ఢిల్లీ: దేశ రాజధానిని చలి, పొగమంచు వణికిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయాయి. చలిగాలులు వీస్తుండటంతో గురువారం ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.
భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఈ రోజు ఉదయం 5.30 గంటలకు పంజాబ్, హర్యానా, పశ్చిమ రాజస్థాన్, బిహార్‌లోని పలు ప్రాంతాల్లో చాలా దట్టమైన పొగమంచు కనిపించింది. దేశ రాజధాని గత నెల రోజులుగా తీవ్రమైన చలిగాలులతో అల్లాడిపోతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో దృశ్యమానత(విజిబిలిటీ) 50 మీటర్లకు పడిపోయింది.
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, అస్సాంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు పొగమంచు కనిపించిందని ఐఎండీ తెలిపింది.
ఇదీ చదవండి: ఆ రోజు కోర్టులకు సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ
Comments
Please login to add a commentAdd a comment