Thane district
-
స్కూల్లో చిన్నారులపై దారుణం.. ఆందోళనలతో ఆగిన రైళ్ల రాకపోకలు
థానే: ఓ వైపు ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగిన ఉదంతంపై దేశ వ్యాప్తంగా ఆందోళలు కొనసాగుతున్న వేళ.. మరికొందరు చిన్నారుల పట్ల ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు.ఆగస్టు 16న మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ స్కూల్లో దారుణం జరిగింది. స్కూల్లో చదివే ఇద్దరు బాలికలపై అదే స్కూల్లో క్లీనింగ్ విభాగంలో పనిచేసే ఓ యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. ఈ దారుణం వెలుగులోకి రావడంతో థానే జిల్లా నిరసన కారుల ఆందోళనతో అట్టుడికిపోయింది. #Maharashtra l Parents & residents in #Badlapur protest over the sexual exploitation of 2 minor girls, blocking the railway tracks. The accused sweeper has been arrested & the school has suspended staff & closed for 5 days.#Crime #Thane #WomenSafety#Justice #Assault #Protest pic.twitter.com/RClqTFyvwx— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) August 20, 2024 బాధితుల తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. స్థానిక బద్లాపూర్ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు. దీంతో రైల్వే రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ సంఘటనతో స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. క్లాస్ టీచర్ని తొలగించినప్పటికీ తల్లిదండ్రులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భద్రతకు పూర్తి బాధ్యత వహించడంలో పాఠశాల విఫలమైందని, పాఠశాల యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కాగా, బాధితుల ఆందోళనతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో పాఠశాల భద్రత విషయంలో లోపాలు బయటపడ్డాయి. బాలికల మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు మహిళా అటెండర్లు లేరని తేలింది. స్కూల్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. -
Maharashtra Samruddhi Expressway: నిర్మాణ దశలో ఘోర ప్రమాదం
ముంబై: మహారాష్ట్రలో నిర్మాణంలో ఉన్న సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వంతెనలోని శ్లాబులను యథాస్థానంలో కూర్చోబెట్టేందుకు వినియోగించే గిర్డెర్ లాంఛర్ కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సెగ్మెంట్ లాంచర్(క్రేన్)తో కలుపుకుని దాదాపు 700 టన్నుల బరువైన గిర్డెర్ లాంఛర్ 35 మీటర్ల ఎత్తునుంచి కిందకు కుప్పకూలింది. దీంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది దాని కింద నలిగిపోయారు. ఈ ఘోర దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైను నాగ్‌పూర్‌ను కలుపుతూ 701 కిలోమీటర్ల పొడవైన సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తున్నారు. ముంబైకి 80 కి.మీ.ల దూరంలో థానె జిల్లాలో సార్లాంబే గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రిదాటాక ఈ ఘటన జరిగింది. ఘటనపై నిపుణులతో కూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసినట్లు ఉపముఖ్యమంత్రి ఫడ్నవిస్ చెప్పారు. పోతపోసిన బాక్స్ శ్లాబులను తర్వాతి రోజు నిర్మాణం కోసం సిద్ధంచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేíÙయా ఇస్తామన ప్రధాని ప్రకటించారు. తలో రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. దుర్ఘటన నేపథ్యంలో సంబంధిత ఇద్దరు కాంట్రాక్టర్లపై పోలీసులు కేసు నమోదుచేశారు. మొత్తం ఎక్స్‌ప్రెస్‌వేలో ఇప్పటికే 600 కి.మీ.ల మేర నిర్మాణం పూర్తయి రాకపోకలు సైతం మొదలయ్యాయి. ఈ 101 కి.మీ.ల నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీద గత ఆరు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. -
మహారాష్ట్రలో ఘోరం.. కుప్పకూలిన గిర్డర్ లాంచర్.. 15 మంది మృతి
ముంబై: మహారాష్ట్ర థానే జిల్లాలో దారుణం జరిగింది. షాపూర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక బ్రిడ్జి గిర్డర్ లాంచర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా ముగ్గురు గాయపడ్డారు. మహారాష్ట్ర థానే జిలాలోని షాపూర్ సమీపంలో జరుగుతున్న సమృద్ధి ఎక్స్ ప్రెస్ నిర్మాణం మూడో దశ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బ్రిడ్జిల నిర్మాణానికి ఉపయోగించే గిర్డర్ లాంచర్ సుమారుగా 100 అడుగుల ఎత్తు నుండి కుప్పకూలడంతో 16 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు మాత్రం గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన గురించి తెలుసుకుని పోలీసులు, NDRF, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను, గాయపడినవారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. శిధిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. అంతకుముందు ఆదివారం రోజున బుల్దానా జిల్లాలో 6వ నెంబరు జాతీయ రహదారి మీద ఒక ట్రక్ విధులు నిర్వహిస్తున్న పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన సంఘటన మరువక ముందే మరో ప్రమాదం జరగడం ఇక్కడి వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఆ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 21 మంది గాయపడ్డారు. #UPDATE | Maharashtra: Two NDRF teams are working at the site after a crane fell on the slab of a bridge in Shahapur tehsil of Thane district. Till now 14 dead bodies have been retrieved and 3 have been injured. Another six are feared to be trapped inside the collapsed… https://t.co/3QiIuUwoIP pic.twitter.com/tptIFDfAfb — ANI (@ANI) August 1, 2023 ఇది కూడా చదవండి: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం -
పోలీస్ వ్యాన్‌లో బర్త్ డే జరుపుకున్న ఖైదీ: వైరల్
థానే: ఒక ఖైదీ పోలీస్ వ్యాన్‌లో బర్త్ డే జరుపుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. ఈ ఘటన మహారాష్ట్రలో థానే జిల్లాలో చోటుచేసుకుంది. రోషన్ ఝూ అనే 28 ఏళ్ల నిందితుడు ఒక కేసు విచారణ కోసం కోర్టు వెలుపల నిరీక్షిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. అతను ఒక హత్య కేసులో నిందితుడు, గత నాలుగేళ్లుగా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ మేరకు పోలీసు వ్యాన్‌లో ఉన్న సదరు నిందితుడు రోషన్‌కి అతని అనుచరులు బర్త్ డే కేక్‌ని వ్యాన్ విండ్ వద్ద నుంచి అందించారు. అతను చక్కగా కేక్ కట్ చేసి బర్త్ డే జరుపుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వాట్సాప్ స్టేటస్‌లోనూ, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద దూమరం రేపింది. అయినా ఒక ఖైదీ పోలీసు వ్యాన్‌లో దర్జాగా వేడుకలు జరుపుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు వచ్చాయి. ఐతే జైలు సూపరింటెండెంట్ అధికారులు ఆ నిందితుడు కళ్యాణ్ అధర్వడి జైలులో ఖైదీగా ఉన్నాడని, కేసు విచారణ విషయమై అన్ని ప్రోటోకాల్స్‌ని అనుసరించే బయటకు తీసుకువచ్చామని చెప్పారు. ఆ నిందుతుడిని కోర్టులో హాజరుపర్చేందుకు ప్రత్యేక ఎస్కార్ట్ పోలీసు బృందం తీసుకువెళ్లిందని తెలిపారు. ఆ నిందితుడి కార్యకలాపాలపై ఆ బృందం గట్టి నిఘా ఉంచుతుందని చెప్పారు. ఇది అధికారులకు చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతో కావాలని చేసిన పనిగా అధికారులు పేర్కొన్నారు. పైగా ఆ నిందితుడిని తీసుకువెళ్లిన ఎస్కార్ట్ బృందాన్ని కూడా విచారిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అతనిపై వివిధ పోలీస్స్టేషన్లలో దాడి, హత్యాయత్నం, దోపిడి వంటి ఇతర కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అంతేగాక 2017లో ఒక కానిస్టేబుల్ పై కూడా దాడి చేశాడని చెబుతున్నారు. (చదవండి: అప్పు తీర్చమన్నందుకు హత్య, ఇద్దరికి జీవితఖైదు ) -
Thane District: ఏడున్నరేళ్లుగా చక్రం తిప్పిన షిండే.. పట్టుకోసం బీజేపీ తహతహ!
సాక్షి, ముంబై: గత ఏడున్నర సంవత్సరాలుగా థానే జిల్లా ఇంచార్జి మంత్రిగా కొనసాగిన ఏక్నాథ్ శిండే ఇటీవల ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. దీంతో ఖాళీ అయిన ఆ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాని జిల్లా ఇంచార్జి మంత్రి పదవి తమ ఆధీనంలోకి రావాలని బీజేపీ తహతహలాడుతోంది. అంతేగాకుండా ఇప్పటి నుంచే బీజేపీకి చెందిన పలువురు పైరవీలు చేయడం ప్రారంభించారు. ఇందులో బీజేపీకి చెందిన రవీంద్ర చవాన్, గణేశ్ నాయిక్ పేర్లు ఆగ్రస్ధానంలో ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండేకు సన్నిహితులుగా ఉన్న ప్రతాప్ సర్నాయిక్, బాలాజీ కిణీకర్ పేర్లు కూడా చర్చల్లో ఉన్నాయి. వీరితోపాటు ఆ పదవి దక్కించుకునేందుకు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ పోస్టుపై పోటాపోటీ... ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గం, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. శిందేకు మద్దతిచ్చిన వారిలో థానే జిల్లాకు చెందిన నలుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలున్నారు. మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం హయాంలో జిల్లా వాటాలోకి వచ్చిన రెండింటిలో ఒక కేబినెట్ మంత్రి పదవి తమకు దక్కాలని ఈ ఎమ్మెల్యేలు ఆసక్తితో ఉన్నారు. మరోపక్క బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. మంత్రి పదవి కోసం బీజేపీకి చెందిన గణేశ్ నాయిక్, రవీంద్ర చవాన్, కిసన్ కథోరే అలాగే షిండే వర్గానికి చెందిన ప్రతాప్ సర్నాయిక్, బాలాజీ కిణీకర్ పేర్లు చర్చల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా థాణే జిల్లా ఏక్నాథ్ షిండేకు కంచుకోటగా ఉంది. ఇక్కడ తిరుగులేని నాయకుడిగా ఆయన ఎదిగారు. దీంతో థానే జిల్లాలో షిండే వర్గం ప్రాతినిథ్యం వహించాలని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ప్రతాప్ సర్నాయిక్‌కు ఈ పదవి వరించే అవకాశాలు ఉన్నాయి. చదవండి: స్పైస్ జెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్ ప్రతాప్తోపాటు ఎమ్మెల్యే బాలాజీ కిణీకర్ పేరు కూడా అగ్రస్ధానంలో ఉంది. ముఖ్యంగా కిణీకర్ దళితుడు కావడంతో మంత్రిమండలిలో ప్రాతినిథ్యం వహించే అవకాశం కూడా ఉంది. దీంతో బీజేపీ వర్గయుల్లో కొంత అసంతృప్తి వాతావరణం కనిపిస్తోంది. ఒకప్పుడు బీజేపీ ఆధీనంలో ఉన్న థానే జిల్లా ఇప్పుడు మళ్లీ చేజిక్కించుకునేందుకు ఇదే మంచి అవకాశమని స్ధానిక బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. అందుకు ఎమ్మెల్యే సంజయ్ కేల్కర్, నిరంజన్ డావ్‌ఖరే, గణేశ్ నాయిక్ లేదా కిసన్ కథోరేలను మంత్రిమండలిలో చేర్చుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. మరోపక్క జిల్లా ఇంచార్జి మంత్రి పదవి బీజేపీకి దక్కాలని, ఆ పదవి కోసం రవీంద్ర చవాన్, గణేశ్ నాయిక్ పేర్లు చర్చల్లో ఉన్నాయి. బీజేపీకి చెందిన గణేశ్ నాయిక్కు మంచి అనుభవం ఉంది. ఎన్సీపీకి గుడ్‌బై చెప్పి ఆయన బీజేపీలో చేరారు. అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన్ని కూడా కేబినెట్లో మంత్రిని చేసే అవకాశముంది. అలాగే రవీంద్ర చవాన్ ఫడ్నవీస్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. అంతేగాకుండా ఫడ్నవీస్‌కు చాలా దగ్గరి సన్నిహితుడని పేరుంది. కొంకణ్ రీజియన్‌లో కూడా ఆయనకు మంచి పట్టు ఉంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందేతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో చవాన్‌కు కూడా కేబినెట్లో మంత్రి పదవి కట్టబెట్టి థానే జిల్లా ఇంచార్జి మంత్రిని చేసే అవకాశాలను కూడా తోసిపుచ్చలేమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. -
శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటికి బెయిల్..
Marathi Actress Ketaki Chitale Got Bail Over Post Against Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌ను అవమానకర రీతిలో ప్రస్తావించిందన్న ఆరోపణలో అరెస్టయిన 29 ఏళ్ల మరాఠీ నటి కేతకి చితాలేకు తాజాగా బెయిల్ మంజూరైంది. సోషల్ మీడియా ఫేస్బుక్లో శరద్‌పై అభ్యంతకర పోస్టులు చేసిందన్న కారణంగా కేతకిని మే 14న థానే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన దాదాపు నెల రోజుల తర్వాత మహారాష్ట్ర థానే జిల్లాలోని కోర్టు బుధవారం (జూన్ 22) బెయిల్ జారీ చేసింది. రూ. 20 వేల పూచీకత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చారు జిల్లా న్యాయమూర్తి హెచ్ఎం పట్వర్దన్. ఇప్పుడు కేతకి థానే సెంట్రల్ జైల నుంచి ఇంటికి వెళ్లవచ్చని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కేతకిపై ఐపీసీ సెక్షన్ 505 (2) (ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం), 500 (పరువు నష్టం), 501 (పరువు నష్టం కలిగించే విషయాన్ని ముద్రించడం, ప్రస్తావించడం), 153 ఏ మతం, జాతి, స్థలం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి కేసులు నమోదయ్యాయి. శరద్ పవార్‌పై అనుచిత పోస్టులు పెట్టిందన్న ఆరోపణలతో నటి కేతకి చితాలే ప్రస్తుతం సుమారు 20కుపైగా ఫిర్యాదులను ఎదుర్కొంటోంది. ఈ కేసు విషయమై పోలీసుల అదుపులో ఉన్నప్పుడు కేతకి చితాలేపై సిరా చుక్కలు చల్లి నిరసన తెలియజేశారు. చదవండి: కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి: సల్మాన్ ఖాన్ -
కసాయి కొడుకు...కన్న తల్లిదండ్రులనే కడతేర్చి... సోదరికి కాల్ చేసి మరీ...
నేటి యువత ప్రస్తుత టెక్నాలజీ మాయలో పడి తల్లిదండ్రుల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం తల్లిదండ్రులుగా వారికి మందలించే హక్కు కూడా లేదనే చెప్పాలి. ఆస్తి కోసమో లేక వారికి నచ్చింది చేయడం లేదనో కన్న తల్లిదండ్రుల పైనే కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారు. మరికొంతమంది ప్రబుద్ధులైతే తల్లిదండ్రులనే కడతేర్చేందుకు రెడీ అయిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడోక దుర్మార్గుడు కన్నతల్లిదండ్రులను చంపి, సోదరికి ఫోన్ చేసి మరీ చెప్పాడు. వివరాల్లోకెళ్తే.... మహారాష్ట్రలోని థానే జిల్లాలోని టిట్వాలా ప్రాంతంలో 37 ఏళ్ల అన్మోల్ భోంస్లే తన కన్న తల్లిదండ్రలనే కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తన సోదరికి ఫోన్ చేసి మరీ విషయం చెప్పాడు. దీంతో అతని సోదరి హుటాహటినా ఇంటికి వచ్చి చూడగా...తల్లిదండ్రులిద్దరూ రక్తపుమడుగులో పడి ఉన్నారు. ఇల్లంతా దుర్వాసన రావడమే కాకుండా అన్మోల్ కూడా ఆ మృతదేహాల పక్కనే కూర్చొని ఉన్నాడు. ఈ మేరకు ఆమె అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో దంపతులను కత్తితో పొడిచి చంపినట్లు తెలిసింని పోలీసులు చెప్పారు. మృతులు అశోక్ భోంస్లే (55), ఆయన భార్య విజయ భోంస్లే (50)గా గుర్తించామని తెలిపారు. (చదవండి: అడిగినంత లంచం ఇవ్వాలి.. లేదంటే నీ సంగతి చెప్తా) -
బర్డ్ ఫ్లూ కలకలం.. వందల సంఖ్యలో కోళ్లు మృతి
సాక్షి, ముంబై: మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం ప్రజలను, అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. బర్డ్ ఫ్లూ కారణంగా షాహాపూర్‌లోని వెహ్లోలి గ్రామంలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు చనిపోయిన కోళ్లకు సంబంధించిన నమూనాలను పూణేలోని ల్యాబ్‌కు పంపించారు. ఇదిలా ఉండగా.. H5N1 ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా కారణంగానే అక్కడ కోళ్లు చనిపోయినట్టు థానే జడ్పీ సీఈవో డా. బహుసాహెబ్ దంగ్డే తెలిపారు. ఈ క్రమంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కట్టడి కోసం అధికారులు రంగంలోకి దిగారు. సదరు పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్లతో సహా.. ఆ కోళ్ల ఫారమ్‌కు కిలోమీటర్ పరిధిలో ఉన్న పౌల్ట్రీ ఫామ్‌లోని దాదాపు 25,000 కోళ్లను చంపేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అయితే, బర్డ్ ఫ్లూ వెలుగులోకి రావడంతో థానే సరిహద్దు జిల్లాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ పౌల్ట్రీ ఫామ్‌ల్లోని కోళ్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ ఫామ్‌ల నిర్వాహకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా దాదాపుగా ప్రతీ ఏటా దేశంలో ఏదో ఒక చోట బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. కాగా, బర్డ్ ఫ్లూ కారణంగా గతేడాది జూలైలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఓ బాలుడు(12) చనిపోయాడు. -
స్లాబ్ కూలి భవనానికి పెద్ద రంధ్రం: ఏడుగురు మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ఐదంతస్తుల భవనంలోని స్లాబ్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్‌కు కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఉల్హాస్‌నగర్‌లోని నెహ్రూ చౌక్ వద్ద ఉన్న సాయిసిద్ధి అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తులో స్లాబ్ కుప్పకూలింది. సహాయ చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానికులు ఆ స్లాబ్ కూలి అది కిందపడి మిగతా అంతస్తుల్లోని కొన్ని ప్లాట్లు కూడా కుప్పకూలాయి. దీంతో అపార్ట్‌మెంట్‌కు పెద్ద రంధ్రం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన (ఎన్డీఆర్ఎఫ్) బృందం స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టింది. భవనం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మృతి చెందారని ఉల్లాస్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
కుప్పకూలిన భవనం.. 17 మంది దుర్మరణం
సాక్షి ముంబై: మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని మూడంతస్తుల భవనం నేలమట్టం కావడంతో అందులోని 17 మంది మృతి చెందారు. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు ఏడుగురు ఉన్నారు. ఈ సంఘటనలో 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. భివండీ ధామన్కర్నాకా పటేల్ కాంపౌండ్ ప్రాంతంలోని మూడంతస్తుల భవనం సోమవారం వేకువజామున 3.15 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. అంతా గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని వారు ఉలిక్కిపడ్డారు. బాధితుల హాహాకారాలు విని ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ ఘటన స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపాదికపై సహాయక చర్యలు ప్రారంభించారు. ఉదయం 11 గంటల సమయానికి 13 మందిని శిథిలాల నుంచి కాపాడగలిగారు. సహాయక చర్యలు సోమవారం రాత్రి వరకు కొనసాగాయి. సాయంత్రం 6.15 గంటల వరకు అందిన వివరాల మేరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. బాధితుల్లో చాలా మంది తీవ్రంగా గాయపడటంతో వారందరికీ వెంటనే ఆస్పత్రులకు తరలించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుపోయి∙ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు 43 ఏళ్లనాటి ఈ శిథిల భవనం ప్రమాదకరమైందంటూ భివండీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. 40 ఫ్లాట్లున్న ఈ భవనంలో 150 మంది వరకు నివాసం ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల సాయం ప్రకటించింది. అధికారులు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను సస్పెండ్ చేశారు. భివండీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. -
కరోనా: థానే కలకలం.. కోయంబేడు కలవరం
కర్నూలు(సెంట్రల్): కరోనా కట్టడికి పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్న జిల్లా అధికార యంత్రాంగానికి మరో కొత్త చిక్కు వచ్చి పడింది. మహారాష్ట్రలోని థానే నుంచి జిల్లాకు తిరిగొచ్చిన వలస కూలీల్లో 37 మందికి కరోనా పాజిటివ్ రావడం, చెన్నైలోని అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ ‘కోయంబేడు’కు వెళ్లొచ్చిన వారిలో 104 మంది ఆచూకీ గల్లంతు కావడంపై అధికారుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో వెంటనే అలర్ట్ అయ్యి.. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వస్తున్న వలసదారులపై గట్టి నిఘా వేయాలని నిర్ణయించారు. మహారాష్ట్రలోని థానే నుంచి ప్రత్యేక రైలులో 930 మంది వలస కూలీలు మంగళవారం రాత్రి గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. (అందరి ఆర్యోగానికి భరోసా) వీరిలో అత్యధిక మంది కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వారే. వీరిలో ఇప్పటివరకు 250 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 38 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో 37 మంది కర్నూలు జిల్లావాసులు కాగా.. మిగిలిన ఒక్కరూ కడప వాసి. మిగిలిన వారందరికీ పరీక్షలు కొనసాగుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారిని జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు థానే సమీపంలోని చేపల మార్కెట్లో కూలీలుగా పని చేసినట్లు గుర్తించారు. కాగా, రెండు వారాల క్రితం ముంబై నుంచి జిల్లాకు 254 మంది వలస కూలీలు తిరిగొచ్చారు. వీరిలో ఒక్కరూ కరోనా బారిన పడకపోవడం విశేషం. (కువైట్ నుంచి వలస కార్మికులను రప్పించండి) అంతటా అప్రమత్తం వలస కూలీలను ప్రభుత్వమే స్వస్థలాలకు తీసుకొస్తుండడంతో వారిని ముందుగా క్వారంటైన్లకు తరలించి.. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన తరువాతే ఇళ్లకు పంపుతున్నారు. అయితే.. కొందరు అనధికారికంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వస్తున్నారు. వీరు ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండానే నేరుగా వస్తుండడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీరు ఇప్పటికే కరోనా బారిన పడి ఉంటే వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లోకి గానీ, పట్టణాల్లోకి గానీ ఎక్కడి నుంచైనా వలసదారులు వస్తే సమాచారం సేకరించాలని ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా నేరుగా రాష్ట్ర హెల్ప్‌లైన్ నంబర్ 104 లేదా 1902కు ఫోన్ చేయొచ్చని సూచిస్తున్నారు. (ఆత్మబంధువులైన అన్నదాతలకు: సీఎం జగన్ లేఖ) 104 మంది ఎక్కడ? చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ ప్రస్తుతం కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. అక్కడ పనిచేసేందుకు జిల్లాకు చెందిన కూలీలు 494 మంది వెళ్లారు. ప్రస్తుతం మార్కెట్‌ను మూసేయడంతో వారందరూ తిరిగొచ్చారు. వారిలో 390 మందిని మాత్రమే క్వారంటైన్ చేశారు. మిగిలిన 104 మంది ఆచూకీ తెలియడం లేదు. వీరు ఎక్కడున్నారో కనుగొనాలని అధికార యంత్రాంగం పోలీసులకు కాల్ డేటా అంద జేసింది. ఎక్కడి నుంచి వచ్చినా క్వారంటైన్లో ఉండాల్సిందే.. వలస కూలీలు ఎక్కడి నుంచి వచ్చినా 14 రోజులు క్వారంటైన్లో ఉండేలా కలెక్టర్ వీరపాండియన్ చర్యలు చేపట్టారు. అక్కడ వారికి భోజనం, ఇతర సదుపాయాలు, వైద్యసేవలను కల్పిస్తున్నారు. కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చిన తరువాతే ఇళ్లకు పంపేలా ఏర్పాట్లు చేశారు. ఆదోని డివిజన్‌పై ప్రత్యేక శ్రద్ధ ఆదోని రెవెన్యూ డివిజన్లోని 16 మండలాలకు చెందిన వారు ఎక్కువగా ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. ప్రస్తుతం వీరు తిరిగొస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే కలెక్టర్ రెండుసార్లు ఆదోనిలో పర్యటించారు. టిడ్కో హౌసింగ్ సొసైటీలో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ సెంటర్‌ను త్వరగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. -
20 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై తన ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా రాష్ట్రంలో 20 రోజుల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. థానే జిల్లాలోని కల్యాణ్ టౌన్‌కు చెందిన 20 రోజుల శిశువు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. (చదవండి : భారత్‌లో పంజా విసురుతున్న కరోనా) శిశువుతో పాటు మరో ఆరుగురికి కూడా కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 162కే చేరింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందినట్లు మున్సిపాలిటీ ఆరోగ్య అధికారి డా. రాజు తెలిపారు.మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఇప్పటివరకు 9,915 కరోనా కేసులు నమోదుకాగా, మొత్తం 432 మంది మరణించారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 1074 మంది మృతి చెందారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కరోనా : వారి అనుమానం అతని ప్రాణం తీసింది
థానే : ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి వల్ల కొంతమంది ప్రాణాలు అనవసరంగా పోతున్నాయి. సాధారణంగా రోడ్డు మీద ఎవరైనా నడుచుకుంటూ వెళుతూ కాస్త దగ్గినా వారిని అనుమానుంగానే చూస్తున్నారు. ఎంతలా అంటే ఒక్కోసారి తమ విచక్షణ కోల్పోయి అవతలి వ్యక్తి ప్రాణాలను కూడా తీసేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. థానేలోని కళ్యాణ్ పట్టణంకు చెందిన గణేష్ గుప్తా ఇంట్లో సరుకులు అవసరం పడడంతో బుధవారం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. థానే ఏరియాలో లాక్డౌన్ కట్టదిట్టంగా ఉండడంతో పోలీసులు పట్టుకుంటే ప్రశ్నల వర్షం కురిపిస్తారని భావించిన గణేష్ వారి కంట పడకుండా వేరే సందులోంచి వెళ్లాడు. అయితే కొద్దిదూరం నడిచిన తర్వాత గణేశ్ విపరీతంగా దగ్గడంతో పక్క నుంచి వెళుతున్న కొంతమంది వ్యక్తులు కరోనా ఉందోమోనని భావించారు. దీంతో ఒక్కసారిగా గణేశ్‌పై దాడి చేసి విపరీతంగా కొట్టారు. అయితే ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న పెద్ద కాలువలో జారిపడి గణేష్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. (ఈ వింత జీవి పేరేంటో మీకు తెలుసా?) (కరోనా వస్తుందేమోనని కోడిగుడ్లు పూడ్చేశారు) -
కొత్తజిల్లాకు పచ్చజెండా
సాక్షి, ముంబై: సుదీర్ఘ స్వప్నం సాకారమైంది. ఎట్టకేలకు ఠాణే జిల్లా విభజనకు కేబినెట్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీంతో రాష్ట్రంలో 36వ జిల్లాగా పాల్ఘర్ ఆవిర్భవించనుంది. కొత్తగా ఏర్పడనున్న ఈ జిల్లాలో ఎనిమిది తాలూకాలుంటాయి. పాల్ఘర్, జవహర్, మొఖాడా, తలసారి, వసయి, వాడా, డహణు, విక్రమ్‌గఢ్ తాలూకాలు పాల్ఘర్ జిల్లాలో ఉంటాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇక ఠాణే జిల్లా ఏడు తాలూకాలకే పరిమితం కానుందని, ఠాణే, కల్యాణ్, అంబర్నాథ్, ఉల్హాస్నగర్, భివండీ, ముర్బాద్, షాహాపూర్ తాలూకాలు ఠాణే జిల్లాలో ఉండనున్నాయని, పాల్ఘర్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 450 కోట్లు కేటాయించనుందని చెప్పారు. కొత్తగా ఏర్పాటు కానున్న పాల్ఘర్ జిల్లా ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశముందని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండున్నర నెలల సమయం పడుతుందన్నారు. జిల్లాల విభజన అంశం శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చినా మిగతా జిల్లాల విభజన జోలికి పోకుండా కేవలం ఠాణే జిల్లా విభజనకే సమావేశాలను పరిమితం చేశారని, ఇతర నిర్ణయాలేవీ తీసుకోలేదన్నారు. ఉపాధి హామీ పథకం అమలు మంత్రి నితిన్ రావుత్ ఈ విషయాన్ని కేబినెట్ సమావేశంలో లేవనెత్తగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుపరిపాలనకు మార్గం సులభం... కొత్త జిల్లా ఏర్పాటు కావడంతో పాల్ఘర్ పరిసర తాలూకాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరనుంది. ఇప్పటిదాకా ఏ అవసరం పడినా జిల్లా కేంద్రమైన ఠాణే వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా పాల్ఘర్లోనే అన్ని అవసరాలు తీరే అవకాశముంది. పైగా ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు రూ. 450 కోట్లు కేటాయించనుండడంతో పాల్ఘర్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల స్వరూపమే మారిపోయే అవకాశముంది. ఠాణే జిల్లాను విభజించాల్సిన అవసరం ఎంతైన ఉందని 1985లో అప్పటి ముఖ్యమంత్రి శరద్‌పవార్ ఈ అంశాన్ని లేవనెత్తారు. అప్పటి నుంచి శాసనసభ ఎన్నికలు సమీపించగానే ఈ అంశం తెరమీదకు వచ్చేది. ఆ తరువాత అటకెక్కేది. కాని ఠాణే జిల్లాకు వలసలు పెరిగిపోవడం, ఉపాధి కారణంగా జనాభా విపరీతంగా పెరిగిపోవడం మొదలైంది. దీంతో 9,558 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ జిల్లాను విభజించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు అనేక ఆందోళనలు, ఆమరణ నిరాహార దీక్షలు జరిగాయి. కొందరైతే దీన్ని మూడు జిల్లాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం రాష్ట్రప్రభుత్వం స్వయంగా చొరవ తీసుకొని 2013 మే ఒకటో తేదీ వరకు విభజిస్తామని ప్రకటించింది. కాని కాంగ్రెస్, మిత్రపక్షమైన ఎన్సీపీ మధ్య నెలకొన్న విభేదాల కారణంగా విభజన అంశం వాయిదా పడుతూ వచ్చింది. ఆ తరువాత 2014 ఆగస్టు 15లోపు ఠాణేను విభజించి తీరుతామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ హామీ ఇచ్చారు. దీంతో విభజన ప్రక్రియ పనులు వేగం పుంజుకున్నాయి. ఇదిలావుండగా సభాపతి శివాజీరావ్ దేశ్‌ముఖ్ అధ్యక్షతన ఇటీవలే అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో వివాదాస్పద అంశాలన్నింటినీ పరిష్కరించడంతో మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం కేబినెట్ సమావేశంలో విభజన ప్రక్రియకు ఆమోదముద్రవేశారు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ విభజన ప్రక్రియను ఏ రాజకీయ పార్టీ అడ్డుకునే ప్రసక్తే లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో త్వరలో పాల్ఘర్ 36వ జిల్లాగా అవతరించనుంది. కాగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో విభజన కీర్తి దక్కించుకునేందుకు అధికార పార్టీలు, ప్రతిపక్షం ప్రచార సభల్లో పోటీ పడనున్నాయి. రైతుల విద్యుత్ బకాయిలు సగం మాఫీ: సర్కార్ విద్యుత్ బకాయిల విషయంలో రైతులకు ఊరట కల్పించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తీసుకుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు రైతుల విద్యుత్ బిల్లులో సగం మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటిదాకా సగం చెల్లించినవారు ఇకపై చెల్లించనక్కరలేదని, అసలు చెల్లించనివారు సగం చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇది జరిమానాలతో కలిపి వర్తిస్తుందని, చెల్లించలేని స్థితిలో ఉన్నవారు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలలపాటు మూడు వాయిదాల్లో చెల్లించాలని ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ అసెంబ్లీలో ప్రకటించారు. గురువారం కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇదిలాఉండగా కాంగ్రెస్-ఎన్సీపీ నేతృత్వంలో ప్రభుత్వం రాష్ట్రా న్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే ఆరోపించారు. -
తుపాకీతో బెదిరించి మహిళపై అత్యాచారం
థానే: తుపాకీతో బెదిరించి మహిళపై దుండగుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తలపై తుపాకీ పెట్టి బెదిరించి దుండగుడు తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు నావఘర్ పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు. భయాందర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఏటీఎం ఎదురుగా ఉన్న ప్రాంతంలో శనివారం సాయంత్రం 2.30 నుంచి 5 గంటల మధ్య ఈ దురాగతం జరిగిందని వెల్లడించారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపి, కేసు నమోదు చేసినట్టు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. -
వితంతువుపై సామూహిక అత్యాచారం
ముంబై: మహారాష్ట్రలోని 30 ఏళ్ల వితంతువుపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. థానే జిల్లాలోని కళ్యాణ్-గోవా నాకా ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ముంబై నుంచి అపహరించుకుపోయి శుక్రవారం రాత్రి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితుల్లోని ఒకరి ఇంటికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఇద్దరిని రాజకుమార్ చౌదరీ, నాగోరి చౌదరీగా గుర్తించారు. రాజకుమార్ సోదరుడిపై గతంలో బాధితురాలు కేసు పెట్టింది. ఈ విషయమై మాట్లాడదాం రమ్మంటూ తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం జరిపినట్టు పోలీసులు తెలిపారు. -
పట్టపగలే నాలుగు హత్యలు!!
మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఒకేరోజు పట్టపగలు నాలుగు హత్యలు జరిగాయి. హతుల్లో ఇద్దరు గృహిణులు కూడా ఉన్నారు. గంగ్రిపాద ప్రాంతంలో ఐదారుగురు వ్యక్తులు పాతికేళ్ల యువకుడిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. కరెంటు స్తంభానికి కొట్టేసి మరీ ఈ ఘాతుకానికి పాల్పడటంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. మరో మూడు సంఘటనలు థానె పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగాయి. కాన్ గ్రామంలో 32 ఏళ్ల తరన్నుమ్ అస్లాంఖాన్ అనే మహిళను ఆమె భర్త చంపేసి, గోనెసంచిలో శవాన్ని కట్టేసి, ఓ పైప్‌లైను వద్ద విసిరేశాడు. బద్లాపూర్ రైల్వేస్టేషన్ వద్ద రాత్రి 10.40 గంటల ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఏజెంటు ఒకరిని కాల్చిచంపారు. సంతోష్ సాల్వి తన స్నేహితుడితో కలిసి మద్యం తాగుతుండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వెంటనే మహేంద్ర భాగుల్ అనే ఆ స్నేహితుడు కాల్చిచంపాడు. లవ్‌కుశ్ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో నివిసించే పూనమ్ గజ్రానీ అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. గ్యాస్ సిలిండర్‌తో ఆమె తలపై మోది, కత్తులతో పొడిచి, గొంతుకు వైరు బిగించి మరీ చంపారు. -
8మంది సజీవ దహనం
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సాక్షి, ముంబై/వరంగల్, న్యూస్‌లైన్: మరో వోల్వో బస్సు అగ్నికి ఆహుతైంది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో బుధవారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది నిద్రలోనే సజీవ దహనమయ్యారు. మరో 14 మంది గాయపడ్డారు. మృతుల్లో వరంగల్ జిల్లా ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన సానికొమ్ము శ్రీనివాస్‌రెడ్డి ఉన్నట్లు భావిస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పాల్ఘర్ తాలూకా మనోరా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణే నుంచి 36 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్‌కు వెళ్తున్న ప్రైవేట్ వోల్వో లగ్జరీ బస్సు తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పాల్ఘర్-మనోరా గ్రామాల మధ్య నిలిచి ఉన్న భారత్ పెట్రోలియం డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ట్యాంకర్‌కు ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. అదే సమయంలో వోల్వో వెనకాల వేగంగా వస్తున్న ఓ కారు.. వోల్వోను ఢీకొని, దాని కిందికి దూరి చిక్కుకుపోయింది. వెంటనే బస్సుకు, కారుకు మంటలు అంటుకున్నాయి. ప్రయాణికులు నిద్రలో ఉండడంతో ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోయారు. ట్యాంకర్‌ను ఢీకొన్నాక భారీ శబ్దం రావడంతో లేచినవారు బయటపడేందుకు ప్రయత్నించేలోపే బస్సును కారు ఢీకొట్టడంతో కిందపడ్డారు. ఇదే సమయంలో బస్సులో మంటలు, పొగ దట్టంగా వ్యాపించాయి. అగ్నికీలలకు ఎనిమిది మంది అసువులు బాశారు. మరో 11 మంది గాయపడ్డారు. మిగతా 17 మంది సురక్షితంగా తప్పించుకున్నారు. మంటల ధాటికి బస్సు మొత్తం కాలిపోయింది. కారులోని ప్రయాణికులు బయటకు దూకేసినప్పటికీ అందులోని ముగ్గురు గాయపడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టనంతగా కాలిపోయాయి. క్షతగాత్రుల్లో కొందరిని ముంబై, స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కంపెనీ పనిపై వెళ్తూ: మృతుల్లో వరంగల్ జిల్లావాసి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నట్లు భావిస్తున్నారు. క్షతగాత్రుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే మృతదేహం ఏది అన్నది డీఎన్ఏ పరీక్షల్లో తేలనుంది. శ్రీనివాస్ ముంబైలోని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివారు. కంపెనీ పనిపై పుణే నుంచి అహ్మదాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. -
డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..
-
డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు: ఆరుగురు మృతి
అనంతపురం జిల్లాలో నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన మరవక ముందే మరో దుర్ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని థానే జిల్లా ధాను రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో బాంద్రా- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మూడు బోగీల్లోకి మంటలు వ్యాపించడంతో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. S-2, S-3, S-4 బోగీల్లో మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగతో ఊపిరి ఆడక ఆరుగురు సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే మూడు బోగీలు దగ్ధమయ్యాయి. డెహ్రాడూన్ నుంచి రైలు ముంబైకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ప్రయాణీకులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఓ బోగిలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మరో రెండు బోగిలకు త్వరితగతిన వ్యాపించాయని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారని అధికార ప్రతినిధి వెల్లడించారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారని తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. డెహ్రాడూన్ నుంచి ముంబయి వెళ్తుండగా ఈ రోజు తెల్లవారుజామున 2.30 నిమిషాలకు ఆ ప్రమాదం చోటు చేసుకుందని రైల్వే అధికార ప్రతినిధి వివరించారు. ప్రయాణికుల వివరాల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు 022-23011853, 022-23007388 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.