పొగమంచుతో రైళ్ల రాకపోకల్లో జాప్యం.. సోషల్‌ మీడియాలో వాపోతున్న ప్రయాణికులు | Fog Affects Train Movement, Many Trains Running Late | Sakshi
Sakshi News home page

పొగమంచుతో రైళ్ల రాకపోకల్లో జాప్యం.. సోషల్‌ మీడియాలో వాపోతున్న ప్రయాణికులు

Published Mon, Nov 18 2024 10:13 AM | Last Updated on Mon, Nov 18 2024 10:20 AM

Fog Affects Train Movement, Many Trains Running Late

న్యూఢిల్లీ: ఉత్తరాదిని పొగమంచు కమ్ముకుంటోంది. దీని ప్రభావం రైళ్ల రాకపోకలపై  పడుతోంది. విజిబిలిటీ తక్కువగా ఉండటానికి తోడు ఇతరత్రా కారణాలతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లే రైళ్లపై కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

రైళ్ల రాకపోకల్లో ఆలస్యంపై ప్రయాణికులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పలు ఫిర్యాదులు చేస్తున్నారు. రైలు నంబర్ 06071 కొచ్చువేలి నుండి ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలు 6 గంటల 47 నిమిషాలు ఆలస్యంగా నడిచి, నవంబర్ 18వ తేదీ తెల్లవారుజామున 3.27 గంటలకు చేరుకుంది. ఇదే మాదిరిగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
 

సురంజన్ పాల్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ఎక్స్‌లో ‘నేను ప్రయాణించాల్సిన రైలు గంటకు మించిన ఆలస్యంతో సడుస్తోంది. నేను కోల్‌కతాలో ఉన్న  ఒక రోగికి రక్తం ఇవ్వాల్సివుంది. అతనికి ఉదయం 8 గంటలలోపు రక్తం  ఇవ్వాలి. ఈ లోపున నేను అక్కడికి ఎలా చేరుకోవాలో నాకు తెలియడంలేదు. రైలు ఆలస్యం గురించి ముందస్తు నోటీసు ఎందుకు ఇవ్వలేదని’ ప్రశ్నించారు.  

మరొక ప్రయాణికుడు ‘రైలు నంబర్ - 02569.. ఏడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నేను ఈ రోజు ఆఫీసుకు వెళ్లలేను. రేపు ఆఫీసుకి తప్పకుండా వెళ్లాలి’ అని రాశాడు. అంజలి ఝా అనే ప్రయాణికురాలు 23:55కి చేరుకోవాల్సిన రైలు 2 గంటలు ఆలస్యంగా నడుస్తోందని, రన్నింగ్ స్టేటస్ కొద్ది నిమిషాల క్రితమే నవీకరించారని తెలిపారు. నాకు 23:44కి ఈ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నేను అర్ధరాత్రి రెండు గంటల పాటు ఎలా వేచి ఉండాలి’ అని ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి: మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్‌ అందాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement