
బోఫాల్: మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్రక్కును(డంపర్) ఢీ కొట్టింది. దీంతో మంటలు చెలరేగగా.. 12 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు కాగా.. జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంటున్నారు.
గుణ నుంచి ఆరోన్ వెళ్తుండగా రాత్రి 9గం. సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సు అతివేగంతో వెళ్లడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మరో నలుగురు ప్రమాదం నుంచి బయటపడి.. వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై గుణ కలెక్టర్ తరుణ్ రతి దర్యాప్తునకు ఆదేశించారు.
గుణ బస్సు ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. మరోవైపు ఘటనపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సైతం స్పందిస్తూ.. బాధించిందన్నారు. ఘటనపై స్థానిక అధికారులతో తాను మాట్లాడినట్లు.. అలాగే మృతుల కుటుంబాలకు తన సంతాపం చెబుతూ ఎక్స్‌లో ఓ సందేశం ఉంచారు.
बिग ब्रेकिंग
— Akhand Awaaj (@akhandawaaj1) December 27, 2023
गुना से आरोन जा रही एक यात्री चलती बस में दुहाई मंदिर के पास लगी भीषण आग। मौके पर लोगों की मची चीख पुकार। जिंदा जल रहे बस में बैठे यात्री। हादसे का कारण बस अनफिट होना बताया जा रहा है। @CMMadhyaPradesh @BJP4MP @PMOIndia @HMOIndia #guna pic.twitter.com/eM2NjmIuPd
Comments
Please login to add a commentAdd a comment