ప్రతీకాత్మక చిత్రం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘెరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భోపాల్ నుంచి సాగర్ హైవేమీద ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 13 మంది వరకు గాయపడ్డారని, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. భోపాల్ పోలీసు అధికారి కమలేష్ సోని తెలిపిన వివరాలు..ఈ బస్సు ప్రమాదం ఈ రోజు ఉదయం(ఆదివారం) 5 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలిపారు. భోపాల్‌లోని విదిష నగరానికి సమీపంలో హిర్ని గ్రామం వద్ద ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు.. బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్టు గుర్తించారు.
సంఘటన సమాచారం అందగానే పోలీసులు హుటాహుటీన ప్రమాద స్థలానికి చేరుకుని.. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించినట్టు తెలిపారు. అయితే, ప్రయాణికులలో 13 మంది వరకు గాయపడ్డారని, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అదే విధంగా, వీరిని మెరుగైన వైద్యం కోసం భోపాల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment