passenegrs
-
దేశంలోని ఏఏ నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి?
దేశంలో శరవేగంగా పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగణంగా తగిన మౌలిక సదుపాయాలు ఏర్పడుతున్నాయి. వీటిలో ఒకటే మెట్రో రైళ్లు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు, కాలుష్యం నుండి నగరాలను కాపాడేందుకు మెట్రో రైళ్లు వరంలా మారాయి. ప్రస్తుతం దేశంలోని ఏఏ నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.కోల్‌కతా మెట్రో కోల్‌కతా మెట్రో 1984, అక్టోబర్ 24న తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది దేశంలోనే తొలి మెట్రో ప్రాజెక్టు. కోల్‌కతా మెట్రోను కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ (కేఎంఆర్సీ) నిర్వహిస్తోంది. కోల్‌కతా మెట్రోలో రోజుకు 5.5 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు.ఢిల్లీ మెట్రో ఢిల్లీ మెట్రోను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)పర్యవేక్షిస్తుంది. ఢిల్లీ మెట్రో 2002లో ప్రారంభమైంది. ప్రతిరోజూ 55 లక్షల మంది ప్రయాణికులు ఢిల్లీ మెట్రోలో ప్రయాణాలు సాగిస్తుంటారు.బెంగళూరు మెట్రో (నమ్మ మెట్రో) బెంగళూరు మెట్రో 2011, అక్టోబర్ 20న తన కార్యకలాపాలు ప్రారంభించింది. దీనిని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్)నిర్వహిస్తోంది. ఈ నెట్‌వర్క్‌లో రెండు లైన్లు, 64 స్టేషన్లు ఉన్నాయి. బెంగళూరు మెట్రోలో రోజుకు 5.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.హైదరాబాద్ మెట్రో హైదరాబాద్ మెట్రోలో మొత్తం 57 స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో తన కార్యకలాపాలను 2017, నవంబర్ 29న ప్రారంభించింది. హైదరాబాద్ మెట్రోలో రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఈ మెట్రో నిర్వహణ బాధ్యత హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)పై ఉంది.పూణే మెట్రో పూణే మెట్రో మూడు లైన్లు ఉన్నాయి. 23 స్టేషన్లతో కూడిన 54.58 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను పూణె మెట్రో కలిగి ఉంది. పూణే మెట్రో నిర్వహణ బాధ్యతను మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సీఎల్) పర్యవేక్షిస్తుంటుంది. పూణే మెట్రో తన కార్యకలాపాలను 2022, మార్చి 6న ప్రారంభించింది. ఈ మెట్రోలో ప్రతిరోజూ 60 వేల నుంచి 65 వేల మంది ప్రయాణిస్తుంటారు.చెన్నై మెట్రో చెన్నై మెట్రో మొత్తం పొడవు 55 కిలోమీటర్లు. దీని నిర్వహణ బాధ్యత చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ ఎల్)పై ఉంది. 2015లో ప్రారంభమైన ఈ మెట్రోలో ప్రస్తుతం 40 స్టేషన్లు ఉండగా, రోజుకు దాదాపు 2.1 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.ముంబై మెట్రో ముంబై మెట్రో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) పర్యవేక్షణలో ఉంది. 2014లో ప్రారంభమైన ఈ మెట్రోలో రోజుకు 1.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.అహ్మదాబాద్ మెట్రో అహ్మదాబాద్ మెట్రో నిర్వహణ బాధ్యత గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (జీఎంఆర్సీఎల్) చేతుల్లో ఉంది. 2019లో ప్రారంభమైన ఈ మెట్రోలో రెండు లైన్లు, 31 స్టేషన్లు ఉన్నాయి. అహ్మదాబాద్ మెట్రోలో ప్రతిరోజూ దాదాపు 30 వేల మంది ప్రయాణిస్తున్నారు.నాగ్‌పూర్ మెట్రో నాగ్‌పూర్ మెట్రో నెట్వర్క్ దాదాపు 38 కిలోమీటర్లు. నాగ్‌పూర్ మెట్రో నిర్వహణ బాధ్యత మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సీఎల్)పై ఉంది. నాగ్‌పూర్ మెట్రోలో ప్రతిరోజూ దాదాపు 1.2 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.కొచ్చి మెట్రో కొచ్చి మెట్రో 2017లో ప్రారంభమయ్యింది. దీని మొత్తం నెట్వర్క్ 27.4 కిలోమీటర్లు. కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ (కేఎంఆర్ఎల్)కొచ్చి మెట్రో నిర్వహణ బాధ్యత వహిస్తుంది. కొచ్చి మెట్రోలో రోజుకు 80 వేల మంది ప్రయాణిస్తున్నారు.లక్నో మెట్రో లక్నో మెట్రో నిర్వహణ బాధ్యత ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (యూపీఎంఆర్సీ)పై ఉంది. ప్రస్తుతం లక్నో మెట్రోలో ఒక లైన్ ఉంది. లక్నో మెట్రోలో రోజుకు 40 వేల మంది ప్రయాణిస్తున్నారు. లక్నో మెట్రో 2017లో ప్రారంభమయ్యింది.జైపూర్ మెట్రో జైపూర్ మెట్రో 2015లో చాంద్‌పోల్- మానసరోవర్ మధ్య నడిచే సర్వీసుతో ప్రారంభమయ్యింది. 11 స్టేషన్లు ఉన్న ఈ మెట్రోను జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ (జేఎంఆర్సీ) పర్యవేక్షిస్తుంటుంది.కాన్పూర్ మెట్రోకాన్పూర్ మెట్రోను ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (యూపీఎంఆర్సీ)నిర్వహిస్తోంది. ప్రస్తుతం కాన్పూర్ మెట్రో తొమ్మిది కిలోమీటర్ల పొడవుతో ఒక లైన్ కలిగివుంది. ఈ మెట్రో 2021, డిసెంబర్ 28 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది.ఇది కూడా చదవండి: అగ్నికి ఆహుతై.. ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న అందమైన చర్చి -
పొగమంచుతో రైళ్ల రాకపోకల్లో జాప్యం.. సోషల్ మీడియాలో వాపోతున్న ప్రయాణికులు
న్యూఢిల్లీ: ఉత్తరాదిని పొగమంచు కమ్ముకుంటోంది. దీని ప్రభావం రైళ్ల రాకపోకలపై పడుతోంది. విజిబిలిటీ తక్కువగా ఉండటానికి తోడు ఇతరత్రా కారణాలతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లే రైళ్లపై కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.రైళ్ల రాకపోకల్లో ఆలస్యంపై ప్రయాణికులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పలు ఫిర్యాదులు చేస్తున్నారు. రైలు నంబర్ 06071 కొచ్చువేలి నుండి ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలు 6 గంటల 47 నిమిషాలు ఆలస్యంగా నడిచి, నవంబర్ 18వ తేదీ తెల్లవారుజామున 3.27 గంటలకు చేరుకుంది. ఇదే మాదిరిగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. Gede(3.50)-Sealdah (6.25) . Delay by more than 1 hours, I am going to give blood to a patient, in Kolkata, he needs blood before 8 am, I don't know how to reach before 8 am. Why was no notice given in advance of the train delay?? @drmsdah @RailMinIndia @AshwiniVaishnaw sir. pic.twitter.com/B4hSZUEhC3— Suranjan Paul (@suranjanPaul23) November 18, 2024సురంజన్ పాల్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ‘నేను ప్రయాణించాల్సిన రైలు గంటకు మించిన ఆలస్యంతో సడుస్తోంది. నేను కోల్‌కతాలో ఉన్న ఒక రోగికి రక్తం ఇవ్వాల్సివుంది. అతనికి ఉదయం 8 గంటలలోపు రక్తం ఇవ్వాలి. ఈ లోపున నేను అక్కడికి ఎలా చేరుకోవాలో నాకు తెలియడంలేదు. రైలు ఆలస్యం గురించి ముందస్తు నోటీసు ఎందుకు ఇవ్వలేదని’ ప్రశ్నించారు. Train number - 02569. This train is 7 hour late. Passengers are facing problems due to train delay. Children and elderly are very worried. I might miss office tomorrow too. #trainlate @RailMinIndia @AshwiniVaishnaw @PMOIndia— Alok Kumar Thakur (@aalokthakur) November 17, 2024మరొక ప్రయాణికుడు ‘రైలు నంబర్ - 02569.. ఏడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నేను ఈ రోజు ఆఫీసుకు వెళ్లలేను. రేపు ఆఫీసుకి తప్పకుండా వెళ్లాలి’ అని రాశాడు. అంజలి ఝా అనే ప్రయాణికురాలు 23:55కి చేరుకోవాల్సిన రైలు 2 గంటలు ఆలస్యంగా నడుస్తోందని, రన్నింగ్ స్టేటస్ కొద్ది నిమిషాల క్రితమే నవీకరించారని తెలిపారు. నాకు 23:44కి ఈ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నేను అర్ధరాత్రి రెండు గంటల పాటు ఎలా వేచి ఉండాలి’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు -
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు!
మానకొండూర్: లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేటకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం వేములవాడ నుంచి సూర్యాపేట వెళ్తోంది. మార్గమధ్యలో మానకొండూర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న జి.కమలమ్మ, భిక్షం, రమణ, బండపెల్లి పద్మతో సహా 15 మంది గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహా యక చర్యలు చేపట్టారు. డ్రైవర్ మల్లయ్య బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో అతికష్టమ్మీద బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మెట్రోలో యువతిపై లైంగిక వేధింపులు.. పట్టించుకోని ప్రయాణికులు!
ఐటీ సిటీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరులో.. రద్దీగా ఉన్న మెట్రోలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. ఆ సమయంలో ఆమె సాయం కోసం కేకలు వేసినా తోటి ప్రయాణికులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నిందితుడు జనంలో కలిసిపోయి, తేలిగ్గా అదృశ్యమయ్యాడు. బాధితురాలి ఫ్రెండ్ ఈ హృదయ విదారక సంఘటనను సోషల్ మీడియా ప్లాట్ఫారం రెడ్డిట్‌లో షేర్ చేశారు. నిందితునిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన స్నేహితురాలు కళాశాలకు రోజూ బస్సులో వెళతారని, అయితే ఆమె సోమవారం (నవంబర్ 20) మెట్రోలో ప్రయాణించారన్నారు. ఉదయం 8.50 గంటల ప్రాంతంలో మెజెస్టిక్‌లోని మెట్రోలో జనం ఎక్కువగా ఉన్నారని, దీంతో తోపులాటలు జరిగాయి. కొద్దిసేపటి తర్వాత, నా స్నేహితురాలికి అసౌకర్యంగా అనిపించింది. ఎర్రటి చొక్కా ధరించిన వ్యక్తి ఆమె వెనుక నిలబడి ఉన్నాడు. అతను ఆమెను అసభ్యంతా తాకడంతోపాటు గోర్లతో ఆమెను గుచ్చాడు. దీంతో ఆమె సహాయం కోసం కేకలు వేసింది. అయినా తోటి ప్రయాణికులెవరూ పట్టించుకోలేదు. ఇంతలో అతను పారిపోయాడని ఆ ఫ్రెండ్ పోస్ట్‌లో రాశారు. ఈ పోస్ట్ చూసిన పలువురు యూజర్స్ స్పందిస్తూ , తమకు తోచిన సలహాలిస్తున్నారు. ఒక యూజర్ తాను మెట్రోలోనే పనిచేస్తున్నానని, మెట్రో అంతటా సీసీటీవీ నిఘాలో ఉన్నందున చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుతారన్నారు. ఈ వేధింపుల విషయమై స్టేషన్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసినా అతను సహాయం అందిస్తాడని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు -
వీరు విమాన ప్రయాణికులేనా?.. పెరుగుతున్న ఫిర్యాదుల పరంపర
విమాన ప్రయాణాల్లో అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు ఇటీవలి కాలంలో తరుచూ నమోదవుతున్నాయి. కొందరు అభ్యంతరకరంగా ప్రవరిస్తూ తోటి ప్రయాణికులను, విమాన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. మరో ప్రయాణికునికి కేటాయించిన సీటులో కూర్చుని.. ఇటీవల టొరంటో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు హంగామా సృష్టించాడు. నేపాల్‌కు చెందిన మహేశ్ పండిట్ అనే ప్రయాణికుడు విమాన సిబ్బందిని తీవ్రంగా దూషించడంతోపాటు లావేటరీ డోర్‌ను ధ్వంసం చేసి, నానా రభస చేశాడు. తనకు కేటాయించిన సీటులో కాకుండా వేరే సీటులో కూర్చుని ఆ ప్రయాణికునితో మహేష్ పండిట్ గొడవపడ్డాడు. ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదు మేరకు నిందితునిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిర్ హోస్టెస్‌ను అసభ్యంగా తాకి.. గత ఏప్రిల్‌లో బ్యాంకాక్ నుంచి ముంబాయికి వస్తున్న ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు ఎయిర్‌హోస్టెస్‌తో పాటు ప్రయాణికులతో అమర్యాదకరంగా ప్రవర్తించాడు. విమానంలో ఆహారం అందుబాటులో లేదని ఎయిర్‌హోస్టెస్ చెప్పడంతో ఒక ప్రయాణికుడు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంతసేపటి తరువాత ఆమె అందించిన చికెన్ డిష్ తీసుకునేందుకు అంగీకరిస్తూ, కార్డు స్వైపింగ్ పేరుతో ఆమెను అసభ్యంగా తాకాడు. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేయగా, మరింత రెచ్చిపోతూ అందరిముందు వేధించాడు. ఈ ఘటనపై సదరు ఎయిర్‌హోస్టెస్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీటు పక్కనే వాంతి చేసుకోవడంతో పాటు.. కొద్దిరోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు ముత్ర విసర్జన చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. గువాహటి నుంచి ఢిల్లీ వెళుతున్న విమానంలో ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో తన సీటు పక్కన వాంతి చేసుకున్నాడు. అంతటితో ఆగక టాయిలెట్ బయట మలవిసర్జన చేశాడు. ఫలితంగా విమాన సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కుక్క పిల్లను ఒడిలో పెట్టుకోవద్దనడంతో.. గత ఏడాది అట్లాంటా విమానాశ్రయంలో న్యూయార్క్ వెళ్లే విమానంలో ప్రయాణించిన ఒక మహిళా ప్రయాణికురాలు తన వెంట ఒక కుక్క పిల్లను తెచ్చుకుంది. ట్రావెల్ కేజ్‌లో ఉంచాల్సిన ఆ కుక్క పిల్లను తన ఒడిలో ఉంచుకొని కూర్చుంది. దీనిని గమనించిన విమాన సిబ్బంది ఆ కుక్క పిల్లను కేజ్‌లో ఉంచాలని చెప్పడంతో, ఆగ్రహించిన ఆ మహిళ విమాన సిబ్బందిని తిట్టడంతోపాటు నానా హంగామా చేసింది. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా వెంటనే విమానం దిగాలని చెప్పిన ఒక ప్రయాణికుడిపై వాటర్ బాటిల్ విసిరింది. అయితే చివరకు ఆ మహిళను విమాన సిబ్బంది కిందకు దించారు. ఈ విషయాన్ని అట్లాంటా పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. గణిత సమీకరణాన్ని పరిష్కరిస్తూ.. ఆ మధ్య అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. విమానంలో గణిత సమీకరణాన్ని పరిష్కరించే విషయంలో తోటి ప్రయాణికుడు అనుమానంగా ప్రవర్తిస్తున్నాడని, విదేశీ స్క్రిప్ట్‌లో రాస్తున్నాడని ఒక మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆ ప్రయాణికుడి కారణంగా తాను అనారోగ్యం పాలయ్యానని పేర్కొంది. ఇందుకు కారకుడైన ప్రొఫెసర్ గైడో మెన్జియోను అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రాంతీయ విమానం టేకాఫ్ చేయడానికి ముందు ప్రశ్నించింది. అసలు విషయం వెల్లడి కావడంతో ఆమెను ప్రత్యేక విమానంలో ఆమె చేరాల్సిన గమ్యస్థానానికి తరలించారు. ఇది కూడా చదవండి: ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు -
ప్రమాదాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..
-
టికెట్ లేని ప్రయాణం .. రైల్వే శాఖకు కోట్లలో లాభం
-
Indigo Flight Emergency Landing:పైలటే ప్రాణాలు కాపాడారు..
శంషాబాద్(హైదరాబాద్): షార్జా నుంచి హైదరాబాద్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ 6ఈ–1406 విమానంలో బయల్దేరిన తమను పైలటే కాపాడారని ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. శనివారం రాత్రి 10.50 గంటలకు బయల్దేరిన విమానం షెడ్యూల్ ప్రకారం శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం తెల్లవారు జామున 4:10 గంటలకు చేరుకో వాల్సి ఉండగా విమానంలోని సాంకేతికలోపాన్ని గుర్తించిన పైలట్ పాకిస్తాన్‌లోని కరాచి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. తెల్లవారు జామున విమానాన్ని కరాచి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసిన అనంతరమే విమానంలో సాంకేతికలోపం తలెత్తిందన్న సమాచారాన్ని ఎయిర్‌లైన్స్ వెల్లడించిందని ప్రయాణికులు తెలిపారు. ఎనిమిది గంటల పాటు విమానంలోనే ఉన్న తర్వాత భోజన ఏర్పాట్లు చేశా రని వెల్లడించారు. తొలుత కరాచి నుంచి ప్రయాణికులను గుజరాత్‌లోని అహ్మదాబాద్ మీదుగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ ప్రయత్నాన్ని రద్దు చేశారు. ప్రత్యేక విమానంలో కరాచి నుంచి నేరుగా శంషాబాద్‌కు తీసుకొచ్చారు. పైలట్ సాంకేతిక లోపం గుర్తించడంతోనే తాము ప్రాణాలతో బయటపడ్డామని, కరాచిలో విమానం ల్యాండయ్యాక మాత్రమే తమకు వివరాలు వెల్లడించారని ప్రయాణికులు తెలిపారు. కరాచి విమానాశ్రయంలో విమానం ల్యాండ్ చేశాక, సుమా రు ఎనిమిది గంటలకు పైగా విమానంలోనే ఉన్నాం. పైలట్ గుర్తించకపోతే పెద్ద ప్రమాదం జరిగేది. – ఓ ప్రయాణికుడు -
ఈ కష్ట‘మెట్లు’ తప్పున్!
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాలన్నా.. విద్యార్థులు, ఉద్యోగులు బస్‌పాస్‌లు తీసుకోవాలన్నా అందుబాటులో ఉన్నది ఏకైక వసతి మెట్ల మార్గమే. రెండంతస్తులు పైకి వెళ్లి అక్కడి నుంచి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్‌కు చేరుకోవాలి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సిటీ బస్సుల్లో రెతిఫైల్కు చేరుకునేవారు, దూరప్రాంతాల నుంచి రైళ్లలో సికింద్రాబాద్ స్టేషన్‌కు వస్తున్న వేలాది మంది ప్రయాణికులు మెట్రో రైలు కోసం ఈ మెట్ల మార్గంలో రాకపోకలు సాగించాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు నాగోల్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి.. అటు మియాపూర్, కూకట్పల్లి, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల నుంచి ఎలాంటి కుదుపు లేకుండా మెట్రో రైళ్లలో హాయిగా సికింద్రాబాద్ ఈస్ట్‌కు చేరుకున్నవారు రెతిఫైల్ మెట్లను ఎక్కలేక, దిగలేక చుక్కలు చూస్తున్నారు. పైగా ఈ మెట్లు ఎంతో ఇరుకుగా, నిటారుగా ఉండడంతో పిల్లలు, మహిళలు, వయోధికులు అవస్థలు పడుతున్నారు. లగేజీతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు రెతిఫైల్ నుంచి మెట్రో స్టేషన్‌కు వెళ్లేందుకు మెట్లు ఎక్కలేకపోతున్నారు. మెట్రో స్టేషన్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లను అనుసంధానం చేసేలా ఉన్న రెతిఫైల్ బస్‌స్టేషన్‌లో కనీస సదుపాయాలు లేకపోవడం ప్రయాణికుల పాలిట శాపంగా పరిణమించింది. కొరవడిన సమన్వయం... ♦ రెతిఫైల్ బస్‌స్టేషన్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, గురుద్వారా, చిలకలగూడ క్రాస్‌రోడ్స్, బ్లూసీ హోటల్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజు సుమారు 1500కు పైగా బస్సులు ఆయా బస్టాపుల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. కనీసం 10 లక్షల మంది సికింద్రాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తారు. ♦ మరోవైపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రోజుకు 1.85 లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. మెట్రో రైళ్లలో సికింద్రాబాద్‌కు చేరుకోవాలంటే తప్పనిసరిగా రెతిఫైల్ నుంచి వెళ్లాల్సిందే. నిత్యం సుమారు 10 వేల మంది ప్రయాణికులు మెట్రో నుంచి ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల కోసం రెతిఫైల్ మీదుగా వెళ్తారు. ఆరీ్టసీ, మెట్రోరైల్, దక్షిణమధ్య రైల్వేల మధ్య సమన్వయం కొరవడడంతో రెతిఫైల్ స్టేషన్లో కనీస సదుపాయాలు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ♦ వాస్తవానికి ఇది ఆర్టీసీకి చెందిన ప్రయాణికుల ప్రాంగణం. ఈ బస్‌స్టేషన్‌లో అద్దెల రూపంలో ఆర్టీసీకి రూ.లక్షల్లో ఆదాయం లభిస్తోంది. కానీ ప్రయాణికుల సదుపాయాలపై మాత్రం ఆర్టీసీ దృష్టి సారించడం లేదు. రైలు, బస్సులు, మెట్రో మధ్య అనుసంధానం కోసం ఈ స్టేషన్‌కు ఆధునిక హంగులు కల్పించే అవకాశం ఉంది. కానీ మెట్రో, ఆర్టీసీ, దక్షిణమధ్య రైల్వేల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రయాణికులు ఒక కనెక్టివిటీ నుంచి మరో కనెక్టివిటీకి సాఫీగా చేరుకోలేకపోతున్నారు. ర్యాంపులు, లిఫ్ట్‌లు అవసరం... ♦ మెట్రో రైళ్లకు, సాధారణ రైళ్లకు అనుసంధానంగా ఉన్న రెతిఫైల్ నుంచి రాకపోకలు సాగించేందుకు ర్యాంపులు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఎంతో అవసరం. భారీ లగేజీతో సికింద్రాబాద్ ఈస్ట్‌కు చేరుకొనేవారు అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రైల్వేస్టేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కు వెళ్లాలన్నా రెండంతస్తుల మెట్లు ఎక్కడం కష్టంగా మారింది. కొద్ది పాటి సదుపాయాలతో ప్రయాణికులకు మూడు ప్రజారవాణా సదుపాయాలను అందుబాటులోకి తీసురావచ్చు. అందుకు కావాల్సిందల్లా మూడు సంస్థల మధ్య సమన్వయమే. -
మధ్య ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘెరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భోపాల్ నుంచి సాగర్ హైవేమీద ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 13 మంది వరకు గాయపడ్డారని, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. భోపాల్ పోలీసు అధికారి కమలేష్ సోని తెలిపిన వివరాలు..ఈ బస్సు ప్రమాదం ఈ రోజు ఉదయం(ఆదివారం) 5 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలిపారు. భోపాల్‌లోని విదిష నగరానికి సమీపంలో హిర్ని గ్రామం వద్ద ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు.. బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్టు గుర్తించారు. సంఘటన సమాచారం అందగానే పోలీసులు హుటాహుటీన ప్రమాద స్థలానికి చేరుకుని.. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించినట్టు తెలిపారు. అయితే, ప్రయాణికులలో 13 మంది వరకు గాయపడ్డారని, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అదే విధంగా, వీరిని మెరుగైన వైద్యం కోసం భోపాల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వామ్మో.. కరోనా ఎఫెక్ట్.. మేం జర్నీచేయం!
సాక్షి, సిటీబ్యూరో: వేసవి వచ్చిందంటే చాలు రైళ్లు కిటకిటలాడుతాయి. ప్రయాణికుల రాకపోకలు రెట్టింపవుతాయి. రైల్వేస్టేషన్లలో సందడి నెలకొంటుంది. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. గతేడాది వేసవిలో కోవిడ్ ఉధృతి దృష్ట్యా రైల్వే సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈసారి వేసవిలో అన్ని రూట్లలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినప్పటికీ రెండో దశ కోవిడ్ విజృంభణతో ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. గత 15 రోజులుగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య తగ్గినట్లు రైల్వే వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సుమారు 25 శాతానికి పైగా ప్రయాణికుల రద్దీ తగ్గినట్లు అంచనా. నెల రోజుల క్రితం వరకు సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజు లక్ష మందికి పైగా రాకపోకలు సాగించగా ఇప్పుడు 60 వేల నుంచి 70 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు వేసవిలో ఏసీ బోగీలకు ఉండే డిమాండ్ కూడా తగ్గింది. కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని చాలా మంది ప్రయాణికులు స్లీపర్ కోచ్‌లను ఎంపిక చేసుకోవడం గమనార్హం. రైళ్లన్నింటినీ పునరుద్ధరించాక ఇలా... ►ఈ ఏడాది సంక్రాంతి నుంచి రైళ్ల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేశారు. గత సంవత్సరం కోవిడ్ దృష్ట్యా లాక్డౌన్ నిబంధనల అనంతరం మొదట 22 రైళ్లను అందుబాటులోకి తెచ్చిన దక్షిణమధ్య రైల్వే అధికారులు ఆ తరువాత ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లను పెంచారు. ► అన్ని రైళ్లను ‘ప్రత్యేకం’ పేరిట నడుపుతున్నారు. సాధారణ చార్జీలను ‘తత్కాల్’కు పెంచేశారు. సంక్రాంతి నాటికి సుమారు 75 రైళ్లు అందుబాటులోకి రాగా ప్రస్తుతం వాటి సంఖ్య వంద దాటింది. ► సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ, ముంబయి, పట్నా, దానాపూర్, అహ్మదాపూర్, రెక్సాల్, లక్నో, కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖ, తిరుపతి, కడప, తదితర అన్ని రూట్లలో రైళ్ల రాకపోకలు పెరిగాయి. ► ఈ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 22 రైళ్లను కొత్తగా పునరుద్ధరించారు. మొదట్లో కేవలం 25 వేల మంది ప్రయాణం చేశారు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. సంక్రాంతి నాటికి అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు భారీగా నమోదైంది. కొన్నింటిలో ఏకంగా 250 నుంచి 300కు చేరుకుంది. వీకెండ్స్‌లో 1.10 లక్షల మంది వరకు ప్రయాణం చేశారు. కానీ రెండో దశ కోవిడ్ విజృంభణతో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. ‘ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నవాళ్లు తమ ప్రయాణాలను యథావిధిగా కొనసాగిస్తున్నప్పటికీ కొత్తగా బుక్ చేసుకొనేవాళ్ల సంఖ్య మాత్రం తగ్గింది’ అని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. పర్యాటకులు బంద్ సాధారణంగా వేసవి రోజుల్లో పర్యాటకుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరాన్ని సందర్శించేందుకు ఎక్కువ మంది వస్తారు. కానీ ఈసారి పర్యాటకులకు బదులు వలస కూలీల రాకపోకలు కొద్దోగొప్పో ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. లాక్డౌన్ కాలంలో సొంత ఊళ్లకు వెళ్లిన కూలీలు సడలింపు అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో తరచుగా సొంత ఊళ్లకు వెళ్లి వచ్చే వాళ్ల సంఖ్య పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గడమే కాకుండా నగరం నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గింది. -
ట్రావెల్స్ బస్సులో పొగలు..తప్పిన ప్రమాదం
సాక్షి, మహానంది : గిద్దలూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రయివేట్ బస్సు ఇంజన్ వెనుక మంటలు వ్యాపించాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లె వద్ద ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకొంది. గిద్దలూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మేఘన ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరబాద్‌కు బయలుదేరింది. ఈ బస్సులో గిద్దలూరు నుంచి హైదరబాద్‌కు సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. నల్లమల ఘాట్‌లోని సర్వ నరసింహస్వామి ఆలయం వద్ద ఆగి భోజనాలు చేసీ బయల్దేరారు. అనంతరం గాజులపల్లె సమీపంలోకి చేరగానే బస్సులోని ఎయిర్ కంప్రెషర్ వద్ద మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు వెంటనే గుర్తించి డ్రైవర్ శివ దృష్టికి తీసుకువెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు ఇంజన్ వెనక మంటలు వ్యాపించడంతో బస్సును గాజులపల్లె మెట్ట వద్ద నిలిపి మంటలను ఆర్పేశారు. ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. -
నీడ కరువు
గరుగుబిల్లి: మండలంలోని సంతోషపురం పంచాయతీ పరిధి ఖడ్గవలస జంక్షన్లో పదేళ్ల కిందట నిర్మించిన బస్ షెల్టర్ శిథిలావస్థకు చేరింది. దీంతో ప్రయాణికులు ఆ జంక్షన్లో ఎండలోనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ షెల్టర్ ముందు స్థానిక వ్యాపారులు షాపులు నిర్వహిస్తున్నారు. దీంతో బస్‌షెల్టర్ ఎవరికీ కనిపించడం లేదు. ప్రయాణికులు వాహనాల కోసం వేచి ఉండేందుకు నీడ కరువు కావడంతో పాటు ఎక్కడా స్థలం లేకపోవడంతో దుకాణాల వద్ద నిల్చుంటున్నారు. షెల్టర్‌ను పునర్నిర్మించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా షెల్టర్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.