![Joshna Chinappa loses to Second round - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/20/JOSHNA.jpg.webp?itok=AazZqPy9)
న్యూఢిల్లీ:ఎల్ గునా ఓపెన్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల సింగిల్స్‌లో 16వ సీడ్ జోష్నా చినప్ప రెండో రౌండ్‌లో నిష్క్రమించగా... పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ ఘోషాల్ ముందంజ వేశాడు. శుక్రవారం ఈజిప్ట్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో జోష్నా 8–11, 5–11, 11–6, 12–10, 4–11తో టినీ గిలిస్ (బెల్జియం) చేతిలో ఓడిపోగా... సౌరవ్ 11–9, 11–1, 3–11, 9–11, 11–6తో ఎడ్మన్ లోపెజ్ (స్పెయిన్)పై విజయం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment