Joshna Chinappa
-
ఆసియా స్క్వాష్ చాంప్స్ సౌరవ్, జోష్నా
కౌలాలంపూర్: భారత స్క్వాష్ స్టార్స్ సౌరవ్ ఘోషాల్, జోష్నా చినప్ప ఆదివారం కొత్త చరిత్ర సృష్టించారు. ఆసియా సీనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా సౌరవ్... మహిళల సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా జోష్నా చినప్ప రికార్డు నెలకొల్పారు. ఫైనల్స్‌లో టాప్ సీడ్ సౌరవ్ 11–9, 11–2, 11–8తో లియో చున్ మింగ్ (హాంకాంగ్)పై... రెండో సీడ్ జోష్నా 11–5, 8–11, 11–6, 11–6తో టాప్ సీడ్ ఆనీ అయు (హాంకాంగ్)పై గెలిచారు. -
ఫైనల్లో సౌరవ్ ఘోషాల్, జోష్నా చినప్ప
ఆసియా సీనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సౌరవ్ ఘోషాల్, జోష్నా చినప్ప ఫైనల్లోకి దూసుకెళ్లారు. కౌలాలంపూర్‌లో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 2017 రన్నరప్ సౌరవ్ 11–2, 11–6, 11–4తో ఎన్జీ ఎయిన్ యో (మలేసియా)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జోష్నా 11–7, 12–10, 11–3తో శివసంగరి సుబ్రమణియం (మలేసియా)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్స్‌లో ఆనీ అయు (హాంకాంగ్)తో జోష్నా; లియో చున్ మింగ్ (హాంకాంగ్)తో సౌరవ్ తలపడతారు. -
సెమీస్‌లో జోష్నా చినప్ప, సౌరవ్ ఘోషాల్
ఆసియా స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్లు జోష్నా చినప్ప, సౌరవ్ ఘోషాల్ మహిళల, పురుషుల వ్యక్తిగత విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. కౌలాలంపూర్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో జోష్నా 12–10, 13–11, 11–7తో భారత్‌కే చెందిన తాన్వీ ఖన్నాను ఓడించగా... సౌరవ్ 11–4, 11–4, 11–3తో మొహమ్మద్ నఫీజ్వాన్ అద్నాన్ (మలేసియా)పై గెలుపొందాడు. -
జోష్నాకు షాక్
న్యూఢిల్లీ:ఎల్ గునా ఓపెన్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల సింగిల్స్‌లో 16వ సీడ్ జోష్నా చినప్ప రెండో రౌండ్లో నిష్క్రమించగా... పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ ఘోషాల్ ముందంజ వేశాడు. శుక్రవారం ఈజిప్ట్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో జోష్నా 8–11, 5–11, 11–6, 12–10, 4–11తో టినీ గిలిస్ (బెల్జియం) చేతిలో ఓడిపోగా... సౌరవ్ 11–9, 11–1, 3–11, 9–11, 11–6తో ఎడ్మన్ లోపెజ్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. -
జోష్నా సంచలనం
చెన్నై: భారత స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప పెను సంచలనం సృష్టించింది. ఎనిమిది సార్లు ప్రపంచ చాంపియన్, మాజీ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా)పై కెరీర్లో తొలిసారి విజయం సాధించింది. ఈజిప్ట్‌లో జరుగుతున్న గునా అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో జోష్నా 11–8, 11–8, 11–8తో నికోల్‌ను బోల్తా కొట్టించింది. ‘నికోల్‌ను నేను ఎలా ఓడించానో అర్థం కావడం లేదు’ అని జోష్నా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరోవైపు ఇదే టోర్నీలో భారత మరో క్రీడాకారిణి దీపిక పళ్లికల్ తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. -
జయహో జోష్నా..
ఆసియా స్క్వాష్ చాంప్‌గా చినప్ప ఫైనల్లో దీపికపై విజయం చెన్నై: ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. ఆసియా స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి తొలి చాంపియన్ అవతరించింది. ఆదివారం ముగిసిన ప్రతిష్టాత్మక ఆసియా వ్యక్తిగత స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో జోష్నా చినప్ప విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మరో స్టార్ క్రీడాకారిణి దీపిక పళ్లికల్తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో జోష్నా 13–15, 12–10, 11–13, 11–4, 11–4తో విజయం సాధించింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో ఒకదశలో 1–2 గేమ్‌లతో వెనుకబడిన జోష్నా అద్భుతంగా పుంజుకొని వరుసగా రెండు గేమ్‌లను సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ క్రమంలో ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. 31 ఏళ్ల ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ నుంచి ఇద్దరు క్రీడాకారిణులు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో సౌరవ్ ఘోషాల్‌కు నిరాశ ఎదురైంది. టాప్ సీడ్ మాక్స్ లీ (హాంకాంగ్)తో జరిగిన ఫైనల్లో సౌరవ్ 11–5, 4–11, 8–11, 7–11తో ఓడిపోయాడు. అయితే పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి రన్నరప్‌గా నిలిచిన తొలి క్రీడాకారుడిగా సౌరవ్ గుర్తింపు పొందాడు. -
భారత్‌కు తొమ్మిదో స్థానం
పారిస్: ప్రపంచ మహిళల టీమ్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు తొమ్మిదో స్థానం లభించింది. కెనడాతో జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 2-0తో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో జోష్నా చిన్నప్ప 13-11, 11-5, 7-11, 11-7తో హోలీ నాటన్పై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో దీపిక పళ్లికల్ 11-7, 11-5, 11-2తో సమంతా కార్నెట్‌ను ఓడించింది. ఫలితం తేలిపోవడంతో ఆకాంక్ష, డానియెలా మధ్య జరగాల్సిన మూడో మ్యాచ్‌ను నిర్వహించలేదు. -
క్వార్టర్స్‌లో జోష్నా చినప్ప
దోహా: ఖతార్ క్లాసిక్ స్క్వాష్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి జోష్నా చినప్ప క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో జోష్నా 16-14, 11-8, 11-8తో యత్రెబ్ అదెల్ (ఈజిప్టు)పై విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత ప్లేయర్ సౌరవ్ ఘోషాల్ 7-11, 8-11, 3-11తో ఫరెస్ దెసూకి (ఈజిప్టు) చేతిలో ఓడిపోయాడు. -
క్వార్టర్స్‌లో జోష్న
మెల్బోర్న్ : భారత స్క్వాష్ క్రీడాకారిణి జోష్న చినప్ప ఆస్ట్రేలియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరింది. గురువారం జరిగిన పోరులో జోష్న 5-11, 11-6, 11-6, 11-8 తేడాతో మేగన్ క్రెయిగ్ (కివీస్)ను ఓడించింది. అయితే క్వార్టర్స్‌లో ఈ తమిళనాడు స్టార్‌కు టాప్ సీడ్ అనీ ఔ (హాంకాంగ్)తో గట్టి పోటీ ఎదురుకానుంది. పురుషుల విభాగం రెండో రౌండ్లో హరీందర్ సింగ్ 4-11, 11-7, 4-11, 15-13, 9-11తో నఫిజ్వాన్ అద్నాన్ (మలేసియా)పై, మహేష్ మంగావ్కర్ 11-7, 11-4, 9-11, 9-11, 7-11 తేడాతో స్టీవ్ పినిస్టిక్ (ఆసీస్)పై పోరాడి ఓడారు. -
సెమీస్‌లో జ్యోత్స్న, సౌరవ్
హాంకాంగ్ స్క్వాష్ టోర్నీ హాంకాంగ్ : భారత స్క్వాష్ స్టార్స్ జ్యోత్స్న చిన్నప్ప, సౌరవ్ ఘోషల్ హాంకాంగ్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నీలో సెమీస్‌కు చేరారు. గురువారం జరిగిన మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్లో నాలుగోసీడ్ జ్యోత్స్న 11-5, 11-7, 11-8తో డెలియా ఆర్నాల్డ్ (మలేసియా)పై నెగ్గింది. పురుషుల విభా గంలో రెండో సీడ్ సౌరవ్ ఘోషల్ 11-4, 11-4, 1-7తో నఫిజ్వాన్ అద్నాన్ (మలేసియా)పై నెగ్గాడు. -
క్రీడారత్నాలకు సత్కారం
సాక్షి, చెన్నై: కామన్వెల్త్లో మెరిసిన తమిళ క్రీడారత్నాలను సీఎం జయలలిత సత్కరించారు. మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యంగా మున్ముందు మరింతగా రాణించి తీరుతామని క్రీడాకారులు ధీమా వ్యక్తం చేశారు. తమకు నగదు ప్రోత్సాహం అందజేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడల పరంగా యువతీ, యువకులను ప్రోత్సహించేందుకు జయలలిత ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడంతోపాటుగా క్రీడల శిక్షణ, వసతుల కల్పన మీద దృష్టి కేంద్రీకరించింది. మైదానాల ఏర్పాటు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. విజేతలకు విద్యా పరంగా, ఆర్థిక పరంగా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో రాణించే తమిళ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సహకాన్ని అందిస్తున్నారు. కామన్వెల్త్ బంగారాలు : స్కాట్లాండ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తమిళ బంగారాలు సత్తాను చాటారు. మునుపెన్నడూ లేని రీతిలో ఈ సారి తమిళ క్రీడాకారులు ముగ్గురు బంగారు పతకాల్ని, మరో నలుగురు వెండి పతకాల్ని దక్కించుకున్నారు. తమిళనాడుకు గర్వకారణంగా నిలిచిన వీరిని సత్కరించడంతో పాటుగా నగదు ప్రోత్సాహాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా వెయిట్ లిఫ్ట్‌లో బంగారం దక్కించుకున్న సతీష్ కుమార్, స్క్వాష్ డబుల్స్‌లో పసిడి పతకాలతో మెరిసిన జ్యోత్స్న చిన్నప్ప, దీపికా పల్లికల్‌కు రూ.50 లక్షలు చొప్పున నజరానా అందజేయడానికి నిర్ణయించారు. టేబుల్ టెన్నిస్‌లో రాణించిన శరత్ కమల్, అమల్ రాజ్‌లకు తలా రూ.30 లక్షలు ప్రకటించారు. ఇక, భారత హకీ జట్టులో తమిళ క్రీడాకారులు రూపేంద్ర పాల్ సింగ్, శ్రీజేష్ పరట్ రవీంద్రలు చోటు దక్కించుకుని రాణించడంతో వారిని సత్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఇద్దరికి కూడా తలా రూ.30 లక్షల్ని ప్రకటించారు. ఈ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహంగా మొత్తం రూ. 2.70 కోట్లను ప్రకటించారు. దీంతో వీరందరూ సోమవారం ఉదయాన్నే సచివాలయం చేరుకుని సీఎం జయలలితను కలిసి పుష్ప గుచ్ఛాలు అందజేశారు. ఈ రత్నాలను సీఎం జయలలిత ఘనంగా సత్కరించారు. వీరందరికీ చెక్కుల రూపంలో ప్రకటించిన నగదు ప్రోత్సాహం అందజేశారు. మరింతగా క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడా పరంగా తమిళనాడు ఖ్యాతిని మరింత పెంచినందుకు గాను ఈ రత్నాలను ప్రత్యేకంగా సీఎం జయలలిత అభినందించారు. మరిన్ని సాధిస్తాం: సత్కారం అనంతరం వెలుపలకు వచ్చిన క్రీడారత్నాలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జయలలితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రోత్సాహం మరింత బాధ్యతను పెంచిందనిపేర్కొన్నారు. అనేక క్రీడల్లో మరిన్ని పతకాల సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరం తమ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటామని వివరించారు. ఈ నగదు ప్రోత్సాహం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సీఎం జయలలిత తమకే కాకుండా క్రీడారంగానికి విశిష్ట సేవలు అందిస్తున్నారని, ఆమె ఆకాంక్ష మేరకు మరెందరో క్రీడాకారులు ఇక్కడి నుంచి అనేక పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ప్రతి క్రీడా కారుడు ఆదర్శంగా తీసుకోవాలని, ప్రభుత్వ ఆకాంక్ష మేరకు పతకాల పంట పండించాలని సూచించారు. అనంతరం ఈ ఏడుగురు క్రీడాకారులు తమ ఆనందాన్ని పంచుకుంటూ సచివాలయం వెలుపల ఒకరినొకరు, గ్రూపు ఫొటోలు తీసుకుంటూ తమ క్రీడా స్ఫూర్తిని చాటుకోవడం విశేషం. -
జోత్స్న, చిన్నప్పలకు తమిళ సర్కారు నజరానా
చెన్నై: కామన్వెల్త్ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. స్క్వాష్ క్రీడలో స్వర్ణం సాధించిన దీపికా పళ్లికల్, జ్యోత్స్న చిన్నప్పలకు తమిళనాడు ప్రభుత్వం 50లక్షల రూపాయల బహుమానం ప్రకటించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 14వ పసిడి పతాకాన్ని స్క్వాష్ క్రీడాకారిణులు దీపికా పళ్లికల్, జోత్స్న చిన్నప్ప అందించారు. ఈ క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారులుగా దీపికా పళ్లికల్, జోత్స్న చిన్నప్ప చరిత్ర సృష్టించారు. -
జోష్నా సంచలనం
రిచ్మండ్ ఓపెన్ టైటిల్ సొంతం ఫైనల్లో మాజీ నంబర్‌వన్‌పై గెలుపు రిచ్మండ్ (అమెరికా): భారత అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప సంచలనం సృష్టించింది. రిచ్మండ్ ఓపెన్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. తద్వారా తొమ్మిదోసారి మహిళల స్క్వాష్ అసోసియేషన్ (డబ్ల్యుఎస్‌ఏ) టూర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ప్రపంచ 21వ ర్యాంకర్ జోష్నా 11-9, 11-5, 11-8తో ప్రపంచ మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్ రాచెల్ గ్రిన్‌హమ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. గ్రిన్హమ్తో తలపడిన ఆరు పర్యాయాల్లో భారత క్రీడాకారిణి గెలవడం ఇదే మొదటిసారి. అలాగే గతవారం టెక్సాస్ ఓపెన్‌లో ఆమె చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. -
జోష్నాకు స్క్వాష్ వరల్డ్ టూర్ టైటిల్
విన్నిపెగ్ (కెనడా): భారత స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప తన కెరీర్లో తొలిసారి మహిళల స్క్వాష్ అసోసియేషన్ (డబ్ల్యూఎస్‌ఏ) వరల్డ్ టూర్ టైటిల్‌ను సాధించింది. విన్నిపెగ్ వింటర్ క్లబ్ ఓపెన్ ట్రోఫీలో భాగంగా ఇక్కడ జరిగిన ఫైనల్లో జోష్నా 11-13, 11-8, 11-5, 3-11, 12-10తో హెబా ఎల్ టొర్కీ (ఈజిప్ట్)పై చెమటోడ్చి నెగ్గింది. టైటిల్ కోసం ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. దీంతో ప్రతీ గేమ్ సుదీర్ఘ ర్యాలీలకు దారితీసింది. చివరకు ప్రపంచ 27వ ర్యాంకర్ జోష్నా ప్రత్యర్థిపై పైచేయి సాధించి తొలి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. మొత్తం మీద భారత్ ఖాతాలో వరుసగా ఇది రెండో డబ్ల్యూఎస్‌ఏ వరల్డ్ టూర్ టైటిల్ కావడం విశేషం. గతేడాది దీపికా పల్లికల్ ఈ టైటిల్ గెలుచుకుంది.