అజిత్‌పవార్‌పై సుప్రియాసూలే ఆసక్తికర వ్యాఖ్యలు | Supriya Sule Interesting Comments On Ajit Pawar | Sakshi
Sakshi News home page

అజిత్‌పవార్‌పై సుప్రియాసూలే ఆసక్తికర వ్యాఖ్యలు

Published Wed, Sep 25 2024 7:21 PM | Last Updated on Wed, Sep 25 2024 8:18 PM

Supriya Sule Interesting Comments On Ajit Pawar

ముంబయి: ఎన్సీపీ పగ్గాలు తన కజిన్‌ అజిత్‌ పవార్‌కు ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైనప్పటికీ ఆయన తమను వీడి వెళ్లారని, ఇబ్బందులకు గురిచేశారని ఎంపీ సుప్రియాసూలే అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సూలే ఈ మేరకు వ్యాఖ్యానించారు. 

‘అడిగితే అన్ని ఇచ్చేవాళ్లం. ఎన్సీపీ లీడర్‌ను చేసే వాళ్లం. కానీ ఆయన ఏదో ఊహించుకుని పార్టీవీడి వెళ్లారు. మా జీవితాలను ఇబ్బందుల పాలు చేశారు.  ఇది వారసత్వ సమస్య కానేకాదు. 

ఎన్సీపీకి నాయకత్వం వహించేందుకు నేను ఆయనకు పోటీ రాలేదు. ఇది కేలం కూటమి సమస్య. ఆయన బీజేపీ, శివసేన కూటమితో వెళ్లాలనుకున్నందున వెళ్లిపోయారు’అని సూలే వివరించారు. ఈ విషయంలో అజిత్‌ పవార్‌తో తాను బహిరంగ చర్చకు సిద్ధమని సూలే సవాల్‌ విసిరారు.

 కాగా, శరద్‌పవార్‌ నేతృత్వంలో నడుస్తున్న ఎన్సీపీలోని ఎక్కువ మంది ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టుకున్న అజిత్‌ పవార్‌ బీజేపీ, శివసేన ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం అయిన విషయం తెలిసిందే. తర్వాతి పరిణామాల్లో అసలైన ఎన్సీపీని కూడా అజిత్‌ పవార్ కైవశం చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement