ముగిసిన నామినేషన్ల గడువు.. 15 స్థానాలపై రాని స్పష్టత! | Nomination Over But Uncertainty 15 Seats In Maharashtra polls | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్ల గడువు.. తేలని 15 సీట్లు పంచాయితీ!

Published Tue, Oct 29 2024 8:09 PM | Last Updated on Tue, Oct 29 2024 8:24 PM

Nomination Over But Uncertainty 15 Seats In Maharashtra polls

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ఇవాళ(మంగళవారం) ముగిసింది. కానీ దాదాపు 15 సీట్లను అధికార, ప్రతిపక్ష కూటమి పార్టీలు అధికారికంగా ప్రకటించని పరిస్థితి నెలకొంది . బీజేపీ, శివసేన( ఏక్‌నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్‌ వర్గం) అధికార కూటమి ఇంకా నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. 

అదేవిధంగా ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో  శివసేన( ఉద్ధవ్‌ వర్గం), ఎన్‌న్సీపీ( ఎస్పీ వర్గం), కాంగ్రెస్ పార్టీ మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం.  

బీజేపీ 152 మంది అభ్యర్థులు, ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) 52  మంది అభ్యర్థులు, శివసేన( ఏక్‌నాథ్‌ షిండే  వర్గం) శివసేన 80 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో అధికార కూటమి చిన్న మిత్రపక్షాలకు ఇచ్చిన సీట్లు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ 103 మంది అభ్యర్థులు, శివసేన( ఉద్ధవ్‌ వర్గం),  ఎన్సీపీ( ఎస్పీ) కలిపి 87 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది.

మధ్యాహ్నం నాటికి ఎన్సీపీ( ఎస్పీ)కి సంబంధించినంత వరకు చివరి 87వ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసినట్లు తెలిపింది. అయితే అది అప్పటికీ 11 సీట్లపై అనిశ్చిత్తి నెలకొంది. ఈ సీట్లు​ కొన్ని చిన్న మిత్రపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీకి వస్తాయని అంచనా వేయగా..  ఎవరికి ఏది, ఎన్ని అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఎన్‌న్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) నవాబ్ మాలిక్ మంఖుడ్ స్థానం నుంచి రెండు నామినేషన్లను దాఖలు చేశారు. ఒకటి ఇండిపెండెంట్‌గా, మరొకటి ఎన్సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement