డిప్యూటీ సీఎం షిండేపై అనుచిత వ్యాఖ్యలు.. శివసేన కార్యకర్తల దాడి | Kunal Kamra Controversy Comments On Eknath Shinde | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర షిండేపై అనుచిత వ్యాఖ్యలు.. శివసేన కార్యకర్తల దాడి

Published Mon, Mar 24 2025 7:41 AM | Last Updated on Mon, Mar 24 2025 8:43 AM

Kunal Kamra Controversy Comments On Eknath Shinde

ముంబై: మహారాష్ట్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కమెడియన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో, ఆగ్రహానికి లోనైన శివసేన కార్యకర్తలు ఓ క్లబ్‌పై దాడి చేశారు. సదరు కమెడియన్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని శివసేన కార్యకర్తలు డిమాండ్‌ చేస్తూ భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు.

వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ఖార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ‘ది యూనికాంటినెంటల్‌ క్లబ్‌’ లో స్టాండప్‌ కమెడియన్‌ కునాల్ కమ్రా షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమెడియన్‌ కునాల్ కమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం, శివసేన నాయకులు ఏక్‌నాథ్‌ షిండేను టార్గెట్‌ చేశారు. ఈ క్రమంలోనే ఏక్‌నాథ్ షిండేను దేశద్రోహిగా అభివర్ణించారు. షోలో కునాల్‌.. ‘దిల్‌ తో పాగల్‌ హై’ అనే హిందీ పాటను మార్చి పాడారు. 2022లో ఉద్దవ్‌ థాక్రేకు వెన్నుపోటుకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. దీంతో, శివసేన కార్యకర్తలు ెద్ద సంఖ్యలో ‘ది యూనికాంటినెంటల్‌ క్లబ్‌’ వద్దకు చేరుకున్నారు. అనంతరం, క్లబ్‌పై దాడి చేశారు.

అనంతరం, కమెడియన్‌ కునాల్‌ కమ్రాను అరెస్ట్‌ చేయాలని శివసేన కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే కునాల్‌పై ఫిర్యాదు చేయడానికి పార్టీ సభ్యులు ఖార్ పోలీస్ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్బంగా శివసేన నేతలు మాట్లాడుతూ.. ఉద్దవ్‌ థాక్రే నుంచి డబ్బులు తీసుకుని కునాల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

మరోవైపు.. ఈ ఘటనపై మాజీ మంత్రి, ఉద్దవ్‌థాక్రే కుమారుడు ఆధిత్య థాక్రే స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ఆధిత్య థాక్రే.. కునాల్‌ కమ్రాపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. ఏక్‌నాథ్‌ షిండేపై అతడు చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజం. అభద్రతాభావం ఉన్న వ్యక్తులే, పిరికివాళ్లు మాత్రమే ఇలాంటి దాడులు చేస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో తెలుసా?. ముఖ్యమంత్రి, హోంమంత్రిని అణగదొక్కడానికి ఏక్‌నాథ్ షిండే చేసిన మరో ప్రయత్నం ఇది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement