సాక్షి, ముంబై : ‘మహా’ రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని శివసేన అధ్యక్షుడు ఉద‍్దవ్ ఠాక్రే చేపట్టనున్నారు. అలాగే కాంగ్రెస్, ఎన్సీపీలకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు దక‍్కనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై శనివారం మూడు రాజకీయ పార్టీలు అధికారికంగా ప్రకటన చేయనున్నాయి. దీంతో మహారాష్ట్రలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడనుంది.
దాదాపు గంటన్నర పాటు కొనసాగిన సమావేశం అనంతరం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ... ‘మహారాష్ట్రకు కాబోయే సీఎం ఉద్దవ్ ఠాక్రే. మూడు పార‍్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. పార్టీల ఎమ్మెల్యేలు లేఖపై సంతకం చేశారు. మా ఎజెండాపై మరింత చర్చలు జరుపుతాం.’ అని తెలిపారు. కాగా ముఖ్యమంత్రి పదవిలో ఐదేళ్ల పాటు శివసేనకు, కాంగ్రెస్, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు లభిస్తాయని, కీలక మంత్రి పదవులు మాత్రం మూడు పార్టీలకు సమానంగా లభిస్తాయని, స్పీకర్ పదవి కాంగ్రెస్‌కేనని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పార్టీకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మూడు పార్టీలకు మంత్రి పదవులు లభించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment