వితంతువుపై సామూహిక అత్యాచారం | widow gangraped by four at Kalyan | Sakshi
Sakshi News home page

వితంతువుపై సామూహిక అత్యాచారం

Published Wed, May 7 2014 3:52 PM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

వితంతువుపై సామూహిక అత్యాచారం

వితంతువుపై సామూహిక అత్యాచారం

ముంబై: మహారాష్ట్రలోని 30 ఏళ్ల వితంతువుపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. థానే జిల్లాలోని కళ్యాణ్-గోవా నాకా ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ముంబై నుంచి అపహరించుకుపోయి శుక్రవారం రాత్రి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

నలుగురు నిందితుల్లోని ఒకరి ఇంటికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఇద్దరిని రాజకుమార్ చౌదరీ,  నాగోరి చౌదరీగా గుర్తించారు. రాజకుమార్ సోదరుడిపై గతంలో బాధితురాలు కేసు పెట్టింది. ఈ విషయమై మాట్లాడదాం రమ్మంటూ తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం జరిపినట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement