Expressway
-
ఉత్తర ‘రింగు’కు అటవీ అనుమతులు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి అటవీ అనుమతులు మంజూరయ్యాయి. ఈ నెలాఖరుకు గాని జనవరి మొదటి వారంలో గాని ఈ రోడ్డుకు టెండర్లు పిలిచేందుకు ఎన్హెచ్ఏఐ సిద్ధమవుతున్న సమయంలో అటవీ అనుమతులకు సంబంధించిన ఇబ్బంది తొలగిపోయినట్టయ్యింది. ఇక పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. అవి కూడా వస్తే ఈ రోడ్డుకు ఎక్స్‌ప్రెస్ వే నంబర్ కేటాయింపు సులభవుతుంది. ఆ నంబర్ వస్తేనే టెండర్లు తెరిచేందుకు వీలుంటుంది. మెదక్ జిల్లా పరిధిలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లా పరిధిలో 28.2544 హెక్టార్లు, యాదాద్రి జిల్లాలో 8.511 హెక్టార్లు .. వెరసి 72.3536 హెక్టార్ల అటవీ భూమిని ఉత్తర రింగు అలైన్మెంటులో భాగంగా సేకరించనున్నారు. ఇందుకు ప్రతిగా అటవీ శాఖకు వేరే ప్రాంతంలో అంతే మొత్తం భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. సేకరించే అటవీ భూమిలో కోల్పోయే చెట్లకు పరిహారంతో పాటు, కొత్తగా పొందే భూమిలో అటవీ శాఖ చెట్ల పెంపకానికి అయ్యే ఖర్చును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ భాగానికి కావాల్సిన భూమిలో 90 శాతం సేకరణ ప్రక్రియ పూర్తయింది. త్వరలో అవార్డులు పాస్ చేయటం ద్వారా భూ యజమానులకు పరిహారం చెల్లించనున్నారు.అనుమతి లేఖ అందింది: మంత్రి కోమటిరెడ్డిట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి 72.3536 హెక్టార్ల అటవీ భూమి స్వాధీనానికి అనుమతిస్తూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ కైలాష్ భీమ్రావ్ భవర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తర భాగం రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి భారతమాల పరియోజన కింద అనుమతి ఇస్తున్నట్టుగా లేఖలో పేర్కొనట్టు వెల్లడించారు. పర్యావరణ నిబంధనలకు లోబడి భూసేకరణ చేస్తామని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు తెలిపామని పేర్కొన్నారు. -
పోలీస్ పహారా కాస్తేనే.. ఎక్స్‌ప్రెస్‌వే పనులు
అదో ఎక్స్‌ప్రెస్ వే.. పూర్తి గ్రీన్ ఫీల్డ్ హైవే.. మరో ఆరేడునెలల్లో నాలుగు వరసల ఆ రోడ్డు అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ, రెండు కీలక ప్రాంతాల్లో పని మొదలు కాలేదు, ఏడాదిన్నరగా అలాగే ఉండిపోయింది.. ఇప్పుడు ఆ రోడ్డు పనులు పూర్తి కావాలంటే పోలీసు పహారా అవసరం ఏర్పడింది. స్వయంగా ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి వచ్చి మరీ ముఖ్యమంత్రిని భద్రత కోరాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 4 గంటల మేర తగ్గించే కీలక రోడ్డుకు ఇప్పుడు పోలీసు భద్రత అవసరం పడింది. మిగతాచోట్ల పనులు దాదాపు పూర్తి కాగా, రెండు కీలక ప్రాంతాల్లో స్థానికులతో పేచీ ఏర్పడింది. ఒకచోట అయితే, పలుకుబడి కలిగిన ఓ వ్యక్తే పనిని అడ్డుకున్నాడు. ఏడాదిన్నరగా ఇదే సమస్య. దీంతో ఈ పనిని ముందుకు తీసుకెళ్లాలంటే రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలంటూ ఢిల్లీ ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు కోరాల్సి వచ్చింది. పోలీసు భద్రత కల్పిస్తే పనులు చేస్తామని లిఖితపూర్వకంగా రాష్ట్రప్రభుత్వానికి విన్నవించారు. ∙హైదరాబాద్–విశాఖపట్నం జాతీయ రహదారి లో ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు మూ డేళ్ల క్రితం ఎన్హెచ్ఏఐ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఖమ్మం పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు కొత్త యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రతిపాదించింది. 162. 12 కి.మీ. నిడివి ఉండే ఈ నాలుగు వరసల రోడ్డు నిర్మాణాన్ని రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. రోడ్డు పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. వచ్చే మార్చి నాటికి ఇది అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ, ఖమ్మం పట్టణం శివారులోని ధ్వంసలాపురం, చింతకాని మండలంలోని కొదుమూరు వద్ద అసలు పనులే ప్రారంభం కాలేదు. సమస్య ఏమిటంటే.. ఖమ్మం శివారులోని ధ్వంసలాపురం వద్ద ఈ రోడ్డుకు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఖమ్మం–బోనకల్ రోడ్డు, ౖరైల్వే లైన్, మున్నేరు సమాంతరంగా ఉన్నాయి. ఇక్కడ ఓవైపు మున్నేరు మీద 100 మీట ర్ల నిడివి వంతెన, మరోవైపు 150 మీటర్ల పొడవైన రైల్ ఓవర్‌బ్రిడ్డి నిర్మించాల్సి ఉంది. ఈ 2 వంతెనల నిర్మాణం నేపథ్యంలో, ధ్వంసలాపురం వద్ద ప్రతిపాదిత ఎక్స్‌ప్రెస్‌వే ఎత్తు ఏకంగా 14 మీటర్లుగా ఉంటుంది. అక్కడ పట్టణంలోకి వెళ్లేందుకు, పట్ట ణంలోని వాహనాలు ఈ రోడ్డు మీదకు వచ్చేందు కు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, అంత ఎత్తుండే రోడ్డు నుంచి ఈ అనుసంధానం కావాలంటే కిలోమీటరున్నర స్థలం అవసరం. కానీ అక్కడ కేవలం 350 మీటర్ల నిడివి మాత్రమే ఉ న్నందున అది సాధ్యం కాదని ఎన్హెచ్ఐఏ తేల్చే సింది. దీంతో స్థానికులు ఆ రెండు వంతెనల నిర్మా ణాన్ని ప్రారంభం కాకుండా అడ్డుకుంటూ వస్తున్నా రు. ఇక.. చింతకాని మండలం కొదుమూరు వద్ద సర్వీసు రోడ్డు నిర్మించాలని కొందరు అడ్డుకుంటున్నారు. యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సర్వీసు రోడ్డు నిర్మించరు.అండర్‌పాస్‌లు మాత్రమే ఉంటాయి. కానీ, సర్వీసు రోడ్డు నిర్మిస్తే తమ భూము ల ధరలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఒకరిద్దరు స్థానికులను రెచ్చగొడుతున్నారు. సర్వీసు రోడ్డు నిర్మిస్తే దాని వెంబడి నిర్మాణాలు, వాణిజ్య కట్టడాలు వెలిసి ఎక్స్‌ప్రెస్‌వే ప్రయోజనం నెరవేరద న్నది అధికారుల మాట. ఇలా ఏడాదిన్నరగా ఈ రెండు ప్రాంతల్లో అసలు పనులే మొదలు కాలేదు. ఏం చేయాలనే దానిపై ప్రభుత్వ పరిశీలన పోలీసు బలగాలను కేటాయిస్తే ఆ రెండు చోట్ల పనులు నిర్వహిస్తామని ఎన్హెచ్ఏఐ పేర్కొంటోంది. ఈ రెండు అడ్డంకుల వల్ల హైదరాబాద్– విశాఖపట్నం మధ్య ప్రయా ణ సమయాన్ని తగ్గించాలన్న ప్రయత్నానికే విఘాతం కలిగిందని తాజాగా ఎన్హెచ్ఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన ఎన్హెచ్ఐఏ ఢిల్లీ అధికారులు ఈ మేరకు సహకరించాలని కోరారు. ఈ రోడ్డు పనులకు పోలీసు భద్రత క ల్పించటమా, స్థానికుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని మధ్యే మార్గంగా మార్పులు చేయటమా అన్న విషయాన్ని ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం పరిశీలిస్తోంది.. -
22ఏళ్ళ క్రితం నిర్మించారు.. ఇప్పటికీ అక్కడ టోల్ ట్యాక్స్ ఎక్కువే!
ఎక్స్‌ప్రెస్‌వే లేదా హైవేలలో ప్రయాణిస్తే టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిందే. అయితే దేశంలో ఎక్కడైనా టోల్ ట్యాక్స్ ఒకేలా ఉంటుంది. కానీ మన దేశంలోని ఓ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ప్రయాణించాలంటే కొంత ఎక్కువ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ ఎక్స్‌ప్రెస్‌వే ఏది? సాధారణ హైవే మీదకంటే ఇక్కడ ఎంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.దేశంలో అత్యంత ఖరీదైన ఎక్స్‌ప్రెస్‌వే ఏది అంటే చాలామంది చెప్పే సమాధానం 'ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే'. దీన్ని 22 సంవత్సరాల క్రితం నిర్మించారు. కాబట్టి దేశంలో అతి పురాతనమైన, మొదటి ఎక్స్‌ప్రెస్‌వేగా దీన్ని పరిగణిస్తారు. 2002లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నిర్మించారు. ఈ రహదారి మహారాష్ట్రలోని అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ఒకటైన ముంబైని పూణేకి కలుపుతుంది.ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే అనేది దేశంలోనే మొదటి 6 లేన్ల రోడ్ కూడా. ఈ రోడ్డు నిర్మాణానికి అప్పట్లో రూ. 163000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీని పొడవు 94.5 కిలోమీటర్లు. ఇది నవీ ముంబైలోని కలంబోలి ప్రాంతం నుంచి ప్రారంభమై పూణేలోని కివాలే వద్ద ముగుస్తుంది. దీన్ని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మించింది.ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైన తరువాత ముంబై & పూణే మధ్య ప్రయాణించే సమయాన్ని మూడు గంటల నుంచి 1 గంటకు తగ్గించింది. అంటే ఈ రోడ్డుపై ప్రయాణించేవారు రెండు గంటల సమయాన్ని ఆదా చేయవచ్చు. కాబట్టి ఎక్కువమంది ఈ హైవే మీద ప్రయాణిస్తూ ఉంటారు. సహ్యాద్రి పర్వత శ్రేణిలో నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే సొరంగాలు, అండర్ పాస్‌లను కలిగి ఉంది.టోల్ ట్యాక్స్ప్రారంభంలో చెప్పుకున్నట్లుగానే ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే అత్యంత ఎక్కువ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఇక్కడ కిలోమీటరుకు రూ. 3.40 వసూలు చేస్తుంది. ఇతర ఎక్స్‌ప్రెస్‌వేల మీద ఈ ఛార్జ్ కేవలం రూ. 2.40 మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ఛార్జ్ ఎంత ఎక్కువ వసూలు చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది.టోల్ ట్యాక్స్ ఎక్కువగా వసూళ్లు చేయడానికి కారణం!ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి భారీగా ఖర్చు చేశారు, అంతే కాకుండా ఇప్పుడు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. అయితే ప్రారంభంలో ప్రైవేట్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం కూడా ఈ ఛార్జెస్ పెరుగుదలకు కారణమనే తెలుస్తోంది. ట్రాఫిక్ వాల్యూమ్, ప్రభుత్వ పన్నులు మొదలైనవి కూడా టోల్ ఫీజు ఎక్కువగా వసూలు చేయడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. -
చైనాలో కొట్టుకుపోయిన ఎక్స్‌ప్రెస్ వే..
బీజింగ్: చైనాలో ప్రధాన రహదారి కొట్టుకుపోయిన ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని మెయిజౌ నగరంలో బుధవారం వేకువజామున ఘటన చోటుచేసుకుంది. చైనాలో ‘లేబర్ డే’సందర్భంగా ఐదు రోజుల సెలవులు బుధవారం నుంచే మొదలయ్యాయి. దీంతో గ్వాంగ్డాంగ్– ఫుజియాన్ ఎక్స్‌ప్రెస్ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. భారీ వర్షాల కారణంగా మెయిజౌ నగరంలోని కొండప్రాంతంలో ఉన్న 18 మీటర్ల రహదారి కొట్టుకుపోయింది. అనూహ్య పరిణామంతో 20 వరకు వాహనాలు అందులో పడిపోయాయి. కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. వాటిలో ఉన్న 54 మందిలో 24 మంది చనిపోగా మరో 30 మంది గాయాలపాలయ్యారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
గాంధీనగర్ : గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్ వేపై నిలిపి ఉంచిన ట్రక్కుపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. ఖేడా జిల్లాలోని నదియాడ్ పట్టణం సమీపంలో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. అతివేగం కారణంగా మారుతీ సుజుకి ఎర్టిగా కారు అదుపుతప్పి ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. బాధితులు వడోదర నుంచి అహ్మదాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో 93 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు చదవండి: ‘అణు బాంబుల ధ్వంసం.. సీపీఎంపై రాజ్‌నాథ్ ఫైర్ -
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని మోదీ
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం గురుగ్రామ్‌లో ప్రారంభించారు. ఎనిమిదిలైన్ల హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే తొలి ఎలివేటేడ్ హైవే. ఈ రహదారి ఢిల్లీ-గురుగ్రామ్ మధ్య నేషన్‌నల్ హైవే 48పై ట్రాఫిక్‌ను తగ్గించి ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. 19 కిలోమీటర్ల పొడవున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వేను రూ. 4,100 కోట్లతో నిర్మించారు. ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం రూ. 10,000 కోట్లతో నిర్మిస్తుండగా.. హర్యానా విభాగంలో రెండు ప్యాకేజీలు ఉన్నాయి . ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుంచి బసాయి ఆర్ఓబీ(10.2 కి.మీ), బసాయి ఆర్ఓబీ నుంచి ఖేర్కి దౌలా (క్లోవర్లీఫ్ ఇంటర్చేంజ్) (8.7 కి.మీ) వరకు. ఇక దేశవ్యాప్తంగా 112 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు, ఇవి ఏకంగా లక్ష కోట్ల రూపాయల విలువైనవి. #WATCH | Prime Minister Narendra Modi inaugurates and lays the foundation stone of 114 road projects worth about Rs One Lakh Crore, in Gurugram, Haryana. pic.twitter.com/9ulZD98ncD — ANI (@ANI) March 11, 2024 #WATCH : Drone Footage of Dwarka Expressway in Gurugram. #DwarkaExpressway #Gurugram #Delhi pic.twitter.com/9QTbcBdJoN — shivanshu tiwari (@shivanshu7253) March 11, 2024 -
రెయిలింగ్‌ను ఢీకొని బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి!
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు రోడ్డుపైనున్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొని, 25 అడుగులు కిందనున్న ప్రదేశంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఖేడా జిల్లాలోని నడియాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణీకులతో వెళుతున్న ఒక బస్సు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొని, 25 అడుగులు కిందికి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎస్పీ సహా పోలీసు సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ రాజేష్ గధియా మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి గురైన బస్సు అహ్మదాబాద్ నుంచి పూణె వెళుతోందని తెలిపారు. బస్సులో దాదాపు 23 మంది ప్రయాణికులు ఉన్నారు. హైవేపై అకస్మాత్తుగా ఎడమవైపు నుంచి వచ్చిన సిమెంట్ ట్యాంకర్.. బస్సును ఢీకొంది. దీంతో బస్సు అదుపు తప్పి, రెయిలింగ్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామన్నారు. #WATCH | Nadiad: SP Rajesh Gadhiya says, "...The bus was going from Ahmedabad to Pune in which there were about 23 passengers. The driver of a cement tanker suddenly turned left and hit the bus...Two people have died & several people have been injured...A case will be filed… https://t.co/B9DKPMKTf5 pic.twitter.com/LrSFa3AepN — ANI (@ANI) February 23, 2024 -
దట్టమైన పొగమంచు.. పదుల సంఖ్యలో వాహనాలు ఢీ
లక్నో: పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలోని ఉన్నావ్ సమీపంలో పదుల సంఖ్యలో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. పొగమంచు కారణంగా డబుల్ డెక్కర్ బస్సు అదుపుతప్పి డివైడర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు వెనక వస్తున్న వాహనాలు ఒకదాకొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో దాదాపు 25మంది గాయపడ్డారు. ఒకరు మృతి చెందినట్లు సమాచారం. పొగమంచుతో దారి సరిగా కనిపించని కారణంగానే బస్సు ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్‌లలో పొగమంచు తీవ్రత అధికంగా ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని సఫర్‌జంగ్‌లో 50 మీటర్లకు దృశ్యమానత(విజిబిలిటీ) పడిపోయింది. పంజాబ్‌లోని అమృత్సర్ విమానాశ్రయంలో విజిబిలిటీ 0 కి పడిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచులో వాహనాలను అధిక వేగంతో ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. వాహనదారులకు అవస్థలు -
అబ్బురపరిచే నిర్మాణం.. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే
న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అదివారం ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వీడియోను విడుదల చేశారు. తన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేస్తూ దాని కింద ఇంజినీరింగ్ యొక్క ఘనత.. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే.. అత్యాధునికమైన కళాత్మక భవిష్యత్తుకు నాంది.. అని రాశారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన భారతదేశంలోనే మొట్టమొదటి ఎనిమిది లైన్ల హైవే. నేషనల్ హైవే నెంబర్ 8 పై ఉన్న శివ మూర్తి నుండి ప్రారంభమై ఖేర్కి దౌలా వద్ద ముగిసే ఈ నాలుగు లైన్ల ప్యాకేజీ హైవే 563 కి.మీ వెడల్పుతో నిర్మితమైంది.ఈ ప్రాజెక్టు కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఏకంగా 1200 చెట్లను తిరిగి నాటారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఢిల్లీ హర్యానా మధ్య రాకపోకలు మరింత మెరుగవుతాయి. వీడియోలో చూపిన వివరాల ప్రకారం ద్వారకా నుండి మానేసర్ వరకు 15 నిముషాలు మానేసర్ నుండి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 20 నిముషాలు ద్వారకా నుండి సింఘు సరిహద్దు వరకు 25 నిముషాలు మానేసర్ నుండి సింఘు సరిహద్దు వరకు 45 నిముషాల వరకు ప్రయాణ సమయం ఉంటుందని తెలిపింది కేంద్ర రవాణా శాఖ. ఈ హైవే నిర్మాణం గనుక పూర్తయితే ద్వారకా సెక్టర్ 25లోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ తో కనెక్టివిటీని బాగా పెరుగుతుంది. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి ఇరువైపులా మూడు లైన్ల సర్వీసు రోడ్లను కూడా నిర్మించారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సుమారు రెండు లక్షల టన్నుల ఉక్కును వినియోగించినట్టు ఇది పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 30 రేట్లు ఎక్కువ కాగా 20 లక్షల క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీటు వినియోగించగా ఇది దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో వినియోగించిన దానికంటే ఆరు రేట్లు ఎక్కువ కావడం విశేషం. Marvel of Engineering: The Dwarka Expressway! A State-of-the-Art Journey into the Future 🛣#DwarkaExpressway #PragatiKaHighway #GatiShakti pic.twitter.com/Qhgd77WatW — Nitin Gadkari (@nitin_gadkari) August 20, 2023 ఇది కూడా చదవండి: Manipur Violence: మణిపూర్‌లో సజీవదహనమైన తల్లీకొడుకులు.. -
జాతీయ రహదారిపై కారు స్టంట్లు.. యువకుల పిచ్చి చేష్టలు..
ఢిల్లీ: ఢిల్లీ-మీరట్ జాతీయ రహదారిపై కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించారు. దేశ ప్రధాన రహదారిపై కారుతో చక్కర్లు కొడుతూ తోటి ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించారు. రద్దీగా ఉండే రహదారిపై యువకుల చేష్టలతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. వీడియోలో చూపిన విధంగా కొందరు యువకులు కారులో ప్రయాణిస్తున్నారు. అయితే.. సవ్యమైన దిశలో కాదు. రోడ్డుకు అడ్డంగా చక్కర్లు కొట్టారు. 25 సెకన్ల వీడియోలో చూపిన విధంగా రౌండ్లు వేస్తూ ఇతర ప్రయాణికులు వెళ్లకుండా ఇబ్బంది కలిగించారు. వీడియోలో యువకుల పిచ్చి చేష్టలకు భయపడిన తోటి ప్రయాణికులు కాసేపు ఎటూ వెళ్లకుండా అక్కడే నిలుచుని ఉండిపోయారు. Car stunt on Delhi Meerut Expressway#CarStunt #Meerut #Delhi #DelhiMeerutExpressway #viralvideo #NoConfidenceMotion #Suspended #DerekOBrien #DerekOBrienSuspended #DreamGirl2On25thAugust #DareToBeBold #AlluArjun #ElvishYadav #Adaniports pic.twitter.com/4NBGCgqlrp — Human Rights Reform Org. (@hqHumanRights) August 8, 2023 కారులో ఇద్దరు యువకులు బయటికి వేలాడారు. మరో ఇద్దరు కారులో కూర్చున్నారు. కనీసం జాతీయ రహదారి అనే జ్ఞానం లేకుండా రోడ్డుపై అడ్డంగా చక్కర్లు కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. పోలీసులు స్పందించారు. దోషులకు శిక్ష తప్పదని చెప్పారు. ఇదీ చదవండి: వీల్ ఛైర్లో మన్మోహన్సింగ్.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్ -
Maharashtra Samruddhi Expressway: నిర్మాణ దశలో ఘోర ప్రమాదం
ముంబై: మహారాష్ట్రలో నిర్మాణంలో ఉన్న సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వంతెనలోని శ్లాబులను యథాస్థానంలో కూర్చోబెట్టేందుకు వినియోగించే గిర్డెర్ లాంఛర్ కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సెగ్మెంట్ లాంచర్(క్రేన్)తో కలుపుకుని దాదాపు 700 టన్నుల బరువైన గిర్డెర్ లాంఛర్ 35 మీటర్ల ఎత్తునుంచి కిందకు కుప్పకూలింది. దీంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది దాని కింద నలిగిపోయారు. ఈ ఘోర దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైను నాగ్‌పూర్‌ను కలుపుతూ 701 కిలోమీటర్ల పొడవైన సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తున్నారు. ముంబైకి 80 కి.మీ.ల దూరంలో థానె జిల్లాలో సార్లాంబే గ్రామం వద్ద సోమవారం అర్ధరాత్రిదాటాక ఈ ఘటన జరిగింది. ఘటనపై నిపుణులతో కూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసినట్లు ఉపముఖ్యమంత్రి ఫడ్నవిస్ చెప్పారు. పోతపోసిన బాక్స్ శ్లాబులను తర్వాతి రోజు నిర్మాణం కోసం సిద్ధంచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేíÙయా ఇస్తామన ప్రధాని ప్రకటించారు. తలో రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. దుర్ఘటన నేపథ్యంలో సంబంధిత ఇద్దరు కాంట్రాక్టర్లపై పోలీసులు కేసు నమోదుచేశారు. మొత్తం ఎక్స్‌ప్రెస్‌వేలో ఇప్పటికే 600 కి.మీ.ల మేర నిర్మాణం పూర్తయి రాకపోకలు సైతం మొదలయ్యాయి. ఈ 101 కి.మీ.ల నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీద గత ఆరు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఎక్స్‌ప్రెస్‌వేలో వరుస ప్రమాదాలు
మండ్య: బెంగళూరు –మైసూరు జాతీయ రహదారిలో ఆదివారం సాయంత్రం వరుస ప్రమాదాలు జరిగి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మైసూరు నుంచి బెంగళూరు నగరానికి వస్తున్న రాజహంస బస్సు మద్దూరు బైపాస్ రోడ్డులోని కే. కోడిహళ్లి సమీపంలో కారును ఢీకొంది. దీంతో కారు ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. ప్రమాదంలో సత్యనానారాయణ అనే వ్యక్తితోపాటు ఒక మహిళ, మరో వ్యక్తి గాయపడ్డారు. వీరిని మద్దూరు ఆస్పత్రికి తరలించారు. వరుస ప్రమాదాలతో అరగంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరించారు. -
తెలంగాణ సర్కార్ భారీ ప్లాన్! మూసీ నదిపై ఏకంగా 55 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ వే
గచ్చిబౌలి: కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. మూసీ నది మీదుగా రూ. 10 వేల కోట్ల వ్యయంతో 55 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ వే నిర్మించనున్నట్లు చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఖాజాగూడ పెద్ద చెరువు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ఓఆర్ఆర్ వెస్ట్ టు ఈస్ట్ మూసీ నదిపై ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కోసం అధ్యయనం చేశామని, మూసీ సుందరీకరణతో ఆ ప్రాంతం రూపురేఖలు మారతాయన్నారు. నిర్మాణ సంస్థలు.. 50 చెరువుల దత్తత కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని 50 చెరువులను అభివృద్ధి చేసేందుకు వివిధ నిర్మాణ సంస్థలు వాటిని దత్తత తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని 185 చెరువుల అభివృద్ధిలో ‘క్రెడాయ్’ను భాగస్వామిని చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని చాలా చెరువుల్లో ప్రైవేటు పట్టాలు ఉన్నాయని, అయినా ప్రైవేటు భూముల యజమానులకు మరోచోట భూమి ఇస్తున్నామన్నారు. వారికి టీడీఆర్ కింద 200 శాతం విలువ కల్పిస్తున్నామని చెప్పారు. 13 చెరువులలో ఎఫ్టీఎల్ పట్టాలున్న వ్యక్తులకు 188 టీడీఆర్‌లు ఇచ్చి 115 ఎకరాల స్థలాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు మంత్రి వివరించారు. ఎఫ్టీఎల్ పట్టాలున్న వ్యక్తులను టీడీఆర్ తీసుకునే విధంగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్‌లో భద్రకాళి చెరువును అభివృద్ధి చేసినంత గొప్పగా దుర్గం చెరువు కూడా లేదని, నాగర్‌కర్నూల్ చెరువును ట్యాంక్‌బండ్‌లా అభివృద్ధి చేసి బుద్ధ విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. సీఎస్ఆర్ నిధులిస్తే జిల్లా కేంద్రాలలో చెరువుల అభివృద్ధి చేపడతామన్నారు. ఆఫీస్ స్పేస్‌లో మనమే నంబర్ వన్.. బెంగళూరు, చెన్నై, ముంబై, పుణే, ఢిల్లీని మించి 2022లో ఆఫీస్ స్పేస్‌లో దేశంలోనే నంబర్ వన్ సిటీగా హైదరాబాద్ నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓఆర్ఆర్ మీదుగా వస్తుంటే కనిపించిన భారీ భవనాలను చేస్తుంటే విదేశాలకు వెళ్లిన అనుభూతి కలిగిందన్నారు. నగరంలో శాంతిభద్రతలు బాగుండటంతోపాటు జీవన వ్యయం తక్కువగా ఉండటం, క్వాలిటీ ఆఫ్ లివింగ్ బాగుండటం వల్లే హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నట్లు తెలిపారు. 250కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరిస్తాం కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా మెట్రో రైలును 250 కి.మీ. విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రూ. 6,250 కోట్లతో మెట్రో ను రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించట్లేదని విమర్శించారు. యూపీలోని 10 నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు నిధులిస్తున్న కేంద్రం... తెలంగాణకు మొండిచేయి చూపుతోందని దుయ్యబట్టారు. రాచకొండలో ఫిలింసిటీ... ప్రపంచస్థాయి ఫిలింసిటీ ఏర్పాటుకు రాచకొండలో స్థలాన్ని గుర్తించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒలింపిక్స్ స్థాయిలో స్పోర్ట్స్ సిటీ తేవాలని సీఎం కేసీఆర్ దృష్టిలో ఉందన్నారు. వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ గుర్తింపు పొందిందని, ప్రపంచంలోని వ్యాక్సిన్లలో 35 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. వచ్చే సంవత్సరంలో 50 శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోనే తయారవుతాయన్నారు. లైఫ్‌సైన్స్ పరిశ్రమ 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల స్థాయికి ఎదిగేలా ప్రణాళిక రూపొందించాలని నిర్దేశించినట్లు పేర్కొన్నారు. -
అద్దంకి–నార్కెట్‌పల్లి హైవే ఇకపై.. కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్ వే
దాచేపల్లి: పల్నాడు ప్రాంతానికి చెందిన రాజకీయ యోధుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత కాసు బ్రహ్మానందరెడ్డి పేరు చిరస్మరణీయంగా నిలిచేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బ్రహ్మానందరెడ్డి చేసిన సేవలు, ఆయన చేసిన అభివృద్ధిని గుర్తించిన ప్రభుత్వం హైదరాబాద్–విజయవాడ హైవే, విజయవాడ–చెన్నై హైవేలను కలుపుతూ పల్నాడు ప్రాంతంలోని అద్దంకి–నార్కెట్‌పల్లి ప్రధాన రహదారికి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్ వేగా నామకరణం చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. సుమారుగా 200 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారికి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్ వేగా నామకరణం చేయడంపై పల్నాడు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారికి తన తాత పేరు పెట్టడంపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ హయాంలో ఈ హైవే నిర్మాణాన్ని చేపట్టారు. -
ఆనంద్ మహీంద్రా అద్భుతమైన వీడియో.. వావ్ అంటున్న నెటిజన్స్
సాక్షి, ముంబై: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు, ఇందులో భాగంగానే ఇటీవల తన ట్విటర్ ద్వారా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. డ్రోన్ వీడియోను షేర్ చేస్తూ 'బెంగుళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే కింద వందే భారత్ ట్రైన్ వెళుతోంది, గ్లోబల్-స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశాన్ని ఎలా మారుస్తుందో అని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకొచ్చారు'. ఈ వీడియోకి వేల సంఖ్యలో లైకులు రాగా, చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోలో ఒక ఎక్స్‌ప్రెస్‌వే కింద 'వందే భారత్' ట్రైన్ వెళ్లడం చూడవచ్చు. ఈ అద్భుతమైన సన్నివేశం 'బెంగళూరు-మైసూరు' ఎక్స్‌ప్రెస్‌వే వద్ద చూడవచ్చు. నిజానికి బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే రెండు దశల్లో ఉంటుంది. ఫేజ్-1 కింద 58 కిమీ పొడవుతో బెంగళూరు - నిడఘట్ట మధ్య, ఫేజ్-2 కింద 61 కిమీ పొడవుతో నిడఘట్ట - మైసూర్ మధ్య ఉంది. గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే మంగళూరుని బెంగుళూరుతో కలుపుతుంది. 119 కిమీ పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌వే చాలా అందంగా కనిపించడమే కాకుండా, మధ్యలో వివిధ రైల్వే క్రాసింగ్‌ల పైన వెళుతుంది. అలాంటి రైల్వే క్రాసింగ్లలో ఒక క్రాసింగ్ వీడియో ఆనంద్ మహీంద్రా మనసు దోచింది. Drone view of the new Bengaluru-Mysuru expressway with the Vande Bharat train passing underneath. A powerful visual symbol of how global-standard infrastructure is transforming India…👏🏽👏🏽👏🏽 pic.twitter.com/nBRiyCFHEd — anand mahindra (@anandmahindra) February 13, 2023 -
ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వే తొలి దశ ప్రారంభం
దౌసా (రాజస్తాన్): కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంలో మరో మైలు రాయిని అందుకుంది. దేశంలో అతి పెద్దదైన జాతీయ ఎక్స్‌ప్రెస్ హైవే ఢిల్లీ–ముంబై మహా రహదారిలో 246కి.మీ. భాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించారు.ఢిల్లీలోని సోహ్నా నుంచి రాజస్తాన్‌లో దౌసా మధ్య నిర్మాణం జరుపుకున్న తొలిదశను దౌసా వద్ద రిమోట్ కంట్రోల్ బటన్ ద్వారా ప్రధాని ప్రారంభించారు. 8 లేన్లతో నిర్మించిన ఢిల్లీ–దౌసా–లాస్‌సాట్ రహదారి అందుబాటులోకి రావడంతో ఢిల్లీ, జైపూర్ మధ్య దూరం సగానికి సగం తగ్గిపోతుంది. ఇన్నాళ్లు 5 గంటలు పట్టే ప్రయాణం ఈ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళితే మూడున్నర గంటలే పడుతుంది. దీంతోపాటు రూ.5,940 కోట్ల జాతీయ హైవే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం హైవే ప్రాజెక్టులు, పోర్టులు, రైల్వేలు, ఆప్టికల్ ఫైబర్, మెడికల్ కాలేజీల మీద అత్యధికంగా దృష్టి సారించిందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. ఇలాంటి హైవేలతో పారిశ్రామికవేత్తలతో పాటు, వ్యాపారులు, చిరు వ్యాపారులు కూడా ఆర్థికంగా బలోపేతమవుతారని తెలిపారు. మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తే మరిన్ని పెట్టుబడుల్ని ఆకర్షించవచ్చునని మోదీ చెప్పారు. ఢిల్లీ–ముంబై తొలిదశతో ఈ ప్రాంతం ఆర్థికంగా మరింత బలోపేతమవుతుందన్నారు. ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రావడంతో జైపూర్, అజ్మీర్‌లకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. సరిహద్దు ప్రాంతాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం: ప్రధాని మన దేశ సైనికుల శక్తి సామర్థ్యాలను కాంగ్రెస్ తక్కువగా అంచనా వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, దేశంలోకి చొరబడడానికి మన శత్రువులు కొత్త మార్గాలు వెతుక్కుంటారన్న భయంతో ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. దౌసాలో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన తర్వాత బీజేపీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ రాజస్తాన్‌లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ కాగితాలకే పరిమితం చేసిందని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటేనే రాజస్తాన్ అభివృద్ధి పథంలో దూసుకువెళుతుందని అన్నారు. దయానంద సరస్వతి 200వ జయంత్యుత్సవాలు ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 200వ జయంత్యుత్సవాలను మోదీ ఆదివారం ప్రారంభించారు. ఆయన చూపిన మార్గం కోట్లాది మందిలో ఆశల్ని నింపుతోందని ఈ సందర్భంగా ఆయనన్నారు. నిరుపేదలకు సేవ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అణగారిన వర్గాల అభ్యున్నతి మొట్టమొదటి యజ్ఞంగా చేపట్టామని తెలిపారు. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ వే విశేషాలు మొత్తం పొడవు: 1,380 కి.మీ. మొత్తం వ్యయం: దాదాపుగా రూ. లక్ష కోట్లు ఢిల్లీ ముంబై మధ్య ప్రయాణ సమయం: 12 గంటలు (ప్రస్తుతం 24 గంటలు పడుతోంది) తొలి దశ పొడవు : 246 కి.మీ. (సోహ్నా నుంచి దౌసా) వ్యయం: రూ.12,150 కోట్లు è ఢిల్లీ నుంచి జైపూర్ మధ్య సగానికి సగం తగ్గనున్న ప్రయాణ సమయం. (ఇన్నాళ్లూ 5 గంటలు పట్టేది. ఇకపై మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు) . è ఆరు రాష్ట్రాల మీదుగా వెళ్లనున్న ఎక్స్‌ప్రెస్ వే 90 గంటలు, 10 సమావేశాలు, 10,800కి.మీ.. నాలుగు రోజుల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోదీ అక్షరాలా సుడిగాలి పర్యటనలు చేపట్టారు. మొత్తం 90 గంటల్లో ఏకంగా 10 బహిరంగ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన 10,800 కి.మీ. దూరం ప్రయాణిస్తారు. ఫిబ్రవరి 10న ఢిల్లీ నుంచి యూపీకి వెళ్లి ప్రపంచ పెట్టుబడుల సదస్సుని ప్రారంభించారు. ముంబైకి వచ్చి వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు. ఫిబ్రవరి 11న త్రిపురలో రెండు బహిరంగ సదస్సుల్లో పాల్గొన్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి రాజస్తాన్ వెళ్లి దౌసాలో ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. రెండు బహిరంగ సమావేశాల్లో ప్రసంగించారు. సోమవారం బెంగుళూరులో ఏరో ఇండియా 2023ను ప్రారంభిస్తారు. అక్కడ్నుంచి మళ్లీ త్రిపురకి వెళ్లి అగర్తాలా ర్యాలీలో పాల్గొని సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. -
రోడ్డును కమ్మేసిన పొగమంచు.. ట్రక్కు-బస్సు ఢీ.. నలుగురు దుర్మరణం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం 5:30 గంటల సమయంలో ఈ విషాదం జరిగింది. బస్సు గుజరాత్ నుంచి నేపాల్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. వేకువజామున రోడ్డును పొగమంచు కమ్మేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించారని, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని పేర్కొన్నారు. చదవండి: అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు.. -
18 మందితో వెళ్తున్న మినీ బస్‌లో మంటలు.. క్షణాల్లో..!
లఖ్‌నవూ: 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సులో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు చెలరేగటాన్ని గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దూకేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. యూపీలోని గ్రేటర్ నోయిడా నుంచి నోయిడాకు వస్తున్న క్రమంలో మినీ బస్సులో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సులోంచి మంటలు, నల్లటి పొగ వస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. బస్సులో మంటలు చెలరేగటంతో నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. #Noida एक्सप्रेसवे पर एक मिनी बस में आग लग गई । हादसे के वक्त बस में 18 यात्री सवार थे जिन्होंने बस से कूद कर खुद की जान बचाई । थाना एक्सप्रेसवे के इलाके में पंचशील अंडर पास के नजदीक बस में आग लगी । बस ग्रेटर नोएडा से नोएडा की तरफ आ रही थी #Video pic.twitter.com/4AsqCp3RcP — Amit Choudhary (@amitchoudhar_y) November 6, 2022 ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. సరస్సులో కూలిపోయిన విమానం -
ఈడీకి కౌంటర్ ఇచ్చిన అఖిలేష్ యాదవ్.. రెస్పాన్స్ ఎలా ఉండనుంది?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హయంలో ఈడీ దాడులు ఎక్కువయ్యాయి. ఈ దాడుల విషయంలో కూడా సుప్రీంకోర్టు వారికి మద్దతుగానే వ్యాఖ్యలు చేసింది. కానీ, ఈడీ దాడులపై ప్రతిపక్ష నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. ఈడీని కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష నేతలను వేధించడానికే వాడుకుంటున్నదని విమర్శించారు. ఈడీ స్వతహాగా దాడులు చేస్తే.. బీజేపీ నేతలకు సంబంధించిన అవినీతిపై ఎందుకు దర్యాప్తు చేయడంలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఈడీ ఎందుకు బయటకు తీయడంలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నారు. యోగి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన నాలుగు రోజులకే వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. కాగా, ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ జూలై 16వ తేదీన ప్రారంభించారు. అయితే, ఈ ప్రాజెక్టు విషయంలో ఈడీ ఎందుకు విచారణ చేపట్టలేదని అఖిలేష్ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: బీజేపీ నేత హత్య.. కేరళ నుంచి కుట్ర జరిగిందా? -
కాషాయ పార్టీలో కలకలం.. ప్రధాని మోదీ, సీఎం యోగికి ఊహించని షాక్!
అధికార బీజేపీలో వ్యతిరేక గళం వినిపిస్తోంది. రెండు క్రితం యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు షాకిస్తూ కేబినెట్ మంత్రి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో కాషాయ పార్టీ ఎంపీ ఏకంగా.. బీజేపీ సర్కార్‌పైనే విమర్శలు ఎక్కుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే, యూపీలో ఈనెల 16న ప్రధాని నరేంద్ర మోదీ 296 కిలో మీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన విషయం తెలిసిందే. చిత్రకూట్ లోని భరత్ కూప్ నుంచి ఇటావాలోని కుంద్రెల్‌ను కలిపే ఈ నాలుగు లైన్ల ఈ ఎక్స్‌ప్రెస్‌వేను యోగి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు రూ.15వేల కోట్లతో నిర్మించారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో జలౌన్ జిల్లా సమీపంలో కొన్నిచోట్ల పెద్ద రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పిలిభిత్ నియోజకవర్గం ఎంపీ వరుణ్ గాంధీ.. బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వారం రోజుల్లోనే రోడ్డు ఇలా అయితే ఎలా అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. ఈ ప్రాజెక్ట్ హెడ్, నిర్మాణంలో భాగస్వాములైన కంపెనీలు, ఇంజనీర్లకు వెంటనే సమన్లు జారీ చేయాలని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, సొంత పార్టీ ఎంపీనే ఇలా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ప్రతిపక్ష నేతలు మాటల దాడి ప్రారంభించారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. బీజేపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రోడ్డు నిర్మాణ విషయంలో ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. 15 हजार करोड़ की लागत से बना एक्सप्रेसवे अगर बरसात के 5 दिन भी ना झेल सके तो उसकी गुणवत्ता पर गंभीर प्रश्न खड़े होते हैं। इस प्रोजेक्ट के मुखिया, सम्बंधित इंजीनियर और जिम्मेदार कंपनियों को तत्काल तलब कर उनपर कड़ी कार्यवाही सुनिश्चित करनी होगी।#BundelkhandExpressway pic.twitter.com/krD6G07XPo — Varun Gandhi (@varungandhi80) July 21, 2022 ఇదిలా ఉండగా, వరుణ్ గాంధీ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై సమయం వచ్చిన ప్రతీసారి విమర్శలు చేస్తూనే ఉన్నారు. అంతకుముందు ఉద్యోగ నోటిఫికేషన్ల భర్తీ విషయంలోనూ మోదీపై వరుణ్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉందంటూ.. ప్రస్తుతం ఇదే దేశంలో బర్నింగ్ ప్రాబ్లమ్ అంటూ వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా 60 లక్షలకుపైగా మంజూరైన పోస్టులు ఖాళీగా ఉండటం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. बेरोज़गारी आज देश का सबसे ज्वलंत मुद्दा है और पूरे देश के नेताओं को इस मुद्दे पर सरकार का ध्यान आकृष्ट कराना चाहिए। बेरोज़गार नौजवानों को न्याय मिलना चाहिए,तभी देश शक्तिशाली बनेगा। मैं आभारी हूँ की रोजगार के ऊपर उठाए गए मेरे सवालों का @asadowaisi जी ने अपने भाषण में ज़िक्र किया। pic.twitter.com/MAqfTOtHKZ — Varun Gandhi (@varungandhi80) June 13, 2022 ఇదిలా ఉండగా.. కేంద్ర గణాంకాలను నమ్మవచ్చా? పలు శాఖల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ పోస్టులకు కేటాయించిన బడ్జెట్ ఎక్కడకు వెళ్లింది? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఉన్న నిరుద్యోగులందరీ ఈ విషయం తెలుసుకునే హక్కు ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. వరుణ్ గాంధీ పార్టీ మరబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో ట్విస్టులు.. షిండే సర్కార్‌కు బిగ్ షాక్! -
మోదీ చేతుల మీదుగా ప్రారంభం.. ఐదు రోజులకే గుంతలుపడ్డ రోడ్డు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేపై పలుచోట్ల గుంతలుపడ్డాయి. బుధవారం కురిసిన వర్షం కారణంగా రోడ్డు పాక్షికంగా ధ్వంసమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఐదు రోజుల క్రితమే 296 కిలోమీటర్ల పొడవైన ఈ నాలుగు లైన్ల రోడ్డును ప్రారంభించడం గమనార్హం. భారీ వర్షాల కారణంగానే సాలెంపుర్ చిరియా సమీపంలో ఈ రోడ్డుపై గంతలుపడిట్లు తెలుస్తోంది. దీనివల్ల బుధవారం రాత్రి ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు కార్లు, ఓ మోటార్ సైకిల్ ప్రమాదాలకు గురయ్యాయి. ఔరేయాలోని అజిత్మాల్ మాల్ ప్రాంతంలోనూ రోడ్డు ఇలాగే దెబ్బతింది. అయితే ఈ ప్రాంతాల్లో మరమ్మతులు ఇప్పటికే పూర్తయినట్లు అధికారులు చెప్పారు. 16 जुलाई यानि 5 दिन पहले प्रधानमंत्री मोदी ने बुंदेलखंड एक्सप्रेस वे का उद्घाटन किया था और कल शाम तेज़ बारिश के बाद ये एक्सप्रेस वे जगह जगह धंस गया .. @ndtv pic.twitter.com/hvdYLf5wTY — Saurabh shukla (@Saurabh_Unmute) July 21, 2022 ప్రతిపక్షాల విమర్శలు.. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఐదు రోజులకే గుంతలుపడటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. వర్షం వల్ల ఈ రోడ్డు అసంపూర్ణంగా ఉందనే విషయం ప్రజలకు తెలిసిందని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరు అంటే ఇదేనా.. వారం రోజులకే ఇలా అవుతుందా అని ఆమ్ ఆద్మీ పార్టీ సెటైర్లు వేసింది. రూ.8000 కోట్ల విలువైన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను జులై 16న ప్రారంభించారు మోదీ. నాలుగు లైన్ల ఈ రోడ్డును ఆరు లైన్లకు కూడా విస్తరించుకోవచ్చు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఏడు జిల్లాలు, మధ్యప్రదేశ్‌లోని 6 జిల్లాలకు ఈ ఎక్స్‌ప్రెస్‌వే వ్యాపించి ఉంది. చదవండి: మోదీ అడ్డాలో పాగాకు కేజ్రీవాల్ పక్కా ప్లాన్! 300 యూనిట్ల ఉచిత కరెంటు, బకాయిల రద్దు హామీ -
ఉచిత పథకాలు దేశానికి ప్రమాదకరం
జలౌన్: ఉచిత పథకాల ద్వారా ఓట్లు దండుకునే సంస్కృతి దేశం అభివృద్ధికి చాలా ప్రమాదకరమని ప్రధాని మోదీ అన్నారు. ఇటువంటి తాయిలాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆయన హెచ్చరించారు. యూపీలో రూ.14,850 కోట్లతో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను జలౌన్ జిల్లా కైతెరి గ్రామం వద్ద శనివారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ రహదారితో వాహనాల వేగం మాత్రమే కాదు, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా వేగవంతమవుతుందని చెప్పారు. చిత్రకూట్– ఢిల్లీ మధ్య ప్రయాణ కాలం మూడు నుంచి నాలుగు గంటలు తగ్గుతుందని కూడా చెప్పారు. ‘‘మన దేశంలో రేవడీ(ఉత్తర భారతంలో ఒక స్వీట్ పేరు)లు పంచుతూ ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేవడీలతో ప్రజలను కొనుగోలు చేయవచ్చని అనుకుంటున్నారు. ఈ సంస్కృతి దేశం అభివృద్ధికి ప్రమాదకరం. రేవడీ సంస్కృతితో కొత్త ఎక్స్‌ప్రెస్ వేలు, ఎయిర్‌పోర్టులు, డిఫెన్స్ కారిడార్లు రావు. ఈ సంస్కృతిని దేశ రాజకీయాల నుంచి పారదోలినప్పుడే కొత్త రహదారులు, కొత్త రైలు మార్గాలు నిర్మించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవచ్చు’’అంటూ ఎన్నికల సమయంలో ఉచిత పథకాలను ప్రకటించే రాజకీయ పార్టీలపై పరోక్షంగా విమర్శలు చేశారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు సులువైన రేవడీ సంస్కృతిని వదిలి, రాష్ట్రాభివృద్ధికి తీవ్రంగా పాటుపడుతున్నాయని ప్రధాని చెప్పారు. దేశ అభివృద్ధికి పునాదులు: కేజ్రీవాల్ ఉచిత పథకాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇస్తున్న విద్య, ఆరోగ్యం, విద్యుత్ సౌకర్యాలు ఓట్లు గుంజే తాయిలాలు కావని తెలిపారు. మన దేశం ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచేందుకు పునాది వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలని పేర్కొన్నారు. -
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించిన ప్రధాని మోదీ
-
ఏసీ హాల్లో ఎందుకు? గ్రౌండ్లో కూడా పెళ్లి చేసుకోండి: నితిన్ గడ్కరీ
సాక్షి, చండీగఢ్: కేంద్ర మంత్రులు పలు సమస్యలపై ప్రశ్నిస్తే వింతగా సమాధానమిస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. టోల్ గేట్ల ధరల పెంపుపై ప్రశ్నించగా వింతగా సమాధానమిచ్చారు. ‘డబ్బులు చెల్లిస్తే మంచి రోడ్లు వస్తాయి’ అని పేర్కొన్నారు. దానికో ఉదాహరణ కూడా వివరించి సోషల్ మీడియాలో నెటిజన్లకు చిక్కారు. ఆయన చేసిన వ్యాఖ్యలేంటో తెలుసుకోండి. చదవండి: 2023లోనూ టీఆర్ఎస్దే విజయం హరియాణాలోని సోహ్నాలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే (డీఎంఈ) పనులను గురువారం రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏసీ హాల్లో వివాహం చేసుకుంటే డబ్బులు చెల్లించాలి. అదే మైదానంలో అయితే ఏం ఖర్చు ఉండదు. అక్కడ కూడా చేసుకోవచ్చు’ అని తెలిపారు. ఎక్స్‌ప్రెస్ హైవేలపై టోల్ చార్జీలతో ప్రయాణ వ్యయం పెరుగుతుండడంపై ఆయన ఇచ్చిన ఉదాహరణ. అంతటితో ఆగకుండా మరికొంత ఉదాహరిస్తూ.. ‘ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే వినియోగిస్తే 12 గంటల్లో ప్రయాణించొచ్చు. ఎక్స్‌ప్రెస్ వేతో ప్రమాణ సమయం తగ్గుతుంది. ఇంధన ధర తగ్గుతుంది. అదే ఓ ట్రక్కు ముంబై నుంచి ఢిల్లీ చేరడానికి 48 గంటలు పడుతుంది. ఎక్స్‌ప్రెస్ వేతో ఎక్కువ ట్రిప్పులు తిరగొచ్చు. దాని ద్వారా వ్యాపారం మరింత చేసుకోవచ్చు’ అని తెలిపారు. మెరుగైన రోడ్లు కావాలంటే ప్రజలు డబ్బులు చెల్లించక తప్పదని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. చదవండి: బీజేపీ సరికొత్త ప్రయోగం.. వారికి నో ఛాన్స్ దేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ వేను ఢిల్లీ- ముంబై మధ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న 1,380 కిలోమీటర్ల ఈ ఎక్స్‌ప్రెస్ వే పనులు 2023లో పూర్తి చేయాలనే లక్ష్యం. ఆ పనులు ముమ్మరం చేయడంలో భాగంగా నితిన్ గడ్కరీ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కలిసి పరిశీలించారు. భవిష్యత్‌లో రోడ్లపై విమానాలు దిగే మాదిరి అత్యంత నాణ్యతతో ఈ పనులు చేస్తున్నట్లు తెలిపారు. -
‘సీమ’ నుంచి శాసన రాజధానికి రాచబాట
సాక్షి, అమరావతి: రాయలసీమను శాసన రాజధాని అమరావతితో అనుసంధానిస్తూ రాచబాట రూపొందనుంది. అనంతపురం నుంచి గుంటూరు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 417.91 కిలోమీటర్ల మేర ఈ రహదారిని రూ.9 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనల మేరకు ‘ఎన్‌హెచ్ 544డి’ నిర్మించేందుకు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ ఆమోదం తెలిపింది. ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయం అనంతపురం నుంచి గుంటూరు వరకు ఎక్స్‌ప్రెస్ హైవే కోసం ఎన్హెచ్ఏఐ గతంలో ప్రతిపాదించింది. అందుకోసం భారీగా అటవీ భూములను సేకరించాల్సి ఉంది. అటవీ భూములను సేకరిస్తే అంతకు రెట్టింపు భూములను అటవీశాఖకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. అటవీ భూముల కేటాయింపునకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు ఇచ్చేందుకు 2018లోనే నిరాకరించడంతో ఆ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో రాయలసీమ నుంచి శాసన రాజధాని అమరావతికి సరైన రహదారి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాయలసీమను అమరావతితో అనుసంధానించే రహదారి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం – అమరావతి అనుసంధానానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణ ప్రతిపాదనలను రూపొందించింది. అనంతపురం నుంచి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం ప్రకాశం జిల్లా గిద్దలూరు, గుంటూరు జిల్లా వినుకొండ మధ్య రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా నిర్వహిస్తోంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనంతపురం – గుంటూరు మధ్య నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖకు ప్రతిపాదనలు పంపింది. వాటికి ఆ శాఖ ఆమోదం తెలిపింది. అనంతపురం నుంచి గుంటూరు వరకు 417.91 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 544డి నిర్మాణానికి ఆమోదించింది. 4 ప్యాకేజీల కింద నిర్మాణం 417.91 కిలోమీటర్ల ఈ రహదారిని రూ.9 వేల కోట్లతో నాలుగు ప్యాకేజీల కింద నిర్మించాలని నిర్ణయించారు. 1. అనంతపురం నుంచి బుగ్గ వరకు 69 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. ఇప్పటికే అనంతపురం నుంచి తాడిపత్రి వరకు నాలుగు లేన్ల రహదారి ఉంది. తాడిపత్రి నుంచి బుగ్గ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణం కోసం భూసేకరణ పూర్తిచేశారు. త్వరలో టెండర్ల ప్రక్రియ చేపడతారు. అందుకోసం రూ.2,130 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలను ఆమోదించారు. 2. బుగ్గ నుంచి కర్నూలు జిల్లా మీదుగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. అందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందిస్తున్నారు. 154.91 కిలోమీటర్ల మేర ఈ రహదారిని రూ.4,550 కోట్లతో నిర్మిస్తారు. 3. గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండ వరకు పేవర్డ్ సోల్డర్స్‌తో రెండు లేన్ల రహదారి నిర్మాణాన్ని ఇప్పటికే వేగంగా కొనసాగిస్తున్నారు. 112 కిలోమీటర్ల మేర ఈ రహదారి కోసం రూ.845 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించారు. అందులో 108.37 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి గత డిసెంబరు 25నే పీసీసీ జారీచేశారు. 4. వినుకొండ నుంచి గుంటూరు వరకు 82 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. అందుకోసం రూ.1,475 కోట్లతో ప్రతిపాదనలను ఆమోదించారు. దీనిపై డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. ఆ తరువాత టెండర్ల ప్రక్రియ చేపడతారు. రాయలసీమ నుంచి అమరావతికి మెరుగైన కనెక్టివిటీ అనంతపురం నుంచి గుంటూరు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణంతో రాయలసీమతో అమరావతికి కనెక్టివిటీ పెరుగుతుంది. తక్కువ వ్యయ, ప్రయాసలతో మెరుగైన ప్రయాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన ప్రణాళికను కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ ఆమోదించింది. డీపీఆర్ పూర్తయిన తరువాత టెండర్ల ప్రక్రియ చేపట్టి నిర్మిస్తుంది. – ఎం.టి.కృష్ణబాబు, ముఖ్యకార్యదర్శి, రహదారులు, భవనాలశాఖ