Marathi Actress Ketaki Chitale Got Bail Over Post Against Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌ను అవమానకర రీతిలో ప్రస్తావించిందన్న ఆరోపణలో అరెస్టయిన 29 ఏళ్ల మరాఠీ నటి కేతకి చితాలేకు తాజాగా బెయిల్ మంజూరైంది. సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో శరద్‌పై అభ్యంతకర పోస్టులు చేసిందన్న కారణంగా కేతకిని మే 14న థానే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన దాదాపు నెల రోజుల తర్వాత మహారాష్ట్ర థానే జిల్లాలోని కోర్టు బుధవారం (జూన్ 22) బెయిల్ జారీ చేసింది. రూ. 20 వేల పూచీకత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చారు జిల్లా న్యాయమూర్తి హెచ్ఎం పట్వర్దన్.
ఇప్పుడు కేతకి థానే సెంట్రల్ జైల నుంచి ఇంటికి వెళ్లవచ్చని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కేతకిపై ఐపీసీ సెక్షన్ 505 (2) (ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం), 500 (పరువు నష్టం), 501 (పరువు నష్టం కలిగించే విషయాన్ని ముద్రించడం, ప్రస్తావించడం), 153 ఏ మతం, జాతి, స్థలం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి కేసులు నమోదయ్యాయి. శరద్ పవార్‌పై అనుచిత పోస్టులు పెట్టిందన్న ఆరోపణలతో నటి కేతకి చితాలే ప్రస్తుతం సుమారు 20కుపైగా ఫిర్యాదులను ఎదుర్కొంటోంది. ఈ కేసు విషయమై పోలీసుల అదుపులో ఉన్నప్పుడు కేతకి చితాలేపై సిరా చుక్కలు చల్లి నిరసన తెలియజేశారు.
చదవండి: కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు..
ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి: సల్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment