ముంబై: మహారాష్ట్రలో నిర్మాణంలో ఉన్న సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వంతెనలోని శ్లాబులను యథాస్థానంలో కూర్చోబెట్టేందుకు వినియోగించే గిర్డెర్ లాంఛర్ కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సెగ్మెంట్ లాంచర్(క్రేన్)తో కలుపుకుని దాదాపు 700 టన్నుల బరువైన గిర్డెర్ లాంఛర్ 35 మీటర్ల ఎత్తునుంచి కిందకు కుప్పకూలింది. దీంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది దాని కింద నలిగిపోయారు. ఈ ఘోర దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైను నాగ్‌పూర్‌ను కలుపుతూ 701 కిలోమీటర్ల పొడవైన సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తున్నారు.
ముంబైకి 80 కి.మీ.ల దూరంలో థానె జిల్లాలో సార్లాంబే గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రిదాటాక ఈ ఘటన జరిగింది. ఘటనపై నిపుణులతో కూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసినట్లు ఉపముఖ్యమంత్రి ఫడ్నవిస్ చెప్పారు. పోతపోసిన బాక్స్ శ్లాబులను తర్వాతి రోజు నిర్మాణం కోసం సిద్ధంచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేíÙయా ఇస్తామన ప్రధాని ప్రకటించారు. తలో రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చెప్పారు. దుర్ఘటన నేపథ్యంలో సంబంధిత ఇద్దరు కాంట్రాక్టర్లపై పోలీసులు కేసు నమోదుచేశారు. మొత్తం ఎక్స్‌ప్రెస్‌వేలో ఇప్పటికే 600 కి.మీ.ల మేర నిర్మాణం పూర్తయి రాకపోకలు సైతం మొదలయ్యాయి. ఈ 101 కి.మీ.ల నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీద గత ఆరు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 88 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment