trains delayed
-
విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకకు అంతరాయం
సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. సోమవారం ఈ అంతరాయం ఏర్పడింది. కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో గూడ్స్ పట్టాలు తప్పించింది. దీంతో పిఠాపురంలో యశ్వంత్‌పూర్, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
మంచు దుప్పటిలో రాజధాని : పలు రైళ్లు జాప్యం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిని పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీ వెళ్లే పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొంది. హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ఫైజాబాద్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌లు ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు మంగళవారం ఉదయం ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాల్లో వాయు కాలుష్యం స్ధాయి ప్రమాదకర స్ధాయికి చేరడంతో వెరీపూర్ క్యాటగిరీగా నిర్ధారించారు. శీతలగాలులకు తోడు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ట్రాఫిక్ కష్టాలను మరింత పెంచాయి. పొగమంచు తాకిడితో రహదారులు, ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
కాజీపేట మార్గంలో నిలిచిన రైళ్లు
పెద్దపల్లి: పెద్దపల్లి-కాజీపేట మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు బుధవారం ఉదయం అంతరాయం ఏర్పడింది. బోగీల మధ్య లింకు తెగడంతో మానేరు వంతెనపై గూడ్స్ రైలు నిలిచిపోయింది. పోత్కపల్లి-బిజిగిరిషరీఫ్ రైల్వేస్టేసన్ల మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది. రైల్వే సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మరమ్మత్తు పనులు చేపట్టారు. గూడ్సు ఆగిపోవడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
28 రైళ్లు ఆలస్యం..10 రైళ్ల వేళల్లో మార్పులు
ఢిల్లీ: దేశ రాజధానిని దట్టమైన పొగమంచు కప్పేసింది. పొగమంచు కారణంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ మీదుగా ప్రయాణిస్తున్న 28 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. మరో 10 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. దీంతో పాటు ఒక రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. -
వర్షాలతో ఆలస్యంగా నడిచిన రైళ్లు
కంచిలి: రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. దీంతో పలు రైళ్లు శుక్రవారం ఆలస్యంగా నడిచాయి. సోంపేట, ఇచ్ఛాపురం స్టేషన్ల మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లు సుమారు రెండు గంటల పాటు ఆలస్యంగా ప్రయాణించాయి. ఉదయం ప్రశాంతి, హౌరా–చెన్నై సూపర్‌ఫాస్ట్ మెయిల్, ఇంటర్ సిటీ, విశాఖ, హౌరా–తిరుచినాపల్లి ఎక్స్‌ప్రెస్‌లు గంటల తరబడి స్టేషన్లో నిలిపివేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. -
ఒడిశాలో బంద్‌తో రైళ్ల ఆలస్యం
ఇచ్ఛాపురం (కంచిలి) : ఒడిశా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జరిగిన బంద్ కారణంగా ఆంధ్రా వైపు వచ్చే పలు రైళ్లు మంగళవారం ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు రైల్వేస్టేషన్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి రైళ్ల కోసం వేచి ఉండాల్సి వచ్చింది. స్టేషన్లో వేచి ఉండేందుకు సరైన సదుపాయాలు లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులతో ప్రయాణానికి వచ్చిన వారు అవస్థలు పడ్డారు. బంద్ కారణంగా ఉదయం 8.20 గంటలకు రావాల్సిన భువనేశ్వర్–బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ 11.05 గంటలకు, 9.30 గంటలకు రావాల్సిన హౌరా–చెన్నై మెయిల్ మధ్యాహ్నం 12.28 గంటలకు, 10.20 గంటలకు రావాల్సిన భువనేశ్వర్–విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ 11.34 గంటలకు వచ్చాయి. భువనేశ్వర్–సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్ 11.59 గంటలకు వచ్చింది. దీంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. -
ట్రాక్‌పై నిలిచిన లారీ...ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు
పశ్చిమగోదావరి జిల్లా: కొవ్వూరు రైల్వేగేటు సమీపంలో రైల్వే ట్రాక్‌పై లారీ సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో ఆదివారం సాయంత్రం పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో విజయవాడ నుండి విశాఖపట్నం వైపు వెళ్లే పలు రైళ్లను చాగల్లు రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. కొరమండల్ ఎక్స్‌ప్రెస్, కొణార్క్ ఎక్స్‌ప్రెస్, ఈస్ట్కొస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లారీని ట్రాక్‌పై తొలగించి రైళ్లను పునరుద్ధరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
జోరు వాన.. ఆగిన రైళ్లు
-
స్పెషల్ ట్రైన్‌కు తప్పిన ప్రమాదం
పశ్చిమగోదావరి: బోగీ విరిగి పడి పోవటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు సమీపంలో శనివారం ఉదయం జరిగింది. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే స్పెషల్ ప్యాసింజర్ రైలు శనివారం ఉదయం 5 గంటల సమయంలో ఉంగుటూరు సమీపంలో రాగా ఒక బోగీ నిట్టనిలువుగా చీలి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బోగీ విరిగిపోవటంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అధికారులు వెంటనే ఏర్పాట్లు చేయకపోవటంతో కొందరు బస్సుల్లో వెళ్లిపోయారు. అయితే, అధికారులు కొద్దిసేపటి తర్వాత వచ్చిన సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో మిగిలిన ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేలా ఏర్పాట్లు చేశారు. విరిగిపడిన బోగీని పక్కకు తొలిగించి ఉదయం 7.30 గంటలకు రైళ్ల రాకపోకలకు వీలు కల్పించారు. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రెండు గంటలపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. -
అదే ఆలస్యం.. అవే అవస్థలు
- రైళ్ల రాకపోకల్లో విపరీతమైన జాప్యం - పడరాని పాట్లు పడుతున్న ప్రయాణికులు పుష్కరఘాట్ (రాజమండ్రి) : పుష్కర స్నానమాచరించేందుకు రైళ్లలో రాజమండ్రి వస్తున్న ప్రయాణికులు అవే కష్టాలు ఎదుర్కొంటున్నారు. రైళ్లు ఆలస్యంగానే నడవడంతో అసహనానికి గురవుతున్నారు. కర్నూలు, కడప, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల నుంచి వచ్చే భక్తులు అధికంగా రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు 112 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నా సరిపోవడం లేదు. రైలు ప్లాట్ఫారం మీదకు వచ్చేసరికి చోటు దొరకదనే భయంతో యాల్రికులు పట్టాలపై నుంచి పరుగులు తీసి రెలైక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. నాలుగైదు గంటలకు ఒకసారి తమ ప్రాంతానికి వెళ్లే రైలు రావడంతో యాత్రికుల నడుమ తోపులాటలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సోమవారం రద్దీ మరింత అధికం కావడంతో రాజమండ్రి , గోదావరి రైల్వే స్టేషన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఇబ్బందులు పడుతున్న పిల్లలు రైళ్లలో ప్రయాణించే భక్తుల పిల్లలు ఆలస్యాన్ని, అసౌకర్యాన్నీ తట్టుకోలేక గగ్గోలు పెడుతున్నారు. వారిని సముదారుుంచడం తల్లిదండ్రుల వల్ల కావడం లేదు. కొంత మంది తిరుగు ప్రయాణంలో బస్సులను ఆశ్రయిస్తున్నారు. అవి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. రాజమండ్రి, గోదావరి రైల్వే స్టేషన్లు దుర్గంధభరితంగా మారాయి. పారిశుధ్య సిబ్బంది తక్కువగా ఉండడంతో పరిసరాలను పరిశుభ్రం చేయడం సాధ్యపడడం లేదు. యాత్రికులు తినుబండారాల వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ పారవేయడం, బహిరంగ మలమూత్ర విసర్జన చేయడం వల్ల పరిసరాలు దుర్గంధపూరితం అవుతున్నారుు. బయో టాయిలెట్లు కూడా పూర్తి స్థాయిలో నిర్వహణ లేక కంపుకొడుతున్నాయి. సొమ్మసిల్లిపోతున్నారు.. రైల్వేస్టేషన్/ రాజమండ్రి సిటీ : సోమవారం ఉదయం నుంచి రైల్వే, బస్స్టేషన్లు రద్దీగా మారాయి. రాజమండ్రి రైల్వేస్టేషన్లో ఒడిశా రాష్ర్టం పర్లాకిమిడికి చెందిన రాము రైలు ఎక్కబోయి సొమ్మసిల్లిపోగా రైల్వే ఆసుపత్రి సిబ్బంది సేవలు అందించారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే వికలాంగుడు రైలు ఎక్కే సమయంలో చాలా ఇబ్బంది పడ్డాడు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో నాలుగు, ఐదు ప్లాట్‌ఫారాలకు చేరుకోవాలంటే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది పట్టాలపైనే ఉంటూ రైళ్ల రాక కోసం ఎదురు చూస్తున్నారు. -
కొంకణ్ రైళ్లు ఆలస్యం
సాక్షి, ముంబై: కొంకణ్ రైల్వే మార్గంలో గత నాలుగైదు రోజుల నుంచి వివిధ కారణాలవల్ల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. తమ గమ్యస్థానాలకు చేరుకోవాలంటే సాధారణ సమయానికి కంటే సుమారు రెట్టింపు సమయం పడుతోంది. దాదాపు 10 లేదా 12 గంటల్లో ముగించాల్సిన ప్రయాణానికి 24 గంటల సమయం పడుతుంది. దీంతో గణేష్ ఉత్సవాలకు ముంబై నుంచి స్వగ్రామాలకు బయలుదేరిన కొంకణ్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గణేష్ ఉత్సవాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఎమ్మెస్సార్టీసీ అదనంగా 3,500 బస్సులు నడుపుతోంది. వీటికి తోడుగా దాదాపు 150కి పైగా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. దీన్ని బట్టి కొంకణ్ వైపు ప్రయాణికుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. ఒకపక్క ఈ మార్గంపై రెగ్యులర్‌గా నడిచే రైళ్లతోపాటు ప్రత్యేక రైళ్ల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో క్రాసింగ్‌ల కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ఆదివారం కరంజాడి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్‌రైలు పట్టాలు తప్పడంతో 500 మీటర్ల మేర రైల్వే లైన్ పూర్తిగా దెబ్బతింది. తాత్కాలికంగా స్లీపర్స్వేసి సోమవారం నుంచి రైళ్లను పునరుద్ధరించారు. కాని కరంజాడి స్టేషన్ సమీపంలో రైళ్ల వేగాన్ని నియంత్రించారు. మరోపక్క సెంట్ర ల్ రైల్వే హద్దు రోహా వరకు ఉంది. ఆ తర్వాత కొంకణ్ రైల్వే డివిజన్ ప్రారంభమవుతుంది. దీంతో ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ), దాదర్, లోక్మాన్య తిలక్ (కుర్లా) టర్మినస్ నుంచి బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైళ్ల మోటార్ మెన్లు, గార్డులు రోహలో మారుతారు. కాని 150కిపైగా అదనంగా నడుపుతున్న రైళ్ల కారణంగా సిబ్బంది కొరత ఏర్పడుతోంది. కొంకణ్ రైల్వే, సెంట్రల్ రైల్వే మధ్య సమన్వయం లేకపోవడంవల్ల రెండు, మూడు గంటలపాటు రైళ్లు రోహాలోనే నిలిచిపోతున్నాయి. డబుల్ డెక్కర్ ఏసీ రైలు ప్రారంభించిన మొదటిరోజే ఈ సమస్య ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో ఈ సమస్య మరింత అధికంగా ఉంది. ఇలా అనేక కారణాలవల్ల కొంకణ్ రైళ్లు తమ గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకుంటున్నాయి. దాదర్-సావంత్వాడి 12 గంటలు, రత్నగిరి-దాదర్ ఎనిమిది గంటలు, దీవా-సావంత్వాడి ఎనిమిది గంటలు, మాండ్వీ ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు, నేత్రవతి ఎక్స్‌ప్రెస్ ఆరు గంటలు, జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్ ఎనిమిది గంటలు, గణేష్ ఉత్సవాల ప్రత్యేక రైళ్లు 12 గంటల చొప్పున ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు అన్ని రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికుల సహనానికి పరీక్ష పెట్టినట్లయితోంది. ఉత్సవాల కారణంగా ఇప్పటికే రైళ్లన్నీ కిక్కిరిసి పోతున్నాయి. వెయిటింగ్ లిస్టు 500-800 ఉన్నప్పటికీ టెకెట్లు కొనుగోలుచేస్తున్నారు. అందులో కాలుపెట్టడానికి ఇంత చోటు దొరికితే చాలని అనుకుంటున్నారు. కాని రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రైల్వే సిగ్నల్ ఫెయిల్... కొంకణ్ రైల్వే మార్గంలో విఘ్నాల పరంపర కొనసాగుతూనే ఉంది. కరంజాడీ స్టేషన్ సమీపంలో బుధవారం ఉదయం సిగ్నల్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గత ఆదివారం ఇదే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా ఇప్పటికీ రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనికి తోడు సిగ్నల్ ఫెయిల్ కావడంతో కొంకణ్ రైల్వే పరిస్థితి మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లుగా మారింది. కొన్ని ప్యాసెంజర్ రైళ్లను లూప్లైన్లోకి మళ్లించి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయినప్పటికీ అప్,డౌన్ రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఢిల్లీలో పొగమంచు.. 50 రైళ్లు ఆలస్యం
ఢిల్లీలో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. కన్ను పొడుచుకున్నా ముందు ఏముందో అర్థం కావట్లేదు. దీంతో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 రైళ్లు విపరీతంగా ఆలస్యమయ్యాయి. వాతావరణ శాఖ మాత్రం ఆకాశం నిర్మలంగా ఉంటుందని చెప్పినా, అందుకు భిన్నంగానే కనిపించింది. ఉదయం 8.30 గంటలకు కూడా 600 మీటర్ల వరకు మాత్రమే కనిపించిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం 50 రైళ్లు ఆలస్యంగా నడిచినట్లు ఉత్తర రైల్వే వర్గాలు తెలిపాయి. కనిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 2 డిగ్రీలకు అటూ ఇటూగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఉదయం 8.30 గంటలకు గాలిలో తేమ 88 శాతం ఉంది. -
భారీగా మంచు.. పలు రైళ్ల రద్దు
ఉత్తరాదిలో మంచు వణికిస్తోంది. ఢిల్లీ ప్రాంతంలో కన్ను పొడుచుకున్నా ముందు ఏముందో కనిపించడం లేదు. దీంతో ఏడు రైళ్లను రద్దు చేయగా మరో ఆరు రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. జార్ఖండ్, ఉజ్జయిని, హౌరా జనతా ఎక్స్‌ప్రెస్‌లతో సహా మొత్తం ఏడు రైళ్లను రద్దు చేశారు. కనీసం పది మీటర్ల ముందు ఏముందో కూడా కనిపించకపోవడంతో రైళ్లను నడిపించడం చాలా కష్టంగా ఉందని, ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకే రైలు సర్వీసులను రద్దు చేశామని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. భాగల్పూర్ గరీబ్ రథ్, మహాబోధి ఎక్స్‌ప్రెస్ రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి.