heavy fog
-
గన్నవరం ఎయిర్ పోర్టులో దట్టమైన పొగమంచు
-
శ్రీశైలంలో కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు
-
ఉత్తరాది గజగజ.. మంచు గుప్పిట్లో ఢిల్లీ
-
దట్టమైన పొగమంచు.. పదుల సంఖ్యలో వాహనాలు ఢీ
లక్నో: పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలోని ఉన్నావ్ సమీపంలో పదుల సంఖ్యలో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. పొగమంచు కారణంగా డబుల్ డెక్కర్ బస్సు అదుపుతప్పి డివైడర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు వెనక వస్తున్న వాహనాలు ఒకదాకొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో దాదాపు 25మంది గాయపడ్డారు. ఒకరు మృతి చెందినట్లు సమాచారం. పొగమంచుతో దారి సరిగా కనిపించని కారణంగానే బస్సు ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్‌లలో పొగమంచు తీవ్రత అధికంగా ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని సఫర్‌జంగ్‌లో 50 మీటర్లకు దృశ్యమానత(విజిబిలిటీ) పడిపోయింది. పంజాబ్‌లోని అమృత్సర్ విమానాశ్రయంలో విజిబిలిటీ 0 కి పడిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచులో వాహనాలను అధిక వేగంతో ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. వాహనదారులకు అవస్థలు -
పొగ మంచు కారణంగా చెరువులోకి దూసుకెళ్లిన కారు
-
పొగమంచు ఎఫెక్ట్‌తో పలు విమానాలు దారి మళ్లింపు
సాక్షి,న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో విమానాల రాకపోకలకు పొగ మంచు అడ్డం పడింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా విమానాలు ల్యాండ్ కాలేకపోతున్నాయి. దీంతో పలు విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే దారి మళ్లించిన విమానాల సమాచారాన్ని అధికారులు తెలియజేశారు. మరోవైపు హైదరాబాద్ నుంచి ఉదయం 6.15కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని(AI559) జైపూర్‌కు దారి మళ్లించారు. ఈ విమానంలోనే వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. దీంతో ఆయన 11 గంటలకు జరుగనున్న పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కు ఆలస్యంగా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు అఖిలపక్ష సమావేశం పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. ఉదయం 11గం.లకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఈ భేటీ జరగనుంది. వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు అవుతుండగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఎజెండాగా ఈ భేటీ జరుతోంది. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 4 నుంచి 22 వరకూ కొనసాగనున్నాయి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. -
తిరుమల క్షేత్రానికి మంచు తెర.. కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు (ఫొటోలు)
-
ఢిల్లీని కప్పేసిన పొగమంచు..
-
ఢిల్లీలో దట్టమైన పొగమంచు
-
మంచు కారణంగా రైళ్లు 6 గంటలు ఆలస్యం
విజయవాడ: పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. న్యూఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి నడిచే రైళ్లు 5 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ- చెన్నై ఎక్స్‌ప్రెస్, హజ్రత్ నిజాముద్దీన్-విశాఖపట్నం లింక్, న్యూఢిల్లీ-తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లు ఆరుగంటలకు పైగా ఆలస్యంగా వచ్చాయి. ఉత్తరాది నుంచి వస్తున్న రైళ్లు ఆలస్యమవుతున్నట్టు అధికారులు చెప్పారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులను ఎలాంటి అదనపు చార్జీ లేకుండా ఇతర రైళ్లలో ప్రయాణించడానికి అనుమతిస్తున్నట్టు తెలిపారు. -
భారీగా మంచు.. పలు రైళ్ల రద్దు
ఉత్తరాదిలో మంచు వణికిస్తోంది. ఢిల్లీ ప్రాంతంలో కన్ను పొడుచుకున్నా ముందు ఏముందో కనిపించడం లేదు. దీంతో ఏడు రైళ్లను రద్దు చేయగా మరో ఆరు రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. జార్ఖండ్, ఉజ్జయిని, హౌరా జనతా ఎక్స్‌ప్రెస్‌లతో సహా మొత్తం ఏడు రైళ్లను రద్దు చేశారు. కనీసం పది మీటర్ల ముందు ఏముందో కూడా కనిపించకపోవడంతో రైళ్లను నడిపించడం చాలా కష్టంగా ఉందని, ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకే రైలు సర్వీసులను రద్దు చేశామని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. భాగల్పూర్ గరీబ్ రథ్, మహాబోధి ఎక్స్‌ప్రెస్ రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. -
పొగమంచుతో 106 విమానాల రద్దు
పొగమంచు కారణంగా చైనాలో 106 విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. ఆగ్నేయ చైనాలోని యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్ విమానాశ్రయాన్ని పొగమంచు దట్టంగా ఆవరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని కారణంగా వందలాది విమానాల సర్వీసులు ఆలస్యంగా బయల్దేరనున్నాయి. ఈ సంఘటనతో వేలాది ప్రయాణికులకు అసౌకర్యం ఏర్పడింది. విమానాశ్రయ సిబ్బంది విమానాల రద్దు, ఆలస్యం విషయాన్ని లౌడ్ స్పీకర్లు, ఎస్ఎమ్ఎస్ల ద్వారా ప్రయాణికులకు చేరవేశారు. ప్రయాణికులు భోజనవసతి కల్పించారు. పొగమంచు కారణంగా ఇక్కడ మూడు రోజుల నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.