మంచు దుప్పటిలో రాజధాని : పలు రైళ్లు జాప్యం | Delhi Bound Trains Delayed As Bad Weather Hits Indian Railways | Sakshi
Sakshi News home page

మంచు దుప్పటిలో రాజధాని : పలు రైళ్లు జాప్యం

Published Tue, Jan 7 2020 8:33 AM | Last Updated on Tue, Jan 7 2020 8:33 AM

Delhi Bound Trains Delayed As Bad Weather Hits Indian Railways - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిని పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీ వెళ్లే పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొంది. హైదరాబాద్‌-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ఫైజాబాద్‌-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌లు ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు మంగళవారం ఉదయం ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాల్లో వాయు కాలుష్యం స్ధాయి ప్రమాదకర స్ధాయికి చేరడంతో వెరీపూర్‌ క్యాటగిరీగా నిర్ధారించారు. శీతలగాలులకు తోడు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ట్రాఫిక్‌ కష్టాలను మరింత పెంచాయి. పొగమంచు తాకిడితో రహదారులు, ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement