
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) ప్రపంచ ర్యాంకింగ్స్ పురుషుల విభాగంలో టాప్–10లోకి అడుగు పెట్టిన తొలి భారత క్రీడాకారుడిగా సౌరవ్ ఘోషల్ రికార్డు సృష్టించాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ఘోషల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 10వ స్థానంలో నిలిచాడు.
2018–19 సీజన్‌లో పీఎస్‌ఏ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో, ప్రతిష్టాత్మక గ్రాస్‌హాపర్ కప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన సౌరవ్ ఇటీవల ప్రదర్శన అతనికి అత్యుత్తమ ర్యాంక్‌ను అందించింది. గతంలో మహిళల విభాగంలో భారత క్రీడాకారిణులు జోష్న చిన్నప్ప, దీపిక పల్లికల్ టాప్–10లో ఉన్నారు.