మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావడియాత్రికులతో కూడిన ట్రాక్టర్‌ను ఒక ట్రక్కు బలంగా డీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురు కావడి యాత్రికులు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆస్పత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మొరెనా జిల్లాలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల 44వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు కావడియాత్రికులు ఖాదియాహర్ గ్రామం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఘాట్‌కు ట్రాక్టర్‌లో తరలివెళ్తున్నారు.
డియోరీ గ్రామ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వీరి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కావడియాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన 12 మందికి పైగా క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment