running late
-
రాజధానిని కమ్మేసిన పొగమంచు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు దట్టంగా అలుముకుంది. రైలు, రోడ్డు మార్గం పూర్తిగా పొగమంచుతో కప్పి ఉన్నాయి. ఈ కారణంగా రైళ్ల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. పొగమంచు కారణంగా 34 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే అధికారులు 13 రైళ్లను రద్దు చేశారు. 2 రైలు వేళ్లల్లో మార్పులు చేశారు. -
అండమాన్ ఎక్స్‌ప్రెస్ ఐదు గంటలు ఆలస్యం
రామగుండం (కరీంనగర్ జిల్లా): జమ్ముకాశ్మీర్‌లో కుండపోత వర్షాలు, పోటెత్తిన వరదల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమవారం జమ్ముతావి నుంచి చెన్నై వెళ్లే అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌కు సాయంత్రం 4.30 గంటలకు రావాల్సి ఉండగా, ఐదు గంటల ఆలస్యంగా రాత్రి 10 గంటలకు వచ్చింది. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. -
విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
విజయవాడ: రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా విజయవాడ-గూడూరు మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. మంగళవారం ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద ట్రాక్‌కు స్వల్ప మరమ్మతులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ-గూడూరు పాసింజర్ రైలును ఒంగోలు వరకే పరిమితం చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే మిగతా రైళ్ల రాకపోకల్లోనూ ఆలస్యం చోటు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. -
మంచు కారణంగా రైళ్లు 6 గంటలు ఆలస్యం
విజయవాడ: పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. న్యూఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి నడిచే రైళ్లు 5 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ- చెన్నై ఎక్స్‌ప్రెస్, హజ్రత్ నిజాముద్దీన్-విశాఖపట్నం లింక్, న్యూఢిల్లీ-తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లు ఆరుగంటలకు పైగా ఆలస్యంగా వచ్చాయి. ఉత్తరాది నుంచి వస్తున్న రైళ్లు ఆలస్యమవుతున్నట్టు అధికారులు చెప్పారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులను ఎలాంటి అదనపు చార్జీ లేకుండా ఇతర రైళ్లలో ప్రయాణించడానికి అనుమతిస్తున్నట్టు తెలిపారు.