
చెన్నై: భారత స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప పెను సంచలనం సృష్టించింది. ఎనిమిది సార్లు ప్రపంచ చాంపియన్, మాజీ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా)పై కెరీర్‌లో తొలిసారి విజయం సాధించింది. ఈజిప్ట్‌లో జరుగుతున్న గునా అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో జోష్నా 11–8, 11–8, 11–8తో నికోల్‌ను బోల్తా కొట్టించింది. ‘నికోల్‌ను నేను ఎలా ఓడించానో అర్థం కావడం లేదు’ అని జోష్నా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరోవైపు ఇదే టోర్నీలో భారత మరో క్రీడాకారిణి దీపిక పళ్లికల్ తొలి రౌండ్‌లోనే
ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment