లక్నో: పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలోని ఉన్నావ్ సమీపంలో పదుల సంఖ్యలో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
పొగమంచు కారణంగా డబుల్ డెక్కర్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు వెనక వస్తున్న వాహనాలు ఒకదాకొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో దాదాపు 25మంది గాయపడ్డారు. ఒకరు మృతి చెందినట్లు సమాచారం. పొగమంచుతో దారి సరిగా కనిపించని కారణంగానే బస్సు ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు.
ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్‌లలో పొగమంచు తీవ్రత అధికంగా ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని సఫర్‌జంగ్‌లో 50 మీటర్లకు దృశ్యమానత(విజిబిలిటీ) పడిపోయింది. పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయంలో విజిబిలిటీ 0 కి పడిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచులో వాహనాలను అధిక వేగంతో ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. వాహనదారులకు అవస్థలు
Comments
Please login to add a commentAdd a comment