విజయవాడ: పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. న్యూఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి నడిచే రైళ్లు 5 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ- చెన్నై ఎక్స్ప్రెస్, హజ్రత్ నిజాముద్దీన్-విశాఖపట్నం లింక్, న్యూఢిల్లీ-తిరువనంతపురం ఎక్స్ప్రెస్ తదితర రైళ్లు ఆరుగంటలకు పైగా ఆలస్యంగా వచ్చాయి. ఉత్తరాది నుంచి వస్తున్న రైళ్లు ఆలస్యమవుతున్నట్టు అధికారులు చెప్పారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులను ఎలాంటి అదనపు చార్జీ లేకుండా ఇతర రైళ్లలో ప్రయాణించడానికి అనుమతిస్తున్నట్టు తెలిపారు.
మంచు కారణంగా రైళ్లు 6 గంటలు ఆలస్యం
Published Sun, Dec 21 2014 5:59 PM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM
Advertisement
Advertisement