Guna
-
‘డిగ్రీలతో ఉపయోగం లేదు.. పంక్చర్ షాప్ తెరవండి’
భోపాల్: మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య విద్యార్థులను ఉద్దేశించి విచిత్రమైన వ్యాఖ్యాలు చేశారు. ఆయన సోమవారం గుణ అసెంబ్లీ నియోజకవర్గంలో పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డిగ్రీలు చదవటం వల్ల ఏం రాదు.. డబ్బులు సంపాదించాలంటే విద్యార్థులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకొవాలని సూచించారు.‘మేము ఇవాళ పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ప్రారంభించాం. నేను అందరికీ ఒక్కటే మాట చెప్పదల్చుకున్నా.. దానిని మీరు గుర్తు పెట్టుకోండి. కాలేజీలో డిగ్రీలతో ఏం రాదు. దాని బదులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్‌ను పెట్టుకోండి. కనీసం దాని వల్ల రోజువారిగా డబ్బులు సంపాదించుకోవచ్చు’ అని అన్నారు.डिग्री से कुछ नहीं होने वाला, पंक्चर की दुकान खोल लेना" गुना से BJP विधायक पन्नालाल शाक्य ने कहा #Guna | Pannalal Shakya | #PannalalShakya pic.twitter.com/j3u7w4HvQ7— Deshhit News (@deshhit_news) July 15, 2024 ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మధ్యప్రదేశ్‌లోని 55 జిల్లాలో ఏర్పాటు చేసిన పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీని వర్చువల్‌గా ప్రారంభించారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
కమల్ హాసన్ 'గుణ' రీ-రిలీజ్‌పై కోర్టు నోటీసులు
కమల్ హాసన్ నటించిన గుణ సినిమా 1991లో విడుదలైంది. స్వాతి చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్‌పై పల్లవి- చరణ్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సంతాన భారతి దర్శకత్వం వహించాడు. ఇందులో కమల్ హాసన్, రేఖ నటించారు. ఇది తమిళ, తెలుగులో కూడా విడుదలైంది. అయితే, జూన్ 21న ఈ చిత్రాన్ని పిరమిడ్, ఎవర్గ్రీన్ మీడియా కలిసి తమిళనాట రీ-రిలీజ్ చేశాయ్. దీంతో వారికి కోర్టు నోటీసులు జారీ చేసింది.మలయాళ చిత్రసీమలో ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా 'మంజుమ్మాళ్ బాయ్స్'. ఈ సినిమా కథకు మూలం గుణ గుహలు అనే విషయం తెలిసిందే. సినిమా మొత్తం ఆ గుహల చుట్టూ తిరుగుతుంది. అదే ప్రాంతంలో కమల్ హాసన్ గుణ సినిమా కూడా ఎక్కువ భాగం అక్కడే షూటింగ్ జరిగింది. 'మంజుమ్మాళ్ బాయ్స్' సినిమా వల్ల గుణ గుహలకు వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని కమల్ సినిమాను రీ-రిలీజ్ చేశారు. అయితే, గన్‌శ్యామ్ హేమ్‌దేవ్ దీనిని తప్పుపట్టారు. మద్రాస్ హైకోర్టులో పిరమిడ్, ఎవర్గ్రీన్ మీడియాను తిరిగి గుణ చిత్రాన్ని విడుదల చేయకుండా శాశ్వతంగా నిషేధించాలని కోరుతూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. ఈ సినిమా కాపీరైట్‌ను తాను కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.కమల్ గుణ సినిమాకు పూర్తి యజమానిగా తనను ప్రకటించాలని కోర్టును ఆయన కోరారు. అంతేకాకుండా సినిమా రీ-రిలీజ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వెల్లడించి, అంతే మొత్తాన్ని తనకు ఇవ్వాలని పిరమిడ్ అండ్ ఎవర్గ్రీన్ మీడియా కంపెనీని ఆదేశించాలని గన్‌శ్యామ్ హేమ్‌దేవ్ డిమాండ్ చేశారు. గుణ సినిమా రీ-రిలీజ్‌పై మధ్యంతర నిషేధం విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గన్‌శ్యామ్ హేమ్‌దేవ్ పిటీషన్‌పై పిరమిడ్, ఎవర్గ్రీన్ మీడియా కూడా జూలై 22లోగా స్పందించాలని కోర్టు తెలిపింది. -
సరిహద్దుల్లో పేలనున్న సిటీ తుపాకీ
సాక్షి, హైదరాబాద్: భారత సరిహద్దుల్లో కాపుకాసే ఆర్మీ జవాన్ల చేతిలో ‘సిటీ తుపాకీ’ పేలనుంది. ‘అస్మి’ పేరుతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీర్డీఓ) డిజైన్ చేసిన ఈ మొట్టమొదటి భారతీయ సబ్ మెషీన్‌గన్ తయారీ కాంట్రాక్టును హైదరాబాద్‌కు చెందిన లోకేశ్ మిషన్స్ లిమిటెడ్ దక్కించుకుంది. తొలి విడతలో ఆర్మీ నార్తర్న్ కమాండ్ కోసం రూ.4.26 కోట్లతో 550 తుపాకులు తయా రు చేసి సరఫరా చేయనున్నారు. ఇజ్రాయెల్, జర్మనీల్లోని ఆయుధ కర్మాగారాలకు దీటుగా నగరానికి చెందిన ఓ చిన్న సంస్థ ఈ ప్రతి ష్టాత్మక కాంట్రాక్టు దక్కించుకోవడం గమనార్హం. ఈ తుపాకీని సరిహద్దు భద్రతా దళాలతో పాటు కేంద్ర పోలీసు బలగాలూ వినియోగించనున్నాయి. ప్రముఖుల భద్రత కోసం వినియోగించడానికీ ‘అస్మి’ అనువుగా ఉంటుంది.ఉజీ, హెక్లర్లకు దీటుగా..⇒ పుణేలోని డీఆర్డీఓలో అంతర్భాగమైన అర్మా మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఆర్మీ సంయుక్తంగా ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పరిశోధనతో ‘అస్మి’ రూపుదిద్దుకుంది. నాగ్‌పూర్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రసాద్ బన్సోద్ దీన్ని డిజైన్ చేశారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ప్రమాణాలకు లోబడి, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేశారు. సంస్కృతంలో అస్మిత అంటే ధైర్యం, గర్వం (ప్రైడ్) అని అర్థం. దీన్ని సంక్షిప్తీకరించిన ప్రసాద్ ఈ తుపాకీకి ‘అస్మి’ అని పేరు పెట్టారు. అంతర్జాతీ యంగా ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ తయారు చేసే ఉజీ, జర్మనీలో తయా రయ్యే హెక్లర్, కోచీ ఎంపీ–5 ఆయుధాలకు దీటుగా ‘అస్మి’ పని చేస్తుందని డీఆర్డీఓ ప్రకటించింది.అంతర్జాతీయ పోటీని తట్టుకుని..హైదరాబాద్‌లోని బాలానగర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లోకేశ్ మిషన్స్ లిమిటెడ్ సంస్థ చిన్న పరిమాణంలో ఆయుధాలు తయారు చేస్తుంది. అయితే అంతర్జాతీయ పోటీని తట్టుకున్న ఈ సంస్థ ‘అస్మి’ తయారీ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇప్పటికే పది చొప్పున తుపాకులు తయారు చేసి ఆర్మీతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ), అసోం రైఫిల్స్‌కు అందించింది. నాణ్యతపై వాళ్లు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడంతో తొలి విడతలో ఆర్మీ నార్తర్న్ కమాండ్ 550 తుపాకుల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.ఈ ఏడాది సెప్టెంబర్ 28 నాటికి వీటిని అందించడానికి లోకేశ్ మెషీన్స్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తోంది. మరోపక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నుంచి ఈ సంస్థకు పైలట్ ఆర్డర్ వచ్చింది. ‘అస్మి’ ఈ తరహాకు చెందిన ఇతర ఆయుధాల కంటే 10–15 శాతం తక్కువ బరువుతో ఉంటుంది. దీన్ని ఆపకుండా 2,400 రౌండ్ల వరకు కాల్చే అవకాశం ఉంది.‘అస్మి’ వివరాలివీ..పేరు: అస్మిస్వరూపం: సబ్ మెషీన్ గన్ ఖరీదు: ఒక్కోటి రూ.50 వేలుబరువు: 2.4 కేజీలుపొడవు: 382 మిల్లీమీటర్లుక్యాలిబర్: 9 X 19 ఎంఎంరేంజ్: 100 మీటర్లుమ్యాగ్జైన్: 32 తూటాలుసామర్థ్యం: నిమిషానికి 800 తూటాలుపరిశోధనకు పట్టిన సమయం: మూడేళ్ల లోపు -
16 మంది మాయం.. మంజుమ్మెల్ బాయ్స్ ‘గుణ గుహ’ గురించి తెలుసా?
మళయాలంలో చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి.. టోటల్ సౌత్‌నే ఊపేస్తోంది మంజుమ్మెల్ బాయ్స్. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కింది ఈ సర్వైవల్ డ్రామా. అత్యంత ప్రమాదకరమైన గుహల్లో చిక్కుకున్న తన మిత్రుడ్ని రక్షించుకునేందుకు ఓ యువకుడు చేసిన సాహసమే ఈ చిత్రానికి స్ఫూర్తి. అయితే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.. గుణ గుహలు, ఆ గుహ చుట్టూ అల్లుకున్న మిస్టరీ నేపథ్యం. ఆ మిస్టరీ ఏంటి? ఆ గుహలోకి వెళ్లి అదృశ్యమైన 16 మంది ఏమైపోయారు?.. ఇంతకీ ఈ గుహలకు డెవిల్ కిచెన్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసుకుందాం. తమిళనాడు కొడైకెనాల్లో గుణ గుహలు ఉన్నాయి. 1821లో బీఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి ఈ గుహల గురించి తొలిసారి వెలుగులోకి తెచ్చారు. ఆ గుహకు డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడాయన. లిఖితపూర్వక రికార్డులు కూడా లేకపోయేసరికి అసలు ఆయన వాటికి ఆ పేరు ఎందుకు పెట్టాడో అనేదానికి చాలా ఏండ్లు స్పష్టత లేకుండా పోయింది. ఈలోపు.. 1991లో కమల్ హాసన్ నటించిన గుణ చిత్రం విడుదలైంది. ఆ చిత్రం మేజర్ పోర్షన్ ఈ గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేసుకుంది. గుణ చిత్రం సూపర్ హిట్ కావడంతో.. ఈ గుహలకు ‘గుణ గుహలు’ అనే పేరొచ్చింది. అప్పటి నుంచి పర్యాటకులు క్యూ కట్టడం ప్రారంభించారు. అయితే.. తర్వాతి కాలంలో ఆ గుహల పేరు చెబితేనే జనాలు వామ్మో అనుకోవడం ప్రారంభించారు. అందుకు కారణం.. ఆ గుహలోని అగాథం, ఆ అగాథాన్ని అన్వేషించేందుకు వెళ్లిన కొందరిని అది మింగేయడం. పైగా గుహ ఏకరీతిలో కాకుండా అసాధారణ రీతిలో ఉండడంతో.. అందులో పడిపోయినవాళ్ల మృతదేహాల్ని సైతం బయటకు తీయలేకపోయారు. దీంతో.. వార్డ్ అందుకే డెవిల్స్ కిచెన్ అని దానికి పేరు పెట్టి ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. అలా.. గుణ గుహలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గుహల్లో ఒకటిగా పేరు వచ్చింది. పోలీసుల రికార్డుల ప్రకారం.. 2016 దాకా 16 మంది ఈ గుహలోకి వెళ్లిన వాళ్లు కనిపించకుండా పోయారు. అలా.. అదృశ్యమైన వాళ్లలో ఓ కేంద్రమంత్రి బంధువు కూడా ఉన్నారు. వీళ్లలో కొన్ని సూసైడ్ కేసులు కూడా ఉన్నాయి. అయితే.. ఓ వ్యక్తి మాత్రం సజీవంగా బయటకు రాగలిగాడు. అదే మంజుమ్మెల్ బాయ్స్ కథకు మూలమైంది. 2006లో కేరళ కొచ్చి మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితులు ఈ గుహ సందర్శనకు వెళ్లారు. అందులో సుభాష్ అనే వ్యక్తి గుహ అగాథంలోకి పడిపోయాడు. దీంతో అతని మీద ఆశలు వదిలేసుకున్న సమయంలో.. సిజూ డేవిడ్ అనే అతని స్నేహితుడు ధైర్యం చేశాడు. పోలీసులు, అధికారులు హెచ్చరించి వారించినా వినకుండా స్థానికుల సాయంతో అతికష్టం మీద తన స్నేహితుడ్ని రక్షించుకున్నాడు. అలా ఆ వాస్తవ గాథ ఆధారంగా తెరకెక్కిన మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం.. ఇప్పుడు సౌత్ ఆడియెన్స్‌ను అలరిస్తోంది. 2000 సంవత్సరం చాలా ఏళ్లపాటు సందర్శకులను అనుమతించకుండా ఈ గుహను శాశ్వతంగా మూసేశారు. అయినా కూడా హెచ్చరికలను పట్టించుకోకుండా కొందరు ఆ గుహ పరిసరాలకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ప్రమాదంలో పడుతూ వచ్చారు. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం సూపర్ హిట్ కావడంతో గుణ గుహలకు సందర్శకులను అనుమతించడం ప్రారంభించింది తమిళనాడు టూరిజం శాఖ. కానీ, గుహ ప్రధాన ద్వారం మాత్రం ఇంకా మూసే ఉంచారు. గుహకి ఉన్న భయాకన నేపథ్యంతో మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం షూటింగ్ చాలావరకు సెట్స్‌లోనే నిర్వహించారు. కొంత భాగం మాత్రం గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అలాగే కమల్ హాసన్ గుణ చిత్రం.. తాజా మెంజుమ్మెల్ బాయ్స్ సినిమాలే కాకుండా.. ఈ మధ్యలో మోహన్‌లాల్ నటించిన షిక్కర్(2010) చిత్రం కొంత భాగం డెవిల్స్ కిచెన్ గుహల పరిసరాల్లోనే షూటింగ్ చేసుకుంది. Video Credits: Pyramid Glitz Music -
Guna: బస్సు ప్రమాదం.. 12 మంది సజీవదహనం
బోఫాల్: మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్రక్కును(డంపర్) ఢీ కొట్టింది. దీంతో మంటలు చెలరేగగా.. 12 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు కాగా.. జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంటున్నారు. గుణ నుంచి ఆరోన్ వెళ్తుండగా రాత్రి 9గం. సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సు అతివేగంతో వెళ్లడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మరో నలుగురు ప్రమాదం నుంచి బయటపడి.. వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై గుణ కలెక్టర్ తరుణ్ రతి దర్యాప్తునకు ఆదేశించారు. గుణ బస్సు ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. మరోవైపు ఘటనపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సైతం స్పందిస్తూ.. బాధించిందన్నారు. ఘటనపై స్థానిక అధికారులతో తాను మాట్లాడినట్లు.. అలాగే మృతుల కుటుంబాలకు తన సంతాపం చెబుతూ ఎక్స్‌లో ఓ సందేశం ఉంచారు. बिग ब्रेकिंग गुना से आरोन जा रही एक यात्री चलती बस में दुहाई मंदिर के पास लगी भीषण आग। मौके पर लोगों की मची चीख पुकार। जिंदा जल रहे बस में बैठे यात्री। हादसे का कारण बस अनफिट होना बताया जा रहा है। @CMMadhyaPradesh @BJP4MP @PMOIndia @HMOIndia #guna pic.twitter.com/eM2NjmIuPd — Akhand Awaaj (@akhandawaaj1) December 27, 2023 -
ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురి దుర్మరణం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గుణాలోని జాతీయ రహదారిపై( NH46) మంగళవారం పొగమంచు కమ్ముకోవడంతో స్పీడ్‌గా వచ్చిన ఓ ట్రక్కు ముందున్న కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా.. వారిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. దాదాపు 40 టన్నులతో కూడిన స్రాప్తో వెళ్తున్న ట్రక్కు.. కారును ఓవర్ టేక్ చేయసే ప్రయత్నంలో అదుపుతప్పి కారుపై దూసుకెళ్లింది. మృతులను రాజ్‌గఢ్ జిల్లాకు చెందిన దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ సాయంతో బాధితుల తుల బంధువులను సంప్రదించారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించడపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. VIDEO | Four killed in a road accident near Guna, Madhya Pradesh. More details are awaited. pic.twitter.com/OivWSq6pJm — Press Trust of India (@PTI_News) December 26, 2023 అదేవిధంగా ధార్ జిల్లాలోని ఆగ్రా-ముంబయిజాతీయ రహదారిపై మరో ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి ముందున్న అయిదు వాహనాల పైకి దూసుకెళ్లింది. దీంతో ఒకదానితో ఒకటి ఢీకొని ఆరు వాహనాల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో ట్రక్కుతోపాటు మరో అయిదు వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. #WATCH | Dhar, Madhya Pradesh: A major accident occurred at Ganesh Ghat located on the Agra-Mumbai National Highway where six vehicles, including cars and one truck, caught fire after colliding with each other. Police and fire brigade on the spot. Efforts to douse the fire are… pic.twitter.com/FD8KVrE3L1 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 25, 2023 -
డైరెక్టర్‌గా మారిన ప్రముఖ నటుడు
యువ నటుడు ఎస్ఆర్ గుణ దర్శకుడిగా మారబోతున్నాడు. 'కయిరు', 'వాండు' తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతడు... 'కయిరు' చిత్రానికిగానూ 2019లో కొలకత్తా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో, మెర్సికోలో జరిగిన సెవెన్ కలర్స్ బ్యాచిలర్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులను అందుకున్నాడు. కాగా తాజాగా సేయన్ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న తీర్పు అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) డైరెక్టర్ కావడంపై స్పందించిన గుణ.. 'జాతి వివక్షతపై పోరాడిన వివిధ దేశాల చెందిన పోరాటయోధులను ఆయా దేశాలు తీవ్రవాదులుగా ముద్రవేసి దేశం నుంచి బహిష్కరించాయి. దీంతో ఇతర దేశాలను ఆశ్రయించిన ఆ పోరాట దారులు అక్కడ నుంచే న్యాయం కోసం రాజకీయ పోరాటం చేస్తారు. అక్కడ న్యాయం దొరకదు. దీంతో ఒక వ్యక్తి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి జాతి వివక్షతపై ఎలా పోరాటం చేశారు అనే స్టోరీతో తీస్తున్న సినిమా 'తీర్పు' అని ఎస్ఆర్ గుణ తెలిపారు. కెనడాకు చెందిన యాక్టర్స్, టెక్నీషియన్స్‌ని ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తీర్పు షూటింగ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: ఒక్క వీకెండ్.. నాలుగు సినిమాలు.. రికార్డ్ కలెక్షన్స్!) -
చేతి పంపు నుంచి బకెట్ల కొద్ది మద్యం.. ఎక్కడో తెలుసా?
భోపాల్: ఎక్కడైనా చేతి పంపు కొడితే తాగు నీరు రావడం సహజమే. కానీ చేతి పంపులో నుంచి మద్యం రావటం ఎప్పుడైనా చూశారా? అవునండీ.. అది నిజమే. మధ్యప్రదేశ్ గునా జిల్లాలోని భన్‌పుర అనే గ్రామంలో చేతి పంపు కొట్టగానే అందులోంచి మద్యం వచ్చింది. నాటుసారా తయారు చేసే ముఠా మెదడులోంచి పుట్టిన ఆలోచన ఇది. నాటుసారా తయారీపై సమాచారం మేరకు గునా జిల్లాలోని భన్‌పుర గ్రామ పరిసరాల్లో సోదాలు నిర్వహించారు పోలీసులు. ఈ క్రమంలో కనిపించిన ఈ దృశ్యం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రామ శివారులోని ఇళ్లకు కొద్ది దూరంలో నాటుసారా నింపిన డ్రమ్ములను భూమిలోపల పాతిపెట్టారు. వాటికి పైపును అమర్చడం ద్వారా నేల పైన చేతి పంపును ఏర్పాటు చేశారు. దాన్ని చేత్తో కొడుతూ క్యాన్లలో మద్యాన్ని నింపి పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఆ గ్రామంలో ఇటీవల దాడి చేసిన పోలీసులు సారా మాఫియా అతి తెలివి చూసి నివ్వెరపోయారు. అక్కడ దాదాపు ప్రతి ఇంటిలోనూ నాటుసారా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రమ్ముల కొద్దీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ‘ భూమిలో దాచిపెట్టిన నాటుసారా డ్రమ్ములకు చేతి పంపు ఏర్పాటు చేశారు. పోలీసులు చేతిపంపును కొట్టడంతో నాటుసారా పైకి వచ్చింది. లిక్కర్‌ను తీసుకునేందుకు వారు చేతిపంపును ఉపయోగిస్తున్నారు. దానిని ప్లాస్టిక్ క్యాన్లు, కవర్లలో నింపి డీలర్ల ద్వారా విక్రయిస్తున్నారు.’ అని గునా ఎస్పీ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు. शराब माफिया का दिमाग हैंडपम्प से निकली शराब गुना के भानपुरा का मामला #Guna #HandPump #Viral #Trending pic.twitter.com/eRm8H1t1wN — LALIT K PRAJAPATI (@prajapatilalit) October 11, 2022 ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
బరి తెగించిన వేటగాళ్లు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో వేటగాళ్లు రెచ్చిపోయారు. వన్యమృగాలను వేటాడుతుండగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక ఎస్సై సహా ముగ్గురు పోలీసులు నేలకొరిగారు. ఒకరు పోలీసు గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో ఒక దుండగుడు హతమయ్యాడు. అనంతరం సోదాల సమయంలో జరిగిన కాల్పుల్లో మరో నిందితుడి మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గుణ జిల్లా అరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వేకువజామున చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసులను మృతవీరులుగా ప్రకటించారు. వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. గ్వాలియర్ జోన్ ఐజీని బదిలీ చేశారు. సాగ బార్ఖేడ గ్రామ సమీపంలోని షారోక్ రోడ్డు వద్ద కొందరు దుండగులు వన్యప్రాణులను వేటాడుతున్నారన్న సమాచారం అందడంతో తెల్లవారు జామున 3 గంటల సమయంలో పోలీసు బలగాలు ఆప్రాంతాన్ని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని చేసిన హెచ్చరికలను దుండగులు లక్ష్యపెట్టలేదు. పోలీసులపైకి యథేచ్ఛగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఎస్సై రాజ్‌కుమార్ జాటవ్, కానిస్టేబుళ్లు నీలేశ్ భార్గవ, శాంతారాం మీనా అసువులు బాశారు. పోలీసులపై కాల్పులకు తెగబడిన నేరగాళ్లు బిధోరియాకు చెందిన వారిగా గుర్తించినట్లు హోం మంత్రి తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, మరో నలుగురి కోసం తీవ్రంగా గాలింపు జరుగుతోందన్నారు. కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతం నుంచి కృష్ణజింకల కళేబరాలు ఐదు, ఒక నెమలి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వర్గాలు వెల్లడించాయి. చదవండి: లౌడ్‌స్పీకర్ల వివాదం..చంపేస్తామని బెదిరింపులు.. రాజ్ ఠాక్రేకు భద్రత పెంపు -
భర్తతో విడిపోయిన మహిళపై ఊరి జనం..
భోపాల్: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలకు రక్షణ లేదనేది మరోసారి రుజువైంది. దేశంలోని చాలా చోట్ల మహిళలు అనేక వివక్షలు, అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న మహిళ పట్ల స్థానికులు, అత్తింటివారి ఆటవిక చర్యలు మధ్యప్రదేశ్‌లో వెలుగు చూశాయి. వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌లోని గునా జిల్లాలో ఒక మహిళ తన భర్తతో విడిపోయి వేరే వ్యక్తితో సహజీవం చేస్తోంది. దీనిని జీర్ణించుకోలేని సదరు గ్రామస్తులు, అత్తింటివారు ఆమె ఇంటికి వచ్చి నానా దుర్భాషవలాడారు. అంతటితో ఆగకుండా మాజీ భర్త కుటుంబంలోని ఒకరిని భుజాలపై మోసుకుంటూ 3 కిలో మీటర్లు నడవాలని హుకుం జారీచేశారు. తన బతుకు తాను బతుకున్న ఆ మహిళ ఆటవిక మనుషుల ఆగడాలను ఎదిరించలేకపోయింది. అసహాయంగా వారు చెప్పినట్టు అత్తింటివారిలో ఓ వ్యక్తిని భుజాలపై ఎక్కించుకుని నడక సాగించింది. ఆమె నరకయాతన పడుతుంటే కొంత మంది ఆకతాయిలు ఆ దృశ్యాలను ఫోన్లలో వీడియో తీస్తూ... మరికొందరు ఆమె బాధతో ఒక్కో అడుగు వేస్తుంటే త్వరగా నడువ్.. అంటూ హేళన చేస్తూ బ్యాట్లు, కర్రలతో బెదిరింపులకు దిగారు. కొందరు రాక్షసులు ఆమె ఒంటిపై దెబ్బలు కూడా కొట్టారు. ఈ ఆటవిక చర్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాధ్యులైన నలుగురిని అరెస్టు చేశారు. ఇదిలాఉండగా.. గతంలో కూడా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం జబువా జిల్లాలో ప్రేమించిన వ్యక్తికోసం ఇంటి నుంచి వెళ్ళిపోయిన మహిళకు గ్రామస్తులు ఇలాంటి శిక్షే విధించారు. అప్పటి ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. చదవండి: వివాహితపై సామూహిక అత్యాచారం.. -
తుపాకీ గురిపెట్టి తనిఖీలు..
బదౌన్: బైక్ మీద వెళుతున్న ప్రయాణికులను పోలీసులు బారికేడ్లు పెట్టి ఆపి, పాయింట్‌బ్లాంక్‌లో గన్ పెట్టి సోదా చేస్తే ఎలా ఉంటుంది. అలాంటి పరిస్థితే ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ద్విచక్ర వాహనదారులకు ఎదురైంది. బైక్‌ను ఆపి, దిగి చేతులు వెనక్కు పెట్టి కదలకుండా ఉండాల్సిందిగా ఆజ్ఞాపించారు. అనంతరం సోదాలు నిర్వహించారు. సోదా నిర్వహిస్తుండగా ఇద్దరు పోలీసులు గన్ గురిపెట్టి నిల్చున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇలా పౌరులను భయభ్రాంతులకు గురి చేయడం సరి కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవి కేవలం పోలీసులు తమను తాము రక్షించుకోవడానికే అని జిల్లా సూపరింటెండెంట్ పోలీసు అశోక్ కుమార్ త్రిపాఠి సోమవారం వివరణ ఇచ్చారు. కొందరు నేరగాళ్లు తమ వెంట ఆయుధాలు తెచ్చుకొని పోలీసులపై దాడిచేసే అవకాశం ఉందని అందుకే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. -
బీరు, బిర్యానీ తెస్తే ఓకే.. లేదంటే చచ్చారే..!
భోపాల్ : మద్యం, మాంసాహారం తీసుకురావాలని కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్న ఓ ఉన్నతాధికారిపై వేటు పడింది. జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు అందడంతో సదరు అధికారిపై చర్యలు తీసుకున్నారు. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్న దిలీప్ మాండవి తన వద్దకు వచ్చే తహసీల్దార్, పట్వారీలు మద్యం, మాంసాహారం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాడు. ఉట్టి చేతులతో వచ్చే వారిని నానా బూతులు తిడుతూ వేధింపులకు దిగుతున్నాడు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందడంతో అతన్ని డిప్యూటీ సెక్రటరీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇంటిలో ఈవీఎం : పోలింగ్ అధికారిపై వేటు
భోపాల్ : రిజర్వ్ ఈవీఎంను తన ఇంటికి తీసుకువెళ్లిన పోలింగ్ అధికారి ఏకే శ్రీవాస్తవను అధికారులు సస్పెండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని గుణలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ అధికారి, సెక్టార్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీవాస్తవను సస్పెండ్ చేశామని, ఆయన నివాసం నుంచి ఈవీఎంను సీజ్ చేశామని ఎస్డీఎం శివాని రక్వార్ గార్గ్ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గంలో ఆదివారం ఆరో దశలో పోలింగ్ జరుగుతోంది. గుణలో కాంగ్రెస్ దిగ్గజ నేత, సిటింగ్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాతో బీజేపీ అభ్యర్థి కేపీ యాదవ్ తలపడుతున్నారు. -
విజయం మాదే: సింథియా
భోపాల్: దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని గుణ లోకసభ అభ్యర్థి జ్యోతిరాదిత్యా సింథియా ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ సరళిని బట్టి చూస్తే తమ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని సింథియా అభిప్రాయపడ్డారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనే విశ్వాసం తమకుందన్నారు. దేశంలో జరిగిన అభివృద్ధంతా కాంగ్రెస్ హాయాంలోనే జరిగిందన్నారు. మధ్య ప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ఐదోసారి పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. -
భర్తకు ప్రేమతో.. గెలుపు బాధ్యత
భోపాల్: ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందనేది ఎంత వరకు నిజమో తెలీదు కానీ.. ప్రతి భర్త విజయం వెనుక భార్య శ్రమ ఉంటుందని రుజువు చేస్తున్నారు మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జ్యోతిరాదిత్య సింథియా భార్య.. ప్రియదర్శినీ రాజే. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమైన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఆ రాష్ట్రంలో పార్టీ విజయానికి ప్రియదర్శిని ఎంతో కష్టపడుతున్నారు. భర్త జ్యోతిరాదిత్య జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ లోక్‌సభ నియోజకవర్గ గెలుపు బాధ్యతను ఆమె మోస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన రెండు స్థానాల్లో గుణ ఒకటి. గత ఏడాది హోరాహోరీగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక జ్యోతిరాదిత్యా కృషి అందరికీ తెలిసిందే. సీనియర్ నేత కమల్‌నాథ్‌ను పక్కన పెట్టి సీఎంగా కుర్చి కూడా అయననే వరిస్తుందని ఓ వర్గం నేతలు ఎంతో ధీమా వ్యక్తం చేశారు. కానీ ఫలితాల అనంతరం లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కమల్‌నాథ్‌కు సీఎం పీఠం అప్పగించి.. జ్యోతిరాదిత్యకు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. ఆ తరువాత దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీలో పార్టీ పుర్వవైభవం కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. సింథియా, ప్రియాంక గాంధీను యూపీ బాధ్యులుగా నియమించారు. యూపీలో విజయం కోసం ప్రియాంకతో పాటు సింథియా విశ్వప్రయత్నలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గమైన గుణ ప్రచారానికి దూరమైయారు జ్యోతిరాదిత్య. గుణలో సింథియా కుటుంబానికి మంచి ఆదరణ ఉంది. 1967 నుంచి వరసగా వారి కుటింబికులే ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ఈసారి గెలుపు బాధ్యతను ఆయన భార్య ప్రియదర్శినీ రాజేపే మోపారు. లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి గుణ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విస్రృతంగా పర్యటిస్తూ.. ప్రజల అవసరాల గురించి ఆరాతీస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజే.. ప్రత్యర్థి అభ్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే జ్యోతిరాదిత్య ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం గుణ స్థానంలో ఆయన భార్యను నిలపాలనే అనుకున్నారు. చివరి వరకూ ఇదే ప్రచారం జరిగినా.. కీలక ఎన్నికలు కావడంతో సింథియానే బరిలో నిలిపింది కాంగ్రెస్ అధిష్టానం. 2002లో తండ్రి మరణంతో ఈ స్థానం ఖాళీ కావడంతో తొలిసారి ఉప ఎన్నికల్లో గుణ ఎంపీగా గెలుపొందారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు సింథియా విజయం సాధించారు. గత ఎన్నికల్లో లక్షన్నర ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. మరోసారి తన భార్యపై ఉన్న నమ్మకంతో విజయంపై ధీమాగా ఉన్నారు. కాగా మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజేను 1994లో జ్యోతిరాదిత్యా సింథియా వివాహమాడిన విషయం తెలిసిందే. -
సీక్రెట్‌గా హీరోయిన్ నిశ్చితార్థం
ఒకప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారిన హీరోయిన్ అనీషా ఆంబ్రోస్. పవన్ కల్యాణ్ సరసన సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఈ భామ హీరోయిన్గా నటించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆ అవకాశం అనీషా చేజారింది. తరువాత మనమంతా, ఒక్కడు మిగిలాడు లాంటి సినిమాల్లో నటించిన అనీషాకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న 7 సినిమాలో నటిస్తోంది అనీషా. తాజాగా అనీషాకు సంబంధించిన మరో వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. త్వరలో ఈ భామ పెళ్లిపీటలెక్కనుందట. జేఎంఆర్ కన్స్ట్రక్షన్ ఈడీ గుణ జక్కను అనీషా పెళ్లి చేసుకోబోతోంది. అంతేకాదు ఇప్పటికే సీక్రెట్‌గా వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందట. ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు మాత్రమే హజరయ్యారు. -
జోష్నా సంచలనం
చెన్నై: భారత స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప పెను సంచలనం సృష్టించింది. ఎనిమిది సార్లు ప్రపంచ చాంపియన్, మాజీ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా)పై కెరీర్లో తొలిసారి విజయం సాధించింది. ఈజిప్ట్‌లో జరుగుతున్న గునా అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో జోష్నా 11–8, 11–8, 11–8తో నికోల్‌ను బోల్తా కొట్టించింది. ‘నికోల్‌ను నేను ఎలా ఓడించానో అర్థం కావడం లేదు’ అని జోష్నా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరోవైపు ఇదే టోర్నీలో భారత మరో క్రీడాకారిణి దీపిక పళ్లికల్ తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. -
ఎంపీలో కాంగ్రెస్ ఓటమికి నాదే బాధ్యత
గుణ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింధియా రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ ఓటమికి దారితీసిన కారణాలపై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ చేస్తున్న విమర్శలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.