
ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఉన్నవ్‌లో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.