Trains Affect
-
పొగమంచుతో రైళ్ల రాకపోకల్లో జాప్యం.. సోషల్ మీడియాలో వాపోతున్న ప్రయాణికులు
న్యూఢిల్లీ: ఉత్తరాదిని పొగమంచు కమ్ముకుంటోంది. దీని ప్రభావం రైళ్ల రాకపోకలపై పడుతోంది. విజిబిలిటీ తక్కువగా ఉండటానికి తోడు ఇతరత్రా కారణాలతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లే రైళ్లపై కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.రైళ్ల రాకపోకల్లో ఆలస్యంపై ప్రయాణికులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పలు ఫిర్యాదులు చేస్తున్నారు. రైలు నంబర్ 06071 కొచ్చువేలి నుండి ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలు 6 గంటల 47 నిమిషాలు ఆలస్యంగా నడిచి, నవంబర్ 18వ తేదీ తెల్లవారుజామున 3.27 గంటలకు చేరుకుంది. ఇదే మాదిరిగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. Gede(3.50)-Sealdah (6.25) . Delay by more than 1 hours, I am going to give blood to a patient, in Kolkata, he needs blood before 8 am, I don't know how to reach before 8 am. Why was no notice given in advance of the train delay?? @drmsdah @RailMinIndia @AshwiniVaishnaw sir. pic.twitter.com/B4hSZUEhC3— Suranjan Paul (@suranjanPaul23) November 18, 2024సురంజన్ పాల్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ‘నేను ప్రయాణించాల్సిన రైలు గంటకు మించిన ఆలస్యంతో సడుస్తోంది. నేను కోల్‌కతాలో ఉన్న ఒక రోగికి రక్తం ఇవ్వాల్సివుంది. అతనికి ఉదయం 8 గంటలలోపు రక్తం ఇవ్వాలి. ఈ లోపున నేను అక్కడికి ఎలా చేరుకోవాలో నాకు తెలియడంలేదు. రైలు ఆలస్యం గురించి ముందస్తు నోటీసు ఎందుకు ఇవ్వలేదని’ ప్రశ్నించారు. Train number - 02569. This train is 7 hour late. Passengers are facing problems due to train delay. Children and elderly are very worried. I might miss office tomorrow too. #trainlate @RailMinIndia @AshwiniVaishnaw @PMOIndia— Alok Kumar Thakur (@aalokthakur) November 17, 2024మరొక ప్రయాణికుడు ‘రైలు నంబర్ - 02569.. ఏడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నేను ఈ రోజు ఆఫీసుకు వెళ్లలేను. రేపు ఆఫీసుకి తప్పకుండా వెళ్లాలి’ అని రాశాడు. అంజలి ఝా అనే ప్రయాణికురాలు 23:55కి చేరుకోవాల్సిన రైలు 2 గంటలు ఆలస్యంగా నడుస్తోందని, రన్నింగ్ స్టేటస్ కొద్ది నిమిషాల క్రితమే నవీకరించారని తెలిపారు. నాకు 23:44కి ఈ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నేను అర్ధరాత్రి రెండు గంటల పాటు ఎలా వేచి ఉండాలి’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు -
ఢిల్లీని వణికిస్తున్న చలిగాలులు
ఢిల్లీ: దేశ రాజధానిని చలి, పొగమంచు వణికిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయాయి. చలిగాలులు వీస్తుండటంతో గురువారం ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఈ రోజు ఉదయం 5.30 గంటలకు పంజాబ్, హర్యానా, పశ్చిమ రాజస్థాన్, బిహార్‌లోని పలు ప్రాంతాల్లో చాలా దట్టమైన పొగమంచు కనిపించింది. దేశ రాజధాని గత నెల రోజులుగా తీవ్రమైన చలిగాలులతో అల్లాడిపోతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో దృశ్యమానత(విజిబిలిటీ) 50 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, అస్సాంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు పొగమంచు కనిపించిందని ఐఎండీ తెలిపింది. ఇదీ చదవండి: ఆ రోజు కోర్టులకు సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ -
రాజధానిని కమ్మేసిన పొగమంచు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు దట్టంగా అలుముకుంది. రైలు, రోడ్డు మార్గం పూర్తిగా పొగమంచుతో కప్పి ఉన్నాయి. ఈ కారణంగా రైళ్ల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. పొగమంచు కారణంగా 34 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే అధికారులు 13 రైళ్లను రద్దు చేశారు. 2 రైలు వేళ్లల్లో మార్పులు చేశారు. -
ఢిల్లీలో దట్టంగా అలుముకున్న పొగమంచు
సాక్షి: ఢిల్లీలో దట్టంగా పొగమంచు అలుముకున్నది. పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్నిటి వేళల్లో మార్పులు చేశారు. 17 రైళ్లను రద్దు చేయగా 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 6 రైళ్ల వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
4 రైళ్లు రద్దు.. మరో 12 దారి మళ్లింపు
చండీగఢ్: పంజాబ్‌లో రైతులు తమ ఆందోళనను తీవ్రం చేశారు. రైతు ప్రతికూల ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బుధవారం నుంచి రెండు రోజుల పాటు రైళ్ల రాకపోకలను అడ్డుకోవాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. రైతుల ఆందోళన దృష్ట్యా పంజాబ్ నుంచి వెళ్లాల్సిన 4 రైళ్లను రద్దు చేశారు. మరో 12 రైళ్లను దారి మళ్లించారు. పంజాబ్‌లో ఎనిమిది రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. పంజాబ్‌లో పలు ప్రాంతాల్లో రైళ్లను అడ్డుకుంటామని, తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తామని రైతు సంఘాల నాయకులు చెప్పారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, గిట్టుబాటు ధర కల్పించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.