ఉత్తరాదిలో మంచు వణికిస్తోంది. ఢిల్లీ ప్రాంతంలో కన్ను పొడుచుకున్నా ముందు ఏముందో కనిపించడం లేదు. దీంతో ఏడు రైళ్లను రద్దు చేయగా మరో ఆరు రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. జార్ఖండ్, ఉజ్జయిని, హౌరా జనతా ఎక్స్‌ప్రెస్‌లతో సహా మొత్తం ఏడు రైళ్లను రద్దు చేశారు.
కనీసం పది మీటర్ల ముందు ఏముందో కూడా కనిపించకపోవడంతో రైళ్లను నడిపించడం చాలా కష్టంగా ఉందని, ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకే రైలు సర్వీసులను రద్దు చేశామని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. భాగల్పూర్ గరీబ్ రథ్, మహాబోధి ఎక్స్ప్రెస్ రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి.
భారీగా మంచు.. పలు రైళ్ల రద్దు
Published Wed, Jan 1 2014 12:53 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement