్ ఇచ్చిన తర్వాత తమ నిర్ణయం తప్పని అనిపించిందని, కానీ దాని గురించి ఇప్పుడు మాట్లాడదల్చుకోలేదని అన్నారు. కాగా మహారాష్ట్రలో పాగా వేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఆయన 600 వాహనాల భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు వెళ్లారు. పూర్తి స్థాయిలో కేసీఆర్ బలప్రదర్శన చేశారు. మంగళవారం షోలాపూర్‌లోని పండరీపూర్‌లోని విఠల్, రుక్మిణి దేవి ఆలయాలను దర్శించుకున్నారు. తర్వాత సర్కోలీలో జరిగిన బహిరంగ సభలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం తుల్జాపూర్ భవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు ఆచరించి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్నారు -
అలిగిన అజిత్ పవార్.. మరోసారి అసంతృప్తి?
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తన కుమార్తె సుప్రియా సూలే తోపాటు ప్రఫుల్ పటేల్ లను నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా అజిత్ పవార్ ను కాదని సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై ఒకే వ్యక్తికి అన్ని బాధ్యతలు అప్పగించడం కూడా సరికాదని క్లారిటీ కూడా ఇచ్చారు శరద్ పవార్. అయిష్టంగానే శుభాకాంక్షలు.. పార్టీ అధ్యక్ష పదవి దక్కనందుకు ఆయన మేనల్లుడు సీనియర్ నేత అజిత్ పవార్ అసంతృపిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల ప్రకటన అనంతరం మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. కానీ కొద్దిసేపటికి ట్విట్టర్ ద్వారా నూతనంగా ఎంపికైన వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్రకటన సమయంలోనే విలేఖరులు అజిత్ పవార్ విషయమై ప్రస్తావించగా శరద్ పవార్ మాటలాడుతూ.. ఆయన ఇప్పటికీ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. ఆయనపై చాలా బాధ్యతలున్నాయి. ఒకే వ్యక్తికి అన్ని బాధ్యతలు అప్పగించడం కూడా సరికాదని అన్నారు. ఫ్లాష్ బ్యాక్.. 2019 ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలిపి ఆనాటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు డిప్యూటీగా కూడా పనిచేశారు అజిత్ పవర్. పార్టీ చీలిపోతుందేమోనని స్వయంగా శరద్ పవార్ రంగంలోకి దిగి బుజ్జగించిన తర్వాతగానీ ఆయన వెనక్కి తగ్గలేదు. ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఎంపికైన వర్కింగ్ ప్రెసిడెంట్లలో తన కుమార్తె సుప్రియా సూలేకు పంజాబ్, హర్యానాలతోపాటు మహారాష్ట్ర బాధ్యతలు కూడా అప్పగించగా ప్రఫుల్ పటేల్ కు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, గుజరాత్, జార్ఖండ్ బాధ్యతలను అప్పగించారు పవార్. ఇకపై వీరిద్దరే దేశవ్యాప్తంగా పార్టీ వ్యవహారాలన్నీ చక్కబెడతారని ఆయనన్నారు. ఇది కూడా చదవండి: గాడ్సే భరతమాత ముద్దుబిడ్డ.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు -
ఎన్సీపీ కీలక నిర్ణయం.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఆ ఇద్దరూ
ముంబై: పార్టీ చీఫ్ పదవికి రాజీనామా ప్రకటన చేసి.. ఆపై వెనక్కి తగ్గిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పార్టీ తరపున కీలక నిర్ణయం ప్రకటించారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే(పవార్ తనయ), ప్రపుల్ పటేల్‌లను ప్రకటించారు. ఎన్సీపీ 25వ వార్షికోత్సవం సందర్భంగా శరద్ పవార్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్సీపీలో కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్(శరద్ పవార్ అన్న కొడుకు) సమక్షంలోనే ఈ విషయాన్ని ప్రకటన వెలువడటం గమనార్హం. ఇదిలా ఉండగా, శరద్ పవార్ గతనెలలో అధ్యక్ష పార్టీ పదవికి రాజీనామా చేస్తాని ప్రకటించారు. ఆ తర్వాత పార్టీ సభ్యుల తోపాటు ఇతర రాజకీయ నాయకులు నుంచి తీవ్ర నిరసనలు వెల్లవెత్తడంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన నిర్ణయంపై చర్చించేందుకు ఏర్పాటైన ఎన్సీపీ ప్యానెల్ మే 5న ఆయన రాజీనామాను తిరస్కరించి, పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరింది. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయ్యాక.. 1999లో సంగ్మాతో కలిసి ఏర్పాటు శరద్ పవార్ ఎన్సీపీని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ ఎప్పటికప్పుడు కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది కూడా. సూలేనే ఎందుకంటే.. ఇటీవల ఆమె పార్టీ అధిష్టాన కీలక నిర్ణయాల్లో పాల్గొనడమే గాక ప్రజలకు చేరువయ్యేలా అనేక జిల్లాలోని కార్యక్రమాలకు హాజరయ్యారు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఇటీవల శరద్ పవర్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే ప్రతిపాదన లేవనెత్తినప్పుడూ ఆయన తన నిర్ణయాన్ని పునరాలోచించేలా పార్టీ అధిష్టానాన్ని, నాయకులను చైతన్యవంతం చేసింది. ఆమె సెప్టెంబర్2006లో రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కావడం ద్వారా సులే క్రియాశీ రాజకీయాలకు పరిచయమయ్యారు. తర్వాత 2009లో అప్పటి వరకు పవార్ ప్రాతినిధ్యం వహించిన బారామతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. అంతేగాదు యువతతో కనెక్ట్ అయ్యేలా నెట్వర్క్ని ఏర్పరుచుకోవడమే గాక రాష్ట్రవాది యువతీ కాంగ్రెస్‌ను కూడా ఏర్పాటు చేసింది. అదీగాక శరద్ పవార్ తన ఆధ్వర్యంలో తన కుమార్తెనే గాక అజిత్ పవార్, ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ తోసహా చాలా మంది యువ నేతలను మంచి నాయకులుగా తీర్చిదిద్దారు. ఇదీ చదవండి: షిండే కుమారుడి కీలక వ్యాఖ్యలు -
మహారాష్ట్ర సీఎంతో శరద్ పవార్ భేటీ! రాజకీయ వర్గాల్లో చర్చ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారి ఈ విషయమై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గతేడాది మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయిన తదనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన షిండేతో శరద్ పవార్ భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ భేటీ చాలా ఊహాగానాలకు దారితీసింది. ఐతే ఎన్సీపీ నేత శరద్ పవార్ మాత్రం ఇది వ్యక్తిగత భేటీ అని క్లారిటీ ఇచ్చారు. ముంబైలోని మరాఠా మందిర్ అమృత్ మహోత్సవ్ వార్షికోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమానికి ఆహ్వానించడానికే ముఖ్యమంత్రి షిండేని కలిశానని పవార్ ట్వీట్ చేశారు. మరాఠీ సినిమా, థియోటర్, ఆర్ట్ రంగానికి చెందిన కళాకారులు సమస్యల గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు శరద్ పవార్. మహారాష్ట్ర సీఎం సైతం ఇదే విషయాన్ని పేర్కొంటూ ట్వీట్ చేశారు. బీజేపీ కూడా ఈ సమావేశంపై స్పందించింది. ఈ భేటికీ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వివరణ ఇవ్వడం గమనార్హం. मराठा मंदिर, मुंबई संस्थेच्या अमृत महोत्सवी वर्धापन दिनानिमित्त वर्धापन सोहळ्याचे आयोजन संस्थेतर्फे करण्यात येणार आहे. संस्थेचा अध्यक्ष या नात्याने आज महाराष्ट्राचे माननीय मुख्यमंत्री श्री. एकनाथ शिंदे यांना या कार्यक्रमाला आमंत्रित करण्यासाठी वर्षा या त्यांच्या शासकीय… pic.twitter.com/Q6dSxeUMLR — Sharad Pawar (@PawarSpeaks) June 1, 2023 (చదవండి: నేను బీజేపీకి చెంది ఉండవచ్చు.. కానీ బీజేపీ నా పార్టీ కాదు..) -
ఎన్సీపీలో కీలక పరిణామం.. రాజీనామా వెనక్కి తీసుకున్న శరద్ పవార్..
ముంబై: ఎన్సీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం అధ్యక్ష పదివికి రాజీనామా చేసిన శరద్‌పవార్.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పార్టీ కార్యకర్తల ప్రేమ, అభిమానం, నమ్మకం తనను కదిలించాయని తెలిపారు. అందుకే వాళ్ల ఇష్టం మేరకు రాజీనామా ఉససంహరించుకుంటున్నట్లు చెప్పారు. తాను ఎప్పుడైనా కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా వాళ్లు తనతో ఉంటున్నారని చెప్పారు. వాళ్ల సెంటిమెంట్‌ను కాదనలేనన్నారు. మంగళవారం తన ఆత్మకథ రెండో భాగం పుస్తకం విడుదల చేస్తూ రాజీనామా విషయాన్ని ప్రకటించారు శరద్‌పవార్. ఆ వెంటనే ఎన్సీపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రాజీనామా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. దీంతో మూడు రోజుల తర్వాత పవార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కాగా.. మంగళవారం రాజీనామా అనంతరం పార్టీ అధినేతగా తన వారసుడిని ఎంపిక చేసేందుకు శరద్ పవార్ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం సమావేశం అయ్యింది. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, సోదరుడి కుమారుడు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దక్షిణ ముంబైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో శరద్‌పవార్ రాజీనామా నిర్ణయాన్ని ఎన్సీపీ కమిటీ తిరస్కరించింది. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని పార్టీ ప్యానెల్ శరద్‌ను కోరింది. దేశమంతా శరద్ పవార్ ప్రభావం ఉందని ఆ పార్టీ సినియర్ నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామా చేస్తానంటే మేం ఊరుకోమని అన్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే రాజీనామా ఉపసంహరించుకుంటున్నట్లు పవార్ ప్రకటించడంతో ఎన్సీపీ శ్రేణులు ఆనందం వ్యక్యం చేశాయి. చదవండి: వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'కి మద్దతు తెలిపిన మోదీ -
మహా చాణక్యం
అన్నట్టే అయింది. పదిహేను రోజుల్లో రెండు రాజకీయ ప్రకంపనలు సంభవిస్తాయని జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కుమార్తె – ఎంపీ అయిన సుప్రియా సులే రెండు వారాల క్రితం అన్నట్టే మొదటి ప్రకంపన మంగళవారం ఎదురైంది. రాజకీయ కురువృద్ధుడూ, 24 ఏళ్ళుగా ఎన్సీపీకి పెద్ద దిక్కూ అయిన శరద్ పవార్ తన సొంత పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్టు రాజకీయ బాంబు పేల్చారు. చుట్టూ పార్టీ నేతలు ఉండగా, ఆత్మకథ రెండో ముద్రణ ఆవిష్కరణ వేదికగా శరద్ చేసిన ఆకస్మిక ప్రకటన కొందరిని కన్నీరు పెట్టించింది. మనసు మార్చుకొమ్మంటూ మరికొందరు ప్రాథేయపడేలా చేసింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య కొద్ది గంటల వ్యవధిలోనే పునరాలోచనకు తనకు రెండు, మూడు రోజుల సమయం కావాలని శరద్ అంగీకరించేలా చేసింది. అనూహ్య నిర్ణయాలతో అవతలివారిని ఆత్మరక్షణలో పడేయడంలో ఆరితేరిన ఈ అపర చాణక్యుడి తాజా నిర్ణయానికి కారణాలు, పర్యవసానాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. జాతీయస్థాయి ప్రతిపాదిత ప్రతిపక్ష కూటమిలోనూ మల్లగుల్లాలు సాగుతున్నాయి. అయిదున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న 82 ఏళ్ళ శరద్ భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకొనే రకం కాదు. ఆలోచన నిండిన ఆచరణవాది. అందుకే, ఆయన తాజా ఎత్తుగడ ఆసక్తికరం. నాలుగు విడతల మాజీ డిప్యూటీ సీఎం, శరద్ అన్న కుమారుడైన అజిత్ పవార్ సీఎం పదవిపై కన్నేశారనీ, చివరకు బీజేపీ అండతో కోరిక నెరవేర్చుకునేలా పావులు కదుపుతున్నారనీ కొన్ని వారాలుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పైకి ఆ వాదనను అజిత్ సహా అందరూ కొట్టిపారేసినా, శరద్ హఠాత్ ప్రకటనతో ఒక్కొక్క పొర తొలగిపోతోంది. ఆ మధ్య ఎన్సీపీ ఎమ్మెల్యేలు బీజేపీతో జట్టు కట్టనున్నారని తెలిసిన వెంటనే శరద్ అదేమీ పట్టనట్టుగా దర్యాప్తు సంస్థల సమన్లను ఎదుర్కొనలేనివారు పార్టీ వదలిపోవచ్చంటూ ముందరి కాళ్ళకు బంధం వేశారు. తాజాగా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా ద్వారా, ఒకరకంగా బీజేపీ అండతో అజిత్ సీఎం పీఠాన్ని అధిష్ఠించడానికి మార్గం సుగమం చేస్తూనే, కార్యకర్తలపై పట్టు బిగించారు. నిజానికి, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ శిందేల మధ్య శివసేన రెండుగా చీలి, కథ కోర్టుకెక్కిన ‘సేన వర్సెస్ సేన’ కేసులో సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం ఏ క్షణంలోనైనా తీర్పు ప్రకటించవచ్చు. వచ్చే తీర్పును బట్టి ఏం జరగవచ్చు, అప్పుడేం చేయాలని రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నాయి. ఉద్ధవ్‌పై తిరుగుబాటు చేసి, ముందుగా జట్టు కట్టిన ఏక్నాథ్ సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సుప్రీం సమర్థిస్తే, సమీకరణాలు మారతాయి. ఆ పరిస్థితుల్లో సీఎం ఏక్నాథ్ అనర్హుడవడంతో పాటు ప్రస్తుత బీజేపీ – ఏక్నాథ్ శిందే ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. అప్పుడిక కొత్త మిత్రపక్షంగా అజిత్‌ను కలుపుకోవాలన్నది బీజేపీ వ్యూహం. దానికి తగ్గట్టే ఎన్సీపీని చీల్చి, శరద్‌కు రాజకీయ వారసుడిగా బీజేపీతో అజిత్ చేతులు కలుపుతారని గుప్పు మంది. అనివార్యతను అర్థం చేసుకున్న శరద్ గతంలో ఎన్టీఆర్, ములాయమ్ సింగ్‌ల లాగా వార సత్వ పోరులో బలికావడం ఇష్టం లేక వ్యూహాత్మకంగా రాజీనామా అస్త్రం సంధించినట్టుంది. శరద్ రాజీనామాపై ఇతరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ, వయసు, ఆరోగ్యరీత్యా శరద్ నిర్ణయాన్ని గౌరవించాలనీ, ఆయన రాజీనామాను వెనక్కి తీసుకోరనీ భవిష్యత్తు గురించి మాట్లాడు తున్నది ఒక్క అజితే. దీన్నిబట్టి సూక్ష్మం గ్రహించవచ్చు. రక్తసంబంధీకులతో శరద్ తన నిర్ణయాన్ని ముందే చర్చించారట. బాబాయ్ ప్రకటన తర్వాతా తొణకని, బెణకని అబ్బాయ్ అజిత్ అందరిలా రాజీనామా ఉపసంహరణకు అభ్యర్థించకపోగా, ‘ఏదో ఒకరోజు ఇది జరగాల్సిందేగా’ అనడం పవర్ పాలిటిక్స్‌కు పరాకాష్ఠ. సీఎం కావాలన్న అజిత్ ఆశతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ లను కీలుబొమ్మలుగా ఆడిస్తూ, ప్రత్యర్థులను వేధించే బీజేపీ ఘనచరితా దీనికి కారణమే. దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్న ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్ వగైరా సైతం శరద్‌తో అనివార్యత చర్చించి, ఒప్పించారట. ఎమ్మెల్యేలు బీజేపీతో నెయ్యానికి తొందరపడుతున్న వేళ ఈ సుదీర్ఘ లౌకిక రాజకీయ వాది పార్టీని కాపాడుకుంటూనే, తన చేతికి మరక అంటని రీతిలో తాజా వ్యూహానికి తెర తీశారు. మిగిలిన మూడేళ్ళ రాజ్యసభ సభ్యత్వంలోనూ బాధ్యతలేమీ తీసుకోకుండా, దేశం కోసం, మహారాష్ట్ర కోసం పనిచేస్తానని శరద్ ఉప్పందించారు. అంటే, రేపు ఒకవేళ అజిత్ సారథ్యంలో ఎన్సీపీ కాషాయపార్టీతో అంటకాగినా పార్టీ వైఖరికి తాను కట్టుబడట్లేదని అనేందుకు ఆత్మరక్షణ సిద్ధం చేసుకున్నారు. ప్రతిపక్షాలేవీ తనను తప్పుబట్టే వీలు లేకుండా చూసుకున్నారు. పార్టీ అధినేత ఎంపిక బాధ్యతను పైకి 15 మంది సభ్యుల కమిటీకి అప్పగించినా, ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కుమార్తె సుప్రియకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు, సీఎం అభ్యర్థిగా అజిత్‌కు మహారాష్ట్ర కిరీటం కట్టబెడతారని కథనం. శరద్ రాజీనామాతో ఇప్పటికే పార్టీ జాతీయ కార్యదర్శి సహా పలువురు పక్కకు తప్పుకున్నారు. ఈ పరిణామాలతో ఎన్సీపీకి, మహారాష్ట్రలో మహావికాస్ ఆఘాడీ కూటమికి జరిగే నష్టం మాటేమో కానీ జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కే మరింత కష్టం, నష్టం. ప్రతిపక్ష ఐక్యతపైనా, మాజీ కాంగ్రెస్ వాది శరద్ వ్యూహరచనపైనా హస్తం పార్టీ ఆశలు నీరుగారతాయి. 2024 ఎన్నికల వేళ బీజేపీకి ఇది లాభదాయకమే. అయితే, అజిత్‌కు దోవ ఇస్తున్నట్టు ఇస్తూనే, పార్టీపై పట్టు చూపుతున్న శరద్ పవార్ అంత తొందరగా కాడి కింద పడేస్తారా? ఇంతకీ, ముందుగానే జోస్యం చెప్పిన సుప్రియ పేర్కొన్న ఆ రెండో ప్రకంపన ఏమిటి? వేచి చూడాల్సిందే. -
శరద్ పవార్ రాజీనామా చేశారంటే.. దేశ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది..!
ముంబై: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం తనను షాక్‌కు గురి చేసిందని తెలిపారు ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్. ఆయన అంత పెద్ద నిర్ణయం తీసుకన్నారంటే కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ ఏదో అలజడి జరగబోతోందని అన్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంతో చూసి తాము ఓ నిర్ణయం తీసుకుంటామని రౌత్ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై ఓ కన్నేసి ఉంచిననట్లు తెలిపారు. గతంలో బాలాసాహెబ్ థాక్రే కూడా దిగజారుడు రాయకీయాలు చూసి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే శివసైనికుల విజ్ఞప్తులతో బాలాసాహెబ్ అప్పుడు తన నిర్ణయాన్ని ఉపసంహరిచుకున్నారని, ఇప్పుడు పవార్ కూడా రాజీనామాను వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. పవార్‌ను బాలాసాహెబ్‌తో పోల్చారు. చదవండి: శరద్ పవార్ రాజీనామా తదనంతరం మరో ఎన్సీపీ నేత రాజీనామా కాగా.. తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్ల పవార్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్సీపీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేయవద్దని ప్రాధేయపడుతున్నారు. ఓ కార్యకర్త అయితే రాజీనామా ఉపసంహంరించుకోవాలని పవార్‌కు రక్తంతో లేఖ రాశాడు. మరోవైపు పవార్ రాజీనామా అనంతరం ఎన్సీపీ కార్యదర్శి జితేంద్ర అవ్హాద్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. థానే ఎన్సీపీ ఆఫీస్ బేరర్లు అందరూ కూడా రాజీనామ ా చేసినట్లు తెలిపారు. పవార్ తప్పుకోవడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు.. -
శరద్ పవార్ రాజీనామా: మరో ఎన్సీపీ నేత షాకింగ్ నిర్ణయం!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సీనియర్ నాయకుడు శరద్ పవార్ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వెంటనే పార్టీలో అనూహ్యా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆయన రాజీనామా తదనంతరం పలువురు నేతల రాజీనామా పర్వం పెరిగింది. ఈ మేరకు ఆ మరుసటి రోజే ఎన్సీపీ నేత, ఎమ్మెల్యే జితేంద్ర అవద్ తన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఆయన తోపాటు పలువురు ఆఫీస్ బేరర్లు కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఎన్సీపీ నాయకుడు జితేంద్ర అవద్ మాట్లాడుతూ..తాను జాతీయ కార్యదర్శి పదవికి రాజీనామా చేశానని తన రాజీనామాని ఎన్సీపీ నేత అధినేత శరద్ పవార్‌కి పంపినట్లు కూడా తెలిపారు. ఎన్సీప్ పార్టీ చీఫ్ శరద్ పవార్ రాజీనామా ప్రకటన తదనందరం థానేలోని అన్ని ఆఫీస్ బేరర్లు కూడా రాజీనామా చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా శరద్ పవార్ తన ఆత్మకథ లోక్ మేజ్ సంగతి రెండవ ఎడిషన్ ప్రారంభోత్సవంలో తాను ఎన్సీపీ అధ్యక్ష పదవినుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఇకపై ఎన్నికల్లో పోటీచేయనని అన్నారు. అంతేగాదు తన రాజ్యసభ పదవీకాలం మూడేళ్లు ఉందని, ఈ మూడేళ్లో రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన సమస్యలపై దృష్టిసారిస్తానని చెప్పుకొచ్చారు పవార్. (చదవండి: శరద్ పవార్ రాజీనామా: పారిశుధ్య కార్మికుడి విజ్ఞప్తి.. సుప్రియా సూలే ఆసక్తికరమైన వీడియో) -
మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలం!
-
Adani Row: ఆయన స్వరం మారింది
ముంబై: హిండెన్‌బర్గ్-అదానీ వ్యవహారంపై విపక్ష నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్వరం మార్చారు. ఈ అంశంపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ)ని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ సమావేశాలను సైతం విపక్షాలు స్తంభింపజేశాయి. అయితే.. విపక్షాల జేపీసీ డిమాండ్‌కు తాము అంగీకరించబోమని, కాకుంటే విపక్షాల ఐక్యత కోసం వాళ్ల డిమాండ్‌ను వ్యతిరేకించబోమని మంగళవారం ప్రకటించారాయన. ఈ విషయంలో(జేపీసీ డిమాండ్) మా మిత్ర పార్టీలతో మేం విబేధిస్తున్నాం. మద్దతు ఇవ్వం. కానీ, మేం ఐక్యంగా కొనసాగాలనుకుంటున్నాం. అందుకే విపక్షాల డిమాండ్‌ను వ్యతిరేకించకూడదని నిర్ణయించుకున్నాం అని ఓ మరాఠీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవార్ తెలిపారు. అంతకు ముందు ఇదే ఎన్సీపీ చీఫ్ హిండెన్‌బర్గ్-అదానీ అంశంపై జేపీసీ విచారణకు తాను పూర్తిగా వ్యతిరేకం కాదని పేర్కొన్నారాయన. ఈ విషయంలో సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు ప్యానెల్ మరింత ఉపయోగకరంగా మరియు ప్రభావవంతంగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, కొన్నిరోజులకే ఆయన స్వరం మార్చారు. గత వారం ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ గ్రూప్‌నకు అనుకూలంగా మాట్లాడారు. హిండెన్‌బర్గ్ నివేదిక ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా, కేవలం విమర్శనాత్మకంగా ఉందంటూ పేర్కొన్నారు పవార్. ‘‘గతంలో మేం అధికారిక ప్రభుత్వంపై విమర్శలు చేసిన క్రమంలో పదేపదే టాటా బిర్లా పేర్లు ప్రస్తావించేవాళ్లం. అలా అని వాళ్లు ఈ దేశానికి చేసిన సేవల్ని తప్పు పట్టలేం కదా. ఇప్పుడు అంబానీ, అదానీ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లు కూడా దేశానికి ఏం చేశారన్నది ఓ సారి పరిశీలించాలి. ఆ కమిటీ ద్వారా నిజాలేవీ బయటకు రావని తేల్చి చెప్పారు. ఇప్పటికే చాలా సార్లు మా మీటింగ్‌లో నేను చెప్పాను. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసినా వృథాయే. ఆ కమిటీలో 21 మంది సభ్యులుంటే.. అందులో 15 మంది బీజేపీ వాళ్లే ఉన్నారు. అలాంటప్పుడు నిజాలు బయటకు వస్తాయని నేను అనుకోవడం లేదు. అందుకే నేను ఓ సూచన చేశాను. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఓ స్వతంత్ర కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని చెప్పాను అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పవార్ 2015లో తన ఆటోబయోగ్రఫీలో అదానీనీ పొడుగుతూ.. రాసిన విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. అదానీతో బంధం వల్లే ఆయన విమర్శించలేకపోతున్నారని చెబుతున్నారు. మరోవైపు విపక్షాల ఐక్యతపైనా ఈ అంశం ప్రభావం చూపెట్టవచ్చని, 2024 ఎన్నికల కోసం బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకుని ముందుకు పోవాలన్న కాంగ్రెస్ ప్రయత్నానికి ఇది.. అడ్డుపుల్లాలాంటి ప్రయత్నమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
Hindenburg-Adani: జేపీసీ కంటే కోర్టు కమిటీ అత్యుత్తమం
ముంబై: కుబేరుడు గౌతమ్ అదానీ షేర్ల కొనుగోలు వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలంటూ కొద్దిరోజులుగా విపక్ష పార్టీలు ఉమ్మడిగా డిమాండ్ చేస్తున్న వేళ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భిన్నమైన వాదన చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘విపక్షాల జేపీసీ డిమాండ్‌తో నేను పూర్తిగా విభేదించడం లేదు. కానీ జేపీసీ కంటే సర్వోన్నత న్యాయస్థానం కమిటీ ఈ వివాదాన్ని మరింత అర్థవంతంగా, ప్రభావవంతంగా పరిష్కరించగలదని భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ‘గతంలో కొన్ని జేపీసీలకు అధ్యక్షత వహించిన అనుభవం నాకుంది. అదానీ–హిండెన్‌బర్గ్ ఉదంతంలో ఒకవేళ జేపీసీ వేస్తే అందులో 21 మంది సభ్యులుంటారు. పార్లమెంట్లో పార్టీల సంఖ్యాబలం ఆధారంగా 15 సభ్యత్వాలు అధికార పార్టీకే దక్కుతాయి. ఇక మిగిలిన ఆరుగురే విపక్షాలకు చెందిన వారు ఉంటారు. ఇది ప్యానెల్ పనితీరుపై అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంది. జేపీసీ ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించట్లేను. దాని కంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల ప్యానెల్ ప్రభావవంతంగా పనిచేయగలదు. నిర్ణీత కాలావధిలో నివేదించగలదు’ అని పవార్ అభిప్రాయపడ్డారు. కాగా, ఇటీవల ఒక జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ సంస్థకు పవార్ మద్దతిస్తూ హిండెన్‌బర్గ్‌ను విమర్శించడం గమనార్హం. ‘అదానీ గ్రూప్‌పై అమెరికా కేంద్రంగా పనిచేసే చరిత్రలేని ఏదో సంస్థ మాట్లాడితే దానికి ఎంత విలువ ఇవ్వాలో మనం నిర్ణయించుకోవాలి. ఇలాంటి ప్రకటనలు, నివేదికలు గతంలోనూ పలు సందర్భాల్లో వచ్చాయి. ఇలాంటి వాటి కారణంగా తాజాగా పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీనికి అనవసర ప్రాధాన్యం ఇచ్చాం. నిరుద్యోగం, పెరిగిన ధరలు, రైతు సమస్యలు ఇలా దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటిని వదిలేసి ఇలా అప్రధాన అంశాలను పట్టించుకుంటే ఇవి దేశ ఆర్థికవ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయి. వీటిని చూస్తుంటే కావాలనే ఏదో లక్ష్యంగా చేసుకుని ఈ తరహా అంశాలను లేవనెత్తుతున్నారు అనిపిస్తోంది ’ అని పవార్ వ్యాఖ్యానించారు. జేపీసీ పట్ల పవార్ విముఖత వ్యక్తంచేయడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ‘ ఈ అంశంలో 19 భావసారూప్య పార్టీలు ఒకే డిమాండ్‌తో ముందుకెళ్తున్నాయి. అయితే ఎన్సీపీకి సొంత అభిప్రాయాలు ఉండొచ్చు’ అని అన్నారు. పవార్ అభిప్రాయం మహారాష్ట్రలో, దేశంలో విపక్షాల ఐక్యతకు బీటలు పడేలా చేయలేదని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పష్టంచేశారు. -
కర్ణాటకలో కాంగ్రెస్‌దే హవా! శరద్ పవార్
కర్ణాటకలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా అని ధీమాగా చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇటర్వ్యూలో మాట్లాడుతూ..కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసే గెలుస్తుందని నమ్మకంగా చెప్పారు. ఐతే ఈ ఎన్నికలను వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల కోణంలో చూడలేం. కానీ బీజేపీ మాత్రం ఎన్నికల ప్రచారంలో జాతీయ అంశాలను రాష్ట్ర సమస్యలతో ముడిపెట్టే యత్నం చేస్తోంది. నా అంచనా ప్రకారం కర్ణాటకలో రెండు రకాలు ఎన్నికలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఇవి జాతీయ ఎన్నికలు కానీ రాష్ట్రాలకు సాధారణ ఎన్నికలే. ఐతే రాష్ట్ర ఎన్నికల్లో వేరే గేమ్ స్ట్రాటజీ ఉంటుంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో బీజేపీ ప్రభుత్వాలు కావు అందువల కర్ణాటకలో కచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే రాష్ట్రాలలో బీజేపీయేతర పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలుపొందాయో అందరికీ తెలుసు కాబట్టి రాష్ట్ర ఎన్నికల విషయానికి వస్తే వాస్తవ పరిస్థితులను విభిన్నంగా ఉంటాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ఎమ్మెల్యేలు విడిపోయి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలే అధికారంలో ఉన్నాయి. వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల గురించి ప్రతిపక్షాలు కలిసి ఏదో ఒకటి చేయాలని లేకుంటే బీజేపీని ఓడించడం కష్టం. అందరూ ఐక్యంగా ఉండి చేస్తే గానీ బీజేపీని మట్టికరిపించలేం అని పవార్ అన్నారు. కాగా, ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. 2008లో దేశంలో దక్షిణాది ప్రాంతంలో తొలిసారిగా అధికారంలోకి రావడంతో అదే రాష్ట్రంలో మరో దఫా విజయం సాధించాలని బీజేపీ గట్టిగా యత్నిస్తోంది. (చదవండి: కర్ణాటక ఎన్నికల్లో పన్నీరు శిబిరం) -
ముంబై.. క్షణ క్షణం ఉద్రిక్తం..
సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ మహారాజ్, జ్యోతి బా పూలే, డా.బీఆర్ అంబేడ్కర్‌లపై గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఓవైపు మహావికాస అఘాడీ మహా మోర్చా పేరుతో శనివారం ఆందోళనకు దిగింది. ఎమ్వీఏ మహా మోర్చాలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేరారు. నిరసన ర్యాలీ ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్, డాక్టర్ సావిత్రీబాయి ఫూలే, ఇతర గొప్ప వ్యక్తులపై ఏలాంటి కామెంట్స్ చేసినా మహారాష్ట్ర ప్రజలు సహించరని ఎన్సీపీ నేత దిలీప్ వాల్సే పాటిల్ తెలిపారు. రాష్ట్ర చరిత్రను మార్చేందుకు ప్రయత్నించరాదని షిండే ప్రభుత్వాన్ని హెచ్చరించారు,. महाविकास आघाडीचे प्रमुख नेते महामोर्च्याचं नेतृत्व करताना!#HallaBol #हल्लाबोल #MaharashtraPrem #Maharashtra pic.twitter.com/jic5ELa2cq — Shivsena Communication (@ShivsenaComms) December 17, 2022 మరోవైపు మాఫీ మాంగో మోర్చా పేరుతో బీజేపీ కూడా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముంబై అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఓ వైపు విపక్షం మరోవైపు ప్రభుత్వంలోని ఓ పార్టీ ఆందోళనలకు దిగడంతో పోలీసులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఆందోళన, ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యగా ముంబైలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎందుకు మహామోర్చా? మహా వికాస్ ఆఘాడి ఈ నెల 17వ తేదీ శనివారం ముంబైలో నిర్వహించనున్న మహా మోర్చాకు ముంబై పోలీసులు అనుమతి ఇచ్చినట్టు శివసేన ఠాక్రే వర్గం నేత అనీల్ పరబ్ మీడియాకు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, మహాత్మ పూలేలపై బీజేపీ నేతలు, గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు నిరసనగా మహావికాస్ ఆఘాడి ఆధ్వర్యంలో ఈ మహామోర్చా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా శిందే, ఫడ్నవీస్ ప్రభుత్వం కూడా వారు చేసిన వ్యాఖ్యలను సమరి్ధస్తోందని ఈ సందర్భంగా మహావికాస్ ఆఘాడి నేతలు ఆరోపించారు. అదేవిధంగా రోజురోజుకు ముదురుతున్న మహారాష్ట్ర–కర్ణాటక సరిహద్దు వివాదంపై శిందే సర్కారు నోరు మెదపడం లేదు. ఇలా అనేక అంశాలను ఖండిస్తూ ముంబైలో మహామోర్చాను తలపెట్టింది. మాఫీ మాంగో మోర్చా... మహావికాస్ ఆఘాడి నిర్వహించే మహామోర్చాకు దీటుగా బీజేపీ శనివారం మాఫీ మాంగో మోర్చా నిర్వహించనుందని బీజేపీ నేత ఆశీష్ శేలార్ మీడియాకు తెలిపారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ చరిత్ర తెలియకుండా ఆయన జన్మస్థలంపై ఎంవీఏ నేతలు వివాస్పద వ్యాఖ్యలు చేస్తారని, మరోవైపు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సుష్మా అంథారే తమ దైవాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఈ వ్యాఖ్యలపై సంజయ్ రావత్ క్షమాపణ చెప్పాలని ఆశీష్ శెలార్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్దవ్ ఠాక్రే కూడా దీనిపై తన వైఖరిని స్పష్టం చేయాలన్నాని కోరారు. పోలీసు బందోబస్తు... మహావికాస్ ఆఘాడి, బీజేపీల మహా మోర్చా, మాఫీ మాంగో మోర్చాల నేపథ్యంలో ముంబైలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై వ్యాప్తంగా సుమారు రెండున్నవేలకు పైగా పోలీసులను మోహరించారు. అదేవిధంగా దీనికి సంబంధించిన బాధ్యతలు ఇద్దరు అడిషనల్ కమిషనర్లు, నాలుగు నుంచి అయిదుగురు డిప్యూటి పోలీసు కమిషనర్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ ఆందోళన సందర్భంగా ఎస్ఆర్పీఏ బలగాలతోపాటు డ్రోన్‌కెమెరాలతో పరిసరాలపై దృష్టి కేంద్రీకరించారు. -
ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు బెదిరింపులు.. మళ్లీ అతడే..!
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌కు బెదిరింపులు వచ్చాయి. మహారాష్ట్ర ముంబైలోని సిల్వర్ ఓక్లో పవార్ నివాసానికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. షూట్ చేసి చంపేస్తానని హెచ్చరించాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడ్ని గుర్తించారు. ఫోన్ చేసిన వ్యక్తి బిహార్‌కు చెందిన వాడని పోలీసులు వెల్లడించారు. ఇతను గతంలోనూ ఓసారి పవార్‌ను చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు. అయితే అప్పుడు అరెస్టు చేసి వదిలేశామని తెలిపారు. ఇప్పుడు అదే వ్యక్తి మళ్లీ బెదిరింపు కాల్ చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. అతని కోసం వెతుకుతున్నామని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వివరించారు. చదవండి: ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు.. 24 గంటల్లోపే అరెస్ట్ -
‘మహా’ పాలిటిక్స్.. బీజేపీతో చేతులు కలిపిన ఎన్సీపీ!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించే పరిస్థితులు కనిపించటం లేదు. ప్రత్యర్థులుగా ఉన్నవారు మిత్రులుగా మారటం, మిత్రులు ప్రత్యర్థులుగా మారటం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. మరోమారు.. అలాంటి సంఘటనే ఎదురైంది. విపక్ష పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్.. బీజేపీతో చేతులు కలిపారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలకు బీజేపీ, ఎన్సీపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తోంది. ఈ మేరకు సోమవారం బీజేపీ ముంబై అధ్యక్షుడు ఆశిష్ షెలార్‌తో సమావేశమయ్యారు శరద్ పవార్. ఆశిష్ షెలార్- శరద్ పవార్ గ్రూప్ కలిసి అభ్యర్థిని బరిలో దింపాయి. అంతకు ముందు.. ఎంసీఏ అధ్యక్ష పదవికి భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్‌కు శరద్ పవార్ గ్రూప్ మద్దతు తెలిపింది. కానీ, ఆ తర్వాత సమీకరణాలు మారిపోయాయి. బీజేపీతో కలిసి ఎంసీఏ ఎన్నికల బరిలో నిలుస్తోంది ఎన్సీపీ. ఎంసీఏ అపెక్స్ కౌన్సిల్ మెంబర్‌గా ఈ కూటమి ఎమ్మెల్యే జితెంద్ర అహ్వాద్ బరిలో నిలుస్తున్నారు. పవార్-షెలార్ గ్రూప్ నుంచి ఉద్ధవ్ థాక్రే పీఏ మిలింద్ నర్వేకర్ పోటీ చేస్తున్నారు. మరోవైపు.. షిండే గ్రూప్ ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ కుమారుడు విహాంగ్ సర్నాయ్ ముంబై ప్రీమియర్ లీగ్ టీ20 ఛైర్మన్ పదవి బరిలో నిలిచారు. ఈ మేరకు ఆశిష్ ,షెలార్‌తో శరద్ పవార్ కూటమి ఏర్పాటు చేసినట్లు ఓ లేఖ విడుదల చేశారు. లేఖపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మిలింద్ నర్వేకర్ ట్వీట్ చేశారు. అందులో ఆశిష్ షెలార్ ఫోటో కనిపిస్తోంది. అక్టోబర్ 20న ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. పవార్-షెలార్ సంయుక్త గ్రూప్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ సన్నిహితుడు అమోల్ కాలే ఉపాధ్యక్షుడి బరిలో నిలవనున్నారు. మరోవైపు.. 2019-22 వరకు ఉపాధ్యక్షుడిగా కొనసాగిన పవార్ గ్రూప్ అభ్యర్థి అజింక్య నాయక్ సెక్రెటరీగా కొనసాగే అవకాశం ఉంది. దీపక్ పాటిల్ సంయుక్త కార్యదర్శి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి: తలాక్‌లపై కేంద్రానికి సుప్రీం నోటీసులు -
మహారాష్ట్రకు కొత్త సీఎం.. ఫోటోలు వైరల్!
ముంబై: ఏక్నాథ్ శిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో మొదలైన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే వర్గంతో మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో కొన్ని ఫోటోలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీలో.. ఏక్నాథ్ షిండే కుమారుడు, లోక్‌సభ ఎంపీ శ్రీకాంత్ షిండే కూర్చోవటం వివాదానికి దారి తీసింది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సూపర్ సీఎం: ఎన్సీపీ శివసేన వ్యవస్థాపకులు బాలా సాహేబ్ థాక్రే ఫోటో ముందు ఉన్న కుర్చీలో శ్రీకాంత్ షిండే కూర్చున్న చిత్రాలను ట్వీట్ చేశారు ఎన్సీపీ అధికార ప్రతినిధి రవికాంత్ వార్పే. ఆ కుర్చి వెనకాలే ఉన్న బోర్డుపై ‘మహారాష్ట్ర ప్రభుత్వం- ముఖ్యమంత్రి’ అని రాసి ఉంది. ఈ క్రమంలో సూపర్ సీఎం అంటూ పేర్కొన్నారు రవికాంత్. ఇది ఎలాంటి రాజధర్మమని ప్రశ్నించారు. మరోవైపు.. సీఎం కుర్చీపై జోకులు వేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు తన సానుభూతి తెలుపుతున్నట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు శివసేన నాయకురాలు ప్రియాంక ఛతుర్వేది. ఆధిత్య థాక్రే ఒక మంత్రిగా ప్రభుత్వ వ్యవహారాలు చూసుకుంటే వారికి సమస్య అనిపించిందని, కానీ, శ్రీకాంత్ షిండే కనీసం ఎమ్మెల్యే కాకపోయినా ఎలాంటి సమస్య లేదని ఎద్దేవా చేశారు. खा.श्रीकांत शिंदे यांना सुपर सीएम झाल्याबद्दल हार्दिक शुभेच्छा. मुख्यमंत्र्यांच्या गैरहजेरीत त्यांचे चिरंजीव मुख्यमंत्री पदाचा कारभार सांभाळतात.लोकशाहीचा गळा घोटण्याचे काम सुरूय.हा कोणता राजधर्म आहे?असा कसा हा धर्मवीर?@mieknathshinde @DrSEShinde pic.twitter.com/rpOZimHnxL — Ravikant Varpe - रविकांत वरपे (@ravikantvarpe) September 23, 2022 తిప్పికొట్టిన షిండే.. ఈ క్రమంలో విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు శ్రీకాంత్ షిండే. ఆ ఫోటో తన నివాసంలో తీసుకున్నదని, తన తండ్రి కోసం అధికారికంగా కేటాయించిన కుర్చీలో కూర్చోలేదని స్పష్టం చేశారు. అలాగే.. అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం సైతం కాదని, థానేలోని ప్రైవటు నివాసం, ఆఫీసుగా వెల్లడించారు. వెనకాల ఉన్న బోర్డును తరుచూ తరలిస్తుంటారని, తన నివాసం నుంచే వర్చువల్‌గా సమావేశాలు నిర్వహిస్తున్నందున అక్కడ ఉందని వివరణ ఇచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ ఆఫీసును సీఎం, తానూ ఉపయోగిస్తానని వెల్లడించారు. ఇదీ చదవండి: సీఎంగా నా వారసుడిని వారే నిర్ణయిస్తారు: గెహ్లాట్ -
ఎన్నికలకు ముందే బలమైన విపక్ష కూటమి: పవార్
ముంబై: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఒక కూటమిని ఏర్పాటు చేస్తాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బుధవారం చెప్పారు. జాతి ప్రయోజనాల కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీతో తనకున్న విభేదాలను పక్కన పెట్టి చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో జట్టు కట్టడానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకి కూడా అభ్యంతరాలు లేవన్నారు. విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధం విపక్ష నేతలను అరెస్ట్చేయడం, కేసులు పెట్టించడంలోనే మోదీ సర్కార్ బిజీగా ఉందని పవార్ విమర్శించారు. ‘‘కేంద్ర ప్రాయోజిక ప్రధాన పథకం ఇదేనేమో. పాత్రా చాల్ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. నా పాత్ర లేదని తేలితే నాపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై ఏం చర్యలు తీసుకుంటారు’’ అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: అందరూ కోరితే రెడీ.. అధ్యక్ష పదవికి పోటీపై గెహ్లాట్ వ్యాఖ్యలు -
టార్గెట్ శరద్ పవార్.. ఎన్సీపీ ‘కంచుకోట’పై బీజేపీ కన్ను!
ముంబై: మహారాష్ట్రలో కొద్ది నెలలుగా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయింది. శివసేన నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేలు.. బీజేపీతో చేతులు కలపటంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత షిండే సీఎం పీఠం అధిరోహించారు. 2024 ఎన్నికలపై దృష్టి సారించి రాష్ట్రంలో బీజేపీ పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కంచుకోటపై కన్నేసింది బీజేపీ. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్న ‘బారామతి’ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ విషయాన్ని స్వయానా.. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ‘గత ఆరు నెలలుగా 16 పార్లమెంటరీ సీట్లపై బీజేపీ దృష్టి పెట్టింది. అందులో శ్రీకాంత్ షిండే సీటు సైతం ఉంది. ప్రస్తుతం వారు మాతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-శివసేనలు కలిసి కూటమిగా పోటీ చేస్తాయి. మాతో ఉన్నవారు గెలిచేందుకు కృషి చేస్తాం. ఈ 16 నియోజకవర్గాల్లో బారామతి సైతం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అక్కడ మాకు మంచి మద్దతు లభించింది. మేము గెలుపే లక్ష్యంగా పని చేస్తాం. ఈ 16 స్థానాల బాధ్యతలను కేంద్ర నాయకులకు అప్పగించారు. బారామతికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్‌ను ఇంఛార్జ్‌గా నియమించారు. సెప్టెంబర్‌లో నియోజకవర్గంలో పర్యటిస్తారు. ’ అని తెలిపారు దేవేంద్ర ఫడ్నవీస్. ఇదీ చదవండి: సంజయ్ రౌత్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.. ఆ వినతికి కోర్టు నో! -
‘మహా’ రాజకీయాల్లో మరో మలుపు.. శరద్ పవార్ సంచలన నిర్ణయం
ముంబై: మహారాష్ట్రలో అధికార మార్పిడితో రాజకీయాలు వేడెక్కిన వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీలోని అన్ని విభాగాలు, సెల్స్‌ను రద్దు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రఫుల్ పటేల్ ట్వీట్ చేశారు. ‘ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ఆమోదంతో తక్షణమే అన్ని విభాగాలు, సెల్స్ రద్దయ్యాయి.’ అని పేర్కొన్నారు. అయితే.. నేషనలిస్ట్ మహిళా కాంగ్రెస్, నేషనలిస్ట్ యువ కాంగ్రెస్, నేషనలిస్ట్ విద్యార్థి కాంగ్రెస్‌లను మినహాయించినట్లు చెప్పారు. With the approval of our National President Hon'ble Shri Sharad Pawar Saheb, all the National level Departments and Cells of @NCPspeaks excluding Nationalist Women's Congress, Nationalist Youth Congress and Nationalist Students Congress stand dissolved with immediate effect. — Praful Patel (@praful_patel) July 20, 2022 అయితే.. పార్టీలో ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం వెనక గల కారణాలను వెల్లడించలేదు కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయిన కొన్ని రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. శివసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఎన్సీపీ కీలక భూమిక పోషించింది. శివసేన నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో వారి ప్రభుత్వం కూలిపోయింది. షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆ రాష్ట్రంలో ఇంకా రాజకీయ వేడి తగ్గలేదు. ఇదీ చదవండి: శరద్ పవార్ (ఎన్సీపీ లీడర్) రాయని డైరీ -
Uddhav Thackeray: ఉద్ధవ్ థాక్రేకు ఊహించని షాక్
Shiv Sena leader Uddhav Thackeray.. మహారాష్ట్రలో పొలిటికల్ వాతావరణం ఇంకా చల్లబడలేదు. బీజేపీ మద్దతుగా శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా.. ఉద్ధవ్ థాక్రేకు మరోసారి ఊహించని దెబ్బ తగిలింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మద్దతు తెలపడం మహా వికాస్ అఘడి (ఎంవీఏ)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉద్ధవ్ థాక్రే నిర్ణయంపై కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత బాలాసాహెట్ థోరట్.. శివసేనసై సంచలన విమర్శలు చేశారు. కాగా, బాలాసాహెబ్ ట్విట్టర్ వేదికగా.. శివసేన ఎందుకు ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తుందో తెలపాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇచ్చే ముందు ఎందుకు ఎంవీఏ కూటమితో చర్చించలేదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తూ అప్రజాస్వామిక పద్ధతిలో మహారాష్ట్రలో ఎంవీఏ సర్కార్‌ను కూల్చి, శివసేన ఉనికినే సవాల్ చేసిన బీజేపీ కూటమికి రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన ఎలా మద్దతు ఇస్తుందని ప్రశ్నించారు. మరో అడుగు ముందుకేసి.. రాష్ట్రపతి ఎన్నిక భిన్న సిద్ధాంతాల మధ్య పోరుగా మారిందని, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటం కోసం సాగుతోందని అన్నారు. అంతా వారి ఇష్టమేనా(శివసేన) అని పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. శివసేన వైఖరిపై అటు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చే విషయంలో ఎంవీఏకు శివసేన ముందస్తు సమాచారం ఇవ్వలేదని వెల్లడించింది. కాగా, మహారాష్ట్రలో శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీ భాగస్వామ్యంతో(ఎంవీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. राष्ट्रपती पदाची निवडणूक ही वैचारिक लढाई आहे. लोकशाही आणि संविधान रक्षणासाठी सुरू असलेला हा संघर्ष आहे. स्त्री, पुरुष किंवा आदिवासी, बिगर आदिवासी अशी ही लढाई नाही. जे संविधान आणि लोकशाहीच्या संरक्षणाच्या बाजूने आहेत ते सर्व यशवंत सिन्हा यांना पाठिंबा देत आहेत. pic.twitter.com/LSykyJ0b6L — Balasaheb Thorat (@bb_thorat) July 12, 2022 -
శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటికి బెయిల్..
Marathi Actress Ketaki Chitale Got Bail Over Post Against Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌ను అవమానకర రీతిలో ప్రస్తావించిందన్న ఆరోపణలో అరెస్టయిన 29 ఏళ్ల మరాఠీ నటి కేతకి చితాలేకు తాజాగా బెయిల్ మంజూరైంది. సోషల్ మీడియా ఫేస్బుక్లో శరద్‌పై అభ్యంతకర పోస్టులు చేసిందన్న కారణంగా కేతకిని మే 14న థానే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన దాదాపు నెల రోజుల తర్వాత మహారాష్ట్ర థానే జిల్లాలోని కోర్టు బుధవారం (జూన్ 22) బెయిల్ జారీ చేసింది. రూ. 20 వేల పూచీకత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చారు జిల్లా న్యాయమూర్తి హెచ్ఎం పట్వర్దన్. ఇప్పుడు కేతకి థానే సెంట్రల్ జైల నుంచి ఇంటికి వెళ్లవచ్చని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కేతకిపై ఐపీసీ సెక్షన్ 505 (2) (ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం), 500 (పరువు నష్టం), 501 (పరువు నష్టం కలిగించే విషయాన్ని ముద్రించడం, ప్రస్తావించడం), 153 ఏ మతం, జాతి, స్థలం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి కేసులు నమోదయ్యాయి. శరద్ పవార్‌పై అనుచిత పోస్టులు పెట్టిందన్న ఆరోపణలతో నటి కేతకి చితాలే ప్రస్తుతం సుమారు 20కుపైగా ఫిర్యాదులను ఎదుర్కొంటోంది. ఈ కేసు విషయమై పోలీసుల అదుపులో ఉన్నప్పుడు కేతకి చితాలేపై సిరా చుక్కలు చల్లి నిరసన తెలియజేశారు. చదవండి: కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి: సల్మాన్ ఖాన్ -
సోనియా గాంధీతో రేపు శరద్ పవార్ భేటీ.. అందుకేనా ??
-
మహిళా ఎంపీపై బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేసి పాటిల్ వివాదంలో పడ్డారు. ఆయన వ్యాఖ్యలపై ఎన్సీపీ నేతలు మండిపడుతున్నారు. వివరాల ప్రకారం.. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లపై స్టే విధించడంతో గత కొన్ని నెలలుగా మహారాష్ట్రలో పాలిటిక్స్ వేడెక్కాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం న్యాయస్థానాల్లో జరిగిన పోరాటంలో ఉద్దవ్ థాక్రే సర్కార్ ఓడిపోయిందని బీజేపీ ఆరోపిస్తుండగా, కేంద్రమే సరైన డేటాను అందించడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమర్తె, ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌కు ఓబీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నుంచి ఎలా ఉపశమనం లభించిందని ప్రశ్నిస్తూ.. ‘‘ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ‘ఎవరినో’ కలిశారు.. అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియడం లేదు. మరో రెండు రోజుల్లో ఓబీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది’’ అని తెలిపారు. ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిరసనకు నేతృత్వం వహిస్తున్న పాటిల్.. ‘మీకు రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికి వెళ్లి వంట చేసుకోండి’ అని సూలేను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పాటిల్ వ్యాఖ్యలపై సుప్రియా సూలే భర్త సదానంద్ సూలే స్పందించారు. పాటిల్ మాటలను ఖండిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ‘‘ నా భార్యను చూసి గర్వపడుతున్నాను. ఆమె ఒక గృహిణి, తల్లి. అలాగే.. సక్సెస్ఫుల్ పొలిటీషియన్. బీజేపీ నేతలు స్త్రీ ద్వేషులు. వీలైనప్పుడల్లా స్త్రీలను వారు కించపరుస్తారనే ఉంటారు. భారతదేశంలోని అనేక మంది కష్టపడి పనిచేసే, ప్రతిభావంతులైన మహిళలలో నా భార్య కూడా ఒకరు. చంద్రకాంత్ పాటిల్ మాటలు మహిళలందరికీ అవమానకరమే.’’ అని మండిపడ్డారు. ఇది కూడా చదవండి: అసెంబ్లీలో అఖిలేష్ నోట అసభ్యకరమైన పదాలు.. సీఎం యోగి రియాక్షన్ ఇది -
బీజేపీ నేత చెంప చెళ్లుమనిపించారు.. వీడియో వైరల్
BJP Leader Vinayak Ambekar Slapped..ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పెట్టిన పోస్టుల వేడి మహారాష్ట్రలో ఇంకా తగ్గలేదు. శనివారం పవార్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసినందుకు గాను మరాఠీ టీవీ, సినీ నటి కేతకి చిటలే మీద థానే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆదివారం ఆమెను కోర్టులో హాజరుపరుచగా.. మే 18వ తేదీ వరకు పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. తాజాగా పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ మహారాష్ట్ర అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్‌పై ఎన్సీపీ(నేషనలిస్ట్ పార్టీ) నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. ఈ క్రమంలో వారు.. వినాయక్ అంబేకర్ చెంప చెళ్లుమనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్సీపీ కార్యకర్తల దాడికి సంబంధించిన వీడియోను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాటిల్ ట్విటర్ట్ వేదికగా స్పందిస్తూ.. వినాయక్ అంబేకర్‌పై ఎన్సీపీ గుండాలు దాడికి పాల్పడ్డారు. బీజేపీ పార్టీ తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వినాయక్‌పై దాడి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందిస్తూ.. భారత రాజ్యాంగం పౌరులకు భావ ప్రకటన స్వేచ్చను కల్పించందని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. సీనియర్ రాజకీయవేత్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. महाराष्ट्र प्रदेश भारतीय जनता पार्टीचे प्रवक्ते प्रा. विनायक आंबेकर यांच्या वर राष्ट्रवादीच्या गुंडांनी भ्याड हल्ला केला असून, भाजपाच्या वतीने मी या हल्ल्याचा तीव्र शब्दांत निषेध व्यक्त करतो. राष्ट्रवादीच्या या गुंडांवर तात्काळ कारवाई झालीच पाहिजे !@BJP4Maharashtra pic.twitter.com/qR7lNc1IEN — Chandrakant Patil (@ChDadaPatil) May 14, 2022 ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేతలు చూస్తూ కూర్చుంటే సరిపోదు. -
‘మహా’ సంకీర్ణం సాఫీగా సాగుతోంది
పుణే: శివసేన నేతృత్వంలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వం సాఫీగా సాగుతోందని, ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విశ్వాసం వ్యక్తం చేశారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు ఉమ్మడి ప్రణాళికతో ముందుకుసాగాలని నిర్ణయించామన్నారు. పవార్ తన స్వస్థలం బారామతిలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ‘సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నపుడు కొన్ని సమస్యలు వస్తాయి. వాటికి పరిష్కారాలను కనుగొనేందకు ఒక వ్యవస్థ ఉండాలని నిర్ణయించాం. కాంగ్రెస్ నుంచి అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరట్, శివసేన నుంచి ఏక్నాథ్ షిండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్, జయంత్ పాటిల్‌లను ఎంపిక చేసి ఈ బృందానికి సమస్యల పరిష్కార బాధ్యతను అప్పగించాం. విధానపరమైన నిర్ణయాలైనా, ఇబ్బందులు వచ్చినా పై ఆరుగురు నాయకులు సమావేశమై ఒక నిర్ణయానికి వస్తారు’ అని పవార్ పేర్కొన్నారు. అందరి అభిలాష అదే... ‘మహా వికాస్ అఘాడి ప్రభుత్వం సాఫీగా నడుస్తోంది. సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకొని ముందుకుసాగాలనేదే అందరి అభిలాష. కాబట్టి ఈ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకుంటుందనడంలో నాకెలాంటి సందేహం లేదు’ అని 2019లో ఎంవీఏ ఏర్పాటు కీలకపాత్ర పోషించిన సీనియర్ నేత శరద్‌పవార్ వ్యాఖ్యానించారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ... శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు పార్టీలుగా ప్రజల్లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని దేనికదే ప్రయత్నిస్తాయని... అందులో తప్పులేదని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఇటీవల పేర్కొని వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంకీర్ణానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని పవార్ తాజాగా వివరణ ఇచ్చారు. -
శరద్‌పవార్‌కు అనారోగ్యం, కార్యక్రమాలన్నీ రద్దు
-
శరద్‌పవార్‌కు అనారోగ్యం, కార్యక్రమాలన్నీ రద్దు
సాక్షి, ముంబై: ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్ (80) అనారోగ్యానికి గురయ్యారు. శరద్ పవార్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, శస్త్రచికిత్స నిమిత్తం బుధవారం ఆసుపత్రిలో చేరనున్నారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. హోం మంత్రి అమిత్ షాతో శరద్ పవార్ రహస్య మంతనాలు జరిపారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో ఆయన అనారోగ్యం వార్త శ్రేణుల్లో ఆందోళన నింపింది. ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ శరద్‌పవార్ అనారోగ్యం వివరాలపై సోమవారం ట్వీట్ చేశారు. ఆదివారం సాయంత్రం కడుపునొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా, పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్టుగా తేలిందన్నారు. దీంతో తదుపరి సమాచారం అందించేంత వరకు ఆయన కార్యక్రమాలన్నీ రద్దైనట్టు మాలిక్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బ్లడ్ థిన్నర్ (రక్తం గడ్డ కట్టకుండా వుండే) మందులు వాడుతున్న నేపథ్యంలో 2021, మార్చి 31న ఆసుపత్రిలో చేరతారని, ఎండోస్కోపీ, అనంతరం శస్త్రచికిత్స జరగనుందని వెల్లడించారు. అటు తన ఆరోగ్యంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, మహారాష్ట్ర నవనిర్మాన్ సేన నాయకుడు రాజ్ ఠాక్రే , ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన ఆరోగ్యంపై ఆరాతీశారని శరద్ పవార్ ట్వీట్‌చేశారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. హోం మంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్య కీలక భేటీ జరిగిందంటూ మీడియాలో వార్తలు వ్యాపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఎన్సీపీ ఖండించింది. అలాంటిదేమీలేదని, ఇదంతా బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగమని కొట్టి పారేసింది. అటు ఈ వ్యవహారంపై అమిత్ షాను ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా మౌనాన్ని ఆశ్రయించారు. ప్రతి విషయాన్నీ బహిర్గతం చేయ లేమంటూ వ్యాఖ్యానించారు. కాగా పవార్ గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. Received a phone call from Shri @drharshvardhan ji to check about my health. Appreciate him checking on my health and well-being. — Sharad Pawar (@PawarSpeaks) March 29, 2021 Kind attention Our party president Sharad Pawar saheb was feeling a little uneasy due to a pain in his abdomen last evening and was therefore taken to Breach Candy Hospital for a check up. Upon diagnosis it came to light that he has a problem in his Gall Bladder. — Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) March 29, 2021 -
యూపీఏకు పవార్ సారథ్యం?
సాక్షి, న్యూఢిల్లీ: మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్‌ను యూపీఏకు సారథ్యం వహించే దిశగా అడుగులు పడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో శరద్ పవార్ విపక్ష బృందానికి సారథ్యం వహించి బుధవారం రాష్ట్రపతిని కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీకి ముందు రైతుల అభ్యంతరాల అధ్యయనం, విపక్షాలను ఏకం చేసేందుకు పవార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. శరద్ పవార్ నివాసంలో రైతుల సమస్యలపై విపక్ష నాయకులతో సమావేశాలు సైతం జరిగాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రపతితో భేటీ తర్వాత యూపీఏ అధ్యక్ష బాధ్యతల మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నారు? 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా మారారు. అయితే, వయోభారం కారణంగా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకొనేందుకు, యూపీఏ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగేందుకు సోనియా గాంధీ విముఖత చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, త్వరలోనే ఆ బాధ్యతలను అనుభవం కలిగిన నేతకు అప్పగించాలని చర్చ జరుగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గతంలో సోనియా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినప్పటికీ, యూపీఏ చైర్‌పర్సన్‌గా, పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా కొనసాగారు. ఈసారి మాత్రం ఆమె రాజకీయాలకే రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమయ్యారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో సోనియాగాంధీ స్థానాన్ని భర్తీ చేసేందుకు అనుభవజ్ఞుడైన, అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపగల చైర్పర్సన్ అవసరమని యూపీఏ భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన శరద్ పవార్, సోనియా గాంధీ తర్వాత తదుపరి యూపీఏ చైర్‌పర్సన్‌గా ఎంపిక విషయంలో ముందు వరుసలో ఉన్నారు. యూపీఏ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే విషయంలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ వంటి ప్రాంతీయ పార్టీ నాయకులు ఉన్నప్పటికీ, రాజకీయంగా వారు ఇతర పార్టీ నాయకులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పవార్ ఎందుకంటే.. ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరాఠా యోధుడు శరద్ పవార్‌కు దాదాపు అన్ని పార్టీలతో కలిసి ముందుకు సాగే స్వభావం ఉంది. మహారాష్ట్రలో బీజేపీకి షాకిచ్చి ఎన్సీపీ–శివసేన–కాంగ్రెస్ కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పవార్ కీలక పాత్ర పోషించారు. రాజకీయ సూత్రధారిగా కూడా శరద్ పవార్ ఏడాదిగా సక్సెస్ అయ్యారు. ఇతర రాజకీయ పార్టీలతో కలుపుకొని ముందుకెళ్ళే స్వభావం, యూపీఏ చీఫ్‌గా పొత్తులను నిర్వహించేటప్పుడు కీలకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాహుల్‌గాంధీతో మాట్లాడేందుకే ఇష్టపడని మమతా బెనర్జీతో పోలిస్తే, పవార్ వ్యవహార శైలి కారణంగా పొత్తు రాజకీయాలు కష్టం కాకపోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. అదంతా ఒట్టిదే: ఎన్సీపీ ముంబై: సోనియాగాంధీ వైదొలిగితే యూపీఏ సారథ్య బాధ్యతలను తమ నేత శరద్ పవార్ చేపట్టే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలను ఎన్సీపీ ఖండించింది. అవన్నీ మీడియా ఊహాగానాలేనని ఎన్సీపీ ప్రతినిధి మహేశ్ తపసే కొట్టిపారేశారు. ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, కొందరి స్వార్థం కోసం ఇటువంటి నిరాధార అంశాలను మీడియా బయటకు తెస్తోందని ఆయన ఆరోపించారు. శరద్ పవార్(80) జాతీయ స్థాయి పాత్ర సైతం పోషించగల సమర్థులు, జనం నాడి తెలిసిన వ్యక్తి అని శివసేన పేర్కొంది. -
ముంబై కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్సీపీ సన్నద్దం?
సాక్షి ముంబై: రాబోయే బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే విషయంపై ఆయా పార్టీల అధినేతలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్సీపీ మాత్రం ఈ సారి బీఎంసీ ఎన్నికల బాధ్యతలను పవార్ కుమార్తె పార్లమెంట్ సభ్యురాలు సుప్రియా సూలే, శరద్ పవార్ మనుమడు, శాసన సభ సభ్యుడు రోహిత్ పవార్ అనగా మేనత్త అల్లుళ్లకు అప్పగించనున్నట్టు తెలిసింది. ముఖ్యంగా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహావికాస్ ఆఘాడీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో కూడా శివసేనతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని ఎన్సీపీ భావిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ముంబైలో ఎన్సీపీ పార్టీని బలోపేతం చేసేందుకు సుప్రియా సూలే, రోహిత్ పవార్లు దృష్టి కేంద్రికృతం చేయనున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మలిక్ పేర్కొన్నారు. ఇలా పరోక్షంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వీరిద్దరిపై పార్టీ బాధ్యతలను మోపనుందన్న సంకేతాలు ఇచ్చినట్లయింది. మరోవైపు కాంగ్రెస్ నాయకుల్లో కొంత అసంతృప్తి ఉండటంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేస్తాయా..?లేదా కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగుతుందా అనేది వేచిచూడాల్సిందే. -
చెరో మూడు ఖాయం
సాక్షి,ముంబై: రాబోయే రాజ్యసభ ఎన్నికల కోసం మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏడుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2న ముగియనుంది. గడువు పూర్తవనున్న రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం ఈ నెలలో నోటిఫికేషన్ వెలువడనుంది. పదవీకాలం పూర్తవుతున్న వారిలో ఆర్పీఐ అధ్యక్షుడు రామ్‌దాస్ ఆఠవలేతోపాటు సంజయ్ కాకడేలున్నారు. అదేవిధంగా బీజేపీకి చెందిన అమర్ సాబలే, కాంగ్రెస్ నేత హుసేన్ దల్వాయి, శివసేన నేత రాజ్‌కుమార్ దూత్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ç పవార్, అడ్వొకేట్ మాజీద్ మేమన్లు ఉన్నారు. అయితే మహావికాస్ ఆఘాడికి చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ముగ్గురు ఎన్నిక కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఏడవ రాజ్యసభ సభ్యుడి ఎన్నిక కోసం గట్టిపోటీ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్థానం కూడా దక్కించుకునేందుకు మహావికాస్ ఆఘాడి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిన సంగతి తెలిసిందే. గతంలో బీజేపీతో కలిసి ఉన్న శివసేన అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి రాష్ట్రంలో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రస్తుతం శాసన సభ్యుల సంఖ్యను పరిశీలిస్తే బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44, ఎమ్మెన్నెస్ 1, సమాజ్‌వాదీ పార్టీ 1, బహుజన్ వికాస్ ఆఘాడి 3, ఇండిపెండెంట్లు కలసి మొంత్తం 288 మంది ఉన్నారు. రాష్ట్రంలో మహావికాస్ ఆఘాడి మిత్రపక్షాలతోపాటు ఇండిపెండెంట్లతో కలిసి 170 మందితో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు బీజేపీ వద్ద ఇండిపెండెంట్లు మిత్రపక్షాలతో కలిపి 115 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. ఈ నేపథ్యంలో గడువు ముగియనున్న ఏడుగురు రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం ఒక్కొక్కరికీ కనీసం 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం కానుంది. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలకు ఒక్కో రాజ్యసభ పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు బీజేపీకి మూడు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. అయితే ఏడవ రాజ్యసభ సభ్యుడి కోసం మాత్రం ఇండిపెండెంట్లు కీలకంగా మారనున్నారు. దీంతో ఇండిపెండెంట్లు ఎవరికి మద్దతివ్వనున్నారనేది వేచి చూడాల్సిందే. -
రాష్ట్రపతిగా సేన ఛాయిస్ ఆ నేతే..
సాక్షి, న్యూఢిల్లీ : 2022లో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలూ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని శివసేన నేత సంజయ్ రౌత్ కోరారు. రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేందుకు అవసరమైన సంఖ్యా బలం 2022 నాటికి తమకు సమకూరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి సర్కార్ ఏర్పాటులో పవార్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దేశంలోనే సీనియల్ నేత శరద్ పవార్ పేరును రాష్ట్రపతి పదవికి అన్ని రాజకీయ పార్టీలూ పరిశీలించాలని ఈ సందర్భంగా రౌత్ విజ్ఞప్తి చేశారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కార్‌లో పవార్ సారథ్యంలోని ఎన్సీపీ హోం, ఆర్థిక వంటి పలు కీలక శాఖలను దక్కించుకుంది. -
మహా సర్కారులో ఎన్సీపీకి జాక్‌పాట్
-
ఠాక్రే నామ సంవత్సరం!
సాక్షి, ముంబై: రాష్ట్ర రాజకీయాల్లో 2019వ సంవత్సరంలో ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో పెను మార్పులు సంభవించాయి. కాషాయ కూటమిగా పోటీచేసిన శివసేన, బీజేపీలు ఫలితాల అనంతరం విడిపోయాయి. అప్పటివరకూ ప్రత్యర్థులుగా ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు మహావికాస్ ఆఘాడిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఠాక్రే కుటుంబంలో మొట్టమొదటిసారిగా శివసేన వ్యవస్థాపకుడు, దివంగత బాల్ ఠాక్రే కుమారుడు, ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కావడం, బాల్ ఠాక్రే మనవడు, ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే అసెంబ్లీలో అడుగుపెట్టడంతోపాటు కేబినేట్ మంత్రి కావడంలాంటి ఊహించని సంఘటనలతో ఈ సంవత్సరం ఠాక్రే నామ సంవత్సరంగా గుర్తుండిపోయింది. కలసి.. విడిపోయి ఈ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల వరకు ఒక మాదిరిగా ఉంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ చిత్రం పూర్తిగా మారింది. ఊహించని ట్విస్ట్‌లతో ప్రజలతోపాటు రాజకీయ పార్టీల కార్యకర్తలను ఆయోమయంలో పడేశాయి. 2019లో లోకసభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే విడిపోయిన శివసేన, బీజేపీలు లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఒక్కటయ్యాయి. దీంతో లోకసభతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీలు, కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా పోటీ చేశాయి. ఫలితాలు శివసేన, బీజేపీల కూటమికి అనుకూలంగా వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105 శివసేనకు 56 ఇలా పూర్తి మెజార్టీ లభించింది. అయితే ఫిఫ్టీ–íఫ్టీ మార్పుల ఒప్పందం మేరకు రెండున్నరేళ్లపాటు శివసేనకు ముఖ్యమంత్రి ఇవ్వాలని శివసేన డిమాండు చేసింది. కాని అలాంటి ఒప్పందమేమి జరగలేదని బీజేపీ పేర్కొనడంతో వీరిమద్య విబేదాలు ఏర్పడ్డాయి. ఇలా ఈ అంశంపై దూరంపెరిగిన చివరికి ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చినప్పటికీ శివసేన, బీజేపీలు విడిపోయాయి. దీంతో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడంతో మహారాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి పాలనను కూడా విధించారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. అన్ని ఒప్పందాలు కుదిరాయి. కానీ, ఊహించని విధంగా ఒప్పందం కుదిరిన మరుసటి రోజున ఎన్సీపీ నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేసి బీజేపీకి మద్దతు పలికారు. ఊహించని విదంగా నవంబర్ 23వ తేదీ ఉదయం 8 గంటలకే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఊహించని ట్విస్ట్‌తో ఒక్కసారిగా అందరు షాక్‌కు గురయ్యారు. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఈ సంఘటన తీవ్ర చర్చల్లోకెక్కింది. నవంబర్ 28న పట్టం.. రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు పొందిన ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ అజిత్ పవార్‌ను రాజీనామా చేయించడంతోపాటు ఆయనతో వెళ్లిన వారందరిని తిరిగి పార్టీలోకి వచ్చేలా ఒత్తిడి తీసుకువచ్చారు. అంతే మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారుతూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహాకూటమి ఆఘాడి ప్రభుత్వం నవంబర్ 28న కొలువదీరింది. శివసేన అధినేత దివంగత బాల్ ఠాక్రే కుమారుడు శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇలా ఆరుగురు మంత్రులతో కొలువుదీరిన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం ఎట్టకేలకు నెలరోజుల తర్వాత మళ్లీ పూర్తిస్థాయి మంత్రులతో కొలువుదీరింది. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి కావడంతోపాటు ఆదిత్య ఠాక్రే కేబినేట్ మంత్రిగా మారారు. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా తండ్రి ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా కుమారుడు ఆదిత్య ఠాక్రే కేబినేట్ మంత్రిగా మారారు. మరోవైపు బీజేపీ ఈ ఊహించని షాక్‌లతో ఖంగుతింది. -
మోదీ ఆఫర్ ఇచ్చారు.. నేనే వద్దన్నా!
ముంబై: ప్రధాని మోదీ కలిసి పనిచేద్దామంటూ ఇచ్చిన ఆహ్వానాన్ని తానే తిరస్కరించానని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. రాష్ట్రపతి పదవిని తనకు ప్రధాని ఇవ్వజూపారన్న వార్తలను పవార్ కొట్టిపారేశారు. ఓ మరాఠా టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన. గత నెలలో ప్రధాని మోదీతో భేటీ, అనంతర రాజకీయ పరిణామాలకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. ‘కలిసి పనిచేద్దామంటూ మోదీ నన్ను అడిగారు. మన మధ్య వ్యక్తిగత సంబంధాలు చాలా బాగున్నాయి. వాటిని అలాగే కొనసాగనివ్వండి. కానీ, కలిసి పనిచేయడం మాత్రం కుదరదు అని ప్రధానికి తెలిపా’నన్నారు. ఆ భేటీలో తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వజూపారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ..‘అలాంటిదేమీ లేదు. కానీ, నా కుమార్తె సుప్రియా సూలేకు కేబినెట్లో చోటు కల్పిస్తామని చెప్పారు’అని పవార్ వివరించారు. దేవేంద్ర ఫడ్నవీస్‌తో అనూహ్యంగా చేతులు కలిపినందుకే అజిత్ పవార్‌కు ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్లో స్థానం కల్పించలేదన్నారు. ‘అజిత్ ప్లేటు ఫిరాయించిన విషయం తెలియగానే మొట్టమొదటగా ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేశా. అజిత్ అలా చేసి ఉండకూడదు.. నాపై నమ్మకముంచండి.. ఆ తిరుగుబాటును అణిచివేస్తానని ఠాక్రేకు తెలిపా’అని చెప్పారు. ‘అజిత్‌కు ఎన్సీపీ మద్దతు లేదని తెలియగానే అతడి వెంట ఉన్న ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరిగిపోయింది. అందుకే వెంటనే వచ్చేశారు’అని వివరించారు. ‘ఫడ్నవీస్ పక్షంను వీడి రావాలంటూ నా కుటుంబ సభ్యులు ఎవరైనా అజిత్‌ను కోరిన విషయం నాకు తెలియదు. కానీ, అజిత్ చేసింది తప్పని అంతా భావించారు’ అని తెలిపారు. ‘నువ్వు క్షమించరాని పని చేశావు. దీనికి ఫలితం ఎవరైనా సరే అనుభవించాల్సిందే. నువ్వు అందుకు మినహాయింపు కాదు’అని అజిత్‌కు చెప్పానన్నారు. -
‘పవార్ సాబ్‌తోనే ఉంటా’
ముంబై : అజిత్ పవార్‌తో కలిసి దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తూ తాను ఎన్సీపీని మోసం చేయలేదని ఆ పార్టీ నేత ధనంజయ్ ముండే అన్నారు. ‘ నేను పార్టీ వెంట, పవార్ సాబ్ వెంటే ఉన్నా..దయచేసి వదంతులు ప్రచారం చేయకండ’ని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీకి మద్దతిస్తూ అజిత్ పవార్ చేసిన ప్రకటన కేవలం పార్టీలో గందరగోళం సృష్టించి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపేందుకేనని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించినయ కొద్ది గంటలకే ధనంజయ్ ముండే ఈ ట్వీట్ చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు చొరవ చూపడంలో అజిత్ పవార్‌తో కీలక సమన్వయం నెరిపారని భావిస్తున్న ముండే పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితిని సమీక్షించేందుకు శరద్ పవార్ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు అసెంబ్లీ తనకు తగిన సంఖ్యాబలం ఉందని దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్‌కు రాసిన లేఖతో పాటు ఫడ్నవీస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ రాసిన లేఖలను తమకు సమర్పించాలని గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ సుప్రీం కోర్టు కోరింది. -
‘శరద్‌కు కేంద్ర పదవులు’
పట్నా: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఎన్డీయేలో చేరితే కేంద్రప్రభుత్వంలో కీలక పదవి లభించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ–ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను కూడా శరద్ కలుపుకుపోవాలని అన్నారు. శివసేన–బీజేపీ సంక్షోభం గురించి మాట్లాడుతూ.. రెండు పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే, సమస్యలున్నా సర్దుకుపోయి ఉండేవన్నారు. కానీ పరిస్థితి చేజారిందన్నారు. ‘అభినవ చాణక్య’ అమిత్‌షా వేగాన్ని ఆయా పార్టీలు అందుకోలేకపోయాయన్నారు. ఎన్సీపీని తమతో చేర్చుకున్న బీజేపీ.. కాంగ్రెస్, శివసేనలకు షాకిచ్చిందని చెప్పారు. మరోవైపు బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ బీజేపీ–ఎన్సీపీ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజును విజయ్ దివాస్‌గా జరుపుకుంటామన్నారు. -
‘మహా’ ఉత్కంఠకు ఎట్టకేలకు తెర
సాక్షి, ముంబై : ‘మహా’ రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే చేపట్టనున్నారు. అలాగే కాంగ్రెస్, ఎన్సీపీలకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై శనివారం మూడు రాజకీయ పార్టీలు అధికారికంగా ప్రకటన చేయనున్నాయి. దీంతో మహారాష్ట్రలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడనుంది. దాదాపు గంటన్నర పాటు కొనసాగిన సమావేశం అనంతరం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ... ‘మహారాష్ట్రకు కాబోయే సీఎం ఉద్దవ్ ఠాక్రే. మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. పార్టీల ఎమ్మెల్యేలు లేఖపై సంతకం చేశారు. మా ఎజెండాపై మరింత చర్చలు జరుపుతాం.’ అని తెలిపారు. కాగా ముఖ్యమంత్రి పదవిలో ఐదేళ్ల పాటు శివసేనకు, కాంగ్రెస్, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు లభిస్తాయని, కీలక మంత్రి పదవులు మాత్రం మూడు పార్టీలకు సమానంగా లభిస్తాయని, స్పీకర్ పదవి కాంగ్రెస్‌కేనని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పార్టీకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మూడు పార్టీలకు మంత్రి పదవులు లభించనున్నట్లు సమాచారం. -
నేడు శివసేనతో భేటీ
న్యూఢిల్లీ/ సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కొత్త కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. త్వరలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడనుంది. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీ సిద్ధమయ్యాయి. శివసేనతో పొత్తుకు సంబంధించి కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు గురువారం విజయవంతంగా ముగిశాయి. ఈ చర్చల్లో అన్ని అంశాల్లో ‘పూర్తి ఏకాభిప్రాయం’ సాధించినట్లు చర్చల అనంతరం రెండు పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, పొత్తుకు తుదిరూపమిచ్చేందుకు శుక్రవారం శివసేనతో భేటీకానున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలసి పోటీ చేసిన సమాజ్‌వాదీ, సీపీఎం, స్వాభిమాని ప„Š , పీజంట్స్ వర్కర్స్ పార్టీలతో శుక్రవారం చర్చించి, ఆ తరువాత శివసేనతో కూటమి కూర్పుపై, కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్– సీఎంపీ)పై యోచిస్తామని కాంగ్రెస్, ఎన్సీపీ ప్రకటించాయి. తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై ముంబైలో అధికారికంగా తుది ప్రకటన ఉంటుందన్నాయి. ఆ తర్వాత మూడు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీకి లేఖ ఇస్తాయి. నవంబర్ 26న ప్రమాణ స్వీకారం ఉండొచ్చని శివసేన వర్గాలు తెలిపాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–శివసేన, కాంగ్రెస్–ఎన్సీపీ కూటములు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన విషయం తెలిసిందే. ఉద్ధవ్నా? ఆదిత్యనా? శివసేన తరఫున ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోనున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. సేన యువనేత, పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రేకు ఆ స్థానం అప్పగించే ఆలోచన ఉందని శివసేన వర్గాలు తెలిపాయి. కానీ, ఉద్ధవ్ ఠాక్రే సీఎం కావాలని ఎన్సీపీ, కాంగ్రెస్ పట్టుబడుతున్నాయని, తొలిసారి ఎమ్మెల్యే అయిన, రాజకీయ అనుభవం పెద్దగా లేని ఆదిత్యకు పెద్ద బాధ్యత అప్పగించడం సరికాదని భావిస్తున్నాయని పేర్కొన్నాయి. మరోవైపు, సీఎంగా ఉద్ధవ్, ఆదిత్య కాకుండా.. శివసేన సీనియర్‌నేతలు సంజయ్ రౌత్, ఏక్నాథ్ షిండే, సుభాష్ దేశాయిల పేర్లూ శివసేన వర్గాల్లో వినిపిస్తున్నాయి. కానీ, ఠాక్రేలు కాకుండా, వేరే ఎవరు సీఎం అయినా, పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. సీడబ్ల్యూసీ ఆమోదం ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ నివాసంలో గురువారం కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు కొనసాగాయి. ‘అన్ని అంశాలపై కూలంకషంగా చర్చలు జరిపాం. రెండు పార్టీల మధ్య పూర్తిస్థాయిలో ఏకాభిప్రాయం కుదిరింది’ అని చర్చల అనంతరం కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ ప్రకటించారు. సీఎంపీ ప్రకటన సందర్భంగా కొత్త ప్రభుత్వ వివరాలను వెల్లడిస్తామన్నారు. సీఎం పదవిని పంచుకోవడంపై వస్తున్న వార్తలను మీడియా ప్రస్తావించగా.. ‘అవన్నీ ఊహాగానాలే’ అని కొట్టివేశారు. ఎన్సీపీతో చర్చల వివరాలను కాంగ్రెస్ పార్టీలోని అత్యున్నత వేదిక సీడబ్ల్యూసీకి నేతలు వెల్లడించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరిగిన భేటీలో శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపిందని ఆ తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సోనియా, ఉద్ధవ్ భేటీ ఉండదు సోనియాగాంధీతో ఉద్ధవ్ ఠాక్రే సమావేశమయ్యే అవకాశాలు లేవని సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ‘ఒకటి, రెండు రోజుల్లో మూడు (శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయి. ప్రభుత్వ ఏర్పాటుపై పూర్తి స్పష్టత వస్తుంది’ అని గురువారం మీడియాతో చెప్పారు. పవార్, ఠాక్రే భేటీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో గురువారం రాత్రి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే సమావేశమయ్యారు. దక్షిణ ముంబైలోని శరద్ పవార్ నివాసంలో ఈ భేటీ జరిగింది. అయితే, వారు ఏం చర్చించారనే విషయం వెల్లడి కాలేదు. ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు ‘డిప్యూటీ’ ప్రభుత్వ కూర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై ముంబైలో మరికొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఐదేళ్ల పాటు శివసేన నేతనే ఉంటారని, కాంగ్రెస్, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు లభిస్తాయని, కీలక మంత్రి పదవులు మాత్రం మూడు పార్టీలకు సమానంగా లభిస్తాయని, స్పీకర్ పదవి కాంగ్రెస్‌కేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్ తరఫున బాలాసాహెబ్ తోరట్ ఉంటారని తెలుస్తోంది. పార్టీకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మూడు పార్టీలకు మంత్రిపదవులు లభించనున్నాయనే వార్తలొచ్చాయి. -
వారాంతంలో కొలువుతీరనున్న మహా సర్కార్..
ముంబై : మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కూడిన సంకీర్ణ సర్కార్ ఈ వారాంతంలో కొలువు తీరే అవకాశం ఉంది. మూడు పార్టీల ప్రతినిధులు ఢిల్లీలో విస్తృత మంతనాలు కొనసాగిస్తున్న క్రమంలో కూటమి సర్కార్‌పై ఓ స్పష్టత వచ్చినట్టు సమాచారం. మరోవైపు మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల నుంచి తదుపరి సర్కార్‌కు మద్దతు ప్రకటిస్తూ రూపొందే లేఖలను శనివారం గవర్నర్‌కు సమర్పిస్తామని శివసేన నేత సంజయ్ రౌత్ వెల్లడించారు. ఇక సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలని ఎన్సీపీకి శివసేన సూచించింది. కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం ఐదేళ్ల పాటు కొనసాగేలా సంప్రదింపులు సాగుతున్నాయి. మరోవైపు కూటమికి తుదిరూపు ఇచ్చేందుకు సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సంయుక్త సమావేశం ముంబైలో జరుగుతుందని ఆయా పార్టీల నేతలు వెల్లడించారు. అధికార పంపకంపై ప్రధానంగా చర్చలు జరిపే ఈ కీలక భేటీకి సేన, ఎన్సీపీల చీఫ్‌లు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లు హాజరవుతారు. అంతా సజావుగా సాగితే నూతన ప్రభుత్వం ఆదివారం లేదా సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తుందని శివసేన వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు మద్దతు ఇవ్వాలని మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించిన విషయం తెలిసిందే. మతతత్వ పోకడలపై పోరాడే క్రమంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు శివసేనకు మద్దతు ఇవ్వక తప్పడం లేదని సోనియా ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు వివరించినట్టు సమాచారం. -
‘మహా’ ఉత్కంఠకు తెర!
న్యూఢిల్లీ/సాక్షి, ముంబై: మహా ఉత్కంఠకు తాత్కాలికంగా తెర పడింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బుధవారం కొంత స్పష్టత వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించారు. సైద్ధాంతికంగా తీవ్ర విబేధాలున్న శివసేనకు కాంగ్రెస్ మద్దతివ్వడంపై నెలకొన్న అనుమానాలు తొలగాయి. ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్, ఎన్సీపీ సీనియర్ నేతలు ఢిల్లీలోని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో 4గంటలకుపైగా చర్చలు జరిపారు. త్వరలో మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ తర్వాత ప్రకటించారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ చెప్పారు. బీజేపీతో సేన తెగతెంపులయ్యాక ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందన్న వార్తలు రావడం మొదలయ్యాక ఈ విషయమై స్పష్టమైన ప్రకటన రావడం ఇదే ప్రథమం. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు కొనసాగుతాయని, కూటమికి సంబంధించి మరి కొన్ని అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందని పృథ్వీరాజ్ చౌహాన్ చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం ప్రకటన చేసే అవకాశముందని సమాచారం. శివసేన ఫస్ట్.. ఎన్సీపీ నెక్ట్స్ ముఖ్యమంత్రి పీఠాన్ని మొదట శివసేన, ఆ తరువాత ఎన్సీపీ చెరో రెండున్నరేళ్లు పంచుకునేందుకు, కాంగ్రెస్‌కు ఐదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరిందని ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. ‘పూర్తిగా ఐదేళ్లు శివసేనకే ముఖ్యమంత్రి పీఠం అప్పగించలేం. చివరి రెండున్నరేళ్లు ఎన్సీపీ నేత సీఎంగా ఉంటారు’ అని తెలిపాయి. శివసేన, ఎన్సీపీల మధ్య సీట్ల తేడా కూడా రెండు మాత్రమేనని ఎన్సీపీ నేత ఒకరు గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్, ఎన్సీపీ చర్చల్లో సీఎం పదవిపై చర్చ జరగలేదని కాంగ్రెస్ నేతలు చెప్పారు. జార్ఖండ్‌లో తొలి దశ ఎన్నికలు జరిగే నవంబర్ 30లోపే ప్రభుత్వ ఏర్పాటవుతుందని ఎన్సీపీ నేత ఒకరు తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య జరిగిన చర్చల్లో కాంగ్రెస్ తరఫున మల్లిఖార్జున్ ఖర్గే, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, బాలా సాహెబ్ తోరట్ తదితరులు.. ఎన్సీపీ నుంచి నవాబ్ మాలిక్, సుప్రియా సూలె, జయంత్‌పాటిల్, అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా సీఎంపీ(కామన్ మినిమమ్ ప్రోగ్రాం)పై చర్చ జరిగిందని, శివసేనతో సైద్ధాంతిక విబేధాల గురించి ప్రస్తావన రాలేదని ఎన్సీపీ రాజ్యసభ సభ్యుడు మజీద్ మెమన్ వెల్లడించారు. త్వరలోనే కొత్త ప్రభుత్వం: ప్రభుత్వ ఏర్పాటుపై అడ్డంకులు దాదాపు తొలగినట్లేనని, అతి త్వరలోనే శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రైతాంగ సంక్షోభాన్ని ప్రధానికి వివరించేం దుకు సీనియర్ నేత, మాజీ వ్యవసాయ మంత్రి అయిన శరద్ పవారే సరైన వ్యక్తి అని భావించి.. తామే ఆయనను ప్రధానిని కలిపే ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించమని కోరామన్నారు. తాను కూడా పవార్‌తో భేటీ అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీ పరిణామాలపై ఎప్పటికప్పుడు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు, యువనేత ఆదిత్య ఠాక్రేకు సమాచారమిస్తున్నామన్నారు. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ.. ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడంపై విభేదాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాకపోవడం, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం తెలిసిందే. -
ప్రధానితో ముగిసిన పవార్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బుధవారం సమావేశమయ్యారు. మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తాము మహారాష్ట్ర రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించలేదని, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తాను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానని పవార్ తెలిపారు. రైతు సమస్యలపైనే ప్రధానితో చర్చించానని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర రైతుల ఇబ్బందులపై ఈ సందర్భంగా శరద్ పవార్ ప్రధాని మోదీకి వినతి పత్రం సమర్పించారు. రైతులకు తక్షణం కేంద్ర సాయం ప్రకటించానలి, షరతులు లేకుండా వ్యవసాయ రుణాల మాఫీని చేపట్టాలని కోరారు. మరోవైపు మహారాష్ట్ర రైతులను ఆదుకునేందుకు కేంద్రం త్వరలోనే రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ భేటీలో హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. -
'శరద్ పవార్‌పై మాకు ఎలాంటి అనుమానం లేదు'
ముంబై : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 27 రోజులు గడుస్తున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నవంబర్ 12 తర్వాత ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేయకపోవడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం శివసేనతో కలిసి ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అందరూ భావిస్తుండగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలే జరగలేదని చెప్పి షాక్ ఇచ్చారు. 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న సభలో శివసేనకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడ నుండి వస్తుందో ఆ పార్టీ నేతలే చెప్పాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాతో సమావేశం తరువాత పవార్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ విషయంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. శరద్ పవార్ తీరుపై తమకు ఎలాంటి అనుమానం లేదన్నారు. మహారాష్ట్రలో డిసెంబరు మొదటి వారంలో శివసేన అధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో.. తాము త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రైతుల సమస్యలను గురించి వివరిస్తామని సంజయ్ రౌత్ తెలిపారు. కాగా.. తాము ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతోన్న తరుణంలో తమ పార్టీని ఎన్డీఏ నుంచి తొలగించడంపై బీజేపీపై శివసేన అధికార పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయనకు దేశం మొత్తం నివాళులు అర్పిస్తున్న సమయంలో బీజేపీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతోనే ఆ పార్టీ తీరు ఎలాంటిదో స్పష్టమైందని తెలిపారు. 288 అసెంబ్లీ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించలేదు
న్యూఢిల్లీ/ముంబై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 26 రోజులు గడుస్తున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న శివసేన ఆశలు నెరవేరడం లేదు. తాజాగా, ఢిల్లీలో ప్రెస్మీట్లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఈ మూడు పార్టీల మధ్య పొత్తు దిశగా అడుగులు పడటం లేదనే సంకేతాలిస్తున్నాయి. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగింది. ఢిల్లీలో సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సమావేశమయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుపై ఆమెతో చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితిని సోనియాకు వివరించానన్నారు. ‘మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వివరంగా చర్చించాం. మహారాష్ట్రలో పరిస్థితులను నిశితంగా గమనిస్తుంటాం. భవిష్యత్ కార్యాచరణపై ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు చర్చలు కొనసాగిస్తారు’ అని పవార్ వివరించారు. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మద్దతిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం దాటవేసిన పవార్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తమ ప్రధాన ప్రత్యర్థి అన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘బీజేపీ, శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదో ఆ పార్టీలనే అడగండి’ అన్నారు. పవార్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేవని, ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నామనేదే పవార్ వ్యాఖ్యల అర్థం అని పలువురు విశ్లేషిస్తున్నారు. మరోవైపు, రాజకీయాల్లో ఆరితేరిన పవార్.. పొత్తు చర్చల్లో శివసేనపై ఒత్తిడి తెచ్చి, కొత్త ప్రభుత్వంలో పై చేయి సాధించేందుకే ఇలా వ్యాఖ్యానించారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పవార్ తాజా వ్యాఖ్యలపై శివసేన స్పందించలేదు. కానీ, పవార్ నివాసంలో ఆయనతో శివసేన నేత సంజయ్‌రౌత్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘త్వరలో శివసేన నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది’ అని అన్నారు. మహారాష్ట్ర రైతుల సమస్యలపై ప్రధాని మోదీని కలిసే అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహించాలని కోరేందుకు పవార్‌ను కలిశానన్నారు. ఇదిలా ఉండగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభలో వ్యవహరించే తీరుపై ఎన్సీపీపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. పార్లమెంట్లో శివసేన సభ్యులకు విపక్ష సభ్యుల వైపు స్థానాలు కేటాయించడంపై సేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ‘ఎన్డీఏ ప్రభుత్వం ఏ ఒక్క పార్టీ సొత్తో కాదు. కానీ, కొందరు తమను తాము దేవుళ్లుగా భావిస్తుంటారు’ అని వ్యాఖ్యానించారు. నవంబర్ 24న అయోధ్య వెళ్లాలనుకున్న శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే.. తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. -
వద్దన్న బీజేపీ... మళ్లీ ముందుకు!
