ఢిల్లీలో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. కన్ను పొడుచుకున్నా ముందు ఏముందో అర్థం కావట్లేదు. దీంతో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 రైళ్లు విపరీతంగా ఆలస్యమయ్యాయి.
ఢిల్లీలో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. కన్ను పొడుచుకున్నా ముందు ఏముందో అర్థం కావట్లేదు. దీంతో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 రైళ్లు విపరీతంగా ఆలస్యమయ్యాయి. వాతావరణ శాఖ మాత్రం ఆకాశం నిర్మలంగా ఉంటుందని చెప్పినా, అందుకు భిన్నంగానే కనిపించింది.
ఉదయం 8.30 గంటలకు కూడా 600 మీటర్ల వరకు మాత్రమే కనిపించిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం 50 రైళ్లు ఆలస్యంగా నడిచినట్లు ఉత్తర రైల్వే వర్గాలు తెలిపాయి. కనిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 2 డిగ్రీలకు అటూ ఇటూగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఉదయం 8.30 గంటలకు గాలిలో తేమ 88 శాతం ఉంది.