
BJP Leader Vinayak Ambekar Slapped..ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై వివాదాస్పద వ్యాఖ‍్యలు చేస్తూ పెట్టిన పోస్టుల వేడి మహారాష్ట్రలో ఇంకా తగ్గలేదు. శనివారం పవార్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసినందుకు గాను మరాఠీ టీవీ, సినీ నటి కేతకి చిటలే మీద థానే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆదివారం ఆమెను కోర్టులో హాజరుపరుచగా.. మే 18వ తేదీ వరకు పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. తాజాగా పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ మహారాష్ట్ర అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్‌పై ఎన్సీపీ(నేషనలిస్ట్ పార్టీ) నేతలు, కార్యకర‍్తలు దాడి చేశారు. ఈ క్రమంలో వారు.. వినాయక్ అంబేకర్ చెంప చెళ్లుమనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్సీపీ కార్యకర్తల దాడికి సంబంధించిన వీడియోను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాటిల్ ట్విటర్ట్ వేదికగా స్పందిస్తూ.. వినాయక్ అంబేకర్‌పై ఎన్సీపీ గుండాలు దాడికి పాల్పడ్డారు. బీజేపీ పార్టీ తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వినాయక్‌పై దాడి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ‍్యలు చేయడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందిస్తూ.. భారత రాజ్యాంగం పౌరులకు భావ ప్రకటన స్వేచ్చను కల్పించందని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. సీనియర్ రాజకీయవేత్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.
महाराष्ट्र प्रदेश भारतीय जनता पार्टीचे प्रवक्ते प्रा. विनायक आंबेकर यांच्या वर राष्ट्रवादीच्या गुंडांनी भ्याड हल्ला केला असून, भाजपाच्या वतीने मी या हल्ल्याचा तीव्र शब्दांत निषेध व्यक्त करतो. राष्ट्रवादीच्या या गुंडांवर तात्काळ कारवाई झालीच पाहिजे !@BJP4Maharashtra pic.twitter.com/qR7lNc1IEN
— Chandrakant Patil (@ChDadaPatil) May 14, 2022
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేతలు చూస్తూ కూర్చుంటే సరిపోదు.