తీర్పు స్పష్టంగానే వచ్చింది. కానీ పార్టీలే మాట తప్పాయి. ఇక్కడ ఏ పార్టీ మాట తప్పిందంటే... చెప్పటం కష్టం. మహారాష్ట్రలో బీజేపీ– శివసేన కూటమికి జనం అధికారమిచ్చినా... రెండున్నరేళ్ల చొప్పున ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకుంటామని ముందు చెప్పి, తరవాత మాట తప్పుతున్నందుకే తాము బీజేపీతో కలవటం లేదని శివసేన చెబుతోంది. తాము అలాంటి హామీనే ఇవ్వలేదని, శివసేనే మాట మారుస్తోందని బీజేపీ చెబుతోంది. అందుకే... ఇద్దరి పొత్తూ పెటాకులైంది. బీజేపీకి సింగిల్‌గా బలం చాలదు కనక... గవర్నరు పిలిచినా... చేతులెత్తేసింది. శివసేనను పిలిచినా అదే కథ. కాకపోతే ఈ పార్టీ కొంచెం సమయం కావాలంది. దానికి నిరాకరిస్తూ మరో పార్టీ ఎన్సీపీని కూడా పిలిచారు గవర్నరు. అంతలోనే ఈ గొడవ తేలదంటూ ఈ వారం మొదట్లో గవర్నరు రాష్ట్రపతి పాలనకూ సిఫారసు చేశారు. కేంద్రం ఓకే చేసేసింది. ఇది అన్యాయమంటూ శివసేన సుప్రీంకోర్టుకు వెళ్లింది కూడా. 288 సీట్ల మహారాష్ట్రలో బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 స్థానాలున్నాయి. బీజేపీగానీ, శివసేనగానీ లేకుండా ఏ ప్రభుత్వమూ ఏర్పాటయ్యే పరిస్థితి లేదు. అందుకే సేన కూడా మొండిపట్టు పడుతోంది. ప్రాంతీయ శక్తుల ఎదుగుదలకు అవకాశమున్న మహారాష్ట్రలో ముందుముందు బలోపేతం కావాలంటే అధికార పీఠం తన చేతిలో ఉండాలన్నది సేన మనోగతం. అందుకే మునుపటిలా బీజేపీకే ఐదేళ్లూ అవకాశం ఇవ్వకుండా తనకూ రెండున్నరేళ్లు సీఎం పీఠం కావాలంది. ఇదే ప్రతిపాదనతో ఎన్సీపీ– కాంగ్రెస్‌లతోనూ సంప్రదింపులు జరుపుతోంది. ఎన్సీపీ ఓకే అంటున్నా... కాంగ్రెస్ మాత్రం సైద్ధాంతిక వైరుధ్యాల దృష్ట్యా అంత సుముఖత వ్యక్తం చేయలేదు. కాకపోతే దేశ ఆర్థిక రాజధాని ముంబైని బీజేపీకి దూరం చేయాలంటే సేనకు మద్దతివ్వక తప్పదు. అందుకే ముగ్గురూ కలిసి ఓ అవగాహనకు రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి కాంగ్రెస్ కూడా సై అనే ప్రకటించింది. కాంగ్రెస్ ఎలాగూ శివసేనతో కలవదని, సేన తమ చెంతకే వస్తుందని ధీమాగా ఉన్న బీజేపీకి ఇది షాకే. అందుకే వేగంగా పావులు కదిపింది. తమకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, కాబట్టి ప్రభుత్వానికి అవకాశమివ్వాలని గవర్నరును శనివారం కోరింది. కనీసం 144 మంది మద్దతిస్తేనే ప్రభుత్వం సాధ్యం. మరి 118 మందితో ఏం చేస్తారు? తమ పార్టీల ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది బీజేపీ వ్యూహమని సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. ఏమో!! ఏం జరుగుతుందో... గవర్నరు ఏం చేస్తారో చూడాల్సిందే!!. కనీసం 144 మంది మద్దతిస్తేనే ప్రభుత్వం సాధ్యం. మరి 118 మందితో ఏం చేస్తారు? తమ పార్టీల ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది బీజేపీ వ్యూహమ’ని సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. -
రాష్ట్రపతి పాలన మాటున బేరసారాలు
ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో గద్దెనెక్కాలని ప్రయత్నాలు చేస్తున్న శివసేన చిరకాల మిత్రుడైన కమలదళంపై కస్సుమంటోంది. రాష్ట్రపతి పాలన ముసుగులో బీజేపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగిస్తోందని శివసేన పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌లు తమ పార్టీకి 119 (స్వతంత్ర అభ్యర్థులు 14 మందితో కలిపి) ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమ పార్టీ సహకారం లేకుండా మరెవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టింది. మేజిక్ ఫిగర్ అయిన 145 మంది ఎమ్మెల్యేలు మద్దతు లేకపోవడం వల్లే బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆహ్వానాన్ని ఆ పార్టీ తిరస్కరించిందని గుర్తు చేసింది. క్రికెట్లోనూ, రాజకీయాల్లోనూ ఆఖరి క్షణంలో ఏదైనా జరగొచ్చునన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపైనా సామ్నా ఎడిటోరియల్ విరుచుకుపడింది. ఇవాళ, రేపు క్రికెట్ అంటే ఆట తక్కువ, వ్యాపారం ఎక్కువ అన్నట్టుగా తయారయ్యాయని వ్యాఖ్యానించింది. అంతేకాదు క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ సర్వసాధారణమైపోయిందని, అప్పుడే విజయం వరిస్తోందని పేర్కొంది. బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై వలవేసి రాజకీయ క్రీడలో గెలవాలని చూస్తోందని సామ్నా తన సంపాదకీయంలో ఆరోపించింది. మరోవైపు ఎన్సీపీ కూడా బీజేపీపై ఇదే అనుమానాన్ని వ్యక్తం చేసింది. తమ పార్టీ త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఇతర పార్టీల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి, ఎమ్మెల్యేలను తమ గూటికి లాగాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్‌తో భేటీ వాయిదా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు ఇంకా ముందుకు కదలలేదు. వాస్తవానికి శనివారమే శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి చర్చించి, ఆ తర్వాత గవర్నర్‌తో భేటీ కావాలని భావించారు. కానీ ఈ సమావేశాలన్నీ వాయిదా పడ్డాయి. ఆదివారం శరద్ పవార్, సోనియాతో కలిసే అవకాశాలున్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అనుసరించాల్సిన విధివిధానాలపై పవార్ సోనియాతో చర్చించాక మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠపై ఒక స్పష్టత రానుంది. ఎన్డీయే భేటీకి సేన దూరం ఈ నెల 18న ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం ఎన్డీయే సమావేశం కానుంది. ఈ సమావేశానికి తాము హాజరు కాబోమని శివసేన స్పష్టం చేసింది. ఎన్డీయేకి రాం రాం చెప్పడం ఇక లాంఛనప్రాయమేనని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ విలేకరులకు చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ఉన్న శివసేనకు చెందిన ఒకే ఒక మంత్రి అరవింద్ సావంత్ ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఎప్పుడైతే 50:50 ఫార్ములాకు బీజేపీ అంగీకరించలేదో అప్పట్నుంచే తాము ఎన్డీయేకి దూరమయ్యామని రౌత్ స్పష్టం చేశారు. పార్లమెంటులో విపక్ష స్థానాల్లో సేన ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో శివసేన పార్టీ ఎంపీలు కూర్చొనే స్థానాలు ఇకపై మారిపోనున్నాయి. శివసేన ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిపక్షం వైపు అయిదో వరసలో ఇక కూర్చోనున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
శివసేన నేతృత్వంలో సంకీర్ణం
నాగ్‌పూర్/ముంబై: మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. అభివృద్ధే లక్ష్యంగా ఏర్పడబోయే తమ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తికాలం కొనసాగుతుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. విభిన్న సైద్ధాంతిక భావాలున్న తమ మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం శివసేన నేతృత్వంలో ఏర్పాటుకానుందని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ప్రాథామ్యాలపై కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)పై మూడు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. ముఖ్యమంత్రి పదవిలో శివసేన నేత ఉంటారని ఎన్సీపీ నేత మాలిక్ తెలిపారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శుక్రవారం నాగ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘త్వరలో అధికారంలోకి రానున్న సేన–ఎన్సీపీ–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగుతుంది. అభివృద్ధే లక్ష్యంగా మా సర్కారు సుస్థిర పాలన అందిస్తుంది. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు అవకాశమే లేదు’అని పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామంటూ మాజీ సీఎం ఫడ్నవీస్ చెప్పడంపై స్పందిస్తూ.. ‘ఫడ్నవీస్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ, ఆయన జ్యోతిష్యం కూడా నేర్చుకున్న సంగతి తెలియదు. మళ్లీ అధికారంలోకి వస్తామంటూ ఆయన పదేపదే అంటున్నారు. అది తప్ప మరేదైనా కొత్త విషయం చెప్పమనండి. మా సంకీర్ణం లౌకిక భావాల ప్రాతిపదికన పనిచేస్తుంది. ఏ మతానికీ వ్యతిరేకం కాదు’అని స్పష్టం చేశారు. 25 ఏళ్లు అధికారంలో ఉంటాం: సంజయ్ రౌత్ శివసేన నేతృత్వంలో త్వరలో ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తెలిపారు. ‘మా పార్టీ రానున్న ఐదేళ్లే కాదు..మరో 25 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగనుంది. రాష్ట్ర ప్రయోజనాల మేరకు సీఎంపీ రూపొందించాం. ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునే విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీలతో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో పార్టీల సిద్ధాంతాల ప్రస్తావన లేదు. గతంలో కూడా సీఎంపీ ప్రాతిపదికన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి’అని పేర్కొన్నారు. వీర్ సావర్కర్‌కు భారతరత్న, ముస్లిం రిజర్వేషన్ వంటి డిమాండ్లను శివసేన వదులుకుంటుందా అన్న ప్రశ్నకు రౌత్ స్పందించలేదు. కాగా, శరద్ పవార్ 17వ తేదీన ఢిల్లీలో సోనియా గాంధీతో సమావేశమై సీఎంపీ, ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇలా ఉండగా, తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్పాటిల్ తెలిపారు. -
ఉమ్మడి ముసాయిదా ఖరారు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన.. రాష్ట్రపతి పాలన తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ప్రభుత్వం ఏర్పాటు దిశగా పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. కనీస ఉమ్మడి కార్యక్రమంపై దాదాపు ఒక అంగీకారం కుదిరిందని, ఆదివారం నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. గురువారం తొలిసారిగా కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నేతలు సమావేశమై కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)తోపాటు అధికారంలో సమాన వాటా అంశంపై చర్చలు జరిపారు. ముసాయిదాను శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ చీఫ్‌లు ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్, సోనియా గాంధీలకు తుది నిర్ణయం కోసం అందించనున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల మహాశివ్ కూటమి ప్రభుత్వం ఈ 17వ తేదీన ఏర్పడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎంపీలో ఏముంటుంది?: కనీస ఉమ్మడి కార్యక్రమం(సీఎంపీ)లో ఏ ఏ అంశాలున్నాయనే దానిపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రభుత్వ పాలనలో ప్రాధాన్యత అంశాలతోపాటు పదవుల పంపకంపై మూడు పార్టీల నేతల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదిరింది. ఒక అంచనా ప్రకారం..శివసేన, ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లపాటు ముఖ్యమంత్రి పదవులతోపాటు చెరో 14 మంత్రి పదవులు.. అయిదేళ్లపాటు కాంగ్రెస్‌కు ఉపముఖ్యమంత్రి పదవి, 11 మంత్రి పదవులు లభించనున్నట్టు తెలుస్తోంది. మరో అంచనా ప్రకారం.. శివసేన, కాంగ్రెస్‌లకు చెరో రెండేళ్లు, కాంగ్రెస్‌కు ఏడాది పాటు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయంపై అంగీకారం కుదిరిందని తెలిసింది. దీంతోపాటు మంత్రి పదవులు ఎన్సీపీ, శివసేనలకు సమానంగా ఉండగా కాంగ్రెస్‌కు మూడు మంత్రి పదవులు తక్కువ కానున్నాయని సమాచారం. -
మహారాష్ట్రలో 50:50 ఫార్ములానే!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు 50:50 ఫార్ములాను రూపొందించినట్లు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీలకు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవితోపాటు చెరో 14 మంత్రి పదవులు ఇవ్వాలని, కాంగ్రెస్‌కు అయిదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు 11 మంత్రి పదవులు ఇవ్వాలనే విధంగా ఒప్పందం కుదరనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై తొలుత ఎన్సీపీ, కాంగ్రెస్‌లు చర్చలు జరిపి, ఆ తరువాత శివసేనతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని పేర్కొన్నాయి. సరైన దిశలో చర్చలు సాగుతున్నాయి: ఉద్ధవ్ ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో బుధవారం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు థోరాత్, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్, మాణిక్ రావు సమావేశమయ్యారు. చర్చలు సరైన దిశలో కొనసాగుతున్నాయని మీడియాతో ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ‘గడువు తిరస్కరణ’ను ప్రస్తావించని శివసేన న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా పార్టీల నుంచి మద్దతులేఖను సాధించేందుకు తాము అడిగిన మూడ్రోజుల గడువును గవర్నర్ కోష్యారీ తిరస్కరించారనే విషయాన్ని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో శివసేన ప్రస్తావించలేదు. మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన ఇప్పటికే అమల్లోకి వచ్చినందున, మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా.. ‘మూడ్రోజుల సమయం ఇచ్చేందుకు గవర్నర్ ఒప్పుకోని’ అంశాన్ని పిటిషన్లో ప్రస్తావించలేదని శివసేన లాయర్లు బుధవారం మీడియాకు చెప్పారు. గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ, వెంటనే దీనిపై అత్యవసర విచారణకు ఆదేశించాలని శివసేన మంగళవారం సుప్రీంకోర్టు తలుపుతట్టడం, దీనిపై రిట్ పిటిషన్ దాఖలుచేయాలని శివసేనను కోర్టు ఆదేశించడం తెల్సిందే. అయితే, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ చేసిన సిఫార్సును తప్పుబడుతూ తాము మరో పిటిషన్‌ను సిద్ధంచేశామని శివసేన లాయర్లు వెల్లడించారు. అయితే, ఇప్పటికే రాష్ట్రపతిపాలన అమల్లోకి వచ్చినందున, నెమ్మదిగా పిటిషన్ వేస్తామని, ఈ పిటిషన్ దాఖలుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని లాయర్లు చెప్పారు. -
బీజేపీ వెనక్కి.. శివసేన ముందుకు
-
బీజేపీ వెనక్కి.. శివసేన ముందుకు
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రెండు వారాలకు పైగా నెలకొన్న రాజకీయ అనిశ్చితిలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఆదివారం సాయంత్రం వేగంగా పరిణామాలు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు విముఖత చూపింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ బీజేపీని శనివారం గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ వెనకడుగు వేయడంతో కొత్త రాజకీయ సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. సీఎం పదవి విషయంలో శివసేనతో అంతరం పెరిగిపోవడం, ప్రభుత్వం ఏర్పాటుకు చాలినంత బలం కూడగట్టలేక బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకే మొగ్గు చూపింది. దీంతో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానం పంపారు. ఈ విషయంలో అభిప్రాయం తెలపాలంటూ సోమవారం సాయంత్రం 7.30 గంటల వరకు గవర్నర్ ఆ పార్టీ శాసనసభా నేత ఏక్నాథ్ షిండేకు గడువిచ్చారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్లో మకాం వేసిన శివసేన ఎమ్మెల్యేలంతా గవర్నర్ ఆహ్వానం అనంతరం పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీకి తరలివెళ్లారు. అంతకుముందు సేన చీఫ్ ఠాక్రే నగరంలోని ఓ హోటల్లో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలతో తమ పార్టీ నేత సీఎం పీఠం ఎక్కనున్నారంటూ ప్రకటించారు. ప్రతిపక్షం మద్దతుతో సర్కారు ఏర్పాటుకు గల అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ కూడా తెలిపారు. ఏదేమైనా తమ పార్టీ నేతే సీఎం అవుతారన్నారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామన్నారు. ఈ పరిణామాలతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య చర్చలు ఊపందుకున్నాయి. శివసేన ఎన్డీఏ నుంచి వైదొలిగితేనే.. శివసేన–ఎన్సీపీ సంకీర్ణానికి కాంగ్రెస్ మద్దతిచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జైపూర్‌లో ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ్యులు అంతిమ నిర్ణయాన్ని సోనియా గాంధీకి వదిలివేసేందుకు ఆమోదం తెలిపారు. ఎన్సీపీ చీఫ్ పవార్ మంగళవారం తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం సోనియాతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ.. ‘సేన–ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే పక్షంలో కాంగ్రెస్ మద్దతిస్తుంది. కాంగ్రెస్‌కు స్పీకర్ పోస్టు దక్కే అవకాశముంది’ అన్నారు. కాంగ్రెస్ తమకు విరోధి కాదంటూ సామ్నా పేర్కొనడంపై కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ.. సేనకు మద్దతు తెలపాలంటే, ముందుగా ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాలి. ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ రాజీనామా చేయాలి’ అన్నారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్‌లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. శివసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం అప్పగించరాదని కొందరు, కాంగ్రెస్–ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వానికి శివసేన మద్దతిస్తే చాలునని మరికొందరు అంటున్నారు. రాష్ట్రపతి పాలన రావాలని తమ పార్టీ కోరుకోవడం లేదని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉండేందుకు బీజేపీ నిర్ణయం ఇటీవలి ఎన్నికల్లో శివసేనతో కలిసి బరిలోకి దిగిన బీజేపీ ఆదివారం ప్రభుత్వం ఏర్పాటులో అన్ని ప్రయత్నాలు చేసింది. శివసేన ససేమిరా అనడంతో గవర్నర్‌ను కలిసి ప్రతిపక్షంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. శివసేన పట్టు కారణంగా ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత నేపథ్యంలో ఆదివారం ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయానికి వచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. ‘శివసేన ప్రజల తీర్పును అపహాస్యం చేసింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అందుకే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాం’అని ఆయన అన్నారు. అందరి చూపు కాంగ్రెస్ వైపు మహారాష్ట్ర పరిణామాలు మరోసారి కర్ణాటక రాజకీయాలను జ్ఞప్తికి తెస్తున్నాయి. అక్కడ ఎక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్ కొన్ని స్థానాలు మాత్రమే గెలుచుకున్న జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి, తలబొప్పి కట్టించుకుంది. మహారాష్ట్రలో.. శివసేనతో కలిసి ఎన్నికల్లో ప్రచారం చేసిన బీజేపీ అతిపెద్ద పార్టీ గా అవతరించింది. శివసేనతో సీఎం పీఠం విషయంలో పొసగక తెగదెంపులు చేసుకుంది. స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిచ్చినప్పటికీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కు 25 సీట్ల దూరంలో ఉండిపోయింది. అయితే, గవర్నర్ ఆహ్వానంతో సైద్ధాంతిక విభేదాలున్న కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టు కట్టేందుకు సేన సిద్ధమయింది. అయితే, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక భాగస్వామ్య పక్షాలతో సాధారణంగా తలెత్తే విభేదాల కారణంగా తమ ఎమ్మెల్యేలు ప్రతిపక్షం వలలో పడే అవకాశముందని కర్ణాటక అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుని కాంగ్రెస్ భయపడుతోంది. సంకీర్ణంలో భాగస్వామి అవుతుందా? లేక బయటి నుంచి మద్దతిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిర్ణయంపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను ఎక్కడ బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందోననే భయంతో శివసేన కూడా క్యాంపు నడుపుతున్న విషయం తెలిసిందే. శివసేన తన ప్రయత్నాల్లో ఉందా? బీజేపీ మద్దతు లేకుండానే శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రావడం ఆసక్తి కరంగా మారింది. కొన్ని రోజులుగా శివసేన నేత సంజయ్ రౌత్ ‘త్వరలోనే మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందంటూ’ మాట్లాడటం వెనుక అంతరార్థం ఇదా అని విశ్లేషకులు విస్తుపోతున్నారు. శివసేన నేత సంజయ్ రౌత్ వారం రోజుల్లో మూడు సార్లు పవార్ ఇంట్లో భేటీ కావడం అంతర్గతంగా ఏదో ఒప్పందం జరిగి ఉండొచ్చని అనే ఊహాగానాలకు తావిస్తోంది. దీంతోపాటు, సోమవారం శివసేన సంజయ్ రౌత్ సోనియా గాంధీతో భేటీ అయేందుకు డిల్లీ వెళుతున్నట్లు సమాచారం. -
పవార్‌తో పవర్ పంచుకుంటారా?
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: రోజుకో రాజకీయం, పూటకో మలుపు, నేతల మధ్య మాటల తూటాలు, కొత్త పొత్తుల కోసం ఆరాటాలు ఇలా మహారాష్ట్ర రాజకీయం రంగులు మారుతోంది. 50:50 ఫార్ములాకే శివసేన పట్టుబట్టడం, అవసరమైతే రాష్ట్రపతిపాలనకైనా సిద్ధపడతామని బీజేపీ తేల్చి చెప్పడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో పీటముడి మరింత బిగుసుకుంది. అధికారం కోసం చావో రేవోకో సిద్ధపడిన శివసేన పవార్‌తో పవర్ పంచుకుంటామనే సంకేతాలు పంపుతోంది. ఇప్పటివరకు ప్రతిపక్షంలోనే కూర్చుంటామన్న ఎన్సీపీ తన రూటు మార్చుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆయన భేటీ అవుతారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించడం కోసమే ఢిల్లీ వెళుతున్నానని పవార్ బయటకి చెబుతున్నప్పటికీ, బీజేపీని అధికారానికి దూరం చేయడం కోసం కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి శివసేనకు మద్దతు ఇవ్వడంపై గల సాధ్యాసాధ్యాలను చర్చించడమే ప్రధాన ఎజెండా అన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ‘నవంబర్ 4, సోమవారం ఢిల్లీలో సోనియాగాంధీతో శరద్ పవార్ భేటీ అవుతారు. ఆయన ఈ మధ్య ఫోన్లో ఆమెతో మాట్లాడారు. వాళ్ల మధ్య ఏయే అంశాలు చర్చకు వస్తాయో ఆ రోజే తెలుస్తుంది’ అని కాంగ్రెస్, ఎన్సీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన అజిత్ పవార్ చెప్పారు. శివసేన, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చేలా మూడు పార్టీల మధ్య ఒక అవగాహన కుదురుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. శివసేన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటూ ఇప్పటికే కాంగ్రెస్‌లో స్వరాలు పెరుగుతున్నాయి. ఆ పార్టీ నేత హుస్సేన్ దల్వాయ్ పార్టీ అధ్యక్షురాలు సోనియాకు లేఖ రాశారు. సేనకు మద్దతివ్వాలని ఆ లేఖలో ఆయన కోరారు. సంకీర్ణ ధర్మానికే కట్టుబడతాం: సంజయ్ మహారాష్ట్ర ఫలితాలు వెలువడి పది రోజులు దాటిపోయినా ప్రభుత్వ ఏర్పాటు అంశంలో అడుగు కూడా ముందుకు పడకపోవడం ఉత్కంఠకు దారి తీస్తోంది. చివరిక్షణం వరకు తాము సంకీర్ణ ధర్మానికే కట్టుబడి ఉంటామని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. ఈ నెల 9తో 13వ శాసనసభ గడువు ముగిసిపోనుంది. అయినప్పటికీ రెండు పార్టీల మధ్య ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక చర్చలేవీ జరగలేదు. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ, శివసేనలకు కలిపి అధికారాన్ని అప్పగించారని, అందుకోసం తాము ఇద్దరూ కలిసే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వేచి చూస్తామన్నారు. ఉద్ధవ్ సీఎం కావాలి: అథవాలే శివసేన తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆదిత్య ఠాక్రేని ముందుకు తీసుకురావడాన్ని కేంద్ర మంత్రి, ఆర్పీఐ (ఏ) చీఫ్ రామ్‌దాస్ అథవాలే వ్యతిరేకించారు. భవిష్యత్‌లో శివసేనకు ఆ అవకాశం వస్తే ఆదిత్య బదులుగా ఉద్ధవ్ ఠాక్రే ఆ పదవిని చేపడితే బాగుంటుందని సూచించారు. ఈ విషయంలో శివసేన పునరాలోచించాలని అన్నారు. రామ్‌దాస్, ఇతర బీజేపీ మిత్రపక్షాలతో కలిసి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీను శనివారం కలుసుకున్నారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలవాలని ఆయన గవర్నర్‌ని కోరారు. రాష్ట్రపతి మీ జేబులో ఉన్నారా? ఈ నెల 7లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తామన్న బీజేపీ సీనియర్ నేత సుధీర్ మంగన్‌తివార్ వ్యాఖ్యలపై శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో విరుచుకుపడింది. మహారాష్ట్రకే అవమానం, రాష్ట్రపతి మీ జేబులో ఉన్నారా ? అన్న హెడ్డింగ్‌తో రాసిన సంపాదకీయంలో సుధీర్ చేసిన ప్రకటన అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమంటూ ధ్వజమెత్తింది. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాతీర్పునే అవమానించినట్టు అవుతుందని రాష్ట్రపతి అధికార పక్షం జేబులో ఉన్నారా అంటూ ప్రశ్నించింది. కొత్త ఎమ్మెల్యేలను భయపెట్టడానికే రాష్ట్రపతి పాలన అస్త్రాన్ని బయటకు తీశారా? అని∙ ఆ సంపాదకీయంలో బీజేపీని శివసేన నిలదీసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హుడాను కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేతగా నియమించారు. కొత్తగా ఎన్నికైన అసెంబ్లీలో హుడా విపక్ష నేతగా వ్యవహరిస్తారని కాంగ్రెస్ నేత ఆజాద్ వెల్లడించారు. -
మరింత మొండిగా శివసేన
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటులో 50:50 ఫార్యులాను కచ్చితంగా అమలు చేయడాలని బీజేపీని శివసేన కోరుతున్న విషయం తెలిసిందే. అయితే అందుకు బీజేపీ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల ఏడో తేదీలోపు ప్రభుత్వం ఏర్పాటు చేయని పక్షంలో రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తుందని బీజేపీ నిన్న ప్రకటన చేసింది. అంతేకాకుండా ఈ నెల 8న మహారాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ పట్టువీడకపోవడంతో పాటు సీఎం ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేసుకోవడంతో శివసేన మాటలు తూటాలు పేల్చుతోంది. కాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు అవుతున్నా... కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ఇంతవరకూ అడుగు ముందుకు పడలేదు. అందుకు ప్రధాన కారణం శివసేన 50:50 ఫార్ములాను అమలు చేయాలని పట్టుబట్టడమే. దీంతో బీజేపీ సీఎం పదవే కాకుండా కీలకమైన శాఖలు కూడా ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. దీంతో మిత్ర పక్షాల మధ్య వివాదం రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటుంది. బీజేపీ పైచేయి చాటుకునే ప్రయత్నం చేస్తుండటంతో శివసేన కూడా మరింత మొండిగా ప్రవర్తిస్తోంది. పుట్టుకతోనే ఎవరు ముఖ్యమంత్రి పదవిని వెంట తీసుకురారని యువసేన చీఫ్ ఆదిత్య ఠాక్రే బీజేపీకి చురకలంటించారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరే ప్రమాదం ఏర్పడింది. చదవండి: ‘శివ’సైనికుడే సీఎం ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత సుధీర్ మృదుగంటివార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడువులోకగా ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీలు ముందుకు రాకుంటే రాష్ట్రపతి పాలన ఒక్కటే మార్గమన్నారు. బీజేపీ-శివసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజలు ఏ పార్టీకి తగిన మద్దతు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కంటే బీజేపీ-శివసేన కలిపి పని చేయడమే మేలు అని అన్నారు. మరోవైపు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ముఖ్య ప్రతినిధి నవాబ్ మాలిక్ మాట్లాడుతూ బిజెపి, శివసేన రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే, తమ పార్టీ ప్రత్యామ్నాయం ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. మృదుగంటివార్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ-శివసేనలకు ప్రజలు అవకాశం ఇచ్చారు. అయితే అందుకు ఆ పార్టీలు విఫలమైతే మేము ప్రత్యామ్నాయాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు. చదవండి: 5న మహా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్.. -
మహారాష్ట్ర రాజకీయాలు మహా ముదురే!!
ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నవంబర్ 7లోపు ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే ఇక రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ బీజేపీ నేత సుధీర్ మృదుగంటివార్ వ్యాఖ్యలు చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఫలితాలొచ్చి వారం దాటిపోయినా ఇంకా శివసేనతో వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో బీజేపీ కొత్త ఎత్తుకి తెరలేపిందేమో అన్న సందేహాలు మొదలయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 8న ముగియనుందని, ఆ లోపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందంటూ బీజేపీ వ్యాఖ్యానించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలపై శివసేన ఘాటుగా స్పందించింది. రాష్ట్రపతి పాలన వస్తుందంటూ బెదిరించడం ముమ్మాటికీ రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి భారత రాష్ట్రపతి బీజేపీ కంట్రోల్లో ఉన్నారా? లేదా రాష్ట్రపతి స్టాంప్ బీజేపీ కార్యాలయంలో ఉందా? అంటూ శివసేన అధికార పత్రిక సామ్నా ప్రశ్నించింది. బీజేపీ వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రజల తీర్పును అగౌరవ పరిచేలా ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రపతి అంటే కేవలం ఒక వ్యక్తి కాదని.. రాజ్యాంగ వ్యవస్థలో రాష్ట్రపతి అత్యున్నత వ్యక్తి అని, యావత్ దేశానికి ప్రతినిధి అని చెప్పింది. ఈ దేశం ఏ ఒక్కరి జేబులో లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్సీపీ స్పందన : 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు సీఎం పదవి ఇవ్వాలని శివసేన పట్టుబడుతుండటంతో బీజేపీ ఎటూ తేల్చుకోలేని సంఘటస్థితికి చేరుకుంది. ఈ దశలో 54 సీట్లను గెలుచుకున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో శివసేన నేతలు భేటీ కావడం ఉత్కంఠను మరింత పెంచింది. ఏ క్షణం ఏం జరగుతుందో అన్న పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో మీడియా ముందుకొచ్చిన శరద్ పవార్ తన మదిలో అంతరంగాన్ని బయటపెట్టారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఎన్సీపీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తాము ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారని, వారి తీర్పును మేము శిరసావహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, శివసేనలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంపై మాట్లాడుతూ.. ఈ దిశగా ఎన్సీపీలో ఎలాంటి సంప్రదదింపులు జరపలేదన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ - శివసేనలకు ప్రజలు మెజార్టీ స్థానాలను ఇస్తే.. వారు చేస్తున్నదేంటి? వారిద్దరూ చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. శివసేన కోరితే మద్దతు ఇస్తామంటూనే కాంగ్రెస్ మరోసారి ప్రతిపక్షపాత్రకే పరిమితం అవుతామంటోంది. ఇలా ప్రతి పార్టీ కూడా రెండు రకాలుగా వ్యవహరిస్తుండటంతో మహానాటకం రక్తి కడుతోంది. కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. -
శివసేనతో ‘చేయి’ కలపం: ఎన్సీపీ
ముంబై: బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు శివసేనతో చేతులు కలపబోమని శుక్రవారం కాంగ్రెస్, ఎన్సీపీ స్పష్టం చేశాయి. తమను విపక్షంలో కూర్చోమన్న ప్రజా తీర్పును శిరసావహిస్తామని మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరట్ పేర్కొన్నారు. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతివ్వాలన్న ఆలోచన కానీ ప్రతిపాదన కానీ లేదని చెప్పారు. ఒకవేళ మద్దతు కోరుతూ శివసేన తమ వద్దకు వస్తే పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు. శివసేనతో పొత్తు వార్తను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోసిపుచ్చారు. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో.. అధికార పంపిణీ విషయంలో మిత్రపక్షం శివసేన 50:50 ఫార్ములాను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న డిమాండ్‌ను శివసేన ముందుకు తెచ్చింది. బీజేపీకి తగ్గిన ఓట్ల శాతం.. గురువారం వెలువడిన ఎన్నికల పలితాల్లో బీజేపీ సత్తా చాటినప్పటికీ గతంతో పోలిస్తే ఓటుశాతం తగ్గింది. తమ మిత్రపార్టీతో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైనా.. ఓటు షేర్ మాత్రం కోల్పోయింది. 2014లో బీజేపీ పోటీ చేసిన 260 సీట్లలో 122 స్థానాల్లో విజయం సాధించగా, పస్తుతం ఆ సంఖ్య 105కు పడిపోయింది. గతంలో 27.8 శాతంగా ఉన్న బీజేపీ ఓటు షేరు రెండు శాతం కోల్పోయి 25.7తో ఆగిపోయింది. శివసేన ప్రస్తుతం 56 సీట్లు సాధించింది. అయితే ఓటు షేరు మాత్రం 2.9 శాతం కోల్పోయింది. ఎన్సీపీ ఓటు షేరు గతంలో 17.2 శాతం ఉండగా ప్రస్తుతం 16.7శాతానికి తగ్గింది. గతంలో 41 సీట్లు గెలుచుకోగా ఇప్పుడు 54 సీట్లు సాధించింది. కాంగ్రెస్ గతంలో 18 శాతం ఓట్లను కలిగి ఉండగా ఇప్పుడది 15.9కి పడిపోయింది. అయితే సీట్ల సంఖ్యను మాత్రం 42 నుంచి 44కు పెంచుకుంది. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన 2.3 శాతం ఓటు షేరును సాధించింది. తొలి ప్రయత్నంలోనే... నాగ్‌పూర్: ఈఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన అభ్యర్థులు కూడా సత్తా చూపారు. మొత్తం 12 స్థానాల్లో మొదటిసారి బరిలో దిగిన అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. అందులో కొందరు సీనియర్ నేతలపై విజయం సాధించారు. -
జోరు వర్షాన్ని లెక్కచేయకుండా.. పవార్.. పవర్!
సతారా: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్(80) చేవతగ్గలేదని మరోసారి నిరూపించారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ప్రచారం ఆఖరి రోజైన శనివారం సతారాలో ఎన్నికల ర్యాలీ నిర్వహించడంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి. ఈ సందర్భంగా శరద్ పవార్ పార్టీ అభ్యర్థి ఎంపికలో తప్పు చేసినట్లు అంగీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘తప్పు చేస్తే ఒప్పుకోవాలి. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ఎంపికలో తప్పు చేశా. ఆ విషయాన్ని మీ ముందు అంగీకరిస్తున్నా. కానీ, ఆ తప్పును సరిదిద్దుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది. 21న జరగనున్న పోలింగ్ కోసం సతారా ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో ఎన్సీపీకి వరుణ దేవుడి ఆశీస్సులు కూడా లభించాయి. వరుణుడి కటాక్షంతో సతారా ప్రజలు అద్భుతం సృష్టించబోతున్నారు’అని తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న మిగతా నేతలంతా వర్షంలో తడవకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ ఆయన ఆగలేదు. తడుస్తూనే ప్రసంగం కొనసాగించారు. పోరాట యోధుడు కాబట్టే శరద్ పవార్ 5 దశాబ్దాలుగా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కాగా, సతారా ఉప ఎన్నికకుగాను ఛత్రపతి శివాజీ వంశీకుడు ఉదయన్ భోసాలేకు ఎన్సీపీ టికెట్ కేటాయిం చింది. ఆయన అనంతరం బీజేపీ తీర్థం పుచ్చు కుని, ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. -
పిల్లలతో కుస్తీ పోటీయా?
బీడ్: మహారాష్ట్రలో తమతో తలపడే మల్లయోధుడే లేరన్న ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వ్యాఖ్యలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దీటుగా సమాధాన మిచ్చారు. పసికూనలతో ఎవరు తలపడతారంటూ ఎద్దేవా చేశారు. బీడ్ జిల్లా అంబేజొగయ్లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ...ఇక్కడ మహారాష్ట్ర స్టేట్ రెజిలింగ్ అసోసియేషన్ అనే ఒకటుంది. దాని అధ్యక్షుడి పేరు శరద్ పవార్. రెజిలర్లందరికీ అండగా నేనుంటా. మేం పిల్లలతో పోటీకి దిగం’అని పేర్కొన్నారు. తమకు పోటీయే లేదని చెబుతున్న బీజేపీ నేతలు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, యూపీ సీం ఆదిత్యనాథ్ వంటి వారితో రాష్ట్రంలో ప్రచారం ఎందుకు నిర్వహిస్తున్నారని పవార్ ప్రశ్నించారు. -
నేనే ఈడీ ముందు హాజరవుతా!: పవార్
ముంబై: మనీ ల్యాండరిం గ్ కేసు విచారణకు తానే స్వచ్ఛందంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు ఈనెల 27న హాజరవుతానని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంలో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మహారాజా ఛత్రపతి శివాజీ భావజాలాన్ని అనుసరించే తాను కేంద్ర ప్రభుత్వం ముందు తలవంచబోనని స్పష్టంచేశారు. ‘ఈడీకి నా పూర్తి సహకారం ఉంటుంది’అని చెప్పారు. నేనే ముంబైలోని ఈడీ కార్యాలయానికి వెళ్తా. వాళ్లు అడిగే ఎలాంటి సమాచారాన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటా’అని పవార్ విలేకరులకు వెల్లడించారు. కాగా, పవార్, అతని సోదరుడి కుమారుడు అజిత్ పవార్, మరో 70 మందిపై ఈడీ కేసువేసింది. -
పాకిస్థాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన సీనియర్ నేత!
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు భారత్‌కు మధ్య పరిస్థితులు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయ్యాయి. ఈ తరుణంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఇరుదేశాలపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పాకిస్తానీయులు భారతీయులను తమ ఆప్తులుగా చూస్తారంటూ పాక్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఆదివారం ముంబైలోని పార్టీ కార్యాలయంలో మైనార్టీల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శరద్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాకిస్తాన్‌కు వెళ్లినపుడు అక్కడి ప్రజలు మంచి ఆతిథ్యాన్ని అందించారని పేర్కొన్నారు. అంతేగాక పాకిస్తానీయులు భారత్‌లో వారి బంధువులను కలిసే వీలులేక అక్కడికి వచ్చేవారినే బంధువులుగా భావించి సకల మర్యాదలు చేస్తారని ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్లో ప్రజలు సంతోషంగా లేరని, సరైన న్యాయం కూడా లభించదన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్‌పై విష ప్రచారం చేపడుతోందని విమర్శించారు. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేపడుతోందని ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే! అయితే ఈ నిర్ణయాన్ని శరద్ పవార్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నిర్ణయం వల్ల జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదం మరింత పెరిగే అవకాశముందని పవార్ హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన దాయాది దేశం పాకిస్తాన్‌ను పొగడ్తలతో ముంచెత్తి.. బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఆ దేశాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని పాక్‌ను వెనకేసుకు రావటం చర్చనీయాంశంగా మారింది. -
సుప్రియాను వేధించిన ట్యాక్సీ డ్రైవర్
ముంబై : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సులేకు శుక్రవారం ముంబైలోని దాదర్ స్టేషన్లో వింత అనుభవం ఎదురైంది. ట్యాక్సీ కావాలా అంటూ ఓ వ్యక్తి దాదర్ స్టేషన్లో ఏకంగా ట్రైన్‌లోకి ఎంటరై తమను వేధించాడని ఆమె ట్వీట్ చేశారు. కుల్జీత్ సింగ్ మల్హోత్రా అనే వ్యక్తి తన రైల్వే బోగీలోకి వచ్చి ట్యాక్సీ సర్వీస్ గురించి ప్రచారం చేసుకున్నాడని, తనకు ట్యాకీఅవసరం లేదని చెప్పినా వినిపించుకోకుండా తన వెంటపడుతూ తనతో ఫోటో కూడా తీసుకున్నాడని ఆమె దాదర్ స్టేషన్లో రైల్వే అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదుతో మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న అధికారులు నిందితుడికి జరిమానా విధించారు. రైల్వే అధికారులు ఈ ఘటనపై దృష్టిసారించి ప్రయాణీకులకు ఇలాంటి అనుభవం మరోసారి ఎదురవకుండా చర్యలు తీసుకోవాలని, ఆటో డ్రైవర్లు తమ సేవలపై ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఉంటే రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో అందుకు అనుమతించరాదని, ట్యాక్సీ స్టాండ్స్‌కే వాటిని పరిమితం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని అతనికి జరిమానా విధించామని రైల్వే పోలీసులు వివరించగా వారికి సుప్రియా ధన్యవాదాలు తెలిపారు. ఏ ఒక్కరి వల్ల రైల్వే ప్రయాణీకులకు అసౌకర్యం వాటిల్లరాదని ఆమె పేర్కొన్నారు. -
కాంగ్రెస్-ఎన్సీపీల సీట్ల సర్ధుబాటు
ముంబై : రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై ప్రాంతంలో సీట్ల సర్దుబాటును కాంగ్రెస్, ఎన్సీపీలు ఖరారు చేశాయి. ఒప్పందం ప్రకారం ముంబై ప్రాంతంలోని 36 అసెంబ్లీ స్ధానాలకు గాను కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేయనుండగా, ఎన్సీపీ ఏడు స్ధానాల్లో తన అభ్యర్ధులను నిలపనుంది. ఈ కూటమిలో మరో భాగస్వామ్య పార్టీ ఎస్పీ ఒక స్ధానంలో పోటీకి దిగనుంది. మరో మూడు స్ధానాలను కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించాలని ప్రాధమికంగా నిర్ధారించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య సీట్ల సర్ధుబాటుపై జరిగిన భేటీలో సీనియర్ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, మల్లిఖార్జున్ ఖర్గే, బాలాసాహెబ్ థొరాట్, ఏక్నాథ్ గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు, ముంబై సహా మహారాష్ట్రలో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్ధుల తుది జాబితాను ఈనెల 14న ప్రకటిస్తారని భావిస్తున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ చీఫ్‌లు సోనియా గాంధీ, శరద్ పవార్ల మధ్య ఢిల్లీలో జరిగిన భేటీ అనంతరం ఇరు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ప్రక్రియ వేగవంతమైంది. -
బీజేపీ గూటికి చేరనున్న ఆ ఎమ్మెల్యేలు
ముంబై : మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పాటు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బుధవారం బీజేపీలో చేరనున్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు శివేంద్ర సింగ్ రాజ భోసాలె, వైభవ్ పిచద్, సందీప్ నాయక్‌తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబ్కార్ ముంబై గర్వారే క్లబ్ హౌస్‌లో బుధవారం బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. పలువురు ఎన్సీపీ దిగ్గజ నేతలు సైతం బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు కాషాయ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. విపక్ష పార్టీలకు చెందిన నేతలను ఒత్తిడి చేసి బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ అగ్రనేతలు, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు. పార్టీలో అసమ్మతి పెరుగుతుండటంపై శరద్ పవార్ ఆత్మవిమర్శ చేసుకోకుండా తమపై బురదచల్లడం మానుకోవాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి పెద్దసంఖ్యలో నేతలు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తుండగా తాము ఎంపిక చేసిన కొద్దిమందినే పార్టీలోకి తీసుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు. -
శరద్ పవార్ సంచలన నిర్ణయం
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్ (78) సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు. శరద్ పవార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే కుటుంబంనుంచి ఇద్దరు ఈసారి ఎన్నికల బరిలో ఉంటారని స్పష్టం చేశారు. తన కుమార్తె సుప్రీయా సూలే, మనువడు పార్థ్ పవార్ 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని పేర్కొన్నారు. ఈ సారి తన కుటుంబ సభ్యులు ఇద్దరు పోటీ చేయనున్నారు.. కనుక తాను తప్పుకోవడానికి ఇదే సరైన సమయంగా తాను భావిస్తున్నానని చెప్పారు. ఓటమి భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించినపుడు గతంలో 14సార్లు విజయం సాధించాను...15వ సారి తనను నిలువరించడం సాధ్యమా అని ప్రశ్నించారు. తాజా ప్రకటనతో ఆయన కుటుంబం నుంచి మూడవతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలపై స్పష్టత వచ్చింది. మావల్ నియోజకవర్గంనుంచి పార్థ్ లోక్‌సభకు పోటీచేస్తారనే అంచనాలు స్థానిక రాజకీయ వర్గాల్లో భారీగా నెలకొన్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక తనకు లేకపోయినా, మధ (మహారాష్ట్ర) నియోజకవర్గంనుంచి పోటీ చేయాలని పార్టీ నేతలు తనను కోరుతున్నారని, దీంతో ఈ లోక్‌సభ ఎన్నికలలో పోటీకి దిగుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. కానీ ఇంతలోనే ఆయన మళ్లీ యూటర్న్ తీసుకుని పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. 2009 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పవార్ విజయం సాధించారు. 2012లో కూడా తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని శరద్ పవార్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత 2014 ఎన్నికలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు బీజేపీకి వ్యతిరేక కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి, ప్రధానమంత్రి పదవి రేసులో ప్రధానంగా నిలిచిన ఆయన ఇక బరిలోనుంచి తప్పుకున్నట్టేనా? ఆయన మనసు మార్చుకోవడం వెనుక వ్యూహం ఏమిటి? -
నేను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తా..
సాక్షి, పూణే : లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తెరదించారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి దిగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని మాధా లోక్‌సభ నియోజక వర్గం నుంచి శరద్ పవార్ బరిలో దిగనున్నారు. ఆయన మంగళవారం సాయంత్రం ఇక్కడ మాట్లాడుతూ...’ వచ్చే ఎన్నికల్లో నేను పార్లమెంట్‌కు పోటీ చేస్తా. నా మేనల్లుడు అజిత్ పవార్, అలాగే కుటుంబ సభ్యులు పార్థ్ పవార్, రోహిత్ పవార్ కానీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయరు. కేవలం శరద్ పవార్ మాత్రమే పోటీ చేస్తారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్ కుమార్తే సుప్రియా సూలె ఇప్పటికే బారామతి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆయన మేనల్లుడు అజిత్ పవార్ కుమారుడు రోహిత్ పవార్ వచ్చేఎన్నికల్లో పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో శరద్ పవార్ స్పష్టతనిచ్చారు. కాగా తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని శరద్ పవార్.. 2012లో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2014లో మాధా స్థానం నుంచి ఆ పార్టీ నేత విజయసింహా మోహిత్ పాటిల్ గెలుపొందారు. -
చంద్రబాబు సరికొత్త కాపురం కాంగ్రెస్‌తో..
సాక్షి, న్యూఢిల్లీ: పరస్పరం బద్ధ శత్రువులైన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల పొత్తుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పురుడు పోసుకున్న తెలుగుదేశం ఇప్పుడు అదే పార్టీతో కలిసి కాపురం చేసేందుకు సన్నద్ధమైంది. ఇన్నాళ్లూ నరనరాన జీర్ణించుకున్న కాంగ్రెస్ వ్యతిరేకతకు ఇక మంగళం పాడేయాలని తెలుగుదేశం నిర్ణయించుకుంది. గతంలో ఉన్న వైరుధ్యాలను మరిచిపోవాలని, ఇకపై కలిసి నడవాలని ఇరు పార్టీలు నిర్ణయానికొచ్చాయి. తమ మధ్య గతాన్ని మరిచిపోయి, ఇద్దరం కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ప్రకటించారు. చంద్రబాబు గురువారం ఢిల్లీలో రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా బాబు వెంట టీడీపీ ఎంపీలు, పలువురు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు ఉన్నారు. రాహుల్ గాంధీతో పరిచయాలు అయ్యాక ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలు బయటకు వచ్చేశారు. తర్వాత రాహుల్, చంద్రబాబు గంటకుపైగా ఏకాంతంగా భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. భేటీ తర్వాత రాహుల్, చంద్రబాబు కలిసి మీడియాతో మాట్లాడారు. దేశ రక్షణకు విపక్షాలన్నీ ఏకం కావాలి ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశ భవిష్యత్తు కోసం మేం కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం. గతంలో మా మధ్య చాలానే వైరుధ్యాలు ఉన్న మాట వాస్తవమే. దాన్ని మేం కూడా అంగీకరిస్తాం. ఎన్ని ఉన్నా ప్రస్తుతానికి పాత విషయాల జోలికి వెళ్లడం లేదు. వాటిని మరిచిపోయి కలిసి పనిచేయాలని నిర్ణయించాం. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. దేశ పరిరక్షణ కోసం విపక్షాలు అన్ని ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్‌తో చంద్రబాబు యువతకు ఉపాధి లేదు. రాఫెల్ కుంభకోణంలో అనిల్ అంబానీకి రూ.30,000 కోట్లు దోచిపెట్టారు. ఈ పరిస్థితుల్లో దేశ రక్షణకు, ప్రజాస్వామ్య బలోపేతానికి అన్ని విపక్షాలు కలిసి పని చేయాలి. దానికి అనుగుణంగా చంద్రబాబు, నేను కలిసి పనిచేస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించే పనిలో పడతాం. ఇక విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరుంటారన్నది ప్రస్తుతానికి అనవసరం. మీడియాకు దీనిపైనే ఆసక్తి ఎక్కువ. కానీ, మాకు మాత్రం దేశ రక్షణపైనే ఆసక్తి. ముందు బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలను ఏకంచేసి ముందుకెళ్లడంపై ప్రణాళికలు రచిస్తాం. వాటిని త్వరలోనే వెల్లడిస్తాం’’అని రాహుల్‌గాంధీ ఉద్ఘాటించారు. వ్యవస్థలను నాశనం చేశారు ‘‘ఎన్డీయే ప్రభుత్వం దేశంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. దేశ రక్షణ కోసం రాహుల్ గాంధీ, నేను కలిసి పనిచేయాలని నిర్ణయించాం. అన్ని విపక్షాలను కలుపుకొనిపోతాం. దేశంలో ప్రస్తుతంæ సాగుతున్న అరాచక పరిపాలనను గతంలో ఎన్నడూ చూడలేదు. వ్యవస్థలను నాశనం చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్బీఐ, గవర్నర్ల వ్యవస్థ, సుప్రీంకోర్టు వ్యవస్థలను నాశనం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరం కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది. విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రస్తుతానికి అనవసరం. రాఫెల్ కుంభకోణాన్ని రాహుల్ గాంధీ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. దీనిపై మేము కూడా మాట్లాడుతున్నాం. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తాం. అన్ని పార్టీలతో చర్చించి, ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తాం’’అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పవార్, ఫరూక్ కంటే చిన్నవాడినే.. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా దేశంలో చాలా సీనియర్ నేతలని, తాను వారికంటే చిన్నవాడినేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. అనంతరం ముగ్గురు నేతలు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశాన్ని రక్షించేందుకు ఎన్డీయేయేతర పక్షాలను ఎలా కలుపుకొని ముందుకెళ్లాలన్న దానిపై చర్చించినట్టు తెలిపారు. శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లాతో చంద్రబాబు దీనిపై ఇంకా ప్రాథమిక స్థాయిలోనే చర్చలు జరిగాయని పేర్కొన్నారు. మున్ముందు బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల నాయకులతో మాట్లాడిన తరువాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని, ప్రస్తుతానికి ఇంతకుమించి ఏమీ చర్చించలేదని శరద్ పవార్ వెల్లడించారు. భావసారూప్యం గల పార్టీలను ఏకం చేసేందుకు త్వరలో బీజేపీయేతర పక్షాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని, దానికి తాము ముగ్గురం కన్వీనర్లుగా ఉంటామని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇతర పార్టీలతో మాట్లాడే బాధ్యతను పవార్, ఫరూక్ తనకు అప్పగించారని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం కాగానే, తనకు ఫ్లైట్ టైం అయిందంటూ ఫరూక్ అబ్దుల్లా లేచి వెళ్లిపోయారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లతో వారి నివాసంలో చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబును బీజేపీ తిరుగుబాటు నేత అరుణ్ శౌరీ ఏపీ భవన్లో కలిశారు. అలాగే సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. -
ఎక్కువ సీట్లొచ్చిన పార్టీకే ప్రధాని పీఠం: పవార్
ముంబై: 2019 సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. కూటమిలో ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీకే ప్రధాని పీఠం దక్కుతుందన్నారు. తనకు ప్రధానమంత్రి కావాలన్న కోరికలేదని రాహుల్ గాంధీ చెప్పడం సంతోషంగా ఉందని పవార్ పేర్కొన్నారు. ‘ఎన్నికలు జరగనీయండి. బీజేపీని అధికారం నుంచి దింపేసి.. మేం ఆ సీట్లో కూర్చుంటాం. ఎక్కువ సీట్లు పొందిన పార్టీ ప్రధాని పీఠానికి అర్హత సాధిస్తుంది. తను ప్రధాని రేసులో లేనని రాహుల్ గాంధీ చెప్పడం సంతోషకరం’ అని పవార్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా విపక్షాల కూటమి పనిచేస్తుందని చెప్పారు. -
'మాబంధం ఎవ్వరూ బద్ధలు కొట్టలేరు'
పాట్నా: తమ కూటమిని ఎవరూ బద్ధలు కొట్టలేరని, అత్యంత దృఢమైనదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. జేడయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలతో ఏర్పడిన కూటమి బీటలు పాయనిదని, శక్తిమంతమైనదని చెప్పారు. ఈ పార్టీలను కలుపుకొని ఎన్సీపీ కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుందని తెలిపారు. రెండు రోజుల పార్టీ జాతీయ మండలి సమావేశానికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
శివసేన చీఫ్‌కు శరద్ పవార్ ప్రశంసలు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణాలు మారొచ్చన్న సంకేతాల నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రేను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రశంసల్లో ముంచెత్తారు. శివసేన వ్యవస్థాపకుడైన తండ్రి బాల్‌ఠాక్రే 2012లో కన్నుమూశాక పార్టీని బలోపేతం చేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. ఆదివారం ముంబైలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బాల్‌ఠాక్రే మరణంతో శివసేన భవిష్యత్తుపై మీడియా అనవసరంగా సిరాను వృథా చేసిందని...కానీ మీడియా అంచనాలను ఉద్ధవ్‌ఠాక్రే తన పనితీరుతో తప్పని నిరూపించారన్నారు. అంచనాలకు మించి పార్టీని బలోపేతం చేసేందుకు ఇంకా కృషి చేస్తున్నారన్నారు. -
ఎన్సీపీ కంచుకోట బారామతి
బారామతి పేరు చెబితే ఎవరికైనా ముందుగుర్తుకొచ్చేది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్. ఈ స్థానం నాలుగు దశాబ్దాలుగా ఎన్సీపీ అధీనంలోనే ఉంది. 2009 దాకా శరద్‌పవార్ దీనికి ప్రాతినిధ్యం వహించారు. 2009 ఎన్నికల్లో ఆయన కుమార్తె సుప్రియాసూలే ఇక్కడినుంచే పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ తిరిగి ఆమె ఇక్కడి నుంచే బరిలోకి దిగారు. పుణే సిటీ, న్యూస్‌లైన్: బారామతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని దౌండ్, ఇందాపూర్, బారామతి, పురందరి, బోర్, ఖడక్వాస్లా శాసనసభ స్థానాలు ఎన్సీపీకి కంచుకోటగా ఉన్నాయి. శరద్‌పవార్ స్వస్థలం కావడంతో ఈ నియోజకవర్గం గత 40 సంవత్సరాల నుంచి ఆ పార్టీ అధీనంలోనే ఉంది. 2009 ఎన్నికల్లో పవార్ కూతురు సుప్రియా సూలే 4.22 లక్షల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి పృథ్వీరాజ్‌పై విజయఢంకా మోగించారు. ఈ ఎన్నికల్లో ఆమెకు పోటీగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సురేష్ కోపడే, కాషాయకూటమి ఉమ్మడి అభ్యర్థి మహాదేవ్ జాన్కర్ బరిలో ఉన్నారు. అధికార కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో మాత్రం ఎన్సీపీ పాగా వేయడం ఖాయమని పలువురు భావిస్తున్నారు. ఇతర తాలూకాలతో పోలిస్తే బారామతి ఎంతో అభివృద్ధి చెందింది. టెక్స్టైల్స్, ఆటోమొబైల్ తదితర రంగాలతోపాటు సహకార సంస్థలు, చక్కెర కర్మాగారాలు ఇక్కడ ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తంనగర్, ఎన్.డి.నగర్, గిరి నగర్ తదితర ప్రాంతాల్లోని తెలుగు ప్రజల అభిప్రాయాలను ‘న్యూస్‌లైన్’ సేకరించింది. వసతులు కల్పిస్తేనే ఓటు ఈ ప్రాంతంలో రహదార్లను అభివృద్ధి చేయాలి. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి. పేదలకు కనీస వసతులు కల్పించాలి. అందుకు కృషి చేసిన నాయకులకే ఓటేస్తాం. - మల్లికార్జున్‌రెడ్డి నిజాయితీపరులు కావాలి రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలి. నామినేషన్ల సమయంలో అభ్యర్థులు ప్రకటించిన ఆస్తులపై సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలి. తప్పుడు వివరాలు వెల్లడించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలా అయితేనే వారిలో మార్పురాదు. అప్పుడే మన నాయకులు నిజాయితీగా పరిపాలిస్తారు. నిజాయితీతో కూడిన పాలన అందించిన నాయకులకే పట్టం కడతాం. - వెంకటస్వామి నిజాయితీపరుడికే ఓటు రోజురోజుకూ రాజకీయాలు మలినమవుతున్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే రాజకీయాల్లో మార్పు వస్తుంది. నిజాయితీపరుడికే నా ఓటు. తెలిసినవారందరికీ ఇదే విషయం చెబుతా. - నరసింహారెడ్డి