బంధాలు, బిజినెస్‌ ఒకటి కాదు.. అజిత్‌ పవార్‌కు సోదరి కౌంటర్‌ | Supriya Sule Dig At Brothers Days After Ajit Pawar Mistake Claim | Sakshi
Sakshi News home page

బంధాలు, బిజినెస్‌ ఒకటి కాదు.. అజిత్‌ పవార్‌కు సుప్రియా సూలే కౌంటర్‌

Published Fri, Aug 16 2024 4:03 PM | Last Updated on Fri, Aug 16 2024 4:10 PM

Supriya Sule Dig At Brothers Days After Ajit Pawar Mistake Claim

ఎన్సీపీ(శరద్‌చంద్ర పవార్‌) ఎంపీ సుప్రియా సూలే.. తన సోదరుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్రప్రభుత్వానికి తమ ప్రియమైన సోదరీమణులను గుర్తుకు రాలేదు కానీ.. అసెంబ్లీ ఎన్నికల వేళ వారి ప్రేమ పొంగిపొర్లుతుందని సెటైర్లు వేశారు.

కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి సోదరి సుప్రియా సోలే మీద పోటీకి తన భార్య సునేత్ర పవార్‌ను నిలబెట్టినందుకు బాధపడుతున్నట్లు అజిత్ పవార్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు సుప్రియా తన సోదరుడికి కౌంటర్‌ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ..  బంధాలు, వ్యాపారం మధ్య తేడాను మన  సోదరులు గుర్తించలేకపోతున్నారు. ఎవరూ కూడా బంధాల మధ్యలోకి డబ్బును తీసుకురాకూడదు. అదే విధంగా వ్యాపారంలోకి సంబంధాలను లాగకూడదు. అయితే మా సోదరుడు దీనిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఇది మాకు చాలా బాధ కలిగిస్తోంది.’ అని అన్నారు.

అంతేగాక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల నిజమైన ప్రేమ లేదని, ఎన్నికల లబ్ధి కోసం సంక్షేమ పథకాలను సాధనాలుగా వాడుకుంటుందని విమర్శించారు.‘ఈ ప్రభుత్వం ఏం చేసిన ఓట్ల కోసమే. మంచిఉద్దేశ్యంతో ఏం చేయదు. ఇదీ లోక్‌సభ ఎన్నికల ప్రభావం. రెండేళ్ల క్రితం అక్కాచెల్లెళ్లపై ఎవ్వరూ అభిమానం చూపలేదు. ఇది కేవలం లోక్‌సభ ఎన్నికల ప్రభావం మాత్రమే’ నని అన్నారు. 

అయితే ఈ వ్యాఖ్యలు  రాష్ట్రంలోని ‘లడ్కీ బహిన్‌’ స్కీమ్‌ను ఉద్ధేశించి చేసినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి వల్లనే మహిళలకు నెలకు రూ.1,500 ఇచ్చే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement