ముంబై: కుటంబాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను ఇంటి వరకు రానివ్వకూడదని ఆయన అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి తన భార్యను, సోదరి సుప్రియా సులేకు వ్యతిరేకంగా నెలబెట్టి తప్పు చేశానని పేర్కొన్నారు,.
రాష్ట్రవ్యాప్తంగా 'జన్ సమ్మాన్ యాత్ర' చేపట్టిన ఉన్న అజిత్ పవార్ ఒక మరాఠీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో సునేత్రాను(అజిత్ భార్య) పోటీ చేయించాలనే నిర్ణయం ఎన్సీపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయమని అన్నారు.
"నేను నా సోదరీమణులందరినీ ప్రేమిస్తాను. రాజకీయాలను ఇంట్లో వరకు రానివ్వకూడదు. నా సోదరిపై సునేత్రను పోటీకి దింపి నేను తప్పు చేశాను. ఇది జరిగి ఉండకూడదు. కానీ పార్లమెంటరీ బోర్డు (ఎన్సీపీ) ఈ నిర్ణయం తీసుకుంది. అది తప్పు అని ఇప్పుడు నేను భావిస్తున్నాను’ అని అజిత్ పవార్ అన్నారు.
కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ భార్య సునేత్రపై సుప్రియా సూలే 1.5 లక్షల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బారామతి స్థానం నుంచి వరుసగా నాలుగోసారి ఆమె గెలుపొందారు. సుప్రియా సూలే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె. ఇదిలా ఉండగా ఎంపీ ఎన్నికల్లో ఓటమి తర్వాతత సునేత్ర పవార్ జూన్ 18న రాజ్యసభకు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment