![Saurav Ghosal and Joshna win Asian Championship titles - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/6/Sourav.jpg.webp?itok=6gjWb0qZ)
కౌలాలంపూర్: భారత స్క్వాష్ స్టార్స్ సౌరవ్ ఘోషాల్, జోష్నా చినప్ప ఆదివారం కొత్త చరిత్ర సృష్టించారు. ఆసియా సీనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా సౌరవ్... మహిళల సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా జోష్నా చినప్ప రికార్డు నెలకొల్పారు. ఫైనల్స్‌లో టాప్ సీడ్ సౌరవ్ 11–9, 11–2, 11–8తో లియో చున్ మింగ్ (హాంకాంగ్)పై... రెండో సీడ్ జోష్నా 11–5, 8–11, 11–6, 11–6తో టాప్ సీడ్ ఆనీ అయు (హాంకాంగ్)పై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment